కరీంనగర్ జిల్లాలో   రాజకీయ హీట్ పీక్స్ కు చేరింది. గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్  శనివారం ( మే9) కరీంనగర్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు చర్యగా పోలీసులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ  సందర్భంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసలు వివాదం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా మొదలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్ర చర్చనీ యాంశమైంది.  ఈ ఘటన వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. అది తమపై చేస్తున్న కుట్ర అని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  కాగా బంద్ నేపథ్యంలో కరీంనగర్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.   ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతుండగా..  మరోవైపు బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.   కరీంనగర్‌లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజలు, వ్యాపారులు యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వాణిజ్య సంస్థలు యధావిధిగా తెరిచి ఉంచాలని కోరుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరీంనగర్ జిల్లా రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనూహ్య పతనాన్ని చవిచూసింది. బెంగాల్ ప్రజల చేత దీదీగా పిలిపించుకున్న మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో  పార్టీ పరాజయమే కాదు.. స్వయంగా తన ఓటమినీ చవి చూశారు.  అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేతలను దూరం చేసుకోవడం.. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలే తృణమూల్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు. సీనియర్లను గౌరవించకుండా.. అభిషేక్ బెనర్జీ   తన వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పార్టీ లోపల అసమ్మతి జ్వాలలు చెలరేగి, చివరకు అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు.  నందిగ్రామ్ పోరాటం ద్వారా మమతను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి, అభిషేక్ తీరుతో విసిగిపోయి బీజేపీలో చేరారు. గతంలో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన ఆయన, తాజా ఎన్నికల్లో మమతకు కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలోనే ఆమెను ఓడించి చరిత్ర సృష్టించారు. కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది. అభిషేక్ బెనర్జీ అనుసరించిన  డైమండ్ హార్బర్ మోడల్' పాలనలో అక్రమాలు జరిగాయనీ..  దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నెపం నెట్టడం..  ఎన్నికల కమిషన్‌తో ఘర్షణ వంటి చర్యలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. టీఎంసీలోని పాత తరం నేతలు కూడా అభిషేక్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ రహస్యం. మమత   మేనల్లుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం టీఎంసీ పతనానికి దారితీయగా, సువేందు అధికారి పట్టుదల బీజేపీకి బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసిందని, సువేందు నాయకత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, కమీషన్ల కోసం ప్రాజెక్టును బలిపెట్టాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు.  రంగారెడ్డి జిల్లా జిల్లేడ్-చౌదరిగూడలో శుక్రవారం నిర్వహించిన 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ'లో  మాట్లాడిన కవిత.. ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.   ప్రాజెక్టు కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినా..  కనీసం 33 ఎకరాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు అందించలేకపోయిందన్న ఆమె.. ఓ గుంటనక్క కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు డిజైన్ మార్చిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ పాయింట్ మార్చడం క్షమించరాని నేరమనీ,  ఈ మార్పు వల్లనే ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు తలెత్తుతున్నాయని కవిత అన్నారు.  అలాగే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె  విమర్శలు గుప్పించారు.  నల్లమల పులి బిడ్డ నని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు.  