Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం వద్దంటున్న జనసేన
posted on: Mar 12, 2026 2:36PM

జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో ఆవిర్భావ వేడుకలను పరిమితం చేయాలని క్యాడర్‌కు సూచించింది. జనసేన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన... గెలిచిన మొదటి ఏడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు . సీన్ కట్ చేస్తే.... ఏడాది తర్వాత.. అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదని స్వయంగా పార్టీ ప్రకటించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ.. జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది..
దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందట. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను.. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జనసైనికులను కూడా విస్మయానికి గురి చేస్తుందట. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని.. అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన పార్టీ ప్రకటించినా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతుందట.
ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో, నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం, కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో, జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారంటున్నారు. నామినేటెడ్ పదవులు విషయంలో సైతం జనసేన నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుందట. అంతేకాదు కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ కొనసాగాలని, కూటమి ధర్మాన్ని పాటించకపోతే మొహమాటం లేకుండా బయటికి వెళ్ళిపోవచ్చని పవన్ కళ్యాణ్ అంటుండటం జనసైనికులకు నచ్చడం లేదంటున్నారు.
జనసైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం, వారికి నచ్చడం లేదనేదని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది.. గత ఏడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం, పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగింది ఏమో గాని, రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసాం.. దాని స్థానంలో యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది.
చివరికి దాన్ని కూడా రద్దు చేసి .. ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు మండలాలకు మాత్రమే పరిమితం చేసింది జనసేన పార్టీ.. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం... సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికే అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది.. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతుందా కేవలం 7, 8 లక్షల మాత్రమే చేయగాలిగారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందట.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా రెండు సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022 లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో... పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించకపోవడం జనసేన పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదట. ఏది ఏమైనప్పటికీ... పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదంటున్నారు.


.webp)



