ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో  ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు.  అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు. విషయమేంటంటే..   ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది.  అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో   తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ  ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు.  తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు.   [Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన, కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన బీజేపీ మధ్య సమన్వయం, వైసీపీ బలం వంటి పలు అంశాలను పరిశీలించినట్లు చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వేలోని అంశాలు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా.. కూటమి పాలనపై ప్రజాల అభిప్రాయం, జనం మూడ్ ఎలా ఉందన్న అంశాన్ని తాజా సర్వే పరిశీలించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి నాయకత్వం, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో  తేలింది.  ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, నెల నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ వంటి అంశాలు ప్రజలకు చేరుతున్నాయని సర్వే పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ పంపిణీ సమయంలో కనిపించిన ప్రచార స్థాయి ఇప్పుడు కనిపించడం లేదన్న అభిప్రాయం జనంలో  వ్యక్తమౌతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ కూటమి నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితంలో వెల్లడైంది.   అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రభుత్వంపై వైసీపీయులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ తెలుగుదేశం వినా, కటమిలోని మిగిలిన రెండు భాగస్వామ్య పార్టీల నేతలూ పెద్దగా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం కూడా ఈ సర్వేలో తేటతెల్లమైంది.   జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.  మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని సర్వే స్పష్టం చేసింది.  చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం ప్రజల్లో  ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని  చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది.  ఇసుక, మట్టి, ఇతర స్థానిక వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వస్తున్న ఫిర్యాదులు, చిన్న చిన్న ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి  క్షేత్రస్థాయిలో ప్రజలలో కనిపిస్తోందని సర్వే పేర్కొంది.   ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమవుతాయన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోందని సర్వే పేర్కొంది. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక చోట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. అమరావతి నిర్మాణ పనులకు ప్రతిరోజూ అప్‌డేట్లు వస్తున్నట్టే.. పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తే విశ్వాసం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వేలో  వ్యక్తమైంది. శంకుస్థాపనలు ఎప్పుడు పూర్తవుతాయి.. పరిశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు జనం సమాధానం కోరుకుంటున్నారని తేలింది.   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన పలు సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్న అంశాన్ని కూడా సర్వే ప్రస్తావించింది. వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు, సాగునీరు, పులివెందులకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వంటి వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొంది. అయితే ఈ పనుల గురించి ప్రజల్లోకి బలంగా వెళ్లే స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం అధికార కూటమికి ఇబ్బందికరంగా మారుతోందని సర్వే విశ్లేషించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని, వాటికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, కూటమి భాగస్వామ్య పార్టీలో విఫలమౌతున్నాయని సర్వే తేల్చింది.  ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీలలో కీలకమైన జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం కూడా జనంలో చర్చనీయాంశంగా మారిందని సర్వే పేర్కొంది. వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు జరుగుతుండటం ఆ అభిప్రాయానికి కారణంగా సర్వే పేర్కొంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న కాలంలో.. స్థానికంగా టీడీపీ నాయకులతో రాజకీయంగా తలపడిన నేతలు జనసేనలో చేరుతుండటం, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో  ముందుముందు జనసేన సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం, ఆందోళన అయా ప్రాంతాలలోని స్థానికులలో బలంగా వ్యక్తమౌతోందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది.  మరీ ముఖ్యంగా ఈ పరిస్థితి స్థానిక ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.  ఇక తెలుగుదేశం   సీనియర్ నాయకులకు, మంత్రి నారా లోకేష్‌కు మధ్య సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా సర్వేలో  పరిశీలించింది. పార్టీలో సీనియర్లకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ప్రస్తుతం లేదన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉందని పేర్కొంది. కీలక పదవులు, నిర్ణయాల్లో సీనియర్ల అభిప్రాయాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా ఉందని తెలిపింది. అదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వంటి ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోందని సర్వే పేర్కొంది. అయితే బహిరంగంగా మాత్రం ఇరువురు నేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తరహా ప్రచారానికి కూటమి అగ్రనాయకత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూటమి ఐక్యతపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ఇక వైసీపీ విషయానికి వస్తు.. వైసీపీ, కూటమి మధ్య అంతరం తగ్గుతోందన్న అభిప్రాయం ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని తెలిపింది. కర్నూలు జిల్లాలోనూ కూటమి నాయకులు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజలలో బలంగా వ్యక్తమైందని సర్వే పేర్కొంది.   కూటమి వైఫల్యాలను వైసీపీ నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందన్న విశ్లేషణను సర్వే చేసింది. అయితే ఇది సర్వే సంస్థ అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ ఎన్నికల ఫలితాలను ముందుగానే నిర్ణయించే అంశంగా చూడలేమని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది.  