మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో  తగ్గేదే లే.. అంటున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఈ విషయంలో  అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంతోనైనా పోరాడి నిధులు సాధిస్తానని ప్రకటించారు.  ఇటీవల మంగళగిరిలో జరిగిన ఒక  సభలో ప్రసంగించిన నారా లోకేష్..  తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు. మంగళగిరి అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించే విషయంలో, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంలోనూ , పాలనాపరమైన అనుమతులను సాధించే దిశగా ముందుకు సాగడంలోనూ రాజీ ప్రశక్తే లేదన్నారు.  ఇందు కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడతానన్నారు.  మంగళగిరి ప్రజలు 2024 ఎన్నికలలో తనపై చూపిన నమ్మకం, అఖండ మెజారిటీతో కట్టబెట్టిన విజయమే తనలో ఈ ధైర్యాన్ని నింపాయని చెప్పారు.   భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల రుణం తీర్చుకోవడం తన ప్రాథమిక బాధ్యతన్న ఆయన.. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో  వెనక్కు తగ్గేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ..  తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలు వచ్చేసరికి ఎంతటి పెద్ద నాయకుడినైనా ప్రశ్నించేందుకు, పట్టుబట్టి పనులు సాధించేందుకు వెనుకాడనన్నారు.   రాజకీయంగా ఈ వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కూటమి రాజకీయం, పార్టీ సమన్వయాన్ని కాపాడుకుంటూనే, ఒక ప్రజాప్రతినిధిగా తన సొంత నియోజకవర్గానికి  ప్రథమ ప్రాధాన్యత నిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. లోకేష్ తన వ్యూహాన్ని రూపొందించుకున్నారు.  గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం మంత్రిగా పలు కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ  ఆయనను నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గర చేసింది. నియోజకవర్గంలో అందరి వాడుగా గుర్తింపు నిచ్చింది.  ఒకవైపు రాష్ట్రస్థాయి నిర్ణయాల్లో భాగస్వామి అవుతూనే, మరోవైపు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు లోకేష్.  ఆ క్రమంలోనే మంగళగిరిని రాష్ట్రానికే సరికొత్త మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా   మంత్రి నారా లోకేష్ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి ప్రాతిపదికగా   ప్రగతి ప్రణాళికలను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, దశాబ్దాలుగా నలుగుతున్న భూహక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.  కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల దైనందిన జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.  మంగళగిరి,  తాడేపల్లి మండలాల పరిధిలో దశాబ్దాలుగా స్వంత ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఆందోళన చెందుతున్న వేలాది నిరుపేద కుటుంబాలకు ఊరట కలిగిస్తూ, 'మన ఇల్లు - మన లోకేష్' కార్యక్రమం ద్వారా శాశ్వత ఇళ్ల పట్టాలు, ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.  రవాణా, పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు మంగళగిరి రూపురేకలను  మారుస్తున్నాయి.  నంబూరు, మంగళగిరి రైల్వే సెక్షన్ పరిధిలోని లెవల్ క్రాసింగ్ వద్ద దశాబ్దాలుగా వేలాది మంది ప్రయాణికులు  ఇబ్బందులు పడే వారు.   రోజుకు పదుల సంఖ్యలో రైళ్లు వెళ్లే సమయంలో గేటు పడి.. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చే ఈ సమస్యకు చెక్ పెడుతూ..  142 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పునాది రాయి పడింది.  767 మీటర్ల పొడవు, నాలుగు లేన్ల విస్తరణతో రూపుదిద్దుకుంటున్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జివల్ల  వల్ల మంగళగిరి, అమరావతి, తాడికొండ తదితర పరిసర ప్రాంతాల మధ్య రవాణా సులభతరం కానుంది. దీనితో పాటు మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తొలి విడతలో దాదాపు 1,167 కోట్ల వ్యయంతో 531 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ,   వ్యర్థ నీటి శుద్ధి కేంద్రాల  పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద  12.56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంగళగిరి రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులు, ప్రయాణికుల సదుపాయాలతో  పునర్నిర్మించడం జరిగింది.  మరోవైపు.. పర్యావరణ పరిరక్షణ   ప్రజలలో  ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో కాజా తూర్పు చెరువు పార్కును శోభాయమానంగా అభివృద్ధి చేశారు. 