జగన్ హయాంలో  ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు. ఫిట్ మెంట్, డిఏ బకాయిల విషయంలో అడిగినందుకు జగన్ సర్కార్ వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. అంతెందుకు ఫిట్ మెంట్ పేరుతో జీతాలు తగ్గించేసి ఉద్యోగ సంఘాల నేతలతో చప్పట్లు కొట్టించుకుంది. ఔను 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పీఆర్సీ విషయంలో  చేయగలిగినంత జాప్యం చేసి చివరకు ఇక తప్పదన్నట్లుగా 2022 జనవరిలో వారికి పీఆర్సీ  ఇచ్చింది. ఎక్కడైనా పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ లో ఆలోచించింది.  జగన్ సర్కార్  పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగుల జీతాలు తగ్గాయి. నిజం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జరిగింది మాత్రం అదే.  ఉద్యోగులకు అప్పటికే మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఉండగా, జగన్ సర్కార్  ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 4 శాతం తగ్గాయి. దాంతో  తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడింది.  దాంతో అప్పట్లో ఉద్యోగులు తమకు ఇచ్చింది పే రివిజన్ కాదు  పే రివర్స్‌  అని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చే శారు.  అసలు జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఉద్యోగులకు కష్టాలూ వేధింపులు ఆరంభమయ్యాయనే చెప్పాలి. సమయానికి వేతనాలు ఇచ్చింది లేదు. వేతనాల కోసం రోడ్డెక్కితే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడింది. కారాలూ మిరియాలూ నూరింది. వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించింది. రారయతీలు, అలవెన్సుల మాట దేవుడెరుగు అసలు జీతాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వేతనాల కోసం నిలదీసినందుకు అసలు వారు పని చేయడం లేదంటూ ప్రచారం చేసింది.  సమయపాలన లేదని నిలదీసింది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్ అంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ప్రజలలో వారిని పలుచన చేయడానికి ప్రయత్నించింది.  విధులకు పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని బెదరించింది. దీంతో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జగన్ పవన్ కట్ చేయడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయం అర్ధమైన తరువాత జగన్ సర్కార్ వారిని ఎన్నికల విధులకు దూరం చేయాలని ఎత్తుగడ వేసింది. వాలంటీర్లతో  పబ్బం గడిపేసుకోవచ్చని భావించింది. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికల సంఘం దూరం చేయడంతో ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి తహతహలాడుతోంది. అందులో భాగమే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మే నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించడం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉద్యోగుల సహనం పూర్తిగా నశించాక ఇప్పుడు వారిని మంచి చేసుకోవడానికి జగన్ ఏ ప్రయత్నం చేసినా వృధాయే అని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు  జగన్  సర్కార్ విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ ఇప్పుడిక జగన్మాయలో పడే అవకాశమే లేదనీ అంటున్నారు. మొత్తం అనూహ్యంగా 1నే వేతనాలు పడటం ఉద్యోగులనే విస్మయానికి గురి చేసింది. తామంటే జగన్ భయపడ్డాడనడానికి ఇదే నిదర్శనమని వారంటున్నారు. ఈ ఒక్క నెల సమయానికి వేతనాలిచ్చేసినంత మాత్రాన తమ నిర్ణయం మార్చుకునే ప్రశక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది. ప్రపంచానికి ఓటు హక్కు విలువను తెలియజెప్పిన మన దేశం ఇప్పుడు ఏదో ఒక ఆశ చూపితే తప్ప ఓటు వేయని ఓటర్లతో నిండిపోయి సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది. రాజకీయ నాయకులు ఓటర్లకి తాయిలాల ఎరచూపి ఓట్లు వేయించుకోవడంతో ప్రారంభమైన