అలాగే స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాట్లే కీలకమని సర్వే పేర్కొంది.   జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుతున్నారని, రోవైపు ఇప్పటికే గ్రామస్థాయిలో తమకు బలమైన పట్టు ఉందని భావిస్తున్న టీడీపీ నాయకులు సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న అభిప్రాయం కూడా ప్రజలలో ఉందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన నాయకత్వం క్షేత్రస్థాయిలో విభేదాలను ముందుగానే పరిష్కరించకపోతే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. గతంలో పరస్పరం పోటీ చేసిన లేదా విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం కూడా కూటమికి కీలక సవాలుగా మారనుందని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వేలో కూటమి ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, పెట్టుబడుల అమలు, జనసేనలో చేరికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం వంటి అంశాలు కీలకంగా మారుతున్నట్లు పేర్కొంది. ఈ అంశాలను కూటమి నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది. [AP Political Survey, Chanakya Strategies Survey, AP Political Survey, Chandrababu, TDP, Janasena, BJP, YCP, AP Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. ఒకవైపు శాసనమండలి ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా..  మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రాజకీయాలను వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా, తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా  ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరి  నిలిచేందుకు సై అంటున్నది. ఈ పరిణామంతో   రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది.  ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.  . ఇక భారతీయ జనతా పార్టీ సైతంఖైరతాబాద్ లో విజయం సాధించి  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఉనికిని చాటుకోవడానికి  శ్రమిస్తోంది. ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.   ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ప్రారంభించాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ బైపోల్‌‌లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఏదో నామ మాత్రపు పోటీ మాదిరిగా కాకుండా.. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని భావిస్తోంది.  ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తగిన అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.   ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉండటమే కాకుండా, అధికారంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తెలంగాణ కు వచ్చే సరికి మాత్రం బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాయి.  ఇదే జరిగితే జనసేన పోటీ బీజీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ (కల్వకుంట్ల కవిత) బరిలో ఉండటం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందేనని చెబుతున్నారు.     [Janasena,  Khairatabad Bypoll, Telangana Politics, Khairatabad Assembly Election, Pawan Kalyan, Danam Nagender Disqualification, Kalvakuntla, Kavita, Trs, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ప్రతి భారతీయుడి ప్రేక్షకుడి  హృదయంలోకి ఎంతగా చొచ్చుకొని పోయిందో, ఆనందిగా చేసిన ప్రత్యుష బెనర్జీ కూడా అంతే స్థాయిలో ప్రతి భారతీయ ప్రేక్షకుడి హృదయంలోకి చొచ్చుకొని పోయింది. కల్మషం లేని ఆ ముగ్ద మనోహర రూపం నేటికీ అభిమానుల మనస్సులో తచ్చాడుతునే ఉందంటే ఎలాంటి అతిశయోక్తి  కాదు. 2016 ఏప్రిల్ 1న ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంట్లో కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ప్రత్యూష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమంటూ ప్రత్యూష తల్లిదండ్రులు బాంగూర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, నటుడు, నిర్మాత అయిన రాహుల్ రాజ్ సింగ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్‌మెంట్ టు సూసైడ్), మానసిక, శారీరక వేధింపులు, దాడి వంటి తీవ్రమైన నేరారోపణలతో ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దాదాపు పదేళ్ల పాటు నడిచిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు తాజాగా అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివకుమార్ జి. దిగే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారించి రాహుల్ రాజ్ సింగ్‌ను ఆత్మహత్య ప్రేరణ కేసు నుండి విముక్తి చేస్తూ (డిశ్చార్జ్) ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దిందోషి సెషన్స్ కోర్టు 2023 ఆగస్టులో రాహుల్ డిశ్చార్జ్ పిటిషన్‌ను తిరస్కరించగా, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2018లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, విచారణ ఎదుర్కొనేందుకు సరిపడా ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ముఖ్యంగా ప్రత్యూష ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు వారిద్దరి మధ్య జరిగిన చివరి టెలిఫోన్ సంభాషణ రికార్డింగ్‌ను కీలక ఆధారంగా పరిగణించింది. ఆ సంభాషణలో రాహుల్ రాజ్ సింగ్ ఆమెను ఎలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోకుండా నిరోధించడానికి ప్రయత్నించడం, తాను కారును యూ-టర్న్ తీసుకుని ఆమె వద్దకు వెంటనే వస్తున్నానని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోందని సీనియర్ అడ్వకేట్ ఆబాద్ పోండా, శ్రేయాన్స్ మిథారే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంభాషణ ఆధారంగా ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాలనే ఉద్దేశం (క్రిమినల్ ఇంటెంట్) రాహుల్‌కు ఎంతమాత్రం లేదని, పైగా ఆమె ప్రాణాలను కాపాడేందుకే ప్రయత్నించాడని న్యాయస్థానం నిర్ధారించింది. అంతేకాకుండా, ఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆత్మహత్య నోట్ లభించకపోవడం, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని డిఫెన్స్ లాయర్లు ఎత్తిచూపారు. వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రత్యూష బెనర్జీ కేసులో జస్టిస్ శివకుమార్ డిగే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఈసారి, ఆయన ఒక సాక్ష్యాన్ని కోర్టు ముందు పెట్టారు. ఏప్రిల్ 1, 2026న, గోరేగావ్‌లోని ఒక అద్దె ఇంట్లో ప్రత్యూష తీవ్ర నిర్ణయం తీసుకుంది. కానీ అంతకు ముందే, ఆమె రాహుల్‌తో తన చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడింది. అందులో ప్రత్యుష మాట్లాడుతూ తన మానసిక స్థితి బాగాలేదని చెప్పింది. అంతేకాకుండా తన పరిస్థితికి కారణం కేవలం ఒక్కరు కాదని.. తన తల్లిదండ్రులతోపాటు అందరినీ నిందించింది ప్రత్యూష. అప్పుడే రాహుల్ ఆమెతో మాట్లాడుతూ.. “అలాంటిదేమీ చేయకు, నేను వస్తున్నాను…” అంటూ చెప్పాడు. కానీ అంతలోనే ప్రత్యూష ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చదవండి:ఆ మూవీపై 'ధమాకా' డైరెక్టర్ త్రినాథరావు సంచలన వ్యాఖ్యలు: అన్నం పెట్టిన సంగతి మర్చిపోవద్దు.     అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, చివరి క్షణంలో ప్రత్యూష ‘మార్కే భీ మాహీ తుఝ్సే ముహ్ నా మోడ్నా…’ ( “నా ప్రాణం పోయినా సరే నా ప్రియతమా… నీ నుండి నా ముఖాన్ని తిప్పుకోను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను” అని అర్థం. చావు కూడా తమను విడదీయలేనంత గాఢమైన ప్రేమను మరియు ఎప్పటికీ తోడుంటానని అర్థం) అని సోషల్ మీడియాలో స్టేటస్ పోస్ట్ చేసి సూసైడ్ చేసుకుంది. చివరకి  రాహుల్ సింగ్ ఈ కేసు నుండి విడుదలయ్యాడు.    [Pratyusha Banerjee Case Update, Pratyusha Banerjee suicide case rahul raj singh discharged, Pratyusha Banerjee, Rahul Raj Singh, Bombay High Court verdict,telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
  తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ప్రేమకథలు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ ఒకటి. 1989లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గానే ఉంది. ఇప్పుడు ఈ ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. నాగార్జున అభిమానులకు, మణిరత్నం సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్ చెబుతూ ‘గీతాంజలి’ రీరిలీజ్‌కు కొత్త తేదీ లాక్ అయింది. నవంబర్ 13న ఈ క్లాసిక్‌ను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. గతంలో రీరిలీజ్ ప్లాన్ చేసి వాయిదా వేయడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 28న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘గీతాంజలి’ని 4K వెర్షన్‌లో రీరిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. అయితే ఆ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు నవంబర్ 13న కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మరింత మెరుగైన పిక్చర్ క్వాలిటీ, రిచ్ కలర్స్, ఇంప్రూవ్డ్ సౌండ్‌తో 4K వెర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతాంజలి’లో నాగార్జున, గిరిజ జంటగా నటించారు. అనారోగ్యంతో పోరాడుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టే ప్రేమను ఎంతో కవితాత్మకంగా మణిరత్నం తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాకు మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ‘ఓ ప్రియా ప్రియా’, ‘జల్లంత కవ్వింత’, ‘ఆమని పాడవే హాయిగా’ వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్‌కు ఫేవరెట్‌గానే ఉన్నాయి. 4K రీరిలీజ్‌తో ఈ పాటలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం దక్కనుంది. మొత్తానికి దాదాపు 37 ఏళ్ల తర్వాత కూడా ‘గీతాంజలి’పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పటి ప్రేక్షకులకు నాస్టాల్జియాను గుర్తు చేయడంతో పాటు.. కొత్త తరానికి ఈ క్లాసిక్ లవ్‌స్టోరీని బిగ్ స్క్రీన్‌పై చూపించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: చిన్నప్పటి ‘చిట్టి నాయుడు’.. ఇప్పుడు రియల్ లైఫ్ డాక్టర్.!       [Geethanjali Movie Re Release Date, Geethanjali Re Release, Geethanjali 4K Release, Geethanjali Movie, Akkineni Nagarjuna, Maniratnam Telugu Movie, Telugu Love Stories, Telugu Film News]  
The CBFC’s decision to cut intimate portions from Verity, starring Anne Hathaway and Dakota Johnson, has once again triggered a debate on India’s film certification rules. The Hollywood thriller has been awarded an ‘A’ certificate for its Indian release, but around 23 seconds of intimate footage, including portions of a make-out sequence, have reportedly been removed. The cuts have not gone down well with a section of younger viewers on social media, with Gen-Z audiences questioning the logic behind censoring intimate content even after a film has been restricted to adults. Similar criticism was visible around Hollywood releases such as Oppenheimer and Superman, where discussions over cuts and certification brought renewed attention to how films are treated by the Indian censoring system. The frustration also extends beyond intimate scenes. Social-media users have questioned why films can face scrutiny over kissing or sexual content while violent and gory action sequences are often allowed with an A certificate, and why Hindi film songs featuring suggestive content are permitted on screen while intimate scenes in Hollywood films continue to attract cuts. Another recurring argument is that instead of removing content from A-rated films, stronger age restrictions should be enforced to prevent minors from accessing them. With Verity becoming the latest example, the larger question being raised by younger audiences is whether an ‘A’ certificate should simply restrict access to adults, rather than allowing further censorship of content meant specifically for them. The debate reflects a growing demand for clearer and more consistent standards in how adult content is handled in Indian theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నాచురల్ స్టార్ నానితో 'నేను లోకల్', మాస్ మహారాజా రవితేజతో ధమాకా వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి సినీ ప్రేమికుల మైండ్ లో వాంటెడ్ డైరెక్టర్ గానే తిష్ట వేసాడు త్రినాథరావు నక్కిన. ఈసారి కేవలం మెగాఫోన్ పట్టుకోవడానికే పరిమితం కాకుండా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న 'అనకాపల్లి' చిత్రానికి త్రినాథరావు నక్కిన స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా మారాడు. అయితే, ఒక సినిమాను తెరకెక్కించే ప్రక్రియ కంటే దాన్ని బాక్సాఫీస్ వద్దకి ముఖ్యంగా థియేటర్ల దాకా సురక్షితంగా తీసుకురావడమే అత్యంత