17 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కులో 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలాలు,  వేలాది మొక్కలతో కూడిన పచ్చదనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిని కేవలం నివాస ప్రాంతంగానే కాక, ఆధునిక సదుపాయాలు కలిగిన పట్టణంగా నిలబెడుతున్నాయి. లోకేష్ నాయకత్వంలో మంగళగిరి వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో స్థానికులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం సరికొత్త ప్రగతి శకానికి వేదికగా మారుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  Nara Lokesh, Mangalagiri Development, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  భారీ ర్యాలీ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో జరిగిన ఈ ర్యాలీకి  నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  గా తరలివచ్చారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  ప్రసంగించిన రేవంత్ రెడ్డి..  దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున నిలబడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు.  ఢిల్లీ లో  కాంగ్రెస్ చేపట్టిన ప్రధాని నివాస ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతల అక్రమ అరెస్ట్​ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం   ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టు అప్రజాస్వామికమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.   Revanth  massive rally, support, Rahul, Kodangal, Condemn, Arrest, Lathicharge
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పిలుపు మేరకు మంగళవారం (జులై 21) జరిగిన ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమంలో   రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో  రాహుల్ గాంధీ  గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది.  పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.  దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.    దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, కేంద్ర  ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు  ప్రధాని నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తల ర్యాలీని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.    నిరసనకారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు  లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. రాహుల్ గాంధీని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది.  అయినప్పటికీ భద్రతా సిబ్బంది   ఆయనను నిర్బంధంలోకి తీసుకుని,  మోసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారు.  ముక్కు నంచి రక్తం కారుతున్నా.. రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా నినాదాలు చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. యువత కసం నిలబడిన నేత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు.  ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ..  అలాంటిది ఒక అగ్రనేతపై  పోలీసులు భౌతిక దాడికి దిగడం దారుణమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రజా నాయకుడిగా క్లిష్ట సమయాల్లో భౌతిక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల తరఫున నిలబడిన  రాహుల్ గాంధీ పోరాటపటిమ, నాయకత్వ లక్షణాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.   Rahul Gandhi Bleeding Nose, Rahul Gandhi PM Residence Protest, Congress Delhi Protest, Rahul Gandhi Detained Delhi Police, Rahul Gandhi Injury
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 23న గ్రాండ్ గా విడుదలవుతోంది.  విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన సినిమా కావడంతో పాటు, ఆయన సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో.. 'జన నాయగన్'పై ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ క్రమంలోనే 'జన నాయగన్' సినిమా సాధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు, బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ సాధించడానికి కావలసిన టార్గెట్ లెక్కలు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 230 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు పరిశీలిస్తే, హోమ్ మార్కెట్ అయిన తమిళనాడులో రికార్డు స్థాయిలో ఏకంగా 105 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. ఇక విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం 78 కోట్ల రూపాయల మైండ్ బ్లోయింగ్ బిజినెస్ నమోదు చేసింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 15 కోట్ల రూపాయలు, అలాగే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక వ్యాప్తంగా కలిపి మరో 30 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యుయేషన్ జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.  దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్' తన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో బోణి కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.     Thalapathy Vijay, Jana Nayagan, Jana Nayakudu, Business, Box Office  
