విజయ్ కు వీసీకే మద్దతు.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం

posted on: May 9, 2026 5:11PM

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు  తెరపడింది.  టుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం చేస్తూ.. విడుదలై చిరుత్తైగల్ కట్జి పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించింది.  

టీవీకే  నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది. దీంతో విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ లభించింది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు,  పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

ఇప్పటికే టీవీకే పార్టీకి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఉన్న సందిగ్ధత  తొలగిపోయింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...