వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైపీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు ఫ్యాన్ గాలి ఉక్కపోతగా మారిందా? వైసీపీని వీడి జనసేన గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాల జరుగుతున్న చర్చ, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తోంది.  2024  ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ ఎన్నికలలో ఘోర పరాజయంతో గద్దె దిగిన తరువాత వైసీపీ గ్రాఫ్ వేగంగా దిగజారిపోతోంది. తాజా సర్వేలు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత దూకుడు పెంచినా ఫలితం ఉండటంలేదు. గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ జనసేన గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు అవుతోంది.   మిగిలిన పదవీ కాలంలో మరింత సమర్థవంతంగా పాలన అందిస్తూ  పట్టు  నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో  వైసీపీ అధినేత కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దూకుడు పెంచినా ఆశించినట్లుగా పుంజుకోలేకపోతున్నది.  దీనికి తోడు రాజధాని, భోగాపురం వంటి కీలక విషయాలలో జగన్ ఏకపక్ష వైఖరితో  వైసీపీ నేతలలో అసంతృప్తి పేరుకుంటోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.   ఈ నేపథ్యంలోనే   బొత్స సత్యనారాయణ వైసీపీని వీడి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా  తనకంటే ప్రత్యేక పట్టు ఉన్న  బొత్స కుటుంబం  వైసీపీకి దూరం అవ్వడమంటూ జరిగితే.. వైసీపీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుందని పరిశీలకులు అంటున్నారు.   ఉత్తరాంధ్ర  రాజకీయాల్లో   బొత్స కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  రాజకీయ పోరాటాలు సాగించింది. ఈ నేపథ్యంలో బొత్సకు తెలుగుదేశంలోకి  ఎంట్రీ లేకపోవడంతో బొత్స జనసేన వైపు దృష్టి సారించారంటున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారనీ, చంద్రబాబు సైతం నో అబ్జెక్షన్ అన్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.    ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియలో అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు.    చిరంజీవితో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  అలాగే పవన్ కల్యాణ్ తోనూ సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయంతోనే బొత్స పవన్ కల్యాణ్ తో చర్చించి జనసేన ఎంట్రీకి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.  AP Politics, AP News, YCP, Uttarandhra, Telegu News 
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమైన తరుణంలో..  విశాఖపట్నానికి   భోగాపురం విమానాశ్రయం చాలా దూరంలో ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను  విశాఖ జనమే ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది. అసలు భోగాపురం ప్రాధాన్యత, పౌర సేవలు ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న వ్యూహాలు, క్షేత్రస్థాయి సానుకూలతల విషయానికి వస్తే..  విశాఖ నుంచి  45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతికూల అంశంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేస్తోంది.  ఈ సందర్భంగా వైసీపీ విమర్శలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సందేహాలూ, విమర్శలూ  వ్యక్తమయ్యాయి. అప్పట్లో నగర నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేసి..  నగరం బయట ఉన్న శంషాబాద్‌కు విమాన సేవలను తరలిస్తున్న సమయంలో ప్రజల నుంచి దూరం, ప్రయాణ సమయం, చివరి మైలు కనెక్టివిటీపై   వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. ఇప్పుడు  శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ,  అలాగే  ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, శరవేగంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ అవసరాలను ఎంతో సమర్థవంతంగా తీరుస్తోంది. ఇప్పుడు ఎవరి నోటీ దూరం మాట వినిపించడం లేదు. అదే తరహాలో భోగాపురం కూడా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చివేస్తుందని పరిశీలకులు చెప్పడం కాదు.. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు.  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక విమానాశ్రయాలను నగరాలకు దూరంగా నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.   ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌లు నగర నడిబొడ్డున లేవు. నగరాల పరిధిలో భూముల ధరలు అత్యంత భారీగా ఉండటం..  విస్తరణకు కావలసిన  భూమి లభించకపోవడం  ఒక కారణమైతే..  నగరం నడిబొడ్డున విమానాశ్రయం ఉంటే..  ఎయిర్ పోర్టుకు  వచ్చే వాహనాల వల్ల   ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనం ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. బేగంపేటలో పౌర విమాన సేవలు కొనసాగిన సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న సంగతి విదితమే. వేగంగా విస్తరిస్తున్న విశాఖ వంటి పారిశ్రామిక నగరంలో, నగర పరిధిలోనే అంతర్జాతీయ స్థాయి రన్‌వేలు, టెర్మినళ్లు, కార్గో కాంప్లెక్స్‌లను విస్తరించడం దాదాపు సాధ్యం కాదు. ఈ విషయాన్ని నిపుణులే చెప్పారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో జీఎమ్‌ఆర్    భారీ పెట్టుబడులతో నిర్మించింది. దీని నిర్వహణ కూడా జీఎంఆర్ సంస్థే చేపట్టింది.  ఇంతటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీపంలో మరో పోటీ విమానాశ్రయం ఉంటే ఇబ్బంది. అందుకే హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమాన సర్వీసులకు మూసివేశారు. ఇప్పుుడు కూడా అలాగే..  విశాఖలోని పాత విమానాశ్రయం నుంచి  పౌర సేవలకు క్రమంగా  స్వస్తి చెప్పి.. ఆ విమానాశ్రయాన్ని  ఇండియన్ నేవీ ఆపరేషన్లకు అప్పగిస్తారు. ఇకపై షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలన్నీ భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నంవాసులు ఈ దూర భారాన్నీ, భయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో కారణమేంటంటే..  విమాన ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ మాదిరిగా ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఉపయోగించేది కాదు. విశాఖపట్నం మొత్తం జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు నిత్యం విమానాశ్రయాన్ని సందర్శించరు. కేవలం కొద్ది శాతంగా ఉండే వ్యాపారులు, పర్యాటకులు, ఐటీ నిపుణులు, అత్యవసర ప్రయాణికులు మాత్రమే తరచూ విమానాలను ఆశ్రయిస్తారు. పైగా.. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం  నేవీ ఆధీనంలో ఉండటంతో పాటు, చుట్టూ కొండలు, విస్తరించిన జనావాసాలు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాండింగ్‌లు, పెద్ద బోయింగ్ విమానాల రాకపోకలకు   పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా నేరుగా కనెక్టివిటీ సాధించాలంటే భోగాపురం వంటి ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక్కటే శరణ్యం. అలాగే..  విశాఖపట్నం  భౌగోళికంగా ఉత్తరం వైపున భోగాపురం, ఆనందపురం, భీమిలి దిశగా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పది,  పదిహేనేళ్లలో విశాఖ మహానగరం భోగాపురం వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, ఏరోసిటీ, విద్యా,  వైద్య సంస్థలు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతమంతా కొత్త ఆర్థిక హబ్‌గా మారబోతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం విశాఖపట్నానికే కాకుండా సమీపంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం  సులభతరం అవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతలను తొలగించి, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గుణాత్మక మార్పులు తీసుకురానుంది. విశాఖ  నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు దూరభారం లేదా సమయభారం అనిపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ఎన్ హెచ్ఏఐ పలు  రహదారి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుత జాతీయ రహదారి 16 విస్తరణ, విస్తృతమైన సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు, విశాఖ పోర్ట్ నుంచి నేరుగా భోగాపురం వరకు 6 వరుసల బీచ్ కారిడార్ కోస్టల్ హైవే నిర్మాణంలో ఉంది. సవరవిల్లి వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారులు సిటీ ట్రాఫిక్ చిక్కులు లేకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ చేరుకునేందుకే దోహదపడతాయి. ఈ రహదారులన్నీ పూర్తయితే విశాఖ నగర కేంద్రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 35 నుంచి 40 నిమిషాల్లో సునాయాసంగా చేరుకోవచ్చు.  ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే సమగ్ర ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి తోడు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు, విద్యుత్ ఆధారిత ఫీడర్ బస్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే నగరవాసులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.   Bhogapuram International Airport, Visakhapatnam Airport Connectivity,  (Bhogapuram Expressway Beach Corridor, Vizag Metro Rail Project,  North Andhra Infrastructure Development 
తమిళ రాజకీయాల్లో  కావేరి జలాల చిచ్చు రేగింది.   దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కావేరి జలాల పంపకం సమస్య..  మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం వివాదం తాజాగా పీక్స్ కు చేరుకున్నాయి.  కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  తాజాగా ఈ వివాదం పెచ్చరిల్లడానికి  ప్రతిపక్షాల అఖిలపక్షం డిమాండ్ ను ముఖ్యమంత్రి విజయ్ తిరస్కరించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.   ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు కావేరీ జల వివాదంపై  అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సీఎం విజయ్..   ఇప్పటికే శాసనసభలో కావేరి నీటి హక్కులపై ఏకగ్రీవ తీర్మానం చేశామని, అందుకే మళ్లీ ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ అవసరం లేదని అకుండబద్దలు కొట్టారు.   దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్  ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.   ప్రతిపక్షాల విజ్ఞప్తులను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల తమిళనాడు రైతులకు న్యాయం జరగదన్నారు. సీఎం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.  అదలా ఉండగా,  కర్ణాటక ప్రభుత్వం కావేరి పరివాహక ప్రాంతంలో మేకెదాటు డ్యామ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా కర్ణాటక పర్యటనకు సిద్ధమయ్యారన్న వార్తలు విపక్షాలలో మరింత ఆందోళనకు కారణమయ్యాయి.  చర్చల ద్వారా  సమస్య తీరదనీ, న్యాయపోరాటం ద్వారానే తమిళనాడు హక్కులను కాపాడుకోవాలని విపక్షలు అంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రత్యేక అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శిస్తుంటే..  తమిళనాడులో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి.   రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లానని డీఎంకే డిమాండ్ చేస్తున్నది.   ఒకవైపు ఆందోళన బాట పట్టిన డీఎంకే, మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఇంకోవైపు న్యాయపోరాటం చేయాలనే డిమాండ్లు... ఈ పరిణామాలు  సీఎం విజయ్ కు సవాల్ గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ కు ఎదురైన అతి పెద్ద సవాల్ ఇదేనని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   CM Vijay, Cauvery Water Dispute, Tamil Nadu Politics, TVK vs DMK, Mekedatu Dam Row