  ఇప్పుడు ఆల్  ఓవర్ ఇండియా విజయ్ జననాయగన్(Jana Nayagan)తో మారు మోగిపోతూ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచే  షోస్ పడుతున్నా అంత కంటే ముందు బెనిఫిట్ షోస్ కూడా పడటంతో అభిమానులు ఇప్పుడిపుడే థియేటర్స్ వద్దకి చేరుకుంటున్నారు. తెలుగు నాట కూడా జన నాయకుడుగా వస్తుండటంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర న్యూస్ వాళ్లందరితో పాటు మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.  జననాయగన్ లో విజయ్‌తో గతంలో పనిచేసిన ముగ్గురు స్టార్ దర్శకులు,  సర్‌ప్రైజ్ క్యామియో రోల్స్ లో కనిపించబోతున్నారు.  నేను జననాయగన్ లో  ఒక ప్రత్యేక పాత్రలో నటించినట్లు లోకేష్ కనకరాజ్ స్వయంగా ధృవీకరించాడు. హెచ్. వినోద్ మరియు విజయ్ ఇద్దరూ ఫోన్ చేసి అడగడంతోనే తాను ఈ క్యామియో చేయడానికి ఒప్పుకున్నానని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. కేవలం లోకేష్ కనకరాజ్ మాత్రమే కాకుండా అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా  భాగం కానున్నారని సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖ దర్శకులు చిత్రంలోని పోస్ట్-క్లైమాక్స్ లేదా కథలోని అత్యంత కీలకమైన ఘట్టంలో విలేకరులు (జర్నలిస్టులు)గా మెరవనున్నారనే వార్త సినీ ప్రియులను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది. లోకేష్ కనకరాజ్ గతంలో విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్లు తెరకెక్కించగా,  ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి హ్యాట్రిక్ హిట్లు అట్లీ అందించాడు. అలాగే నెల్సన్ ‘బీస్ట్’ చిత్రాన్ని అందించిన విషయం తెలిసిందే.దీంతో  విజయ్ సినీ కెరీర్‌లో చెరగని ముద్ర వేసిన ఈ ముగ్గురు దర్శకులందరూ ఆయన చివరి సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం భారతీయ చిత్రసీమలోనే ఒక మైలురాయిగా నిలవబోతోంది.  Also read: అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎక్కడకి వెళ్ళాడో తెలుసా.. గెస్ చేసినా తెలుసుకోలేరు! vijay, jana nayagan, lokesh kanagaraj, atlee, nelson dilip kumar  
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి కన్నుమూయడంతో మెహర్ రమేష్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. మెహర్ రమేష్ సోదరి చికిత్స పొందుతూ కన్నుమూసిన మణిపాల్ ఆస్పత్రికి ఆయన స్వయంగా వెళ్లారు. మణిపాల్ ఆస్పత్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడ ఉన్న మెహర్ రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ కుటుంబం బంధువులనే విషయం తెలిసిందే. మెహర్ రమేష్ అమ్మమ్మ, పవన్ తండ్రి సొంత అక్కాతమ్ముళ్ళు అవుతారు.      Pawan Kalyan, Meher Ramesh, Sister Death, Telugu News  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తన పాన్ ఇండియా కట్ అవుట్ ని మరింత పెంచుకునేలా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' తో ముస్తాబు అవుతున్న తెలిసిందే.  కింగ్ ఖాన్ షారుక్ తో జవాన్ హిట్ తర్వాత  అట్లీ నుంచి వస్తున్న మూవీ కూడా 'రాకా' నే కావడంతో అంచనాలు ఒక రేంజ్ లోనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ తన సతీమణి  స్నేహా , పిల్లలు అయాన్, అర్హలతో  యూరప్ పర్యటనకి వెళ్లారు. అందులో భాగంగా  ఆస్ట్రియాలోని సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉండే ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వత శ్రేణులలో ఉన్న ‘సీగ్రూబ్ టెర్రేస్’ పై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉంది. ఇన్స్‌బ్రక్ (Innsbruck) నగరం సమీపంలోని ప్రసిద్ధ నార్డ్‌కెట్ (Nordkette) పర్వత శ్రేణుల్లో భాగమైన ఈ ఎత్తైన ప్రదేశం నుంచి దిగువన వంకరలు తిరుగుతూ ప్రవహించే ఇన్న (Inn) నది, చుట్టూ అల్లుకున్న అద్భుతమైన పచ్చదనం, మంచు శిఖరాల సుందర దృశ్యాలను ఈ జంట తిలకించింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన స్పెషల్ పిక్స్, క్యూట్ వీడియోలను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడంతో  నిమిషాల్లో వైరల్ అయ్యాయి. డార్క్ కలర్ బాంబర్ జాకెట్, కార్గో ప్యాంట్, వైట్ స్నీకర్స్‌లో అల్లు అర్జున్ అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తుండగా, బ్లాక్ నీట్ స్వెటర్, వైడ్-లెగ్ డెనిమ్ అవుట్‌ఫిట్‌లో స్నేహా  మెరిసిపోతున్నారు. పచ్చటి కొండల మధ్య  అర్హతో కలిసి బన్నీ సరదాగా ఆడుకుంటున్న క్షణాలు అభిమానుల హృదయాలని  కొల్లగొడుతున్నాయి. Also read: జననాయగన్ సెన్సార్ టాక్ అవుట్.. ఎంత పని చేసారంట! allu arjun, raaka, atlee, allu sneha      
