కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో దాచుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. వాటికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. అయితే, డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు పెరిగిపోతోంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి ఎవరూ తీసుకోని డబ్బులు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) ఏకంగా రూ. 67003 కోట్లు ఉన్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకుల్లోనూ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగినట్లు తెలిపింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి అన్‌ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ. 58,330.26 కోట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో రూ. 8,673.72 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.  కెనరా బ్యాంకులో రూ. 6,278.14 కోట్లు ఎవరూ తీసుకోని డిపాజిట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2063.45 కోట్లతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 1609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ. 1360.16 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
    ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎన్డీయే సర్కార్ 30 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాక్‌ను అడిగింది. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని రాజ్‌నాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్నికి పాక్‌తో పోరాడే ఆలోచన లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన ఎయిర్ కాప్టర్లు కూలిపోయాయి. ఐఏఏప్ లాంటి తప్పు చేయలేదని రాహుల్‌ తెలిపారు.  ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ప్రభుత్వ పెద్దలు మన సైనికుల చేతులు కట్టేశారని  విమర్శించారు. మరోవైపు భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పుకొంటున్నారు’’అని అన్నారు.  ఓ వైపు సీజ్ ఫైర్ కు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు చెప్పారని కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఖండించలేదన్నారు. ఇందిరాగాంధీలో ఉన్న సగం ధైర్యం ప్రధానికి లేదన్నారు. ఉంటే సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ప్రధానికి ధైర్యం ఉంటే  ట్రంప్ అబద్ధాల కోరు అని సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పహెల్గామ్ సూత్రధారి మునీర్ ట్రంప్ తో కలిసి భోజనం చేశారని రాహుల్ విమర్శించారు. కశ్మీర్ పహెల్గాం ఉగ్రదాడిలో అమాయలు బలయ్యారని పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండిచారని రాహుల్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఈ పరేషన్ విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు అన్ని సహకరించాయన్నారు. అంటే.. పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రాజ్ నాథ్ చెప్పారు. అసలు పాకిస్థాన్ తో యుద్ధం చేసే ఆలోచననే రాజ్ నాథ్ చెప్పకనే చెప్పారన్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ను ఖండించలేదని కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయన్నారు.  1971 యుద్దంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయత్మకంగా వ్యవహరించిందని రాహుల్ తెలిపారు. అప్పటి జనరల్ మణిక్ షాకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పూర్తి సేఛ్చ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. యుద్దం చేసే సంకల్పం ప్రభుత్వానికి లేదు. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయిని పేర్కొన్నారు. మీరు దాడులు చేయకండని పాక్ చెప్పడం దేనికి సంకేతం అని రాహుల్ ప్రశ్నించారు. పాక్ దుశ్చర్యను సభలోని ప్రతి ఒక్కరూ ఖండించారు అని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటమని పార్టీలన్నీ చెప్పాయి. దేశంలో ప్రతి పక్షంగా ఐక్యంగా  ఉన్నందుకు గర్వపడుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.  
  ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు 25 నుంచి అర్హులు అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆగష్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపీణీ కొనసాగుతుందని వెల్లడించారు. QR కోడ్‌లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండబోవు అని స్పష్టం చేశారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని అన్నారు.  ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. అటు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం. 8 గంటల నుండి 12 వరకు సాయంత్రం 4 గంటల నుండి 8 వరకు రేషన్ షాపుల్లో  సరకులు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.  
