Home

»

Latest News

రాకా ఇంటర్వెల్ ఎపిసోడ్: అల్లు అర్జున్ కోసం అట్లీ భారీ ప్లాన్.!

Nov 1, 2026 11:47AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'రాకా'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సీక్వెన్స్ కోసం నవంబర్ రెండో వారంలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అట్లీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 'జవాన్', 'బిగిల్', 'మెర్సల్' వంటి సినిమాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో అంతకుమించిన స్థాయిలో యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'రాకా' సినిమా మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుందని, అల్లు అర్జున్ మూడు విభిన్న అవతారాల్లో కనిపిస్తారని గతంలో ప్రచారం జరిగింది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొణెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడం, అట్లీ వంటి మాస్ దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

మరి ఇంటర్వెల్‌లో అట్లీ ప్లాన్ చేస్తున్న ఆ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది? వెండితెరపై బన్నీ ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నారో చూడాలి.

ఇది కూడా చదవండి: రాధిక ఇంటి పనిమనిషి కొడుకు హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!

 

 

 

[Raaka Interval Block, Allu Arjun Raaka, Raaka Movie Update, Raaka Interval Fight, Raaka Shooting Update, Allu Arjun, Director Atlee, Deepika Padukone, Rashmika Mandanna]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com