కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు,   నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది.   ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో  అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు.   మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది.   అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే..   నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు..  ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది.   అందుకే ఈ వ్యవహారం   జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా   డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో? [Special Session  Parliament,  Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government,  DMK, Discussions, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్‌లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్‌లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ  అధినేతతో చర్చించి జనసేనను.  20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు.  మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి,  అనంతపురం కార్పొరేషన్‌లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్‌ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. [Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]
దేశ రాజకీయాలలో  కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  ఎన్నికల సంఘం  చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ ,  అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు   నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్   కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి  తీహార్ జైలుకు తరలించారు.   ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   జగన్ బొద్దింకలకు  మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ   కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్   ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో  జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు.  [YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Veteran music director Deva, fondly known as ‘Thenisai Thendral’, passed away in Chennai on Saturday at the age of 75. His demise has come as a shock to the Tamil film industry, bringing an end to the journey of a composer who delivered several memorable soundtracks and became one of the defining musical voices of Tamil cinema during the 1990s.  Born Devanesan Chokkalingam, Deva built his reputation with his ability to create music across genres, from energetic folk numbers and Chennai gaana songs to romantic melodies. His association with superstar Rajinikanth resulted in memorable albums for Annamalai and Baashha. The latter, in particular, remains closely associated with Rajinikanth's screen persona, with its music and background score becoming an integral part of the film's enduring popularity. Deva went on to compose for several successful films featuring leading Tamil stars. His notable works include Aasai, Kadhal Kottai, Nerrukku Ner, Ninaithen Vandhai, Priyamudan, Vaalee, Kushi and Arunachalam. Across a career spanning more than three decades, he worked on over 500 films, leaving a substantial body of work that reached audiences across generations.  Although audiences widely identified him with gaana music, Deva had a deep affection for melodies and a strong grounding in Carnatic music. In a June 2026 interview with Cinema Express, he spoke about his desire to explore classical music more extensively and how the film Charukesi helped fulfil that long-standing ambition. Even after decades in the industry, he continued to work with younger composers and learn from changing musical trends.  Deva's contribution to Tamil cinema extended beyond chartbusters. His music became part of the identity of several films, helping create memorable moments that continue to resonate with audiences. His son, Srikanth Deva, has also established himself as a music composer, carrying forward the family's musical legacy. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సినిమా పేరు: గరివిడి లక్ష్మి న‌టీన‌టులు: ఆనంది,రాశి,నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న తదితరులు  సినిమాటోగ్ర‌ఫీ: జె. ఆదిత్య  ఎడిటింగ్: రవితేజ గిరజాల   మ్యూజిక్: చరణ్ అర్జున్   నిర్మాత‌లు: టి జి విశ్వ ప్రసాద్, క్రితి ప్రసాద్  బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  రచన,దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము రిలీజ్ డేట్ : అక్టోబర్ 17 ,2026  బ్రో, రాజాసాబ్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో 'ఆనంది' టైటిల్ రోల్ పోషించిన చిత్రం గరివిడి లక్ష్మి.1990ల్లో బుర్రకథ, జానపద సాంగ్స్ తో తెలుగు ప్రజలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలని ఉర్రుతలూగించి, ఉత్తరాంధ్ర కళాప్రపంచాన్ని ఏలిన  ప్రముఖ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం కథ విజయలక్ష్మి ఉరఫ్ లక్ష్మి(ఆనంది)ది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని గరివిడి. తండ్రంటే చాలా ప్రేమ. కానీ తన ఐదేళ్ల వయసులోనే తండ్రి మరో పెళ్లి చేసుకొని వెళ్తాడు. అందుకు లక్ష్మి తల్లి దేవుడమ్మ(రాశి) నే కారణం. ఆ తర్వాత 12 ఏళ్ళ వయసులో లక్ష్మికి  పెళ్లి అవుతుంది. కానీ భర్తకి అంతకు ముందే పెళ్లి అయ్యిందని తెలుసుకొని అతన్ని వదిలేసి తల్లి పెంపకంలోనే పెరుగుతుంది. పెద్దగా చదువు లేని లక్ష్మి ఒక్కసారి పాట వింటే చాలు అవలీలగా అక్షర దోషం లేకుండా పాడుతుంది. మధురమైన తన గాత్రంతో  పాట పాడుతుంటే సంగీతంలో ఎంతో నిష్ణాతులైన వాళ్ళు సైతం పొగడాల్సిందే. అలా క్రమక్రమంగా తల్లికి ఇష్టం లేకపోయినా బుర్ర కథ నేర్చుకుంటుంది. బుర్ర కథని కొత్తగా చెప్పాలని కమర్షియల్ పంధాలో సాగే  జానపద సాంగ్స్ యాడ్ చేస్తుంది. దీంతో గరివిడి లక్ష్మి నోటి నుంచి వచ్చే పాటలు అంటే  ప్రజలు పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతారు. తన క్యాసెట్స్ కూడా వస్తాయి. రాష్ట్రంలోనే  అత్యధిక క్యాసెట్స్ అమ్ముడైన రికార్డు లక్ష్మిదే. సినిమా వాళ్ళు కూడా ఆమె దగ్గరకి వచ్చి ఆమె పాటలు కావాలంటారు. అలాంటి ఆవిడ చివరకి ఒక నిరుపేదగా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుంటుంది. జానపద రంగాన్ని ఏలిన లక్ష్మికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారకులు ఎవరు? ఎవరైనా మోసం చేసారా? ఆ మోసం తాలూకు ఖరీదు ప్రేమనా? నమ్మక ద్రోహమా? అనేదే గరివిడి లక్ష్మి కథ ఎనాలసిస్  మూవీ మొత్తం ఫస్ట్ నుంచి చివరకి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. నిజజీవిత కథ కావడం, గరివిడి లక్ష్మి గారికి కూడా మూవీ చూపించాల్సి రావడంతో సినిమా ట్రిక్ అనేది ఎక్కడా ఉపయోగించకుండా రియల్ స్టిక్ గానే తీసారనే విషయం ప్రతి సన్నివేశంలో అర్థమవుతూనే ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న వ్యక్తి తన ప్రొడ్యూసర్ కోరిక మేరకు  గరివిడి లక్ష్మి గారిని వెతుక్కుంటూ ఆమె ఊరు రావడం,లక్ష్మి  ఫ్రెండ్ ద్వారా కథ ఓపెన్ కావడం బాగుంది. ఆ తర్వాత లక్ష్మి చిన్నప్పటి సీన్స్, తల్లి దేవుడమ్మ( రాశి) మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. ఇక పెద్దయ్యాక లక్ష్మి పాటలు పాడటాన్ని ఏదైనా భారీ సందర్భంలో ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిందేమో. బుర్ర కథ నేర్చుకోవడం  రాంబాబు( నరేష్) ద్వారా లక్ష్మి బుర్ర కథ బాగా పడుతుందని గరివిడి ప్రజలకి తెలియడం, సత్తిబాబు( రాగ్ మయూర్) తో కలిసి ప్రోగ్రాం ఇవ్వడం బాగుంది. అక్కడ్నుంచి లక్ష్మి, సత్తిబాబు కలిసి ప్రయాణం చేయాలనీ లక్ష్మి నే చెప్పడం. ఈ సందర్భంగా వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ బ్యాంగ్ తో మూవీ నెక్స్ట్ లెవెల్ లో వుండబోతుందనే విషయం అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ వచ్చింది. లక్ష్మి ప్రోగ్రామ్స్ మెయిన్ ఎట్రాక్షన్.ఆ తర్వాత ఒక్కొక్కరిగా తనని మోసం చేస్తున్నారని గ్రహించడం, చిత్రం మూవీలో 'రాను రాను అంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నది సాంగ్' ని సత్తిబాబుతో చూసి తన సాంగ్ కదా అని షాక్ అవ్వడం, ఆడియో క్యాసెట్ కంపెనీ వాళ్ళు చేసిన మోసం, చివరకి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సత్తిబాబు కూడా చేసిన మోసం సీన్స్ బాగున్నాయి. కాకపోతే కొంచం సినిమా టిక్ ఉపయోగించి కొంచం గ్యాప్ మోడ్ లో ఎస్టాబ్లిష్ చేస్తే ఫీల్ అనేది బాగా వర్క్ అవుట్ అయ్యేది. అదే విధంగా పెద్ద పెద్ద సినీ ఉద్దండులు సైతం వచ్చి ఉత్తరాంధ్ర కళాకారులని సన్మానించే ప్రాసెస్ లో గరివిడి లక్ష్మికి సన్మానం అని వేరే మహిళని గరివిడి లక్ష్మి గా భావించి సన్మానం చేసే సీన్ బాగున్నా, స్టేజ్ కిందనే  ఉన్న నిజమైన గరివిడి లక్ష్మి ఫీల్ అయ్యే ట్రాక్ ని సినిమా ట్రిక్ లోనే  మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందేమో . క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. నటీనటులు సాంకేతిక నిపుణుల తీరు  గరివిడి లక్ష్మి గా ఆనంది పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమ, జాలి,దయ, సంతోషం,ఉత్సాహం, నమ్మక ద్రోహం వంటి పార్శ్యాలు తన జీవితంలోకి ఎదురైనప్పుడు ఆనంది పండించిన హావ భావాలు నభూతో నభవిష్యత్. తన ఎంటైర్ సినీ లైఫ్ లో నా సినీ ఆల్బమ్ లో గరివిడి లక్ష్మి ఉందని సగర్వంగా చెప్పుకోవచ్చు. అంతలా క్యారక్టర్ లో ఒదిగిపోయింది. డాన్స్ లు కూడా ఎక్స్ లెంట్. సత్తిబాబు గా రాగ్ మయూర్ సైతం మెప్పించాడు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన నరేష్, రాశి, శరణ్య తమ క్యారెక్టర్స్ కి నిండు తనాన్ని తెచ్చారు.గౌరీ నాయుడు  డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు . కాకపోతే కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ ని సినీ ట్రిక్ లో చూపించాల్సింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సంస్థ కూడా తన సినీ లైబ్రరీలో గరివిడి లక్ష్మి ఉందని సగర్వంగా చెప్పుకోవచ్చు. బలాలు 1 . కథ 2 . సాంగ్స్  3 . ఆనందితో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్  4 .డైరెక్షన్   చివరిగా చెప్పుకోవాలంటే అలనాటి నిజమైన 'గరివిడి లక్ష్మి' ని మన కళ్ళ ముందు ఉంచింది.  రేటింగ్ 2 .75 /5                                                                                                     అరుణాచలం     
