హస్తినలో  రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ   సోమవారం (జులై 29) చలో పార్లమెంట్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ  కార్యకర్తలు, మద్దతుదారులు ఢిల్లీ సరిహద్దులకు, సెంట్రల్ ఢిల్లీ వైపు చేరుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.   శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు  భద్రతను   కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు.   కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేని ఏ కార్యక్రమాన్ని కూడా రాజధాని వీధుల్లో కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వంటి ప్రాంతాలు ఉండే హైసెక్యూరిటీ జోన్‌లో   ర్యాలీ,  ధర్నాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. , ఈ ప్రాంతాకికి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో  దాదాపు వంద బారికేడ్లు ఏర్పాటు చేశారు.  సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో   అదనపు బలగాలను, పారామిలటరీ దళాలను   మోహరించారు. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద   తనిఖీలు ముమ్మరం చేశారు,   మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ  నాయకులు  తమ నిరసనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు,  లేదని భీష్మించుకూర్చున్నారు. తమ చలో పార్లమెంటు కార్యక్రమం  శాంతియుతంగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ఈ నేపధ్యంలో  ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.  ఇలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్ 21  నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆస్పత్రికి తరలించిన సంగతి తలిసిందే. అయితే ఆస్పత్రిలో కూడా నిరశన కొనసాగిస్తున్న సోనమ్ వాంగ్చుక్..  అక్కడి నుంచే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.  నీట్ బాధితుల ఆక్రందనలు  కేంద్రానికి వినిపించేందుకు ఈ మార్చ్ ఒక పెద్ద వేదిక కావాలన్న సోనమ్ వాంగ్చుక్..ఈ ఉద్యమాన్ని రెండో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తూ ఉద్వేగ పూరిత ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే హస్తిన లో తీవ్ర ఉద్రిక్త ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.   chalo parliament protest, cockroach janata party, delhi police alert, central delhi security, high security zone
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం..  తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై  ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ  ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.    సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది.  అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు.  వాస్తవానికి..  గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు.  చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే  అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.   ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది.  మొత్తం మీద  మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది.  chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది. జూమ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలని స్పష్టం చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావద్దని ఆదేశించారు. హైదరాబాద్‌లో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. సోమవారం నుంచి ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌పై సమీక్షలు నిర్వహించాలని, ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  బీఎల్‌ఓల నివేదికల కంటే బీఎల్‌ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గాంధీభవన్ బృందం కూడా బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. Congress SIR Review, CM Revanth Reddy Zoom Meeting, SIR Deadline Extended till August 3 Focus on Ground-Level Campaign, No Visits to Gandhi Bhavan, Stay in Constituencies, Priority to BLA Reports, Gandhi Bhavan  
ALSO ON TELUGUONE N E W S
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం. ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ . ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేలలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు, ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం మరోసారి థియేటర్స్‌లో విడుదల కానుంది, పాప్ కార్న్ ప్రొడక్షన్స్‌లో దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణుమొలకల నక్షత్ర నిర్మాతగా కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ నిర్మాతగా ఖడ్గం చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాలెంటెడ్ బ్యూటీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన మార్క్ స్పీచ్ మరియు టైమింగ్‌తో ఈవెంట్ మొత్తానికే హైలైట్‌గా నిలిచారు. వేదికపై ఆయన చేసిన హంగామా, పంచిన నవ్వులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈవెంట్‌ను నడిపిస్తున్న ఒక అందమైన యాంకర్‌తో అల్లు అరవింద్ చేసిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ యాంకర్ ఆర్జే చార్మిలా స్టేజ్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమం సాగుతున్న క్రమంలో ఆమె అల్లు అరవింద్‌ను ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని గట్టిగానే ప్రయత్నించారు. అందులో భాగంగానే ఆమె అరవింద్ గారి వైపు చూస్తూ.. "సార్, ఫస్ట్ లవ్ అనేది తోపా కాదా?" అంటూ ఒక గుక్క తిప్పుకోకుండా సూటిగా ప్రశ్నించారు. ఈ ఊహించని ప్రశ్నకు సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏమాత్రం తడబడకుండా, తనదైన శైలిలో నవ్వుతూ "ఊరుకోవమ్మా.. ఇప్పుడు అవన్నీ ఎందుకు" అంటూ చాలా చాకచక్యంగా టాపిక్‌ను దాటవేశారు. అయితే ఆ తర్వాత ఆయన మాట్లాడుతుండగా.. "నా యంగ్ ఏజ్‌లో నేను చెన్నైలో ఉన్నాను, అక్కడే చదువుకున్నాను" అని తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అందుకుని.. "సార్, లవ్ చేయడానికి వయసుతో పనేంటి సార్!" అంటూ గట్టిగా సెటైర్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే ఈ సరదా సంభాషణ ఇక్కడితో ఆగిపోలేదు. యాంకర్ ఆర్జే చార్మిలా చాకచక్యం మరియు ఆమె ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అందానికి ఫిదా అయిన అల్లు అరవింద్ ఆమెకు వేదికపైనే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆమెను ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ.. "చాలా బాగా మాట్లాడుతున్నావ్, మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రాబోయే నెక్స్ట్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటిస్తావా?" అంటూ స్టేజ్ పైనే డైరెక్ట్ ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అల్లు అరవింద్ లాంటి ఒక బిగ్ ప్రొడ్యూసర్ నుండి స్వయంగా గీతా ఆర్ట్స్ ఆఫర్ రావడంతో యాంకర్ చార్మిలా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రేజీ మూమెంట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో విడుదల చేసిన 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. స్టీవెన్ (కిరణ్ అబ్బవరం) అనే ఒక మధ్యతరగతి యువకుడు ఎలాగైనా ఒక మంచి రైటర్ అవ్వాలనే బలమైన లక్ష్యంతో తన సొంత ఊరు హైదరాబాద్ వదిలి చెన్నై నగరానికి చేరుకుంటాడు. అక్కడ సినీ అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ తన స్నేహితులతో కలిసి ఒక చిన్న రూమ్‌లో ఉంటాడు. ఈ క్రమంలోనే అతడి జీవితంలోకి హీరోయిన్ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది, ఒక సాధారణ రైటర్ చెన్నైలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను ఒక పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించారు. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం.     Allu Aravind, Geetha Arts, Kiran Abbavaram, Chennai Love Story 
తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డుల గ్రాఫ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన తిరుగులేని ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' చిత్రం తర్వాత, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరియు సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఒక సాలిడ్ క్రేజీ అప్‌డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే తన కెరీర్‌లోనే అత్యంత భారీ సక్సెస్ సాధించిన 'పెద్ది' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని ఊపుమీద ఉన్నారు. ఇదే తిరుగులేని జోష్‌లో ఆయన దర్శకుడు సుకుమార్‌తో తన 17వ సినిమాని (RC17) పట్టాలెక్కించేందుకు సర్వసిద్ధం చేసుకుంటున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అటు మెగా అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి మెగా అభిమానులను ఎంతగానో ఖుషీ చేసే ఒక అదిరిపోయే సమాచారం ఏమిటంటే, ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మరియు రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు మేకర్స్ ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఈ భారీ సినిమాను అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎలాంటి ఆలస్యం లేకుండా, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని, నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి సుకుమార్ ఇప్పటికే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి కూడా మేకర్స్ ఒక భారీ స్కెచ్ వేశారు. ఈ క్రేజీ చిత్రాన్ని 2027 చివరి భాగంలో లేదా 2028 మార్చి నెల కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఇదొక వింటేజ్ పీరియాడిక్ డ్రామా అని, 'pushpa' తరహాలో రెండు భాగాలుగా రాబోతోందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే ఈ పుకార్లన్నింటికీ పూర్తిగా చెక్ పెడుతూ ఇప్పుడు ఒక అసలైన నిజం బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగదు, అలాగే ఈ సినిమాకు రెండు పార్టులు అసలే ఉండవు. ఒకే ఒక్క భాగంలో పక్కా స్టైలిష్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. మెగా అభిమానులు రామ్‌చరణ్ నుండి ఎలాంటి పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు ఆశిస్తారో, అవన్నీ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. సాధారణంగానే సుకుమార్ సినిమాల్లో ఉండే మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే సర్ప్రైజ్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులు ఊహించని సరికొత్త స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ఉంటుంది. ఇక రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్ విషయానికొస్తే, 'రంగస్థలం' లోని చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. అలాగే 'పెద్ది' చిత్రంలోనూ ఆయన పడిన కష్టం మరియు చూపించిన వేరియేషన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే సుకుమార్ తెరకెక్కించబోయే ఈ కొత్త సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ ఈ రెండు చిత్రాలలోని పాత్రలను మించేలా, ఆయన పర్‌ఫార్మెన్స్‌కు మరింత వైవిధ్యమైన స్కోప్ ఇచ్చేలా సుకుమార్ డిజైన్ చేశారట. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే ఒక బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు టాలీవుడ్‌లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే ఒక మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.  
టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ మెగా అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి అచ్చమైన, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగా మేనల్లుడు, యువ హీరో సాయి వైష్ణవ్ తేజ్ కోసం ఒక సరికొత్త కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో బజ్ గట్టిగా వినిపిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను రూపొందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల, ప్రస్తుతం తన కెరీర్‌లో సరికొత్త మార్పుల కోసం చూస్తున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమై, తన మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వైష్ణవ్ తేజ్‌ను శ్రీకాంత్ అడ్డాల కలవడం, కథా చర్చలు జరపడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. యువ హీరో వైష్ణవ్ తేజ్ తన కెరీర్ ఆరంభం నుండి ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా, మాస్ మరియు క్లాస్ అంశాలు కలగలిసిన వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అటు శ్రీకాంత్ అడ్డాల కూడా కేవలం సాఫ్ట్ సినిమాలు మాత్రమే కాకుండా, గతంలో ‘నారప్ప’, ‘పెద్ద కాపు’ వంటి విభిన్నమైన రా అండ్ రస్టిక్ చిత్రాలతో తనలోని సరికొత్త యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక గనుక నిజమైతే, అది ఖచ్చితంగా వెండితెరపై ఒక వైవిధ్యమైన మరియు అద్భుతమైన ప్రయోగం అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల రాసే స్క్రిప్ట్‌లలో ఉండే సహజత్వం, పాత్రల రూపకల్పనలో ఉండే భావోద్వేగాలు.. వైష్ణవ్ తేజ్ నటనలోని గాఢత మరియు ఈజ్ కలిస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక సరికొత్త మరియు ఆహ్లాదకరమైన వినోదం దక్కడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ పూర్తిగా మారింది, ముఖ్యంగా యువ హీరోలు రొటీన్ ఫార్ములా సినిమాలకు దూరంగా ఉంటూ వినూత్నమైన మరియు ప్రయోగాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తూ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సమయంలో శ్రీకాంత్ అడ్డాల లాంటి ఎమోషన్స్ బాగా పండించగల అనుభవజ్ఞుడైన దర్శకుడితో పని చేయడం అనేది అతని కెరీర్‌కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవ్వడమే కాకుండా, ఒక మంచి మలుపుగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల సైతం తన పాత శైలి ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా, ఈ జనరేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఒక పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ కథాంశాన్ని సిద్ధం చేసుకుని వైష్ణవ్ తేజ్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి ఆలోచనలు, కథ పట్ల ఉన్న విజన్ పక్కాగా సింక్ అయితే మాత్రం టాలీవుడ్‌లో ఇదొక క్రేజీ పవర్ ఫుల్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్ల గురించి చర్చలు జరగడం చాలా సాధారణమైన విషయమే అయినప్పటికీ, శ్రీకాంత్ అడ్డాల మరియు వైష్ణవ్ తేజ్ భేటీపై జరుగుతున్న ఈ విస్తృత ప్రచారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా గనుక పట్టాలెక్కితే, అది వైష్ణవ్ తేజ్ మాస్ అండ్ క్లాస్ ఇమేజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుంది? అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన పాత ఫామ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి అందుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య కథా చర్చలు కేవలం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా ముగిసిన తర్వాత ఈ క్రేజీ కాంబోపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు, నిర్మాతల సమన్వయంతో