కష్టమైన పని అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా మేకింగ్ లో దర్శకుడిగా కొన్ని వందల మందిని నడిపించడం ఒక ఎత్తయితే, ఒక ప్రొడ్యూసర్ గా ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి థియేట్రికల్ రిలీజ్ వరకూ తీసుకురావడం పూర్తి భిన్నమైన అనుభవమని ఆయన స్పష్టం చేశారు. కేవలం కెమెరా వెనుక నిలబడి యాక్షన్, కట్ చెప్పడం వల్ల ప్రొడక్షన్ లో ఎదురయ్యే నిజమైన సవాళ్లు అర్థం కావు. కానీ నిర్మాతగా ప్రతీ పైసా లెక్కచూసుకుంటూ, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ, థియేటర్ల కేటాయింపు మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తో చర్చలు జరపడం అనేది ఒక పెద్ద పోరాటంతో సమానమని త్రినాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ 'అనకాపల్లి' చిత్రం వెనుక తన టీమ్ పడిన శ్రమను, ఎదుర్కొన్న ప్రొడక్షన్ సవాళ్లను ఆయన మీడియా ముందు ఎంతో ఓపెన్ గా వెల్లడించారు. ఒక కల్ట్ విలేజ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ లవ్ డ్రామాగా తీర్చిదిద్దిన ఈ సినిమాలో సాంకేతిక నైపుణ్యంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో తాము పడిన కష్టాలు సినిమా అవుట్‌పుట్ చూశాక మర్చిపోయామని ఆయన వెల్లడించారు. అనకాపల్లి పట్టణ నేపథ్యం, అక్కడి ప్రముఖ బెల్లం మార్కెట్ వైబ్స్, నూకాంబిక అమ్మవారి దేవాలయ విశేషాలు మరియు గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలు ఈ కథకు ప్రాణవాయువుగా నిలిచాయని తెలిపారు. దర్శకుడు ఖగేష్ కథను ఎంతో సహజంగా, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్సెస్ తో మరియు వినసొంపైన మ్యూజిక్ తో తీర్చిదిద్దారని ప్రశంసించారు. సినిమా మేకింగ్ దశలో ఉన్నప్పుడు రోజుకు కనీసం 14 నుంచి 16 గంటలు కష్టపడాల్సి వచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ మరియు థియేట్రికల్ రన్ ప్లానింగ్ కోసం 100 శాతానికి పైగా శ్రమించామని వివరించారు. ముఖ్యంగా చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో దాదాపు 70 శాతం వరకూ డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదురవుతాయని, వాటిని అధిగమించి అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని పేర్కొన్నారు.  ఇది కూడా చదవండి:  అది మాత్రం నో అంటున్న భామలు : ఆ సుఖం బాగా రుచి మరిగేనా!      ఒక వైపు దర్శకత్వ బాధ్యతలు నెరవేరుస్తూనే, మరోవైపు నిర్మాతగా సినిమాని ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడం అనేది సినిమా పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమతోనే సాధ్యమైందని త్రినాథరావు నక్కిన స్పష్టం చేశారు. యువ నటుడు విక్రమ్ సహిదేవ్ నటించిన ఈ చిత్రంలో త్రినాథరావు నక్కిన ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలో కూడా కనిపించి మెప్పించనుండటం విశేషం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసి ఆదరించినప్పుడే ఒక నిర్మాత పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన కోరారు. ఏది ఏమైనా నిర్మాతగా మారి తిండి పెట్టిన సినిమాకి న్యాయం చేస్తున్నాడని చెప్పవచ్చు.   [Trinadha Rao Nakkina Producer Struggles At Anakapall Movie, Trinadha Rao Nakkina, Anakapalli Movie Release, Vikram Sahidev, Khagesh Tammineni, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
'రెడీ' సినిమాలో 'చిట్టి నాయుడు'గా మాస్టర్ భరత్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. 'రెడీ'నే కాదు.. 'వెంకీ', 'ఢీ', 'కింగ్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన భరత్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పుడు రీల్ లైఫ్‌లో అల్లరి పిల్లవాడిగా మనల్ని ఎంతగానో అలరించిన చిట్టి నాయుడు.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో డాక్టర్‌గా మారి స్టెతస్కోప్ చేతపట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మాస్టర్ భరత్ చేసిన ఎన్నో కామెడీ రోల్స్ టాలీవుడ్ హిస్టరీలోనే నిలిచిపోతాయి. చిన్న వయసులోనే ఏకంగా 80కి పైగా సినిమాల్లో నటించి, స్టార్ హీరోలకు సమానంగా థియేటర్లలో విపరీతమైన నవ్వుల పంట పండించారు. భరత్ కోసమే కొన్ని సినిమాలు రిపీటెడ్ గా చూసిన ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల చప్పట్లే కాదు.. రెండు నంది అవార్డులు కూడా భరత్ గెలుచుకున్నారు. అయితే, ఒక వైపు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్రేజ్, వరుస ఆఫర్లు, స్టార్‌డమ్ తలుపు తడుతున్న సమయంలో.. భరత్ ఒక బిగ్ అండ్ డిఫికల్ట్ డెసిషన్ తీసుకున్నారు. గ్లామర్ వరల్డ్, అవార్డులు, చప్పట్లు.. వీటన్నింటినీ పక్కన పెట్టి, తన చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమాలకు కొంతకాలం పూర్తిగా దూరమై, రాత్రింబవళ్లు కష్టపడి చదివి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన వైద్య రంగంలో తన సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. డాక్టర్‌గా పట్టా అందుకొని, ప్రజలకు సేవ చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఒక వైపు చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్ చూసి, మళ్లీ దాన్ని పక్కన పెట్టి, మెడికల్ సీట్ సంపాదించి డాక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత, కష్టం కావాలి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, టాలీవుడ్ అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అప్పట్లో తన నటనతో ప్రతీ ఇంట్లో నవ్వులు పూయించిన భరత్.. ఇప్పుడు డాక్టర్‌గా మారి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది" అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: ది ఇండియా స్టోరీ.. ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ.!       [Master Bharath Inspiring Journey, Master Bharath Doctor, Master Bharath Career Change, Ready Chitti Naaidu, Master Bharath Movies, Master Bharath Comedy, Master Bharath Story, Child Artist Bharath, Telugu Film News]  
