ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  వైసీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో   ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా  ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు   హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి.  ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. గతంలో వైసీపీ, బీఆర్ఎస్  మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి.  జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది. తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో  ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్  విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు.  YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.   సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా  ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.    ఏపీలో   2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్  అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో  క్రియాశీల  అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన  మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు.   ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు. ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది.  అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు.   Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపీపీ అధినేత ప్రెస్ మీట్ అనగానే వైసీపీ నేతలు, శ్రేణుల గుండెల్లో గుబులు మొదలౌతుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు, నెటిజనులకు, మీమర్లకు పండుగ వస్తున్నదన్నంత ఆనందం మొదలౌతుంది. జగన్.. పర్యటనలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు ఎప్పుడూ రాజకీయ సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా నెటిజనులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు ఎప్పుడూ అడ్డంగా దొరికి పోతుంటారు. వాస్తవ దోషాలు, తప్పులు, తడబాటు ఇవే జగన్ రెడ్డి ప్రసంగాలనూ, ప్రెస్ మీట్లనూ ప్రత్యేకంగా నిలుపుతాయి.     తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తలలుపట్టుకునేలా చేస్తే.. ఆయన ప్రత్యర్థులు, నెటిజనులు, మీమర్లు పండుగ చేసుకున్నారు. కనీసమైన ప్రాథమిక పరిజ్ణానం లేని వ్యక్తా ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసింది అంటూ నెట్టింట జగన్ తెగ ట్రోలింగ్ కు గురయ్యారు.  డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న  తేడా తెలియని వ్యక్తికి రాజకీయాలెందుకు? అంటూ  తెలుగుదేశం  కూటమి నేతలు, నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.   గతంలో వైసీపీ సోషల్ మీడియా, మీడియా లోకేష్ ఆహార్యం, ఆహారం, భాష ఇలా ప్రతి విషయంలోనూ ట్రోల్ చేసేది. బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడేది కాదు. అయితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీంతో వైపీపీయులు జగన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే మేలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లనేమిటి అసలు బయటకు రాకుండా సైలంట్ గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనీ,  అలా కాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మంటగలిసేలా ఉందన్న భయం వైసీపీయుల్లో వ్యక్తమతోంది.   YS Jagan pressmeets worrying YCp, YSRCP Politics, Jagan Press Meet Controversies, AP Politics News, Jagan Mohan Reddy Speeches
ALSO ON TELUGUONE N E W S
కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు తన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బిగ్ స్క్రీన్‌పై యష్‌ను సరికొత్త డార్క్ అవతార్‌లో చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, డార్క్ థీమ్‌ను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. విశేషమేమిటంటే, సినిమాలో ఎలాంటి ప్రధాన సన్నివేశాలపై కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం ఒకటి రెండు సంభాషణల్లోని పదాలను మ్యూట్ చేయడం, చట్టబద్ధమైన హెచ్చరికలను స్పష్టంగా ప్రదర్శించడం వంటి చిన్నచిన్న మార్పులను మాత్రమే సూచించారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయినట్లు అధికారిక సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనంలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ హింసాత్మక సన్నివేశాలున్న చిత్రాలకు సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలు విధించిన సందర్భాలున్నాయి. అయితే 'టాక్సిక్' చిత్రంలో ఉన్న రా వయొలెన్స్‌కు ఒక్క కట్ కూడా పడకపోవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో విపరీతంగా చర్చనీయాంశమైంది. స్వయంగా యష్ కూడా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కేవలం పెద్దల కోసమే రూపొందించబడిన కథ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రసిద్ధ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. పవర్ ఫుల్ కాస్టింగ్ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ప్రస్తుతం అన్ని వైపులా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా శరవేగంగా ప్రారంభమవుతుండటంతో యష్ అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని టాలీవుడ్ సహా పాన్-ఇండియా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   Yash, Toxic Censor Certificate, Toxic Movie Runtime, Geethu Mohandas Toxic Movie Update, TeluguOne TMDB Movie Updates