Vijay Deverakonda's much-awaited period action drama Ranabaali has reportedly been postponed from its previously announced September 11, 2026 release date. While the makers are yet to issue a detailed statement explaining the delay, the development has come as a surprise, considering the film was one of the biggest Telugu releases lined up for the festive season. Directed by Rahul Sankrityan and produced by Mythri Movie Makers, Ranabaali marks Vijay Deverakonda's reunion with Rashmika Mandanna after the blockbuster Dear Comrade. The film is mounted on a grand scale and is set in the 1870s, with Vijay playing a rebellious warrior who rises against British rule during the Great Famine. The film also features international actor Arnold Vosloo in a key role, making it one of the most ambitious projects in Vijay's career. Ever since the first-look posters and title glimpse were unveiled, Ranabaali has generated massive buzz among moviegoers. The combination of Vijay Deverakonda, Rahul Sankrityan, and Mythri Movie Makers, coupled with the film's large-scale period setting, has kept expectations high. Fans were eagerly waiting to witness Vijay in a never-before-seen avatar. With the release now pushed, all eyes are on the makers to announce a new date. Industry circles expect the postponement to give the team additional time to fine-tune post-production work and ensure the film reaches audiences in the best possible form. An official announcement regarding the revised release schedule is awaited. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
నందమూరి బాలకృష్ణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన కొత్త సినిమా 'NBK111' షూటింగ్‌లో పాల్గొంటుండగా ప్రమాదానికి గురయ్యారు. ఒక కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు, ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే డాక్టర్ల బృందం, బాలకృష్ణను వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల అనంతరం ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి.  బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో (మజిల్ టేర్) సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయన విస్తృతమైన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నారు. తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు.   Nandamuri Balakrishna, Health Bulletin, AIG Hospital, NBK 111  
దళపతి విజయ్ అభిమానులు, సౌత్ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్'. జులై 23వ తేదీ గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ సినీ కెరీర్‌లో ఇది చివరి చిత్రం కావడమే కాకుండా, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ బజ్ నెలకొంది. అయితే, సినిమా విడుదల కాన్ డౌన్ ప్రారంభమైన వేళ ఈ చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించి అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన అనేక ముఖ్యమైన సన్నివేశాలను ఎడిటింగ్‌లో కట్ చేయాల్సి వచ్చిందని, అందుకే ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. గతంలో దళపతి విజయ్‌తో కలిసి 'బీస్ట్' సినిమాలో జోడీ కట్టిన పూజా హెగ్డే, మళ్లీ ఈ కాంబినేషన్‌లో 'జన నాయగన్' సినిమా ప్రకటించగానే ఎంతో సంతోషపడింది. ఇటీవలి కాలంలో సరైన సరైన బాక్సాఫీస్ విజయం లేక వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ బుట్టబొమ్మ, 'జన నాయగన్' చిత్రంపై కొండంత ఆశలు పెట్టుకుంది. విజయ్ చివరి సినిమా కావడం, ఈ సినిమా గ్యారెంటీ హిట్ కొడుతుందనే నమ్మకంతో తన కెరీర్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భావించింది. కానీ రిలీజ్ ముంగిట దర్శకుడు హెచ్. వినోద్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఆమె అభిమానులకు కాస్త నిరాశను మిగిల్చాయి. అసలు ఈ సినిమా కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను కూడా దర్శకుడు వినోద్ బయటపెట్టారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి 'జన నాయగన్' రీమేక్ అనే ప్రచారాన్ని ఆయన అధికారికంగా అంగీకరించారు. అయితే తమిళ ప్రేక్షకుల అభిరుచికి, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో దాదాపు 50 శాతం మార్పులు చేర్పులు చేసినట్లు స్పష్టం చేశారు. మూల చిత్రం ఫస్టాఫ్ నుండి 60 శాతం, అలాగే రెండో భాగం సెకండాఫ్ నుండి 20 శాతం సన్నివేశాలను మాత్రమే స్వీకరించి, మిగిలిన కథను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు వివరించారు. 