ALSO ON TELUGUONE N E W S
ఈమధ్యకాలంలో థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వివిధ భాషలకు చెందిన సినిమాలన్నీ ఓటీటీ ప్లాప్‌ఫామ్స్‌పై చూసే అవకాశం ఉంటుంది. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వివిధ భాషల్లో 27 సినిమాలు వచ్చాయి. వాటి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.  అమెజాన్‌ ప్రైమ్‌ : లోన్లీ ఎనఫ్‌ టు లవ్‌ సీజన్‌ 1.. జూలై 28 చెక్‌ (తెలుగు సస్పెన్స్‌ థ్రిల్లర్‌).. జూలై 28 హౌజ్‌ఫుల్‌ 5.. ఆగస్టు 1 నెట్‌ఫ్లిక్స్‌ : ఐరన్‌ చెఫ్‌ థాయిలాండ్‌ వర్సెస్‌ ఆసియా.. జూలై 28 ట్రైన్‌ రెక్‌: స్ట్రోమ్‌ ఏరియా 51.. జూలై 29 డబ్ల్యూడబ్ల్యూఈ: అన్‌ రియల్‌.. జూలై 29 కన్వర్జేషన్స్‌ విత్‌ ఏ కిల్లర్‌: ది సన్‌ ఆఫ్‌ సామ్‌ టేప్స్‌.. జూలై 30 అన్‌ స్పీకబుల్‌ సిన్స్‌.. జూలై 30 యాన్‌ హానెస్ట్‌ లైఫ్‌.. జూలై 31 గ్లాస్‌ హార్ట్‌.. జూలై 31 లియాన్నే.. జూలై 31 మార్క్‌డ్‌.. జూలై 31 తమ్ముడు (తెలుగు మూవీ).. ఆగస్టు 1 మై ఆక్స్‌ఫర్డ్‌ ఇయర్‌.. ఆగస్టు 1 బియాండ్‌ ది బార్‌.. ఆగస్టు 2 పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ సీజన్‌ 3.. ఆగస్టు 2 ఆపిల్‌ ప్లస్‌ టీవీ : చీఫ్‌ ఆఫ్‌ వార్‌.. ఆగస్టు 1 స్టిల్‌ వాటర్‌ సీజన్‌ 4.. ఆగస్టు 1 జియో హాట్‌స్టార్‌ : అడ్డా ఎక్స్‌ట్రీమ్‌ బాటిల్‌.. జూలై 28 బ్లాక్‌ బ్యాగ్‌.. జూలై 28 క్యుంకీ సార్‌ బీ కబీ బహు థీ సీజన్‌ 2.. జూలై 29 బ్యాటిల్‌ ఆఫ్‌ కులికన్‌: హయర్స్‌ ఆఫ్‌ ది కార్టెల్‌.. జూలై 29 సూపర్‌ సారా (మినీ వెబ్‌ సిరీస్‌).. ఆగస్టు 1 పతీ పత్నీ ఔర్‌ పంగా.. ఆగస్టు 2 సోనీ లివ్‌ : ట్విస్ట్‌డ్‌ మెటల్‌ సీజన్‌ 2.. ఆగస్టు 1 సన్‌ నెక్ట్స్‌ : సురభిల సుందర స్వప్నం.. ఆగస్టు 1 జీ5 : బకైటి.. ఆగస్టు 1
తమని ఎదగనీయడం లేదని, తొక్కేస్తున్నారని ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఆ అంశం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్‌ పైడి జయరాజ్‌ ఫోటోను చిన్నగా ఎందుకు పెట్టారంటూ ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌తో వాగ్వాదానికి దిగారు పాశం యాదగిరి. ‘గో బ్యాక్‌ ఆంధ్రా..’ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫిలిం ఛాంబర్‌కి వెళ్లి వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.  జూలై 29 ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి జయంతి. తెలంగాణకు చెందిన సినారె ఫోటో ఫిలిం ఛాంబర్‌లో లేకపోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ సెక్రటరీని వివరణ కోరారు. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన గొడవ గురించి నిర్మాతల మండలి ఇంకా స్పందించలేదు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న తెలంగాణ వారిపై వివక్ష చూపిస్తున్నారని గత కొన్ని రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై నిర్మాతల మండలి, చిత్ర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. 