Veteran actress Sowcar Janaki, one of the most respected names in South Indian cinema, has passed away at the age of 94. The legendary actress breathed her last in Chennai on Friday, August 21, at 1:59 PM after being hospitalised following age-related health complications. The news was confirmed by Nadigar Sangam president and actor Nassar. Janaki had been undergoing treatment at Kauvery Hospital in Alwarpet, Chennai, and was reportedly receiving intensive medical care. Her mortal remains will be kept at Centoph Road in Teynampet from 5 PM on Friday for family, friends, colleagues and admirers to pay their last respects. Born in Rajahmundry, Janaki entered films with the Telugu classic Shavukaru in 1950, directed by L. V. Prasad and starring N. T. Rama Rao. The film not only marked her leading-lady debut but also gave her the screen name that stayed with her for the rest of her life. Interestingly, Shavukaru was also NTR's first film as a leading hero. From there, Janaki built an extraordinary career that crossed Telugu, Tamil, Kannada and Malayalam cinema. She worked with some of the biggest stars of different generations, including NTR, Akkineni Nageswara Rao, MGR and Sivaji Ganesan. Her Telugu filmography includes memorable films such as Kanyasulkam, Jayam Manade, Vadante Dabbu, Rechukka-Pagati Chukka, Rojulu Marayi, Doctor Chakravarthy, Akkachellellu and Manchi Kutumbam. What made Sowcar Janaki particularly remarkable was her ability to evolve with the industry. After establishing herself as a leading actress, she seamlessly moved into character roles and continued to make an impact across generations. Her performances in films such as K. Balachander's Iru Kodugal, Edhir Neechal and other acclaimed Tamil films demonstrated the range that made her much more than a conventional heroine. She also remained relevant in Telugu cinema through films such as Samsaram Oka Chadarangam, Evade Subramanyam, Kanche, Babu Bangaram, Soubhagyam and Anni Manchi Sakunamule. Janaki's career spanned more than seven decades and over 400 films, along with extensive work on stage and television. Her contribution to cinema was recognised with honours including the Kalaimamani and, in 2022, the Padma Shri. Her last film was the Telugu release Anni Manchi Sakunamule in 2023. With her passing, Indian cinema has lost an actress who belonged to an entirely different generation of performers—one who began her journey in black-and-white Telugu cinema and remained visible even as the industry transformed across decades. Sowcar Janaki's name, however, is inseparable from the history of South Indian cinema, and her performances will continue to live on through generations of movie lovers.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినీ రంగాన్ని ఏలిన లెజెండరీ నటి 'షావుకారు జానకి' (94) చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి సినీ ప్రయాణం, పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి" అని భావోద్వేగంగా నివాళులర్పించారు.  1950లో వచ్చిన 'షావుకారు' సినిమాతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ మొదటి సినిమానే ఆమె ఇంటి పేరుగా మారిపోయేలా తన నటనతో మాయ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి లెజెండరీ నటుల కాంబినేషన్‌లో ఆమె చేసిన ఎన్నో సినిమాలు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నిధిలా నిలిచిపోయాయి. గ్లామర్ పాత్రలైనా, ఎమోషనల్ పాత్రలైనా సరే.. సీన్‌లో జానకి కనిపిస్తే చాలు, ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన గౌరవం, జీవం వచ్చేది. గతకొద్ది రోజులుగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త విన్న వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. "తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేస్తూ నివాళులర్పించారు. https://x.com/tarak9999/status/2090734674444480897       Sowcar Janaki, JR NTR, Shavukaru Janaki, NTR  
