ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  విమర్శలు  గుప్పించారు. ఇక తాను పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, ఆయన పాలనలో చోటుచేసుకున్నట్లు తాను భావిస్తున్న తప్పులను చట్టపరంగా ప్రశ్నించడం తన లక్ష్యాలన్నారు.  రిటైర్మెంట్ తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనీ, అయితే తనకు పదవులపై కించిత్ కూడా ఆసక్తి లేదని చెప్పారు.  తనకు పని ఇవ్వమనీ, నిర్దుష్ట బాధ్యత అప్పగించాలనీ తాను చంద్రబాబును కోరినట్లు చెప్పారు. జగన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబును తాను కోరాననీ, అయితే ఆయన తనకు ఎటువంటి  పనీ అప్పగించలేదని స్పష్టం చేశారు.  జగన్ హయాంలో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అవకతవకలు, తప్పిదాలను చట్టపరంగా ప్రశ్నించే పని అప్పగించాలని చంద్రబాబును కోరాననీ, అయితే ఆయన పట్టించుకోలేదని వివరించారు.   ప్రభుత్వం నుంచి తాను ఆశించిన బాధ్యత రాకపోవడంతో బయట ఉండి తనకు సాధ్యమైన మార్గాల్లో అదే అంశాలపై పోరాడుతున్నానన్నారు. ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అయితే తన ఎంట్రీ పట్ల తెలుగుదేశం అధినాయత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.   [AP Inteligence, Former Chief,  AB Venkateswara Rao, CBN, Jagan, Appolitics,  Former IPS, Telugu One]
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని  సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది.  ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో  ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు   ప్రకటించింది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది. యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే  అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,   వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా  స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్‌‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు. ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది. కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్‌లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. [Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.  తాజాగా  మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.  పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు.  సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.  మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.  అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది.  దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ  పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.     స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.  మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.   [YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్ తొలిసారి ఆయనతో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉంది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల మూడో వారంలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముందుగా ఒక గ్రాండ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. ఆ వెంటనే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ రెడీ అవుతోందని టాక్. ఇప్పటికే ‘డ్రాగన్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించిన విషయం తెలిసిందే. గతంలో యూరోపియన్ స్టైల్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఈసారి ప్లాన్ చేస్తున్న యాక్షన్ బ్లాక్ మరింత స్పెషల్‌గా ఉండబోతుందట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఈ ఫైట్‌ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ మేకింగ్, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిసి వస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘డ్రాగన్’లో జైల్ ఫైట్, కాళీమాత టెంపుల్ ఫైట్ లాంటి భారీ యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ‘స్పిరిట్’ స్టోరీ లీక్.. రెండు డిఫరెంట్ లుక్స్‌లో ప్రభాస్ ఊచకోత.!       [Dragon Massive Action Schedule, NTR Dragon Shooting Update, NTR Dragon Fights, NTR Dragon Action Scenes, Jr NTR Dragon Movie, NTR Neel Movie, Prashanth Neel, Telugu Film News]  