కాజల్ అగర్వాల్ నుంచి ఈ ఏడాది వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’. థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి తాజాగా తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మించారు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించాయి.  జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ‘ది ఇండియా స్టోరీ’.. మొదట హిందీ భాషలోనే విడుదలైంది. సినిమా కథాంశం కారణంగా విడుదలకు ముందు నుంచే చర్చకు వచ్చింది. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వినియోగం, ఆహార కల్తీ, వాటి వల్ల ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావం వంటి అంశాలను కథలో ప్రస్తావించారు.  కథ విషయానికి వస్తే.. సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన యోగేష్ పాటిల్ తన చిన్న కుమార్తె క్యాన్సర్‌తో చనిపోవడంతో షాక్‌కు గురవుతాడు. తన కుమార్తె అనారోగ్యానికి వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలే కారణమని అనుమానిస్తాడు. దీంతో ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ పోరాటంలో అతడికి లాయర్ అర్చనా అండగా నిలుస్తుంది. ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించింది. పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీలు, కల్తీ వ్యవహారాలపై వీరిద్దరూ న్యాయపోరాటం చేయడం.. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలే సినిమా ప్రధాన కథ. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్ స్టార్ లో ‘ది ఇండియా స్టోరీ’ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా సెప్టెంబర్ 30 నుంచి తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇక ఓటీటీలోకి రావడంతో కాజల్ అభిమానులకు ఈ సినిమాను తెలుగులో చూసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా కాజల్ ఇందులో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా లాయర్ పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఆగిపోయిన నివిన్ పౌలీ 'సంచారి' రిలీజ్.. కారణం తెలిస్తే షాకవుతారు.!       [The India Story Telugu OTT Release, Kajal India Story Movie, The India Story OTT, Kajal Aggarwal, The India Story Movie, Kajal New Movie, Telugu OTT Movies, Telugu Film News]  
పెళ్లంటే..పందిళ్లు, చప్పట్లు, తాళాలు, మేళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు.. ఈ వేద మంత్రాలు తమ కోసమే మొగాలని కోరుకొని వారంటు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి హీరోయిన్స్  కి కూడా ఆ ఆశ ఉంటుందనేది నిజం. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కథానాయికలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసేవారు.  కానీ మారుతున్న కాలంతో పాటు సమాజంలో, అలాగే సినీ వర్గాల్లో మహిళల ఆలోచనా విధానంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. నేటి తరం నటీమణులు పెళ్లి పట్ల తమకున్న వ్యక్తిగత దృక్పథాన్ని చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు. సినీ రంగానికి చెందిన చాలా మంది సౌత్ హీరోయిన్లు వివాహ బంధానికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత కాళ్లపై నిలబడటం, వృత్తిపరమైన స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యత ఇస్తూ చాలా మంది భామలు వివాహ వ్యవస్థకు స్పష్టంగా "నో" అని చెప్తున్నారు.   తాజాగా నటి అంజలి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి. "కేవలం నా స్నేహితులు, సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల ఆనందం కోసం నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది?" అని అంజలి చాలా సూటిగా ప్రశ్నించింది. పెళ్లి అయిన కొత్తలో అందరూ చుట్టూ ఉన్నా, కాలక్రమంలో ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోతారని, చివరకు తాను ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఆమె సరదాగా చెబుతూనే నిత్యసత్యాన్ని వ్యాఖ్యానించింది. తన ఇంట్లో కూడా ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదని, ప్రస్తుతం తానెంతో సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది.   కేవలం అంజలి మాత్రమే కాదు, మరో ప్రముఖ నటి శ్రుతిహాసన్ కూడా పెళ్లి పట్ల తన వైఖరిని గతంలోనే ఓపెన్‌‌గా వెల్లడించింది.  తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, కానీ సాంప్రదాయ పెళ్లి బంధంపై మాత్రం అసలు ఆసక్తి లేదని కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ తెగేసి చెప్పింది. అసలు పెళ్లి అనే ఒక చట్టబద్ధమైన ముద్ర లేకుండానే ఒక జీవిత భాగస్వామితో కలిసి హాయిగా, సంతోషంగా జీవించవచ్చని ఆమె అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే శ్రుతిహాసన్ వ్యాఖ్యలు నేటి ఆధునిక ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయి.   మరో వైపు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మీ మీనన్ కూడా పెళ్లికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసుకోవడం మాత్రమే ఒక వ్యక్తికి పరిపూర్ణమైన లేదా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం తనకు లేదని లక్ష్మీ మీనన్ తేల్చి చెప్పింది. ఈ విషయంపై తనకు కొంతకాలం క్రితమే స్పష్టమైన అవగాహన వచ్చిందని, భవిష్యత్తులో కూడా పెళ్లి విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె పునరుద్ఘాటించింది.   ఇక సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికలుగా ఏలుతున్న అనుష్క శెట్టి, త్రిష, నిత్యామీనన్ వంటి నటీమణులు కూడా ప్రస్తుతం వివాహ బంధానికి దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా జాతీయ అవార్డు గ్రహీత నిత్యామీనన్ ఒంటరి జీవితమే తనకు ఎనలేని సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తోందని ఇప్పటికే అనేక వేదికలపై బహిరంగంగానే చెప్పింది. వయసు పెరుగుతోందనో, సమాజం ఒత్తిడి తెస్తోందనో పెళ్లిళ్లు చేసుకోకుండా, తమ జీవితంపై పూర్తి నియంత్రణ సాధిస్తూ తమకు నచ్చిన రీతిలోనే వీరంతా జీవిస్తున్నారు. ఒకపక్క స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులలో నటిస్తూ, మరోపక్క సోలో లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ భామల స్టాండ్ సినీ వర్గాల్లోనూ, ఫ్యాన్స్‌లోను నయా ట్రెండ్‌గా మారుతోంది. దీంతో సోలోగా అందమైన లైఫ్ అనుభవిస్తున్న సినీ టైంని ఎంజాయ్ చేయడానికే అనే మాటలు సినీ ప్రియుల నుంచి వినపడుతున్నాయి.   [Film Actresses Saying No Marriage South, Anushka, Trisha, anjali, Shruthi Haasan, Nithya Menon, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