Vetrimaaran, after Viduthalai 2, has been waiting to start his next project. He announced Vaadivaasal with Suriya, long back and then, kept that project in cold storage to make his Vada Chennai Universe based film with Simbu aka STR. But the movie is going through many twists and turns as per reports.  Kalaipuli S. Thanu, who is producing the film, is having differences with Simbu about the actor's remuneration. While the actor is asking for Rs.50 crores, Thanu is not ready to offer so much for him. Hence, Simbu is in talks with Sithara Entertainments and other production houses to move project elsewhere.  Now, as the actor is looking for other producers, Thanu is keen on producing Vaadivaasal with Suriya and director Vetrimaaran. But this time, the story will be changed and it won't have Jallikattu as central theme. As the title for this project has already become popular and helps in business, Thanu is keen on using it.  For now though, Simbu and Vetrimaaran are in talks about who will produce their movie and Dhanush had already issued NOC for using Vada Chennai characters, Universe. If the reports are to be believed, we have to wait and see, how all these twists and turns will lead to production of Vetrimaaran's next.  For a director who won National Award and been delivering critical and box office successes continuously, these kind of twists explain how volatile Film industry can be. Simbu has also been going through different issues from past decade before any of his films go to floors.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Ajith Kumar is one of the biggest stars of Indian Cinema, from Tamil language. He delivered a disaster like Vidaamuyarchi and a blockbuster with Good Bad Ugly, this year. He took a decision to concentrate on his racing career and do films, during intervals. His next film is going to be directed by Adhik Ravichandran.  But there is no clarity about production house. Reports suggest that distributor Raahul is producing the film. Many are shocked to see him becoming producer for a Rs-250-300 crores project. Latest reports suggest that Ajith has agreed to take Satellite, OTT and Audio rights for the film as remuneration.  Further the reports state that he decided to take Rs.160 crores as his remuneration and these rights will be sufficient for that. On the other hand, Raahul who distributed Good Bad Ugly is happy with how well this upcoming film could collect at the box office.  Well, Akshay Kumar followed this arrangement for long time in Bollywood. He opened his Cape of Good Films and started taking Satellite, OTT rights as his remuneration for many of his films. If Ajith is also following this arrangement, we might see many South Stars following this model.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కొంతమంది హీరోలు తాము చేసే సినిమాల విషయంలో, క్యారెక్టర్ల విషయంలో ఎంతో వైవిధ్యంగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగానే సినిమాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడున్న హీరోల్లో దుల్కర్‌ సల్మాన్‌ ఆ కోవకు చెందుతారు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నీ అలాంటివే. మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు తాను చేసిన సినిమాల ద్వారా ఎంతో దగ్గరైన దుల్కర్‌.. మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు ‘కాంత’. తమిళ, తెలుగు భాషల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలో దుల్కర్‌, రానా దగ్గుబాటి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావడం విశేషం. దీంతో ఈ సినిమా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.  ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేశన్‌ పాత్రను అత్యద్భుతంగా పోషించిన దుల్కర్‌.. ఈ చిత్రంలో తొలి తమిళ సూపర్‌స్టార్‌ ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ పాత్రను పోషిస్తున్నారు. 