వెండితెరపై తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఆమె మరణాన్ని ధృవీకరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించిన ఆమె, భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  షావుకారు జానకి ప్రయాణం కేవలం నటన మాత్రమే కాదు, అది ఒక చరిత్ర. 'షావుకారు' సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాను శాసించింది. ఏ పాత్ర చేసినా, అందులో జీవం పోయడం ఆమెకే సాధ్యం. గ్లామర్ పాత్రలైనా, ఎమోషనల్ క్యారెక్టర్లైనా.. ఆమె ఉంటే ఆ సీన్‌కి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చేది. అలాంటి మహానటి ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా తీరని లోటు.     Veteran Actress, Sowcar Janaki, Passed Away  
  ఇరుముడి చూసి బయటకి వచ్చిన మాస్ మహారాజా అభిమానులు ఈ సారి కొట్టేసాం, చాలా గట్టిగా కొట్టేసాం అని మాట్లాడుతు 'ఎన్నాళ్ళకెన్నాళ్ళ కెన్నాళ్ళకు వెన్నేళ్లు కురిసాయి మా కళ్ళలో' అని కూడా పాడుకుంటున్నారు. దీన్ని బట్టి రవితేజకి హిట్ ఎంత అర్జెంటు అవసరమో అర్ధం చేసుకోవచ్చు.ఇరుముడి  క్రమక్రమంగా  హిట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్తుండటం అభిమానులకి  అదనపు బోనస్.   ఇరుముడిలో రవితేజ నటన అత్యంత సహజంగా, భావోద్వేగాల మేళవింపుగా సాగింది. కూతురుగా చేసిన బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చిన సెంటిమెంట్ దృశ్యాలు అభిమానులు, ప్రేక్షకుల హార్ట్స్ ని టచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, రవితేజ చెప్పిన ఎమోషనల్ డైలాగులకి థియేటర్స్  విజిల్స్, ఈలలతో మార్మోగిపోతున్నాయి సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన బాక్‌గ్రౌండ్ స్కోర్, విష్ణు శర్మ కెమెరా పనితనం, శివ నిర్వాణ రచనా, దర్శకత్వం ప్రధాన బలంగా నిలిచాయి. సెకండాఫ్ ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుండటంతో కుటుంబ ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. Also read: డోంట్ మిస్   సోషల్ మీడియాలో కూడా ‘ఇరుముడి బ్లాక్‌బస్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్ X (ట్విట్టర్) వేదికగా 100,000 కంటే ఎక్కువ ట్వీట్లతో ట్రెండింగ్‌లో నిలిచింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఈ విజయంపై స్పందించిన అభిమానులు "మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ ఒరిజినల్ ఫోర్మ్" అంటూ పండగ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్  నవీన్ యెర్నేని,యలమంచిలి రవిశంకర్  మరో అదిరిపోయే హిట్ ని కైవసం చేసుకున్నారు. భీమవరం, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో అభిమానులు తెల్లవారుజామున 4 గంటలకే థియేటర్లకు చేరుకుని రవితేజ  భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. సుమారు 100 అడుగుల భారీ కటౌట్లు, 50కి పైగా పూలదండలు, బాణసంచా కాల్పులతో థియేటర్ల కాంప్లెక్స్‌లని సంబరాల కేంద్రాలుగా మార్చడంతో శ్రావణమాసశోభ నూతనత్వాన్ని సంతరించుకుంది. Irumudi, Raviteja, Nakshtra, Tollywood
రిలీజ్ కి ముందే అభిమానుల్లో, మూవీ లవర్స్ లో హిట్ ఖాయమనే మాటలు వినిపించిన   'ఇరుముడి' ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. దీంతో థియేటర్స్ దగ్గర  పండుగ వాతావరణం నెలకొని ఉంది. పాజిటివ్ టాక్ వినిపిస్తుండంతో మాస్ మహారాజా రవితేజ  అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. మరి మూవీ హైలెట్స్ ఏంటో చూద్దాం. 1 .త్రినాధ్(రవితేజ) మణికంఠ(బేబీ నక్షత్ర) మధ్య నడిచిన భావోద్వేగ ఎపిసోడ్  2 .స్కూల్ పిల్లలపై జరిగే దారుణం  3 . గోపరాజు గురుస్వామి( సాయికుమార్ ) నుంచి వచ్చిన  షాకింగ్  ఎపిసోడ్  4 . అయ్యప్పస్వామి నేపథ్యంతో వచ్చిన సాంగ్స్  5 . యాక్షన్ సీక్వెన్స్ లో త్రినాధ్ పెర్ ఫార్మెన్స్  6 . మణికంఠ చనిపోయిన సీక్వెన్స్  7 . ఎంఎల్ఏ, స్కూల్ టీచర్ ఇల్లీగల్ వ్యవహారం  8 . లైవ్ లొకేషన్స్ లో మూవీ మొత్తం తెరకెక్కడం  9 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో చనిపోయిన మణికంఠకి త్రినాధ్ మంగళస్నానం చేయడం  10 .స్కూల్ కి వెళ్లే  అమ్మాయిల విషయంలో  సమాజానికి హెచ్చరిక జారీ చేస్తూ నడిచిన కథ, కథనం also read: Irumudi Movie Review In Telugu: ఇరుముడి మూవీ రివ్యూ   ఇక షో షో కి ఇరుముడి హిట్ రేంజ్ పెరుగుతుంది. దీంతో హైదరాబాద్.  విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు చాలా ఏరియాస్ లో రికార్డు స్థాయిలో బుక్ మై షోస్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి.   Irumudi, Raviteja, nashthra, Shiva Nirvana
