Home

»

Latest News

అసిస్టెంట్ డైరెక్టర్ to ప్రొడ్యూసర్.. నాని ఇన్‌స్పైరింగ్ జర్నీ.!

Aug 3, 2026 2:45PM

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక హీరో సినిమాకి క్లాప్ కొట్టిన కుర్రాడు.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే హీరో నటిస్తున్న సినిమాకి నిర్మాతగా మారితే? ఇది కదా అసలైన సక్సెస్ స్టోరీ అంటే. ఈ ఇన్‌స్పైరింగ్ జర్నీ ఎవరిదో కాదు.. న్యాచురల్ స్టార్ నానిది. 

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా అడుగుపెట్టి, తన స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన నాని ప్రయాణం ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ . ఈ రోజు నాని స్టార్ హీరోగా మాత్రమే కాదు.. విజనరీ ప్రొడ్యూసర్‌గా కూడా దూసుకుపోతున్నారు. 

2005లో యూత్ స్టార్ నితిన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లరి బుల్లోడు' అనే సినిమా వచ్చింది. ఆ సమయానికి నాని ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఆసక్తితో 'అల్లరి బుల్లోడు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

కట్ చేస్తే.. కాలం చకచకా తిరిగేసింది. 2008లో 'అష్టా చమ్మా'తో హీరోగా మారి, తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగారు నాని. కేవలం నటుడిగానే కాకుండా వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మంచి అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్‌గానూ తన మార్క్ చూపిస్తున్నారు.

ఇప్పుడు నానికి చెందిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా 'అలియాస్ రుక్మిణీ' అనే సినిమా రూపొందుతోంది. అప్పుడు ఏ హీరో సినిమాకి అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారో, ఇప్పుడు అదే హీరో సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నాని. 

దీంతో "ఇది కదా రియల్ సక్సెస్ అంటే.." అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో నాని సినీ జర్నీని కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

 

Natural Star Nani, Assistant Director, Producer, Alias Rukmini, Nithiin

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com