బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ భయంతోనే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా జరిగిందా? రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే బీఆర్ఎస్ లో అభ్యర్థిని నిలపడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గెలిచే అవకాశం లేకున్నా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బరిలోకి అభ్యర్థిని దింపాలని బీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ తరఫున ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దింపి కాంగ్రెస్ ను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలని భావించింది. అలాగే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని కూడా భావించింది. తీరా నామినేషన్ల గడువు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి వినా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వారిరువురి ఎన్నిక ఇక లాంఛనమే.   రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్   మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు. అయితే చివరికి బీఆర్ఎస్ మౌనంగా వెనక్కు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణంగా బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న భయమే అంటున్నారు.   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటంతో.. వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే పార్టీ పరువు పోతుందన్న భయంతోనే బీఆర్ఎస్ వెనక్కు తగ్గిందంటున్నారు. అలాగే ఎలాగూ గెలిచే అవకాశం లేని ఎన్నికలలో పోటీ చేసి క్యాడర్ లో నిరాస, నిస్ఫృహలను పెంచడమెందుకన్న యోచనతో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందంటున్నారు. 
మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు  కస్టోడియల్ టార్చర్ కేసులో ఇంత కాలం విచారణకు దూరంగా ఉన్న ఐపీఎస్  అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు అనివార్యంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం (మార్చి 5) విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.   విచారణలో సునీల్ నాయక్ అప్రూవర్ గా మారే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు సునీల్ నాయక్ అప్రూవర్ గా మారినా, మారకున్నా సునీల్ నాయక్ తన పరిధిమీరి వ్యవహరించారన్నది నిర్ద్వంద్వంగా తేలిపోయిందన్న డీవీ శ్రీనివాసరావు  గుంటూరు సిఐడి కార్యాలయంలో రఘురామకృష్ణ రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ నాయక్ నాలుగు సార్లు లోపలికి వెళ్లి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెప్పడాన్ని ఉటంకించారు. అసలు రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో అప్పట్లో పోలీసుల తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చిందని డీవీ శ్రీనివాసరావు అన్నారు.  ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు తెలుగువన్ న్యస్ చానెల్ లో ఈ దిగువ ఇచ్చిన లింక్ లో వీక్షించండి.    
2015లో మొద‌లైన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజ‌కీయాల‌నే మ‌లుపు తిప్పిందంటే  అతిశ‌యోక్తి కాదేమో. ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మొద‌లైన ఈ వివాదంలో కీల‌కంగా ఉన్న ఇద్ద‌రు నేత‌ల‌కు గొప్ప ప‌ద‌వుల‌ను కట్టబెట్టింది. ఇది నిజంగా ఒక విచిత్ర‌ రాజ‌కీయ ప‌రిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక వివరాల్లోకి అంటే.. 2015 కి వెళ్తే.. నాడు  తెలంగాణ ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల సమయంలో  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్  స‌న్ కు రూ. 50 ల‌క్ష‌లు ఇస్తూ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి  చిక్కారు. ఆ ఎన్నిక‌ల్లోతెలుగుదేశం అభ్యర్థిగా  నిలిచింది మ‌రెవ‌రో కాదు..  ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో  రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. అప్పట్లో స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ ఉన్న  దృశ్యాలు, ఆడియో టేపులు.. బ్రీఫ్డ్ మీ వంటి పోన్ సంభాషణలు    పెను ప్ర‌కంప‌న‌లు పుట్టించాయి. ఈ ప్ర‌కంప‌న‌లు ఎంత‌  మేలు చేశాయంటే.. రేవంత్ రెడ్డి ఆ కేసు విష‌యంలో అరెస్టు కాగా.. అది ఆయ‌న‌లో ఎలాగైనా స‌రే కేసీఆర్ పీచ‌మ‌ణ‌చాల‌న్న కృత‌నిశ్చ‌యం వచ్చేలా చేసింది.  దానికి తోడు ఆయ‌న త‌న కుమార్తె వివాహ స‌మ‌యంలో ఈ అరెస్టు కావ‌డంతో ఆ క‌సి రెట్టింపు అయ్యింది.  కేసీఆర్ నీ అంతు నా చేతుల ద్వారానే జ‌రుగుతుంది చూసుకో! అంటూ ఆయ‌న జైలు నుంచి విడుద‌లైన టైంలో చేసిన ప్ర‌సంగాలు, పిడికిలి బిగించి చేసిన‌ సంజ్ఞ‌లు తెలంగాణ  రాజ‌కీయాల్లోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచాయి.  ఆ త‌ర్వాత కాలంలో.. ఆ క‌సీ క్రోధ‌మే రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి  ఎంపీగా, ఆ త‌ర్వాత  సీఎంగా అవ్వడానికి దారి తీసింది.   ఎవ‌రిని ఎమ్మెల్సీ  చేయాల‌ని ఆనాడు రేవంత్  భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా  క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు. ఈ కేసు రేవంత్, వేం  న‌రేంద‌ర్ రెడ్డి.. ఇద్ద‌రినీ ఒక‌రికొక‌రు న‌మ్మక‌మైన స్నేహితులుగా మార్చేసింది. ఇరువురూ త‌మ క‌ష్ట‌న‌ష్టాల్లో పాల్పంచుకున్నారు. ఒక‌రి శ్రేయ‌స్సే మ‌రొక‌రిగా భావించ‌చారు. ఇప్పుడు చూస్తే వారి మ‌ధ్య ఆ గాఢానుబంధం.. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఒక ప్ర‌త్యేక స్నేహ అధ్యాయాన్ని లిఖించింది.  దీంతో పాటు ఈ కేసు ద్వారా జ‌రిగిన మ‌రో  విషయమేంటంటే.. ఏమిటంటే చంద్ర‌బాబు హైద‌రాబాద్  రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉండ‌టానికి హ‌క్కున్నా దాన్ని  వ‌దులుకుని  అమ‌రావ‌తి వెళ్లిపోయారు. అక్క‌డే ఉంటూ ప్ర‌జ‌ల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా మ‌సులుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.  ఇక్కడ మోర‌ల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే.. చెడు జ‌రిగింద‌ని.. ఇక అక్క‌డితో అయిపోయింద‌ని   భావించ‌కూడ‌దు. ఒక చెడు  మ‌రో మంచికే  అని భావించి  ముంద‌డుగు వేయాలి. 
