టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా తన సత్తా చాటుతున్నారు. 'దేవర' ఘనవిజయం తర్వాత తారక్ తన తదుపరి చిత్రాలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో సంచలనం సృష్టించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ జతకట్టడం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కంటే పవర్‌ఫుల్ గా స్క్రిప్ట్ రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న రూపాల్లో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో రెండు షేడ్స్ చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ కాగా, ఎన్టీఆర్ మేకోవర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్ట్-1లో ఎన్టీఆర్ చాలా షార్ప్‌గా, లీన్ లుక్‌లో కనిపించనున్నారు. పార్ట్-2 కోసం తారక్ ‘బీస్ట్ మోడ్’లోకి మారనున్నారు. భారీ కండలు పెంచి బల్క్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ రెండు భాగాల షూటింగ్‌ను ఒకే సమయంలో సమాంతరంగా ప్లాన్ చేయడంతో నిరంతరం ఫిజిక్ మార్చుకోవడం తారక్ డెడికేషన్‌కు ఒక సవాలుగా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామా యొక్క తదుపరి షెడ్యూల్ మే 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో కథానాయికతో పాటు చిత్రంలోని ఇతర కీలక నటులు కూడా జాయిన్ కాబోతున్నారు. సినిమాలోని మేజర్ యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ సీన్లను ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.