ALSO ON TELUGUONE N E W S
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక హీరో సినిమాకి క్లాప్ కొట్టిన కుర్రాడు.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే హీరో నటిస్తున్న సినిమాకి నిర్మాతగా మారితే? ఇది కదా అసలైన సక్సెస్ స్టోరీ అంటే. ఈ ఇన్‌స్పైరింగ్ జర్నీ ఎవరిదో కాదు.. న్యాచురల్ స్టార్ నానిది.  సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా అడుగుపెట్టి, తన స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన నాని ప్రయాణం ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ . ఈ రోజు నాని స్టార్ హీరోగా మాత్రమే కాదు.. విజనరీ ప్రొడ్యూసర్‌గా కూడా దూసుకుపోతున్నారు.  2005లో యూత్ స్టార్ నితిన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లరి బుల్లోడు' అనే సినిమా వచ్చింది. ఆ సమయానికి నాని ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఆసక్తితో 'అల్లరి బుల్లోడు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కట్ చేస్తే.. కాలం చకచకా తిరిగేసింది. 2008లో 'అష్టా చమ్మా'తో హీరోగా మారి, తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగారు నాని. కేవలం నటుడిగానే కాకుండా వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మంచి అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్‌గానూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు నానికి చెందిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా 'అలియాస్ రుక్మిణీ' అనే సినిమా రూపొందుతోంది. అప్పుడు ఏ హీరో సినిమాకి అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారో, ఇప్పుడు అదే హీరో సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నాని.  దీంతో "ఇది కదా రియల్ సక్సెస్ అంటే.." అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో నాని సినీ జర్నీని కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.     Natural Star Nani, Assistant Director, Producer, Alias Rukmini, Nithiin  
సినిమా థియేటర్‌కు వెళ్లి ప్రశాంతంగా, సరదాగా సినిమాను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు కొన్నిసార్లు ఊహించని, విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) చిత్రం చూసేందుకు ఒక ప్రేమికుల జంట థియేటర్‌కు వచ్చింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన ఆ సమయంలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడికి ఈ సినిమా కథ, ప్రధాన మలుపులు, సస్పెన్స్ సన్నివేశాలు ముందే తెలిసి ఉండటంతో, పక్కనే కూర్చున్న తన ప్రియురాలికి ప్రతి సీన్ వివరంగా బిగ్గరగా వివరించడం ప్రారంభించాడు. "ఇప్పుడు ఈ సీన్ వస్తుంది", "తర్వాత ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది", "ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే" అంటూ ఆ యువకుడు ఉత్సాహంగా పెద్ద శబ్దంతో ముందే చెప్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే, మొదటిసారిగా ఆ సినిమాను ఎంతో ఆసక్తిగా, సస్పెన్స్‌తో చూస్తున్న తోటి ప్రేక్షకులకు ఈ ప్రవర్తన తీవ్ర అసహనానికి, చికాకుకు గురిచేసింది. మొదట్లో తోటి ప్రేక్షకులు అతడిని భరిస్తూ ఊరుకున్నప్పటికీ, ఆ యువకుడి ప్రవర్తన హద్దులు దాటడంతో సహనం కోల్పోయారు. పక్కనే కూర్చుని సినిమా చూస్తున్న నలుగురు మిత్రుల గుంపు అతడిని సున్నితంగా వారించింది. "నాయనా! సినిమా సస్పెన్స్‌ను పాడు చేయకు, రాబోయే సీన్లను ముందే గట్టిగా చెప్పి మా వీక్షణ అనుభవాన్ని భంగపరచకు" అని హితవు పలికారు. కానీ, తన ప్రియురాలి ముందు ప్రతాపం చూపించాలనుకున్న ఆ యువకుడు ఆ నలుగురి మాటలను అస్సలు ఖాతరు చేయలేదు. తోటి ఆడియ‌న్స్‌ విజ్ఞప్తిని తుంగలో తొక్కి, మరింత బిగ్గరగా స్పాయిలర్స్ ఇవ్వడం కొనసాగించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సినిమా సస్పెన్స్‌ను పాడుచేస్తూ, ఎంత చెప్పినా వినకుండా గర్వంగా ప్రవర్తించడంతో ఆ నలుగురు యువకులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఇక లాభం లేదనుకుని, వారంతా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై పడి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాపులు తన్నులతో థియేటర్ లోపల పెద్ద ఎత్తున గందరగోళం, కలకలం రేగింది. ప్రియురాలి ముందు గొప్పలకు పోయిన ఆ ప్రేమికుడు చివరికి దెబ్బలు తిని, థియేటర్ మూలన భయంతో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అకస్మాత్తు పరిణామానికి థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రియురాలి ముందు హీరోలా కనబడదామనుకున్న ఆ యువకుడు, చివరికి అందరి ముందు అవమానపడి జోకర్‌గా మారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన ఘటనా వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కిక్కిరిసిన థియేటర్లలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలనే కనీస 'సివిక్ సెన్స్' (Civic Sense) చాలామందిలో కొరవడిందని కొందరు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ, "స్పాయిలర్ ఇవ్వబోయి బ్రాయిలర్ కోడిలా మారిపోయాడు" అని సరదా కామెంట్లు చేశారు. సినిమా సస్పెన్స్, థ్రిల్‌ను పాడు చేసే స్పాయిలర్ రాయుళ్లకు ఇది సరైన రీతిలో జరిగిన తగిన శాస్తి అని మరికొందరు మద్దతు తెలిపారు.   spiderman brand new day, theatre fight viral video, spiderman spoilers fight
  భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హీరోయిన్ దీపికా పదుకునే(Deepika padukone).. కోట్లాది మంది అభిమానులు ఆమె సొంతం. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ డ్రీం ప్రాజెక్ట్ రాకా తో బిజీగా ఉంది.  రీసెంట్ గా దీపికా సోషల్ మీడియా వేదికగా చేసిన రీల్  వైరల్ గా మారింది   సదరు రీల్ లో ' సాధారణంగా గర్భవతిగా ఉన్న సమయంలో శారీరకంగా జాగ్రత్తలు పాటిస్తూ, బరువులు ఎత్తకూడదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. కానీ నా చిన్నారి దువాను ఎత్తుకుని గడిపే ప్రతి క్షణం నాకు అపారమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆ మధురమైన క్షణాలను నేను జీవితంలో ఎప్పటికీ మిస్ కావాలనుకోవడం లేదు" అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. Also read: జాతకాల కోసమే నెలకి 10000 ఖర్చు. షాక్ ఇచ్చిన హీరోయిన్  సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, పిల్లల వివరాలను చాలా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించే దీపికా పదుకొనే, ఇలా సడన్‌గా తన భావోద్వేగాలను బయటపెట్టడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలు సాధించి రికార్డు సృష్టించింది. లక్షలాది మంది నెటిజన్లు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పోస్ట్‌పై స్పందిస్తూ, లవ్ ఎమోజీలతో తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆమె మాతృత్వపు ప్రేమని  కొనియాడుతున్నారు. Deepika padukone, Raaka, Allu Arjun
Karthi has officially announced his next project, teaming up with acclaimed director Mohan Raja and producer Lakshman Kumar's Prince Pictures. The announcement has generated considerable excitement, bringing together one of Tamil cinema's most versatile actors and a filmmaker known for delivering stylish commercial entertainers with strong emotional storytelling. The makers revealed the collaboration through social media, describing the film as "a grand celebration of family entertainment with inspiring heroism." Their announcement read: "Prince Pictures is proud to join hands once again with our very own Karthi and Director Mohan Raja for a grand celebration of family entertainment with inspiring heroism. A new journey begins." Karthi has earned a reputation for picking unconventional scripts, and this project is expected to continue that trend. According to the makers, he will be seen in a completely fresh and unique role, while the story promises to offer a new take on the family entertainer genre. Mohan Raja, best known for directing blockbusters like Thani Oruvan and Godfather, is returning with a script that reportedly blends family emotions with heroic elements. His collaboration with Karthi has already raised expectations among fans eager to see what the duo brings to the screen. Prince Pictures, which is currently backing the highly anticipated Sardar 2 with Karthi, will produce the film on a grand scale. While the title, cast, and technical crew are yet to be announced, the combination of Karthi, Mohan Raja, and Prince Pictures has already made the project one of the most anticipated upcoming Tamil films. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
‘‘అగధ... అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’.. ఈ ఒక్క డైలాగ్‌తోనే ‘అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్.  మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్న మూవీ ‘అగధ’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘‘మహిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా బాబాయ్?’’ అనే ప్రశ్నతో మొదలైన మిస్టరీ... ‘‘నువ్వు, మహిమ కలిసి వెళ్లిన చోటేంటి? అక్కడేం చూశారు?’’ అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అసలు మహిమకు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక కారణమేంటి? వాళ్లు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేస్తోంది. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆ శక్తి వెనుక కారణమేంటి? ఆ కుటుంబానికి ‘అగధ’కు ఉన్న సంబంధమేంటి? అనే మిస్టరీని మేకర్స్ ట్రైలర్‌లో రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన ‘అగధ’.. మరోవైపు ఆ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మహదేవి... ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది. అడవులు, పురాతన ఆలయాలు, రహస్య ప్రదేశాలు, మంత్ర తంత్రాలు, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను మిస్టిక్ వాతావరణంతో నింపారు దర్శకుడు ఎం.ఎస్. రాజు. విజువల్స్‌కు తోడు ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ‘అగధ’ ప్రపంచాన్ని మరింత ప్రభావవంతంగా చూపించాయి. హీరో శ్రవణ్ రెడ్డి, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి. మిస్టరీ.. సస్పెన్స్.. థ్రిల్.. భక్తి.. అతీంద్రియ శక్తులు.. వీటన్నింటినీ ఒకే కథలో మేళవిస్తూ దర్శకుడు ఎం.ఎస్. రాజు ‘అగధ’ను మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ‘అగధ’ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.     Agadha Trailer, MS Raju, Kamakshi Bhaskarla  
సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ ఎక్కితే చాలు, తనదైన అగ్రెసివ్ స్పీచ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేయడం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు తమిళనాడు కోలీవుడ్ సినీ వర్గాల్లోనూ ఆయన తన మార్క్ అస్సలు మార్చుకోలేదు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన కోలీవుడ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథన్ అండ్ సన్స్'. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత నాగవంశీ మాట్లాడిన తీరు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కు ఇచ్చిన సరదా 'వార్నింగ్' ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈవెంట్ వేదికలపై నిర్మాతలు పవర్‌ఫుల్ లెవెల్లో స్పీచ్‌లు ఇవ్వడం, ఆ వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవ్వడం నాగవంశీ శైలిలోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. మిగిలిన మేకర్స్ కూడా ఆయనను చూసే ఈ అగ్రెసివ్ ప్రమోషనల్ స్టైల్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. సూర్య హీరోగా రూపొందుతున్న 'విశ్వనాథన్ అండ్ సన్స్' చెన్నై ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నాగవంశీ మైక్ పట్టుకుని తన మార్క్ స్పీచ్‌తో దుమ్మురేపారు. ఈ ఈవెంట్‌లో నాగవంశీ ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ను ఉద్దేశించి ఫన్నీగా బెదిరించారు. "సూర్య ఫ్యాన్స్ కోసం నువ్వు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చి తీరాలి.. లేకపోతే సూర్య ఫ్యాన్స్ నిన్ను మర్డర్ చేస్తారు" అంటూ వేదికపైనే సరదాగా వార్నింగ్ ఇచ్చారు. నాగవంశీ నోటి నుంచి వచ్చిన ఈ మాస్ డైలాగ్ అక్కడ ఉన్న వారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించడమే కాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా, తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' ఎంత పెద్ద బాక్సాఫీస్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూర్యతో తీస్తున్న 'విశ్వనాథన్ అండ్ సన్స్' సినిమా కూడా అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని, అలాంటి బిగ్గెస్ట్ హిట్ ఇస్తామని సూర్య అభిమానులకు నాగవంశీ వేదికపై మాటిచ్చారు. ప్రస్తుత జెన్-జీ (Gen-Z) తరానికి నటి మమితా బైజు నటన బాగా నచ్చుతుందని చెప్పారు. సినిమాలో సూర్య, మమితా బైజు, రాధికల మధ్య వచ్చే సీన్లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే 'లక్కీ భాస్కర్' లాంటి వరుస బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీగా పెరిగాయి. సీనియర్ నటి రవీనా టాండన్, క్రేజీ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రల్లో నటించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఆగస్టు 14న థియేటర్లలో ఈ సినిమా అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. ఏది ఏమైనా నాగవంశీ ఇచ్చే స్పీచ్‌లు సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను పెంచేస్తాయి. మరి ఆయన చెప్పినట్లే 'విశ్వనాథన్ అండ్ సన్స్' ఆగస్టు 14న తమిళనాట, తెలుగులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.   Naga Vamsi, GV Prakash, Suriya, Vishwanathan and Sons, Venky Atluri, Sitara Entertainments
  ప్రస్తుత రోజుల్లో ఎవరి ఆనందం వాళ్ళది. కాబట్టి వాళ్ళ ఆనందాన్ని విమర్శించడానికి ఎవరకి  ఎలాంటి రైట్స్ ఉండవు. ఇప్పుడు బుల్లి తెర హీరోయిన్ 'బ్రహ్మముడి’  ఫేమ్ దీపిక రంగరాజు విషయంలో పైన చెప్పుకున్న మాట అక్షరాలా సత్యమని ఒప్పుకోవాల్సిందే. అచ్చమైన తెలుగమ్మాయిగా, తన సహజసిద్ధమైన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దీపిక రంగరాజు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన రహస్యాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన కెరీర్ ఎంపికల్లో జ్యోతిష్యం వహించిన పాత్ర  గురించి  చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సందిగ్ధత ఏర్పడుతుంది.  బ్రహ్మముడి సీరియల్ ప్రారంభానికి ముందు  ఒకేసారి రెండు వేర్వేరు ప్రాజెక్టుల నుండి అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఇప్పటికే నడుస్తున్న ఒక హిట్ సీరియల్‌లో హీరోయిన్ రీప్లేస్‌మెంట్ ప్రాజెక్ట్ కాగా, మరొకటి సరికొత్తగా ప్రారంభం కాబోతున్న ఒక కొత్త సీరియల్ ప్రాజెక్ట్. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే నా భవిష్యత్తు బాగుంటుందో తెలియక తీవ్ర మనోవేదనకి, సందిగ్ధానికి గురయ్యాను. ఆ సమయంలోనే  జ్యోతిష్యులని సంప్రదించాను ఫోన్ అపాయింట్‌మెంట్లు తీసుకొని, జాతకాలను విశ్లేషింపజేసుకోవడానికి నెలకు దాదాపు రూ. 