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: మెన్షన్ హౌస్ మల్లేష్ న‌టీన‌టులు: శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్, సాయి ప్రసన్న  తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: అమ్మముత్తు. కే  ఎడిటింగ్: గారీ బి హెచ్  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి  నిర్మాత‌:రాజేష్ కుమార్   రిలీజ్ :మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్  రచన,దర్శకత్వం: బాల సతీష్  రిలీజ్ డేట్ : మార్చి 6 , 2026  సెల్యులాయిడ్ పై ఈ రోజు విభిన్నమైన టైటిల్ తో తెరకెక్కిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' ప్రత్యక్షమయ్యింది. ప్రచార చిత్రాలతో క్రేజ్ ఏర్పడటం, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రిలీజ్ చేయడంతో మూవీ లవర్స్, ప్రేక్షకుల కళ్ళు మెన్షన్ హౌస్ పై పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ తెలంగాణలోని యాదగిరి గుట్ట పరిసర ప్రాంతానికి చెందిన మల్లేష్( శ్రీనాధ్) చిన్నప్పట్నుంచి ఆల్కహాల్ తాగుతూ పెరిగి పెద్దవుతాడు. ఉదయాన్నే పరగడుపున మందు తాగందే బ్రెష్ కూడా చేయని స్వభావం. అలా అని చెడ్డవాడేం కాదు. మంచోడే. కానీ ఆవేశపరుడు. తన ఊరి పటేల్(రాజేష్ ) కి మల్లేష్ కి గొడవ. ఒకరంటే ఒకరికి అసలు పడదు. మల్లేష్ కి జ్యోతి (గాయత్రి రమణ) తో పెళ్లి జరుగుతుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ ఆ ఇద్దరి మధ్య 'కార్యం' మాత్రం జరగదు. ఆ ఇద్దరి మధ్య 'కార్యం' జరగకపోవడానికి కారణం ఏంటి? చివరకి జరిగిందా లేదా! మల్లేష్,పటేల్ కి మధ్య గొడవ ఎందుకు? పటేల్ భార్య పద్మ ( కామాక్షి భాస్కర్ల) పోషించిన క్యారక్టర్ ఏంటి? వంటి పలు ప్రశ్నల సమూహారమే మెన్షన్ హౌస్ మల్లేష్ ఎనాలసిస్  ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తెలంగాణ పల్లె వాతావరణం, మాండలికం మెరిసింది. సింపుల్ కథ అయినా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో  బాగానే నడిపించారు. నడిపించారు అని ఎందుకు అంటున్నామంటే, కథనం విషయంలో ముందు కెళ్ళి, మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కానీ చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ మెంట్ పక్కా. . ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మొదటి పావుగంట రొటీన్ గానే ఉంటుంది. సీన్స్ కూడా చాలా సినిమాల్లో వచ్చినవే. కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ తో కథలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. మల్లేష్, జ్యోతి పెళ్లి చూపుల సీన్ తో పాటు జ్యోతి క్యారక్టర్ తో వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. పటేల్, మల్లేష్ గొడవల సీన్ రొటీన్. మల్లేష్ అతని తల్లి మధ్య వచ్చిన సీన్స్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మల్లేష్, జ్యోతి  కలవడానికి స్నేహితులు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. కానీ ఈ విషయంలో మరింత డీప్ గా వెళ్ళాలి. కానీ వెళ్ళలేదు. మల్లేష్ తల్లిని చంపడం కథని సాగ తియ్యడానికే చేసినట్టుగా ఉంది. మల్లేష్ తండ్రి రెండు ఫ్లాష్ బ్యాక్ లు నవ్వులు పూయిస్తాయి. మల్లేష్, జ్యోతి బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కింట్లోని ఓల్డ్ మాన్ ఓల్డ్ సాంగ్స్ ని వింటుండే ఎపిసోడ్ బాగా పేలింది. పోలీస్ స్టేషన్ లోని  పద్మ సీన్ కూడా అంతే.  ఒక లెవల్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి సినిమా చివర దాకా ఆమె క్యారక్టర్ ని అదే టెంపోతో హైలెట్ గా చేసి, మల్లేష్, జ్యోతి కార్యానికి కావాల్సిన చిట్కాలని, తాను చేయడంతో పాటు తన భర్త పటేల్ తో చేసి ఉంటే సినిమా హిట్ స్థాయి పెరిగేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా మల్లేష్, జ్యోతి మధ్య ఇన్నాళ్లు కార్యం కాకపోవడానికి చివరలో కార్యం అవ్వడానికి గల బలమైన కారణాన్ని చెప్పాల్సింది. నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు  మల్లేష్ గా శ్రీనాధ్ పెర్ఫార్మ్ పెద్ద హీరో స్థాయిలో చాలా మెచ్యూర్డ్ గా ఉంది. మంచి అవకాశాలు వస్తే  తెలుగు చిత్రసీమలో తనదైన హవాని కొనసాగించడం పక్కా. హీరోయిన్ గా చేసిన గాయత్రి రమణ కూడా మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా తన క్యారక్టర్ పరిధి మేరకు చాలా ఈజీగా చేసింది. కామాక్షి భాస్కర్ల కి ఎక్కువ స్కోప్ లేకపోయినా, కనపడినంత సేపు అద్భుతమైన పెర్ ఫార్మ్ ప్రదర్శించి సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. మురళిధర్ గౌడ్ మరోసారి తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. రాజ్ కుమార్  కసిరెడ్డి పెర్ఫార్మ్ బాగున్నా రొటీన్ యాక్షన్ లాగా ఉంది. పటేల్ గా చేసిన రాజేష్ ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం. అంతలా సెటిల్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన వారు కూడా పర్లేదు. బాల సతీష్ దర్శకుడిగా సక్సెస్ అయినా, రచయితగా మాత్రం తడడ్డాడు. కథ టెంపోకి తగట్టుగా సీన్స్ రాలేదు. సురేష్ బొబ్బిలి తన బ్యాక్ గ్రౌడ్ స్కోర్, సాంగ్స్ తో సరికొత్త జీవాన్ని పోసాడు. ఫొటోగ్రఫీ  సూపర్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం వల్ల  నిర్మాణ విలువల్లో భారీ తనం లేకపోయినా బాగున్నాయని అనిపిస్తాయి. టోటల్ గా  మెన్షన్ హౌస్ మల్లేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటీనటుల పెర్ ఫార్మెన్స్, డైరెక్షన్ బాగుంది.  కథ, కథనం సో సో..  బలాలు  1 .మల్లేష్, జ్యోతి క్యారెక్టర్స్ డిజైన్  2 . పటేల్, మల్లేష్ మధ్య వచ్చిన సీన్స్  3 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్   4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  బలహీనతలు  1 .కథనంలో పట్టు లేకపోవడం  2 .ఫస్ట్ హాఫ్   3 . ఎంటర్ టైన్మెంట్  4 .సాగతీత సీన్స్  రేటింగ్ 2 .5 /5                                                                                                            అరుణాచలం 
తెలుగు సాహిత్యం, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులు బాపు, రమణ స్మారకంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8, 2026న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న హోటల్ దస్పల్లాలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దివ్య వెలుగు క్రియేషన్స్ దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.  ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సాహిత్యం, సినిమా రంగాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొని బాపు, రమణల సృజనాత్మక వారసత్వాన్ని స్మరించనున్నారు. వారి కళా సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వారిలో నటుడు రాజేంద్ర ప్రసాద్, దిల్ రాజు, బ్రహ్మానందం, శ్రీకాంత్, ఆది సాయికుమార్, సాయిధరమ్ తేజ్, నరేష్, రఘుబాబు, హర్షవర్ధన్ తదితరులు పాల్గొననున్నారు.  ఈ కార్యక్రమంలో విశ్వమహిళా బాపు బొమ్మ పురస్కారాలు అందజేయనున్నారు. అందులో భాగంగా మెగా విశ్వమహిళ బాపు బొమ్మ 2026 పురస్కారం మెగాస్టార్ చిరంజీవి మాతమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవికి అందజేయనున్నారు. విశ్వ మహిళ బాపు బొమ్మ 2026 పురస్కారం అందుకుంటున్న వారిలో టీవీ యాంకర్లు నాగ భార్గవి, స్వప్న, కష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, సీనియర్ నటి విజయశాంతి, బీజేపీ లీడర్ మాధవీలత, డాక్టర్ జి.వి.వెన్నెల, సింగర్ సమీరా భరద్వాజ, ఫ్యాషన్ డిజైనర్ రేఖారాణి, శ్రీమతి మట్టాడి ఆశాలత, మందుల మంగమ్మ తదితరులు ఉన్నారు. 