ప్రాజెక్టు పేరుతో రూ.6 వేల కోట్ల బిల్లులు చెల్లించి రేవంత్ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.  దసరాలోపు పనులు ప్రారంభించకపోతే పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను ఎండగడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. నీటి పారుదలపై వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)గత నెల తిమ్మరాజు పల్లి టీవీతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ నేపథ్యం బాగున్నా స్క్రీన్ ప్లేతో లోపల వల్ల తిమ్మరాజు పల్లి ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. ఇప్పుడు అబ్బవరం దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇప్పడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం 'రియాలిటీ'(Reality)అనే పేరుతో కూడిన టైటిల్ తో అబ్బవరం దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. తన కెరీర్ బిగ్గెస్ట్ హాట్ 'క' మూవీ ముందు చిన్న సినిమాల విషయంలో ఎంతో ఆవేదన చెందటంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై తన గళాన్ని విప్పాడు. మరి ఇప్పుడు 'రియాలిటీ' మూవీ సినీ పరిశ్రమకి సంబంధించి ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలయింది.అదే టైంలో తను రియాలిటీ లో ఉంటాడా లేక వేరే వాళ్ళు ఉంటారా అనేది చూడాలి. Also read: Trisha: త్రిష రీసెంట్ పోస్ట్ వైరల్.. విజయ్ తో బంధంపై వివరంగా క్లారిటీ ఇచ్చేసింది  సాధారణంగా హీరోలు సక్సెస్ ట్రాక్‌లో ఉన్నప్పుడు దర్శకత్వం జోలికి వెళ్లడం రిస్క్ అని భావిస్తారు. కానీ, అబ్బవరం తనపై తనకు ఉన్న నమ్మకంతో ఈ సాహసం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ,సినిమాల రైటింగ్ వర్క్ చూసిన వారు, కిరణ్ ఖచ్చితంగా మంచి దర్శకుడిగా రాణిస్తారని అభిప్రాయపడుతున్నారు. అబ్బవరం  గతంలో తాను చేసిన కొన్నిసినిమాలకి స్వయంగా కథ, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే.  
What started as a heartfelt appreciation post by Dubai-based Telugu influencer Srilata Adepalli soon became one of social media’s most loved conversations this week. In her video, Srilata spoke about powerful women with Telugu roots who are creating their own space across the world. From actress Sobhita Dhulipala to Chanel model Bhavitha Mandava, rapper Raja Kumari and beauty entrepreneur Deepica Mutyala, the post celebrated women who are confidently embracing their identity on a global stage and inspiring others along the way. But what truly caught everyone’s attention was Sobhita Dhulipala’s beautiful response in the comments section. Instead of a simple thank you, the actress shared a deeply personal note about trusting instincts, honouring oneself and living life with authenticity. "Lean in to your essence, no matter what. My most meaningful moments have come when i did what my instinct told me to, even when it’s totally illogical or unproductive. And every single time I did something otherwise, only i know how it backfired. Honour yourself. This life is a short sail across the river, cherish the breeze and the current, ” Sobhita Dhulipala commented. Her words instantly struck a chord online. Thousands praised the honesty, warmth and calm wisdom in her message, while many called the exchange refreshing in a world filled with surface-level social media interactions. The viral moment has now become more than just an Instagram exchange. It is being seen as a celebration of Telugu women supporting each other, owning their journeys and inspiring people far beyond borders.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, టీవీ రంగ విస్తరణ, అంతరించిపోతున్న నాటకరంగ పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మూడు విభాగాలను సమన్వయం చేస్తూ, రాష్ట్రంలో షూటింగ్ సంస్కృతిని పెంచడం, కళాకారులకు సరైన వేదికను కల్పించడం భరత్ భూషణ్ ముందున్న ప్రధాన లక్ష్యాలు.  