పాటు సరైన హీరోల ఎంపిక అనేది సినిమా విజయంలో 100 శాతం కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల లాంటి అభిరుచి గల దర్శకుడు, వైష్ణవ్ తేజ్ వంటి యువ ప్రతిభను ఏ విధమైన విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో అని మెగా అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా మరియు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక అఫీషియల్‌గా అనౌన్స్ అయితే, అది మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అవార్డులను సొంతం చేసుకున్న సినీ ప్రముఖులకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాల పండుగలో తెలుగు సినిమా సత్తా చాటడం పట్ల ఆయన ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సినిమా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని, రాబోయే తరతరాలకు ఒక గొప్ప స్ఫూర్తినివ్వాలని ఈ సందర్భంగా మెగాస్టార్ ఆకాంక్షించారు. ఈ 72వ జాతీయ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్ర బృందాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించిన తన సోదరుడి కుమార్తె నిహారిక కొణిదెలను చూసి ఎంతో గర్వపడుతున్నానని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. ఒక వినూత్నమైన కథతో వచ్చి, మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకోవడం సాధారణ విషయం కాదని, నిహారిక పట్టుదలకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ విజయం మెగా కుటుంబంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు గెలుచుకున్న క్రేజీ డైరెక్టర్ సుకుమార్‌కు చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సుకుమార్ రాసుకున్న కథన శైలి, విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయని ప్రశంసించారు. అలాగే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన వైజ్ఞానిక అద్భుతం 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైనందుకు యువ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బృందానికి మెగాస్టార్ తన అభినందనలు అందజేశారు. మరోవైపు, మలయాళీ లెజెండరీ నటుడు, తన ఆప్తమిత్రుడు అయిన మమ్ముట్టిని చిరంజీవి ఆకాశానికెత్తారు. నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన మమ్ముట్టి అసాధారణ విజయాన్ని సాధించారని, ఇది ఒక అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు. వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న 'లక్కీ భాస్కర్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచిన వెంకీ అట్లూరిని, అలాగే ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన '35' చిత్ర బృందాన్ని అభినందించారు. అదే చిత్రంలో అద్భుత నటన కనబరిచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు గెలుచుకున్న అరుణ్ దేవ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ మెగాస్టార్ పోస్ట్ చేశారు.   chiranjeevi, 72nd national film awards, niharika konidela
సినీ పరిశ్రమలో రాణించాలంటే కేవలం గ్లామర్, టాలెంట్ ఉంటేనే సరిపోదు. వాటన్నింటికీ మించి బాక్సాఫీస్ వద్ద ఒక సరైన వాణిజ్య విజయం అత్యంత కీలకం. కొంతమంది కథానాయికలకు మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్‌డమ్ వచ్చేస్తుంది. కానీ మరికొందరు నటీమణులు మాత్రం ఒక మంచి బ్రేక్ కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి విలక్షణమైన సినీ ప్రయాణాన్నే ఎదుర్కొంటోంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. వరుసగా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆమెకు దక్కలేదు. అయితే, తాజాగా విడుదలైన 'లెనిన్' చిత్రం ఆమె