Cast: Ravi Teja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra, Ajay Ghosh, Ramesh Indira, Swasika, Meesala Lakshman   Crew:  Cinematography by Vishnu Sarma  Editing by Prawin Pudi  Music by GV Prakash Kumar Written & Directed by Shiva Nirvana Produced by Naveen Yerneni & Y Ravi Shankar Banner - Mythri Movie Makers   Ravi Teja has been crowned as Mass Maharaja of Telugu Cinema but his recent films did not live up to the hype and buzz surrounding them. But Irumudi has been different as movie got huge positive buzz from the beginning. Joining hands with a director like Shiva Nirvana and divine connection seems to have changed things for Ravi Teja. Let's discuss about the film in detail.    Plot:  Trinath (Ravi Teja) is an alcoholic but he loves his wife (Priya Bhavani Shankar) and daughter Manikanta (Baby Nakshatra) to the core. Every year he observes Ayyappa Deeksha and stays away from every vice for 41 days and he is popular as a singer. On the other hand, Sileru High school becomes a problematic aspect for the girls commuting from the Trinath's village.  They have to go by bus to near by Donkapadu forest and then travel 5 KM by walk or bicycle. Guru Swamy (Sai Kumar)'s daughter Gayathri complains about this and he asks MLA (Ramesh Indra) to sanction at least bus. Meanwhile, high school girls are terrified by teacher (Swasika Vijay) and her special classes. Why? How Trinath and his daughter are connected to all this? Watch the movie to know more.    Analysis:  Ravi Teja has delivered his career best performance in the film. It is hard to find Ravi Teja as he completely immersed himself into the role of Trinath. We see only Trinath in his body language and his dialogue delivery too. We never saw Ravi Teja this restrained and in character and that is the biggest strength of the film.  Baby Nakshatra is cute and her performance is life of the film. Priya Bhavani Shankar is good, Ramesh Indra, Sai Kumar and everyone did their best. GV Prakash Kumar's music and BGM stand-out. They carry the film flawlessly and create the necessary atmosphere for the thriller.  Shiva Nirvana did his best in writing dialogues for the film. Each scene carries forward the emotion and delivers a strong humanitarian angle that the director posses. But screenplay wise after the big twist movie gets into predictable zone but climax emotion elevates the feel. The thought process on how two fathers' handle education and upbringing of girl child is beautifully presented by the director.  Technically, movie is good as cinematography is handled very well. Production design and values by Mythri Movie Makers are perfect too. But editing could have been better in the second hour. Overall, the movie is worth a watch for the social message it intertwines into a thriller aspect. Ayyappa songs help the movie big time.    Positives:  Ravi Teja's Performance  Baby Nakshatra scenes  Strong emotional core  Gayathri - Manikanta scenes GV Prakash Kumar music  Socially Relevant Concept Negatives: Drag in second hour  Slight predictability post big twist  Sluggish narrative at places.    Bottomline:  A good and honest film that talks about women safety   Rating: 3/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్‌తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్‌ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.     DC Movie, Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Arun Matheswaran, Anirudh Ravichander  
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్‌లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్‌ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్‌ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. సందీప్ వంగా మేకింగ్ టేస్ట్ ప్రకారం ప్రకాష్ రాజ్ ప్లేస్‌లోకి వచ్చే కొత్త నటుడు ఎవరుంటారోననే కుతూహలం ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల అధికారిక వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