ఈ జాడ్యం, ఇప్పుడు తాయిలాలు ఇస్తే తప్ప ఓటు వేయం అని ఓటర్లు చెప్పే పరిస్థితి వరకు పరిస్థితి దిగజారింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు డబ్బు ఇస్తే, విశ్వాసంతో అతనికే ఓటు వేసే పరిస్థితి నుంచి, అందరి దగ్గర డబ్బు తీసుకుని వేస్తే ఏ ఒక్కరికో.. లేక ఎవరికీ ఓటు వేయకుండా ఊరుకునే పరిస్థితికి ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత అనే విషయం మరచిపోయి పథకాలు ఇస్తేనే, తాయిలాలు ప్రకటిస్తేనే ఓటు వేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఎన్నికల వ్యవస్థ చేరుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్లు ఎలా తయారయ్యారంటే, పథకాల ద్వారా డబ్బు ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు  ఓటు వేయడానికి డబ్బు ఇవ్వాలి. ఇందులో ఓటర్లకు డబ్బు ఎరచూపే రాజకీయ నాయకులది తప్పా.. ఓటుకోసం డబ్బు ఆశించే ఓటర్లది తప్పా అంటే, అది ‘విత్తుముందా.. చెట్టుముందా’ అనే ప్రశ్నకంటే సంక్లిష్టమైన ప్రశ్న అవుతుంది. ఎలక్షన్ల వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య ఇలాంటి కానుకల బంధం కొనసాగుతూ, ప్రజాస్వామ్య విలువలను ఒకవైపు ప్రశ్నార్థకంలో పడేస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి తెరతీసింది. ఓటు వేసేలా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఓకేగానీ, ఓటు వేయండి, కానుకలు ఇస్తాం అని సాక్షాత్తూ ఎన్నికల కమిషనే అంటూ వుండటం ఘోరం.. దారుణం.. అన్యాయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను ఓటు వేసేలా చేయడానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఓటు వేయండి.. బహుమతులు పొందండి’ అటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం, ఓటు వేసిన ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌లు గెలుచుకునే సదవకాశాన్ని ఇస్తోంది. ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకి వచ్చి, తమ చేతికి వున్న ఇంకు గుర్తును చూపించి, లాటరీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా రెండు గంటలకోసారి లాటరీ తీసి, ఈ రెండు గంటల్లో ఓటు వేసిన వారికి ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. భోపాల్ నియోజకవర్గంలో ఈనెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అక్కడి ఎన్నికల కమిషన్ ఈ డైమండ్ రింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్నికల కమిషన్‌ని ఏమనాలో అర్థంకావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ చెంగ్ సైఫాన్. లావోస్ దేశానికి చెందిన చెంగ్ సైఫాన్ నలభై ఆరేళ్ళ క్రిందట అమెరికా దేశానికి వలస వెళ్ళాడు. చిన్నా చితకా ఉద్యోగాలేవో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సైఫాన్‌కి ఎనిమిదేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో బాధపడుతూనే, చాలీ చాలని సంపాదనతో కీమో థెరఫీ చేయించుకుంటూనే బతుకుమీద ఆశతో ముందుకు వెళ్తున్నాడు చెంగ్ సైఫాన్. జీవితం ఎంత దురదృష్టభరితంగా వున్నప్పటికీ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు సైఫాన్. పవర్‌బాల్ లాటరీ అనే ప్రఖ్యాత సంస్థకు చెందిన లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా నిర్వహించగా, చెంగ్ సైఫాన్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్ల నంబర్లు సరిపోలి జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ద్వారా చెంగ్‌కి మొత్తం 1.3 బిలియన్ డాలర్లు... అంటే, మన కెరెన్నీలో అక్షరాలా పదివేల కోట్లు. పన్నులలో భాగంగా 422 మిలియన్ డాలర్లను తగ్గించి త్వరలో చెంగ్‌కి మిగతా డబ్బును అందించనున్నారు. ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి తనకు సాయం చేసిన తన భార్య, మిత్రుడితో ఈ డబ్బును పంచుకుంటానని, తనను వేధిస్తున్న క్యాన్సర్‌కి చికిత్స చేయించుకుంటానని చెంగ్ సైఫాన్ చెబుతున్నాడు.