Keerthy Suresh looks vibrant and lively in the first look of January 12 Vidudala, unveiled by the makers on the occasion of her birthday. Directed by blockbuster filmmaker Anil Ravipudi, the upcoming festival entertainer brings together Victory Venkatesh and Nandamuri Kalyanram for the first time, with Krithi Shetty also playing a leading role. Keerthy plays Latha Reddy, a confident and energetic character who makes an immediate impression in the first-look poster. Sporting a green and red half-saree, glasses and a cheerful demeanour, she is seen driving a tractor through a field, presenting a refreshing village belle look. Known for creating entertaining and distinctive characters for female leads, Anil Ravipudi appears to have designed a lively role for the actress, with the first look hinting at a performance that could stand out in her career. The combination of Keerthy's spirited character, Venkatesh and Kalyanram's presence, and Anil Ravipudi's trademark humour has raised curiosity about the film's entertainment quotient. The makers are promising a wholesome family entertainer blending fun, festive appeal and heartfelt emotions. GV Prakash Kumar is composing the music and has expressed confidence in the film after watching its rushes and beginning work on the background score. Produced by Sahu Garapati, with Anitha, Suresh Babu and Zee Studios presenting it, the film is currently progressing with a major shooting schedule in Ooty, where prominent cast members are filming key sequences. The movie is releasing on 12th January.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Dulquer Salmaan and Satvika Veeravalli promise a heartfelt cinematic experience with Aakasamlo Oka Tara, a story that revolves around ambition, emotional support and the courage to chase an impossible dream. The teaser, unveiled by the makers, introduces Krishna and Kalpana, two individuals whose lives come together through a shared journey of hope and determination. Satvika Veeravalli makes her acting debut as Kalpana, a district first ranker whose ambition of becoming an astronaut finds little understanding within her family. Krishna, played by Dulquer Salmaan, recognises her potential and stands by her dream. The teaser hints at an emotional journey in which his support, hard work and loneliness become integral to her pursuit of an extraordinary goal. Dulquer brings his trademark charm to Krishna while exploring a different emotional dimension through the character. Satvika makes a strong impression with her expressive performance, commanding screen presence and chemistry with Dulquer. Shruti Haasan, appearing in a special role, adds another compelling presence to the narrative. Director Pavan Sadineni presents their modest world against the vastness of their ambition, maintaining a sincere and intimate visual approach. GV Prakash Kumar's background score elevates the emotional depth of the teaser, building on the buzz already generated by the chartbuster Chitti Cheema song. Produced by Sandeep Gunnam and Ramya Gunnam, with Geetha Arts and Swapna Cinema presenting the film, Aakasamlo Oka Tara promises an inspiring emotional drama. The film is scheduled to arrive in theatres on November 20. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించిన మేకర్స్.. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. కానీ ఆ తేదీకి కూడా సినిమా థియేటర్లలోకి రాలేదు. ఇప్పుడు అక్టోబర్ 30న విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేట్ చుట్టూ మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అక్కినేని నాగార్జున సమర్పణలో వస్తున్న చిన్న సినిమా ‘ఇట్లు అర్జున’ కూడా అక్టోబర్ 30నే విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ గురించి నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన నేరుగా ఏ సినిమా పేరూ ప్రస్తావించకపోయినా.. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల మార్పుల వల్ల చిన్న సినిమాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో వివరించారు. ‘ఇట్లు అర్జున’ సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన నాగార్జున.. రిలీజ్ డేట్లను ప్రకటించిన తర్వాత వాటిని మార్చడం వల్ల చిన్న సినిమాల టీమ్‌లు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఈ సినిమా మొదట అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా, పెద్ద సినిమా కోసం ఆ తేదీని మార్చాల్సి వచ్చిందని, ఆ తర్వాత అక్టోబర్ 9 కూడా వాయిదా పడిందని చెప్పారు. ఇప్పుడు అక్టోబర్ 30నైనా ఎలాంటి మార్పు లేకుండా విడుదల కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ను ఉపయోగించేసిన చిన్న సినిమాలకు మరోసారి వాయిదా పడితే కొత్తగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం కూడా కష్టమే. ‘ఇట్లు అర్జున’ విషయంలోనూ ఇదే సమస్య ఎదురైందని నాగార్జున వెల్లడించారు. సినిమా కోసం సిద్ధం చేసిన ప్రమోషనల్ కంటెంట్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే ఉపయోగించేశామని, మరోసారి వాయిదా పడితే కొత్తగా ఏం చూపించాలో ఆలోచించాల్సి వస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి అక్టోబర్ 30 రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ తేదీని పరిశీలిస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాకే కొత్త రిలీజ్ డేట్‌పై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ గతంలో వెల్లడించారు. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే వరుసగా రిలీజ్ డేట్లు మారడం, ప్రమోషన్ల విషయంలో స్పష్టత లేకపోవడం అభిమానుల్లో కొంత గందరగోళానికి కారణమవుతోంది. నాగార్జున వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తిని పెంచుతున్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగా ‘ఆదర్శ కుటుంబం’ను టార్గెట్ చేశారని చెప్పలేం. కానీ ఒక పెద్ద సినిమా విడుదల తేదీ మారినప్పుడు దాని ప్రభావం ఇతర సినిమాలపై ఎలా పడుతుందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: పాన్ ఇండియా సినిమాలపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.!       [Akkineni Nagarjuna, Aadarsha Kutumbam Movie, Itlu Arjuna Movie, Venkatesh, Trivikram, Naga Vamsi, Telugu Movies 2026, Telugu Film News]
అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్ 100’. ఆయన కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారా? అనే ప్రశ్నకు నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ‘కింగ్ 100’ను తెలుగు సినిమాగానే చూస్తున్నామని, ఇతర భాషల్లో విడుదల చేయాలా వద్దా అనేది సినిమా పూర్తయ్యాకే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు. రీసెంట్ గా ‘ఇట్లు అర్జున’ ఈవెంట్‌కు హాజరైన నాగార్జునను మీడియా ఇదే విషయం అడిగింది. దానికి స్పందించిన ఆయన.. సినిమా మొదలుపెట్టినప్పుడే పాన్ ఇండియా అని ఆలోచించడం వల్ల అనవసరమైన గందరగోళం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. పాన్ ఇండియా సినిమా అనగానే ఏ భాషకు చెందిన నటులను తీసుకోవాలి? డైలాగులు అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చేలా ఎలా రాయాలి? మన సంస్కృతి, సంప్రదాయాలు ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు నచ్చుతాయా? అనే లెక్కలు మొదలవుతాయని నాగార్జున వివరించారు. ఈ క్రమంలో కథలోని సహజత్వాన్ని పక్కనపెట్టే పరిస్థితి రాకూడదన్నది ఆయన అభిప్రాయం. ‘తెలుగు సినిమాని తెలుగు సినిమా లాగే తీయాలి.. ఆ తర్వాతే మిగతావన్నీ’ అన్న నాగార్జున మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముందుగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మంచి సినిమా తీయాలని, అది పూర్తయ్యాక ఇతర భాషల్లో విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలన్నది ఆయన ఆలోచన. నాగార్జునకు తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగు ప్రేక్షకులేనని ఆయన గతంలోనూ స్పష్టం చేశారు. అందుకే ఇతర మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచే కథను మార్చుకోవడం కంటే, మన ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ‘కింగ్ 100’ విషయానికి వస్తే.. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునతో పాటు టబు, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: సుడిగాలి సుధీర్‌కు 2014లోనే పెళ్ళయిందా.?       [Nagarjuna Comments On Pan India Movies, Nagarjuna 100th Movie, King 100 Movie, Akkineni Nagarjuna, Itllu Arjuna, Pan India Movies, Telugu Film News]  
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి చర్చ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా యాంకర్ రష్మి గౌతమ్‌తో ఆయన కెమిస్ట్రీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే సుధీర్, రష్మి ఇద్దరూ తమ మధ్య ఉన్నది స్నేహమేనని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.  ఇక ఇప్పుడు సుధీర్‌కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఆయనకు 2014లోనే పెళ్లి అయిపోయిందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వైరల్ అవుతున్న ఫోటోల్లో సుధీర్‌తో పాటు జబర్దస్త్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. దీంతో ఆయనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని, ఇన్నేళ్లుగా ఆ విషయాన్ని బయటపెట్టలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం వేరే ఉందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైరల్ అవుతున్న ఫోటోలు సుడిగాలి సుధీర్‌కు 2014లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించినవిగా చెబుతున్నారు. ఆ సమయంలో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఆ ఫోటోల్లో సుధీర్ పెళ్లి దుస్తుల్లో, మెడలో పూలదండతో కనిపించడంతో చాలామంది ఆయనకు పెళ్లి అయిపోయిందని భావిస్తున్నారు. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని, సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ పెళ్లి వరకు వెళ్లకుండానే ఆ సంబంధం ముగిసిందని అంటున్నారు. అయితే దీనిపై సుధీర్ నుంచి ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. మొత్తానికి పదేళ్ల నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో సుడిగాలి సుధీర్ పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: 'రణబాలి'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా.?       [Sudigali Sudheer Marriage, Sudigali Sudheer Engagement, Sudigali Sudheer Viral Photos, Sudigali Sudheer, Sudheer Rashmi, Jabardasth Rakesh, Telugu Film News]  
