తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న, ఏపీ అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్ కాబోతున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 1)న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో  భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ  ఎయిర్‌పోర్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది చంద్రబాబు నాయుడి దార్శనికతాఅసలీ క్రెడిట్ వార్ ఏమిటి?  వంటి అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.   హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని డిజైన్ చేస్తున్న సమయంలోనే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో ఓ భారీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలని చంద్రబాబు భావించి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారని అడుసుమిల్లి చెప్పారు.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే..  కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.  2019 ఎన్నికల ప్రచారంలో  జగన్.. ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈగలు తోలుకుంటున్నారు, అక్కడకి వెళ్లేవాళ్లే లేరు, ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ దేనికి?  అంటూ చేసిన విమర్శలను అడుసుమిల్లి అజ్ణానం అంటూ కొట్టి పారేశారు.   గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన భూ సేకరణపై ఎన్నో అనుమానాలు, వివాదాలు రేకెత్తించారు. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన..  నాడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు, శిల్పారామం కట్టినప్పుడు కూడా అందరూ ఇలాగే ఎగతాళి చేశారు. అక్కడెవడు ఉంటాడు? అంత దూరం ఎవడు వెళ్తాడు? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో అర్ధమౌతుందన్నారు.   ముందుచూపుతో వ్యవహరించినవారు ఎప్పుడూ నష్టపోరన్న ఆయన..  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలాగైతే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారిందో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. అందులో ఇసుమంతైనా సందేహం అవసరం లేదని అడుసుమిల్లి అన్నారు.  వైజాగ్  నుంచి  40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు పోటెత్తడం ఖాయమన్నారు.  జగన్ హయాంలో  భూసేకరణను తగ్గించడం, ప్రాజెక్టు పనులను రెండేళ్లపాటు పక్కన పెట్టడాన్నీ గుర్తు చేసిన అడుసుమిల్లి,   2024లో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  భోగాపురం పనులు వేగం పుంజుకున్నాయనీ, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందనీ చెప్పారు.  అయితే తగుదునమ్మా అంటూ ఇప్పుడు జగన్ భోగాపురం క్రెడిట్ కోసం ప్రాకులాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా  ప్రారంభంలో వ్యతిరేకించడం, తర్వాత విమర్శించడం, చివరకు నిజం తెలుసుకుని  క్రెడిట్ చోరీకి పాకులాడటం జగన్ రాజకీయం అని ఎద్దేవా చేశారు.   ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రారంభం కావడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది. ఇది నిస్సందేహంగా చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకుని సాకారమైన ప్రాజక్ట్ అని అడుసుమిల్లి ముక్తాయించారు.  Bhogapuram Airport Launch,  Chandrababu Vision, Jagan Credit Chori Attempts, Uttarandhra Development,   PM Modi Bhogapuram, Telogu One
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు   వైసీపీ అధినేత   జగన్  శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన చేసినన వ్యాఖ్యలు   కొత్త వివాదానికి తెరలేపాయి. సీదిరి అప్పలరాజును జైలులో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుట్ర చేశారని, అప్పలరాజు అంటే చంద్రబాబుకు అసలు పడదని, కక్షపూరితంగానే ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జగన్ గుప్పించిన విమర్శలు పరిశీలకులనే కాదు సామాన్య జనాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెబుతున్నట్లుగా ఈ కేసులో  రాజకీయ ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు  ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.   సీదిరి అప్పలరాజు చేసిన  అతే..  ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.  నిర్లక్ష్యంగా బైక్ నడిపి  ఒక అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో..  నిజాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమేంటన్న చర్చ ఇప్పుడు జనంలో విస్తృతంగా జరుగుతోంది. కేసు ఏమిటంటే..  శ్రీకాకుళం జిల్లా పరిధిలో బుల్లెట్ బైక్‌తో ప్రమాదం జరిగి ఒక సామాన్య గొర్రెల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో బైక్ నడుపుతోంది సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాగా, తన కుమారుడిని ఈ కేసు నుండి తప్పించడానికి మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు.  తన కొడుకు ఆరవ్‌ను బయట పడేసే క్రమంలో, ఆరవ్ స్నేహితుడైన  వేరే యువకుడిని ఈ కేసు ఒప్పుకునేలా ఒత్తిడి తెచ్చారు.  బైకు ప్రమాదం సదరు యువకుడే చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించి కేసు కూడా నమోదు చేయించారు.  అప్పట్లో సీదిరి మాటలను, ఆయన చెప్పిన కథనాన్ని నమ్మిన స్థానిక పోలీసులు, ఆరవ్ స్నేహితుడిపై  కేసు నమోదు చేశారు. అయితే ఈ  వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన గొర్రెల కాపరికి సీదిరి అప్పలరాజు రోడ్డుపై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని ప్రచారం చేసుకున్నప్పటికీ..  అది కూడా వాస్తవం కాదని, దారిన పోతున్న ఒక సాధారణ వ్యక్తి మాత్రమే ఆ సహాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు సీదిరి అప్పలరాజు   అబద్ధపు కథనాన్ని నమ్మి, అక్రమంగా కేసు నమోదు చేసినందుకు గాను శాఖాపరమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం, సంబంధిత సీఐ, ఎస్సైతో సహా పలువురు పోలీసులపై   చర్యలు తీసుకుంది. మొత్తం నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తప్పుడు కేసు కారణంగా నలుగురు పోలీసు అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడగా, మరోవైపు ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడింది. సీదిరి కుమారుడు చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడిని తప్పించేందుకు కుట్రపూరితంగా వేరే వారిపై కేసు పెట్టించడంతో సిదిరి అప్పలరాజు కటకటాల పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయపార్టీ అధినేతగా జగన్ చేయాల్సిందేంటంటే.. బాధితుడి అంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి. అది వదిలేసి.. నిందితులకు పరామర్శలేంటన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.   Jagan Mohan Reddy, Seediri Appalaraju, Palasa accident case, Chandrababu Naidu, AP Political News, AP Police suspension