ALSO ON TELUGUONE N E W S
మమ్ముట్టి..మలయాళ సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే మాలీవుడ్  బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఫస్ట్ మూవీ అనుభవంగల్ పాలిచకల్  1971 లో విడుదల అయ్యింది. అప్పుడు ఆయన వయస్సు  20  సంవత్సరాలు. దాన్ని  బట్టి ఆయన సినీ జర్నీ ని  అర్ధం చేసుకోవచ్చు. సామ్రాజ్యం, దళపతి, స్వాతి కిరణం లాంటి విభిన్న సినిమాలతో తెలుగు వారికి కూడా  అభిమాన కధానాయకుడు గా కూడా మారాడు . రీసెంట్ గా ఆయన ఒక రికార్డు సృష్టించాడు.అంతే కాకుండా  ఎంతో మంది అగ్ర హీరోలకి ఆదర్శంగా నిలిచాడు. . ప్రస్తుతం  స్టార్  హీరో  సినిమా  రెండేళ్లకో,మూడేళ్లకో  ప్రేక్షకులని పలకరిస్తుంది. ఎనీ  లాంగ్వేజ్ తీసుకున్నా ఇదే పరిస్థితి  కానీ మమ్ముట్టి ఈ పద్ధతిని మారుస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. కేవలం తొమ్మిదంటే  తొమ్మిది నెలల్లో ఐదు సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త  ప్రభంజనాన్నే సృష్టించాడు.  డిఫరెంట్ కంటెంట్ తో కూడిన  ఆ చిత్రాలన్నీ సక్సెస్ ని కూడా  సాధించాయి. కన్నూర్ స్క్వాడ్  సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది,  కాదల్ ది కోర్ నవంబర్ 23న , అబ్రహం ఓజ్లర్ ఈ ఏడాది జనవరి న  రిలీజ్ అయ్యింది. భ్రమ యుగం ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యింది.  ఇప్పుడు టర్బో గా రాబోతున్నాడు. వాస్తవానికి ఈ మూవీ  జూన్ 13న రిలీజ్ అవ్వాలి. కానీ మే 23నే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బజూక అనే ఇంకో చిత్రం కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది.  సోషల్ మీడియాలో మమ్ముట్టి ఐదు సినిమాల న్యూస్  బాగానే వైరల్ అవుతుంది. దీంతో  అన్ని బాషల కి చెందిన హీరోలు మమ్ముట్టి ని ఆదర్శంగా తీసుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు  కోరుతున్నారు.  అన్ని లాంగ్వేజ్ లని కలుపుకొని   సుమారు 400  చిత్రాలకి పైనే మమ్ముట్టి  నటించాడు  
ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'సిద్ధార్థ్ రాయ్'(Siddharth Roy). ఈ రొమాంటిక్ డ్రామాని యశస్వి దర్శకత్వంలో జయ అడపాక నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' సినిమా ఛాయలతో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.   ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ   'సిద్ధార్థ్ రాయ్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ సినిమాని మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల థియేటర్లలో అంతగా ఆదరణ పొందని కొన్ని సినిమాలు.. ఓటీటీలో మ్యాజిక్ చేస్తున్నాయి. మరి యూత్ ఫుల్ మూవీ 'సిద్ధార్థ్ రాయ్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Rising star Naveen Chandra has clinched the highly coveted Best Actor award at the prestigious Dada Saheb Phalke Film Festival. The accolade recognizes his outstanding performance in the film 'Month of Madhu'.  The Dada Saheb Phalke Film Festival, named after the father of the Indian film industry, celebrates excellence in cinema across various categories each year. Artists from all corners of the country vie for these esteemed awards, making it a true testament to talent and dedication. Naveen Chandra's win for the year 2024 is a testament to his versatility and impact on the Indian film scene. Having showcased his acting prowess in a myriad of Telugu, Tamil, and Hindi films, he first made waves with his debut in the 2011 hit 'Andala Rakshasi'. Since then, he has continued to captivate audiences with his performances, including his role in the acclaimed film 'Game Changer'. Notably, Naveen Chandra's portrayal in the web series 'Inspector Rushi', available on Amazon Prime, has been garnering widespread acclaim and creating a sensation among viewers.
Prabhas' Salaar movie was released in theatres on December 22, 2023, and since then the movie has been performing well at the box office. Salaar has shattered several box office records and has been created new records every day. It was a solid comeback for Prabhas with total 700 crores gross worldwide. This is unprecedented and Prabhas is breaking his own records and creating new benchmarks. The film created sensation after the OTT release too. Now, the film's second part is in the works. Everyone is eagerly waiting to start the 2nd part shoot. Prasanth Neel is currently busy in pre-production while Prabhas and Prithviraj Sukumaran are so excited to back on grandeur sets. According to sources, the film's shoot begins in May end at Ramoji Film City, Hyderabad. The sets work is going on. Prabhas and Prithviraj Sukumaran will be part of this 10 days schedule. Salaar: Part 1 – Ceasefire is directed by KGF director Prashanth Neel and it is produced by Vijay Kiragandur under the banner of Hombale Films. The movie stars Prabhas, Shruti Haasan, Bobby Simha, Jagapathi Babu Tinnu Anand, Easwari Rao, Sriya Reddy and Ramachandra Raju in pivotal roles.