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో  తెలుగు, తమిళ భాషల్లో  రూపొందుతున్న  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. (Carmeni Selvam) లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో  గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ  తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో  ‘కార్మేని సెల్వం’ సినిమాను  భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని  పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు.  ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది. ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు.  
కుటుంబం అంటే కేవలం రక్త సంబంధాలు మాత్రమే కాదు, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటం. ముఖ్యంగా ఈ రోజుల్లో అత్తాకోడళ్ల సంబంధం అంటే గొడవలు, ఆధిపత్య పోరాటాలే గుర్తుకు వస్తాయి. కానీ, తప్పు చేసిన కొడుకును ఎదిరించి, అన్యాయానికి గురైన కోడలికి అండగా నిలిచిన ఒక అత్త కథ సమాజానికి ఒక కొత్త పాఠం నేర్పుతుంది. భావోద్వేగాలతో నిండిన ఈ కథనం ‘శ్రీవారి ప్రియురాలు’ చిత్రంలోనిది. వినోద్‌కుమార్, ఆమని, ప్రియా రామన్, శారద, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు.  సమాజంలో ఇప్పటికీ పరువు పేరుతో ఆడపిల్లల ప్రాణాలను తీస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే కడుపులోనే చంపేసేవారు కొందరైతే, పెళ్లయ్యాక భర్త వేధింపుల వల్ల ప్రాణాలు కోల్పోయేవారు మరికొందరు. ఒకవేళ భర్త అన్యాయం చేస్తే, పుట్టింటికి వస్తే పరువు పోతుందని భావించే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో, ‘నీలాంటి ఆడది బతికున్నా ఒకటే సచ్చినా ఒకటే’ అని కన్నకూతురిని అనడం అత్యంత బాధాకరం. కానీ, ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. సాధారణంగా కొడుకు ఏం చేసినా వెనకేసుకొచ్చే తల్లులు ఉంటారు. కానీ, ఇక్కడ ఒక తల్లి కొడుకుని వ్యతిరేకించి కోడల్ని సపోర్ట్ చేస్తుంది. తన కోడలు ‘బంగారం’ అనీ, తప్పంతా తన కొడుకుదేనని ధైర్యంగా చెబుతుంది. కిరోసిన్ పోసి కోడళ్లను తగలబెట్టే అత్తలు ఉన్న ఈ దేశంలో, కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోరాడుతున్న ఈ అత్తని నిజంగా అభినందించాలి. తన కొడుకు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి, కోడలి భవిష్యత్తు కోసం ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తుంది. మరోవైపు, ఆ కొడుకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక బాధలు అనుభవిస్తుంటాడు. తనను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ, తన కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రియను భార్యగా గౌరవించలేకపోతున్నాననే వేదన అతన్ని వెంటాడుతుంటాయి. తన తండ్రికి గుండెపోటు రావడానికి తానే కారణమయ్యానని, సమాజం తనను వెక్కిరిస్తుందని అతను పడే ఆవేదన వర్ణనాతీతం. వివాహ బంధంలో ఒకరి పట్ల మరొకరికి ఉండాల్సింది ఆస్తిపాస్తులు కాదు, కేవలం ప్రేమ, నమ్మకం మాత్రమే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది . గతాన్ని తలచుకుంటూ బాధపడటం కంటే, ధైర్యంగా భవిష్యత్తు వైపు అడుగులు వేయడమే సరైన మార్గం. అందుకే వేణు మరియు ప్రియ అమెరికా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. సమాజం ఏమనుకున్నా, అందరి ముందు ధైర్యంగా పెళ్లి చేసుకొని వెళ్లడమే కరెక్ట్ అని పెద్దలు సలహా ఇస్తారు. జీవితంలో తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పును దిద్దుకొని బాధితులకు న్యాయం చేయడమే గొప్పతనం అని చెప్పే ఈ సందేశాత్మక వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి అర్థవంతమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
అమాయకత్వం, భక్తి, మరియు హాస్యం మేళవించిన ఒక అద్భుతమైన తెలుగు సినిమా సన్నివేశం గురించి మనం మాట్లాడుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సరదాలు, ఆట పట్టించడాలు మనందరి జీవితాల్లోనూ ఉండేవే. కానీ, ఒక భర్త తన భార్యలో దేవతను చూస్తూ మురిసిపోతుంటే, ఆ కుటుంబం ఎంత అలజడికి గురవుతుంది? దాని వల్ల వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ భర్త ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు అనేది సినిమాలోని ఇతివత్తం. సంగీతం, నత్యం ప్రధానాంశాలుగా ఎన్నో కళాఖండాలను తెరకెక్కించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సప్తపది’ చిత్రంలోని సన్నివేశాలతో కూడిన వీడియో ఇది. జె.వి.సోమయాజులు, సబిత, రవికాంత్, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సష్టించింది.  