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బలప్రదర్శన బ్యాక్ ఫైర్ అయ్యింది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి   జనం మధ్యకు రావడం మానేసిన జగన్.. కేసులలో జైలు పాలైన వైసీపీ నేతల పరామర్శకు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం అంతా బెంగళూరు ప్యాలెస్ కో, తాడేపల్లి ప్యాలెస్ కో పరిమితమౌతున్నారు. ప్రెస్ మీట్లతోనే గడిపేస్తున్నారు.  అలా ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా అదే జరిగింది. బలప్రదర్శన ర్యాలీ కారణంగా అయన ఎందుకు  వచ్చారో  ఆ పని చేయలేకపోయారు.   అసలు సీదిరి అప్పలరాజు ఎందుకరస్టయ్యారు అంటే.. అదేదో రాజకీయ కారణం కాదు. తన కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒక వ్యక్తి మరణానికి కారకుడైతే.. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తును పక్కదోవపట్టించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఒక క్రిమినల్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు.  జైలులో ఉన్న అప్పలరాజును ములాఖత్ రోజున కలడానికి వచ్చిన జగన్ ఈ పర్యటనను బలప్రదర్శన వేదికగా మార్చుకోవాలని ప్రయత్నించారు. అందుకే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఈ కారణంగా జగన్ జైలు ప్రాంగణం దగ్గరకు చేరుకునే సరికే సమయం గడిచిపోయింది. దీంతో జైలు అధికారులు అప్పలరాజును కలిసేందుకు జగన్ ను అనుమతించలేదు.   దీని ఫలితంగా, జైలులో ఉన్న  న మాజీ కేబినెట్ మంత్రిని కలవకుండానే వెనుదిరిగారు.  YS Jagan Mohan Reddy, Seediri Appalaraju, Srikakulam jail meeting, YCP politics, Andhra Pradesh news, Telugu One
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్', అలాగే 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' ముందు వరుసలో ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణ సంస్థల కాంపౌండ్ లో ఎప్పుడూ చూసినా నాలుగైదు సినిమాలు ఒకేసారి రన్నింగ్ లో ఉండటం కామన్. ఒక వైపు పెద్ద హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలు, మరోవైపు యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ తీసే ప్రామిసింగ్ ప్రాజెక్టులు ఎప్పుడూ సెట్స్ పై సందడి చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్యానర్స్ ఒక  ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం తమ వర్కింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోబోతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదే పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'. 'గాడ్ ఆఫ్ వార్' సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లకు అన్ని రకాలుగానూ అత్యంత కీలంగా మారనుంది. ఈ భారీ బడ్జెట్ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని, మేకింగ్ లో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ కారణంతోనే సినిమా షూటింగ్ మొదలయ్యే లోపు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా ఒకేసారి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే ఈ సంస్థలు, 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్ పైకి వెళ్లేలోపే ప్రస్తుతం చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అంతేకాకుండా, ఇంకా ప్రారంభ దశలో ఉన్న కొన్ని ఇతర ప్రాజెక్ట్‌లను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది.  నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా ఫినిష్ చేసి, కొత్తగా అనుకున్న ప్రాజెక్టులను కాస్త పక్కన పెట్టి, ప్రొడక్షన్ హౌస్ లోని మొత్తం ఫోకస్, రిసోర్సెస్ ను కేవలం ఈ ఒక్క సినిమా పైనే పెట్టబోతున్నారట. ఈ స్థాయిలో ప్రొడక్షన్ మొత్తం ఒకే సినిమాపై దృష్టి పెట్టడం అనేది టాలీవుడ్ లో చాలా అరుదుగా చూస్తుంటాం. 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ స్కేల్, దాని ప్రాముఖ్యత ఎంతటిదో ఈ నిర్ణయమే స్పష్టం చేస్తోంది. ఏ రకమైన డిస్ట్రాక్షన్ లేకుండా, అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో, అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రొడక్షన్ టీమ్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.   God Of War, Jr NTR, Trivikram
  -నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన శ్రీనివాస మంగాపురం -జై కృష్ణ పెర్ ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫిదా -దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్ ఘట్టమనేని జై కృష్ణ(Jai Krishna)నిన్న వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం'( తో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ 'అజయ్ భూపతి' దర్శకత్వంలో తెరకెక్కగా జై కృష్ణ తో 'స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన' అంటూ బంగారు బుల్లోడు బాలయ్య తో కలిసి చిందులేసిన బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీ రోల్స్ పోషించారు.  