1930వ దశకంలో విపరీతమైన పాపులారిటీ వున్న హీరో భాగవతార్‌. అతను నటుడే కాదు, సంగీత విధ్వాంసుడు కూడా. దాంతో అతన్ని తమ ఆరాధ్యదైవంగా భావించేవారు తమిళ ప్రేక్షకులు. ఆరోజుల్లోనే సినిమాకి లక్ష రూపాయలు పారితోషికం తీసుకొని చరిత్ర సృష్టించిన భాగవతార్‌ నటించిన ‘హరిదాస్‌’ చిత్రం ఒకే థియేటర్‌లో మూడు సంవత్సరాలు ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత ఒకేసారి 12 సినిమాల్లో హీరోగా బుక్‌ అయ్యారు భాగవతార్‌. అయితే ఈ సినిమాలు ప్రారంభం అవకముందే లక్ష్మీకాంతన్‌ అనే జర్నలిస్ట్‌ హత్య కేసులో భాగవతార్‌ దాదాపు 3 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు నుంచి వచ్చిన తర్వాత తనను బుక్‌ చేసుకొని అడ్వాన్స్‌ ఇచ్చిన 12 మంది నిర్మాతలకు ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టారు. కానీ, ఆయన చేసిన ఏ ఒక్క సినిమా హిట్‌ అవ్వలేదు. దాంతో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, మానసికంగా కూడా కుంగిపోయారు. అనారోగ్య కారణాల వల్ల 1959లో 49 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు భాగవతార్‌.  దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న కొత్త చిత్రం ‘కాంత’ చిత్రంలో అతని క్యారెక్టర్‌ పేరు ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌. ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఆయన పేరును ‘కాంత’ చిత్రంలో హీరోకి పెట్టడంతో ఆయన జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు భావించారు. అయితే తాజాగా విడుదలైన టీజర్‌లో ఒక హీరోకి, దర్శకుడికి మధ్య ఉన్న ఈగో క్లాష్‌ నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. దీన్నిబట్టి భాగవతార్‌ కెరీర్‌లో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్‌తోనే ఈ కథను రూపొందించారా అనే సందేహం కలుగుతోంది. ఆ రెండు క్యారెక్టర్లను దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని అద్భుతంగా పోషించారని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్‌ 12న తమిళ, తెలుగు భాషల్లో కాంత చిత్రం విడుదలవుతోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ‘కాంత’ ఖచ్చితంగా కనెక్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
'విజయ్ దేవరకొండ'(Vijay Devarakonda)ఈ నెల 31 న 'కింగ్ డమ్'(Kingdom)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.ట్రైలర్ తో మంచి అంచనాలని క్రియేట్ చేసిన 'కింగ్ డమ్' విజయ్ ని వరుస పరాజయాల బాట నుంచి తప్పించి, ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ వ్యయంతో నిర్మించడం, 'జెర్సీ' మూవీ తర్వాత దర్శకుడు 'గౌతమ్ తిన్ననూరి'(Gowtham Tinnanuri)చాలా గ్యాప్  తీసుకొని 'కింగ్ డమ్' ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో కూడా' కింగ్ డమ్' పై మంచి అంచనాలు ఉన్నాయి.  'కింగ్ డమ్' టీం రీసెంట్ గా 'చెన్నై'(Chennai)లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 'విజయ్ దేవరకొండ' మాట్లాడుతు 'కింగ్ డమ్' తమిళ వెర్షన్ టీజర్ వాయిస్ కోసం ఒక పవర్ ఫుల్  వాయిస్ తో ఇప్పించాలని అనుకున్నాం. అప్పుడు వెంటనే సూర్య(Suriya)అన్నే నా మైండ్ లోకి వచ్చాడు. దీంతో అన్నని  అడిగిన వెంటనే ఓకే చెప్పాడు. ఆయన ఎంతో దయా హృదయం కలిగిన పవర్ ఫుల్  వ్యక్తి అంటు విజయ్ మాట్లాడటం జరిగింది. విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri borse)జత కట్టగా  కౌశిక్ మెహతా, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం' కింగ్ డమ్' టికెట్ రేట్స్ ని నిర్దిష్ట రేట్స్ కి పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.      
ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్(Allu Arjun),త్రివిక్రమ్'(Trivikram)కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'జులాయి'. ఈ మూవీలో 'రాజేంద్రప్రసాద్' కూతురుగా, అల్లుఅర్జున్ కి లైన్ వేసే క్యారక్టర్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటి 'కల్పిక గణేష్'(Kalpika Ganesh). ఆరెంజ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు కూడా ఆమె లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక పబ్ లో బర్త్ డే కేక్ విషయంలో 'కల్పిక' పబ్ సిబ్బందిని  నానా దుర్భాషలాడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా కల్పిక హైదరాబాద్‌(Hyderabad)సమీపంలోని 'మొయినాబాద్' ప్రాంతంలో ఉన్న 'బ్రౌన్ టౌన్'(Broun Town)రిసార్ట్‌కి  మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో వెళ్ళింది. రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ పై దురుసుగా ప్రవర్తిస్తు మెనూ కార్డుని, రూమ్ కీస్‌ ని మేనేజర్ ముఖంపై విసిరింది. అసభ్యంగా బూతులు కూడా తిట్టింది. ఈ  వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ విషయంపై కల్పిక ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతు తాను సిగరెట్స్ కావాలని అడిగితే మేనేజర్ తో పాటు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. రిసార్ట్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. క్యాబ్ బుక్ చేసుకోవడానికి వైఫై లేదు. వీటి గురించి అడిగితేనే మేనేజర్ గొడవకి దిగాడు. దీంతో నేను కూడా గొడవకి దిగానని కల్పిక చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కల్పిక కి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. రాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో కల్పిక కంటెస్ట్ గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది.     
