
ఈ సారి మాత్రం పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలే.. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదబ్బా అంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'కల్ట్' ని ముస్తాబు చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో అభిమానులు, సినీ ప్రియులు, సినీ సర్కిల్స్ లో మోస్ట్ అవేటెడ్ ప్రొజెక్ట్ గా మారింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు రాని ఒక సరికొత్త తరహా 'స్లాషర్ థ్రిల్లర్' (Slasher Thriller) జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. తారక్ సినిమాస్ మరియు వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్ కాకరాల, కరాటే రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రాన్ని రాబోయే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా ప్రకటన నాటి నుంచే ఫిలిం నగర్ వర్గాల్లోనూ, విశ్వక్ అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమో మరియు 45 నిమిషాల గ్లింప్స్ మేకర్స్ సృష్టించిన డార్క్ వరల్డ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాయి. రక్తంతో తడిసిన గొడ్డలి చేతపట్టుకుని తీవ్రమైన ఆవేశంతో ఉన్న విశ్వక్ సేన్ రౌద్ర రూపం ప్రేక్షకుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన కెరీర్‌లో మొదటిసారిగా విశ్వక్ సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తుండటం ఈ చిత్రానికి అతిపెద్ద విశేషం.
గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి మరో పవర్ ఫుల్ ప్లస్ పాయింట్ ఏమిటంటే, క్లోజ్ ఫ్రెండ్ మరియు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించగా, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతాన్ని సమకూర్చారు. కెమెరామెన్ అరవింద్ విశ్వనాథన్ తన మార్క్ ఛాయాగ్రహణంతో విజువల్స్ అందించగా, ఎడిటర్ రవి తేజా గిరిజాలా, ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ ములే ఎంతో శ్రమించి అద్భుతమైన డార్క్ సెట్స్ నిర్మించారు.
ఇది కూడా చదవండి: చరణ్, సుకుమార్ RC17 షాకింగ్ డెడ్‌లైన్!

దేశంలోనే మొదటి గ్లోబల్ స్లాషర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని 'ఆర్-రేటెడ్' (R-Rated) కంటెంట్‌తో విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్‌లతో సహా మొత్తం 5 విభిన్న భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. కల్ట్ మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని, యాక్షన్ ప్రియులకు అక్టోబర్ 30న థియేటర్లలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని చిత్ర బృందం ధీమాలో ఉంది.
[Vishwak Sen Cult release date, Cult Telugu movie shooting update, Vishwak Sen R rated slasher thriller, Cult movie October 30 release, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