మొదటి రోజు శ్రీనివాస మంగాపురం వరల్డ్ వైడ్ గా 2 .2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలలో వినిపిస్తుంది. తొలిరోజు ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 1.40 కోట్లకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధికంగా 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. కర్ణాటకలో  5 లక్షలు, తమిళనాడులో  1 లక్ష, మిగిలిన భారతీయ ప్రాంతాల్లో  4 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు  2 కోట్ల నుండి  2.2 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణీ కొట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి శుభారంభాన్ని సూచించింది. Also read: Newtons 3rd law movie review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ  థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలోనూ  మెరుగైన ఆదరణ పొందింది. తెలుగు వెర్షన్ రోజు మొత్తంలో సగటున 19.31% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఉదయం షోలు అత్యధికంగా 22% ఫుట్‌ఫాల్స్‌తో సందడిగా మారాయి. మధ్యాహ్నం 15.77%, సాయంత్రం 17.38%, మరియు నైట్ షోలలో 18% ఆక్యుపెన్సీ కనిపించింది.  మాస్ కాన్సెప్ట్, జై కృష్ణ ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులని, ప్రేక్షకులని  విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మోహన్ బాబు విలనిజం, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ ప్రధాన బలంగా నిలిచాయి. టాక్ పరంగా, రివ్యూస్ పరంగా బాగానే వస్తుండటంతో  వీకెండ్ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. Jai Krishna, Srinivasa Mangapuram, Rasha Thadani, Mohan Babu   
Cast: Sumanth, Jagapathi Babu, Srinivas Avasarala, Trinadh Varma, Ravi Varma, Shelly N Kumar, Neha Pathan, Pandit Gautam Crew: Written and Directed by Rajesh Karna Cinematography by Veda Vyas Gottipati Music by Sinjith Yerramilli Edited by Anil Kumar P Produced by Harish Kohirkar Sumanth has become very selective, focusing on strong stories. His latest outing is the suspense crime thriller, Newton's 3rd Law, presented by ETV Win. Promising a unique karma-based concept matching the famous physics principle, the film hit theaters today. Let's discuss how it fares. Plot: David (Srinivas Avasarala) receives a mysterious book titled "Newton's 3rd Law." Reading it, he realizes it mirrors real events from 1999: a woman's fatal accident and a young man named Vinay's alleged suicide. Cop Vasudev (Sumanth) investigates and discovers Vinay was actually murdered. His probe uncovers dark secrets involving Vinay's parents, his missing friend, and the dangerous criminal Stephen Mercury (Jagapathi Babu). How these crimes connect forms the rest of the story. Analysis: Sumanth delivers a measured and subtle performance as Cop Vasudev, carrying the serious tone of the film with ease. Jagapathi Babu, though in a limited cameo as Stephen Mercury, leaves a strong impact with his screen presence. Srinivas Avasarala is neat in his role as the reader unraveling the mystery. Supporting actors like Trinadh Varma and Shelly N Kumar also do justice to their crucial roles, adding necessary depth to the narrative. Director Rajesh Karna brings an interesting core concept to the table by linking the physics law of action and reaction to the philosophical idea of human karma. The storytelling device of using a mysterious book that mirrors real-life crimes adds a nice thrilling layer to the plot. This creative approach shows promise and attempts to set the film apart from regular police procedurals. However, the execution falters mainly during the initial portions. The first half is quite slow-paced, heavily relying on lengthy interrogation scenes that drag the narrative down. While the makers try to build tension and set up a complex web of characters, the screenplay lacks a tight grip, making it a bit tedious for the audience to stay fully invested during these early stages. The movie finally picks up the required momentum in the second half. Once the backstories of the victims and the main antagonist start to unfold, the actual thrill kicks in. The final twists are handled well and manage to connect all the scattered dots convincingly. Despite the earlier pacing issues, the climax delivers a satisfying payoff that justifies the karma theme. Positives: Sumanth's subtle performance Karma-based core concept Second-half twists Negatives: Slow-paced narration Dragged investigation scenes in first half Some predictable moments Bottomline: A decent crime thriller that tests patience for long time.  Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  యువతకు నచ్చే యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'దీవానా' థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్‌లో యూత్‌ను, ఎమోషనల్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామా ఈరోజు (జూలై 31) నుండి ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 143 నిమిషాల రన్‌టైమ్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా, స్మేహా మణిమేగలై హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అంతేకాకుండా నరేష్, ఝాన్సీ, బలగం వేణు, జీవన్ కుమార్ తదితరులు కీలక పాత్రలలో కనిపించి తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. 'దీవానా' కథ విషయానికొస్తే.. డిగ్రీ పూర్తి చేసి బాధ్యత లేకుండా తిరిగే మున్నా (హర్షిత్ రెడ్డి), ప్రభుత్వ ఉద్యోగి అమూల్య (స్నేహ మణిమేగలై) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రేమ కోసం మారాలనుకునే కుర్రాడి ప్రయాణమే ఈ చిత్రం. ప్రేమ, స్నేహం, కుటుంబ బాధ్యతలు, జీవితంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారే యువకుడి ప్రయాణంగా తెరకెక్కింది. సెన్సార్ బోర్డు నుండి 'A' సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం, యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకుంటుంది.      Deewana Movie, OTT Telugu, Harshith Reddy, Smeha Manimegalai
  -మూవీ పేరు: న్యూటన్స్ థర్డ్ లా -న‌టీన‌టులు: సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, త్రినాథ్ వర్మ, రవివర్మ, షెల్లీ కుమార్, నేహా పఠాన్, అభినయన, గౌతమ్ పండిట్  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: వేద వ్యాస్ గొట్టిపాటి   -ఎడిటింగ్: అనిల్ పలాస  -మ్యూజిక్: సింజిత్ యర్రమిల్లి  -నిర్మాత‌:హరీష్ కోహిర్కర్  -బ్యానర్ :ఈటీవీ విన్  -రచన,దర్శకత్వం: రాజేష్ కర్ణ  -రిలీజ్ డేట్ : జులై 31 ,2026  వైవిధ్యమైన చిత్రాలని అందించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ ఈటీవీ విన్. ఈ రోజు సుమంత్, జగపతి బాబు వంటి స్టార్ స్టేటస్ ఉన్న నటులతో 'న్యూటన్స్ థర్డ్ లా' అనే మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టింది. టైటిల్ తో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడంతో నిన్న ప్రీమియర్స్  ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ డేవిడ్(అవసరాల శ్రీనివాస్) అనే వ్యక్తి ప్రపంచానికి దూరంగా ఒక దీవిలో పెద్ద భవంతిని ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉంటాడు. జ్యోతి(నేహా పఠాన్) ఒక హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంటుంది. వేరే ఊరులో ఉన్న తన భర్తకి ఉద్యోగం రావడంతో ఆరేళ్ళ తన కూతురుతో కలిసి భర్త దగ్గర ఉండటానికి సిద్దమవుతుంది. జ్యోతి పని చేసే హాస్పిటల్ లోనే నర్స్ డిపార్ట్మెంట్ కి పార్వతి( షెల్లీ కుమార్) హెడ్. పార్వతి భర్త గంగాధర్(రవివర్మ) ఖాళీగా ఇంట్లోనే ఉంటూ మత్తుకి బానిస అవుతాడు. కొడుకు పేరు వినయ్( త్రినాథ్ వర్మ) లైఫ్ లో త్వరగా గొప్పవాడు కావాలని అనుకునే మెంటాలిటీ. ఈ క్రమంలో తన ఫ్రెండ్ కార్తీక్( గౌతమ్ పండిట్) తో కలిసి  రాంగ్ రూట్ లో డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. స్టీఫెన్ మెర్క్యురీ(జగపతి బాబు) ఒక అసాంఘిక శక్తి. చట్ట విరుద్ధంగా స్మగ్లింగ్ చేస్తుండటం, అడ్డొచ్చిన వాళ్ళని చంపుతుండటం స్టీఫెన్ నైజం. ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్స్ యొక్క లైఫ్ లోకి పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్( సుమంత్) ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందనేదే న్యూటన్స్ థర్డ్ లా. ఎనాలసిస్   పేపర్ పై  కథగా రాసుకుంటే క్యూరియాసిటీ ఉన్న కథనే. పైగా కర్మ సిద్ధాంతం అనేది మూవీ యొక్క ప్రధాన పాయింట్. అంటే మన వల్ల ఎన్నో కలలు కంటూ ఉన్న ఒక మనిషి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే, అది మన చావు వరకు తీసుకెళ్తుందని చెప్పారు. కానీ కథనం విషయంలో మాత్రం నచ్చేలా  చెప్పలేకపోయారు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ బాగోలేదు. వినయ్ క్యారక్టర్ దొంగతంగా బైక్ ఇంజిన్ ని దొంగిలించి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అతను అలా చేస్తున్నప్పుడు వచ్చిన సాంగ్ ని వినయ్ దేశం కోసం పోరాడుతూ  ఉండే యువకుడిగా  సాంగ్ ప్లే చేయడం పెద్ద విచిత్రం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే   సార్టింగ్  లో వచ్చిన డేవిడ్ సీన్, వినయ్ సీన్, జ్యోతి సీన్ తో మూవీపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ అక్కడ్నుంచి సినిమా క్లైమాక్స్ వరకు వచ్చిన ప్రతి సీన్ మెప్పించే స్థాయిలో సాగలేదు. వాసుదేవ్ (సుమంత్) చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా నార్మల్. చుట్టపు చూపుగా వచ్చి పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. వినయ్, కార్తీక్ మధ్య వచ్చిన సీన్స్ లో కొన్ని బాగున్నా, డైలాగ్స్ సరిగా రాసుకోకపోవడంతో అర్ధం పర్థం లేని సీన్స్ గా మిగిలిపోయాయి. పార్వతి ,గంగాధర్ సీన్స్ పర్లేదు.    ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్స్ లో అయినా వేగం పెరుగుతుంది అనుకుంటే వినయ్, కార్తీక్ మధ్య డైమండ్స్ మధ్య గొడవ పెట్టి, అదే పాయింట్ పై అర్ధం పర్థం లేని బోలెడు సీన్స్ పెట్టి విసుగు తెప్పించారు. సెకండ్ హాఫ్ లో అయినా  స్టీఫెన్ మెర్క్యురీ(జగపతి బాబు) క్యారక్టర్ ని బాగా యాక్టీవ్ చెయ్యాల్సింది. ఆ దిశగా ఆలోచించకోపోవడంతో కథనం ఒకే పాయింట్ పై తిరుగుతుండటం విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ పర్లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు వాసుదేవ్ గా  సుమంత్ నటనలో మెరుపులు లేవు.  మెరుపులు ప్రదర్శించే నటుడైనా     అత్యద్భుతమైన నటనని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది.జగపతి బాబుది అదే పరిస్థితి. కాకపోతే ఉన్నంతలో తన క్యారక్టర్ కి న్యాయం చేసాడు. కథకి హీరోగా భావించే  వినయ్ క్యారక్టర్ లో త్రినాధ్ వర్మ పెద్దగా సూటవ్వలేదు. కొన్ని సీన్స్ లో మాత్రం బాగా చేసాడు. అవసరాల శ్రీనివాస్, షెల్లీ కుమార్, నేహా పఠాన్ , రవివర్మ మాత్రం తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వడంతో పాటు కథనం బోర్ కొట్టకుండా సాగడానికి హెల్ప్ అయ్యారు. దర్శకుడు, రచయిత రాజేష్ కర్ణ విషయానికి వస్తే ఆ రెండు విభాగాల్లోను ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ అయితే అసలు బాగోలేదు. ఫొటోగ్రఫీ పర్లేదు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మెరుపులు నహి.  నిర్మాణ విలువలు పెద్దగా ఉండవు. బలాలు  1 . కథ  2 .మూవీ స్టార్టింగ్ 10 నిమిషాలు, క్లైమాక్స్  బలహీనతలు   1 . కథనం  2 . డైరెక్షన్      చివరిగా చెప్పుకోవాలంటే 'న్యూటన్స్ థర్డ్ లా' ని  చూస్తున్నంత సేపు  ప్రేక్షకులకి నచ్చడం కోసం తెరకెక్కించలేదేమో అనిపిస్తుంటుంది.     Rating 2 /5                                                                                             అరుణాచలం   
The makers of Yash's Toxic: Fairytale for GrownUps have unveiled a special birthday poster of leading lady Kiara Advani, giving fans another glimpse into the film's stylish and intriguing world. The new poster presents Kiara in a striking crimson red outfit, carrying a regal and elegant look that has quickly caught the attention of fans across social media. The actress appears glamorous with an international-inspired styling, while her poised expression adds to the mysterious aura surrounding her character. The poster has received an enthusiastic response online, with fans praising Kiara's stunning transformation and the film's rich visual aesthetics. Directed by Geethu Mohandas and produced by KVN Productions in association with Monster Mind Creations, Toxic has emerged as one of the most anticipated Indian films of the year. Every promotional asset released so far—including the teaser, trailer and songs like Tabaahi and Madhoshi—has generated significant buzz, further fueling expectations for the action-packed entertainer. Apart from Yash and Kiara Advani, the film features an impressive ensemble cast including Nayanthara, Tara Sutaria, Huma Qureshi, and Rukmini Vasanth in pivotal roles. Yash's intense gangster avatar and the film's stylized action sequences have already become major talking points among moviegoers. With anticipation continuing to soar after the latest poster reveal, Toxic: Fairytale for GrownUps is gearing up for a grand worldwide release on August 26 in multiple languages. Fans are eagerly waiting to witness the unique cinematic world that Yash and Geethu Mohandas have promised on the big screen. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' లో జులై 29వ తేదీ నుంచి 'ఆజాదీ 501' (Azadi 501) అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. సాయితేజ కల్వకోట కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్‌కు శివతేజ దర్శకత్వం వహించారు. మొత్తం 6 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్, ఒకప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఒక భారీ స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కథ అంతా 2014 నుండి 2018 మధ్యకాలంలో కాకినాడ నేపథ్యంతో నడుస్తుంది. కథానాయకుడు జితేంద్ర (సాయితేజ కల్వకోట) తన తల్లి యశోద, చెల్లెలు ప్రీతితో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ జితేంద్ర భుజాలపై పడతాయి. తండ్రి నిర్మించిన స్కూల్ హక్కుల కోసం కోర్టులో సుదీర్ఘమైన కేసు నడుస్తూ ఉంటుంది. ఒకవైపు తండ్రి ఆశయమైన స్కూల్‌ను కాపాడుకోవడం, మరోవైపు కుటుంబ అవసరాలను తీర్చడం జితేంద్రకు పెద్ద సవాలుగా మారుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక అతనిలో మొదలవుతుంది. ఈ ఆలోచనతోనే తన స్నేహితుడు కిషన్ సహాయంతో ఒక సంచలనాత్మక వ్యాపార ప్లాన్ సిద్ధం చేస్తాడు. అది స్మార్ట్‌ఫోన్‌లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్న కాలం. అయితే, అధిక ధరల కారణంగా సామాన్యులకు స్మార్ట్‌ఫోన్ ఒక కలగానే మిగిలిపోయింది. ఈ పాయింట్‌నే జితేంద్ర బిజినెస్ అవకాశంగా మలుచుకుంటాడు. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ అందించాలనే ఆలోచనతో, చైనా నుంచి చౌకగా ఫోన్లను దిగుమతి చేసుకుని, వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' లోగోతో 'ఆజాదీ 501' బ్రాండ్ పేరును ముద్రిస్తాడు. కేంద్ర మంత్రి శరత్ గోయెల్ (హర్షవర్ధన్) చేతుల మీదుగా ఈ 'ఆజాదీ 501' మొబైల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయిస్తాడు. ఊహించని రీతిలో ఈ ఫోన్ సంచలనం సృష్టిస్తుంది. లక్షలాది మంది ప్రజలు ఈ ఫోన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో జితేంద్ర రాత్రికి రాత్రే వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారతాడు. అయితే, ఈ విపరీతమైన ప్రజాదరణతో పాటు జితేంద్రకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సెంట్రల్ మినిష్టర్ శరత్ గోయెల్ కన్ను జితేంద్ర సంపాదన, లాభాలపై పడుతుంది. మరోవైపు, ఈ రూ. 501 స్మార్ట్‌ఫోన్ వెనుక ఏదో పెద్ద మోసం దాగి ఉందనే అనుమానంతో ఐపీఎస్ ట్రైనీ చాణక్య చక్రవర్తి (శశాంక్) విచారణ ప్రారంభరిస్తాడు. దీనికి తోడు నిజానిజాలు బయటకు తీయడానికి స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ (రవివర్మ) కూడా రంగంలోకి దిగుతాడు. మూడంచెల ఒత్తిడి నడుమ, రాజకీయనాయకులు మరియు అధికారుల నుంచి ఎదురయ్యే బెదిరింపులకు జితేంద్ర భయపడకుండా, లంచాలు ఇవ్వకుండా తన ప్లాన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది ఈ సిరీస్‌లో ప్రధానాంశం. దర్శకుడు శివతేజ వ్యాపారం మరియు మోసం అనే రెండు కోణాలను చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. 2014-2018 కాలంలో జరిగిన నిజమైన స్కామ్ ఘటనలను ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్‌గా తెరకెక్కించారు. సాయితేజ నటన, శశాంక్, హర్షవర్ధన్, రవివర్మ పాత్రలు సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. చివర్లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. లవ్ ట్రాక్ లేకపోవడం, మదర్ సెంటిమెంట్ మోతాదు కొద్దిగా తగ్గడం చిన్నపాటి లోపాలుగా అనిపించినా, మొత్తం మీద 2.75/5 రేటింగ్‌తో ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్లాది మంది శ్రోతలను మైమరిపించిన ప్రముఖ నేపథ్యగాయని కోకా జమునా రాణి (88) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గాయని కె. జమునా రాణి 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆమె తండ్రి కె. వరదరాజులు నాయుడు కాగా, తల్లి కె. ద్రౌపది. తల్లికి సంగీతం పట్ల ఉన్న మక్కువ కారణంతో జమునా రాణికి చిన్ననాటి నుంచే సంగీతంపై ప్రత్యేకమైన పట్టు, అనురాగం ఏర్పడ్డాయి.  కేవలం ఏడేళ్ల వయసులోనే, అంటే 1946 లోనే చిత్తూరు నాగయ్య నిర్మించిన ప్రముఖ చిత్రం 'త్యాగయ్య'లో బాలనటుల కోసం తొలిసారిగా పాట పాడి తన గాత్ర ప్రయాణాన్ని పిన్న వయసులోనే ప్రారంభించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా తన అద్భుతమైన స్వరంతో సినీ సంగీత ప్రపంచంలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. జమునా రాణి కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు శ్రీలంకలోని సింహళ భాషల్లో కూడా దాదాపు 6,000కు పైగా పాటలు ఆలపించారు.  