తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు.  వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.  వీటి నిర్మాణం,   ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.   అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా  హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాల‌ని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు.  ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు.  అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్  నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి.   ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో  సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే..  తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు.  ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో  రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.   
హైదరాబాద్ లోని ఐడీపీఎల్  భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల  కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత  ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా,  మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో  ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   ఈ విచారణలో  కబ్జాదారులు ఎవరన్నది తేలితే   వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Mega Powerstar Ram Charan, who is himself gearing up to star as a sportsman in his upcoming village action drama Peddi, is set to lend his support to the next generation by unveiling the trailer for Roshan Meka's sports film, Champion. Champion features Roshan Meka in the lead role as a talented Indian footballer during the British era who dreams of meeting Queen Elizabeth II. The film has already generated significant buzz with the teaser and the chartbuster songs, Gira Gira and Sallangundale. Roshan's chemistry with co-star Anaswara Rajan is also a major talking point in T-Town. Music composer Mickey J Mayer's tracks have already become popular hits. Ram Charan's attendance at the trailer launch event on December 18th in Hyderabad is a gesture honoring the great bond he shares with Roshan's father, actor Srikanth.  The film, which also marks the return of Nandamuri Kalyan Charavarthy to the screen, is being produced by Priyanka Dutt and is slated for a grand theatrical release on December 25th, 2025. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఓ సాలిడ్ సక్సెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దీని తర్వాత రవితేజ.. తనకు 'కిక్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.   2009లో రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'కిక్' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 2015లో వీరి కాంబోలో వచ్చిన 'కిక్-2' మాత్రం పరాజయం చూసింది. ఏకంగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ చేతులు కలపబోతున్నట్లు సమాచారం.   Also Read: షాకింగ్.. అప్పుడే ఓటీటీలోకి మోగ్లీ..!   2023లో వచ్చిన 'ఏజెంట్' తర్వాత సురేందర్ రెడ్డి  నుంచి సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశమొచ్చినా అది పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. సురేందర్ రెడ్డి మెజారిటీ సినిమాలకు రచయితగా పని చేసిన వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడట. ఇది 'కిక్-3' అనే ప్రచారం కూడా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మూవీ రూపొందనుందట.   రవితేజ, సురేందర్ రెడ్డి.. ఇద్దరికీ ఇప్పుడు హిట్ అవసరం. మరి వీరి కాంబోలో రానున్న ఈ మూవీ.. ఇద్దరికీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.  
  ఇటీవల కాలంలో మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. కొన్ని కొన్ని సినిమాలు మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చి షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'మోగ్లీ' కూడా చేరనుందని న్యూస్ వినిపిస్తోంది. (Mowgli 2025)   రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మోగ్లీ'. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 12 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. పైగా, ప్రస్తుతం థియేటర్లలో 'అఖండ-2' హవా ఉండటంతో వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇలాంటి సమయంలో 'మోగ్లీ' మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.   Also Read: ఇదెక్కడి ట్రైలర్ రా మావ.. లేడీ గెటప్ లో సూపర్ స్టార్!   'మోగ్లీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయడానికి ఈటీవీ విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. అంటే మూడు వారాలు కూడా తిరగకుండానే 'మోగ్లీ' మూవీ ఓటీటీలోకి రాబోతుంది అన్నమాట. మరి ఈ న్యూస్ లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.  
        -విడాకులు నిజమేనా! -అసలు ఏం జరుగుతుంది - ఆ ఇద్దరు క్లారిటీ ఇస్తారా!      భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల గురించి చెప్పుకుంటే అందులో ఖచ్చితంగా 'సెల్వ రాఘవన్'(Selvaraghavan)ఉంటాడు. 7 /జి బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకి అర్దాలు వేరులే, మయక్కం ఎన్నా, నెంజమ్ మరప్పతిల్లై వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రతిభావంతమైన నటుల గురించి చెప్పుకోవాలన్నా అందులో సెల్వ రాఘవన్ పేరు ఉంటుంది. బీస్ట్, సాని కాయిధ‌మ్, నానే వరువేన్, బకాసురన్, మార్క్ ఆంటోనీ, రాయన్ తో పాటు రీసెంట్ గా వచ్చిన ఆర్యన్ వంటి చిత్రాలే  ఉదాహరణ.     సెల్వ రాఘవన్ 2011 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకురాలు 'గీతాంజలి'(Gitanjali)ని వివాహం చేసుకున్నాడు. సెల్వ రాఘవన్ కి ఇది రెండో వివాహం. మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ 7 /జి బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia Agarwal)తో జరిగింది. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. 2006లో వీరి పెళ్లి జరగగా మనస్పర్థలు తలెత్తడంతో  2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతనే గీతాంజలి ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ ఒకటి తమిళ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.     Also read:   సుజిత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా     ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గీతాంజలి ఇనిస్టాగ్రమ్ లో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడమే. పెళ్లయిన 14 ఏళ్లకి అలా ఉన్నట్లుండి పిక్స్ డిలేట్ చేయడంతోనే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మాటలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.       
  "ఇఫ్తేకర్ షరీఫ్" జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్” హైదరాబాద్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి, అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.   ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ భారత క్రికెటర్, తెలంగాణ మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ సినిమా చూసి ప్రశంసించారు. నిజ జీవిత కథను చాలా నిజాయితీగా, సింపుల్‌గా చూపించారని, ఇందులో మంచి సామాజిక సందేశం ఉందని అన్నారు. డాలి టోమర్ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరారు. ఫిల్మ్ మేకర్ గా ఆమెకు ఉజ్వల భవిష్యత్ ఉందని కొనియాడారు.   ఈ డాక్యుమెంటరీని ముంబయికి చెందిన ఓమ్‌షీల్ ప్రొడక్షన్స్ (డాలీ టోమర్) నిర్మించగా, అమెరికాలోని డీకే ఒమ్‌షీల్ ప్రొడక్షన్స్ (ఖుర్రం సయ్యద్) సహకరించింది. సినిమాకు దర్శకత్వం రజనీష్ దూబే, నిర్మాణం కల్పనా రాజ్‌పుత్, ఎడిటింగ్ దేవు నామ్‌దేవ్ చేశారు.   “జిందగీ ఇన్ టూ షేడ్స్” మన జీవితాల్లో ఎదురయ్యే నిజాల్ని సూటిగా చూపించే డాక్యుమెంటరీ. ఇప్పటికే ఇది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ ఈవెంట్ ను కోఆర్డినేట్ చేశారు.   మొత్తానికి, మంచి కంటెంట్‌తో, మంచి సందేశంతో “జిందగీ ఇన్ టూ షేడ్స్” ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంటోంది.  
  కేజీఎఫ్, కాంతార సినిమాలతో కన్నడ పరిశ్రమ పేరు పాన్ ఇండియా స్థాయిలో మరోమోగిపోయింది. ఇప్పుడు కన్నడ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే '45'. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (45 Movie)   శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం '45'. సూరజ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాతో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతుండటం విశేషం. (45 Trailer)   '45' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్.. ఉపేంద్ర సినిమాలను తలపించేలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా ఉంది.    Also Read: డేవిడ్ రెడ్డి మూవీలో రామ్ చరణ్!   "అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ డ్యాష్(-) మరణించిన తేదీ రాసి ఉంటుంది. ఆ మధ్యనున్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం" అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.    సెటప్ పూర్తి కొత్తగా ఉంది. శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టిల పాత్రలతో పాటు.. ఇందులోని వాహనాలు, ఆయుధాలు అన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చివరిలో శివ రాజ్‌కుమార్ లేడీ గెటప్ లో కనిపించడం హైలైట్ గా నిలిచింది.   '45' మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదవుతుండగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 1న విడుదల కానుంది.   ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన '45' మూవీ.. కంటెంట్ తోనూ సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.    
        -చిన్నప్పట్నుంచి పవన్ అభిమాని -ఎన్నో కోట్లు  -కారు మోడల్ ఏంటి     పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సినీ కెరీర్ ని చూసుకుంటే కొన్నిచిత్రాలకి అభిమానుల్లోనే కాకుండా పవన్ కి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి ఒక ప్రత్యేకత గల చిత్రమే ఓజి(OG). గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజై పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. పవన్ కి ఈ చిత్రం ద్వారా ఎంత పేరు వచ్చిందో  దర్శకుడు సుజిత్ కి అంతే పేరు వచ్చింది.  అంతలా పవన్ ని సరికొత్త ప్రెజెంటేషన్ తో చూపించాడు. పవన్ కూడా ఓజి విజయం తాలూకు క్రెడిట్ మొత్తాన్ని సుజిత్ కే ఇచ్చాడు. దీన్నిబట్టి పవన్  గుండెల్లో సుజిత్ కి ఉన్న స్థానాన్ని అర్ధం చేసుకోవచ్చు.      ఆ స్థానం యొక్క గొప్పతనాన్ని చాటుతు సుజిత్ కి పవన్ ఖరీదైన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్'(Land Rover Defender)కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. సదరు కారుతో పవన్, సుజిత్(Sujeeth)దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పవన్ తనకి కారుని గిఫ్ట్ ఇవ్వడంపై సుజిత్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'బాల్యం నుంచి పవన్ అభిమాని అయిన నేను ఈ రోజు ఆయన్నుంచి కారుని గిఫ్ట్ గా అందుకోవడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. నా ఓజి పవన్ కళ్యాణ్ ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికి మరువలేనివి. ఎప్పటికి ఆయనకి రుణపడి ఉంటా అని ట్వీట్ చేయడంతో పిక్స్ ని కూడా షేర్ చేసాడు. ఇక పవన్ ఇచ్చిన కారు ధర కోటి రూపాయలకి పైగానే ఉంటుంది.     also read:   లిఫ్ట్ లో ఇరుక్కొని దర్శకుడి కుమారుడు మృతి.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్      సుజిత్  సినీ కెరీర్ విషయానికి వస్తే  తన అప్ కమింగ్ మూవీని నాచురల్ స్టార్ నాని(Nani)తో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అధికారంగా ఈ మూవీ ప్రారంభమైంది. నాని కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్.        
        -షాక్ కి గురవుతున్న భారతీయ చిత్ర పరిశ్రమ  -లిఫ్ట్ లో ఏం జరిగింది! -పవన్ ట్వీట్ వైరల్       భారతీయ చిత్ర సీమలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో జరిగిన జరిగిన ఈ సంఘటన చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచి వేస్తుంది. కేజిఎఫ్ సిరీస్ యష్, ప్రశాంత్ నీల్ కే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో 'కీర్తన్'(Kirtan)కూడా ఒకరు. ఈయన కేజిఎఫ్ సిరీస్ కి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేసాడు. రీసెంట్ గా కీర్తన్ కుమారుడు సోనార్ష్(Sonarsh)లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. పొరపాటున లిఫ్ట్ లో ఇరుక్కోవడం వల్లనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వయసు సుమారు రెండు సంవత్సరాలు.       దీంతో పలువురు సినీ ప్రముఖులు సోనార్ష్ మృతి పట్ల తమ సంతాపాన్ని  తెలియచేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోనార్ష్ మృతి తనని తీవ్రంగా బాధించిందని ఎక్స్ వేదికగా తెలిపాడు. కొన్నిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి కీర్తన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని అనౌన్స్ చేసారు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాంటి ఈ టైంలో సోనార్ష్ మరణించడం అత్యంత బాధాకరమైన విషయం. కీర్తన్ స్వస్థలం బెంగుళూర్ కాగా నార్త్ బెంగళూరులోని రాజ్ మహల్ విల్లాస్ లో నివాసం ఉంటున్నాడు     Also read:  పెళ్లి చేసుకుంది ఎవర్ని.. మెహ్రిన్ కీలక వ్యాఖ్యలు       
Russo Brothers have been highly successful with Marvel Cinematic Universe films like Captain America: Winter Soldier, Captain America: Civi War, Avengers: Infinity War and Avengers: EndGame. They are returning to direct Avengers: Doomsday and Avengers: Secret Wars. MCU also announced return of Robert Downey Jr. as Doctor Doom.  Many have speculated that Chris Evans, who played Captain America aka Steve Rogers, will be back as Russos have been casting him in their major other blockbusters too. The Avengers: Doomsday teaser leaks have noted that he is indeed returning and he will have a baby with him as well.  Now, fan theories are going around that Steve Rogers is with young Victor Doom and hence, he is able to time travel and appear in Fanstatic Four: First Steps changed timeline to 1970's, in end credit scene. Also, there are theories that the makers are planning to make it another big flm with Chris Evans vs Robert Downey Jr. story.    As Captain America: Civil War had both of them as Captain America and Iron Man going against each other, now, it will be Steve Rogers vs Doom. They are majorly predicting that during the time travel of Steve Rogers in EndGame, he did rupture the timeline and hence, the changes will be addressed by him only.  While the theories are rampant, several fans are unhappy that Marvel back tracked from Anthony Mackie's Sam Wilson as Captain America to Chris Evans. Several are countering it by stating that this time he is Steve Rogers but not Captain America and Sam Wilson will remain Cap. The official note and confirmation from MCU or producer Kevin Feige can only satisfy fans about the new developments of the story. For now, Chris Hemsworth is expected to also play a huge role in this film but Secret Wars will be having the original trinity going against each other say several sources.  Looking at the disappointing reception to Marvel Phase 5 films, this kind of restructuring is anticipated. As Chris Evans stated that he is not going to return to MCU films but decided to keep it aside for Russos and Feige, he is receiving backlash and appreciation. We have to wait and see how Marvel will handle all this further.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      -ఎవరు ఆ పెళ్లి కొడుకు  -మెహ్రిన్ వ్యాఖ్యలు కరెక్టే కదా  -ప్రస్తుతం చేస్తున్న సినిమాలు      విక్టరీ వెంకటేష్(venkatesh),మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej),అనిల్ రావిపూడి(ANil Ravipudi),దిల్ రాజు(Dil Raju) లు సెల్యులాయిడ్ పై సృషించిన 'ఎఫ్ 2 'మూవీ అభిమానులు, ప్రేక్షకులపై ఎంతగా ప్రభావం చూపించిందో తెలిసిన విషయమే. ఈ మూవీలో హనీ అనే క్యారక్టర్ లో 'హనీ ఈజ్ ది బెస్ట్' అనే డైలాగ్ తో  అంతే ప్రభావం చూపించిన భామ 'మెహ్రిన్'(Mehreen). పంజాబ్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2016 లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమైంది. అనతికాలంలోనే పలు చిత్రాల్లో నటించి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది.     2021 మార్చి 21 న మెహ్రీన్ కి రాజస్థాన్ క్యాప్టల్ జైపూర్ కి చెందిన 'భవ్య బిష్ణోయ్' అనే పొలిటీషియన్ తో ఎంగేజ్మెంట్  జరిగింది. భారతీయ జనతా పార్టీ తరుపున అడంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి  ఎంఎల్ఏ గా బిష్ణోయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బిష్ణోయ్ తాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ . కానీ ఆ తర్వాత ఆ ఇద్దరి వివాహం క్యాన్సిల్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెహ్రీన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మెహ్రిన్ ఇనిస్టాగ్రమ్ వేదికగా స్పందిస్తు 'నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా న్యూస్ రాస్తున్నారు.  నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మీరు చెప్తున్న ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కనీసం పరిచయం కూడా లేదు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రపంచానికి చెప్తాను. దయ చేసి నా పెళ్లి వదంతులు వ్యాప్తి చెయ్యవద్దని మెహ్రిన్ కోరింది.     also read:   నెక్ట్స్‌ మూవీ హీరో ఎవరు? ఈ స్టార్ ఓకేనా మీకు       ఇక  మెహ్రీన్ సినీ కెరీర్ విషయానికి వస్తే  బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ తర్వాత ఎఫ్ 3 తో పాటు స్పార్క్ లైఫ్ అనే మూవీలో మెరిసింది.తమిళంలో వసంత్ రవితో కలిసి ఇంద్ర అనే సినిమాలో ఈ ఏడాది కనిపించగా, ప్రస్తుతం కన్నడంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు,  సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్న స్నేహితుల అవసరం,  వారి సహాయం ఎంతో అవసరం అవుతుంది.  అయితే ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీగా ఉన్న, నిజమైన స్నేహితులు ఉండరు. కొందరి జీవితాలలో నకిలీ స్నేహితులు కూడా ఉంటారు.  కేవలం స్వార్థం కోసం, మోసం చేయాలనే ఉద్దేశంతో స్నేహం చేసే వారు ఉంటారు. నకిలీ స్నేహితులు వెనక గోతులు తీస్తూ ఉంటారు. చాలా నష్టాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. నిజమైన స్నేహితుడికి,  నకిలీ స్నేహితుడికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పే మార్గాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. దూరం.. నకిలీ స్నేహితులను బయటపెట్టే మంచి మార్గం వారు పాటించే దూరం. స్నేహితులు సమస్యలు ఏమీ లేకుండా బాగున్నప్పుడు,  పార్టీలు చేసుకుంటున్నప్పుడు,  ఆర్థికంగా  బాగున్నప్పుడు,  ప్రయాణాలు ప్లాన్  చేస్తున్నప్పుడు  అందరికంటే ముందు వీళ్లే కనిపిస్తారు.  కానీ స్నేహితులు ఏవైనా సమస్యలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు  దూరం మెయింటైన్ చేస్తారు. అంతేకాదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడం  లేదా ఫోన్  ఆఫ్ లో ఉందని చెప్పడం లాంటివి చేస్తారు. కొన్నిసార్లు కేవలం దూరంగా ఉంటూ మాటల్లో సానుభూతి తెలుపి తప్పించుకుంటారు. ఈర్ష్య.. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల  విజయాన్ని తనదిగా భావిస్తాడు.  కానీ  నకిలీ స్నేహితులు తన స్నేహితులు  అభివృద్ధి చెందడం చూసి ఎప్పటికీ సంతోషించడు.  ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఓర్వలేరు.  పైగా   అలాంటి సంతోష సమయాల్లో  నీ అదృష్టం బాగుంది అందుకే నీకు అవన్నీ దొరికాయి వంటి ఎగతాళి మాటలు కూడా మాట్లాడతారు.  విజయం పట్ల అసూయ పడే స్నేహితులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. అవమానం.. స్నేహితుల మధ్య జోకులు వేసుకోవడం, ఆటపట్టించడం సర్వసాధారణం, కానీ నకిలీ స్నేహితులు  తరచుగా అందరిముందు   తక్కువ చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి  ప్రయత్నిస్తారు. బలహీనతలు బయటపెట్టడం,  ఎగతాళి చేయడం వంటివి చేస్తారు.  అలాంటి సందర్భాలలో బాధపడితే నేను జోక్ చేశా.. దీనికే బాధపడాలా, కనీసం ఫ్రెండ్ గా నేను ఇలా కూడా మాట్లాడకూడదా అని కవరింగ్ కూడాచేస్తారు. రహస్యాలు.. స్నేహితులు  ఇతరుల రహస్యాలను కథలు కథలుగా లేదా కబుర్లు లాగా చెప్పేవాడు అయితే అతను  ఇక్కడ వినే రహస్యాలు కూడా అవతలి వారికి చెప్పేస్తాడు. నకిలీ స్నేహితుడు ఎప్పుడూ రహస్యాలను దాచి ఉంచలేరు.  పోస్ట్‌మ్యాన్ లాగా వ్యవహరించి అవతలి వారి విషయాలను ఇవతలికి,  ఇవతలి వారి విషయాలను అవతలికి చెబుతూ ఉంటారు.  ఇలాంటి వ్యక్తి అస్సలు మంచివాడు కాదు. స్వార్థం.. నకిలీ స్నేహితులు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు.  ఎవరైనా తన దగ్గర  ఏదైనా  చెప్పుకునేటప్పుడు మధ్యలో తన సమస్యలు,  తన ఇబ్బందులు చెప్పి తన స్నేహితుల మాటలు డైవర్ట్ చేస్తారు. ఇతరుల భావాలు, ఎమోషన్స్ అస్సలు వారికి పట్టవు. అందరూ తను చెప్పేది వింటే చాలని అనుకుంటారు తప్ప అందరి విషయాలు తనకు అవసరం లేనట్టు బిహేవ్ చేస్తారు. పైన చెప్పుకున్న లక్షణాలు మీ స్నేహితులలో ఉంటే దయచేసి వారిని దూరం ఉంచడం ఉత్తమం. వారికి పర్సనల్ విషయాలు,  ముఖ్యమైన విషయాలు, జీవితంలో ఏవైనా రహస్యమైన విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. అలాంటివారి కోసం సమయాన్ని వృథా చేయడం కూడా తప్పే.                             *రూపశ్రీ.
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.  వారి ప్రవర్తన,  వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు,  జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు  వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు.  అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.   సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట.  వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన,  హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట.  ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట.  వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు.  దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు.  వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట.  ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో  సులువుగా బోల్తా పడతారు.   డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట.  అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట. కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట.  వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట.  ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని,  ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు. సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు,  సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు,  సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.                                *రూపశ్రీ.
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. టీ-బిస్కెట్ కహానీ.. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు,  అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ  పదార్థాలు టీలోని కెఫిన్,  టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా  ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర,  కొవ్వు పేరుకోవడాన్ని  పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే  అది ఊబకాయం, మధుమేహం  జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా  పెంచుతుంది. పోషకాలు జీరో.. మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి.  వీటిలో  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్.. బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి,  వాటి షెల్ఫ్ లైప్  పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చక్కెర .. బిస్కెట్లలో చక్కెర,  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి  శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. జీర్ణక్రియ, యాసిడ్.. బిస్కెట్-టీల కాంబో  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.  టీలోని ఆమ్లతత్వం,  బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం,  యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.