ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన..  ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను..  ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని చెప్పారు.  రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు,  ఏపీలో ప్రతి చిన్న విషయానికి కులం రంగు పులుముతున్నారని, మంచినీళ్ల నుంచి ఇంటి అద్దె వరకు కుల ప్రాతిపదికన లెక్కలు వేసే వాతావరణం నెలకొందని   విమర్శించారు. తన కొత్త పార్టీ కేవలం  వ్యక్తిత్వం ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తుందనీ,  ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద వ్యక్తులకు, అవినీతిపరులకు చోటు ఉండదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన తప్పులను, దోపిడీని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో జరిగిన వేల కోట్ల అవకతవకలు, ఇండోసోల్ ప్రాజెక్టుల పేరుతో జరిగిన సబ్సిడీల కుంభకోణాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ఇలాంటి  ప్రమాదకరమైన  రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటి వరకు కేవలం మీడియా ద్వారానే ప్రజా సమస్యలపై పోరాటం చేశాననీ,  ప్రభుత్వాలను కదిలించాలంటే ఒక వ్యవస్థీకృత రాజకీయ వేదిక అవసరమని  గుర్తించానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అందుకే ఒక పొలిటికల్ పార్టీగా అవతరించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే తన కర్తవ్యమని  వివరించారు. భవిష్యత్ నాయకత్వంపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న వ్యక్తిగా ఇతర పార్టీల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం సబబు కాదని చెబుతూనే..  వ్యవస్థలో మార్పు రావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.    ఏబీ వెంకటేశ్వరరావు  కొత్త రాజకీయ ప్రయాణం ఏపీ ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుంది? సాంప్రదాయ పార్టీలకు ఆయన తన పార్టీతో చెక్ పెట్టగలరా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు  తెరపడింది.  టుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం చేస్తూ.. విడుదలై చిరుత్తైగల్ కట్జి పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించింది.   టీవీకే  నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది. దీంతో విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ లభించింది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు,  పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే టీవీకే పార్టీకి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఉన్న సందిగ్ధత  తొలగిపోయింది.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏసీ గదుల లో కూర్చిని పాలన సాగించే పద్ధతికి చరమగీతం పాడారు. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార దినంగా ప్రకటించడం ద్వారా అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు.  అమరావతిలో జరిగిన  కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ..  పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.   సింగపూర్ నమూనా నుండి స్ఫూర్తి పొందిన చంద్రబాబునాయుడు, సమస్యలను స్థానికంగా మండల స్థాయిలో పరిష్కరించాలని నొక్కి చెప్పారు.   అధికారులు  క్షేత్రస్థాయిలో గడిపే సమయాన్ని గరిష్ఠంగా పెంచడానికి..  అన్ని అధికారిక వీడియో కాన్ఫరెన్సులు,  అంతర్గత సమావేశాలు ఇప్పుడు వారానికి ఒక రోజుకు పరిమితం చేశారు. కలెక్టర్లు ఇప్పుడు ప్రతి  నియోజకవర్గాన్ని నెలలో కనీసం నాలుగు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.   అలాగే.. డిసెంబర్ 2027 నాటికి 10 లక్షల ఇళ్లను నిర్మించాలనే భారీ లక్ష్యాన్ని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు.  క్షేత్రస్థాయి ఉనికిని, హై-స్పీడ్ డిజిటల్ ట్రాకింగ్‌ను కలపడం ద్వారా.. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేయడం ఒక మేండటరీగా మార్చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
Pooja Hegde is currently facing massive trolling on social media, and it is all connected to her upcoming Bollywood film, Hai Jawani Toh Ishq Hona Hai. The makers recently released a romantic track titled "Tera Ho Jaun," where Pooja is seen wearing highly glamorous outfits and swimwear alongside Varun Dhawan. As soon as the song dropped, netizens quickly dug up an old interview of hers from the time of Ala Vaikunthapurramuloo. Back then, she made a controversial comment stating that South Indian cinema has an "obsession with navels and midriffs." That statement upset many fans at the time.  Now, seeing her in revealing costumes in a Bollywood song, people are actively calling out her perceived double standards. Social media users are heavily questioning why she criticized the glamour in Tollywood when she is perfectly fine doing similar or even bolder scenes in Bollywood.  While some of her fans are defending her by saying her old comments were just about specific camera angles used in the South, the majority of the internet is not letting this slide easily. The debate has definitely sparked a fresh and heated controversy for the actress online.