కర్ణాటక కాంగ్రెస్‌లో  సంక్షోభం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో పాతిక మందికి పైగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బెంగళూరులో రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది. కాగా  బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం తేలిసిందే. ఈ నేపథ్యంలోనే  పాతిక మంది ఎమ్మెల్యేల రహస్యభేటీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలను వేడెక్కించింది. తాజా భేటీలో,   అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాలకు వెళ్లడం ప్రమోషనా, డిమోషనా అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, నితీశ్ కుమార్ సెంట్రల్ పాలిటిక్స్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే తన రాజకీయ వారసత్వాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. నితీశ్ కుమార్ చంద్రబాబు కంటే ఒక సంవత్సరం చిన్నవారని పేర్కొన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ నాయకుడని, ఎప్పుడు అధికారంలో ఉండాలో బాగా తెలిసిన నాయకుడని వ్యాఖ్యానించారు. మోదీలా ఎప్పటికీ అధికారంలో ఉండాలనే తత్వం నితీశ్‌కు లేదని తెలిపారు. నితీశ్ కుమార్ వ్యక్తిగత జీవితం చాలా సాధారణమైందని, బీహార్ పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ఎన్డీయేలో కీలక పాత్ర పోషించే నాయకుల్లో నితీశ్ కుమార్ ఒకరైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్య నేత అని అన్నారు. నితీశ్ మార్గంలోనే చంద్రబాబు ప్రయాణిస్తారా అని రవిశంకర్ ప్రశ్నించగా, టీడీపీ కార్యకర్తల్లో కూడా నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. 2024లోనే నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాలని కొంతమంది చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు లోకేశ్‌దేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో రాష్ట్రపతిగా వెళ్లవచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటిదేమైనా జరుగుతుందా అని రవిశంకర్ ప్రశ్నించారు. వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి గట్టిగా ప్రతిస్పందించే నాయకులు ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అలాగే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత రాజకీయ శక్తి కొంత మేర తగ్గిందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి చంద్రబాబు విషయంలో ఉండదని అన్నారు. చంద్రబాబుకు ‘విజన్ 2047’ లక్ష్యాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై అనేక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అమరావతిని ఆధునిక నగరంగా నిర్మించాలనే లక్ష్యం ఆయనకు ఉందన్నారు. ఆ ప్రణాళికలను భవిష్యత్తులో తన వారసుడు లోకేష్ ముందుకు తీసుకెళ్లే అవకాశముందని చర్చ జరిగింది. అలాగే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన పార్టీ బలంగా ఉందని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా చురుకుగా పనిచేస్తారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కొన్నిసార్లు పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి    
  జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.  జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో ఆవిర్భావ వేడుకలను పరిమితం  చేయాలని క్యాడర్‌కు సూచించింది.  జనసేన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన... గెలిచిన మొదటి ఏడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు . సీన్ కట్ చేస్తే.... ఏడాది తర్వాత.. అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను   రాష్ట్రస్థాయిలో  నిర్వహించడం లేదని స్వయంగా పార్టీ ప్రకటించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ.. జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది..  దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందట. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను.. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జనసైనికులను కూడా విస్మయానికి గురి చేస్తుందట. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని.. అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన పార్టీ ప్రకటించినా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతుందట. ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో,  నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం, కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో, జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారంటున్నారు. నామినేటెడ్ పదవులు విషయంలో సైతం జనసేన నాయకులు,  కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుందట. అంతేకాదు కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ కొనసాగాలని, కూటమి  ధర్మాన్ని పాటించకపోతే  మొహమాటం లేకుండా  బయటికి వెళ్ళిపోవచ్చని  పవన్ కళ్యాణ్ అంటుండటం జనసైనికులకు నచ్చడం లేదంటున్నారు.  జనసైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం, వారికి నచ్చడం లేదనేదని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురంలో  ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది.. గత ఏడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం, పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగింది ఏమో గాని, రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసాం.. దాని స్థానంలో  యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది.  చివరికి దాన్ని కూడా రద్దు చేసి .. ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు మండలాలకు మాత్రమే పరిమితం చేసింది జనసేన పార్టీ.. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం... సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికే అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది.. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతుందా కేవలం 7, 8 లక్షల మాత్రమే చేయగాలిగారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందట.  వైసీపీ ప్రభుత్వం హయాంలో  ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా రెండు సంవత్సరాలు  పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022 లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో... పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించకపోవడం జనసేన పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదట. ఏది ఏమైనప్పటికీ... పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Marking one of the biggest re-releases in Indian cinema history, the global blockbuster Dhurandhar returns to theatres worldwide from today, 13 March 2026, ahead of the release of it’s sequel Dhurandhar The Revenge. Originally planned for a release across 500 screens globally, overwhelming demand from fans and exhibitors has more than doubled the scale of the re-release to 1,000+ screens worldwide. After breaking multiple box office records during its theatrical run, this moment marks yet another milestone in the film’s extraordinary journey. As Dhurandhar nears 100 days in cinemas, the massive global re-release further cements its phenomenal theatrical run.
Aaya Sher is among the biggest hits of the year, garnering millions of views across languages and dominating Instagram Reels recreations. To bring the vision alive, the makers built a grand slum empire set with the hero portrayed as the emperor of the slums. The excitement around The Paradise has been growing ever since the teaser was released. It received a strong response from audiences and quickly gained massive views online. The teaser created a lot of buzz on social media and increased curiosity about the film. With this growing excitement, The Paradise has become one of the most anticipated films of the year. The recently released song Aaya Sher from The Paradise has impressed audiences with its raw energy and striking visuals. A major reason behind the scale and authenticity of the song lies in the meticulously designed sets created by the film’s art department, which blended grandeur with organic realism. One of the most striking setups is the Hero House (Kaman Set) — a massive structure measuring 60 ft in width, 45 ft in height, and 25 ft in depth, built specifically for the hero’s powerful dip moment. Initially constructed at 30 ft width, the set was later expanded by 15 ft on each side, taking the final width to 60 ft. Around 25 workers worked for nearly 20 days to bring this imposing structure to life, with special aging techniques used to ensure the set blended naturally with the surroundings. Another visually unique element featured in the song is the giant biryani bowl–style structure, designed with a copper finish and aged texture to give it a rustic authenticity. Measuring 10 ft in width, with a 20 ft radius and 6 ft height, the setup was completed within five days by a team of 5–7 members. Adding further scale to the production was the Water Body Village Set, spread across 2.5 acres, featuring 60 fully constructed houses rather than dummy structures. Nearly 50 workers spent 30 days building the village, which was designed to accommodate around 500 people at once. To create the water body, 100 tankers of water were brought in, taking seven days to fill, along with an additional 20 ft × 20 ft pond with 20 ft depth built to store water. The production also constructed a massive dump yard set, measuring 120 ft in length, 50 ft in width, and 30 ft in height. Built by a 25-member team over 30 days, the design aimed to recreate the look of a real dump yard with an organic, lived-in aesthetic. What makes these sets even more remarkable is that they were created without disturbing the natural environment, with the art department carefully integrating the structures into the landscape. Natural textures and aging techniques were extensively used to enhance realism and authenticity. Each setup was meticulously planned to ensure smooth execution and creative precision. The final builds were carried out after securing all necessary approvals. The result is the visually immersive world audiences witnessed in Aaya Sher, giving a glimpse into the grand and gritty universe that The Paradise promises to deliver on the big screen.