  -సినిమా పేరు: ఇరుముడి -న‌టీన‌టులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శర్మ  -ఎడిటింగ్: ప్రవీణ్ పూడి   -మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్  -నిర్మాత‌లు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి  -బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్  -రచన,దర్శకత్వం: శివ నిర్వాణ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026  మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో  థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్  ఉన్న  ఇరుముడి  ఎలా ఉందో చూద్దాం. కథ త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే  పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి.  ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు   మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా  మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి ఎనాలసిస్  సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో  మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది. ఫుల్ ఫ్లెడ్డ్ ఎమోషనల్ రైడ్.  కూతుళ్ళని పెంచే  ఇద్దరు తండ్రుల పెంపకం గురించి చెప్పిన విధానం ఆలోచింపచేయడంతో పాటు కట్టిపడేస్తుంది. మూవీ మొత్తం రవితేజ కనిపించలేదు. త్రినాధ్  మాత్రమే కనిపించాడు.దర్శక నిర్మాతలు తాము ఎంచుకున్న కథని దైర్యంగా ప్రతి సీన్ ని ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన కథకి తగ్గ లిరిక్స్, ఆర్ ఆర్  ఇరుముడిని మన హృదయాల్లో  నిలుపుతుంది.ముఖ్యంగా స్కూల్ వయసు ఉన్న పిల్లలు, తల్లి తండ్రులు తప్పక చూడాల్సిన మూవీ. ఈ కలియుగంలో  ఇలాంటి మూవీ రావాల్సిన అవసరం కూడా ఉంది.  ఫస్ట్ హాఫ్  చూసుకుంటే స్టార్టింగ్ సీన్ నార్మల్ గానే ఉందని అనిపించినా, ఆ సీన్ ఇంపాక్ట్  సెకండ్ హాఫ్ లో తెలిసాక కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాం. మణికంఠ, త్రినాధ్ తో వచ్చిన సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండటంతో పాటు కథ ఏ విధంగా రన్ అవ్వబోతుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో వచ్చిన సన్నివేశాలు, గోపరాజు( సాయికుమార్) , 10 th క్లాస్ చదివే   అతని కూతురుతో త్రినాద్, మణికంఠ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీచర్ గా చేసిన శ్వాసిక విజయ్ సీన్స్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు.  ఇంటర్వెల్ సీన్ పర్లేదు.   సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అసాంఘిక  శక్తుల నుంచి  ఏ నిమిషానికి  ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అనే టెన్షన్ కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే సస్పెన్సు కి కన్నీళ్లు ఆపుకోలేం. అది నిజం కాకపోతే బాగుండని మన ఇష్ట దైవాలని ప్రార్దిస్తాం. సీన్ తో సీన్ తో పాటు  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో కుదిరాయి. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  త్రినాధ్ గా రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎమోషనల్, లవ్, యాక్షన్ సీన్స్ లో రఫ్ఫాడించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో రవితేజ పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. అభిమానులకి ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రియా భవాని శంకర్ హోమ్లీ క్యారక్టర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా బేబీ నక్షత్ర అయితే తన క్యూట్ నటనతో థియేటర్ నుంచి బయటకి వచ్చినా తన గురించే ఆలోచించేలా అదిరిపోయే పెర్ఫార్మ్ చేసింది. తన వల్ల రిపీట్ ఆడియెన్స్ కూడా పక్కా. దీన్ని బట్టి ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.  మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక విజయ్,  నెగిటివ్ రోల్ లో చేసిన ఎం ఎల్ ఏ క్యారక్టర్ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు నటించారు.  శివ నిర్వాణ దర్శకుడిగా, రచయితగా సక్సెస్ అయ్యాడు. తెలుగు సినిమాకి సరికొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసినట్టే. మైత్రి నిర్మాణ విలువలు, ఎడిటింగ్,  జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ ఇరుముడి కోసమే పుట్టినట్టుగా కుదిరాయి.  బలాలు    1 . రవితేజ, బేబీ నక్షత్ర పెర్ ఫార్మెన్సు  2 . సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్  3 . సెకండ్ హాఫ్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ లు  4 . యాక్షన్ సీక్వెన్స్  5 . ప్రీ క్లైమాక్స్  6 . క్లైమాక్స్   చివరిగా చెప్పుకోవాలంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నివర్గాల ప్రేక్షకులు చూసే  విధంగా తెరకెక్కిన ఎమోషనల్ బాండింగ్ జర్నీ ఇరుముడి. రేటింగ్ 3 /5                                                                                                             అరుణాచలం 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అవమానం, బాధ.. ఇవి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కునేవే.  