Home

»

Latest News

RC17 మొదలైంది: రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి ఫస్ట్ క్లాప్.!

Nov 1, 2026 10:04AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. సినిమాకు తొలి క్లాప్ ఇచ్చారు.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక సుకుమార్ టేకింగ్, కథను నడిపించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై చాలా కాలంగా వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొంతకాలంగా జరుగుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు టీ-సిరీస్ ఈ సినిమాను నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా సంగీత దర్శకుడి విషయంలో అనిరుధ్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈసారి చిట్టిబాబు కంటే భిన్నమైన పాత్రలో చరణ్‌ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారో చూడాలి.

 

 

 

[RC17 Pooja Ceremony, RC17 Movie Launch, Chiranjeevi First Clap, Chiranjeevi, Ram Charan, Sukumar, RC17 Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com