గౌరీనాథం ఒక వింత పరిస్థితిలో ఉంటాడు. పెళ్లి తర్వాత అతను అత్తవారి ఇంటికి వెళ్ళినప్పటికీ, అక్కడ ఉండలేక తిరిగి వచ్చేస్తాడు. దానికి అతను చెప్పిన కారణం విని కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు. ‘కన్ను మూసినా తెరిచినా అమ్మవారే కనిపిస్తుంది’ అంటూ తన అనుభవాన్ని చెబుతాడు. అతని భక్తి ఎంత గాఢమైనదంటే, ప్రతి చోటా అతనికి ‘మహిషాసుర మర్దిని’ స్తోత్రమే వినిపిస్తుంది, ఆ దేవీ రూపమే కనిపిస్తుంది గౌరీనాథం గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, అతన్ని ‘కూపస్థ మండూకం’ (బావిలో కప్ప)తో పోలుస్తారు. గుడి నాలుగు గోడల మధ్యే ప్రపంచం అనుకునే అతనికి బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదని, కనీసం ఒక చొక్కా వేసుకోవడం కూడా ఎరుగని అంతటి ‘మడి’ మనిషి అని ఆటపట్టిస్తారు. పరాయి ఆడదానితో మాట్లాడటం కూడా తెలియని అతని అమాయకత్వం చూస్తుంటే ప్రేక్షకులకు నవ్వుతో పాటు ఒక రకమైన జాలి కూడా కలుగుతుంది గుడిలో దేవుడికి కూడా బాహ్య ప్రపంచం తెలియదు కాబట్టి, ఏడాదికి ఒకసారి ‘ఊరేగింపు’ అనే పేరుతో బయటకు తీసుకువచ్చి ఊరు చూపిస్తారని, అలాగే గౌరీనాథాన్ని కూడా అతని భార్యతో కలిసి హనీమూన్‌కు పంపించాలని ఇంట్లో పెద్దలు నిర్ణయిస్తారు. అప్పుడైనా అతను బాహ్య ప్రపంచాన్ని చూస్తాడని వారి ఆశ. మరోవైపు, ఇంట్లోని ఆడవాళ్ళు అతని భార్యను ‘సత్యభామ’ అని సంబోధిస్తూ, అమాయకుడైన గౌరీనాథం మీద పెత్తనం చలాయించవద్దని, జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇస్తారు ఈ కథలో కేవలం హాస్యం మాత్రమే కాదు, భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి పెద్దాయన తన మనవడి కోసం (వారసుడి కోసం) ఎంతగానో ఎదురుచూస్తున్నారని, ‘ఎప్పుడు మనవడిని ఇస్తావు?’ అని అడిగే సన్నివేశం మన ఇళ్ళలోని పెద్దల ఆరాటాన్ని గుర్తు చేస్తుంది. తెలుగు చలనచిత్రాల్లోని ఇటువంటి క్లాసిక్ సన్నివేశాలు మన సంస్కృతిని, కుటుంబ వ్యవస్థలోని అందమైన కోణాలను ప్రతిబింబిస్తాయి. గౌరీనాథం వంటి పాత్రలు మన చుట్టూ ఉండే అమాయకపు వ్యక్తులను గుర్తు చేస్తూ, మన ముఖంపై చిరునవ్వును పూయిస్తాయి. ఎంతో ఆసక్తిరంగా సాగే ఈ వీడియోను మీకోసం అందిస్తున్నాం. వీక్షించండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
'NBK 111'లో విలన్ గా టాలీవుడ్ హీరో బాలయ్యను ఢీ కొట్టబోతున్న యంగ్ స్టార్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందుతోంది. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 'వీరసింహారెడ్డి' తరువాత బాలకృష్ణ-గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు.. బాలయ్య అండర్ వరల్డ్ డాన్ గా కనిపించనున్నాడనే వార్తల నేపథ్యంలో.. 'NBK 111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. 'NBK 111'లో విలన్ గా మంచు మనోజ్(Manchu Manoj) నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ముందు విలన్ గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలి. అలాంటి సాహసం చేయడానికి మనోజ్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన ముద్ర వేసిన మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గానూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా 'మిరాయ్'లో స్టైలిష్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు 'NBK 111'లోనూ స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని వినికిడి. కాగా, బాలకృష్ణ-మనోజ్ కలిసి నటించడం అనేది ఇది మొదటిసారి కాదు. 14 ఏళ్ళ క్రితం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' అనే సినిమా చేశారు. అందులో మనోజ్ హీరోగా నటించగా, అతిథి పాత్రలో బాలయ్య కనువిందు చేశారు. Also Read: మృత్యుంజయ్ మూవీ రివ్యూ  
నటీనటులు: శివాజీ, లయ, రోషన్, ప్రిన్స్, ధన్‌రాజ్, ఇమ్మానుయేల్, రఘు కారుమంచి, ప్రత్యేక పాటలో బండ్ల గణేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: రిత్విక్ రెడ్డి ఎడిటింగ్: బాలు మనోజ్ డి. సంగీతం: రంజిన్ రాజ్ నిర్మాత: శివాజీ బ్యానర్: శ్రీశివాజీ ప్రొడక్షన్స్ రచన, దర్శకత్వం: సుధీర్ శ్రీరామ్ విడుదల తేదీ: 06 మార్చి 2026 సినిమా నిడివి: 146.53 నిమిషాలు ఇటీవలికాలంలో నటుడుగా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో శివాజీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈటీవి విన్ సమర్పించింది. శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక’ వెబ్ సిరీస్‌లో ఈ టైటిల్ వినిపిస్తుంది. అప్పటి నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటూ చాలా స్కిట్స్‌లో, రీల్స్‌లో మనం చూస్తున్నాం. ఇప్ప్పుడు అదే టైటిల్‌తో శివాజీ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాను ఏ జోనర్‌లో చేశారు, ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది అనే విషయాలు తెలుసుకుందాం. కథ: శ్రీరామ్(శివాజీ) గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు. నిజాయితీకి మారుపేరుగా ఉంటూ లంచం అనే మాటను కూడా దగ్గరకు రానివ్వడు. అయితే అతని భార్య డిఫరెంట్ మెంటాలిటీతో, క్రిమినల్ ఆలోచనలతో ఉంటుంది. కొడుకు మిట్టు(రోషన్) హైపర్ యాక్టివ్. ఎప్ప్పుడు ఏ పనిచేసి తండ్రికి తలనొప్పి తెస్తాడో తెలీదు. ఒకరోజు మినిస్టర్ వస్తున్నాడన్న కారణంగా ఒక రోడ్డులో వెహికిల్స్‌ని  ఆపేస్తాడు ఎస్.