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా విడుదలైన వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంసుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు విభిన్న లుక్స్‌ను సినిమా నుంచి పూర్తిగా తొలగించారని, ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాన్ని సైతం ఫైనల్ కట్‌లో తీసేశారని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మోహన్‌లాల్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిషాద్ షంసుద్దీన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిత్రీకరించిన సన్నివేశాలను చూసినప్పుడు తమ పనిపై ఎంతో నమ్మకంగా ఉన్నానని తెలిపారు. ట్రైలర్‌లో మోహన్‌లాల్ కనిపించే భాగం కేవలం రెండు సెకన్లకే పరిమితమైనప్పటికీ, సినిమాలో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటుందని ఆశించానని పేర్కొన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక మోహన్‌లాల్‌కు సంబంధించిన మూడు విభిన్న లుక్స్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు, ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాన్ని కూడా కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ వంటి సూపర్‌స్టార్‌కు సంబంధించిన సన్నివేశాలను ఇలా తగ్గించడం తనకు బాధ కలిగించిందని అన్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో ‘జైలర్’ ఫ్రాంచైజీలో మరో సినిమా వచ్చినా తాను భాగం కాబోనని జిషాద్ స్పష్టం చేశారు. లాభాలు, కోటి క్లబ్బులు, స్టార్‌డమ్ కోసం కాకుండా సినిమా కళను ప్రేమించే ప్రేక్షకులు, అభిమానులు, మోహన్‌లాల్ కోసం తాను నిలబడతానని తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ సన్నివేశాలను ఎందుకు తొలగించారనే దానిపై చిత్రబృందం నుంచి స్పష్టమైన వివరణ వెలువడలేదు. ఎడిటింగ్ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. కాగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మొదటి భాగంలో మాథ్యూ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్న మోహన్‌లాల్, సీక్వెల్‌లోనూ అదే పాత్రను పోషించారు. అయితే ఆయనకు మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని ఆశించిన అభిమానులకు ఈసారి నిరాశ ఎదురైంది. మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల తొలగింపుపై కాస్ట్యూమ్ డిజైనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా చుట్టూ కొత్త చర్చకు తెరలేపాయి.     [Jailer 2 Mohanlal Scenes Cut, Mohanlal Jailer 2 Controversy, Jishad Shamsudeen, Jailer 2 Costume Designer, Rajinikanth Jailer 2, Mohanlal Mathew Character, Jailer 3 News]
ఒక కథను ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. అదే కథతో మరో హీరో సినిమా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మొదట ఈ కథను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మొదట ‘రణబాలి’ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాలని అనుకున్నారట. అయితే ఈ తరహా పీరియాడిక్ డ్రామాలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిందని భావించిన రామ్ చరణ్.. ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. ‘రణబాలి’ కథను రామ్ చరణ్ రిజెక్ట్ చేశారనే వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఒకవేళ ఆయన ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఈ సినిమా ఆయన కెరీర్‌కు మరో ఫ్లాప్‌గా మిగిలేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం రామ్ చరణ్ లుక్, నటనకు ఈ పాత్ర బాగా సరిపోయేదని అంటున్నారు. 1876–78 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన మహా కరువు నేపథ్యంతో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథగా ఈ సినిమాను రూపొందించారు.  తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో రామ్ చరణ్ ఈ కథ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అనేది అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇది కూడా చదవండి: చిరంజీవితో మల్టీస్టారర్.. ఎప్పుడు ఉంటుందో చెప్పిన నాగార్జున.!       [Did Ram Charan Reject Ranabaali, Ram Charan Rejected Ranabaali, Ranabaali Movie, Ram Charan, Vijay Deverakonda, Rahul Sankrityan, Rashmika Mandanna, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘స్టైల్’ సినిమాలో కనిపించినప్పటికీ.. అది కేవలం అతిథి పాత్రలకే పరిమితమైంది. పూర్తిస్థాయిలో ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందనే విషయంలో తాజాగా నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇద్దరు సీనియర్ నటులతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా సిద్ధమైందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా నాగార్జున చేసిన వ్యాఖ్యలతో ఈ కాంబినేషన్ విషయంలో మరోసారి ఆసక్తి మొదలైంది. ‘ఇట్లు అర్జున’ ప్రెస్ మీట్ సందర్భంగా చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని నాగార్జునను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను కూడా ఆ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని చెప్పారు. చిరంజీవితో తనకు మంచి స్నేహం, అద్భుతమైన ర్యాపో ఉందని.. ఇద్దరూ ఎప్పుడు కలిసినా కలిసి ఒక సినిమా చేయాలని మాట్లాడుకుంటామని తెలిపారు. అయితే ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే సరైన సమయం రావాలని నాగార్జున అన్నారు. ఆ సమయం తప్పకుండా వస్తుందని, అప్పుడు ఈ సినిమా కచ్చితంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో చిరంజీవి, నాగార్జున కలిసి నటించేందుకు సిద్ధంగానే ఉన్నారని.. ఇద్దరికీ సరిపోయే కథ, సమయం కోసం ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికే కథను సిద్ధం చేశారని, కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, మాస్ అంశాలతో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చేలా సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. నాగార్జున తాజా వ్యాఖ్యల్లో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఈ మల్టీస్టారర్ ఆయన దర్శకత్వంలోనే ఉంటుందా? లేక మరో దర్శకుడు ఇద్దరు నటులకు సరిపోయే కథతో ముందుకొస్తారా? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం.. అసలు ఏమైంది?.. ఇప్పట్లో విడుదల కష్టమేనా.?       [Chiranjeevi Nagarjuna Multistarrer, Megastar Chiranjeevi, Akkineni Nagarjuna, Itllu Arjuna Movie, Anil Ravipudi, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన భారతీయ సంప్రదాయంలో వంటశాలలో లభించే ప్రతి దినుసు వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కనిపించే వేప చెట్టు, అలాగే ప్రతి కూరలోనూ సువాసనను, రుచిని పెంచే కరివేపాకు మన శరీరానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. అయితే పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కరివేపాకు మరియు వేప ఆకులలో ఏది ముందుంటుంది? ఏది మనకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అనే అంశంపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి. వాస్తవానికి ఈ రెండు ఆకులూ వేర్వేరు విశిష్టతలను కలిగి ఉండి, మన ఆరోగ్యానికి రెండు కళ్లలా పనిచేస్తాయి. కమ్మని వాసనతో ఆహారానికి రుచినిచ్చే కరివేపాకు కేవలం వంటలకే పరిమితం కాకుండా, శరీరానికి శక్తినిచ్చే అద్భుతమైన ఔషధ ఖజానాగా పనిచేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు బీటా కెరోటిన్, ఐరన్ మరియు క్యాల్షియం వంటి ఎన్నో విలువైన పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. మనం సాధారణంగా భోజనం చేసేటప్పుడు కరివేపాకును తీసి పక్కన పడేస్తుంటాం, కానీ అలా చేయడం వల్ల ఎన్నో పోషకాలను కోల్పోతున్నాము. ఉదయాన్నే పరగడుపున 5 నుండి 6 తాజా కరివేపాకులను నమిలి తినడం వల్ల లేదా రోజువారీ వంటల్లో 8 నుండి 12 తాజా కరివేపాకులను విధిగా వాడటం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా, మధుమేహం లేదా షుగర్ వ్యాధి ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, కురుల ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో కరివేపాకు పోషించే పాత్ర అద్భుతం. మరోవైపు చేదుగా ఉండే వేప ఆకు ఆరోగ్యానికి అక్షరాలా అమృతంలా పనిచేస్తుంది.  చేదుగా ఉండేదే ఆరోగ్యానికి ఎంతో మంచిది  అనే సామెత వేప విషయానికి వస్తే అక్షరాలా నిజమవుతుంది. వేప చెట్టుకు సంబంధించి పుల్ల దగ్గర నుంచి ఆకుల వరకు అన్నీ మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వేప ఆకులో నింబిన్, అజాడిరాక్టిన్, క్వెర్సెటిన్ వంటి సుమారు 140కి పైగా శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు నిండి ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, మన శరీరానికి ఒక పటిష్టమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. పూర్వకాలం నుండి చర్మ వ్యాధులకు, దీర్ఘకాలిక జ్వరాలకు మరియు వివిధ ఇన్ఫెక్షన్లకు వేపను అత్యుత్తమ ప్రాచీన వైద్యంగా వాడుకుంటూ వస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే పరగడుపున 4 నుండి 8 లేత వేప ఆకులను నమిలి తినడం లేదా ఆకులను మెత్తగా మిక్సీ పట్టి జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల శరీర రోగనిరోధక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనకు రోజూ పచ్చి ఆకులు అందుబాటులో లేకపోతే, కరివేపాకు మరియు వేప ఆకులను విడివిడిగా ఎండబెట్టి లేదా దోరగా వేయించి చక్కటి పొడిలా తయారు చేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని వంటల్లో లేదా వివిధ హెల్దీ డ్రింక్స్ లో కలుపుకుని వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకు జీర్ణక్రియను, కొలెస్ట్రాల్ నియంత్రణను, జుట్టు అందాన్ని కాపాడితే, వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని అజేయంగా మలుస్తాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏది గొప్ప అంటే, రెండూ వాటికవే సాటి అని నిపుణులు చెబుతున్నారు.     curry leaves vs neem leaves, benefits of curry leaves, benefits of neem leaves, curry leaves for hair growth, neem for skin and diabetes, herbal health remedies, neem vs curry leaves comparison.