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi),దర్శకేంద్రుడు 'రాఘవేంద్రరావు'( k.Raghavendrarao)కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో 'ఘరానా మొగుడు' కూడా ఒకటి. ఈ మూవీలో వచ్చే మొదటి ఫైట్ లో 'వీరయ్య'గా చిరంజీవితో తలపడి మంచి గుర్తింపు పొందిన తమిళ నటుడు 'పొన్నాంబళం'(Ponnambalam). బాలకృష్ణ(Balakrishna),నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, (Pawan Kalyan)వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కూడా ఫైటర్ గా తన సత్తా చాటాడు.  పొన్నాంబళం గత కొంత కాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్నీ తనే స్వయంగా అందరకి తెలియచేసాడు. రెండు మూత్ర పిండాలు చెడిపోయి, డయాలసిస్ అవసరం కావడంతో వెంటిలేటర్ పై ఉండి చికిత్స అందుకుంటున్నాడు. ఈ విషయంపై రీసెంట్ గా పొన్నాంబళం మాట్లాడుతు ప్రస్తుతం డయాలసిస్ నుంచి కోలుకుంటున్నాను. ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల్లో 750 ఇంజంక్షన్స్ ఇచ్చారు. రెండు రోజులుకి ఒకసారి రెండు ఇంజెక్షన్స్ చేసి నా ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్  చేసేవారు. పూర్తిగా భోజనం చెయ్యలేను. ఉప్పు వాడలేను. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు.ఎక్కువ మద్యం సేవించడం వల్లే డయాలసిస్ బారిన పడ్డాను. చాలా ఏళ్ళ క్రితమే మద్యం ఆపేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే చిరంజీవి, శరత్ కుమార్, ధనుష్, అర్జున్ వంటి వారు 'పొన్నాంబలం' కి ఆర్ధిక సాయం చేసారు  1988 లో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన 'పొన్నాంబళం' తమిళ, తెలుగు, కన్నడ, హిందీ,మలయాళం  భాషల్లో కలిపి సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో ఫైటర్, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేకుండా ప్రమాదకర యాక్షన్ సన్నివేశాలు చెయ్యడంలో పొన్నాంబళం స్పెషలిస్ట్.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
అంతా నువ్వే చేసావు. అప్పుడలా చేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అన్నిటికి కారణం మీరే. ఇప్పుడు జీవితంలో సొల్యూషన్ ఏంటి?? జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు భరించేవాళ్ళు?? మీకేం హాయిగానే ఉంటారు, భరిస్తున్న వాళ్లకు తెలుస్తుంది అందులో ఉన్న బాధ. ఇలాంటి మాటలు చాలా మంది తమ జీవితాల్లో మాట్లాడుతూ ఉంటారు. వీటికి కారణం ఏమిటంటే ముఖ్యమైన నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేక ఇతరుల ఒత్తిడితోనో, లేక నిస్సహాయతలోనో ఉన్నప్పుడు జరిగిపోవడం. సింఫుల్ గా చెప్పాలి అంటే జీవితాన్ని, అందులో ముఖ్యమైన విషయాలను ఇతరులు నిర్ణయించడం.  ఎందుకిలా? జీవితాల్లో ఇలా ఎందుకు జరుగుతాయి. సాధారణంగా చాలామంది చెప్పుకునే సమర్థింపు కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే అలా రాసిపెట్టి ఉంది. దానికి ఎవరేం చేయగలరు అని. అదే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా అటు ఇటు అయితే అందరూ అలాగే అనుకోగలరా?? లేదే ముందే చెప్పాము కానీ వినలేదు. అందుకే ఇలా అవుతోంది. కావాల్సిందేలే. శాస్తి జరగాల్సిందే లాంటి మాటలు వినబడుతుంటాయి.  