  -ఎందుకు ఆ విధంగా పోస్ట్ చేసాడు -బ్రేక్ అప్ ఎందుకు అయ్యింది  -ఇంతకీ ఆమె ఎవరు అర్జున్ దాస్(Arjun Das).. సౌత్ సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో వర్ స్టైల్ యాక్టర్. ఎవరైనా నెగిటివ్ రోల్ లో చేస్తుంటే తిట్టుకుంటూ ఉంటాం. కానీ అర్జున్ దాస్ నెగిటివ్ రోల్ లో పెర్ఫార్మ్ చేస్తే మైమరచిపోయి చూస్తుంటాం. పైగా వాయిస్ అతి పెద్ద ఎసెట్. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సైతం  లెజండ్రీ యాక్టర్ 'రఘువరన్'(Raghuvaran)తో కంపార్ చేసాడంటే అర్జున్ దాస్ కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా అర్జున్ దాస్ ఒక పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ హోదాలో సోషల్ మీడియాకి ప్రత్యేక గుర్తింపుని తెస్తుంది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం  అర్జున్ దాస్  తన ఇన్ స్టా స్టోరీలో 'మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే, వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన ఎవరికైనా బ్రేక్ అప్ పోస్ట్ అనే విషయం అర్ధమవుతుంది. ఆ వర్డ్స్ కి ఉన్న కెపాసిటీ అది. కాకపోతే ప్రేమ అనే వర్డ్ పై హక్కు  ప్రియుడు, ప్రియురాలికే కాదు అన్ని రిలేషన్స్ కి వర్తిస్తుంది. కాబట్టి ఆ పోస్ట్ ప్రేమలో  విఫలమవడం వల్ల చేశాడా లేక మరో విషయంలోనా అని తేలాల్సి ఉంది. అర్జున్ దాస్ తన ఇనిస్టాలో కొత్త సినిమాల అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పంచుకుంటు ఉంటాడు. అలాంటిది ఫస్ట్ టైం లవ్ గురించి చెప్పాడు.  also read:  Ustaad Bhagat sing: గెలిచిన ఉస్తాద్ భగత్ సింగ్.. సాక్ష్యంగా నిలిచిన సుప్రీంకోర్టు అభిమానులు, నెటిజన్స్ కూడా పైన చెప్పుకున్న డౌట్స్ ని వ్యక్తం చేస్తూనే కొత్త సినిమాలోని    డైలాగ్ ఏమో అనే కామెంట్స్  చేస్తున్నారు. అర్జున్ దాస్ లిస్ట్ లో అయితే ఎలాంటి కొత్త చిత్రం లేదు. గత ఏడాది ఓజితో పాటు తమిళ మూవీ కుంకీ పార్ట్ 2 లో చేసాడు. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో క్లోజ్ గా దిగిన ఫొటోలు మాత్రం వైరల్ గా నిలిచాయి. ఆ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమెతోనే బ్రేక్ అప్ చెప్పాడా అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  
కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విఘ్నేష్ రాజా దర్శకత్వంలో 'కర' అనే సినిమా పూర్తి చేశాడు. 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇళయరాజా బయోపిక్, అబ్దుల్ కలాం బయోపిక్ లైన్ లో ఉన్నాయి. అలాగే, 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 56వ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లతో నటిస్తున్న ధనుష్, తన తదుపరి సినిమా 'D56' కోసం మరో క్రేజీ హీరోయిన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. 'సప్త సాగరాలు దాటి', 'కాంతార' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్, ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించబోతోందట. (Rukmini Vasanth) తనదైన నటన, అందంతో ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది రుక్మిణి. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగన్', యశ్ తో 'టాక్సిక్' వంటి భారీ సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ధనుష్‌తో జత కడుతుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో ఇప్పటికే 'ఏస్, మదరాసి' వంటి సినిమాలు చేసింది రుక్మిణి. ఇది ఆమెకు మూడో తమిళ చిత్రం. Also Read: ఎంజీఆర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన  రాజేంద్రప్రసాద్!