10,000 వరకు ఖర్చు చేసేదాన్నీ. జాతక సలహాల కోసమే అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, ఆమె సంప్రదించిన ఎక్కువ మంది జ్యోతిష్యులు రీప్లేస్‌మెంట్ ప్రాజెక్ట్ వద్దని, సరికొత్త సీరియల్‌నే ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. జ్యోతిష్యుల సూచనల మేరకు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం  ‘బ్రహ్మముడి’ ఎంచుకున్నాను. Also read: వెలుగులోకి రామాయణ  సీక్రెట్..ఆ రాష్ట్రంలోని ప్రాగ్జ్యోతిష్యపురంతో రాముడికి ఉన్న లింక్ ఏంటి? జ్యోతిష్యులు చెప్పిన ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్నే మార్చివేసింది. ‘బ్రహ్మముడి’ సీరియల్ బుల్లితెరపై విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల క్రితమే  ఒక నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత నా కెరీర్‌లో ఊహించని వెలుగులోకి వస్తానని ఒక జ్యోతిష్యుడు చెప్పారు. సరిగ్గా బ్రహ్మముడి సీరియల్‌తో ఆ జ్యోతిష్యుడి మాటలు నూటికి నూరు శాతం నిజమయ్యా యి. గతంలో కూడా వారు చెప్పిన అనేక విషయాలు నా  నిజ జీవితంలో అక్షరాలా ఫలించాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలతో జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళకి ఎక్కడా లేని హుషారు రావడం గ్యారంటీ. Deepika Rangaraju, Astrology  
మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 'ఇరుముడి' నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ మెప్పించింది. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'ఇరుముడి కట్టు' సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు 'యాలాలో యాలాలో' అంటూ సెకండ్ సింగిల్ విడుదలైంది.  'ఇరుముడి' నుంచి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ అండ్ మెలోడియస్ సాంగ్ విడుదలైన 'యాలాలో యాలాలో' ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. చిన్న కుటుంబంలోని క్యూట్ మూమెంట్స్ ను కాప్చర్ చేస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించారు. తల్లిదండ్రులు, కూతురు మధ్య సన్నివేశాలు కట్టిపడేశాయి.  జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృద్యమైన సంగీతం, అనంత శ్రీరామ్ అద్భుత సాహిత్యం, హేషమ్ అబ్దుల్ వహాబ్, సాధికా కె.ఆర్ ఆత్మీయ గాత్రం.. ఈ పాటను ఒక మ్యాజికల్ మెలోడీగా మార్చాయి. "యాలాలో యాలాలో ఎన్నెన్నో ముచ్చటలో.. అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం.. చూడాలి ఈ లోకం" అంటూ సాగే ప్రతీ లైన్ కూడా మన కుటుంబ సంబంధాల విలువను, ఆప్యాయతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇంతటి అద్భుతమైన ఎమోషన్‌ను తనదైన స్టైల్‌లో తెరకెక్కించడంలో దర్శకుడు శివ నిర్వాణ మరోసారి తన మార్క్ చూపించారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి చిత్రాలతో ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అనిపించుకున్న శివ నిర్వాణ, ఈ 'ఇరుముడి' చిత్రంలో రవితేజతో ఎలాంటి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాను ఆవిష్కరించబోతున్నారో ఈ ఒక్క పాటతో స్పష్టమవుతోంది.     Ravi Teja, Irumudi Second Single, Yaalalo Yaalalo Song, Shiva Nirvana, GV Prakash  
ఒకప్పుడు వందలాది సినిమాల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, కోట్లాది రూపాయల ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడిపిన ఓ సీనియర్ నటుడు నేడు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక వృద్ధాశ్రమంలో గడుపుతున్నారంటే సినీ ప్రపంచంలో కాంతి వెనుక ఉన్న చీకటి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయనే దక్షిణాది సినీ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ శర్మ. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'వేట'లో విలన్‌గా మెప్పించిన మోహన్ శర్మ, సీనియర్ నటి లక్ష్మి తొలి భర్తగా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితులు. ఆయన సినీ ప్రస్థానం ఎంతో ఘనమైనది. దాదాపు 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా, మరొక 50కి పైగా చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో 'చట్టకారి' (1974), 'నెల్లు', 'ప్రయాణం', 'సుయంవరం', 'ఫ్రెండ్స్', 'సచిన్', 'మామాంగం', 'ఫోరెన్సిక్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన భాగమయ్యారు. అంతేకాదు, కమల్ హాసన్ నటించిన 'సాగర సంగమం'లోనూ మోహన్ శర్మ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంటుంది. కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన నాలుగు దక్షిణాది భాషల్లో సుమారు 20 చిత్రాలను నిర్మించి, దక్షిణాది భాషల్లోనూ సినిమాలు నిర్మించిన తొలి నిర్మాతగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఒకప్పుడు చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి పక్కనే మోహన్ శర్మ ఓ విలాసవంతమైన భవనంలో నివసించేవారు. ఏవీఎం స్టూడియోలో కలిసినప్పుడు జయలలితే స్వయంగా ఆ హౌసింగ్ ప్రాజెక్టును సిఫార్సు చేయడంతో ఆమె సలహా మేరకే ఆయన ఆ భవనాన్ని కొనుగోలు చేశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడానికి రెండు రోజుల ముందు ఆమెను కలిసిన చివరి సినీ ప్రముఖుడు కూడా మోహన్ శర్మనే కావడం విశేషం. అయితే, ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సంఘటన 'గ్రామం నమ్మ గ్రామం' అనే ద్విభాషా చిత్రం. ఆ రోజుల్లో రూ.1.25 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన ఈ సినిమాకు