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ సెన్సేషనల్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడే ఈ భామ, ఈసారి నేరుగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్ చేసిన ఒక ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసలు విషయానికొస్తే.. ఒమన్‌లో చిక్కుకున్న ఒక తెలుగు మహిళను భారత విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినట్లు పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పెట్టిన పోస్ట్‌పై పూనమ్ స్పందించారు. కేవలం సోషల్ మీడియాలో కనిపించే ఈ హంగులు చూసి మోసపోవద్దని, ఇవన్నీ కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను ఈ సందర్భంగా పూనమ్ గుర్తు చేశారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని ఆమె తల్లికి పవన్ గతంలో హామీ ఇచ్చారని, ముందు ఆ ప్రామిస్‌ను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. "నిజంగా సహాయం చేస్తే మంచిదే.. కానీ ఈ విజువల్ హంగుల వెనుక అసలు సమస్యలను మర్చిపోకూడదు" అంటూ పూనమ్ రాసుకొచ్చారు. నిజానికి పూనమ్ కౌర్ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఉద్దేశించి సంచలన పోస్టులు చేస్తూనే ఉన్నారు. గతంలో పవన్ రాజకీయ ప్రచారాల్లో సుగాలి ప్రీతి కేసు హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండటంతో, ఆ కేసులో బాధితులకు న్యాయం జరగాలన్న డిమాండ్‌ను పూనమ్ మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ పూనమ్ వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొందరు మాత్రం సుగాలి ప్రీతి కేసులో పురోగతి ఉండాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా, పూనమ్ కౌర్ చేసిన ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ కేకుల్లా ట్రెండ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, అలాగే పూనమ్ చేసే మరిన్ని విమర్శలకు జనసైనికులు ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపుతోంది.
The internet has been buzzing for the last couple of days over Ashu Reddy's sudden engagement pictures, but it turns out there is a massive twist to the tale. Just when everyone thought the Bigg Boss Telugu fame actress had secretly gotten engaged, she dropped the curtain on the real story.  The viral photos of her exchanging rings in traditional Telugu attire are not from a real-life ceremony, but rather behind-the-scenes glimpses from her upcoming web series, Vikram on Duty, which will be streaming on JioHotstar Telugu.   She deliberately kept the man's identity hidden and only used a camera emoji in her initial post, which proved to be a brilliant promotional strategy that had social media completely fooled. Interestingly, this perfectly timed publicity stunt comes right in the middle of a serious real-life controversy. Ashu is currently dealing with a highly publicized legal issue after an NRI software engineer filed a complaint accusing her of cheating him out of Rs 9.35 crore under the guise of marriage. While the courts are handling those serious legal allegations and she has secured an order against defamatory content, Ashu has cleverly managed to turn the spotlight toward her acting career with this scripted engagement buzz.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The celebrations for Vijay Deverakonda’s 37th birthday have been truly spectacular this year, offering fans a perfect mix of personal joy and cinematic excitement. Marking his first birthday since tying the knot in February, a heartwarming video of the actor and his wife, Rashmika Mandanna, greeting fans outside their Jubilee Hills residence has taken the internet by storm. Dressed elegantly in a simple outfit, Rashmika was seen looking adorably at Vijay while they smiled and waved at the massive crowd that gathered, making it a completely wholesome and viral moment. Adding to the festive mood, the makers of his highly anticipated films gave fans exactly what they were waiting for.  The team of his period action drama Ranabali dropped a gripping behind-the-scenes video showcasing Vijay’s intense horse-riding training. Directed by Rahul Sankrityan, the massive historical epic is set for a grand worldwide release on September 11. Furthermore, a striking new poster of his upcoming rural mass entertainer Rowdy Janardhan was also unveiled.  Directed by Ravi Kiran Kola, the film promises to show Vijay in a completely new, rustic mass avatar and is scheduled to hit the screens this December. Between the beautiful personal moments with Rashmika and the major movie updates, it was definitely a birthday to remember for his fans.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటించారు. 'ఇష్టంగా' ఫేమ్ అర్జున్ మహీ విలన్‌గా మెప్పించారు.  'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సి.సి. క్రియేషన్స్, ఎ.వి.ఆర్. మూవీ వండర్స్ బ్యానర్స్ పై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎ.వి.ఆర్ నిర్మించారు.  థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ, రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎంఏ తిరుపతి కథ, రమేష్ రాయ్ మాటలు అందించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమాకు కెమెరామెన్‌గా వైఆర్ శేఖర్, ఎడిటర్‌గా బొంతల నాగేశ్వరరెడ్డి వర్క్ చేశారు.  