కెరీర్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక భారీ ఊరటను, తిరుగులేని బ్రేక్‌ను ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, తన మొదటి చిత్రంతోనే అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అమోఘమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ, హీరోయిన్‌గా భాగ్యశ్రీకి మాత్రం పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు, ప్రశంసలు లభించాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. ఆ వెంటనే ఆమెకు 'కింగ్‌డమ్', 'కాంతా', మరియు 'ఆంధ్ర కింగ్ తాలూకా' వంటి విభిన్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో వరుసగా అవకాశాలు దక్కాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. సాధారణంగా చిత్ర పరిశ్రమలో బ్యాక్-టు-బ్యాక్ పరాజయాలు వస్తే ఏ హీరోయిన్ కెరీర్ అయినా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. కొత్త అవకాశాలు రావడం దాదాపుగా నిలిచిపోతుంది. కానీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం టాలీవుడ్ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా మారాయి. వరుసగా 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోయినా, తెలుగు ట్రేడ్ వర్గాలు మరియు దర్శకులలో ఆమెపై ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శక నిర్మాతలు ఆమెకు వరుసగా కొత్త అవకాశాలు ఇస్తూనే వచ్చారు. దీనికి ప్రధాన కారణం తెరపై ఆమెకు ఉన్న తిరుగులేని గ్లామర్ అప్పీల్, ఏ పాత్రకైనా ఇట్టే సరిపోయే అద్భుతమైన లుక్స్ మరియు సినిమా సినిమాకూ నటనలో ఆమె చూపిస్తున్న అపరిమితమైన ఇంప్రూవ్‌మెంట్ అని ఇండస్ట్రీ టాక్. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె క్రేజ్ నిలబడటానికి ఇదే కారణం. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన ఒడిదుడుకుల సమయంలో విడుదలైన 'లెనిన్' సినిమా భాగ్యశ్రీ బోర్సే సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగా, మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు, చూపించిన నటనకు అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాకుండా, ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ లోనూ భాగ్యశ్రీ పాత్ర మరియు ఆమె పెర్ఫార్మెన్స్ గురించి పెద్ద ఎత్తున పాజిటివ్ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా, బలమైన పాత్రలను కూడా అలవోకగా పండించగల నటి అని పరిశ్రమలో నిరూపితమైంది. రెండేళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన భాగ్యశ్రీ బోర్సేకు 'లెనిన్' అందించిన బూస్ట్ సామాన్యమైనది కాదు. ప్రస్తుతం 'లెనిన్' ఘన విజయంతో టాలీవుడ్‌ లోని యంగ్ హీరోలు, మీడియం రేంజ్ చిత్రాల మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుల కోసం భాగ్యశ్రీ బోర్సే వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మరోవైపు, కోలీవుడ్ క్రేజీ స్టార్ శివకార్తికేయన్ సరసన నటిస్తున్న 'సేయోన్' చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. తెలుగు సినిమాలే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఈ ముద్దుగుమ్మ, పక్క రాష్ట్రాల నుండి కూడా ఆఫర్లు అందుకోవడంతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. వరుస ఫ్లాపులు వచ్చినా వెనకడుగు వేయకుండా నిలబడిన ఈ భామకు 'లెనిన్' తెచ్చిపెట్టిన ఈ కొత్త జోష్, రాబోయే సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  