Sree Vishnu’s upcoming film Comrade Kalyan has unveiled its trailer, giving a clearer look at the film’s unusual backdrop and its blend of comedy, romance and action. Directed by Janakiram Marella, the film revolves around Kalyan, whose life takes an unexpected turn as he becomes a most-wanted Naxalite. The trailer introduces Kalyan’s personal world before bringing the larger conflict into focus. He falls in love with an Odisha girl, played by Mahima Nambiar, while his mother, portrayed by Radhikaa Sarathkumar, is presented as an ardent NBK fan with a short temper. The story takes a serious turn when a police officer begins pursuing Kalyan, raising questions about what led him to become a Naxalite and what exactly he has done to land on the police radar. Despite the serious backdrop, the trailer retains Sree Vishnu’s trademark humour and dialogue-driven entertainment. His one-liners and distinctive dialogue delivery remain central to the film, with Satya, Vennela Kishore and Sudharshan adding to the comic portions. The trailer suggests that the film will balance its action and dramatic elements with the lighter treatment associated with Sree Vishnu’s entertainers. Mahima Nambiar and Radhikaa Sarathkumar get moments that stand out, while Vijai Bulganin’s music, including the already released songs Oh Oriya Pilla and Intha Istama, adds to the film’s appeal. Produced by Seetha Karnati and Venkata Krishna Karnati, with Kona Venkat presenting the film, Comrade Kalyan is scheduled to release in theatres on October 9. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కలెక్షన్ల తుఫాన్ వచ్చే ముందు బాక్స్ ఆఫీస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా వచ్చి కలెక్షన్ల పెను తుఫాన్  సృష్టించింది స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్పైడర్ మాన్ మాస్క్ లు ధరించి థియేటర్స్ కి తరలి వెళ్లారు. ఇప్పుడు వాళ్లంతా మరో సారి తమ ఇంట్లోనే మాస్క్ ధరించనున్నారు.   థియేటర్లలో సుదీర్ఘకాలం విజయవంతంగా ప్రదర్శించబడుతూ అసాధారణ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తన సందడిని షురూ చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 66 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అక్టోబర్ 6 నుంచి, అంటే ఈ రోజు నుంచి  ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ డెబ్యూ (OTT Premium/PVOD) చేస్తోందన్న వార్త సినీ ప్రేమికులకి, స్పైడీ ఫ్యాన్స్‌కు అపరిమిత ఆనందాన్ని ఇస్తోంది. థియేటర్లలో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ అయిన సినీ ప్రియులై ఇది నిజంగా తీపి కబురే.     ఇది కూడా చదవండి: రవితేజ తులాభారంలో తూగబోయే వాళ్ళు వీరేనంటా!  ఇప్పటివరకు 'అవేంజర్స్: ఎండ్ గేమ్', 'అవతార్' చిత్రాలు మాత్రమే 2.5 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరగా,  ఆ ప్రతిష్టాత్మక క్లబ్‌లో అడుగుపెట్టిన మూడో చిత్రంగా కూడా  'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' తన రికార్డుని చాలా గర్వంగా తన అమ్ముల పొదిలో దాచుకుంది.   [Spider Man Brand New Day In Ott, Spider Man Brand New Day, Spider Man 2.5 billion box office, Spider Man digital debut, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]    