ఐ. అశోక్(ప్రిన్స్). ఆ తర్వాత మినిస్టర్ ఆ రూట్‌లో రావడం లేదని తెలిసినా వెహికిల్స్‌ని వదలడు.  ఈ విషయంలో శ్రీరామ్, అశోక్ గొడవ పడతారు. కట్ చేస్తే.. ఒకరోజు అనుకోకుండా శ్రీరామ్ లేని సమయంలో అతని ఇంటికి వస్తాడు అశోక్. ఉమనైజర్ అయిన ఆ ఎస్.ఐ. శ్రీరామ్ భార్యపై కన్నేస్తాడు. ఆరోజు దీపావళి కావడంతో ఒక డమ్మీ గన్‌తో మిట్టు ఆడుకుంటూ ఇంటికి వస్తాడు. అశోక్ దగ్గర ఒరిజినల్ గన్ చూసి ఒకసారి చూసిస్తాను అంటాడు. అశోక్ అతనికి గన్ ఇస్తాడు. టెస్ట్ చేస్తానంటూ గన్‌తో అశోక్‌ను కాలుస్తాడు. స్పాట్‌లోనే అశోక్ చనిపోతాడు.  శ్రీరామ్ వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. శవాన్ని వదిలించుకోవడానికి కారులో బయల్దేరతారు. ఆ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ.  విశ్లేషణ: టైటిల్ చూస్తే ఇదేదో కామెడీ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే సినిమా ప్రారంభంలో కొన్ని కామెడీ సీన్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ కామెడీలో కూడా కొత్తదనం ఏమీ లేదు. ఈమధ్యకాలంలో మనం చూస్తున్న కామెడీలాగే అనిపిస్తుంది. మొదటి అరగంట అలాంటి కామెడీ సీన్స్‌తో టైమ్ పాస్ చేశాడు డైరెక్టర్. ఎస్.ఐ. అశోక్‌ను శ్రీరామ్ కొడుకు కాల్చడంతో అసలు కథ మొదలవుతుంది.  ఇందులో రెండు కథల్ని ఇన్‌వాల్వ్ చేసి వాటిని ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నం చేశారు. ఒకటి శ్రీరామ్ కథ అయితే, మరొకటి మినిస్టర్‌కి సంబంధించిన కథ. ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు రెండు కథలు నడుస్తుంటాయి. ఒక దశలో ఆ రెండింటినీ కలుపుతూ ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు కథ మొదలైన దగ్గర నుంచి ఎవరూ ఊహించని విధంగా రకరకాల ట్విస్టులు ఉంటాయి. ఆడియన్స్ వాటిని ఎంజాయ్ చేసే విధంగానే ఉన్నాయి.  గతంలో ఈ తరహా సినిమా దశ్యం సిరీస్‌గా వచ్చింది. కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులకు ఆ సినిమా గుర్తుకు వస్తుంది. కొన్ని సీన్స్‌ని గ్రిప్పింగ్‌గా తీసినప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం లెంగ్తీగా, పేలవంగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే సెకండాఫ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా బాగుంది అనిపిస్తుంది.  నటీనటులు: శ్రీరామ్‌గా శివాజీ, అతని భార్యగా లయ, మిట్టుగా రోహన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. భార్య చేసే విన్యాసాలకు శివాజీ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. ఇక హైపర్ యాక్టివ్‌గా ఉండే మిట్టు క్యారెక్టర్‌ను రోహన్ ఎప్పటిలాగే బాగా చేశాడు. మిగతా పాత్రల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎస్.ఐ. క్యారెక్టర్‌లో ప్రిన్స్ మంచి నటన ప్రదర్శించాడు. అతనికి విలన్‌గా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. మిగతా పాత్రల్లో ధనరాజ్, కాదంబరి కిరణ్, అప్ప్పుడప్ప్పుడు కనిపించి నవ్వించే ప్రయత్నం చేసిన ఇమ్మానుయేల్ ఫర్వాలేదు అనిపించారు. సినిమా ప్రారంభంలో రఘు కారుమంచి కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు.  సాంకేతిక నిపుణులు:  క్రైమ్ కామెడీగా రూపొందిన ఇలాంటి సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కథ, కథనాలకు తగ్గట్టుగానే రిత్విక్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. థ్రిల్ చేసే కొన్ని కెమెరా యాంగిల్స్ కూడా రిత్విక్ ట్రై చేశాడు. బాలు మనోజ్ ఎడిటింగ్ బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఉంది. అయితే డైరెక్టర్ సూచన మేరకు వాటిని అలాగే వదిలేసి ఉండొచ్చు. వాటిని ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత స్పీడ్ అయ్యేది.  ఇక సంగీతం విషయానికి వస్తే.. సినిమాలో పాటలు లేవు. ఉన్న ఒకే ఒక్క పాటను సినిమా ఎండింగ్‌లో వాడారు. ఈ పాటలో బండ్ల గణేశ్ నటించడం విశేషం. ‘పాయా పాయా’ అంటూ తెలుగు, ఉర్దూ భాషల్లో సాగే ఈ పాటకు భోలే షావలి సంగీతం అందించడంతోపాటు పాడారు. రంజిన్ రాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా బాగా చేశాడు.  డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ గురించి చెప్పాలంటే.. కథను, కథలోని ట్విస్టుల్ని, సస్పెన్స్‌ని చివరి వరకు మెయిన్‌టెయిన్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్ని అసలు కథలోకి తీసుకెళ్లే ముందు కొన్ని పేలవమైన కామెడీ సీన్స్, ల్యాగ్ అనిపించే సీన్స్ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టాయి. ఓవరాల్‌గా డైరెక్టర్‌కి మంచి మార్కులు పడతాయి.  ప్లస్ పాయింట్స్: ట్విస్టులు సస్పెన్స్ నటీనటుల పెర్‌ఫార్మెన్స్ స్క్రీన్‌ప్లే మైనస్ పాయింట్స్: ఫస్ట్‌హాఫ్‌లో స్లో నేరేషన్ కొన్ని పేలవమైన సీన్స్ ఫైనల్‌గా..  టైటిల్ కామెడీగా అనిపించినా.. ఊహించని ట్విస్టులు, షాక్‌కి గురి చేసే సస్పెన్స్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. క్రైమ్, సస్పెన్స్ మూవీస్‌ని ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా నచ్చుతుంది.  రేటింగ్: 2.75/5 - జి.హరా