నిజానికి చాలామంది అవమానం, బాధ అనేవి బాగా దగ్గరైన, ఎంతో ఇష్టపడిన వారి కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  ఇలా అవమానం లేదా బాధ అనేవి ఎదురైనప్పుడు కొందరు గొడవ పడతారు,  మరికొందరు ఎదుటివారిని కూడా బాధపెట్టడానికి ప్రయత్నం చేస్తారు.  ఇంకొందరు అలా బాధపెట్టేవారికి దూరం జరుగుతారు. కానీ కొందరు మాత్రం.. ఇలా బాధ, అవమానం ఎదురైనా సరే.. మౌనంగా ఉండిపోతారు. అసలు తాము ఎందుకు ఇలా చేస్తున్నాం అనే విషయం చాలామందికి అస్సలు తెలియదు కూడా.  ఇలాంటి వారి గురించి వారికే తెలియని షాకింగ్ నిజాలను మనస్తత్వ వేత్తలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. ఎవరైనా బాధపెడితే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయా? ఎవరైనా బాధపెడితే.. బహుశా వారు చాలా ఒత్తిడికి గురై ఉంటారు, అందుకే బాధపెట్టారు ఏమో అనుకోవడం. నన్ను బాధపెట్టాలని అనుకోలేదు ఏదో ఆవేశంలో అలా చేసి ఉంటారు అనుకోవడం. ప్రస్తుతం వారి జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, పాపం ఆ టెన్షన్ లో నన్ను బాధపెట్టి ఉంటారు అనుకోవడం. పై కారణాల వల్ల  బాధపెట్టే వారిని సమర్థించుకుంటూ,  వెనుకేసుకొస్తూ, వారిని మంచోళ్లుగా చూస్తూనే ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది? సంఘర్షణ భయం.. ఎవరైనా తమతో సరిగా ప్రవర్తించకపోతే.. ఆ విషయం  తెలిశాక, వాదనలు లేదా గొడవలు నివారించడానికి.. జరిగిన వాటి గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతూ ఉంటారు. చాలా మంది గొడవ  అనే ఆలోచనకే ఒత్తిడికి లేదా అసౌకర్యానికి గురవుతారు. అది సంబంధాన్ని నాశనం చేస్తుందేమోనని భయపడతారు. అందుకే మౌనంగా ఉండిపోతారు. ప్రాధాన్యత..   కొన్నిసార్లు బెస్ట్ గా ఉన్నది మనకు దక్కేంత అర్హత మనకు లేదని భావించి, తక్కువకే సర్దుకుపోతూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని పదేపదే బాధపెడుతున్నా లేదా వారి హద్దులు దాటుతున్నా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ముఖ్యం. గాయం  ప్రేమకు దారితీస్తుందని అనుకోవడం.. చాలా మంది బాధపడిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రేమను లేదా శ్రద్ధను చూపిస్తారు. ఈ ఎమోషనల్ గొడవ గందరగోళాన్ని సృష్టిస్తుంది.  దీనిని ట్రామా బాండింగ్ అని అంటారు. దీని కారణంగా, మనల్ని పదేపదే బాధపెట్టే వారిని వదిలిపెట్టడానికి  ఇబ్బంది పడతాము.  మార్పు  ఆశించడం.. ఎప్పటికైనా బాధపెట్టే  వ్యక్తి మారుతాడని  నమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న మార్పులు కూడా మన ఆశను పెంచుతాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఈ మార్పు శాశ్వతం కాదు,  మనం మన జీవితంలోని ఎన్నో సంవత్సరాలను కోల్పోవాల్సి రావచ్చు కూడా. పెంపకం ప్రభావం.. క్షమించడం, విశాల హృదయం కలిగి ఉండటం, మనకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైనవని నూరిపోస్తూ  పెంచడమే ఇలా ఎవరైనా బాధపెట్టినా కూడా మౌనంగా ఉండిపోవడానికి కారణం. సంబంధాలలో శాంతి, సామరస్యాలను కాపాడుకోవడం మన ఏకైక బాధ్యత అని  నమ్మడం వల్లే ఇలా చేస్తారు. ఒంటరిగా ఉండాలనే భయం.. ఒక చెడ్డ సంబంధంలో బాధపడటం కంటే ఒంటరిగా ఉండటమే మేలైనప్పటికీ, ఒంటరిగా ఉండటానికి భయపడి..  ఎదుటివారు బాధిస్తున్నా సరే.. కలిసి ఆ బంధంలోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. బాధపెట్టే వారితో ఎలా ఉండాలి.. బాధపెట్టే  వారి మాటలను మనసుకు తీసుకోకూడదు. ఎవరైనా బాధపెట్టినప్పుడు గొడవ జరగకుండా ఉండాలంటే ఆ ప్రదేశాన్ని వదిసి దూరంగా వెళ్లవచ్చు. . మార్పును బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకూడదు.  నమ్మకమైన వారితో మాట్లాడటం  లేదా థెరపిస్ట్ సహాయం తీసుకోవడం మంచిది.  ఇతరుల ప్రాధాన్యత ఇవ్వడం కంటే.. తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం పట్ల శ్రద్ద పెట్టడం మంచిది.                                                                                                                                                   *రూపశ్రీ.  
మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలకు కారణం పెద్ద గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలను నమ్మడం, ఒకరి గురించి మరొకరికి చెప్పడం, అపార్థాలు కలిగించడం కూడా కుటుంబాల్లో, స్నేహాల్లో, ఉద్యోగ సంబంధాల్లో సమస్యలకు దారితీస్తాయి. వీటినే సాధారణంగా “చెప్పుడు మాటలు” అని అంటుంటాం. అయితే ప్రతి సలహా చెప్పుడు మాట కాదు. మన మంచిని కోరుతూ చెప్పే సలహా వేరు. ఇద్దరి మధ్య అనుమానం, కోపం లేదా విభేదాలు పెంచే ఉద్దేశంతో చెప్పే మాటలు వేరు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. చెప్పుడు మాటలు అంటే.. ఒక వ్యక్తి గురించి మరొకరి వద్ద ప్రతికూలంగా చెప్పడం, ఒకరి మాటలను మరొకరికి వక్రీకరించి చెప్పడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి అపార్థం కలిగించడం