
'ది ప్యారడైజ్' జోరు చూస్తుంటే ఈ సారి బాక్స్ ఆఫీస్ కి సరికొత్త రికార్డుని పరిచయం చేసేలా ఉంది. అదే టైంలో నిమిష,నిమిషానికి రికార్డుల పేర్లు కూడా మారుతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా నాని అభిమానుల హంగామా ఒక రేంజ్ లో నడుస్తూ ఉంది.
నైజాం పరిధిలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అపూర్వమైన ప్రజాదరణ లభించి, నాని కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని రేంజ్‌లో రికార్డు వసూళ్లు నమోదవుతున్నాయి. నైజాం రీజియన్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అభిమానులు, సినీ ప్రియులు టికెట్ల కోసం డిస్ట్రిక్ట్ యాప్ మరియు బుక్ మై షో యాప్‌లలో ఒక్కసారిగా పోటీ పడ్డారు. ఈ భారీ డిమాండ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 1 లక్షకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. నైజాం మార్కెట్‌లో నానికి ఉన్న తిరుగులేని క్రేజ్‌ను చాటిచెబుతూ, కేవలం హైదరాబాద్ లొకేషన్ పరిధిలోనే తొలి రోజే గంటల వ్యవధిలో కోటికి పైగా గ్రాస్ వసూలై సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిధిలో పూర్తిస్థాయి బుకింగ్స్ ప్రారంభం కాకముందే, కేవలం నైజాం మరియు ఓవర్సీస్ ప్రీ-సేల్స్ ద్వారానే వరల్డ్‌వైడ్‌గా 10 కోట్ల గ్రాస్ మార్క్‌ను సునాయసంగా క్రాస్ చేయడం విశేషం.
.webp)
ఇది కూడా చదవండి: 'బతికుండగానే చంపేశారు'.. సీనియర్ నటి వడివుక్కరసి ఆవేదన.. ఫ్యాన్స్ షాక్
ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతి గంటకు దాదాపు 11,000 టికెట్లు అమ్ముడవుతున్నాయంటే ప్యారడైజ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో కూడా అదే స్థాయిలో జోరు కనిపిస్తుండగా, నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ లోనే ఇప్పటికే $600K మార్కును క్రాస్ చేసి నాని ఓవర్సీస్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. మరి బొమ్మ పడ్డాక ఎన్ని కొత్త రికార్డులు పరిచయం అవుతాయో చూడాలి.
మీకు నచ్చవచ్చు: ఆరేసుకోబోయి పారేసుకున్నాను..' తెరపై చిల్లర వర్షం కురిపించిన 'కోటి రూపాయల' పాట.!
[The Paradise, Nizam Advance Booking Records, Nani, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