ఇళయరాజా అంటే తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. సంగీత ప్రపంచంలో ఎన్ని రాగాలు ఉంటాయో వాటన్నింటిలోను అవలీలగా స్వరాలు సమకూర్చగల సంగీత మేధావి. ఆయన స్వరపరచిన  పాటని  పామరులు సైతం నోటితో  హమ్ చెయ్యవచ్చు.అంతటి  సంగీత  జ్ఞానీ  గత కొంత కాలంగా సంచలనాల  జ్ఞానీ గా మారాడు. తాజాగా ఇంకో సంచలనాన్ని తన ఖాతాలో భద్రపర్చుకున్నాడు  రజనీకాంత్ తో కూలీ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ కి ఇళయరాజా  కోర్ట్  నోటీసులు పంపాడు. ఇటీవల కూలీ టీజర్ రిలీజ్ అయ్యింది.బంగారం స్మగ్లింగ్ చేసే డెన్ లోకి రజనీ అడుగుపెట్టి అందర్నీ తుక్కు తుక్కుగా కొడతాడు.ఇక  గతంలో ఇళయరాజా స్వరపరిచిన  తంగ మగన్ లోని  వా వా పక్కం వా పాటను టీజర్ లో  ఉపయోగించారు. దీంతో   తన అనుమతి లేకుండా తన పాటని  ఉపయోగించారంటు  సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసులు పంపించాడు. మ్యూజిక్ కి కాపీ రైట్ ని చెల్లించాలి.లేదా టీజర్ నుంచి తన పాటని  తొలగించాలని కూడా నోటీసులో పేర్కొన్నాడు.చివరిగా ఇందులో కొసమెరుపు ఏంటంటే  తంగ మగన్ లో  రజనీ నే హీరో. సిల్క్ స్మిత, రజనీ మీద ఆ పాట తెరకెక్కింది ఇళయ రాజా గతంలో అమర గాయకుడు దివంగత బాలసుబ్రమణ్యం గారు తన అనుమతి లేకుండా పాటలు పాడాడని  కూడా కేసు వేసాడు. పాటలు కేవలం స్వర కర్త సొంతం అనేది ఇళయరాజా అభిప్రాయం.  మరి ఇప్పుడు కూలీ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రజనీ కాంత్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.  కూలీ కి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాగా అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు. రజనీ కెరీర్ లో 171 వ సినిమా  
పాన్ ఇండియా హీరోలు ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఇద్దరి సినిమాల్లో ముందుగా ఏది మొదలవుతుందో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ గందరగోళానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు. గతేడాది డిసెంబర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'సలార్' సినిమా విడుదలైంది. అలాగే వీరి కాంబోలో 'సలార్-2'(Salaar 2) రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తోనూ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారింది. కొందరు 'సలార్-2' ఈ నెలలోనే ప్రారంభం కానుందని, ఇది పూర్తయ్యాక వచ్చే ఏడాది ఎన్టీఆర్-నీల్ (NTR Neel) ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు ఇప్పట్లో 'సలార్-2' ఉండదని చెబుతున్నారు. 'కల్కి 2898 AD' విడుదల తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని, అనంతరం 'స్పిరిట్', 'కల్కి 2', 'రాజాసాబ్' పూర్తి చేసి.. అప్పుడు 'సలార్ 2'పై దృష్టి పెడతాడని అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్-నీల్ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్టార్ట్ కానుందని చెబుతున్నారు.  దీంతో 'సలార్-2', ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లలో ఏది ముందు మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారిపోయింది. ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
ఒకప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. కామెడీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఆయన పేరు చెప్పుకునేవారు. 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్‍షా' ఇలా ఎన్నో ఆల్ టైం ఎంటర్టైనర్స్ ని శ్రీను వైట్ల అందించారు. సోషల్ మీడియాలో కనిపించే తెలుగు మీమ్స్ లో 80 శాతం ఆయన సినిమాల్లోని టెంప్లేట్స్ కనిపిస్తాయి. అలాంటి వైట్ల.. 'ఆగడు' తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. 2018 లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో 'విశ్వం' సినిమా చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. హీరో రామ్ పోతినేని(Ram Pothineni), శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'రెడీ'(2008) మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. థియేటర్లలో నవ్వులు పూయించి, కాసులు వర్షం కురిపించింది. పలు భాషల్లో రీమేక్ కూడా అయింది. ఇప్పటికీ ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవారు ఎందరో ఉన్నారు. అలా 'రెడీ'తో నవ్వుల సునామీ సృష్టించిన రామ్-వైట్ల కాంబో మరోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల స్టోరీ లైన్ చెప్పడం, దానికి రామ్ ఇంప్రెస్ అవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. 'విశ్వం' సినిమా పూర్తయ్యాక.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని వైట్ల మొదలుపెడతారట. 'రెడీ' కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్'(Double iSmart) చేస్తున్నాడు రామ్. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత వైట్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