మారిన ఆధునిక జీవన విధానం, పెరిగిన కాలుష్యం, మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో లోపాల కారణంగా గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ సమస్యలు ఈ రోజుల్లో చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరినీ తీవ్రంగా వేధిస్తున్నాయి. నిజానికి, ఈ పొట్ట సంబంధిత సమస్యలను వంటింట్లో లభించే కొన్ని సహజమైన పదార్థాలతో సులభంగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా, నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ కంటెంట్ మరియు పులియబెట్టిన గంజి రూపంలో తీసుకుంటే కడుపులోని చెడు బ్యాక్టీరియా పూర్తిగా నశించి, గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ సమస్యల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే, విటమిన్ సి సమృద్ధిగా ఉండే పదార్థాలు కడుపులో ఏర్పడే పుండ్లను లేదా అల్సర్లను త్వరగా నయం చేయడానికి ఎంతోగాను సహాయపడతాయి. రోజు విడిచి రోజు ఒక గ్లాసు తాజా క్యాబేజీ రసం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక తేనెలో ఉండే ప్రత్యేక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసే గుణాలు అల్సర్‌ను కలిగించే హానికరమైన బ్యాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడతాయి. అందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగడం మంచిది. దీనివల్ల పొట్టలో మంట తగ్గి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అంతేకాకుండా, వెల్లుల్లిలో ఉండే  అల్లిసిన్  అనే శక్తివంతమైన కాంపౌండ్ పెప్టిక్ అల్సర్లను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను నేరుగా తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి, అల్సర్లను కలిగించే బ్యాక్టీరియా మళ్లీ పెరగకుండా అడ్డుకుంటుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇక జీర్ణక్రియను మెరుగుపరచడంలో మెంతులు, జీలకర్ర, ఆవాల కషాయం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మెంతి ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి కొద్దిగా ఉప్పు కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది. గ్యాస్ట్రిక్ మరియు అల్సర్‌తో బాధపడేవారికి తరచుగా వచ్చే త్రేన్పులు, నోటి దుర్వాసనను తగ్గించడంలో ఆవాల కషాయం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు స్టమక్ అల్సర్ మరింత పెరగకుండా ముందే నివారిస్తాయి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినీళ్లలోని సహజ మినరల్స్ పొట్టను లోపలి నుంచి శుభ్రపరిచి, చల్లబరిచి అల్సర్ తీవ్రతను తగ్గిస్తాయి. ఈ చిన్నపాటి ఆహారపు మార్పులు, వేళకు భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.     stomach burning remedies, acidity home remedies, gastric problem quick relief, natural acid reflux treatment, gas bloating home remedies, how to cure stomach burning, digestive health tips.
మన వంటింట్లో లభించే ఆరోగ్యకరమైన కూరగాయలలో బీరకాయ ముందు వరుసలో ఉంటుంది. వేసవి కాలంలో లేదా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన వంటకాల్లో బీరకాయ పెరుగు కూర ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సాధారణంగా బీరకాయను పాలు పోసి, పెసరపప్పుతో లేదా ఎగ్ వేసి రకరకాలుగా వండుతుంటాం. కానీ పెరుగుతో బీరకాయ కూర వండుకోవడం చాలా సులభం మాత్రమే కాకుండా, అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఈ ఆరోగ్యకరమైన రెసిపీ తయారీకి మనకు కేవలం కొన్ని సాధారణ పదార్థాలు మాత్రమే సరిపోతాయి. ఈ వంటకం కోసం ముఖ్యంగా 2 కప్పుల తాజా బీరకాయ ముక్కలు, 3 కప్పుల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 నుంచి 3 పచ్చిమిర్చి, 10 కరివేపాకులు, కొద్దిగా కొత్తిమీర, పోపు కోసం తగినంత నూనె, ఆవాలు, మినపప్పు, జీలకర్ర మరియు ఎండుమిర్చి అవసరమవుతాయి. ఈ రుచికరమైన కూరను తయారు చేసేందుకు ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, పీచు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి బీరకాయ ముక్కలను వేయించుకోవాలి లేదా కొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు వేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన బీరకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో 3 కప్పుల పెరుగు తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి మజ్జిగలా తయారు చేసుకోవాలి. ఆ మజ్జిగలో ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ మీద మీడియం మంటపై ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించాలి. అయితే పెరుగును ఎక్కువసేపు మరగనివ్వకూడదు, లేదంటే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఈ కూరకు సరిపడే పోపు సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న కడాయిలో సరిపడా నూనె వేడి చేసి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు మరియు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న సువాసనల పోపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు కూరలో వేసి చక్కగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును చల్లుకుంటే ఎంతో కమ్మనైన, ఆరోగ్యకరమైన బీరకాయ పెరుగు కూర సిద్ధమవుతుంది. ఈ కూరను వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇచ్చే ఈ సంప్రదాయ వంటకాన్ని ఇంట్లోని సాధారణ పదార్థాలతోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేస్తే కుటుంబంలోని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మరియు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.     Beerakaya perugu kura, ridge gourd curd curry recipe, healthy ridge gourd recipe, Andhra style ridge gourd curry, beerakaya recipes, yogurt ridge gourd curry, easy vegetarian curries.  
