తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నామా నాగేశ్వరరావుకు తీవ్ర ప్రజా వ్యతిరేకత స్వాగతం పలుకుతోంది. అదే సమయంలో నామా గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారు అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన మొదటికే మోసం తెచ్చిందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో బీజేపీతో రహస్య బంధం అన్న ఆరోపణలు వాస్తవమని తేల్చేశారనీ, ఇంతోటి దానికి బీఆర్ఎస్ కు ఓటు వేయడం ఎందుకు అంటూ కారు పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందే  బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి ఖారరైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తొలి సారి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన  తాండ్ర వినోదరావు  అనూహ్యంగా పుంజుకున్నారు.  ఎప్పుడైతే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందో.. ఆ క్షణం నుంచీ ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే రామసహాయం రఘఉరామరెడ్డిని ఎక్కడో ఆకాశం నుంచి తీసుకువచ్చిన అభ్యర్థి కాదు. ఆయనది కాంగ్రెస్ కుటుంబం. ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. అలా రామసహాయం రఘురామరెడ్డి రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అంతే కాకుండా ఆర్ధికంగా కూడా బలమైన అభ్యర్థి. ఇక తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయానా వియ్యంకుడు, అదే విధంగా ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ కు కూడా ఆయన వియ్యంకుడు. అంటే ఇటు రాజకీయరంగంలోనూ, అటు సీనీ పరిశ్రమలోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్ కమ్మ సామాజికవర్గం వారిని దూరం పెట్టిందన్న అపప్రధ కూడా రామసహాయం రాఘురామరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తొలగించుకుంది. ఎందుకంటే ఆయన వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు కావడంతో ఇటు  కమ్మ, అటు రెడ్డి సామాజికవర్గాలకు ఆయన బంధువు అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. అదే జోష్ ఇంకా ఖమ్మం కాంగ్రెస్ లో అలాగే ఉంది. దీనికి తోడు అభ్యర్థి ఎంపికలో అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా పార్టీలోని అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడైన రఘురామరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఖమ్మంలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.    అయితే ప్రజాసేవకు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చిన వినోదరావు  తొలిసారి ఎన్నికల బరిలో దిగినా ప్రచారంలో కాంగ్రెస్ కు దీటుగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రచార వేగం చూస్తుంటే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నారని అనిపించక మానదు.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ విషయంలో స్పష్టత వున్నప్పటికీ, ఇక తప్పదు కాబట్టి, కాడి వదిలేయలేరు కాబట్టి ఎన్నికల ప్రచారంలో మేకపోతు గాంభీర్యపు మాటలు చెబుతూనే వున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు, రేవంత్ రెడ్డి మాట తప్పాడని అనడం, కాంగ్రెస్, బీజేపీ ఒకటే అనడం, బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనడం... ఇలాంటివన్నీ అలా వుంచితే, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న ఒక బంపర్ ఆఫర్ని విని జనం భయంతో వణికిపోతున్నారు. కేటీఆర్ ఇస్తున్న ఆ ఆఫర్ ఏంటంటే, ‘‘ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్‌ని 12 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించండి. మా నాయకుడు కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతాడు. సంవత్సరం తిరిగేసరికి తెలంగాణలో మరోసారి కేసీఆర్ శకం వస్తుంది’. కేటీఆర్ ఇస్తున్న ఈ ఆఫర్ విని జనం భయపడిపోతున్నారు. ఒక దశాబ్దం పాటు కేసీఆర్ చల్లని పాలనను చవిచూసిన ప్రజలు మరోసారి ఆ చల్లని పాలనని కోరుకోవడం లేదు. రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకే ఆకాశంలో వున్న తెలంగాణని అప్పుల పాతాళంలోకి పడేశారు. మళ్ళీ ఇంకోసారి కేసీఆర్ శకం వస్తే భరించడం మావల్ల కాదు బాబోయ్ అనుకుంటున్నారు. అందువల్ల కేటీఆర్ ఇస్తున్న బంపర్ ఆఫర్ వల్ల  ప్లస్ జరగకపోగా మైనస్ జరిగే అవకాశాలున్నాయి. 12 స్థానాలు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ కేసీఆర్ శకాన్ని తేవడం ఎందుకు అని ఓటర్లు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది మరి.