Ravi Teja and Vivek Athreya’s upcoming collaboration is turning interesting on the casting front. Industry buzz suggests that the film has locked Priyanka Mohan and Anaswara Rajan in prominent female roles, making it a two-heroines setup. Priyanka Mohan is said to be the leading lady, while Anaswara Rajan is reportedly playing another important character with considerable prominence in the story. The makers are said to be keeping the details of both roles under wraps for now, leaving the relationship between the two characters and their importance to Ravi Teja’s character open to speculation. The casting is particularly interesting given Vivek Athreya’s penchant for building films around distinctive characters rather than conventional commercial templates. Bringing Ravi Teja together with Priyanka and Anaswara could give the film an unusual dynamic, although the makers are yet to reveal the film’s plot or the exact nature of their roles. For Anaswara, the project would mark another significant step into Telugu cinema after making her presence felt with her recent work. Priyanka, meanwhile, continues to be part of several interesting projects across the South. The film marks Ravi Teja’s first collaboration with Vivek Athreya and is expected to be a different outing for the actor. While the official announcement is yet to reveal the complete cast and character details, the reported combination of Ravi Teja, Priyanka Mohan and Anaswara Rajan has already become an interesting talking point in industry circles. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమాకు భాషతో సంబంధం లేదని మరోసారి నిరూపిస్తోంది తమిళ చిత్రం ‘బత్తా’. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటనతో పాటు కథను దర్శకుడు బాలాజీ ధరణీధరన్ నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘బత్తా’ ఒకటంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 1986 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. అయితే గ్యాంగ్‌స్టర్ కథ అనగానే కత్తులు, కొట్లాటలు, రక్తపాతం ఎక్కువగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఇందులో కామెడీ, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ను ఓ చిన్నారి అనుకోకుండా స్కూల్ బాత్రూమ్‌లో బంధించడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. బయట ప్రపంచంలో అందరూ భయపడే వ్యక్తి.. ఓ చిన్న గదిలో చిక్కుకుపోయిన తర్వాత తన జీవితాన్ని, కుటుంబాన్ని, తనలోని మనిషిని ఎలా తిరిగి చూసుకున్నాడనేదే సినిమా ప్రధాన కథాంశం. ఇక బత్తా పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను ప్రదర్శించారని చెప్పొచ్చు. గ్యాంగ్‌స్టర్‌గా భయపెట్టే సన్నివేశాల నుంచి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల వరకు ఆయన నటనలో ఎన్నో షేడ్స్ కనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో చిన్నారి సబరి పాత్ర పోషించిన నటుడు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో పోటీపడే స్థాయిలో అతని నటన ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. లిజోమోల్ జోస్, బత్తా భార్యగా, చిన్నారి నటుడు సినిమాకు మరింత ఎమోషనల్ బలం చేకూర్చారు. మరోవైపు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. పెద్ద యాక్షన్ సీన్లు లేకుండానే ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో వచ్చే మార్పును హాస్యం, ఎమోషన్‌తో దర్శకుడు చెప్పిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ‘బత్తా’ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమిళ వెర్షన్‌లో ప్రదర్శితమవుతోంది. తెలుగులో డబ్బింగ్ చేస్తే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.       [Baththa Movie, Baththa Movie Review, Vijay Sethupathi Baththa, Vijay Sethupathi Latest Movie, Vijay Sethupathi Best Performance, Baththa Tamil Movie, Balaji Tharaneetharan, Lijomol Jose, Sai Abhyankkar, Tamil Movies, Kollywood News, Vijay Sethupathi Movies]