When two of the biggest superstars of Malayalam cinema, Mohanlal and Mammootty, come together for a massive 125-crore action thriller, you expect the box office to be set on fire. Unfortunately, their latest highly anticipated film, Patriot, has done exactly the opposite. The movie has crashed terribly after its opening weekend and is now heading towards becoming a monumental disaster.   Directed by Mahesh Narayanan, the spy thriller had a promising start, minting around 28 crores worldwide on its opening day. Fans were thrilled to see the legends back in action together, but the excitement died down incredibly fast. The mixed word of mouth and the niche, serious tone of the espionage subject did not sit well with the regular theatergoing audience.  Once the weekdays started, the collections witnessed a severe free fall. By the end of its first week, the film managed to scrape just about 27 crores net in India and around 73 crores gross worldwide. With a reported budget of 125 crores, the theatrical returns are shockingly low. Even with decent overseas numbers backing it up initially, Patriot is currently struggling to even cross the 100-crore mark globally.  Trade circles are already declaring it a colossal flop, estimating that the makers and distributors are looking at heavy, absolute minimum losses of over 40 to 50 crores. It is just another harsh reminder that even the biggest stars and massive budgets cannot save a film if the narration fails to connect with the masses.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్లుగా మిగిలిపోవు, అవి ఒక శకాన్ని సృష్టిస్తాయి. సరిగ్గా 35 ఏళ్ల క్రితం, 1991 మే 9న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader) అటువంటి సంచలనమే. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని బాక్సాఫీస్ వద్ద అజేయమైన నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టిన ఈ సినిమా, నేటికీ మాస్ సినిమాలకు ఒక గైడ్‌లా నిలుస్తోంది. సంచలన రికార్డులు విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ అప్పట్లో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల షేర్ వసూలు చేసి, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. 50కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, కొన్ని ప్రధాన కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్‌తోనే చిరంజీవి భారతీయ సినీ చరిత్రలో రూ.1.25 కోట్ల పారితోషికం అందుకున్న తొలి హీరోగా వార్తల్లో నిలిచారు. ఇది అప్పట్లో అమితాబ్ బచ్చన్ పారితోషికం కంటే ఎక్కువ. ‘గ్యాంగ్ లీడర్’ వెనుక ఆసక్తికర కథ నిజానికి ఈ సినిమాకు మొదట అనుకున్న కథ ఇది కాదు. విజయ బాపినీడు తన పాత చిత్రం 'బొమ్మరిల్లు' తరహా ఫ్యామిలీ డ్రామాను నాగబాబుతో చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే చిరంజీవి డేట్స్ ఇవ్వడంతో ఆ కథలో మార్పులు చేశారు. అది చిరంజీవికి అంతగా నచ్చకపోవడంతో, పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగి ఆ కథకు మెరుగులు దిద్ది మెగాస్టార్ ను మెప్పించారు.  ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ వెనుక కూడా ఆసక్తికర కథ ఉంది. రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అప్పట్లో 'మెగాస్టార్' మ్యాగజైన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ పేరుతో ఒక సీరియల్ రాసేవారు. ఆ పేరు నచ్చడంతో బాపినీడు దీనినే సినిమా టైటిల్‌గా ఖరారు చేశారు. ‘గ్యాంగ్ లీడర్’ ప్రత్యేకతలు "చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో.." వంటి డైలాగులు, చిరు మేనరిజమ్స్ యువతను ఉర్రూతలూగించాయి. బప్పీలహరి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణవాయువు. ముఖ్యంగా "వాన వాన వెల్లువాయే" పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్.  విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్ వంటి హేమాహేమీల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘గ్యాంగ్ లీడర్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అది ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న డ్రామా. 35 ఏళ్లు గడిచినా, ఆ సినిమాలోని స్టైల్, మేనరిజమ్స్, సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. మెగాస్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, భవిష్యత్ తరాల మాస్ హీరోలకు ఎప్పటికీ ఒక పాఠంలా ఉంటుంది.  