లేదా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినేలా మాట్లాడటాన్ని సాధారణంగా చెప్పుడు మాటలు అంటారు. చెప్పుడు మాటల వల్ల జరిగే నష్టాలు.. భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరుగుతాయి.. కుటుంబ వ్యవహారాల్లో మూడో వ్యక్తి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య మూడవ మనిషి ప్రమేయం ఉండకూడదని చెబుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు-పిల్లలు లేదా ఇతర బంధువుల మధ్య ఒకరి గురించి మరొకరు చెప్పే మాటలు నమ్మడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇది బంధాల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. స్నేహాలు చెడిపోవచ్చు.. స్నేహితుల మధ్య చెప్పుడు మాటలు సాగితే అది అనుమానాలకు దారితీస్తాయి. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు..   ఆ విషయాన్ని తెలుసుకోకుండానే స్పందిస్తే మంచి స్నేహం కూడా దెబ్బతినవచ్చు. నమ్మకం కోల్పోయే ప్రమాదం.. చెప్పుడు మాటలు పదేపదే వినడం వల్ల మన చుట్టూ ఉన్నవారిపై నమ్మకం తగ్గుతుంది. కొన్నిసార్లు నిజాయితీగా మాట్లాడే వ్యక్తిపైనా అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని పదేపదే వింటే కోపం, బాధ, ఆందోళన వంటి భావాలు కలగవచ్చు. దాంతో మనశ్శాంతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే చోట సమస్యలు రావచ్చు.. ఉద్యోగ చేసే ప్రదేశంలో ఒక ఉద్యోగి గురించి మరొకరికి తప్పుగా చెప్పడం వల్ల సహోద్యోగుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. టీమ్‌లో పరస్పర నమ్మకం తగ్గే ప్రమాదం ఉంటుంది.  చిన్న సమస్యలు పెద్ద గొడవలుగా మారవచ్చు.. చిన్న విషయాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి చెప్పేటప్పుడు మాటలు మారిపోవచ్చు. చివరకు అసలు విషయం కంటే పూర్తిగా భిన్నమైన అర్థం ఏర్పడి గొడవకు దారితీయవచ్చు. ఎవరైనా చెప్పుడు మాటలు చెబుతున్నారని ఎలా తెలుసుకోవాలి? ఒక్క లక్షణాన్ని చూసి ఎవరినైనా చెప్పుడు మాటలు చెప్పేవారు అని నిర్ణయించలేం. అయితే ప్రవర్తనను బట్టి కొన్ని గ్రహించవచ్చు. ప్రతి వ్యక్తి గురించి ఏదో ఒక నెగిటివ్ విషయం చెబుతుంటారు మీ దగ్గర ఒకరి గురించి చెబుతారు. మరో వ్యక్తి దగ్గర మీ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారని తెలుస్తే జాగ్రత్తగా ఉండాలి.  “ఇది ఎవరికీ చెప్పొద్దు” అని తరచుగా చెబుతుంటారు వ్యక్తిగత విషయాలను రహస్యంగా చెప్పడం తప్పు కాదు. కానీ ప్రతి విషయాన్నీ “రహస్య సమాచారం” పేరుతో ఒకరి నుంచి మరొకరికి తీసుకెళ్లే అలవాటు ఉంటే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆధారాలు లేకుండా అనుమానాలు కలిగిస్తారు. ఇతరుల గురించి ఆధారాలు ఏమీ లేకపోయినా ఊరికే అనుమానంతో ఊహగానాలు సృష్టించి చెబుతుంటారు.  ఇలా  స్పష్టమైన ఆధారం లేకుండా మాటలు చెప్పడం చెప్పుడు మాటలకు సంకేతం కావచ్చు.  ఒకరి మాటలను మరొకరికి వేరే విధంగా చెబుతారు ఒక వ్యక్తి చెప్పిన మాటను యథాతథంగా చెప్పకుండా, తమకు నచ్చిన విధంగా మార్చి చెప్పడం వల్ల అపార్థాలు ఏర్పడతాయి.  ఇతరుల గొడవల గురించి తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు.  ఎవరికి ఎవరితో గొడవ, ఇంట్లో ఏం జరిగింది, ఎవరు ఎవరితో మాట్లాడటం లేదు వంటి విషయాలను పదేపదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొంత జాగ్రత్త అవసరం.                                                                                                                                                   *రూపశ్రీ.
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
కాకరకాయ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే.  అయితే కాకరకాయను చేదు లేకుండా వండే క్రమంలో చాలామంది వాటిని ఉప్పులో, చింతపండు రసంలో నానబెడుతూ ఉంటారు.  వీటి కారణంగా  అందులో విత్తనాలు వచ్చేస్తుంటాయి.  మరికొందరు కావాలనే  కాకరకాయ నుండి విత్తనాలను తీసేసి పారేస్తుంటారు. అయితే కాకరకాయలోని విత్తనాల్లో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయని చాలామందికి తెలియదు.  కాకరకాయ నుండి విత్తనాలు తొలగించే ముందు  అందులో ఉన్న పోషకాల గురించి వివరంగా తెలుసుకోవాలి. అవేంటంటే... కాకరకాయ విత్తనాలలో పోషకాలు.. కాకరకాయలోని విత్తనాల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో పాటు  బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అయితే విత్తనాల పోషక విలువ కాకరకాయ రకం, పక్వత, వంట విధానాన్ని బట్టి మారతాయట. కాకరకాయ విత్తనాలు ప్రయోజనాలు..  జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు కాకరకాయలో ఫైబర్ ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే ఆహారంలో ఫైబర్ పెరగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి, మలబద్ధకం తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కాకరకాయ విత్తనాలు తినడానికి ఇష్టపడని వారు వాటిని కారం పొడిలాగా కూడా చేసుకుని తింటారు. యాంటీఆక్సిడెంట్లు.. కాకరకాయలో వివిధ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. రక్తంలో చక్కెర.. కాకరకాయను రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగిస్తారని చాలాకాలంగా చెబుతుంటారు. కాకరకాయలోని కొన్ని సమ్మేళనాలు గ్లూకోజ్ మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. కాకరకాయనే కాకుండా కాకరకాయ విత్తనాలను కూడా ఆహారంలో తీసుకోవడం మరీ మంచిది. విత్తనాలు ఎప్పుడు తీసేయాలి? కాకరకాయ చిన్నగా, లేతగా ఉన్నప్పుడు దాని విత్తనాలు సాధారణంగా మృదువుగా ఉంటాయి. అలాంటి కాకరకాయను వండేటప్పుడు విత్తనాలను  తీసేయాల్సిన అవసరం ఉండదు. అయితే కాకరకాయ బాగా ముదిరినది అయితే అందులో విత్తనాలు గట్టిగా ఉంటాయి. ఇలాంటి విత్తనాలను కారం పొడి వంటి వంటకంగా తయారు చేసుకుంటే మంచిది.                                                                                                                                                   *రూపశ్రీ.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆహారాన్ని ఎలా తాగాలి? నీళ్లను ఎలా తినాలి? అని సందేహం రావచ్చు. అయితే ఈ మాటకు అర్థం అక్షరాలా తీసుకోవడం కాదు. ఆహారం, నీరు తీసుకునే విధానంలో జాగ్రత్త అవసరమనే ఆరోగ్య సూత్రం ఇందులో దాగి ఉంది.  ఆహారాన్ని “తాగాలి” అంటే.. ఆహారాన్ని తినేటప్పుడు తొందరగా మింగేయకుండా, బాగా నమిలి, నోటిలోనే మెత్తగా చేసి, లాలాజలంతో కలిసేలా చేయాలి అన్నది ఈ మాటలోని ప్రధాన ఉద్దేశం. మన జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది చిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలంలోని జీర్ణ ఎంజైములు ఆహారంపై పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో కడుపుపై పడే జీర్ణక్రియ భారం కొంత తగ్గుతుంది. అందుకే ఆహారాన్ని తాగాలి అని చెప్పడం ద్వారా ఆహారాన్ని ద్రవంలా మెత్తగా అయ్యేంత వరకు నమిలి తర్వాత మింగాలి అనే మంచి అలవాటును సూచించారు. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారాన్ని బాగా నమిలి తింటే..  ఆహారం చిన్న ముక్కలుగా మారుతుంది.  లాలాజలంతో బాగా కలుస్తుంది.  ఆహారాన్ని నెమ్మదిగా తినే అలవాటు ఏర్పడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.  అతిగా తినే అవకాశం తగ్గుతుంది.  జీర్ణక్రియకు సహకారం అందుతుంది. నీళ్లను తినాలి అంటే.. నీటిని నిజంగానే తినాలని దీని అర్థం కాదు. నీటిని కూడా నెమ్మదిగా, చిన్న చిన్న మోతాదుల్లో తాగాలిఅనే సూచనగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. చాలామంది దాహం వేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. కానీ సాధారణంగా దాహం తీర్చుకోవడానికి నీటిని నెమ్మదిగా, సౌకర్యంగా తాగడం మంచి అలవాటు. నీళ్లను తినాలి అనే పదప్రయోగం ద్వారా నీటిని కూడా గౌరవంగా, ఆచితూచి తీసుకోవాలని మన పెద్దలు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆహారాన్ని ఎలా తాగాలి? నీళ్లను ఎలా తినాలి? అని సందేహం రావచ్చు. అయితే ఈ మాటకు అర్థం అక్షరాలా తీసుకోవడం కాదు. ఆహారం, నీరు తీసుకునే విధానంలో జాగ్రత్త అవసరమనే ఆరోగ్య సూత్రం ఇందులో దాగి ఉంది.  ఆహారాన్ని “తాగాలి” అంటే.. ఆహారాన్ని తినేటప్పుడు తొందరగా మింగేయకుండా, బాగా నమిలి, నోటిలోనే మెత్తగా చేసి, లాలాజలంతో కలిసేలా చేయాలి అన్నది ఈ మాటలోని ప్రధాన ఉద్దేశం. మన జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది చిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలంలోని జీర్ణ ఎంజైములు ఆహారంపై పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో కడుపుపై పడే జీర్ణక్రియ భారం కొంత తగ్గుతుంది. అందుకే ఆహారాన్ని తాగాలి అని చెప్పడం ద్వారా ఆహారాన్ని ద్రవంలా మెత్తగా అయ్యేంత వరకు నమిలి తర్వాత మింగాలి అనే మంచి అలవాటును సూచించారు. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారాన్ని బాగా నమిలి తింటే..  ఆహారం చిన్న ముక్కలుగా మారుతుంది.  లాలాజలంతో బాగా కలుస్తుంది.  ఆహారాన్ని నెమ్మదిగా తినే అలవాటు ఏర్పడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.  అతిగా తినే అవకాశం తగ్గుతుంది.  జీర్ణక్రియకు సహకారం అందుతుంది. నీళ్లను తినాలి అంటే.. నీటిని నిజంగానే తినాలని దీని అర్థం కాదు. నీటిని కూడా నెమ్మదిగా, చిన్న చిన్న మోతాదుల్లో తాగాలిఅనే సూచనగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. చాలామంది దాహం వేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. కానీ సాధారణంగా దాహం తీర్చుకోవడానికి నీటిని నెమ్మదిగా, సౌకర్యంగా తాగడం మంచి అలవాటు. నీళ్లను తినాలి అనే పదప్రయోగం ద్వారా నీటిని కూడా గౌరవంగా, ఆచితూచి తీసుకోవాలని మన పెద్దలు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి.                                                                                                                                                   *రూపశ్రీ.