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబోరెటరీ పంపించాలని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత విఠల్ ఎన్నికల రద్దు చేస్తున్నామని తీర్పు వెలువరించింది. దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో ఎన్నికయ్యారు. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వర్ రెడ్డ నామినేషన్ ఉపసంహరణకు గురైంది.అయితే తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కోరారు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: ఆ ఒక్కటీ అడక్కు  తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లివర్, హరితేజ, అరియానా తదితరులు  దర్శకత్వం: మల్లి అంకం  సంగీతం: గోపి సుందర్  నిర్మాత:  రాజీవ్ చిలక  మాటలు: అబ్బూరి రవి  ఎడిటర్: చోట కె ప్రసాద్  కెమెరా: సూర్య  విడుదల తేదీ: మే 3  2024 అప్పట్లో కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ మునుపటిలా కామెడీతో మ్యాజిక్ చేశాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: గణపతి(అల్లరి నరేష్) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడుకి పెళ్ళయ్యి, ఒక పాప కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగమున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా గణకి మాత్రం వివాహం జరగదు. 50 సంబంధాలు చూసినా ఏదీ సెట్ అవ్వదు. బంధువులు, తెలిసినవాళ్లంతా "పెళ్ళెప్పుడు", "పప్పన్నం ఎప్పుడు పెడతావు" అని అడుగుతూనే ఉంటారు. అలాంటి గణ, అనుకోకుండా వివాహాలు కుదిర్చే హ్యాపీ మాట్రిమోనీని సంప్రదిస్తాడు. అక్కడ వచ్చిన వధువుల ప్రొఫైల్స్ ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. అప్పటికే సిద్ధిని బయట చూసి, ఆమెపై సదాభిప్రాయమున్న గణ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ సిద్ధి మాత్రం గణని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. గణకి సిద్ధి నో చెప్పడానికి కారణమేంటి? అసలు సిద్ధి ఎవరు? ఆమె గణ జీవితంలోకి ఎలా వచ్చింది? అసలు గణకి పెళ్లి ఆలస్యం అవ్వడానికి కారణమేంటి? చివరికి తాను ఇష్టపడిన సిద్ధిని పెళ్లి చేసుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: మాట్రిమోనీ పేరుతో బయట ఎన్నో మోసాలు జరగడం చూస్తున్నాం. దానిని కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ సీరియస్ పాయింట్ ని తీసుకొని, ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లీడు దాటిపోతున్నా, ఇంకా సింగిల్ గా ఉండే యువకులకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందే. తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నతో ఇబ్బంది పెడతారు. అలా ఇబ్బంది పడే ఓ యువకుడి పాత్రే ఈ సినిమాలోని కథానాయకుడిది.  ఓ వైపు పెళ్లికాని ప్రసాద్ లాంటి హీరో పాత్ర, మరోవైపు మాట్రిమోనీ పేరుతో మోసాలు.. ఈ రెండింటిని కలుపుతూ కథని అల్లుకున్నారు. కథ ఆలోచన బాగున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా మలిచి, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. అల్లరి నరేష్ కొంచెం గ్యాప్ తరువాత చేసిన కామెడీ సినిమా కావడంతో.. ప్రేక్షకులు కామెడీ ఓ రేంజ్ లో ఆశిస్తారు. అలా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే కొన్ని నవ్వులు ఉన్నాయి. మునుపటి అల్లరి నరేష్ సినిమాలతో పోలిస్తే కామెడీ డోస్ బాగా తగ్గిపోయింది. హీరో పెళ్లి గోల, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని హీరో అనుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ పరవాలేదు అన్నట్టుగా సాగింది. ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అవకాశముంది. ఓ రకంగా సినిమాలో అదే హైలైట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో కామెడీ డోస్ మరింత తగ్గింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాల ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒకట్రెండు సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మొత్తానికి కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు అన్నట్టుగా సినిమా సాగింది. సన్నివేశాలను కొత్తగా రాసుకొని, కామెడీ డోస్ పెంచినట్లయితే.. సినిమా అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది. నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. సిద్ధి పాత్రకు ఫరియా అబ్దుల్లా పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మరదలు పాత్రలో నటించిన జామీ లివర్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. తనదైన కామెడీతో కట్టిపడేసింది. తెలుగులో ఆమెకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్, హరితేజ, అరియానా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. చాలారోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమా చేశాడు.. ఓ రేంజ్ లో నవ్వుకోవచ్చు అనే అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో పరవాలేదు అనేలా ఉంది. పెళ్లికాని యువకుల బాధని, మాట్రిమోనీ పేరుతో బయట జరుగుతున్న మోసాలను చూపించిన ఈ సినిమాను.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5  - గంగసాని
క్యారక్టర్ ఆర్టిస్ట్ కి కూడా స్టార్ డం తెచ్చిన నటి  వరలక్ష్మి శరత్ కుమార్. పాత్ర ఏదైనా సరే రఫ్ ఆడించడం ఆమె నైజం. తను ఉన్న సినిమా  ఖచ్చితంగా  బాగుంటుందనే ఆలోచనని కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.పేరుకే తమిళ నటి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెలుగు నటే అని అంటారు. అంతలా అభిమానాన్ని పొందింది. తాజాగా తనకి ఎదురైన క్యాస్టింగ్ అనుభవం గురించి చెప్పింది ఇండస్ట్రీలో ఏ చిన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చాలు. ఆ తర్వాత  దూసుకుపోవచ్చని అంటారు. అలాంటిది వరలక్ష్మిది  మాములు బ్యాక్ గ్రౌండా. తండ్రి శరత్ కుమార్ తమిళనాట బడా స్టార్. కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పొలిటికల్ పార్టీని  కూడా స్థాపించాడంటే ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వరలక్ష్మి కూడా  క్యాస్టింగ్  కౌచ్ ని ఎదుర్కొంది. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ హెడ్ ఒక సినిమా విషయమై తనతో  మాట్లాడేందుకు వచ్చాడు.డిస్కర్షన్  ముగిశాక మనం మళ్లీ బయట కలుద్దామని చెప్పాడు.ఎందుకని  అడిగితే వేరే పని కోసం అన్నాడు. రూం కూడా  బుక్ చేస్తానని చెప్పాడు. అప్పుడు గాని  వరలక్ష్మి కి విషయం అర్ధం కాలేదు. పైగా అతను వరలక్ష్మి ఇంటిలోనే ఆ విధంగా మాట్లాడాడు.దాంతో  సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఆ  తర్వాత  ఛానల్ కూడా అతన్ని   తీసేసింది ఇండస్ట్రీలో తనకు ఇదొక్కటే చేదు అనుభవం కాదు. కమిట్ మెంట్ కి ఒప్పుకోలేదని  కొన్ని సినిమాల నుంచి కూడా  తప్పించారు. అయినా సరే క్యారెక్టరే ముఖ్యం అని భావించి నేడు టాప్ స్టార్ గా వెలుగొందుతుంది.పైగా  వేరే అమ్మాయిలతో ఇండస్ట్రీ జనాలు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకొని  శక్తి పేరుతో ఒక ఎన్జీవో పెట్టి ఇండస్ట్రీలో మహిళలకు అండగా నిలుస్తుంది. ప్రస్తుతం శబరి అనే మూవీ తో థియేటర్ లలో ఉంది. ఇటీవలే ముంబైకి చెందిన నీకొలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పిఎస్, హనుమాన్ లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.   