సినీ రంగంలో కానీ, టెలివిజన్ పరిశ్రమలో కానీ సెలబ్రిటీల మధ్య ఉండే పవిత్రమైన స్నేహబంధాలను అక్రమ సంబంధాలుగా, రొమాంటిక్ రిలేషన్స్‌గా చిత్రీకరించడం ఈ డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యుగంలో నిత్యకృత్యంగా మారిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్, మరియు క్లిక్స్ కోసమే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని వార్తా కథనాలపై తాజాగా ప్రముఖ హిందీ టెలివిజన్ స్టార్ హీరో అర్జున్ బిజ్లానీ అత్యంత తీవ్రంగా స్పందించారు. తన లాంగ్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ నటి మౌనీ రాయ్‌తో తనకు ముడిపెడుతూ వస్తున్న ఎఫైర్ రూమర్లను ఆయన పూర్తిగా బేస్‌లెస్ అని కొట్టిపారేస్తూ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘమైన మరియు పవిత్రమైన స్నేహ బంధాన్ని కేవలం రేటింగ్‌ల కోసం తప్పుగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ప్రశ్నించారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా వారి స్నేహాలపై ఇష్టానుసారంగా కథనాలు రాసేటప్పుడు మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కనీస అవసరం ఉందని అర్జున్ బిజ్లానీ హితవు పలికారు. బాధ్యతాయుతమైన జర్నలిజం అనేది ప్రజల్లో ఎల్లప్పుడూ నమ్మకాన్ని పెంచుతుందని, కానీ కేవలం క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్, సంచలనాల కోసం పెట్టే అబద్ధపు టైటిల్స్ సమాజంలో మీడియాపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా, కనీసం సదరు వ్యక్తులను సంప్రదించకుండా కేవలం ఊహాగానాలతో తప్పుడు కథనాలను ప్రచురించే ముందు కనీస వాస్తవాలను వెరిఫై చేసుకోవాలని ఆయన మీడియా సంస్థలకు స్పష్టమైన పిలుపునిచ్చారు. రూమర్లపై అర్జున్ బిజ్లానీ ఇంత ఓపెన్‌గా, ధైర్యంగా స్పందించి మీడియాకు చురకలు అంటించిన విధానాన్ని ఆయన అభిమానులు మరియు నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు. ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కూడా అర్జున్ బిజ్లానీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మనం ఎంత 21వ శతాబ్దంలో ఉన్నామని చెప్పుకుంటున్నా, ఇంకా మన సమాజంలో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడి మధ్య ఉండే అత్యంత స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్‌ను అర్థం చేసుకోలేని సంకుచిత మానసిక స్వభావం కొందరిలో కొనసాగుతుండటం విచారకరమని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఒకరితో ఒకరు ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన, ఈవెంట్లలో నవ్వుతూ మాట్లాడుకున్నంత మాత్రాన వారి మధ్య ఏదో నడుస్తోందన్నట్లుగా అసత్య ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల విషయంలో, వారు కెరీర్‌లో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఆధారం లేని రూమర్లు వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అర్జున్ బిజ్లానీ మరియు మౌనీ రాయ్ ఇద్దరూ బుల్లితెరపై ఎన్నో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్‌లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభం నుండి ముంబై గ్లామర్ ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. ఒక బలమైన స్నేహ బంధం, అలాగే ఒకరిపై ఒకరికి ఉండే ప్రొఫెషనల్ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయని, వాటిని తప్పుడు కోణంలో చూడటం ఇప్పటికైనా ఆపాలని బాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అర్జున్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, క్లిక్స్ కోసం సెలబ్రిటీల ప్రైవసీతో ఆడుకునే కొన్ని వెబ్‌సైట్ల ధోరణిని ఎండగట్టేలా ఉన్నాయి. ఎంతటి సెలబ్రిటీలైనా సరే, వారి ప్రైవసీని మరియు స్నేహాలను గౌరవించాల్సిన కనీస బాధ్యత సమాజానికి ఉంటుంది. ఈ రూమర్లకు అర్జున్ బిజ్లానీ పెట్టిన ఫుల్‌స్టాప్‌తోనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆగుతాయని ఆశిద్దాం.  