-వీడియోలో ఏముంది -ఈ రోజు జాన్వీ బర్త్ డే కదా  -ప్రెజెంట్ తిరుపతిలో  చాలా సినిమాల్లో విలన్స్ నోటి నుంచి ఆవేశంగా బళ్ళు తియ్యండిరా అనే మాట తరచుగా వస్తుంటుంది. మరి వాళ్ళు ఆ ఆవేశంతో వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్తారో లేక భయంతో మధ్యలోనే డ్రాప్ అవుతారో తెలియదు గాని, ఇప్పుడు పెద్ది(Peddi)నుంచి మేకర్స్  రిలీజ్ చేసిన వీడియో దెబ్బకి ఇప్పటి నుంచే బళ్ళు రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంత మాస్ గా పెద్ది గురించి ఉదహరించడానికి  కారణం, మేకర్స్  ఎక్స్ క్లూజివ్ గా  రిలీజ్ చేసిన వీడియో.  పూర్తి మాటర్ ఏంటో చూద్దాం. ఈ రోజు జాన్వీకపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ మేకర్స్ సుమారు 28 సెకన్ల వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియో ద్వారా 'పెద్ది' లో అచ్చాయమ్మా గా జాన్వీ సృషించబోయే ప్రభంజనం ఏ మేర ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. వేష ధారణ, మాట తీరుతో ఉత్తరాంధ్ర అమ్మాయితో సరదాకైనా సరే  పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా పెద్ది ద్వారా చెప్పబోతోంది. టోటల్ గా పెద్దికి తగ్గ జోడి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పైన మనం చెప్పుకున్న బళ్ళు తియ్యండిరా పెద్ది కి వెళ్ళాలి  అనే కామెంట్స్  అభిమానుల దగ్గర నుంచి వినపడుతున్నాయి. also read: Anasuya: అనసూయ మళ్ళీ వచ్చేసింది.. ఆ పోస్ట్ ఖచ్చితంగా వీళ్ళని ఉద్దేశించి చేసిందే  ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్(Ram Charan)కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ 'రై రై రా రా' సాంగ్ ఫస్ట్ సింగిల్ చికిరి ని క్రాస్ చేస్తూ మురిసిపోవడం ఒకరి సొత్తు కాదని నిరూపించింది. మరి మిగతా సాంగ్స్ రాకతో 'రై రై రా రా' కి కూడా ఆ పరిస్థితి వస్తుందేమో చూడాలి. జాన్వీ కపూర్ ప్రస్తుతం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఉంది. తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్వస్థలం తిరుపతి అనే విషయం తెలిసిందే.    
  -వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్  -ఎందుకు ఎంట్రీ ఇచ్చింది  -సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది. 'అ' అంటే 'అనసూయ'(Anasuya) అనే రేంజ్ కి ఎదిగింది ప్రముఖ నటి 'అనసూయ'. మరి యాంకర్ గా స్మాల్ స్క్రీన్ షో నుంచి సోలో హీరోయిన్ రేంజ్ కి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. పాన్ ఇండియా డైరెక్టర్స్ సైతం తన కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసే చరిష్మా కూడా తన సొంతం. అందుకు ఆమె నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే ఉదాహరణ. సోషల్ మీడియాలోను తనదైన శైలిలో దూసుకుపోతు విమర్శకులకి, ట్రోలర్స్ కి సరైన సమాధానం ఇస్తుంటుంది. అసలు అనసూయ పేరు చెప్పకుండా ఆమె పోస్ట్ లని చూపిస్తే చాలు ఇది అనసూయ పోస్ట్ కదా అంటారు. సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ మోడ్ లో ఉంటుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఒక  పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ కే వైరల్ ని నేర్పిస్తుంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. రీసెంట్ గా 'హోలీ'(Holi) ఫెస్టివల్ జరిగిన విషయం తెలిసిందే. సదరు హోలీ వేడుకలలో అనసూయ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మీడియాతో ముచ్చటించింది. ఆ టైంలో కొంత మంది యువకులు అనసూయని ఆంటీ అని పిలిచారు. ఆ తతంగం మొత్తానికి   సంబంధించిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. దీంతో వీడియోకి రకరకాల కామెంట్స్  వస్తున్నాయి. కొంత ముందైతే ఫన్నీ కామెంట్స్ చేయడంతో పాటు రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ అనసూయ ని చాలా బాధకి గురి చేస్తున్నట్టుగా ఉన్నాయేమో, సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. సదరు పోస్ట్ లో 'కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేకుండా ఇతరుల బాధలో ఆనందాన్ని వెతికే వారిని సమాజం నిలదీసే రోజు రావాలి. ఏజ్ ని బట్టి హేళన చేయడం, ఆడ వారి పట్ల వివక్షణ చూపించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించకూడదు. also read: s saraswathi: ఎస్. సరస్వతి హైలెట్స్ ఇవే.. వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇస్తున్నారు నాకెందుకులే అని వదిలేస్తే అలాంటి విషయాలు సాధారణమవుతాయి. అయినా నేను సాధించిన ప్రయాణం నాకెంతో గర్వకారణం. ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడే ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. లైఫ్ లో పైకి వచ్చే వారిని విమర్శించడానికి మీరెవరు అని అనసూయ తన పోస్ట్ లో పేర్కొంది.  
