
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందుతోన్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న విడుదల కానున్న ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ గ్లింప్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఏ సినిమా గ్లింప్స్ అయినా ఒక నిమిషానికి అటుఇటుగా ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ ఈసారి తన మార్క్ యాక్షన్ అడ్వెంచర్‌ను గట్టిగా చూపించాలని డిసైడ్ అయ్యారట. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ రన్ టైమ్ దాదాపు 3 నిమిషాలు (180 సెకన్లు) ఉండబోతోంది.
సాధారణంగా ట్రైలర్ మూడు నిమిషాల నిడివి ఉండటం చూస్తుంటాం. అలాంటిది గ్లింప్స్ మూడు నిమిషాలు అంటే.. దీనితోనే ఒక చిన్నపాటి సునామీని చూపించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ 3 నిమిషాల గ్లింప్స్ లో ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఇది ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 3 నిమిషాల గ్లింప్స్ గనుక వస్తే, యూట్యూబ్ రికార్డులన్నీ చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.
ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ అండ్ డార్క్ షేడ్ ఉన్న రోల్‌లో చూపించబోతున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' తరహాలోనే ఈ చిత్రంలో కూడా ప్రశాంత్ నీల్ మార్క్ భారీ సెట్టింగులు, మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ హైస్ ఉండనున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని టాక్.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో షూటింగ్ జరుగుతోంది. 2027, జూన్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





.webp)