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన వెలువడింది. 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమా (టాలీవుడ్) తన సత్తా చాటి, ఏకంగా పలు విభాగాల్లో జాతీయ అవార్డులను కొల్లగొట్టింది.  చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు టాలీవుడ్‌ విజువల్ వండర్స్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి.  1. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  ప్రభాస్ హీరోగా, నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది.  ఉత్తమ పాపులర్ చిత్రం (Wholesome Entertainment): ప్రేక్షక ఆదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'కల్కి' జాతీయ అవార్డును గెలుచుకుంది.  ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఈ సినిమాలో అద్భుతమైన సెట్స్, ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని సృష్టించినందుకు గానూ నితిన్ జిహానీ చౌదరికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు దక్కింది.   2. పుష్ప-2: ది రూల్ (Pushpa 2: The Rule)  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు ముఖ్యమైన కేటగిరిల్లో అవార్డులు సాధించింది.ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్): ఈ చిత్రానికి అద్భుతమైన కథనం అందించినందుకు గానూ దర్శకుడు సుకుమార్ జాతీయ అవార్డును అందుకున్నారు.  ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చిత్రంలోని పాత్రలకు తగ్గట్టుగా అద్భుతమైన దుస్తులను డిజైన్ చేసినందుకు దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఈ పురస్కారం లభించింది.   3. కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)  నిహారిక కొణిదెల నిర్మాణంలో, కొత్త నటీనటులతో వచ్చిన ఈ చిన్న సినిమా జాతీయ స్థాయిలో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.  ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: 2024 ఏడాదికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' జాతీయ అవార్డుకు ఎంపికైంది.  ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ఈ సినిమాలో నటీనటులకు సహజసిద్ధమైన మేకప్ అందించిన పి. రవికుమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా నిలిచారు.   4. 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)  ఆకట్టుకునే భావోద్వేగాలతో, పిల్లల చదువుల నేపథ్యంలో వచ్చిన ఈ అందమైన సినిమాకు రెండు అవార్డులు దక్కాయి.ఉత్తమ బాలల చిత్రం (Best Children's Film): చిన్న కథతోనే పెద్ద సందేశాన్ని ఇచ్చినందుకు ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా గుర్తింపు దక్కింది.  ఉత్తమ బాల నటుడు: ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల జాతీయ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు.   5. లక్కీ భాస్కర్ (Lucky Baskhar) దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ విలక్షణమైన పీరియాడిక్ డ్రామా కూడా జాతీయ అవార్డుల జాబితాలో నిలిచింది.  ఉత్తమ డైలాగ్ రైటర్: ఈ సినిమాకు పదునైన, ఆలోచింపజేసే మాటలు రాసినందుకు గానూ దర్శకుడు వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.   భారీ గ్రాఫిక్స్ చిత్రాల నుంచి మనసును హత్తుకునే చిన్న సినిమాల వరకు అన్ని రకాల జోనర్లలో తెలుగు సాంకేతిక నిపుణులు, దర్శకులు జాతీయ వేదికపై అవార్డుల పంట పండించి తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పారు!
  'తగ్గేదెలే' అనే రీతిలో కాసేపటి క్రితం ప్రకటించిన  72వ నేషనల్ అవార్డ్స్ లో పుష్ప 2  తన సత్తా చాటింది.  పుష్ప: ది రైజ్' మొదటి భాగానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతంలోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించగా, ఇప్పుడు రెండో భాగానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.  ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ డ్రామాకి జాతీయ స్థాయిలో కథనం యొక్క  నైపుణ్యం గుర్తించబడటం తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. కేవలం స్క్రీన్‌ప్లే మాత్రమే కాకుండా, 'పుష్ప 2' చిత్రానికి గాను దీపాలీ నూర్ మరియు శీతల్ శర్మలకి  ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా కూడా జాతీయ అవార్డు లభించింది.దీంతో  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖాతాలో మొత్తం రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు చేరినట్లయింది. సుకుమార్ ప్రతిభను జాతీయ వేదికపై గుర్తించడంతో తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక సాధారణ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కథను అంతర్జాతీయ స్థాయి ఎమోషన్స్ మరియు మైండ్ గేమ్స్‌తో నడిపించిన సుకుమార్ రైటింగ్ స్టైల్‌కి  ఈ అవార్డు నిజమైన గుర్తింపు అని ఇండస్ట్రీ వర్గాలు కొనిాడుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో తెలుగు సినిమా సాధించిన విజయాలు ఇక్కడితో ఆగిపోలేదు. పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అంతేకాకుండా నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రానికి గాను అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే డైలాగ్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. చిన్న చిత్రంగా వచ్చి థియేటర్లలో సంచలనం సృష్టించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం బెస్ట్ తెలుగు రీజినల్ ఫిల్మ్‌గా  ఎంపికవడమే కాకుండా, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్ విభాగంలోనూ అవార్డును కొల్లగొట్టింది. మొత్తం మీద 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూస్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా తానేంటో నిరూపించుకుంది, అందులో సుకుమార్ సాధించిన స్క్రీన్‌ప్లే అవార్డు టాలీవుడ్ రచనా నైపుణ్యానికి దక్కిన మకుటంగా నిలిచిపోతుంది Also read: నేషనల్ అవార్డ్స్ లో కమిటీ కుర్రోళ్లు సంచలనం.. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరిన్ని.. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ అవార్డుల విజేతల జాబితాను వెల్లడించింది. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల సెంట్రల్ జ్యూరీ దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది ఎంట్రీలను నిశితంగా పరిశీలించి ఈ అవార్డులను ఖరారు చేసింది. ఈ ఏడాది అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటుతూ ఏకంగా 7 ప్రధాన అవార్డులను సొంతం చేసుకుని గర్వంగా నిలిచింది. ఈ మహా విజయంలో టాలీవుడ్ లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సరికొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వేట సాగించిన ఐకానిక్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) చిత్రానికి గాను ఆయన ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (Best Original Screenplay) కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ రాసుకున్న గ్రిప్పింగ్ నరేషన్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్లు, మాస్ ఎలిమెంట్స్ జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. sukumar, allu arjun, pushpa 2
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ ఏడాది అవార్డుల్లో అటు బాలీవుడ్ చిత్రాలతో పాటు ఇటు దక్షిణాది సినిమాలు సైతం భారీ స్థాయిలో తమ సత్తా చాటుతూ అవార్డుల పంట పండించుకున్నాయి. ప్రతి ఏటా దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినీ సాంకేతిక నిపుణులను, నటీనటులను గౌరవించే ఈ వేదికపై ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలలో విజేతల ఎంపిక సినీ విశ్లేషకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన వందలాది చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు ఎంతో నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సారి జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ (Yami Gautam) ఎంపికై సంచలనం సృష్టించారు. కశ్మీర్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్టికల్ 370' (Article 370) సినిమాలో యామి గౌతమ్ కనబరిచిన అద్భుతమైన, భావోద్వేగభరితమైన నటనకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ భార్య అయిన యామి గౌతమ్, ఈ చిత్రంలో ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో జీవించేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవడం తన కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ సారి 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడి (Best Actor) స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొనగా, జ్యూరీ ఇద్దరు అగ్ర నటులను సంయుక్తంగా విజేతలుగా ఎంపిక చేయడం విశేషం. బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'చందు ఛాంపియన్' (Chandu Champion) సినిమాలో తన అద్భుత నటనకు గాను తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. ఆయనతో పాటు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) హారర్ థ్రిల్లర్ చిత్రం 'భ్రమయుగం' (Bramayugam) లో ప్రదర్శించిన విలక్షణ నటనకు గాను మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై తన సీనియారిటీని చాటుకున్నారు. ఒకే ఏడాది ఇద్దరు విభిన్న తరాల నటులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం విశేషం.   72nd National Film Awards, National Awards Winners List, Yami Gautam, Mammootty, Kartik Aaryan 
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.
వాము, జీలకర్రతో చేసే ఈ చూర్ణం గ్యాస్, అజీర్ణానికి ఎంత ఉపయోగమో తెలుసా.! గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలను సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.   ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చూర్ణం తయారీ విధానాన్ని చూపించారు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల ఉప్పు వంటి మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో పూర్తి వివరంగా తెలిపారు. ఈ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ సమస్యను తగ్గించడంలో, కడుపు ఉబ్బరాన్ని నియంత్రించడంలో, అసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: గ్యాస్, అసిడిటీకి సహజమైన ఆయుర్వేద చిట్కా ఇంట్లోనే చూర్ణం తయారు చేసే విధానం వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు ప్రయోజనాలు చూర్ణం తీసుకునే సరైన సమయం, మోతాదు జీర్ణక్రియను మెరుగుపరచే సహజ మార్గాలు మీరు తరచూ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.      
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి