Home

»

Latest News

ఈ తెలుగు సినిమా చూడండి: ఫ్రీగా మేఘాలయ ట్రిప్ కొట్టేసే బంపర్ ఆఫర్!

Oct 3, 2026 7:11PM


ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ ఈ వర్డ్ ని ఇష్టపడని వారంటూ ఈ భూమ్మీద ఉండరు. జూలో జంతువులు సైతం ప్లీజ్.. ఎక్కడ.. ఫ్రీ, మీకు పుణ్యం ఉంటుంది చెప్తారా అని కాళ్లవేళా పడే పరిస్థితి.  ఫ్రీ అనే వర్డ్ అంత సమ్మోహతని దాచుకుంది. మరి ఇప్పుడు ఒక సినిమా నన్ను చూసి మేఘాలయ ట్రిప్ ఫ్రీ గా వెళ్లండని అంటుంది. అదేంటో చూద్దాం  


 అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రీసెంట్ గా  కొత్త తరం క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' ట్రైలర్ ఘనంగా విడుదలయ్యింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొణెపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నే  మేకర్స్ ఏకంగా ఉచిత మేఘాలయ ట్రిప్ ఆఫర్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆఫర్ ప్రకారం, 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు సంబంధించి నిర్వహించే ఒక కాంటెస్ట్‌లో పాల్గొని గెలుపొందిన మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఉచితంగా మేఘాలయ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాత వేణు దొణెపూడి అధికారికంగా వెల్లడించారు. మేఘాలయలోని అద్భుతమైన లొకేషన్లలో పూర్తి స్థాయిలో చిత్రీకరించిన ఈ సినిమా చూడటంతో పాటు, ప్రేక్షకులకు స్వయంగా ఆ అందాలను వీక్షించే అవకాశం దక్కడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

 

 


ఇది కూడా చదవండి: ఫ్యాన్ వార్స్: ఎవరి కోసం..స్నేహం వర్సెస్ సోషల్ మీడియా వేధింపులు


మరి మేఘాలయ అందాలు చూడాలంటే  అక్టోబర్ 9న మీ అభిమాన థియేటర్ లో బా బా బ్లాక్ షీప్ చూసేయండి.

 

[Baa Baa Black Sheep Movie Offer, Baa Baa Black Sheep Trailer, Nag Ashwin Release Baa Baa Black Sheep, Meghalaya Trip Offer, Chitralayam Studios, Baa Baa Black Sheep Movie, Upendra Limaye, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com