'భగవంత్ కేసరి' సినిమాలో కథానాయిక కాజల్ అగర్వాల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పాత్రలో కనిపిస్తే, 'జన నాయగన్' చిత్రంలో పూజా హెగ్డే పాత్రను ఒక పవర్‌ఫుల్ ప్రెస్ రిపోర్టర్‌గా తీర్చిదిద్దారట. అయితే ఈ సినిమాలో విజయ్ మరియు పూజా హెగ్డే మధ్య ఎటువంటి రొమాంటిక్ సన్నివేశాలు లేదా డ్యూయెట్లు ఉండవని వినోద్ తేల్చి చెప్పారు. స్క్రిప్ట్ రాసుకున్న ప్రాథమిక దశలో పూజా హెగ్డే పాత్రకు చాలా నిడివి మరియు ప్రాధాన్యత ఉండేదని, కానీ రన్ టైమ్ పరిమితుల కారణంగా ఆమెకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించలేకపోయామని, కొన్ని తీసిన సీన్లను కూడా కట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. కథాపరమైన పరిమితుల వల్ల ఒక మంచి నటికి తగినంత నిడివి ఇవ్వలేకపోయానని భావిస్తూ, ఈ విషయంలో పూజా హెగ్డేకు ప్రత్యేకంగా 'సారీ' చెబుతున్నానని వినోద్ తెలిపారు. రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు దర్శకుడు పేల్చిన ఈ బాంబ్ పూజా హెగ్డే అభిమానులను ఆవేదనకు గురిచేసినప్పటికీ, అతిథి తరహా పాత్రలోనే ఆమె ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     Jana Nayagan, Thalapathy Vijay, Pooja Hegde, Director H Vinoth, Bhagavanth Kesari 
NBK111 makers have confirmed that Nandamuri Balakrishna had sustained a knee injury during the Rajahmundry shooting schedule and would undergo surgery. Now, AIG Hospitals, Hyderabad, has released an official medical bulletin detailing his condition. According to the hospital, Balakrishna was airlifted to Hyderabad after receiving initial treatment at a local hospital. Preliminary medical examinations at AIG revealed swelling and blood clotting in the soft tissues around his left knee, indicating a possible muscle tear. The actor is currently undergoing extensive clinical and diagnostic investigations under the supervision of a team of orthopedic surgeons. The hospital stated that, considering Balakrishna's previous medical history, a multidisciplinary team of specialists is evaluating his condition to determine the safest and most appropriate treatment plan before proceeding further. AIG Hospitals has assured fans that Balakrishna's condition is stable and that he remains under continuous medical observation. The final line of treatment, including the planned surgery, will be finalized after all diagnostic tests are completed. The production house had earlier confirmed that the actor suffered the injury while filming an action sequence in Rajahmundry. Following the latest medical update, fans across social media have been wishing Balakrishna a speedy recovery and are eagerly awaiting further updates on his surgery and return to the sets. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న జన నాయగన్(తెలుగు జన నాయకుడు) మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. దీంతో అభిమానులు, సినీ ప్రియుల ముఖాలు మతాబులులా వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెన్సార్ రిపోర్ట్ వాళ్ళ వెలుగుల్ని రెట్టింపు చేస్తుందని చెప్పవచ్చు.  సెన్సార్ రిపోర్ట్ ప్రకారం' ఫస్ట్ హాఫ్‌లో విజయ్ క్యారెక్టరైజేషన్, ఆయన స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు అభిమానులని, ప్రేక్షకులని  కట్టిపడేస్తాయని, సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ పొలిటికల్ డ్రామా, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడుస్తుందని సెన్సార్ కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు 30 నిమిషాల పాటు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారట. విజయ్ నటన, ఆయన చెప్పే శక్తివంతమైన డైలాగ్స్ సామాన్య ప్రజల ఆలోచనలని  తట్టేలా ఉంటాయని సమాచారం. వర్తమాన సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, విజయ్ తనదైన శైలిలో ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ అభిమానులకు ఐఫీస్ట్‌లా మారనున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, పూజా హెగ్డే గ్లామర్, బాబీ డియోల్ విలనిజం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అంతేకాకుండా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాలోని ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు సమాచారం. 