    -సుప్రీం తీర్పుతో సినిమా వాళ్ళల్లో సంబరాలు  -తెలంగాణ హైకోర్టుకి షాక్  -తీర్పులో ఏమని చెప్పింది   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh)ఉగాది కానుకగా ఈ నెల 18 న బెనిఫిట్ షోస్ నుంచే సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా వరుస ప్రమోషన్స్ తో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న రిలీజైన మూడో సాంగ్ నే అందుకు ఉదాహరణ. కానీ వాళ్లందరిలో మాత్రం ఒక దిగులు ఆవహించి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏరియా అభిమానుల్లో. ఇప్పుడు ఆ దిగులు సుప్రీం కోర్టు తీర్పుతో ఎటు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం. కొత్త సినిమాలకి టికెట్ రేట్స్ పెంచుకునే వీలు కలిపిస్తూ తెలంగాణ(Telangana)ప్రభుత్వం రెండు రోజుల ముందు జీవో జారీ చెయ్యడం, లేదా చివరి నిమిషంలోనో జారీ చేయడమో జరుగుతుంది. ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టులో టికెట్ పెంపుపై కేసు వేస్తున్నారు. దీంతో  అభిమానుల్లో, మూవీ లవర్స్ లో టెన్షన్ స్టార్ట్. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు స్పందిస్తు    టికెట్ ధరలని పెంచుతు నిర్ణయం తీసుకుంటే ఆ వివరాలని రిలీజ్ కి  90 రోజుల ముందే బహిర్గతం చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పుని ప్రకటించింది. దీంతో అభిమానుల్లో,సినీ మేకర్స్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది.       హైకోర్టు ఇచ్చిన తీరుపై అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సుప్రీం కోర్టు(Supreme Court)ని ఆశ్రయించింది. ఈ నిబంధన వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుంది. రిలీజ్ డేట్స్  చివరి నిమిషంలో మారుతుంటాయి. అలాంటప్పుడు  3 నెలల ముందే ధరల వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని మైత్రి తరుపు లాయర్ వాదించాడు. సదరు వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన '90 రోజుల గడువు' ఉత్తర్వులపై స్టే విధించింది.ఈ నిబంధన వల్ల చిత్ర పరిశ్రమ స్తంభించిపోయే ప్రమాదం ఉందనే వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది. also read: Priyanka mohan: ఓజి ప్రియాంక మోహన్ ఆవేదన.. డబ్బులు ఇచ్చి ఎందుకు చేయించారు దీంతో గతంలో లాగే రిలీజ్ కి  కొద్ది రోజుల ముందు టికెట్ రేట్స్ పెంపు కోసం ప్రభుత్వ  అనుమతులు పొందే అవకాశం నిర్మాతలకి  కలిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ ని మైత్రి మూవీ మేకర్స్ పవన్ కెరీర్ లోనే భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే.    
ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నటులు నాజర్, విశాల్ సహా పలువురు దీనిని తప్పుబట్టారు. వివాదం మరింత ముదురుతుండటంతో తాజాగా రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ అవార్డుని రాజేంద్రప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా కాంతారావుపై ప్రశంసలు కురిపించే క్రమంలో.. ఎంజీఆర్ ని తక్కువ చేసి మాట్లాడారు రాజేంద్రప్రసాద్. కాంతారావుని చూసి అప్పట్లో ఎంజీఆర్ ఉ** పోసుకున్నాడని అన్నారు. ఎంజీఆర్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళ ప్రజలు, ఎంజీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నాజర్, విశాల్ సహా పలువురు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ తీరుని తప్పుబట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  https://x.com/Theteluguone/status/2032391804692345327 ఈ క్రమంలోనే తాజాగా తమిళ భాషలో క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు రాజేంద్రప్రసాద్. తనకు ఎంజీఆర్ అంటే ఎంతో గౌరవమని, ఆయనను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని పేర్కొన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, ప్రసంగంలో భాగంగా తెలియక చేసిన వ్యాఖ్యలని వివరించారు.  "నా మాటల వల్ల తమిళ సోదరులు, ఎంజీఆర్ అభిమానులు బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని రాజేంద్రప్రసాద్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. Also Read: జియో హాట్‌స్టార్ లో విజయ్ సేతుపతి సంచలన వెబ్ సిరీస్
  -ప్రియాంక మోహన్ గురించి ఎందుకు అలా చెప్తున్నారు -అసలు సోషల్ మీడియాలో ఏముంది  -అభిమానుల ఆవేదన   అందానికి సరికొత్త నిర్వచనాన్ని వెతికేంత అందం 'ప్రియాంక మోహన్'(Priyanka Mohan)సొంతం. తన కంటు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే తన నుంచి సినిమా వచ్చిన రోజు థియేటర్ కి వెళ్లి కొంత మంది ప్రేక్షకులని జస్ట్ టచ్ చేస్తే చాలు మేము ప్రియాంక మోహన్ అభిమానులమని చెప్పేస్తారు. గత సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)'ఓజి'లో కన్మణి గా చేసి మెప్పించింది. ఆ థియేటర్ దగ్గర కూడా సేమ్ సిట్యువేషన్ కనపడిందంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్నివిషయాలతో అభిమానులు, నెటిజన్స్ ఒక్కసారిగా ఉలిక్కి పాటుకి గురవుతున్నారు. ఆ మాటలేంటో చూద్దాం. రీసెంట్ గా ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాపై దుష్రపచారం జరుగుతుంది. ద్వేషాన్ని చిమ్ముతు ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీని వెనక ఒక టీం పని చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఇవన్నీ చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని క్రిందకు లాగే వాళ్లు, మనపై చెడు ప్రచారం చేసే వాళ్లు ఉంటారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. గతం గురించి పట్టించుకునే పరిస్ధితుల్లో నేను ఇప్పుడు లేను. సినీ పరిశ్రమ నిలకడ లేని పరిశ్రమ.  ఇక్కడ ఎవరికైనా నాలాంటి పరిస్ధితి ఎదురుకావొచ్చు.  ఇలాంటి పరిస్థితులే మనల్ని దృఢంగా మారుస్తాయని నేను నమ్ముతాను. నా జీవితంలో ఎన్నో చూశాను. ఈ ట్రోలింగ్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇక్కడ అణగదొక్కడానికి కొంత మంది ఉంటారని ఒకింత ఆవేదనతోనే చెప్పింది. Also read: Nagarjuna: నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది అయితే సౌత్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక మోహన్ పై నెగిటివ్ ప్రచారం వెనక  చెన్నైకి చెందిన ఓ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఆ కంపెనీ నుంచి ప్రియాంక బయటకి వచ్చాకే తనపై ట్రోల్స్ జరుగుతున్నాయనేది వాళ్ళ నమ్మకం. దక్షిణాది చిత్ర పరిశ్రమకి చెందిన అనేక మంది తారల మీడియా వ్యవహారాలని ఆ కంపెనీ చూస్తుంటుంది. గత కొన్ని నెలల నంచి మాత్రం  ప్రియాంక పై  నెగిటివ్ పోస్టులు, దారుణమైన కామెంట్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కెరీర్ చూసుకుంటే 'మేడ్ ఇన్ కొరియా'(Made In Korea) అనే తమిళ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా రేపు  స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ్ లో మరో సినిమా, కన్నడలో ఒకటి ఆమె ఖాతాలో ఉన్నాయి 2019 లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడలో పదమూడు చిత్రాల వరకే చేసింది.  