  -వైరల్ గా మారిన త్రిష పోస్ట్  -విజయ్ తో నిజంగానే ఎఫైర్ ఉందా! -మరి తాజా పోస్ట్ లోని ఆంతర్యం ఏంటి సోషల్ మీడియాలో ఎంతటి వైరల్ న్యూస్ అయినా రెస్ట్ తీసుకొని ఒక మూలన కూర్చుంటుంది. కానీ విజయ్, త్రిష మధ్య ఎఫైర్ ఉందనే రూమర్ న్యూస్ మాత్రం రెస్ట్ అనేదే లేకుండా వ్యూస్ కి రెస్ట్ లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో త్రిష రీసెంట్ గా  చేసిన పోస్ట్ తో అయినా ఎఫైర్ రూమర్స్ ఆగుతాయో చూడాలి. మరి ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం. త్రిష రీసెంట్ గా తన ఇనిస్టా లో ఎఫైర్ వార్తలని ఉద్దేశించి  ఒక కార్టూన్ బొమ్మతో  పాటు "Blah Blah Blah" (చెత్త మాటలు) ,IYKYK (If You Know You Know) అనే అక్షరాలని ట్యాగ్ లైన్‌ గా జోడించింది. 'బయట వాళ్లు ఏమనుకున్నా పర్వాలేదు, అసలు విషయం తెలిసిన వారికి తెలుసు" అనే అర్థం వచ్చేలా చేసిన  పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనపై వస్తున్న అసత్య ప్రచారాలని లేదా అతిగా మాట్లాడుతున్న వారి మాత్ లని ఆపాలనే త్రిష ఆ విధంగా పోస్ట్ చేసిందని  విశ్లేషకులు భావిస్తున్నారు. Also read:sathi leelavathi: సతీలీలావతి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!.. మెగాకోడలు సేఫ్ జోన్ లోకి వెళ్తుందా! విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'గిల్లి' సినిమా నుండి 'లియో' వరకు వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఫేవరెట్. అయితే, వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లని  "Blah Blah" అంటూ త్రిష  కొట్టిపారేయడం ఆమెలోని ధైర్యాన్ని చూపిస్తోంది. ఇక విజయ్  తో  ముఖ్యమంత్రి పీఠం దోబూచులాడుతోంది. వేరే రాజకీయ పార్టీల కంటే విజయ్ టివికె కి ఎక్కువ సీట్స్ వచ్చినా ప్రభుత్వాన్ని స్థాపించే సింగల్ మెజారిటీ రాకపోవడమే అందుకు కారణం.     
- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో? - ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా? - మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా? - ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్‌ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట. ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.  
  మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొంత గ్యాప్ తర్వాత సెల్యులాయిడ్ పై అడుగుపెట్టిన మూవీ సతీలీలావతి. నిన్న రిలీజ్ అవ్వగా దేవ్ మోహన్ లావణ్యకి జత కట్టాడు. హీరోతో హీరోయిన్ కదా జత కట్టేది అని  అనుకోవచ్చు. కానీ సతి లీలావతి కథ ప్రకారం హీరోయిన్ తో  హీరో జత కట్టాడని అనుకోవడంలో ఎలాంటి అక్షర దోషం లేదు. మరి ఈ చిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ఏంటో చూద్దాం. తొలి రోజు సుమారు 20 లక్షల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సతీ లీలావతికి 10  కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాల టాక్. మరి 20 లక్షలు రాబట్టడం అంటే యూనిట్ కి షాక్ అని చెప్పవచ్చు.  దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. భీమిలి కబడీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకుడు కాగా  మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. నరేష్, మడోన్నా సెబాస్టియన్, వీటీవీ నరేష్, సప్తగిరి, మోట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిఖ్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. also read:  Peddi: పుష్ప 2 దారిలో పెద్ది     
  -శరవేగంగా ముస్తాబవుతున్న పెద్ది  -సరికొత్త రికార్డులు పెద్దిపై నమోదు కాబోతున్నాయా! -పుష్ప 2 ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి! పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సాధించడమే లక్ష్యంగా 'పెద్ది'(Peddi)శరవేగంగా ముస్తాబవుతున్నాడు. ఇటీవల ఓవర్ సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్  ఓపెన్ చేస్తే నమోదైన రికార్డులే అందుకు సాక్ష్యం. మరి యుఎస్ లోనే ఆ విధంగా ఉంటే తెలుగు రాష్ట్రాల మానియా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు . మేకర్స్ కూడా సదరు మానియా కి తగ్గట్టుగానే ముందుకెళ్తూ సరికొత్త రికార్డులు పెద్దిపై ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పెద్ది' ట్రైలర్ వేడుకని ఉత్తర భారతదేశంలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా మన సినిమా ఈవెంట్లు హైదరాబాద్ లోనే జరుగుతుంటాయి. కానీ పుష్ప 2 లాగా అక్కడి ప్రేక్షకులని పెద్ది వైపు టర్న్ చేసేలా ముంబై లేదా ఢిల్లీలో ఒక భారీ ఈవెంట్‌ని నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి బాలీవుడ్ అగ్ర నటులని గెస్ట్ లుగా ఆహ్వానించే అవకాశం ఉందని, దీని ద్వారా పెద్దికి  నేషనల్ వైడ్ పబ్లిసిటీ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారంట. 