కల్ట్  ఫ్యాన్స్ కి పెట్టింది పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్. తమ అభిమాన హీరోని ఎవరేమైనా అంటే వాళ్ళ అంతు తేల్చే వాళ్లే కల్ట్ ఫ్యాన్స్.రెండున్నర  దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ అంతటి అభిమానాన్ని  పొందాడు.    1996 లో తెలుగులో  వచ్చిన  ప్రేమలేఖ  ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తాజాగా అజిత్ కి ఒక గిఫ్ట్ వచ్చింది.   ఈ రోజు అజిత్  53వ పుట్టినరోజు. ఈ  సందర్భంగా ఆయన భార్య షాలిని ఒక  అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. స్పోర్ట్స్ బైక్ లో నెంబర్ వన్ బైక్ గా గుర్తింపు పొందిన  డుకాటీ ని గిఫ్ట్ గా ఇచ్చింది. రెడ్ కలర్ కోటింగ్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ బైక్ ధర సుమారు 20 లక్షలు దాకా ఉంటుంది. ప్రస్తుతం ఆ బైక్ కి  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని చూసి  తమ  సంతోషం వ్యక్తం చేస్తు అజిత్ కి  బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఇక  స్వతహాగా  అజిత్ మంచి రేసర్. ఎన్నోపోటీల్లో పాల్గొని పలు  ప్రైజ్ లని  కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం  విడా ముయార్చి అనే కొత్త మూవీ  షూటింగ్ లో  బిజీగా ఉన్నాడు.  మగిజ్ తిరుమేని దానికి దర్శకుడు. అలాగే   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా  మొదటి సారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అజిత్ వైఫ్  షాలిని కూడా బాలనటిగా,  హీరోయిన్ గా  చాలా సినిమాల్లో చేసింది.చిరంజీవి హీరోగా వచ్చిన  జగదేక వీరుడు అతిలోక సుందరి లో  కళ్ళజోడు పెట్టుకొని కనపడే   అమ్మాయి తనే. అలాగే మాధవన్ హీరోగా వచ్చిన మణిరత్నం సఖి లో సోలో హీరోయిన్ గా తమిళ, తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది.       
Mega Producer K. T. Kunjumon As the producer and directed by sensational director S. Shankar, Music by Oscar winner A. R. Rahman and starring by Indian Michael Jackson Prabhu Deva and beautiful actress Nagma movie Premikudu is going to be re-released. Ramana and Muralidhar are acting as the re release producers of this movie. SP Balasubramaniam, Vadivelu, Raghuvaran and Girish Karnad acted in lead roles. The movie Premikudu, which released 30 years ago, was planned for re-release in more than 300+ theaters on May 1st. Even, bookings opened and but the poor response and bookings made makers to postpone. Premikudu is Directed by S. Shankar, starring Indian Michael Jackson Prabhu Deva and Nagma’s movie released 30 years ago and impressed the youth. Even now, the songs of that movie continue to impress everyone, not just the youth. Prabhu Deva’s father S. P. Balasubramaniam’s acting is a big plus for the movie. S. P. Balu’s dancing is equal to Prabhudeva in the song andamaina premarani cheyyi tagilithe is special. Takeit Easy Policy, O Chelia Na Priya Sakhia songs are still evergreen songs. The movie which came out as a good youth full love story was the biggest blockbuster in those days.
రామ్ చరణ్(Ram Charan) ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన డ్రెసింగ్ స్టైల్ ని ఫాలో అవ్వడానికి ఎందరో ఆసక్తి చూపిస్తుంటారు. రామ్ చరణ్ అలా బయట కనిపిస్తే చాలు.. నిమిషాల్లో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా చరణ్ మరోసారి తన ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు చరణ్. వైట్ షర్ట్ ధరించి, క్యాప్, కళ్ళద్దాలతో చరణ్ స్టైల్ గా ఉన్నాడు. అలాగే ఎక్కువగా గుబురు గడ్డం, మీసంతో కనిపించే చరణ్.. ఈసారి మాత్రం క్లీన్ షేవ్, చిన్న మీసకట్టుతో కనిపిస్తున్నాడు. ఇది ఆయన రాబోయే చిత్రం 'గేమ్ ఛేంజర్'(Game Changer)లో లుక్ అని తెలుస్తోంది. 'గేమ్ ఛేంజర్'లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రలో ఇలా క్లీన్ షేవ్, చిన్న మీసకట్టుతో కనిపించనున్నాడని సమాచారం.  ఏది ఏమైనా చరణ్ తాజా లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆయన న్యూ లుక్ చూసి.. చరణ్ ఏంటి ఇలా మారిపోయాడు అని షాక్ అవుతున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.
  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.