విజయ్ సేతుపతి కొత్త వెబ్ సిరీస్ 'కాట్టాన్'  అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మణికందన్ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో సంచలనానికి సిద్ధం విభిన్న కథలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా లేదా సిరీస్ వస్తుందంటే.. దానిపై ప్రేక్షకుల దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. త్వరలో ఆయన ఓ డిఫరెంట్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ముత్తు అలియాస్ కాట్టాన్'(Muthu Alias Kaattaan). కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి అవార్డు విన్నింగ్ సినిమాలతో మంచి పేరు గడించిన దర్శకుడు మణికందన్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కడం విశేషం.  'కాట్టాన్' సిరీస్ రిలీజ్ డేట్ ని తాజాగా రివీల్ చేశారు. మార్చి 27 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రూరల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'కాట్టాన్' తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. మొండెం లేని తల దొరకడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. "ఇది నా తల. మీరు నా బాడీని వెతికి పట్టుకోవాలి" అని విజయ్ సేతుపతి పోలీసులకు సవాల్ విసురుతున్నట్లుగా డిఫరెంట్ గా టీజర్ ను కట్ చేశారు. అసలు కాట్టాన్(విజయ్ సేతుపతి) ఎవరు? అతని కథ ఏంటి? అతన్ని ఎవరు హత్య చేశారు? అనే ఆసక్తిని కలిగిస్తూ టీజర్ రూపొందించారు. మరో రెండు వారాల్లో స్ట్రీమింగ్ కి రానున్న 'కాట్టాన్' సిరీస్.. ఓటీటీలో గట్టిగానే సౌండ్ చేసేలా ఉంది. Also Read: సాకులు చెప్పొద్దు.. ఫేక్ చేయొద్దు.. మంచు మనోజ్ సంచలనం!
     -అభిమానుల పోటాపోటీ మెసేజెస్  -షోయూలో సుజితోలో ఏముంది -ఈ విషయాన్నీ ఎవరు బయటపెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna).. పేరు ముందు కింగ్ అనేది ఊరికే రాలేదంటు విభిన్న కథాంశంతో కూడిన చిత్రాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎనీ క్యారక్టర్ తీసుకోండి తను కనపడడు. క్యారక్టర్ మాత్రమే కనపడుతుంది. సినిమా బాగు కోసం ఎంత దూరం అయినా, ఏం చేయడానికైనా వెనుకాడడు. కింగ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ప్రస్తుతం తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అభిమానులకి, ప్రేక్షకులకి మంచి మెమరబుల్ మూవీ ఇవ్వాలనేది నాగ్ పట్టుదల. ఈ మూవీ అప్ డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్న అభిమానులకి కింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ కంటపడింది. పైగా నాగచైతన్య (Naga Chaintanya) సదరు న్యూస్ సృష్టికర్త కావడంతో కామెంట్స్ చేయడంలో వాళ్లంతా పోటీపడుతున్నారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాగ చైతన్య 'క్లౌడ్ కిచెన్'(Cloud Kichen)పేరుతో ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టాడు. జపనీస్ వంటకాలకి మాత్రం బాగా ఫేమస్. ఈ క్రమంలో జపనీస్ కి చెందిన ఎన్నో కొత్త  రకాల వంటకాల్ని ఆర్డర్ పై కస్టమర్స్ కి పంపిస్తుంటాడు. క్లౌడ్ కిచెన్ గురించి తాజాగా నాగ చైతన్య మాట్లాడుతు ఏ కొత్త రకం డిష్ తయారు చేసినా నేను, శోభిత టెస్ట్ చేసే పంపిస్తాం.  నాన్నకి షోయూలో సుజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి సండే పిలిచి ఈ సారి కొత్తగా పిజ్జాలు ఏం చేసారు. నాకు పంపించు అని అడుగుతుంటారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు అభిమానులతో పాటు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. also read: sona heiden: మగాళ్లతో గడపడం ఫూలిష్ పని.. వాళ్ళు టిష్యూ పేపర్‌తో సమానం అభిమానులైతే మా బాస్ అందానికి 'షోయూలో సుజితో' పిజ్జాలు కారణమా అనే కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా అవే పిజ్జాలని ఆర్డర్స్ చేసే బిజీలో ఉన్నారు. ఫుడ్ లవర్స్ కూడా  ఈ విషయంలో పోటీ పడే అవకాశం ఉంది. మరి ఈ లెక్కన 'క్లౌడ్ కిచెన్' సర్వర్ క్రాష్ అయ్యే అవకాశం ఉండవచ్చేమో.        