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఒకవైపు ఉంటే.. ప్రభాస్‌ను వంగా ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనే క్యూరియాసిటీ మరోవైపు ఉంది. ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించి వస్తున్న కొత్త సమాచారం ఈ అంచనాలను మరింత పెంచుతోంది. సాధారణంగా పోలీస్ కథ అంటే నిజాయితీగల పోలీస్.. విలన్లను పట్టుకోవడం.. చివర్లో పెద్ద యాక్షన్ బ్లాక్ అనే ఫార్మాట్‌లో సినిమాలు వస్తుంటాయి. కానీ ‘స్పిరిట్’ విషయంలో సందీప్ రెడ్డి వంగా ఆ రెగ్యులర్ ఫార్ములాను ఫాలో కావడం లేదట. ప్రభాస్ పాత్రలో డార్క్ గ్రే షేడ్స్ ఉంటాయని టాక్.  ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రల్లో చూడని రీతిలో ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రభాస్ పాత్రను వైల్డ్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. పాత్రలో ర్యాష్‌నెస్, నెగెటివ్ షేడ్స్ కనిపించినప్పటికీ.. దాని వెనుక బలమైన కారణం, ఎమోషనల్ జస్టిఫికేషన్ ఉంటుందట.  ఇక ‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ కూడా చాలా కీలకంగా ఉండబోతుందట. ఫస్ట్ హాఫ్‌లో ఒక రకమైన లుక్‌లో కనిపిస్తే.. సెకండ్ హాఫ్‌లో పూర్తిగా మరో అవతార్‌లో కనిపిస్తారని సమాచారం. కథలో జరిగే కీలక పరిణామాల కారణంగా ప్రభాస్ లుక్‌లో ఈ భారీ మార్పు వస్తుందట. అంటే ఇది కేవలం మేకోవర్ కోసం చేసే మార్పు కాకుండా.. పాత్రలో వచ్చే ఎమోషనల్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూపించడానికి ఉపయోగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌లో గాయాలతో ఉన్న ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్‌కు ఈ వార్త మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. అసలు కథ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఉన్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి జీవితం ఒక్కసారిగా ఎలా తలకిందులైంది? తన సర్వీస్‌కు, సమాజానికి దూరమైన తర్వాత అతను తన జీవితాన్ని ఎలా తిరిగి నిర్మించుకున్నాడు? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని టాక్. ఈ జర్నీలో ఈగో, ఎమోషన్స్, రిడెంప్షన్ వంటి అంశాలు కీలకంగా ఉంటాయని సమాచారం. ‘స్పిరిట్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను 2027, మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఫటా పటాకా.. యామీ గౌతమ్ జాంబీ డ్యాన్స్ అదిరిపోయిందిగా.!       [Prabhas Looks In Spirit, Prabhas Spirit Story, Prabhas Cop Role, Prabhas As Police, Rebel Star Prabhas, Sandeep Reddy Vanga, Telugu Film News]  
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా, రచయితగా సుపరిచితమైన సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో నవ్వించిన ఆయన.. తాజాగా ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. సినిమాలను తాను వదిలిపెట్టలేదని, తన స్థాయికి తగ్గ మంచి పాత్రలు రావడం లేదనే కారణంతోనే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. సినిమాల్లోకి రాకముందు సుమారు 10 నుంచి 15 ఏళ్ల పాటు నాటకరంగంలో నటించానని ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. ఆ అనుభవంతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 500 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించే అవకాశం దక్కిందన్నారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ వంటి దాదాపు 40 విజయవంతమైన చిత్రాలకు సంభాషణలు రాశారు. అయితే కాలక్రమంలో తనతో కలిసి ప్రయాణించిన పలువురు సమకాలీన నటులు, కమెడియన్లు దూరమయ్యారని, తన గురువు ఈవీవీ సత్యనారాయణ కూడా లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చే, బలమైన పాత్రలు పెద్దగా రాకపోవడంతో యూట్యూబ్ కోసం సొంతంగా షార్ట్‌ఫిలిమ్స్ చేయడం ప్రారంభించానని తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘గరివిడి లక్ష్మి’ సినిమా తనను కథతోనే ఆకట్టుకుందని ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ద్వారా ఈ బయోపిక్ గురించి తెలుసుకున్నానని, దర్శకుడు గౌరీ నాయుడు కథను వివరించిన విధానం, జానపద కళపై ఆయనకున్న అవగాహన తనకు నచ్చాయని తెలిపారు. ఇందులో గరివిడి లక్ష్మికి గురువుగా కనిపించనున్నానని, తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించానని చెప్పారు. మరోవైపు ‘గరివిడి లక్ష్మి’లో మొత్తం 16 పాటలు ఉన్నాయని, ఇది మంచి సంగీత విందుగా నిలుస్తుందని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. చిన్నతనంలో దసరా పందిళ్లలో బుర్రకథలు వింటూ పెరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బుర్రకథ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళారూపమని పేర్కొన్నారు. ఒక మహిళా జానపద కళాకారిణి జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న నిర్మాతల నిర్ణయాన్ని అభినందించిన ఆయన.. ‘శంకరాభరణం’, ‘మహానటి’ తరహాలో ‘గరివిడి లక్ష్మి’ కూడా మంచి విజయాన్ని సాధించి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.       [LB Sriram, LB Sriram Emotional Speech, LB Sriram Movies, Garividi Lakshmi, Garividi Lakshmi Movie, Garividi Lakshmi Trailer, Anandhi, Gowri Naidu Jammu, People Media Factory, Telugu Cinema News, Tollywood News]
