Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమ్మర్‌లో ఏసీ రోజంతా వాడినా సరే.. తక్కువ కరెంట్ బిల్ రావడానికి ఈ సీక్రెట్ ట్రిక్స్ మీకోసం..!
posted on: Mar 13, 2026 1:20PM

వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి. ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది. ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది. ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే..
టెంపరేచర్...
చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు. ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది. ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది.
ఏసీ, ప్యాన్ కాంబినేషన్..
ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు. ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు. కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి. ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు.
డోర్స్, విండోస్..
చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు. డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు. దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది.
కర్టెన్లు..
కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి. ఇలా చేస్తే వేడి లోపలికి రాదు.
ఫిల్టర్..
చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ, ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు. ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి. వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
స్లీప్ మోడ్ లేదా టైమర్..
వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది. ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు.
పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు. ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.
*రూపశ్రీ.



.webp)