డెకాయిట్(Dacoit) విషయంలో ఇప్పుడు నమోదైన రికార్డుని ఎవరు ఊహించలేదు. అసలు కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు. మేకర్స్ కూడా అందుకు అతీతులేం కాదు. బహుశా అందుకే అది రికార్డు అయ్యింది. మరి లేటు చేయకుండా ఆ రికార్డు విశేషాలేంటో చూద్దాం. డెకాయిట్ మే 8 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అంటే నిన్న. కానీ  గత రికార్డులపై ఏ మాత్రం జాలి, దయ అనేది చూపించకుండా కేవలం 24 గంటల్లోనే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  మొదటిది అడివి శేష్ బ్రాండ్ ఇమేజ్: క్షణం నుండి మేజర్ వరకు శేష్ సినిమాలకి ప్రత్యేకమైన క్లాస్ ఆడియన్స్ ఉన్నారు. డెకాయిట్ లో ఆయన మాస్ అండ్ రఫ్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. రెండవది మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్:  మృణాల్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఒక టీనేజ్ కూతురికి తల్లిగా ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించింది. దీంతో ఆమె పర్ఫార్మెన్స్ కి   ప్రశంసలు దక్కుతున్నాయి. మూడవది అనురాగ్ కశ్యప్ ఎంట్రీ: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ డెకాయిట్ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ స్పెక్టర్ స్వామి పాత్రలో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు  Also read: Irumudi: ఫుల్ స్వింగ్ లో ఇరుముడి.. అంతా అందులోనే ఉంది మహత్యం  ఓటీటీలో డెకాయిట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన డెకాయిట్ కి ఎక్కువ శాతం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టడం గమనార్హం.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, ముక్కుసూటిగా మాట్లాడే ఇనయా వెనుక ఇంతటి పెయిన్ ఫుల్ స్టోరీ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ కన్నీరు పెట్టుకుంది. ఇనయా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ఒక వ్యక్తిని తాను ప్రాణంగా ప్రేమించానని, అతనితో కలిసి జీవితాంతం గడపాలని ఎన్నో కలలు కన్నానని వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి తనను కాకుండా తన పేరును, ఫేమ్ ను మాత్రమే ప్రేమించాడని ఆలస్యంగా తెలుసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆర్థికంగా కూడా అతనికి ఎంతో సాయం చేశానని పేర్కొంది. ఆర్థికంగా తనను ఎలా వాడుకున్నాడో వివరిస్తూ.. సదరు వ్యక్తి బిజినెస్ పేరుతో తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు చేతి గాజులను కూడా అమ్మి తీసుకున్నాడని ఇనయా వాపోయింది. చివరకు బ్రేకప్ అయ్యే సమయానికి తన బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేదని, కనీసం జీరో బ్యాలెన్స్ కి పడిపోయానని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఆ మోసం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని తెలిపింది. ఈ మానసిక వేదన తట్టుకోలేక తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానని ఇనయా బయటపెట్టింది. నిద్ర లేని రాత్రులు గడిపానని, ఒక దశలో నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప ప్రశాంతత దొరికేది కాదని ఆమె నిజాయితీగా వెల్లడించింది. గ్లామర్ ప్రపంచంలో పైకి నవ్వుతూ కనిపించినా, లోపల ఇంతటి నరకాన్ని అనుభవించానని ఆమె చెప్పడం ఫ్యాన్స్ ని కలిచివేస్తోంది. బిగ్ బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఈ వ్యక్తిగత ఇబ్బందులు ఎదురుకావడం ఇనయా కెరీర్ పై కూడా ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు ఆ గతం నుంచి బయటపడుతున్నానని, తనలాగా మరెవరూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెడుతున్నానని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో నెటిజన్లు ఇనయాకు మద్దతుగా నిలుస్తున్నారు. "నువ్వు చాలా ధైర్యవంతురాలివి, ఈ కష్టాల నుంచి త్వరలోనే బయటపడి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇనయా తన కెరీర్ పై దృష్టి పెడుతూ, కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. 