థియేటర్లు, పబ్లిసిటీ, పోస్టర్ల ఖర్చులన్నీ తనే భరించాల్సి రావడంతో బడ్జెట్ ఏకంగా రూ.2 కోట్లకు చేరుకుంది. సినిమా అవార్డులు సాధించినప్పటికీ, ఆర్థికంగా మోహన్ శర్మను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ అప్పులు తీర్చడానికి తన కలల నిలయమైన పోయెస్ గార్డెన్ ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చింది. అక్కడితో ఆయన కష్టాలు ఆగలేదు. వయసు పెరిగేకొద్దీ తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కాలికి సర్జరీ, లిగ్మెంట్ సమస్య, వెర్టిగో, తీవ్రమైన బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు సర్జరీల కోసం రూ.4-5 లక్షల వరకు ఖర్చయింది. ప్రతి నెలా ఇన్సులిన్‌తో కలిపి కేవలం మందుల కోసమే రూ.35,000 వరకు అవుతోంది. ఒక దశలో మందులు కూడా కొనుక్కోలేని దయనీయ స్థితికి చేరుకోవడంతో, రోటరీ క్లబ్ ట్రస్టీలైన స్నేహితుల సూచనతో ఆయన వృద్ధాశ్రమంలో చేరారు. భార్యతో విడాకుల నోటీసులు అందుకోవడం, కుమారుడు జర్మనీలో ఇంటి ఈఎంఐల భారం వల్ల వెంటనే సహాయం చేయలేకపోవడంతో ఆయన ఒంటరిగా మిగిలారు. ఈ కష్టకాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన బ్యాంక్ వివరాలు తెలుసుకుని వెంటనే రూ.1 లక్ష సహాయం అందించి దేవుడిలా ఆదుకున్నారు. ప్రస్తుతం 25 ఏళ్లుగా తనకు స్నేహితుడైన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ బృందాన్ని కలిసి సహాయం కోసం మోహన్ శర్మ ఎదురుచూస్తున్నారు.     Mohan Sharma, Veta Movie Rajinikanth. Sagara Sangamam 
  భారతీయ సినీ ప్రేమికులతో పాటు రామ భక్తులంతా దీపావళి(Diwali)కానుకగా నవంబర్ 8న రాబోయే  రామాయణ(Ramayana)పార్ట్ 1 కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇటీవల రిలీజైన ట్రైలర్ ని పదే పదే తనివితీరా చూసుకుంటూ జై శ్రీరామ్ అంటూ మురిసిపోతున్నారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్  తమ క్యారక్టర్లతో ఎలా తమ హృదయాల్లో సజీవంగా నిలవబోతున్నారనే క్యూరియాసిటీ కూడా ఆ అందరిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40కి పైగా భాషల్లో విడుదల కాబోతున్న రామాయణ చుట్టూ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన చారిత్రక అంశం సోషల్ మీడియా వేదికగా  చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రామాయణం కథ అనగానే మన అందరికీ వెంటనే గుర్తుకువచ్చే ప్రాంతాలు అయోధ్య, దండకారణ్యం, కిష్కింధ మరియు లంక మాత్రమే. కానీ మన ప్రాచీన భారతదేశ ఇతిహాసాలకు, ఈశాన్య భారత భూభాగమైన అస్సాం ప్రాంతానికి మధ్య ఉన్న నమ్మశక్యం కాని అనుబంధం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామాయణం కేవలం మన దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకే పరిమితం కాలేదని, ఈశాన్య భారతం కూడా ఈ మహాకావ్యంలో కీలక పాత్ర పోషించిందనే విషయం వెలుగులోకి రావడం విశేషం. ఈ సరికొత్త చర్చకు ప్రధాన కారణం ప్రముఖ చరిత్రకారుడు, రచయిత డాక్టర్ సౌరదీప్ నాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలే.  రణ్‌బీర్ అల్లాహాబాదియా నిర్వహిస్తున్న ప్రసిద్ధ 'బీర్‌బైసెప్స్' (BeerBiceps) పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ సౌరదీప్ నాథ్ పాల్గొని, ప్రాచీన భారతీయ గ్రంథాలలో అస్సాం ప్రాధాన్యతను సవివరంగా విశ్లేషించారు. ఆయన మాట్లాడుతూ' ప్రాచీన కాలంలో 'ప్రాగ్జ్యోతిష్యపురం' అని పిలువబడిన నేటి అస్సాం భూభాగ ప్రస్తావనలు రామాయణం, మహాభారతం వంటి మహత్తర ఇతిహాసాల్లో స్పష్టంగా కనిపించేవి. రామాయణంలోని కిష్కింధ కాండలో సుగ్రీవుడు వానర వీరులను సీతాదేవి అన్వేషణ కోసం నలుదిక్కులకూ పంపే సన్నివేశం అత్యంత కీలకమైనది. ఆ సమయంలో తూర్పు దిక్కుకు వెళ్లే వానర సమూహానికి మార్గనిర్దేశం చేస్తూ, ప్రాగ్జ్యోతిష్యపురం గురించిన ప్రస్తావన వస్తుందని చెప్పాడు.  Also read: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? అరుణాచలంలో రజినీకాంత్ మనవళ్లతో ప్రత్యేక పూజలు దీంతో 'రామాయణ' లోని భౌగోళిక విస్తృతిని, భారతీయ సంస్కృతిలోని వివిధ ప్రాంతాల ప్రాముఖ్యతను దృశ్యరూపంలో ఎంతో ప్రామాణికంగా చూపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో అంచనాలని  రెట్టింపు చేశాయి.నితేష్ తివారీ దర్శకత్వంలో  4000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న   ఒక్కో భాగానికి సుమారు రూ. 2000 కోట్లు వెచ్చిస్తూ, ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందిస్తున్నారు.   Ramayana, RanbirKapoor, Sai Pallavi, Yash, Nitesh Tiwari, Namith Malhotra  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. చిట్బొట్ల మధుసూదన్ శర్మ మోకాళ్ల నొప్పిని తగ్గించేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజమైన చిట్కాను వివరించారు. కేవలం మూడు సాధారణ వంటింటి పదార్థాలు అయిన వెల్లుల్లి, పసుపు, నూనెతో తయారయ్యే ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ చిట్కా మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చని ఆయన తెలిపారు. అయితే ఫలితాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: • మోకాళ్ల నొప్పికి సహజమైన ఇంటి చిట్కా • వెల్లుల్లి, పసుపు, నూనెతో మిశ్రమం తయారీ విధానం • రాత్రి ఎలా ఉపయోగించాలి? • ఈ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు • ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల ఆరోగ్యం, కీళ్ల సంరక్షణ, సహజ వైద్య చిట్కాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.  