  మాస్ మహారాజా రవితేజకి ఇరుముడి అదిరిపోయే హిట్ నే కాదు బాధ్యతని కూడా ఇచ్చింది. అందుకే ఇప్పడు హిట్ మేకర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'తులాభారం' చేస్తున్నాడు. హర్రర్ కామెడి అనే టాక్ వినిపిస్తుండటం, టైటిల్ ఏమో తులాభారం కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి ఈ మూవీలో ఓజి బ్యూటీ  ప్రియాంక అరుల్ మోహన్ , కాకా డాటర్ అనస్వర రాజన్ భాగస్వామ్యం కానున్నట్టు  ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రియాంక మోహన్  హీరోయిన్ కాగా అనశ్వర రాజన్ కీ రోల్ లో కనిపించబోతున్నట్టు కూడా టాక్. మరి ఇదే నిజమైతే అభిమానులకి  తులాభారం మరో కనువిందు  బొమ్మగా నిలబడటం ఖాయం. అంతేకాకుండా విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం.  ఇది కూడా చదవండి: నయనతార వైట్ బికినీ ఫోటోలు వైరల్: ఏఐ వాడారా!    ఇటీవల హైదరాబాద్ లో లుక్ టెస్ట్ ప్రమోషనల్ ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోషూట్‌లో రవితేజ, వివేక్ ఆత్రేయలతో పాటు ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. షాడో లుక్‌తో విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మరి ముందు ముందు తులాభారం నుంచి వచ్చే అప్ డేట్స్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.   [RaviTeja Thulabharam Movie Cast Update, Ravi Teja Vivek Athreya Movie, Thulabhaaram Telugu Movie, Priyanka Arul Mohan, Anaswara Rajan, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ‘గర్ల్ గ్యాంగ్’తో కలిసి సరదాగా గడిపిన సాయంత్రానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మళ్లీ కలిశాం.. స్నేహితురాళ్లతో సరదా సాయంత్రాలు” అంటూ నమ్రతా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో నమ్రతతో పాటు ఆమె కుమార్తె సితార ఘట్టమనేని, దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్, దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి తదితరులు కనిపించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సన్నిహితులంతా కలిసి రిలాక్స్‌డ్‌గా గడిపినట్టుగా ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో మహేశ్, సుకుమార్, వంశీ పైడిపల్లి కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. గతంలోనూ ఈ కుటుంబాలు కలిసి పలు సందర్భాల్లో సందడి చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ గెట్‌టుగెదర్‌లో సితార ఘట్టమనేని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార.. మోడలింగ్‌తో పాటు డిజిటల్ కంటెంట్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఫ్యాషన్, డ్యాన్స్, ఫొటోషూట్లకు సంబంధించిన పోస్టులతో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ సితార సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.     [Namrata Shirodkar, Sitara Ghattamaneni, Mahesh Babu, Namrata Latest Photos, Sitara Latest Photos, Namrata Girl Gang, Sitara Ghattamaneni Photos, Tollywood News, Varanasi Movie, Mahesh Babu Family]
సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ రిలేషన్‌షిప్‌ను ఇన్నాళ్లు ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. ‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ జంట.. తమ ప్రేమకథకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ బంధాన్ని దాచిపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని, అయితే దాని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం మాత్రం తమకు అనిపించలేదని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ మాట్లాడుతూ.. రష్మికతో తన పరిచయం తొలుత కోస్టార్స్‌గా మొదలైందని, ఆ తర్వాత స్నేహంగా మారిందని చెప్పాడు. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారిందని, చివరకు ఆమె తన జీవిత భాగస్వామిగా మారిందని వివరించాడు. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని అందరికీ చెప్పాల్సిన బాధ్యత తనకు లేదని విజయ్ పేర్కొన్నాడు. ‘ఇది నా జీవితం.. దీన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఏముంది?’ అనే భావనతోనే తమ బంధాన్ని ప్రైవేట్‌గా ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. రష్మిక కూడా ఇదే విషయాన్ని మరో విధంగా వివరించింది. తమ రిలేషన్‌షిప్ ఎవరి వినోదం కోసం, గాసిప్ కోసం కాదని ఆమె చెప్పింది. జీవితంలో కొన్ని విషయాలు తమకు ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటాయని, వాటిని తమ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలని అనుకున్నామని పేర్కొంది. అందుకే తమ బంధం గురించి బయట పెద్దగా మాట్లాడలేదని తెలిపింది. ఇక తమ ప్రేమకథలో ప్రత్యేకంగా ‘ఈ రోజే ప్రేమలో పడ్డాం’ అని చెప్పుకునే సందర్భం కూడా లేదట. ఒకరినొకరు మూడు, నాలుగేళ్లు తెలుసుకున్న తర్వాత తమ మధ్య ఉన్న అనుబంధం సాధారణ స్నేహం కంటే ప్రత్యేకమైనదని రష్మికకు అర్థమైందట. ఇక పెళ్లికి ఏడాది ముందు రష్మిక తన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తిగా మారిందో తనకే స్పష్టంగా అర్థమైందని విజయ్ చెప్పాడు. ఆమెతో కలిసి పనిచేసినా, ట్రైనింగ్‌కు వెళ్లినా, భోజనం చేసినా ప్రతి పని మరింత ఆనందంగా అనిపించేదని వెల్లడించాడు. తాను ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు కూడా ‘రష్మిక ఇక్కడ ఉంటే బాగుండేది’ అనే ఆలోచన వచ్చేదని, తన జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లోనూ ఆమెను మిస్ అవుతున్నానని గుర్తించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఆసక్తికరంగా తమ మధ్య ప్రత్యేకమైన ప్రపోజల్ కూడా జరగలేదని, ఎప్పుడు స్నేహం ప్రేమగా మారిందో ఇద్దరికీ కచ్చితంగా తెలియదని ఈ జంట వెల్లడించింది.       [Vijay Deverakonda, Rashmika Mandanna, Vijay Rashmika Relationship, Vijay Rashmika Love Story, Vijay Deverakonda Marriage, Rashmika Mandanna Marriage, Ranabaali, Telugu Cinema, Tollywood News, Vijay Rashmika Relationship Secret]
మన దైనందిన జీవితంలో ఆహారం అత్యంత ప్రాథమికమైన అవసరం. కానీ నేటి ఆధునిక జీవన శైలిలో తెల్ల బియ్యం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చూడటానికి ఎంతో తెల్లగా, ఆకర్షణీయంగా ఉండి, వండటానికి కూడా చాలా తేలికగా ఉండే ఈ తెల్ల బియ్యం, మన శరీరానికి తెలియకుండానే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం (డయాబెటిస్), రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ వంటి భయంకరమైన వ్యాధులకు తెల్ల బియ్యం అధిక వినియోగమే ప్రధాన కారణమవుతోంది. ఈ నేపథ్యంలో, మన ప్రాచీన సంప్రదాయ ఆహారమైన ఎర్ర బియ్యాన్ని (Red Rice) రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. ఎర్ర బియ్యం అనేది ఎటువంటి పాలిష్ చేయని పూర్తి సహజమైన ధాన్యం. ప్రాసెస్ చేయకపోవడం వల్ల దీనిలోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర బియ్యంలో ఉన్న పోషక విలువలను ఒక్కసారి పరిశీలిస్తే, అందులో శరీరానికి కావలసిన 356 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. అలాగే దీనిలో 75.5 గ్రాముల పిండిపదార్థాలు, 9 గ్రాముల మాంసకృత్తులు (ప్రోటీన్), 3.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు 11 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తాయి. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఎర్ర బియ్యంలో పీచు పదార్థం ఏకంగా 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఎర్ర బియ్యంలో ఉండే ఈ అత్యధిక ఫైబర్ పరిమాణం రక్తంలో గ్లూకోజ్ శోషణ వేగాన్ని గణనీయంగా నెమ్మదింపజేస్తుంది. దీని మూలంగా రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు లేదా చక్కెర వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారు తమ ఆహారంలో తెల్ల బియ్యం మరియు సాధారణ ముడి బియ్యం స్థానంలో ఈ ఎర్ర బియ్యాన్ని ఎంచుకుంటే, గ్లూకోజ్ స్థాయిలను చాలా సులభంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల శరీరానికి నిరంతర శక్తి లభించడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలు కూడా క్రమబద్ధీకరించబడతాయి. కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా, ఎర్ర బియ్యంలో ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఇందులో దాదాపు 294 మిల్లీగ్రాముల ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ లభిస్తాయి. ఈ విశిష్ట సమ్మేళనాలు మన జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను మందగించేలా చేసి, చక్కెర రక్తంలోకి వేగంగా కలవకుండా అడ్డుకుంటాయి. గుండె సంబంధిత లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గ్లూకోజ్ నియంత్రణ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర బియ్యానికి ఆ ప్రత్యేకమైన ఎరుపు రంగు రావడానికి కారణం దానిలో ఉండే 'యాంథోసైనిన్' అనే బలమైన యాంటీఆక్సిడెంట్. ఈ యాంటీఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఉచిత రాడికల్స్ నుండి కాపాడి, వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఎర్ర బియ్యంలో ఉండే అధిక ఫైబర్ కారణంగా తక్కువ పరిమాణంలో అన్నం తిన్నా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును నివారించి, బరువును అదుపులో ఉంచుతుంది. ప్రత్యేకించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడంలో ఎర్ర బియ్యం ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.     Red rice health benefits, Erra Biyyam benefits, red rice for weight loss, red rice for diabetes, nutrients in red rice, red rice vs white rice, healthy grains benefits, organic red rice benefits Telugu, health benefits of red rice.
మన సాంప్రదాయ వంటకాలలో రకరకాల పులుసులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా కమ్మటి చేమదుంపల పులుసు సరిగ్గా పద్ధతి ప్రకారం చేస్తే వచ్చే ఆ రుచే వేరు. చేమదుంపలతో పులుసు తయారు చేసేటప్పుడు చాలామందికి జిగటగా రావడం లేదా దుంపలు సరిగ్గా ఉడకకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే సరైన కొలతలు మరియు సులువైన చిట్కాలు పాటిస్తే, ఇంటి నిండా గుమగుమలాడే వాసనలతో నాటి కాలపు రుచిని తలపించేలా నోరూరించే పులుసును సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎంతో రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సాంప్రదాయ పులుసు తయారీకి కావలసిన ప్రధాన పదార్థాల కొలతలను పరిశీలిస్తే: ముందుగా పావు కేజీ (250 గ్రాములు) చేమదుంపలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఉడికించుకున్న తర్వాత తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉన్న చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. రుచితో పాటు సరైన ఘాటు కోసం 1.5 స్పూన్లు ఉప్పు, 1.5 స్పూన్లు కారం, 1/4 స్పూను పసుపు సిద్ధం చేసుకోవాలి. తాలింపు మరియు మసాలాల విషయానికి వస్తే 1 స్పూన్ పోపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి మరియు 1 స్పూన్ ధనియాల పొడి అవసరమవుతాయి. తయారీ విధానం విషయానికి వస్తే, ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగాక 1 స్పూన్ పోపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గి దోర రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న 1/4 కేజీ చేమదుంపల ముక్కలను అందులో వేయాలి. ఆపై 1/4 స్పూను పసుపు, 1.5 స్పూన్ల ఉప్పు మరియు 1.5 స్పూన్ల కారం వేసి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా కలపాలి. ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి, కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వడం వల్ల చేమదుంపల లోపలి వరకు రుచి వెళ్తుంది. ఇలా ముక్కలు కాసేపు మగ్గాక, ముందుగా నీళ్లలో నానబెట్టుకుని తీసిన చింతపండు రసాన్ని (పులుసు) ఇందులో పోయాలి. పులుసు బాగా మరిగి మసలే వరకు మీడియం మంట మీద ఉంచాలి. పులుసు మరుగుతున్న సమయంలో 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మెంతుల పొడి వేయడం వల్ల పులుసుకు అద్భుతమైన సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి వస్తుంది. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కొందరు చేమదుంపలను పచ్చిగానే తొక్క తీసి ముక్కలుగా కోసి పులుసు పెడుతుంటారు. కానీ, ముందుగా ఉడికించి తొక్క తీసిన తర్వాత పులుసు చేయడం వల్ల జిగట రాకుండా, ముక్క మెత్తగా ఉడికి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి లేదా వేడి చపాతీల్లోకి ఈ కమ్మటి చేమదుంపల పులుసును వడ్డిస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.     Chamadumpala Pulusu recipe, Taro Root Curry Telugu, Andhra style Chamadumpala Pulusu, Chamagadda Pulusu recipe, Arbi Gravy Telugu, traditional Andhra pulusu recipes, Chamadumpala curry step by step, tasty chamagadda curry.
మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత అవసరమో, స్వచ్ఛమైన నీరు కూడా అంతే అత్యంత ముఖ్యం. సాధారణంగా ప్రతీ మనిషి రోజుకు 2.7 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే చాలామంది దాహం వేయనప్పుడు నీరు తాగడం మర్చిపోవడం లేదా తక్కువగా తాగడం వల్ల తెలియకుండానే తీవ్రమైన డిహైడ్రేషన్ బారిన పడుతుంటారు. మనం తీసుకునే నీటి పరిమాణం తగ్గినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, డిహైడ్రేషన్ ఏర్పడినప్పుడు మన శరీరంలో రక్తం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. రక్తంలో నీటి శాతం తగ్గి పరిమాణం పడిపోవడం వల్ల, శరీరంలోని ప్రధాన అవయవాలకు మరియు కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను నిరంతరం అందజేయడానికి గుండె సాధారణం కంటే చాలా వేగంగా మరియు కష్టపడి రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండె స్పందనలు అకస్మాత్తుగా పెరిగి, గుండె దడ వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువ సమయం ఉండటం, వేడి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల చెమట రూపంలో నీరు అధికంగా బయటకు పోతుంది. అలాగే జ్వరం, వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు శరీరంలో ద్రవాలు వేగంగా తగ్గిపోయి గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, కొన్ని రకాల వైద్య మందులు వాడుతున్నవారు డిహైడ్రేషన్ ప్రమాదానికి అత్యంత వేగంగా గురవుతారు. శరీరంలో నీటి శాతం తగ్గిందని గుర్తించడానికి అసాధారణంగా తీవ్రమైన దాహం వేయడం, నోరు ఆరిపోవడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం లేదా మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం ముఖ్య సంకేతాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనత, నిలబడినప్పుడు తల తిరగడం, గుండె లయ తప్పి వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల గుండె వేగం పెరిగితే, వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ కొద్దికొద్దిగా నీరు తాగడం ప్రారంభించాలి. చెమట లేదా విరేచనాల వల్ల ఎలక్ట్రోలైట్లు కోల్పోతే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) లేదా కొబ్బరిబోండాం నీరు తీసుకోవడం ద్వారా కోల్పోయిన శక్తిని త్వరితగతిన తిరిగి పొందవచ్చు. రోజువారీ జీవితంలో తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     Dehydration and heart rate, fast heartbeat dehydration, dehydration heart palpitations, symptoms of dehydration, high heart rate causes, dehydration effect on blood pressure, dehydration symptoms Telugu health, rapid pulse rate fluid loss.
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని  మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ​మనం చేసే చిన్న చిన్న పనులు,  ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. LI4 పాయింట్.. ​మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో  మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంగ్ టాంగ్ పాయింట్.. ​నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్  ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. నీరు.. ​శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాంప్రెస్.. ​తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి. ఆయిల్స్.. పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి. అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.                      *రూపశ్రీ.