'పెద్ది' కేవలం ఒక ప్రాంతీయ కథగా కాకుండా, అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కింది. పైగా కుస్తీ,క్రికెట్ కి నార్త్ లో ఆదరణ ఎంతో ఉంటుంది. Also read: Godari Gattupaina: గోదారి గట్టుపైన ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!.. దీన్ని బట్టి రేంజ్ అర్ధం చేసుకోవచ్చు  ఈ నేపథ్యంలో పెద్ది ని నార్త్ లో సరైన విధంగా ప్లాన్ చేస్తే, కానీ విని ఎరుగని రికార్డులు పెద్దికి దక్కుతాయి. పుష్ప 2 విషయంలో కూడా నార్త్  ప్రమోషన్ స్ట్రాటజీ పక్కాగా ఉండటంతో రికార్డు కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు మన  సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు నేరుగా థియేటర్లలోనే బాలీవుడ్ సినిమాలకి గట్టి పోటీ ఇస్తున్నాయి. 'పెద్ది'  మేకర్స్ అనుసరిస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ సక్సెస్ అయితే,  ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఈవెంట్ తేదీ మరియు వేదికపై అధికారిక ప్రకటన వెలువడనుంది.     
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందుతోన్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న విడుదల కానున్న ఈ మూవీ గ్లింప్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ గ్లింప్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ సినిమా గ్లింప్స్ అయినా ఒక నిమిషానికి అటుఇటుగా ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ ఈసారి తన మార్క్ యాక్షన్ అడ్వెంచర్‌ను గట్టిగా చూపించాలని డిసైడ్ అయ్యారట. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ రన్ టైమ్ దాదాపు 3 నిమిషాలు (180 సెకన్లు) ఉండబోతోంది.  సాధారణంగా ట్రైలర్ మూడు నిమిషాల నిడివి ఉండటం చూస్తుంటాం. అలాంటిది గ్లింప్స్ మూడు నిమిషాలు అంటే.. దీనితోనే ఒక చిన్నపాటి సునామీని చూపించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ 3 నిమిషాల గ్లింప్స్ లో ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఇది ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 3 నిమిషాల గ్లింప్స్ గనుక వస్తే, యూట్యూబ్ రికార్డులన్నీ చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.  ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ అండ్ డార్క్ షేడ్ ఉన్న రోల్‌లో చూపించబోతున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' తరహాలోనే ఈ చిత్రంలో కూడా ప్రశాంత్ నీల్ మార్క్ భారీ సెట్టింగులు, మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ హైస్ ఉండనున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో షూటింగ్ జరుగుతోంది. 2027, జూన్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  
      సమ్మర్ లో మీ కోసం కూల్ ఎంటర్ టైనర్ మూవీ అంటూ  'గోదారి గట్టుపైన'(Godari Gattupaina)నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల్లో ఉన్న రెస్పాన్స్ ని బట్టి  నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మేము ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా చెయ్యడం నిది ప్రదీప్ హీరోయిన్. జగపతి బాబు, లైలా,రాజీవ్ కనకాల కీ రోల్స్. మరి ఈ చిత్రం ఫస్ట్ డే సాధించిన కల్లెక్షన్స్ వివరాలు చూద్దాం. గోదారి గట్టు తొలి రోజు వరల్డ్ వైడ్ గా 1 .5 కోట్ల గ్రాస్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రీమియర్స్ తో 8 . 8 లక్షలు కలుపుకుని 1 .5 కోట్ల గ్రాస్. మేకర్స్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పై ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి  10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అత్యున్న నిర్మాణ విలువలు, సినిమాటిక్ అనుభూతి కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. మరి ఈ లెక్కన 10 కోట్ల రూపాయల షేర్, 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు నిర్దేశించాయి . also read: Razor Movie Review: రేజర్ మూవీ రివ్యూ మరి  ప్రెజెంట్ మూవీకి ఐతే డివైడ్ టాక్ నడుస్తుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విషయంలో ఏ మాత్రం అవహగాన లేకుండా తెరకెక్కించారని మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో ఏ మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి. సుభాష్ చంద్ర దర్శకత్వంలో నూతన నిర్మాత అభినవ్ రావు నిర్మించాడు.  
హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డుల నిర్వాహకులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరిగిపోతున్న తరుణంలో, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. 2027లో జరగబోయే 84వ ఎడిషన్ అవార్డుల వేడుక కోసం సరికొత్త నిబంధనలను ఖరారు చేస్తూ చిత్ర పరిశ్రమలో చర్చకు తెరలేపారు. ముఖ్యంగా నటన, రచన వంటి ప్రధాన విభాగాల్లో AI ప్రాబల్యం పెరగకుండా అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశం. ఒక నటుడి హావభావాలను లేదా గొంతును పూర్తిగా AI ద్వారా సృష్టించి సినిమా తీస్తే, అటువంటి చిత్రాలు లేదా నటీనటులు అవార్డులకు అనర్హులని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం సహాయక సాంకేతికతగా మాత్రమే AIని వాడాలని, అది మానవ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాకూడదని పేర్కొన్నారు. నటన విభాగంలో పోటీ పడే ప్రతి అభ్యర్థి ప్రతిభ కూడా సహజసిద్ధంగా ఉండాలని, కేవలం స్క్రీన్ మీద కనిపించే వ్యక్తి నటనలో మెజారిటీ భాగం ఆ నటుడి సొంతమై ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ డీ-ఏజింగ్ (వయస్సు తగ్గించడం) లేదా ఇతర విజువల్ ఎఫెక్ట్స్ కోసం AIని వాడితే, ఆ విషయాన్ని ముందే వెల్లడించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఒక నటుడి డిజిటల్ రూపాన్ని వాడితే అటువంటి ఎంట్రీలను అసలు పరిగణనలోకి తీసుకోరు. గత ఏడాది హాలీవుడ్‌లో జరిగిన రచయితలు, నటీనటుల సమ్మె సమయంలో AI ప్రధాన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికత వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అకాడమీ కూడా ఇప్పటికే కొన్ని కఠిన నియమాలను తీసుకొచ్చింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా అదే బాటలో పయనిస్తూ మానవ మేధస్సుకే పెద్దపీట వేస్తోంది.   పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం సినిమాలే కాకుండా మ్యూజిక్, యానిమేషన్ విభాగాల్లో కూడా AI వాడకంపై నిఘా ఉండనుంది. స్క్రిప్ట్ రాయడంలో చాట్ బాట్‌ల సహాయం తీసుకున్నా లేదా సంగీతంలో పూర్తిగా మెషిన్ లెర్నింగ్ వాడినా అవార్డు రేసులో వెనుకబడే అవకాశం ఉంది. హాలీవుడ్ మేకర్స్ ఈ కొత్త నిబంధనలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఇది నిజమైన టాలెంట్‌కు ఇచ్చే గౌరవమని వారు భావిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ పెరుగుతున్నా, కళ అనేది గుండెల్లోంచి రావాలి కానీ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ నుండి కాదని గోల్డెన్ గ్లోబ్స్ గట్టి సందేశాన్ని పంపింది. 2027 జనవరి 10న జరగనున్న ఈ వేడుకలో ఏయే సినిమాలు ఈ కొత్త రూల్స్ దాటుకుని నిలుస్తాయో వేచి చూడాలి. నిక్కీ గ్లేజర్ వరుసగా మూడోసారి ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!