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  అంతేకాదు.. ఉదయం లేవగానే బాగా చిరాకుగా, తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. ఉదయం లేవగానే ఇలా ఎందుకు తలనొప్పి వస్తుందని కొందరికి సందేహం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు.  కానీ ఇది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే  తలలో బరువుగా, నొప్పిగా లేదా ఒత్తిడిగా అనిపించడం  అనేది లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు.ఇది కొన్ని సందర్బాలలో తీవ్రమైన అనారోగ్యాలకు ప్రారంభ లక్షణం కావచ్చని అంటున్నారు. ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉండే ఆరోగ్య సమస్యలు ఏమిటి? దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డీహైడ్రేషన్.. రాత్రిపూట శరీరం చాలా గంటల పాటు విశ్రాంతిలో  ఉంటుంది.  దీనివల్ల ఉదయానికి లైట్ గా డీహైడ్రేషన్  ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్  మెదడు చుట్టూ ఉన్న ద్రవ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది, ఇది తలనొప్పికి దారితీస్తుంది. రోజంతా తక్కువ నీరు త్రాగినా లేదా వేసవిలో అధికంగా చెమట పట్టినా ఈ ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం , రోజంతా 2.5 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి.. ఆరోగ్యకరమైన శరీరం , మనస్సు కోసం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. ఆలస్యంగా నిద్రపోవడం, తరచుగా మేల్కొనడం లేదా తగినంత నిద్ర లేకపోవడం  దినచర్యలో భాగమైతే, ఉదయం తలనొప్పులు రావడం చాలా కామన్ అంటున్నారు వైద్యులు. నిద్రలేమి మెదడుకు తగినంత విశ్రాంతిని ఇవ్వదు, దీనివల్ల ఒత్తిడి పెరిగి, నొప్పిని కలిగించే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. అందువల్ల, టైమ్ కు తగ్గట్టు  నిద్రపోవడం , తగినంత నిద్ర పొందడం ముఖ్యం. స్లీప్ అప్నియా.. స్లీప్ అప్నియా అనేది నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోయే ఒక పరిస్థితి. దీనివల్ల శరీరానికి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా నిద్రలేచినప్పుడు తలనొప్పి, అలసట , మగతగా ఉండటం వంటివి సంభవించవచ్చు. బిగ్గరగా గురక పెట్టడం, తరచుగా నిద్రలేవడం , పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వంటివి సాధారణ లక్షణాలు. ఈ సమస్యలు కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. మైగ్రేన్.. మైగ్రేన్లు సాధారణ తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇవి తలలోని ఒక భాగంలో తీవంగా, కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పిని కలిగిస్తాయి. ఇది గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా ఉంటుంది. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే మైగ్రేన్లు మొదలవుతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, చాలా బ్రైట్ గా ఉండే కాంతికి గురికావడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్లతో పాటు వికారం, వాంతులు,  ఎక్కువ కాంతి లేదా శబ్దం వల్ల అసౌకర్యం కూడా కలగవచ్చు. మైగ్రేన్లు తరచుగా వస్తుంటే, నరాల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అధిక రక్తపోటు.. రక్తపోటు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటే, ఉదయం పూట తలనొప్పి ఒక సంకేతం కావచ్చు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి రోగికి తలనొప్పి రాకపోయినప్పటికీ, అదుపులో లేని రక్తపోటు మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. తలనొప్పితో పాటు తల తిరగడం, దృష్టి మసకబారడం లేదా ఛాతీ నొప్పి వంటివి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ,  వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం.. రాత్రి సమయంలో ఎక్కువగా కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురై, మరుసటి రోజు ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అధికంగా కెఫీన్ తీసుకోవడం లేదా అకస్మాత్తుగా కెఫీన్‌ను మానేయడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. రాత్రి ఆలస్యంగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం వల్ల ఉదయం తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేయాలి, మద్యానికి దూరంగా ఉండాలి,   పుష్కలంగా నీరు త్రాగాలి.                                           *రూపశ్రీ.