  -ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఎస్ సరస్వతి  -టాక్ పరిస్థితి ఏంటి! -ప్రేక్షకులు చెప్తున్న హైలెట్స్ నిజమేనా! నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్ ని చంపితే నో బెయిల్. మరి ఆడపిల్లని రేప్ చేసినా, చంపినా బెయిల్ ఇస్తున్నారు. ఇలా ఎందుకు అనే పాయింట్ ని రేజ్ చేస్తు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఎస్. సరస్వతి(S. Saraswathi). వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)టైటిల్ రోల్ పోషించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరించింది. ప్రకాష్ రాజ్(Prakash Raj),ప్రియమణి (Priyamani),రాధికా శరత్ కుమార్, నాజర్, రంగం ఫేమ్ జీవా, ఓజి కిషోర్ ముఖ్యమైన క్యారెక్టర్స్ పోషించారు. మూవీ చూసిన ప్రేక్షకుల దగ్గర్నుంచి అయితే పర్వాలేదనే టాక్ వినపడుతుంది. ప్రధానంగా కొన్ని అంశాలు బాగా అలరించాయని, మూవీకి అవే హైలెట్స్ అని చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.  1 .కథ 2 .ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్  3 . కోర్టు డ్రామా  4 . ఇంటర్వెల్ ఎపిసోడ్  5 .సెకండ్ హాఫ్ లో సరస్వతి చైల్డ్ ఎపిసోడ్  6 . సరస్వతి, ఆదిత్య మధ్య వచ్చిన ట్విస్ట్   7 . ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్  ఈ ఏడూ అంశాలే సరస్వతికి ప్రధాన హైలెట్ గా నిలిచాయని ప్రేక్షకులు చెప్తున్నారు.  రివ్యూస్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి. మెజారిటీ రివ్యూస్ ని ఒకసారి చూసుకుంటే 'ఇలాంటి కథలు సిల్వర్ స్క్రీన్ పై చాలానే వచ్చాయి. కథనం విషయంలో మరింత శ్రద్ద వహించి  క్యూరియాసిటీ కలిగించే విధంగా సన్నివేశాలని మలుచుకొని ఉండాల్సింది. దీంతో సరస్వతి మరింత బెటర్ పొజిషన్ లో ఉండేది. ప్రెజెంట్ సొసైటీ ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యని కథా వస్తువుగా ఫిక్స్ చేసుకొని వ్యక్తిగత పగ వైపు ఎక్కువగా ఫోకస్ చేయడంతో సరస్వతి  బ్లాక్ బస్టర్ ని దూరం చేసుకున్నట్లయిందని మెజారిటీ రివ్యూల అభిప్రాయం. also read: s saraswathi movie review: ఎస్. సరస్వతి మూవీ రివ్యూ     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి.  వీటిని రిలేషన్ లో రెడ్ ప్లాగ్స్ అని చెప్పవచ్చు. వీటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇలాంటివి ఉన్నప్పుడు వాటి గురించి నిర్లక్ష్యం చేయడం లేదా, పట్టించుకోకుండా ఉండటం వంటివి జరిగితే.. చాలా నష్టపోతారు.  అందుకే ఈ పరిస్థితులు ఉన్నవారు రిలేషన్లో ఉన్నవారితో ఓపెన్ గా మాట్లాడాలి.  సమస్యను పరిష్కరించుకోవాలి.  అయితే రిలేషన్ ను దెబ్బతీసే ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో తెలుసుకుంటే.. అధిక నియంత్రణ.. రిలేషన్ లో భాగస్వామి మీ ప్రతి కదలికను పర్యవేక్షిస్తే, స్నేహితులను కలవకుండా నిరోధిస్తే లేదా ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకుంటే, అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు. పదే పదే అబద్ధం చెప్పడం.. చిన్న చిన్న అబద్ధాలు కూడా సంబంధానికి పునాదిని బలహీనపరుస్తాయి. పదే పదే అబద్దాలు చెప్పడం,  అది బయటకు స్పష్టంగా కనిపిస్తున్నా తనకేమీ సంబందం లేదన్నట్టు ఉండటం రిలేషన్ ను దెబ్బతీస్తుంది. కోపంతో అవమానించడం.. వాదన సమయంలో వ్యక్తిగత దాడులు, ఆధిపత్యం చూపించడం లేదా అవమానం చేయడం వంటివి చేస్తే అది భాగస్వామి వ్యక్తిత్వం సరిగా లేదని చెబుతుంది. గ్యాస్‌లైటింగ్ మీ భాగస్వామి మీ భావాలను తప్పుగా నిరూపించడానికి ప్రయత్నించి మిమ్మల్ని నిందించినప్పుడు. ఎలాంటి సమస్య, లేదా తప్పు లేకపోయినా తప్పును క్రియేట్ చేసి నిందించాలని,  తప్పుగా నిరూపించాలని చూస్తే ఆ భాగస్వామి సరైన వారు కాదని అర్థం. నమ్మకం లేకపోవడం సంబంధంలో నమ్మకం చాలా అవసరం. ఎప్పుడూ  సందేహంగా, అనుమానంగా  ఉండటం వల్ల సంబంధం నెమ్మదిగా నాశనం అవుతుంది. భావోద్వేగ మద్దతు లేకపోవడం.. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతు ఇవ్వకపోతే, ఆ సంబంధం అసంపూర్ణంగా ఉంటుంది. భావోద్వేగ మద్దతు లోపించినప్పుడు ఆ బంధాన్ని అర్థమే ఉండదు. భవిష్యత్తు  గురించి ఆలోచన లేకపోవడం.. భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత ఈ ఆలోచన మరింత ఎక్కువగా ఉంటుంది.  కానీ చాలామందికి భవిష్యత్తు గురించి కానీ,  వర్తమానం గురించి కానీ ఎలాంటి ఆలోచన,  ఎలాంటి చింత ఉండదు.  పూర్తీగా నిర్గక్ష్యంగా ఉంటారు.  ఇలాంటి వారితో జీవితం ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు.                                       *రూపశ్రీ.
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ, మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి: పరీక్షలు మీ మేధస్సును పరీక్షించేవి మాత్రమే, మీ జీవితాన్ని శాసించేవి కావు. ఈ ఒత్తిడిని జయించి, పరీక్షల్లో అద్భుతంగా రాణించడానికి నిపుణులు చెబుతున్న సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు ఒత్తిడిని తగ్గించుకోవాలి? (Why should we?) ఒత్తిడి అనేది కేవలం మానసికమైనదే కాదు, అది మన శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి: మన మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాచారాన్ని చక్కగా "రీకలెక్షన్" (Recollection) చేయగలదు. ఆందోళనలో ఉంటే తెలిసిన విషయాలు కూడా గుర్తుకురావు. ఆరోగ్యం కోసం: విపరీతమైన స్ట్రెస్ వల్ల కొంతమంది విద్యార్థులకు జ్వరం రావడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన ఫలితాల కోసం: మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్ష రాస్తే, మీ సాధారణ పర్ఫార్మెన్స్ కంటే 10% నుండి 30% వరకు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏమి చేయకూడదు? (What NOT to do!) చాలా మంది విద్యార్థులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. అవి ఏంటంటే: అతిగా ఆశించడం: "నాకు ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ రావాలి" లేదా "470 కి 470 రావాలి" అని పరీక్షకు వెళ్లే ముందు టార్గెట్లు పెట్టుకోకండి. ఈ ఆలోచనలే మిమ్మల్ని టెన్షన్ పెడతాయి. పోలికలు వద్దు: మీ అన్నయ్యకో, పక్కింటి అబ్బాయికో వచ్చిన మార్కులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఇలాంటి ప్రెజర్ పెట్టకూడదు. మార్కులు లెక్కపెట్టడం: క్వశ్చన్ పేపర్ చూడగానే "నాకు ఇన్ని మార్కులు వస్తాయి, ఇన్ని రావు" అని లెక్కలు వేయకండి. దీనివల్ల కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. పక్కవారిని చూడటం: ఎగ్జామ్ హాల్‌ లో పక్కవాడు ఎన్ని అదనపు పేపర్లు (Additionals) తీసుకున్నాడు అనేది మీకు అనవసరం. అది చూస్తే మీ బ్రెయిన్ డైవర్ట్ అయి ఒత్తిడి పెరుగుతుంది. ఎలా సిద్ధమవ్వాలి? విజేతల సూత్రాలు (How to Prepare?) రాతపూర్వక ప్రాక్టీస్: కేవలం నోటితో చదవడం కంటే, రాస్తూ చదవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. "ఒకసారి రాయడం.. పదిసార్లు చదవడంతో సమానం". సమయ పాలన (Time Planning): ఏ సెక్షన్ కి ఎంత సమయం కేటాయించాలి? (2 మార్కుల ప్రశ్నలకు ఎంత? 10 మార్కుల ప్రశ్నలకు ఎంత?) అనేది ముందే ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో హడావిడి ఉండదు. పాజిటివ్ థింకింగ్: "నేను చదివింది బాగా రాస్తాను, తెలియని ప్రశ్నలు వస్తే ఊహించి రాస్తాను" అనే క్లియర్ పిక్చర్ తో పరీక్ష హాల్ లోకి అడుగు పెట్టండి. ఏకాగ్రత: పరీక్ష రాస్తున్న ఆ రెండున్నర గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి, కేవలం మీ పేపర్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నేను బాగా చదివాను, కానీ పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే అంతా మర్చిపోతున్నాను. ఎందుకు?  