ఆమె పాడిన ఎన్నో పాటలు నేటికీ శ్రోతల గుండెల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా తెలుగులో 'సరదా సరదా సిగరెట్టు', 'ఎంత టక్కరి వాడు నారాజు', 'ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం', 'కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా', 'పదపదవె వయ్యారి గాలిపటమా' వంటి ఎవర్ గ్రీన్ గీతాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకమైన తుంటరితనం, హుషారు, భావ వ్యక్తీకరణ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి. భారతీయ సంగీత రంగానికి, ప్రత్యేకించి తమిళ సినీ సంగీత రంగానికి ఆమె చేసిన విశిష్టమైన సేవలను గుర్తించి 1998లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మకమైన 'కలైమామణి' పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత 2002లో తమిళనాడు ప్రభుత్వంచే 'అన్నాదురై' పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఏడేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె సంగీత ప్రయాణం 6000కి పైగా పాటల వరకు సాగడం భారతీయ సంగీత చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం. నాటి తరం నటీనటుల నుంచి నేటి తరం సంగీత ప్రియుల వరకు అందరినీ తన వైవిధ్యభరితమైన స్వరంతో అలరించిన జమునా రాణి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన గీతాలు ఎప్పటికీ చిరస్థాయిగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోతాయి.     Singer, K Jamuna Rani, Passed Away  
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న విజువల్ వండర్ ‘వారణాసి’ థియేటర్లలోకి అడుగుపెట్టడానికి సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రియులు, సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.  నిజానికి ‘వారణాసి’ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కావడం అనుమానమనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని కూడా వార్తలొచ్చాయి. "సరిగ్గా 250 రోజుల్లో ఏప్రిల్ 7న వారణాసి వస్తోంది" అంటూ తాజాగా మూవీ టీమ్ ప్రకటించి వాయిదా వార్తలకు చెక్ పెట్టింది. ఈ భారీ ప్రాజెక్ట్ థియేట్రికల్ రిలీజ్‌కు 250 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా నెలకొంది. #Varanasi హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ పోషిస్తున్నారు. శ్రీరాముడి పాత్రలోనూ కనువిందు చేయనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నారు.  టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పాటు వారాణసి నగరానికి దూసుకొచ్చే ఆస్టరాయిడ్ ప్రమాదం, త్రేతాయుగం బ్యాక్‌డ్రాప్‌ చుట్టూ ఈ కథ నడుస్తుందనే ప్రచారం సినీ ప్రియులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఇదిలా ఉంటే, మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ఉండటంతో, ఆ ప్రత్యేక రోజున మేకర్స్ నుంచి ఏమైనా క్రేజీ అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.     250 Days To Varanasi, Mahesh Babu, SS Rajamouli  
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. గతంలో ప్రకటించిన తేదీల ప్రకారం ఈ పాటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉన్న ఈ బిగ్ ప్రాజెక్ట్, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  అయితే, ప్రస్తుతం విశ్వంభర సినిమాకు సంబంధించిన ప్రధాన వీఎఫ్ఎక్స్ పనులు ఆఖరి దశకు చేరుకోవడంతో, చిత్ర యూనిట్ గ్రాండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘బింబిసార’ చిత్రంతో తన అద్భుతమైన కథనంతో విజయాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ సోషియో ఫాంటసీ విజువల్ వండర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్  భారీ బడ్జెట్‌తో, ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, వశిష్ట సోషియో ఫాంటసీ మార్క్ విజన్ తోడవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే విశ్వంభర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దసరా పండుగ సెలవులను వినియోగించుకునేలా అక్టోబర్ 16 విడుదల తేదీని మేకర్స్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. సుదీర్ఘమైన దసరా సెలవులు కలసిరావడం వల్ల మొదటి వారం నుంచే సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు నమోదు కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ దసరా పోరు మరింత ఆసక్తికరంగా మారబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'జైలర్ 2' కూడా దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ బరిలోకి దిగుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఇద్దరు ఐకాన్స్ మధ్య బిగ్గెస్ట్ క్లాష్ ఖాయమనే వార్తలు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.      Chiranjeevi, Vishwambhara, Rajinikanth, Jailer 2  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఇలా పెట్టచ్చు..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే.. పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు.. జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు. ఇతరులకు మర్యాద ఇవ్వడం.. జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం.. జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి. ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం.. జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట. ఒకసారి ఒక పనినే చేయడం.. పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.                                  *రూపశ్రీ.  
లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది. కానీ లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల EMI చెల్లించడం చాలా మందికి ఒత్తిడిగా మారుతోంది. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఈ EMI భారం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఫైనాన్షియల్ గైడ్ రామకృష్ణ మాగులూరి గారు లోన్ తీసుకునే ముందు ఏ విషయాలు ఆలోచించాలి, ఎంత వరకు అప్పు చేయడం మంచిది, EMI భారం తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు పెంచుకోవాలి, ఆర్థిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి వంటి ఉపయోగకరమైన సూచనలను చాలా సులభంగా వివరించారు. అప్పుల భారం లేకుండా ప్రశాంతమైన ఆర్థిక జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి.      