అయితే వాటి గురించి పక్కనబెడితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అని.  అంతిమ నిర్ణయం! ఎవరు ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు, ఎన్నో సలహాలు అయినా తీసుకోవచ్చు. కానీ చివరికి సాధ్యా సాధ్యాలు ఆలోచించి నష్టాలు జరిగితే భరించాల్సింది నేనే కదా అనే అవగాహనతో ఉండాలి. అపుడే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు.  ఇచ్చేయ్యాలి! ఎవరి జీవితంలో వాళ్ళు తమ సామర్త్యాలకు తగినట్టు ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉంటారు. ఒక మెడికో దగ్గరకు వెళ్లి పోలీస్ అకాడమీ కి సంబంధించిన విషయాలు చెప్పమంటే ఎలా అయితే అవగాహన లేకుండా ఉంటారో ఇదీ అంతే.  ఇంకొక విషయం ఏమిటంటే పెద్దరికం అనే ఆయుధం చేతిలో ఉంది కదా అని ఊరికే చిన్న వాళ్ళ జీవితాలను డిసైడ్ చేయకూడదు.  కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలి. అలాగని వాళ్ళ జీవితాలను ఏదో వీధుల్లో వదిలేయడం లేదు కదా. పెద్దరికం అంటే తప్పు మార్గం లో వెళ్తున్నప్పుడు రంగంలోకి దిగి సరిచెయ్యడం, చెప్పాల్సిన రీతిలో చెప్పడమే కానీ జీవితాలను లాక్కోవడం కాదు. బి కాన్ఫిడెంట్! కాన్ఫిడెంట్ అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఉంది అని నోటితో చెబితే వచ్చేది కాదు. నలుగురితో చెబితే బుర్రలో చేరేది అంతకన్నా కాదు. అనుభవాలు, పరిస్థితులను మేనేజ్ చేయడంతో ఆ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ప్రణాళిక, లక్ష్యాలు చేరడం అనేవి చాలా ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత వాటి నష్టాలు ఏమైనా ఎదురైనా తిరిగి భర్తీ చేసుకోవడం చాలా కష్టం. అతి విశ్వాసం వద్దు! కొందరు చెప్పేవాటిలో  మంచి విషయాలే ఉండచ్చు.  అయితే వాళ్ళ వరకు మాత్రమే అది మంచిగా ఉండచ్చు. కానీ ఇతరులకు అలా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు. అలాంటప్పుడు నాకేదో బాగుంది మీకూ బాగుంటుందిలే carry on అని అదేపనిగా ముందుకు ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు.  ఇదే నిజం! పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు,ఉద్యోగాలు కావచ్చు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉండచ్చు. ప్రతి నిర్ణయంలో అంతిమంగా తృప్తి అనేది ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ పని చేసాక ఏదైనా నష్టం జరిగినా నేను దాన్ని భరించగలను అనే ఆలోచన కూడా ఉండాలి. ఫెయిల్యూర్ ను ఆక్సిప్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి. అలా ఉంటే జీవితాలు బాగుంటాయి. లేకపోతే గడ్డి తినమన్నారు కాబట్టి తిన్నాము ఇప్పుడు అరగలేదు అంటే దానికి ఎవరు బాద్యులు?? ఎంత అనుభావాలు కలిగిన  వాళ్ళు అయినా అవి వాళ్ళ వరకు మాత్రమే 100% వర్తిస్తాయి.  అందుకే నిర్ణయాలు నవ్వుతాయి. జాగ్రత్తగా ఒకరి ప్రమేయం లేకుండా వాటిని తీసుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ.