భారతీయుల జీవన విధానంలో సినిమా అనేది నిత్యకృత్యమయిపోయింది. రోజుకి ఒక సినిమా అయినా చూడందే నిద్రపోనీ వాళ్ళు కోట్లల్లోనే ఉంటారు. ఇక సినిమా విడుదల రోజు చూడాలి. థియేటర్ ల దగ్గర  డాన్స్ లు,మేళతాళాల చప్పుళ్ళు   బాణాసంచా మోతలతో పెద్ద హడావిడే  చేస్తారు. మరీ ఇంతలా ఆనందాన్ని ఇస్తున్న సినిమా ఎప్పుడు విడుదలయింది. ఆ సినిమా ఏంటి మొట్టమొదటి భారతీయ సినిమా రాజా హరిచంద్ర. మే 3  1913 సంవత్సరం విడుదలైంది. అంటే నేటికీ  నూట పదకొండు సంవత్సరాలు అవుతుంది. అసేతు హిమాచలం సాక్షిగా  వెండి తెరపై సగర్వంగా ప్రదర్శితమయ్యింది. కాకపోతే  సైలెన్స్ చిత్రంగా తెరకెక్కింది. అంటే ఎలాంటి మాటలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండవు. కేవలం పాత్రలు మాత్రమే కనపడతాయి. పురాణాల్లోని రాజా హరిచంద్ర జీవిత కథ ఆధారంగా నిర్మాణం జరుపుకుంది.మరాఠీ నటులు ఎక్కువ భాగం  నటించారు. ఇరవై వేలరూపాయిల బడ్జట్ తో  నలభై నిమిషాల నిడివితో తెరకెక్కింది దాదాసాహెబ్ ఫాల్కే ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు. దాంతో  ఇండియన్ సినిమా పితామహుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద అవార్డుల్ని ఇస్తుంది. ఆ అవార్డు అందుకోవడాన్ని సినీ ప్రముఖులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక రాజా హరిచంద్ర ప్రీమియర్ షో ని కూడా జరుపుకుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ముంబైలో ని ఒలింపిక్ థియేటర్ లో ప్రదర్శితమయ్యింది. ఏది ఏమైనా తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలి.. చూస్తే సినిమా చూడాలి  
  సినిమా పేరు: ప్రసన్నవదనం తారాగణం: సుహాస్,పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు,  హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత  రచన, దర్శకత్వం : అర్జున్ వై.కె సంగీతం : విజయ్ బుల్గానిన్  నిర్మాతలు :మణికంఠ,ప్రసాద్ రెడ్డి  విడుదల తేదీ:  మే  3  2024  వరుస హిట్లతో దూసుకుపోతున్న సుహాస్ ఈ రోజు ప్రసన్నవదనం అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి సుహాస్ విజయపరంపర కంటిన్యూ అయ్యిందో లేదో చూద్దాం కథ తన తల్లి తండ్రులతో కలిసి కారులో వెళ్తున్న సూర్య ( సుహాస్ ) కారు  యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ ప్రమాదంలో తల్లి తండ్రులు ఇద్దరు చనిపోతారు. సూర్య  మాత్రం ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడతాడు. అంటే ఒక మనిషి ముఖం సూర్యకి రక రకాలుగా కనపడుతుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషి ముఖం అతనికి గుర్తు ఉండదు. రేడియో మిర్చిలో జాకీగా పని చేస్తుంటాడు. సాటి వారి పట్ల జాలి దయ కల్గిన సూర్య మెంటాలిటీ నచ్చి  ఆధ్య   (పాయల్ రాధాకృష్ణ) ప్రేమిస్తుంది. సూర్య కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో అమృత (సాయిశ్వేత) అనే అమ్మాయి హత్య జరుగుతుంది . కాకపోతే ప్రపంచం మొత్తం యాక్సిడెంట్ అని నమ్ముతుంది. దాంతో  పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  వైదేహి (రాశీ సింగ్ )  ఆధ్వర్యంలో  కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తుంటారు. కానీ అమృత ది  హత్యా అని సూర్య కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులే  సూర్య మీద మూడు హత్యలు చేసినట్టు కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళు అలా ఎందుకు చేసారు?  అమృత  కేసు విషయంలో  తనకున్న ఫేస్  బ్లైండ్ నెస్ అనే వ్యాధిని దాటుకొని అసలు నేరస్తుల్ని సూర్య  ఎలా పట్టుకున్నాడు?  అసలు అమృత ఎవరు? తన లవ్ ఏమైంది ? అనేదే ఈ కథ  ఎనాలసిస్ :  ముందుగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్న  కథని ఎంచుకున్నందుకు దర్శకుడుకి కంగ్రాట్స్ చెప్పాలి. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ  బోర్ కొట్టదు.కాకపోతే  ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న వ్యక్తి తన లోపాన్ని నయం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుండేది. ఈ యాంగిల్ ని ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్ టైన్మెంట్ కోణంలో చెప్పుండాల్సింది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లాంటివి మధ్య మధ్యలో వచ్చి వచ్చి ఉంటే బాగుండేది.  