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) తన తదుపరి సినిమా 'డేవిడ్ రెడ్డి'(David Reddy) కోసం సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడని మనోజ్, తాజాగా తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపాడు. గత మూడు వారాలుగా కఠినమైన శిక్షణలో ఉన్న మనోజ్, తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మూడు వారాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలని, సాకులు చెప్పడం ఆపి కష్టపడాలని నిశ్చయించుకున్నాను" అన్నాడు.  కేవలం బాడీ బిల్డింగ్ కోసం కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లలో పర్ఫెక్షన్ కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. "యాక్షన్ సినిమాల్లో మన బదులు ఇంకెవరూ ఫేక్ చేయలేరు. ప్రతి పంచ్, ప్రతి దెబ్బ కెమెరా ముందు నిజాయితీగా కనిపించాలి. అందుకే నా శరీరాన్ని 'అన్‌బ్రేక్ బుల్'గా మార్చుకుంటున్నాను." అని మనోజ్ రాసుకొచ్చాడు. ఇటీవల తేజ సజ్జతో కలిసి నటించిన 'మిరాయ్' సినిమాలో బ్లాక్ స్వోర్డ్ పాత్రలో మనోజ్ చూపిన విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'డేవిడ్ రెడ్డి'పై మనోజ్ మరింత దృష్టి సారించాడు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1897 నుండి 1920 మధ్య కాలంలో బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడి కథ ఇది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి సినిమాపై అంచనాలను పెంచింది. రియాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. https://www.instagram.com/p/DVtRzdhEix7/
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం.  అటు ఏడు తరాలు,  ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది.  అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు. ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది,  కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ గొడవలు ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్నిఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. కెరీర్ లక్ష్యం..  సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే,  కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించే కాదు.. అమ్మాయి  కెరీర్‌కు మద్దతు ఇస్తాడా?  లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది.  ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. డబ్బు.. డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తుంటాయి.  కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆదా చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా  అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని  ఎలా మెయింటైన్  చేస్తారనే విషయం కూడా చర్చించాలి. లైఫ్ స్టైల్.. సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి గురించి ప్రశ్నలు అడగాలి.  భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి  తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా?  రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది. పర్సనల్ సేవింగ్స్.. సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి.  వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్స్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతాయి. లోన్ లు,  అప్పులు..  కాబోయే భర్తకు ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి ఏవైనా పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు వంటివి ఉన్నాయా  అని కూడా ముందుగానే అడగాలి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగి క్లియర్ చేసుకుంటే వివాహం తర్వాత జీవితం చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది.                                        *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!
ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు, నచ్చినంత తినడంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. అయితే ప్రతి రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంత సహాజమో.. ఆహారం తీసుకోగానే 10 నిమిషాలు నడవడం అంత ముఖ్యమని అంటున్నారు వైద్యులు,  ఫిట్‌నెస్ నిపుణులు.  ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. వాకింగ్.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా చేయగలిగే అతి తేలిక వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్ ఏ.  వాకింగ్ ను చాలామంది దినచర్యలో భాగం చేసుకుంటారు.  ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం చేస్తుంటారు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడవడం చాలా మంచి అలవాటు అని అంటున్నారు. తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజాలు.. భోజనం తర్వాత ప్రతి రోజూ 10 నిమిషాలు నడిస్తే కాళ్ల కండరాలు బలపడతాయట.  ఇది ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చాలా మంచి ఫలితాలు గమనించవచ్చని అంటున్నారు. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య షుగర్.  రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు.  అయితే ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని అంటున్నారు.   ఆహారం తిన్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల  బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  వాకింగ్ చేయడం వల్ల శరీర కదలికలు జరిగి పేగులు కూడా కదలికలకు లోనవుతాయి.  జీవక్రియ  మెరుగవుతుంది.   ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురయ్యే వారు ఉంటారు.  ఇలాంటి వారు బోజనం చేసిన తర్వాత 10న నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి.  ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది.  మనసును ప్రశాంత పరుస్తుంది.  ఒత్తిడి తగ్గిస్తుంది. నేటికాలంలో చాలా మంది పొట్ట ఆరోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నారు.  చాలామందికి పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. నిజానికి ఇలాంటి వారికే డయాబెటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే బోజనం చేయగానే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ చేస్తే పొట్ట వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు.                                   *రూపశ్రీ. 
శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.  అయితే  ప్రపంచవ్యాప్తంగా  కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  పెరుగుతున్న కిడ్నీ  వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించడానికి,  అవగాహన పెంచడానికి,  కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది ఈ ఏడాది మార్చి 12వ తేదీన వచ్చింది.  అన్ని వయసుల వారిలో కిడ్నీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. . పిల్లలు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదంలో ఉన్నారు. మూత్రపిండాలు  శరీరానికి ఫిల్టర్లలా పనిచేస్తాయి. అవి రక్తం నుండి మలినాలను,  అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేస్తే, శరీరంలో విషపూరితం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల పరీక్షల సమయంలో క్రియేటినిన్ స్థాయిలు గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అసలు క్రియోటినిన్ అంటే ఏంటి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్రియాటినిన్.. క్రియాటినిన్ అనేది శరీర కండరాలలో ఉత్పత్తి అయ్యే క్రియాటిన్ అనే సమ్మేళనం విచ్ఛిన్నం కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. మనం శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు, మన కండరాలు శక్తిని ఉపయోగిస్తాయి,  ఈ ప్రక్రియలో క్రియాటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో నిరంతరం ఉత్పత్తి అవుతుంది.  సాధారణ పరిస్థితులలో మూత్రపిండాలు దానిని రక్తం నుండి వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేసినప్పుడు, రక్తంలో క్రియాటినిన్ స్థాయి సమతుల్యంగా మారుతుంది.  క్రియేటినిన్ పెరగడం అనేది మూత్రపిండాలు రక్తాన్ని తగినంతగా ఫిల్టర్ చేయడం లేదని సంకేతాన్ని ఇస్తుంది. క్రియాటినిన్ స్థాయి.. క్రియాటినిన్ స్థాయి ఎలా ఉండాలి? రక్త పరీక్ష ద్వారా క్రియాటినిన్ స్థాయిలను గుర్తిస్తారు.    పురుషులలో సాధారణ క్రియాటినిన్ స్థాయిలు 0.7 నుండి 1.3 mg/dL వరకు ఉంటాయి. మహిళల్లో, ఇది 0.6 నుండి 1.1 mg/dL మధ్య  ఉంటే అది సాధారణం అని పరిగణిస్తారు. క్రియాటినిన్ స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. క్రియాటినిన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే,  మూత్రపిండాలు అంత ప్రమాదంలో ఉంటాయి. క్రియాటినిన్ ఎక్కువైతే ఏ సమస్యలు వస్తాయి.. మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటంతో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి, దీని వలన శరీరంలో యూరియా,  ఇతర విషపదార్థాలు పేరుకుపోతాయి.   మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తరచుగా నొప్పి నివారణ మందులు వాడటం,  శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం మొదలైనవన్నీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి,  అధిక క్రియాటినిన్ స్థాయిలకు దారితీస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. క్రియాటినిన్ పెరగడం వల్ల మూత్రపిండాలే కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో ద్రవం,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన పాదాలు, ముఖం లేదా చేతులు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. రక్తంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అలసట, బలహీనత, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.  కొన్ని సందర్భాల్లో,  పొటాషియం స్థాయిలు అసమతుల్యంగా మారడం,  హృదయ స్పందనలు క్రమబద్దంగా లేకపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. క్రియాటినిన్ పెరిగితే ఏం చేయాలి? క్రియాటినిన్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే, కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మందులతో పాటు, క్రియాటినిన్ స్థాయిలను నియంత్రించడానికి  ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి.   మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గించే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినాలి.  ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచాలి. ఉదాహరణకు పండ్లు,  కూరగాయలు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఉప్పు,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.                        *రూపశ్రీ.