  రాగి,  ఇత్తడి పాత్రలు ఇంటికి సాంప్రదాయ టచ్ ను  ఇస్తాయి. వీటి కారణంగా ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రలను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు, కానీ చాలా తొందరగా   అవి  మెరుపును కోల్పోతాయి. అయితే వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడం కాస్త కష్టంతో కూడుకున్న పని.  వీటిని తోమలేక చాలా మంది ఇలాంటి పాత్రలను దూరంగా పెట్టేస్తుంటారు. అయితే  పండుగలు, ప్రత్యేక రోజుల్లో రాగి, ఇత్తడి పాత్రలు అవసరం అవుతాయి.  ఈ  రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా కేవలం సెకెన్ల వ్యవధిలో మెరిపించగల మ్యాజిక్ లిక్విడ్ ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లిక్విడ్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.  ఇంతకీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి? దీన్నెలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి?  తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 2 టీస్పూన్లు ఉప్పు 2 టీస్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ 1 టీస్పూన్ బేకింగ్ సోడా 2 టీస్పూన్లు వైట్ వెనిగర్ తయారీ విధానం.. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్దదిగా ఉండాలి.   ముందుగా గిన్నెలో ఉప్పు వేసి, ఆపై నిమ్మరసం కలపాలి. డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన తర్వాత, బేకింగ్ సోడాను కూడా జోడించాలి. చివరగా వైట్  వెనిగర్ జోడించాలి.  ఇలా చేస్తే  రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణం సిద్ధమైనట్టే.. ఈ తప్పు చేయొద్దు.. ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు వెనిగర్  ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ద్రావణంలో ఎక్కువ వెనిగర్ కలిపితే పాత్రలు శుభ్రం అవుతాయి, కానీ ఎండిన తర్వాత, వాటిపై నల్ల మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు. కాబట్టి పాత్రలు మచ్చలు లేకుండా,  మెరుస్తూ ఉండాలంటే  పరిమిత మొత్తంలో వైట్ వెనిగర్  వాడాలి. ఉపయోగించే విధానం.. రాగి,  ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని పాత్రపై పూసి పాత్ర మొత్తం అప్లై అయ్యేలా చూడాలి. ఈ ద్రావణం తొలగించిన వెంటనే పాత్ర శుభ్రంగా కనిపిస్తుంది. ఇలా కాకపోతే.. తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఇందులో పాత్రలను ముంచి తీసినా పాత్రలు మెరిసిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది.                                     *రూపశ్రీ.
ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు. విజయ్ దివస్.. ఆవిర్భావం.. 1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది. ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ.. కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఎందుకు జరుపుకోవాలి? కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే: దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం యువతలో దేశభక్తిని ప్రేరేపించటం సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం మనం ఏమి చేయగలం.. మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.  పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు. దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు. కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..  స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.                                         *రూపశ్రీ.
శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  అది శరీర నిర్మాణం అయినా లేదా బరువు తగ్గడం అయినా ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్ ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఎక్కువ ప్రోటీన్ అందరికీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి అధిక ప్రోటీన్ ఆహారం  ధోరణి పెరిగినంతగా, దానితో వల్ల ఏర్పడే   దుష్ప్రభావాలు  ప్రమాదాల గురించి పెద్దగా చర్చ కనిపించదు.  అధిక ప్రోటీన్ ఆహారం అంటే  ఒక రోజులో తీసుకునే కేలరీలలో 25% నుండి 35% ప్రోటీన్ నుండి వస్తుంది. ఇందులో గుడ్లు, చికెన్, చేపలు, జున్ను, పప్పులు, ప్రోటీన్ పౌడర్ మొదలైనవి ఉంటాయి. దీని వల్ల  కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గుతుంది. కానీ అది అందరికీ ప్రయోజనకరంగా ఉండదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు హానికరం. కండరాలను నిర్మించడానికి,  ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం, కానీ కొన్ని వ్యాధులలో అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే.. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి అధిక ప్రోటీన్ ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఊక పిండి, మొక్కజొన్న, బేకరీ ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. దీనితో పాటు, మినపప్పు, మాంసం, చేపలు, బీన్స్, మునగకాయ, పాలకూర, బఠానీలు, పుట్టగొడుగులు, బీట్‌రూట్, గుమ్మడికాయ గింజలు తినకూడదు. వైద్యుడి సలహా మేరకు  తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు.. అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలను కష్టతరం చేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఇది ప్రమాదం.  దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వారి ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలి.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత  చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు, తృణధాన్యాలు,  సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగడ,  జీర్ణ సమస్యలు, మూత్రపిండాల ఒత్తిడి,  శరీరం డీహైడ్రేషన్ కు లోనుకావడం జరుగుతుంది. అందువల్ల,  ఆహారాన్ని మార్చుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాలి. అధిక ప్రోటీన్ ఆహారం చాలా మంచిది అని అనుకుంటారు.. కానీ  ప్రతి శరీరానికి,  ప్రతి పరిస్థితికి ఇది సరైనది కాదు. బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి,  అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. అన్నింటికంటే బెస్ట్ ఏదంటే..  సమతుల్య ఆహారం.  దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్,  సూక్ష్మపోషకాలు అన్నీ సరైన మొత్తంలో ఉంటాయి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన,   రోజువారీ అలవాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి  శరీరం,  మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో  యోగా,  ప్రాణాయామంతో  రోజును ప్రారంభిస్తే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం. ప్రాణాయామంలో 'ఉజ్జయి ప్రాణాయామం' చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మనసును చురుగ్గా ఉంచుతూ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అయితే అసలు ఈ ప్రాణాయామానికి ఉజ్జయిని ప్రాణాయామం అని పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉజ్జయి ప్రాణాయామంలో 'ఉజ్జయి' అంటే 'విజయవంతుడు' లేదా 'విజయం సాధించేవాడు' అని అర్థం. ఈ పదం 'ఉద్' మరియు 'జి' అనే సంస్కృత పదాలతో రూపొందించబడింది. ఇక్కడ 'ఉద్' అంటే లేవడం లేదా బంధనం నుండి విముక్తి పొందడం, అలాగే 'జి' అంటే విజయం సాధించడం. ఇక 'ప్రాణాయామం' అంటే 'నియంత్రిత శ్వాస సాధన'. ఈ ప్రాణాయామం మనలో విశ్వాసాన్ని,  బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని 'విజయవంతమైన శ్వాస' అని కూడా పిలుస్తారు. మెదడుకు మంచిది.. ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గొంతు నుండి మృదువైన శబ్దంతో నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు  దృష్టి స్వయంచాలకంగా శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మనస్సు అటు ఇటు కదిలిపోకుండా, చలించకుండా  ఉంచుతుంది.   ఆలోచించే,  అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉజ్జయి ప్రాణాయామం చాలా బాగా  సహాయపడుతుంది.  లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు, ఉదర అవయవాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల  కడుపు తేలికగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యం.. ఉజ్జయి ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస వేగం తగ్గుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచుతుంది,  రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు లేదా ఒత్తిడి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ   గుండె జబ్బు ఉంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులు.. సాధారణంగా ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది.  ఇది గొంతు,  ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగిస్తుంది. నెమ్మదిగా పీల్చడం,  నిశ్వాసించడం ఊపిరితిత్తులను బలపరుస్తుంది,  శ్వాసను సులభతరం చేస్తుంది. ఇది అలెర్జీలు, జలుబు,  శ్వాస సమస్యలకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉజ్జయి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది,  మంచి నిద్రను ఇస్తుంది.  ఎందుకంటే దీనిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అలసట కూడా తొలగిపోతుంది, దీని కారణంగా రాత్రి త్వరగా నిద్ర వస్తుంది.  ఉదయం ఉత్సాహంగా నిద్రలేవచ్చు. శక్తినిచ్చే ఆసనం.. ఈ ప్రాణాయామం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది,  శక్తిని పెంచుతుంది.  రోజంతా అలసిపోయినట్లు లేదా సోమరితనంగా అనిపిస్తే ఈ ప్రాణాయామం శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది. అందుకే దీనిని 'విజయవంతమైన శ్వాస' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసం,  అంతర్గత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ఉజ్జయి ప్రాణాయామం చేయడానికి, ముందుగా ప్రశాంతమైన,  సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని శరీరమంతా రిలాక్స్ గా వదులుగా  ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.  గొంతు నుండి తేలికపాటి 'ఘర్' శబ్దాన్ని కూడా చేయాలి. అది చాలా నెమ్మదిగా ఉండాలి. తరువాత ముక్కు నుండి నెమ్మదిగా గాలిని అదే విధంగా వదలండి. ఈ మొత్తం సాధన సమయంలో పూర్తి దృష్టి  శ్వాసపై ఉండాలి. తద్వారా మనస్సు చలించకుండా ప్రాణాయామం మీదే దృష్టి నిలుపవచ్చు. ప్రారంభంలో దీన్ని ఐదు నిమిషాలు చేయాలి. సాధన బలంగా మారినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..