కవిత వర్సెస్ కేటీఆర్.. మాటల యుద్ధం మొదలైనట్లేనా?

posted on: May 2, 2026 3:44PM

బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.  

కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,

 పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.  

ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు.

అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...