'U/A' సర్టిఫికేట్‌ ని కేటాయించగా  రన్‌టైమ్ సుమారు 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) గా లాక్ అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ టాక్ బయటకు రావడంతో దళపతి అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. బాక్సాఫీస్ వద్ద  1000 కోట్లు సాధిస్తామని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. Also read: అందులో మొత్తం 60 సినిమాలు ఉన్నాయి.. చూసి ఎంజాయ్ చేయండి jana nayagan, vijay, pooja hegde, h vinoth
యష్ గీతు మోహన్‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్ మరియు మొదటి పాట 'తబాహీ' సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ సృష్టించగా, యష్ మరియు కియారా అద్వానీ మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' అనే మధురమైన రొమాంటిక్ మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన వైరల్‌గా మారిపోవడం విశేషం. ఈ 'మనసాగదే' పాటలో కథానాయకుడు యష్ (రాయా పాత్రలో) మరియు గ్లామరస్ బ్యూటీ తారా సుతారియా (రెబెకా పాత్రలో) మధ్య సాగే సున్నితమైన బంధం, మెస్మరైజింగ్ కెమిస్ట్రీ మరియు గాఢమైన ఎమోషన్స్‌ను దర్శకురాలు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ మెలోడీకి తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా కలసి ఎంతో ఆహ్లాదకరమైన స్వరాలను సమకూర్చగా, ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఆకట్టుకునే తెలుగు సాహిత్యాన్ని అందించారు. గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ తన అద్భుతమైన గొంతుతో ఈ పాటను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అయితే, ఈ పాటలో యష్, తారా సుతారియా మధ్య ఉన్న రొమాన్స్ కంటే కూడా ప్రేక్షకులు మరియు నెటిజన్లను అత్యంత తీవ్రంగా షాక్‌కు గురిచేసింది మాత్రం లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించిన ఒకే ఒక్క బోల్డ్ షాట్! ఈ పాట మధ్యలో నయనతార సిగరెట్ తాగుతూ అత్యంత బోల్డ్ అవతారంలో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. సాధారణంగా నయనతార ఏదో ఒక విభిన్నమైన యాక్షన్ లేదా పవర్‌ఫుల్ రోల్ చేస్తోందని అందరూ భావించారు, కానీ ఏకంగా తెరపై స్మోకింగ్ చేస్తూ కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇటివల కాలంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యమున్న హోమ్లీ క్యారెక్టర్లు మరియు మహిళా ప్రాధాన్య చిత్రాలు మాత్రమే ఎంచుకుంటున్న నయన్, సడన్‌గా ఇలాంటి స్టైలిష్ అండ్ బోల్డ్ అవతారంలోకి మారడం ఇప్పుడు ఫిలిం నగర్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతం పరిశీలిస్తే, తన కెరీర్ ప్రారంభంలో అజిత్ సరసన నటించిన 'బిల్లా' సినిమాలో నయనతార బికినీ వేయడంతో పాటు స్మోకింగ్ సీన్‌లో కనిపించి సంచలనం సృష్టించారు. కానీ ఆ తర్వాత కాలంలో పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత ఆమె పూర్తిస్థాయి పద్ధతైన పాత్రలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నయనతార 'టాక్సిక్' చిత్రంలో సిగరెట్ తాగుతూ కనిపించడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నయన్ తన రూట్ మార్చారా, లేక దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కథ మరియు పాత్ర డిమాండ్ మేరకు ఆమెను ఒప్పించారా అని అభిమానులు విశ్లేషిస్తున్నారు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఇలా స్మోకింగ్ సీన్స్ చేయడం ఏంటని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే, మరికొందరైతే కేవలం పాటలో వచ్చే ఒక చిన్న షాట్ చూసి పాత్రను జడ్జ్ చేయడం సరికాదని, సినిమా విడుదలయ్యాక పాత్రలోని అంతరార్థం ఏమిటో తెలుస్తుందని సపోర్ట్ చేస్తున్నారు. కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి భారీ తారాగణం ఉన్న ఈ 'టాక్సిక్' చిత్రంలో నయనతార పాత్ర ఏ స్థాయిలో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందో తెలియాలంటే మాత్రం 2026 ఆగస్టు 26 వరకు వేచి చూడాల్సిందే!   Yash, Nayanthara, Toxic movie, Geethu Mohandas