జవాబు: దీనికి ప్రధాన కారణం "ఆలోచనల ఒత్తిడి". పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో, మార్కులు ఎన్ని వస్తాయో అని అతిగా ఆలోచించడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది. ఫలితం గురించి కాకుండా, కేవలం ఆన్సర్ రాయడం మీద దృష్టి పెడితే మర్చిపోయే సమస్య ఉండదు. ప్రశ్న: పరీక్షల సమయంలో పేరెంట్స్ పాత్ర ఏమిటి?  జవాబు: పేరెంట్స్ పిల్లలకు హోమ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారిని భయపెట్టకుండా, వారిలో ధైర్యాన్ని నింపాలి. కార్పొరేట్ సంస్థలు పెట్టే ప్రెజర్ నుంచి పిల్లలను కాపాడాలి. గుర్తుంచుకోండి, పరీక్షలు మీ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రశాంతమైన మనసుతో, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే విజయం మీదే. ఆల్ ది బెస్ట్! మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య మరియు విద్యా విషయాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ ని సందర్శించండి! మీరు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలి? జ్ఞాపకశక్తిని ఎలా పెంచుకోవాలి? వంటి మరిన్ని చిట్కాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి. మీ విజయ ప్రయాణంలో మేము తోడుంటాం! (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు చూసేటప్పుడు, వారి మనసులోని మాటను గమనించకుండా తొందరపడుతుంటారు. దీనివల్ల పెళ్లి కుదరకపోవడమే కాకుండా, పిల్లల మనసుపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు, చేయకూడని పొరపాట్ల గురించి  కాకతీయ మ్యారేజ్ డైరెక్టర్ నవీనా యలమంచి గారు చెప్పిన విషయాలను ఈ Video Link లింక్ క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We?) పెళ్లి సంబంధం చూసే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, అది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఎదుటి కుటుంబం యొక్క శ్రమను, ఆశలను కూడా నీరుగారుస్తుంది. పిల్లలు సిద్ధంగా లేనప్పుడు వారిపై ఒత్తిడి తెస్తే, వారు ఎదుటి వారితో "నాకు ఇష్టం లేదు" అని చెప్పడం వల్ల రెండు కుటుంబాల మధ్య అనవసరమైన మనస్పర్థలు ఏర్పడతాయి. సరైన అవగాహన లేకుండా సంబంధాలు చూస్తే, భవిష్యత్తులో పిల్లలు మరే సంబంధాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు: బలవంతం చేయడం: పిల్లలు పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వారిని బలవంతంగా సంబంధాలు చూడమని ఫోర్స్ చేయకూడదు. ముందస్తు చర్చ లేకపోవడం: ఇంట్లో పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా బయట సంబంధాలు వెతకడం వల్ల ఫలితం ఉండదు. భయాలను విస్మరించడం: "నా ఫ్రెండ్స్ ఎవరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరు" లేదా "అపరిచిత వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది?" అనే పిల్లల భయాలను కొట్టిపారేయకండి. వారి భయాలు చాలా జెన్యూన్ అయి ఉండవచ్చు. పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు పిల్లలను పెళ్లికి సిద్ధం చేయడానికి ఈ పద్ధతులు పాటించండి: కౌన్సెలింగ్ మరియు మాటామంతి: పిల్లలు మీతో ఓపెన్ అవ్వనప్పుడు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓపికగా ప్రయత్నించండి లేదా నిపుణుల సహాయం తీసుకోండి. అవకాశం ఇవ్వండి: పిల్లలు ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, కనీసం ఒకరిద్దరిని కలిసేలా ప్రోత్సహించండి. సరైన వ్యక్తి (Right Person) తారసపడినప్పుడు వారిలోని భయాలు సహజంగానే తొలగిపోతాయి. ఇంటి గుట్టు ముఖ్యం: ముందుగా మీ ఇంట్లో చర్చలు జరిపి, పిల్లలను ఒప్పించిన తర్వాతే పబ్లిక్‌గా సంబంధాలు చూస్తున్నామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: పిల్లలు సంబంధం చూడటానికి వచ్చినప్పుడు 'ఐ యామ్ నాట్ రెడీ' అని ఎందుకు అంటారు?  జవాబు: దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వారు కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకోవచ్చు లేదా అపరిచిత వ్యక్తులతో ప్రేమను ఎలా పంచుకోవాలో తెలియక భయపడవచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కూడా వారు ఇలాంటి సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్న: పిల్లల భయాలు ఎప్పుడు తొలగిపోతాయి?  జవాబు: అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మరేదైనా సరే.. ఒక సరైన వ్యక్తిని కలిసినప్పుడు, వారితో మాటలు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందేహాలు, భయాలు క్లియర్ అవుతాయి. అంతవరకు మనం ఎన్ని చెప్పినా వారి భయం తగ్గదు. ప్రశ్న: ఒక సంబంధం తప్పిపోతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?  జవాబు: ఒకసారి చేదు అనుభవం ఎదురైతే, తర్వాత వచ్చే మంచి సంబంధాలను కూడా పిల్లలు వద్దని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో పరిస్థితిని సెట్ చేసుకున్నాకే బయట సంబంధాలు చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి భయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ విజయవంతం అవుతుంది. వారిని బలవంతం చేయడం కంటే, వారికి నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు రిలేషన్‌షిప్ సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి! 👉మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [www.youtube.com/@Naveenacolumn ] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
                           ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్‌ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?)  బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా?  జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది?  జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా?  జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!