'బెత్లెహెం కుటుంబ యూనిట్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మలయాళ స్టార్ నివిన్ పౌలీ నుంచి వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ తమిళ్ మూవీ 'ఏళు కడల్ ఏళు మలై'. తమిళ దర్శకుడు రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోలీవుడ్ యాక్టర్ సూరి ఒక కీలక పాత్రలో నటించగా, అంజలి హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ఒరిజినల్ వెర్షన్‌తో పాటు అక్టోబర్ 1న తెలుగులో కూడా 'సంచారి' టైటిల్‌తో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, చివరి నిమిషంలో తెలుగు వెర్షన్ రిలీజ్‌ కి బ్రేక్ పడింది. తెలుగు టైటిల్ వివాదం కారణంగానే ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు. 'సంచారి' టైటిల్ తో టాలీవుడ్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ ఓ మూవీ ప్లాన్ చేశారు. టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే ఇప్పుడు అదే టైటిల్ ను 'ఏళు కడల్ ఏళు మలై' తెలుగు వెర్షన్ కి పెట్టడంతో వివాదం అయినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలోనే నివిన్ పౌలీ 'సంచారి' విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం మేకర్స్ ఈ టైటిల్ ఇష్యూను త్వరగా పరిష్కరించే పనిలో ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్‌ను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది. మరి చంద్ర సిద్ధార్థ్ తో టైటిల్ సమస్యను పరిష్కరించుకుంటారా? లేక కొత్త టైటిల్ తో వస్తారా? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఎమోషనల్ రివ్యూ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఎలా ఉందంటే.?     [Sanchari Release Postponed, Nivin Pauly Sanchari Telugu Release, Sanchari Movie Title Issue, Yezhu Kadal Yezhu Malai Telugu, Nivin Pauly New Movie, Bethlehem Kudumba Unit, Soori New Movie, Telugu Film News]  
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో కార్తికేయ నిర్మాతగా వస్తున్న మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఫహాద్ ఫాజిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే, తాజాగా ఈ మూవీ స్పెషల్ షో చూసిన మహేష్ బాబు.. తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇస్తూ, ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన స్టైల్ లో రివ్యూ ఇచ్చేశాడు.  'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా చూసిన తర్వాత తారక్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఈ సినిమా ప్రతి చిన్నారికి, ప్రతి తల్లిదండ్రులకు.. అలాగే ఇప్పటికీ తమ మనసులో ఆ చిన్నతనాన్ని దాచుకున్న ప్రతి ఒక్కరికీ అంకితం" అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. సినిమాలో హీరోగా నటించిన ఫహాద్ ఫాజిల్ నటన గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. 'సూరి' పాత్రలో ఫహాద్ గారు ఇచ్చిన పెర్ఫార్మన్స్ చూసి నేను నిజంగా ఫిదా అయిపోయాను. ప్రతీ ఫ్రేమ్‌లోకి ఆయన ప్రాణం పోసిన తీరు నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్ర దర్శకుడు శశాంక్ గురించి మాట్లాడుతూ, "తమ్ముడూ.. నీ మొదటి సినిమాతోనే ఎంత అద్భుతమైన కథని, ఎంత స్పష్టతతో, ప్రేమతో తెరకెక్కించావో!" అంటూ అభినందించారు. పిల్లలు, కుటుంబాల మధ్య ఉండే స్వచ్ఛమైన భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం అందరికీ సాధ్యం కాదు, కానీ శశాంక్ దాన్ని చాలా అందంగా ఆవిష్కరించాడని, ముందు ముందు అతనికి మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు. ఈ సినిమాలో నటించిన చిన్నారి సారా గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతాయి. "లిటిల్ సారా.. నువ్వు నా మనసు దోచేసావ్. న్యాచురల్‌గా యాక్ట్ చేశావ్. సినిమా అయిపోయిన తర్వాత కూడా నీ అమాయకత్వం, నీ నటన మనసులోనే ఉండిపోతుంది" అని ఎన్టీఆర్ అన్నారు. అలాగే కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌‌కి తీసుకెళ్ళిందని, ప్రతీ సీన్‌లోని ఎమోషన్‌ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఒక ముక్కలో చెప్పాలంటే, "చాలా కాలం తర్వాత ఒక పక్కా ఫ్యామిలీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు నా హృదయాన్ని బలంగా తాకాయి, ఆ ఇంపాక్ట్ నుండి నేను ఇంకా బయటపడలేదు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మాస్టర్ పీస్" అని ఎన్టీఆర్ అన్నారు. చివరగా కార్తికేయకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, "నాన్నా.. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, అక్టోబర్ 2న ఈ మ్యాజిక్ ప్రపంచమంతా చూడబోతోంది" అంటూ పోస్ట్ ముగించారు. ఇది కూడా చదవండి: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. మహేష్ బాబు మెచ్చిన మూవీ.! https://x.com/tarak9999/status/2105327119438155798       [Don't Trouble The Trouble Review By NTR, Dont Trouble The Trouble Movie Review, Dont Trouble The Trouble Review Telugu, Don't Trouble The Trouble, Jr NTR, SS Kartikeya, SS Rajamouli, Fahadh Faasil, Mahesh Babu, Telugu Film News]  
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ నుంచి మరో పాట వచ్చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘బిందాస్’ అనే నాలుగో సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘బిందాస్’ పాటకు అనిరుధ్ రవిచందర్, దీప్తి సురేష్ కలిసి గాత్రం అందించారు. శ్రీ‌నివాస మౌళి లిరిక్స్ రాశారు. ఫుల్ ఎనర్జీతో సాగే ఈ పాటలో నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో అలరించారు. విభిన్నమైన సెట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లు, పిల్లలతో కూడిన విజువల్స్‌తో లిరికల్ వీడియోను రూపొందించారు. పాటలో తమిళ లిరిక్స్‌తో పాటు హిందీ పదాలు కూడా వినిపించడం ప్రత్యేకంగా ఉంది. ఇదిలా ఉంటే.. ‘బిందాస్’ పాట నోరా ఫతేహికి తమిళ సినిమాల్లో ప్రత్యేకమైన ఎంట్రీని ఇస్తోంది. గతంలో వివిధ భాషల్లో స్పెషల్ డ్యాన్స్ నంబర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు రజనీకాంత్ ‘జైలర్ 2’లో ఈ ప్రత్యేక పాటతో తమిళ ప్రేక్షకులను పలకరించనున్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’లో తమన్నా భాటియా నటించిన ‘కావాలా’ పాట ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. దీంతో ‘బిందాస్’పై కూడా సహజంగానే ఆసక్తి పెరిగింది. మరోవైపు.. ‘జైలర్ 2’లో మొత్తం 12 పాటలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని పాటలను విడుదల చేసిన మేకర్స్.. పూర్తి ఆల్బమ్‌ను ప్రత్యేకమైన మ్యూజిక్ ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అక్టోబర్ 2న చెన్నైలో భారీ స్థాయిలో ఆడియో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా తదితరులు తమ పాత్రలను కొనసాగిస్తుండగా.. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఎస్‌.జే. సూర్య, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మొత్తంగా.. ‘కావాలా’ తరహాలో మరో స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో ‘జైలర్ 2’ టీమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నోరా ఫతేహి ‘బిందాస్’ పాటకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.     [Jailer 2 Bindaas Song, Jailer 2 Bindaas Lyrical Video, Rajinikanth Jailer 2, Nora Fatehi Jailer 2, Nora Fatehi Bindaas Song, Anirudh Ravichander, Nelson Dilipkumar, Jailer 2 Songs, Rajinikanth New Movie, Jailer 2 Release Date, Jailer 2 October 15, Tamil Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన పూర్వీకులు 80 నుండి 90 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా, చలాకీగా తమ పనులు తామే చేసుకుంటూ జీవించేవారు. వారు అంతటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ముఖ్యమైన కారణం మన సాంప్రదాయ ఆయుర్వేద విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా పొలం గట్లపై, ఇంటి చుట్టుపక్కల దొరికే ప్రకృతి ప్రసాదిత ఆకుకూరలను రోజూవారి వంటకాల్లో భాగంగా పప్పు, పచ్చడి రూపంలో తీసుకునేవారు. అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ప్రధానమైనది తెల్ల గలిజేరు . సాధారణంగా చూసేందుకు పొలాల్లో ఏదో పిచ్చిమొక్కలా కనిపిస్తున్నప్పటికీ, ఆయుర్వేద వైద్యంలో దీనిని  పునర్నవ అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. శాస్త్రీయంగా బోరేవియా డిఫ్యూసా (Boerhavia diffusa) అని పిలిచే ఈ మొక్క పేరులోని  పునః  అంటే మళ్లీ,  నవ  అంటే కొత్తగా అని అర్థం. అంటే పాడైపోయిన శరీర కణాలకు మరియు ముఖ్యమైన అవయవాలకు మళ్లీ కొత్త జీవాన్ని పోసి పునరుజ్జీవింపజేసే గొప్ప శక్తి ఈ తెల్ల గలిజేరుకు ఉంది. వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, తెల్ల గలిజేరు సుమారు 350కి పైగా రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు మూత్రనాళ సమస్యలకు ఒక దివ్యౌషధంగా లేదా సంజీవనిగా పనిచేస్తుంది. ఆధునిక కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), యూరియా మరియు క్రియాటినిన్ స్థాయిలు పెరగడం, శరీరంలో విపరీతంగా నీరు చేరి వాపులు రావడం వంటి తీవ్రమైన సమస్యలకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. తెల్ల గలిజేరులో విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం, ఐరన్ తో పాటు పొటాషియం నైట్రేట్ మరియు హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత కీలకమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును సమతుల్యం చేసి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరును మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పచ్చడి రూపంలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీకి 3 కప్పుల శుభ్రం చేసిన తెల్ల గలిజేరు ఆకులు, పావు కప్పు వేరుశనగ గుళ్లు (పల్లీలు), 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల ధనియాలు, పావు చెంచా మిరియాలు, నిమ్మకాయ పరిమాణమంత చింతపండు, చిటికెడు ఇంగువ, 6 వెల్లుల్లి రెబ్బలు మరియు తగినంత ఉప్పు, నూనె అవసరమవుతాయి. తయారీ విధానంలో భాగంగా ముందుగా గలిజేరు ఆకులను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్లు, మిరియాలను దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో బరకగా పొడి చేసిన తర్వాత, అందులో గలిజేరు ఆకులు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కొద్దిగా నీటితో మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువతో నూనెలో తాలింపు వేస్తే నోరూరించే తెల్ల గలిజేరు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ తెల్ల గలిజేరు పచ్చడి సుమారు 4 రోజుల పాటు చెక్కుచెదరకుండా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ పచ్చడిని లేదా ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, ఐరన్ మరియు శక్తివంతమైన మూలికా ప్రభావం ఎక్కువగా ఉండే తెల్ల గలిజేరును గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోకూడదు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని వాడటం శ్రేయస్కరం. ఈ సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.     Learn how to make Tella Galijeru (White Punarnava) leaves chutney, an ancient Ayurvedic natural remedy known for supporting kidney health and boosting immunity.
భారతీయ వంటకాల్లోనూ, సాంప్రదాయ గృహ వైద్యంలోనూ వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. చాలామంది రాత్రి వేళల్లో శ్వాస సరిగ్గా ఆడటానికి, శ్వాసనాళాలు శుభ్రపడటానికి లేదా ప్రశాంతమైన నిద్ర కోసం వెల్లుల్లిని తినడం లేదా దిండు కింద పెట్టుకోవడం వంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే, నిద్రపోతున్న సమయంలో వెల్లుల్లి ఘాటైన వాసన శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందనే వాదనను బలంగా నిర్ధారించే ఎలాంటి ప్రత్యక్ష మానవ వైద్య ఆధారాలు (Human Clinical Trials) ప్రస్తుతం లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లికి వచ్చే ప్రత్యేకమైన ఘాటైన వాసనకు మరియు రుచికి అందులోని  అల్లిసిన్  (Allicin) అనే శక్తివంతమైన సమ్మేళనం ప్రధాన కారణం. వెల్లుల్లి రెబ్బలను కోసినప్పుడు, నలిపినప్పుడు లేదా మెత్తగా చేసినప్పుడు ఈ అల్లిసిన్ ఏర్పడుతుంది. ప్రయోగశాల (Laboratory) స్థాయిలో జరిగిన అధ్యయనాలలో అల్లిసిన్‌కు అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఉపాధి, వాపు నిరోధక) లక్షణాలు ఉన్నట్లు తేలింది. అల్లిసిన్ కలిగిన వెల్లుల్లి సప్లిమెంట్లను వాడిన ఒక చిన్న అధ్యయనంలో జలుబు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ, ఈ ప్రయోగశాల ఫలితాలను నేరుగా మనుషులలో నిద్ర సమయంలో శ్వాస మెరుగుపడటానికి అన్వయించలేమని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అనేకమంది భావిస్తున్నట్లుగా వెల్లుల్లి తినడం లేదా దాని వాసన పీల్చడం ద్వారా రాత్రివేళ శ్వాసనాళాలు శుభ్రపడి గురక, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెప్పడానికి అందుబాటులో ఉన్న ఆధారం చాలా పరిమితం. అందువల్ల ఆస్తమా, గురక, స్లీప్ అప్నియా (Sleep Apnea) వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లిని ఒక ప్రాథమిక వైద్య చికిత్సగా భావించడం ఎంతమాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెల్లుల్లిని సాధారణ ఆహారంలో భాగంగా పప్పులు, కూరలు, సూప్‌లలో పరిమిత మోతాదులో (రోజుకు 1,2 రెబ్బలు) తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ నిద్రలో ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా విపరీతమైన గురక వంటి సమస్యలు ఉన్నవారు సొంత వైద్యంపై ఆధారపడకుండా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.     Eating garlic before bed health effects, garlic and sleep apnea breathing, nighttime raw garlic benefits risks, garlic before sleep breathing issues, garlic side effects at night.
మన రోజువారీ బిజీ జీవితంలో ఉదయాన్నే తాగే వేడివేడి టీ, కాఫీల నుంచి మొదలుకొని మైండ్ రిలాక్స్ కోసం తినే స్వీట్లు, కేకులు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ వరకు తెలియకుండానే పెద్ద మొత్తంలో కృత్రిమ చక్కెరలు మన శరీరంలోకి చేరుతున్నాయి. ఆహార పదార్థాలకు రుచిని అందించే ఈ తీపి పదార్థాలు శరీర బరువును విపరీతంగా పెంచడమే కాకుండా, భయంకరమైన డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీంతో విసిగిపోయిన చాలామంది ఇకపై జీవితంలో అసలు పంచదారే ముట్టుకోకూడదు అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే, చక్కెరను పూర్తిగా మానడం నిజంగానే ఆరోగ్యానికి సురక్షితమేనా? అసలు కృత్రిమ పంచదారను ఆపేస్తే మన శరీరంలో ఎలాంటి ముఖ్యమైన ఆరోగ్య మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలపై చెన్నైకి చెందిన ప్రముఖ ఎస్‌ఆర్‌ఎమ్ (SRM) గ్లోబల్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ ఫిజీషియన్ డాక్టర్ హరిత సెంథిల్ వేల్ స్పష్టమైన శాస్త్రీయ వివరాలను అందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకాయం మరియు బరువు పెరిగే సమస్యలకు మనం తీసుకునే అధిక ప్రాసెస్డ్ కృత్రిమ చక్కెరలే మూలకారణం. అందుకే, మనం నిత్యం తీసుకునే టీ, కాఫీలు, స్వీట్లు మరియు బాటిల్ కూల్‌డ్రింక్స్‌లో అదనంగా కలిపే పంచదారను నిరోధించడం లేదా తగ్గించడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. వీటిని బంద్ చేయడం ద్వారా రోజువారీ కేలరీల వినియోగం గణనీయంగా తగ్గి, బరువు చాలా వేగంగా అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గి, ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. ఫలితంగా మెటబాలిజమ్ శక్తివంతమై డయాబెటిస్, గుండెజబ్బుల ప్రమాదం నుంచి శరీరం రక్షణ పొందుతుంది. అయితే, చక్కెరను మానడం అంటే పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ వంటి సహజసిద్ధమైన తీపిని కూడా ఆపేయడం కాదు. కూల్‌డ్రింక్స్, బేకరీ పదార్థాలలో ఉండే రిఫైన్డ్ చక్కెరను మానడం చాలా మంచిదే అయినప్పటికీ, యాపిల్స్, అరటి వంటి పండ్లను పూర్తిగా మానేయడం అస్సలు సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పండ్లను తినడం ఆపేస్తే శరీరానికి అత్యంతావసరమైన ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్లు లోపించి మలబద్ధకం వంటి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. ఇక సాధారణంగా తీపి పదార్థాలు తిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా గగనానికి పెరిగి, మళ్లీ అంతే వేగంగా పడిపోవడం వల్ల తీవ్రమైన నీరసం ఆవరిస్తుంది. అదే కృత్రిమ పంచదారను తగ్గించి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటే రోజంతా శరీరానికి నిలకడైన, స్థిరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు, పిసిఓడి (PCOS) సమస్యతో బాధపడే మహిళలు, అధిక బరువు ఉన్న పిల్లలు, గర్భిణులు మరియు గుండెజబ్బుల ప్రమాదం ఉన్నవారు తమ ఆహారంలో చక్కెర వినియోగాన్ని ఖచ్చితంగా కఠినమైన నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం, ఒక మనిషి రోజువారీగా తీసుకునే మొత్తం కేలరీలలో చక్కెర వాటా 10 శాతం కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇది రోజుకు సుమారు 50 గ్రాములు లేదా 12 టీస్పూన్లకు మించకూడదు. ఒకవేళ ఈ మోతాదును 5 శాతానికి అంటే కేవలం 6 టీస్పూన్లకు తగ్గించుకోగలిగితే శరీరానికి మరింత అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. ఆహారంలో పంచదారను సున్నాకి తగ్గించాల్సిన అవసరం లేదు; కాఫీ, టీలలో చక్కెర పరిమాణాన్ని తగ్గించుకుంటూ, ప్రాసెస్ చేసిన తినుబండారాలకు దూరంగా ఉంటూ, రోజూ పండ్లు, కూరగాయలను సమృద్ధిగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.     Curious about what happens to your body when you quit sugar completely? Discover expert insights on weight loss, energy shifts, skin health, and sugar withdrawal.
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పీచు పదార్థాలు, విటమిన్లు, అలాగే జీర్ణక్రియకు దోహదపడే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎంతో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని తినే విధానం సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే అటువంటి కొన్ని ఆహార కలయికల గురించి వివరంగా తెలుసుకుంటే.. పాలు , డైరీ ఉత్పత్తులు.. చాలామంది పండ్లతో పాటు పాలు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది పండ్లతో మిల్క్ షేక్ తీసుకోవడానికే ఇష్టపడతారు.  కానీ బొప్పాయిని పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నప్పుడు అందులోని ఎంజైములు రియాక్షన్ జరిపి కడుపులో గ్యాస్, యాసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. జీర్ణవ్యవస్థపై ఇది తీవ్రమైన భారాన్ని పెంచి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు.. బొప్పాయిలోని ఎంజైములు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయగలవు. అయితే మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు వంటి అధిక ప్రోటీన్ కలిగిన భారీ ఆహారాలతో బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో తేడా జరుగుతుంది.  కాబట్టి బొప్పాయిని ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారంతో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం. నూనెలో వేయించిన పదార్థాలు.. బొప్పాయి వేగంగా అరిగిపోయే గుణం కలిగి ఉండే పండు, కానీ వేపుళ్లు లేదా నూనె పదార్థాలు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ  సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారం, అసౌకర్యం , గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినగానే పండ్లు తినే అలవాటు ఉండేవారు నూనెలో వేయించిన ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి తినడం అంత మంచిది కాదు.  పులియబెట్టిన లేదా ఈస్ట్ తో తయారు చేసిన ఆహారాలు..  ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలతో బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. అరటిపండు కాంబినేషన్.. అరటిపండు,  బొప్పాయి రెండూ పండ్లే అయినప్పటికీ, అరటిపండు , బొప్పాయిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ వేగం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ  కడుపు నిండిపోయినట్లు, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి బొప్పాయి ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఇతర ఆహారాలతో కలపకుండా విడిగా మాత్రమే తినడం మంచిది. అది కూడా ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుండి గంట సమయం వ్యవధి ఇచ్చి పండిన బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                                                                                                                                     *రూపశ్రీ.