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..! కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రపిండాలు దీనిని వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. అయితే, శరీరం దీనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు లేదా మూత్రపిండాలు దీనిని సరిగ్గా విసర్జించలేనప్పుడు, ఇది రక్తంలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో  యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. క్రమంగా, దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయి, నొప్పి, వాపు , గౌట్ వంటి సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, పప్పుధాన్యాలు తినడం మానేయాలని  కొందరు చెబుతూ ఉంటారు. అసలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పప్పు ధాన్యాలు తినడం మానేయాలా? యారిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది?  ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవడం,  బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా బయటపడుతోంది. . కిడ్నీ వ్యాధులు,  డయాబెటిస్ మందులు,  మెటబాలిక్ సిండ్రోమ్,  కొన్ని రకాల మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పప్పు ధాన్యాలు తినకూడదా?  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే పప్పుధాన్యాలు తినడం మానుకోవాలా అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ పూర్తీగా మానేయడం అవసరం లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ,  పప్పుధాన్యాలు తినడం ఆపాల్సిన అవసరం లేదు.  సరైన పప్పుధాన్యాలను ఎంచుకుని, వాటి పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందట. ఇది  యూరిక్ యాసిడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందట. 8 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ ఉంటే, తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పు ధాన్యాలు తినడం మంచిది. పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి వనరు. పచ్చ పెసలు యూరిక్ యాసిడ్  ఉన్నవారికి చాలామంచివి.   అవి పోషకాలను అందించి, యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  వారానికి 3-4 సార్లు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిది. యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఏవి తినకూడదు? యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే, సముద్రపు ఆహారం, ఎర్ర మాంసం , మద్యం మొదలైనవి మానేయాలి.   తీపి పానీయాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు , అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి. తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరం.                                      *రూపశ్రీ.  
హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం. ముఖ్యంగా శారీరక బలహీనత, కండరాల బలం తగ్గడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు మినుముల పులగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. మినుములలో ఉండే అధిక ప్రోటీన్ శరీర కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, శక్తి పెరగడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: మినుముల పులగం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? ఇందులో ఉండే పోషక విలువలు ఏమిటి? అధిక ప్రోటీన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మినుముల పులగాన్ని ఎలా తయారు చేయాలి? ఎవరు తినాలి? ఎవరు పరిమితంగా తీసుకోవాలి? ఆయుర్వేదం ప్రకారం దీనిని తీసుకునే సరైన విధానం ఏమిటి? సహజమైన ఆహారంతో శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.  
డెంగ్యూ బాధలకు చెక్..వ్యాక్సిన్ వచ్చేసింది..!  వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది  డెంగ్యూ గురించి  భయపడతారు.  జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్.. ఇప్పటివరకు  డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది.  కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు.  నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే  దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట.   గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు  ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు.   భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కుడెంగా టీకా.. కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే..   శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట.   భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం  చాలా మేలైందని అంటున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి.   టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.  ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట.                                          *రూపశ్రీ.