పెద్దల మాట కొట్టి పడేయకండి..  కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..! ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.  ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసేవారు.  కానీ నేటి వేగవంతమైన జీవితాల కారణంగా ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయడం చాలా అరుదుగా మారిపోయింది. పిల్లలు స్కూల్లో,  తల్లిదండ్రులు ఆఫీసులలో.. ఇలా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండటం లేదు.. కనీసం రాత్రి సమయంలో అయినా కలిసి భోజనం చేస్తారా అనుకుంటే.. ఒకరు బయట తినేయడం,  ఇంకొకరు పార్టీలో తినేయడం,  ఇంకొకరు ఆలస్యంగా ఇంటికి రావడం.. ఇలాంటి కారణాల వల్ల కుటుంబంలో అందరూ కలిసి తినే సందర్బం ఉండటం లేదు. అయితే.. పెద్దలు మాత్రం కుటుంబంలో అందరూ కలిసి కనీసం రోజులో  ఒకసారి అయినా భోజనం చేయాలని చెబుతారు. అందరూ కలిసి భోజనం చేయడం ఎందుకు ముఖ్యమూ.. తెలుసుకుంటే.. విద్య ఫలితాలు.. అంతా కలిసి భోజనం చేసే కుటుంబాలలో పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారట. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వారిని మానసికంగా మెరుగ్గా ఉంచి,  చదువులో మంచి వికాసం కలిగేలా చేస్తుందట. పిల్లలు చక్కగా చదువుకుంటారట. లాంగ్వేజ్,  కమ్యూనికేషన్ స్కిల్స్.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేసినప్పుడు  పిల్లలలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ అవుతాయి. పిల్లలు పెద్దలతో మాట్లాడటం,  కావలసినది అడగడం, వద్దని చెప్పడం,  వంట బాగుందని చెప్పడం.. ఇలా భోజనం సమయంలో చాలా సంఘటనల నుండి పిల్లలు చక్కగా మాట్లాడటం,  చక్కగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెద్దల సమక్షంలో పిల్లలు భోజనం చేయడం వల్ల పిల్లలు తినే విధానం,  ఎలా తినాలి? కావలసిన ఆహారం తినడం, ఆహారం వృధా చేయకపోవడం, శుభ్రంగా తినడం వంటి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి.  అంతేకాదు.. ఆహారాన్ని కలుపుకునే విధానం కూడా పెద్దల నుండే నేర్చుకుంటారు. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు సంపూర్ణ ఆహారం తినే అవకాశం ఉంటుంది.  పండ్లు, కూరగాయలు,  పోషకాలు, ప్రోటీన్.. ఇలా అన్ని రకాలు పిల్లలకు అందుతాయి. తృప్తిగా తింటారు.. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు హ్యాపీగా తినడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలు తృప్తిగా తినడానికి కారణం అవుతుంది. సెల్ఫ్ రెస్సెక్ట్, సెల్ఫ్ కాన్పిడెన్స్.. పెద్దల దగ్గర కూర్చుని పిల్లలు తామే ఆహారం కలుపుకోవడం, తినడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం,  ఆత్మగౌరవం పెరుగుతాయి. బందాలు.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది.  అందరూ కలిసి తినే ఆ కొద్ది సమయం అందరినీ కలిపి ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్.. ఒంటరిగా తినేటప్పుడు కోపం,  డిప్రెషన్, ఒత్తిడి వంటి ఎమోషన్స్ తో తినే అవకాశం ఉంటుంది.  పైగా ఒంటరిగా తినేటప్పుడు ఒంటరితనం కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ కలిసి తింటే.. ఒత్తిడి,  ఆందోళన,  డిప్రెషన్ వంటివి ఉండవు. చెడు అలవాట్లు.. ఒక వయసులోకి వచ్చిన పిల్లలు చాలా వరకు మధ్యం సేవించడం,  స్మోక్ చేయడం,  డ్రగ్స్ వాడటం వంటివి చేసే అలవాటు ఉంటుంది. కానీ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే పిల్లలలో చాలా వరకు మానసిక మార్పు కలుగుతుంది.  చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలు.. అందరూ కలిసి భోజనం  చేసేటప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎక్కువ ఆహారం తినవద్దని,  ఎక్కువ ఉప్పు, కారం వంటివి తినవద్దని ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకోవడం లేదా జాగ్రత్తలు చెప్పడం లాంటివి జరుగుతాయి.  దీని వల్ల ఒబెసిటీ,  దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.                      *రూపశ్రీ.  
  పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.  పచ్చబొట్టును కొత్తగా టాటూ అని పిలుస్తున్నారు. ఈ టాటు పచ్చబొట్టుకు అప్డేడ్ వెర్షన్ అనుకోవచ్చు. పచ్చ బొట్టు గురించి కవులు ఎన్నో పాటలు కూడా రాశారు. నేటికాలంలో పచ్చబొట్టును చాలా కొత్తగా వేయించుకోవడం మాత్రమే కాకుండా చాలా కామన్ విషయంగా కూడా అయిపోంది. చాలామంది తమ  అభిరుచి కారణంగా టాటూలు , పియర్సింగ్‌లు చేయించుకుంటున్నారు. ఈ  టాటూలు లేదా పియర్సింగ్‌ల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని అనుకుంటారు. అయితే ఇది పూర్తీ నిజం కాదు.. బాడీ ఆర్ట్ గా పిలువబడే పచ్చబొట్టు లేదా టాటు.. కాలేయాన్ని తీవ్రమైన ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. బాడీ ఆర్ట్.. కాలేయానికి జరిగే హాని.. టాటు వేయించుకుంటే ఫ్యాషన్ లో భాగంగా కొత్తగా కనిపించవచ్చు అనుకుంటారు.  అయితే  ఈ ఫ్యాషన్ కాలేయానికి ప్రమాదాన్ని పెంచుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. టాటూ వేసినప్పుడు  రక్తం వల్ల  హెపటైటిస్ బి , హెపటైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్లు  కాలేయంపై నేరుగా దాడి చేస్తాయట. ఇవి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం రక్త ఇన్ఫెక్షన్ కారణం అని చెబుతున్నారు. టాటూ నీడిల్స్.. టాటూ ఆర్టిస్ట్ లు శుభ్రపరచని సూదులను లేదా అవే పరికరాలను పదేపదే ఉపయోగిస్తే, వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందట. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, హెపటైటిస్ లక్షణాలు సంవత్సరాల తరబడి బయటపడకపోవచ్చని, ఈ కారణంగా ఇది ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసి, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. పచ్చబొట్టు  వేయించుకొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. మార్కెట్‌లో లైసెన్స్ పొంది, మంచి పేరున్న స్టూడియోలకు మాత్రమే వెళ్లాలి,  పార్టీలో లేదా ఇంట్లో టాటూ వేయించుకోవడం మంచిది కాదు. టాటూ ఆర్టిస్ట్ లను,  వారి సెటప్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు కొత్త, క్రిమిరహితం చేసిన సూదులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి.  అంతేకాదు.. వీటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి సందేహాలు తీర్చుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి. టాటూ వేయడానికి ఉపయోగించే ఇంక్  ఒక చిన్న, ఒకేసారి వాడే కప్పులో ఉండాలి. అలాగే, టాటూ ఆర్టిస్ట్  సూదిని నేరుగా పెద్ద సిరా సీసాలో ముంచకూడదు. ఎందుకంటే, ఒకే సీసాను పదేపదే వాడటం వల్ల సిరా డబ్బా మొత్తం కలుషితం కావచ్చు. టాటూ ఆర్టిస్ట్ చేతులు కడుక్కొని, ఆ తర్వాత కొత్త డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి. అలా ఉండే టాటూ ప్రాసెస్ శుభ్రంగా ఉన్నట్టు. జాగ్రత్త..  
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం. అయితే సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపించవచ్చు. ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి సులభంగా వివరిస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఏ ఆహారాల్లో లభిస్తాయి, అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం, చర్మ కాంతి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత కోసం తీసుకోవాల్సిన ఆహారాలు, దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి కూడా విలువైన సూచనలు అందించారు. 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, స్లిమ్‌గా, ఉత్సాహంగా ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: 40 ఏళ్ల తర్వాత మహిళలకు అవసరమైన పోషకాహారం యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ప్రయోజనాలు బరువు పెరగకుండా ఉండే ఆహారాలు మెటాబాలిజం పెంచే ఆహారాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఎముకలు బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం డైట్ సూచనలు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవ్వండి.    
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ.. ప్రతిరోజూ రాత్రి నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. రాత్రి పూట ఇలా మూత్ర విసర్జనకు లేవడం అనేది  కేవలం నిద్రకు అంతరాయం కలిగించే సమస్య మాత్రమే కాదని, అది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు వైద్యులు. మీరు కూడా ప్రతి రోజూ నిద్ర మధ్యలో మూత్ర విసర్జన కోసం లేస్తుంటే కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి. మధుమేహం.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిని మించినప్పుడు, మూత్రపిండాలు అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరం నుండి అధికంగా నీరు కూడా నష్టపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావచ్చు. దీనితో పాటు అధిక దాహం, తరచుగా ఆకలి వేయడం, అలసట, లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓవర్ యాక్టీవ్ బ్లాడర్..  మూత్రాశయం సాధారణం కంటే ఎక్కువగా  సంకోచించే  పరిస్థితిని ఓవర్ యాక్టీవ్ బ్లాడర్ అని అంటారు. దీనివల్ల  వ్యక్తికి తరచుగా , ఆకస్మికంగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, కొన్నిసార్లు రాత్రిపూట చాలాసార్లు నిద్రలోంచి మెలకువ కూడా వస్తుంది. ఈ సమస్య వృద్ధాప్యం, నరాల వ్యాధి, ఊబకాయం లేదా  మూత్రాశయ కండరాలు బలహీన వడటం వల్ల ఎదురవుతుంది. సరైన చికిత్స , జీవనశైలి మార్పులతో దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు. యూటీఐ.. యూటీఐ అనేది మూత్ర మార్గంలోని ఏ భాగానికైనా సోకగల ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, మంట, నొప్పి, దుర్వాసన,   మూత్రం మబ్బు రంగులో ఉండటం,  కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపించే  అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మూత్రపిండాల సమస్యలు.. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను , అదనపు నీటిని తొలగిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రవిసర్జన పరిమాణంలో , సమయంలో మార్పులు సంభవించవచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, పాదాలు లేదా చీలమండలలో వాపు, అలసట, ఆకలి లేకపోవడం , అధిక రక్తపోటు వంటి సమస్యలు మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు కావచ్చు. ఇటువంటి సందర్భాలలో,  మూత్రపిండాలను పరీక్షించుకోవడం , వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అదిక రక్తపోటు, మందుల ప్రభావాలు.. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు, ముఖ్యంగా డైయూరెటిక్స్ వంటి మూత్రవిసర్జనను పెంచే మందులు, శరీరం నుండి అదనపు ఉప్పు , నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఈ మందులను సాయంత్రం లేదా రాత్రిపూట తీసుకుంటే, రాత్రి సమయంలో చాలాసార్లు బాత్రూమ్‌కు వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపి, మూత్రవిసర్జన అలవాట్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలవాలి.. ప్రతి రాత్రి 2-3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కోసం నిద్రలేస్తుంటే వైద్యుడిని కలవాలి.  మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట,  మూత్రంలో రక్తం పడటం,  ఎన్ని నీళ్లు తాగినా చాలా దాహంగా ఉండటం,   కాళ్ళలో వాపులు కనిపించడం,  జ్వరంతో పాటు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి.                                        *రూపశ్రీ.