హీరో హీరోయిన్ ల మధ్య కామెడీ ట్రాక్ ని నడిపే అవకాశం ఉన్నా ఎందుకనో ఆ దిశగా వెళ్ళలేదు.కాకపోతే  హీరో హీరోయిన్ల  పరిచయం సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చిన చాలా  ట్విస్ట్ లు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి.  ముఖ్యంగా రాశి సింగ్, సూర్య,  పాయల్ రాధాకృష్ణ,  నితిన్ ప్రసన్న ల మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకులకి థ్రిల్ ని కలిగించాయి. కాకపోతే ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు కూడా  మైండ్ లో ఒక ఆలోచన వస్తు ఉంటుంది. అబ్బా బడ్జట్ ఇంకొంచం ఎక్కువ ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది అని. అది నూటికి నూరుపాళ్లు నిజం కూడా  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు సుహాస్ మరోసారి తన సహజమైన నటనతో  అదరగొట్టాడు.ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లం వల్ల  మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో సూపర్ గా నటించాడు. తన కెరీర్ లో మొదటి సారి  యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా చేసాడు.ఇక హీరోయిన్  పాయల్ రాధాకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసింది. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అనేలా చేసింది.క్లోజ్ షాట్స్ లో కూడా మంచి ఎక్సప్రెషన్స్ ని  పలికించింది. ఇక ఏసిపి క్యారక్టర్ లో రాశి సింగ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. వరలక్ష్మి శరత్ కుమార్ అవకాశాలని రాశి సింగ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎస్ఐ క్యారక్టర్ చేసిన  నితిన్ ప్రసన్న కూడా సూపర్ గా చేసాడు. ఫ్యూచర్ లో అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు. వైవా హర్ష,  నందు, సత్య లు కూడా తమ   పరిధిమేరకు చక్కగానే నటించారు.ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక మ్యూజిక్ ని అందించిన  విజయ్ బుల్గానిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  సినిమాని నిలబెట్టాడు.  సాంగ్స్ కూడా బాగున్నాయి.నిర్మాణ విలువలు మాత్రం సోసో గా ఉన్నాయి  ఫైనల్ గా చెప్పాలంటే ఎంత చెట్టుకి అంతే గాలి అనే సామెత ప్రసన్నవదనంతో  మరోసారి రుజువయ్యింది. సినిమా అయితే నాట్ బాడ్.. వెరైటీ కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ మూవీ కాబట్టి టైటిల్ కూడా డిఫరెంట్ గా పెట్టుండాల్సింది. ప్రసన్న వదనం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నవ్వు ముఖంతో ఉండటం  రేటింగ్ 2 .75 / 5                                                                                                    అరుణాచలం 
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'జితేందర్ రెడ్డి'. రాకేష్‌ వర్రె లీడ్‌ రోల్‌ లో నటించిన ఈ సినిమాని ముదుగంటి క్రియేషన్స్‌ పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించింది. మే 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 1983-89 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన 'జితేందర్ రెడ్డి' ట్రైలర్ ఎన్టీఆర్ పాత్రను కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో నక్సలిజాన్ని వ్యతిరేకిస్తూ, హిందూయిజంకి మద్దతుగా ఉన్నట్టుగా జితేందర్ రెడ్డి పాత్ర కనిపిస్తుంది. అలాగే, "ప్రజల కోసం అడవుల బాట పట్టిన నక్సల్స్ దేశ భక్తులు. వారి పోరాట స్ఫూర్తి గొప్పది." అని ఎన్టీఆర్ అన్నట్టుగా సంభాషణలు ఉండగా, దానికి కౌంటర్ గా కథానాయకుడు "నక్సలైట్లు దేశభక్తులు కాదు సార్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు దేశభక్తులు.. ప్రాణాలు తీసేవాళ్ళు కాదు సార్." అంటూ ఎన్టీఆర్ తో చెప్పినట్లుగా ట్రైలర్ లో ఉంది. మొత్తానికి ట్రైలర్ లో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లుగా ఉంది.
ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద బయోపిక్ ల ట్రెండ్ నడుస్తు ఉంది. సమాజంలోని రకరకాల వ్యక్తుల జీవిత చరిత్రలని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్  నివేత థామస్( Nivetha Thomas)కూడా బయోపిక్ లో నటించబోతుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది.     గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ  బుర్రకథ కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బుర్రకథ చెప్పడంలో గుంటూరు నాజర్ వంటి అగ్రగణ్యులు ఉన్నా కూడా  తన కంటూ ఒక ప్రత్యేక బాణి ని ఏర్పరచుకొని ఎంతో కీర్తిని సంపాదించింది. అసలు ఆమె బుర్ర కథ చెప్పడం ప్రారంభిస్తే ఇంక జనం అన్ని పనులు మానుకొని ఆమె ప్రదర్శననని తిలకిస్తుంటారు. ఇప్పుడు  లక్ష్మి బయోపిక్ లోనే నివేదిత నటిస్తుంది. ప్రముఖ అగ్రనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా  గౌరీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గరివిడి లక్ష్మి అసలు పేరు రెడ్డి లక్ష్మి నివేదిత  2008 లో వేరుతే ఓరు భార్య అనే మలయాళ మూవీతో  బాలనటిగా పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 20 సినిమాలకి పైనే చేసింది.ఎన్టీఆర్ జై లవ కుశ, నాని జెంటిల్మన్ ,నిన్ను కోరి హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చాయి. పవన్ వకీల్ సాబ్, రజనీ దర్బార్ లో కూడా  ముఖ్య పాత్రల్లో నటించింది.   
The movie "Aarambham," featuring Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment and directed by Ajay Nag V. "Aarambham," a film touted as a distinctive thriller trailer was released today during a launch event, presenting a captivating narrative. The trailer opens with the scene of a convict vanishing from jail, leaving no clues behind. This mysterious escape is being probed by a special office, drawing widespread interest. The trailer showcases the visuals of investigation and the story of escaped convict with his mother and love and also a scientist who inspired him. Packed with mysterious elements, compelling storylines and powerful performers, the film promises a seat edge thriller. With the absorbing story, rich visuals and a powerful soundtrack, is all set to deliver a gripping experience, enriched with mythological elements. The intertwining plotlines enhance the suspense and anticipation surrounding this thrilling movie. The movie team is planning to release "Aarambham" in theaters on May 10th. Srinjith Yerramilli is the music director while Devdeep Gandhi Kundu is handling the cinematography.
‘Love Today’ bankrolled by South India's leading production company AGS Entertainment and directed by Pradeep Ranganathan, who had also played the lead, emerged a blockbuster by winning the praise of audience from all walks of life. This success combo is joining forces once again. To be produced by Kalpathi S. Aghoram, Kalpathi S. Ganesh, and Kalpathi S. Suresh, this new film is written and directed by 'Oh My Kadavule' fame Ashwath Marimuthu and Pradeep Ranganathan is playing the protagonist. The yet-to-be-titled movie, which will have popular actors in its cast, will commence shooting from May. This is the 26th production of AGS Entertainment. The team has released an announcement video, which is making huge waves on the internet. The fun-filled video reflects the real-life friendship of Pradeep Ranganathan and Ashwath Marimuthu and it has won widespread acclaim within minutes of its launch. Archana Kalpathi is the Creative Producer of this lively emotional film. Aishwarya Kalpathi is the Associate Creative Producer. Music is by Leon James, cinematography by Niketh Bommi, and editing by Pradeep E. Ragav. Announcements including the title of the film, information about other actors and actresses will be made officially by AGS Entertainment in due course.
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.