The intense political drama in Tamil Nadu over the past few days has finally come to a close. Thalapathy Vijay is all set to become the next Chief Minister as the route is completely clear now. His party, Tamilaga Vettri Kazhagam (TVK), emerged as the single-largest party with 108 seats in the recent assembly elections but fell just short of the 118-seat majority mark required to form the government.   After days of suspense and multiple visits to Governor Rajendra Vishwanath Arlekar, Vijay has finally secured the magic number. The major breakthrough came today when the Viduthalai Chiruthaigal Katchi (VCK) officially handed over a letter of unconditional support with their two MLAs.  With the Left parties and Congress already pledging their backing, the TVK-led alliance now comfortably commands 119 seats in the assembly, paving the way for a historic coalition government. What makes this victory even more spectacular is the sheer scale of his political debut.  Following in the legendary footsteps of MGR and NTR, Vijay has created history by becoming Chief Minister in his very first election. By dismantling the decades-old Dravidian duopoly of DMK and AIADMK on his first attempt, he has set a new benchmark in Indian politics. Senior leaders have confirmed the submission of the final support letters, and the official swearing-in ceremony in Chennai is now just a matter of time.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  ఖచ్చితంగా, లైపోసెక్షన్ మరియు టమ్మీ టక్ గురించి మీ వెబ్‌సైట్ కోసం పాఠకులను ఆకట్టుకునేలా మరియు భావోద్వేగాలను స్పృశించేలా రూపొందించిన సమాచారం ఇక్కడ ఉంది: మీ కలల రూపం మీ సొంతం: లైపోసెక్షన్ మరియు బాడీ కాంటౌరింగ్ గురించి పూర్తి అవగాహన మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పదిమందిలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోలేక, బాడీ షేప్ సరిగ్గా లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందరికో ఎదురవుతుంటాయి. మీ ఈ ఆవేదనను అర్థం చేసుకుని, మీకు సరైన ఆకృతిని ఇచ్చే అద్భుతమైన ప్రక్రియే 'లైపోసెక్షన్'. మనం ఈ చికిత్స ఎందుకు చేయించుకోవాలి? (Why Should We?) లైపోసెక్షన్ అనేది కేవలం కొవ్వును తీసేయడం మాత్రమే కాదు, అది మీ శరీరానికి ఒక కొత్త రూపాన్ని, మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మొండి కొవ్వు నుండి విముక్తి: వ్యాయామంతో తగ్గని లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్, మరియు చేతుల దగ్గరి కొవ్వును ఇది సులభంగా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుదల: ముఖ్యంగా యువతలో గైనకోమాస్టియా (పురుషులలో ఛాతి పెరగడం) వంటి సమస్యల వల్ల కలిగే మానసిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. సరైన శారీరక ఆకృతి: హై డెఫినిషన్ లైపోసెక్షన్ ద్వారా జిమ్‌కు వెళ్లినప్పుడు వచ్చే సహజమైన బాడీ లైన్స్‌ను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: పొట్ట భాగం కిందకు సాగిపోవడం వల్ల వచ్చే అలర్జీలు, రాషెస్ మరియు అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. లైపోసెక్షన్ ఎలా చేస్తారు? (How it works?) ఇది చాలా సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. చిన్న గాటు: కేవలం 1.5 నుండి 2 mm వరకు ఉండే అతి చిన్న రంధ్రం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాట్ సక్షన్: ఒక చిన్న ట్యూబ్ సహాయంతో శరీరంలోని అదనపు కొవ్వును బయటకు సక్ (Suck) చేస్తారు. త్వరిత కోలుకోవడం: సర్జరీ జరిగిన రోజే లేదా మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు రోజుల తర్వాత మీ సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. టమ్మీ టక్ (Tummy Tuck): పొట్ట భాగం మరీ ఎక్కువగా సాగిపోయిన వారికి ఆ అదనపు చర్మాన్ని తీసేసి, బొడ్డును కూడా సరిచేసి మంచి షేప్ ఇస్తారు. ఏం చేయకూడదు? (What Not to Do?) లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బరువు తగ్గడానికి కాదు: లైపోసెక్షన్ అనేది బరువు తగ్గడానికి చేసే చికిత్స అని నమ్మవద్దు; ఇది కేవలం శరీర ఆకృతిని (Body Shaping) మార్చడానికి మాత్రమే. ధూమపానం వద్దు: సర్జరీకి 2-3 వారాల ముందు మరియు తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అన్-సర్టిఫైడ్ డాక్టర్లు వద్దు: అనుభవం లేని వారితో కాకుండా, కేవలం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారానే ఈ చికిత్స చేయించుకోవాలి. నియమాలను అతిక్రమించవద్దు: డాక్టర్ సూచించిన లిమిట్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయమని ఒత్తిడి చేయకూడదు, అది ప్రమాదకరం కావచ్చు. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: లైపోసెక్షన్ సురక్షితమేనా?  జ: అవును, అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నియమిత పరిమితుల్లో చేయించుకుంటే ఇది 100% సురక్షితం. ప్ర: సర్జరీ తర్వాత మచ్చలు కనిపిస్తాయా?  జ: లైపోసెక్షన్ రంధ్రాలు చాలా చిన్నవి కాబట్టి మచ్చలు తెలియవు. టమ్మీ టక్ చేసినా ఆ గీత మీ ఇన్నర్ వేర్ లైన్ లోపలికే ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. ప్ర: సర్జరీ తర్వాత మళ్ళీ కొవ్వు చేరుతుందా?  జ: సర్జరీ తర్వాత హెల్దీ డైట్ పాటించడం మరియు డాక్టర్ సూచించిన విధంగా 4-6 వారాల పాటు కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందంగా కనిపించాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఈ అద్భుత చికిత్సలతో మీ కలల రూపాన్ని పొందడం ఇప్పుడు సులభం. భయపడాల్సిన అవసరం లేదు, సరైన నిపుణులను సంప్రదించి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)