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.
  శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది.. సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  పొడి చర్మానికి రక్షణ.. మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది.. చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణవ్యవస్థ కు మంచిది.. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.  మహిళల నెలసరిలో.. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు.  కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే  కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.                  *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వెనుక థైరాయిడ్ హార్మోన్ల పాత్ర ఎంత? మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకు మధ్య సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు, Cell Health Clinics వ్యవస్థాపకులు డాక్టర్ చింతా రవికుమార్ వివరణ ఇచ్చారు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? మహిళల శరీరంలో యుక్తవయస్సు, నెలసరి, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి వివిధ దశల్లో హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని మార్పుల వల్ల కూడా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళకూ థైరాయిడ్ సమస్య వస్తుందని కాదు. లక్షణాలను గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. TSH, T3, T4 హార్మోన్లు ఏం చేస్తాయి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియలు, శక్తి వినియోగం, బరువు నియంత్రణ వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. TSH పరీక్ష ద్వారా థైరాయిడ్ పనితీరు గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు. T4 హార్మోన్ శరీరంలో T3 అనే క్రియాశీల హార్మోన్‌గా మారుతుంది. ఈ మార్పిడిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? థైరాయిడ్ పరీక్షల్లో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరిస్తారు. గట్ హెల్త్‌కు థైరాయిడ్‌కు సంబంధం ఏమిటి? మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు జీర్ణక్రియతో పాటు శరీరంలోని కొన్ని జీవక్రియల్లోనూ పాత్ర పోషిస్తాయి. పోషకాలు సరిగా అందడం, పేగుల ఆరోగ్యం, శరీరంలోని హార్మోన్ల ప్రక్రియలు పరస్పరం ప్రభావితం చేసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల పనితీరులో గట్ హెల్త్ పాత్ర ఏమిటి? జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటే ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితిని హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైద్య పరీక్షల ప్రాధాన్యత గురించి డాక్టర్ వివరిస్తారు. PCOS, బరువు పెరగడం, నెలసరి సమస్యలకు థైరాయిడ్ కారణమా? PCOS ఉన్న మహిళల్లో నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. థైరాయిడ్ సమస్యల్లోనూ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యలన్నింటికీ థైరాయిడ్ ఒక్కటే కారణం కాదు. లక్షణాలను బట్టి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ ఆరోగ్యానికి అయోడిన్, సెలీనియం, జింక్ ఎందుకు అవసరం? థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ అవసరం. సెలీనియం, జింక్ వంటి పోషకాలు కూడా శరీరంలోని సాధారణ జీవక్రియలకు, థైరాయిడ్ హార్మోన్ల ప్రక్రియలకు తోడ్పడతాయి. వీటిని ఆహారం ద్వారా తగినంతగా పొందడం ఎందుకు ముఖ్యం? పోషకాల లోపం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? అనే విషయాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. మెదడు ఆరోగ్యం, డోపమైన్, సెరోటోనిన్‌తో సంబంధం ఏమిటి? డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు మెదడులో మానసిక స్థితి, ప్రేరణ, నిద్ర వంటి విధులకు సంబంధించిన ప్రక్రియల్లో పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత శక్తి స్థాయులు, ఏకాగ్రత, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఈ అంశాల గురించి కూడా డాక్టర్ వివరిస్తారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు కూడా థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్సను కొనసాగించడం ముఖ్యం. గర్భం దాల్చాలని ఆలోచిస్తున్న మహిళలు కూడా తమ థైరాయిడ్ ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో థైరాయిడ్ సమస్యలకు గల కారణాలు, TSH స్థాయులు, T4 నుంచి T3గా మారే ప్రక్రియ, హషిమోటోస్ థైరాయిడిటిస్, PCOS, గట్ హెల్త్, అవసరమైన పోషకాలు, మెదడు ఆరోగ్యం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలపై డాక్టర్ చింతా రవికుమార్ అందించే పూర్తి వివరణను ఈ వీడియోలో చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానం వచ్చినా, పరీక్షల్లో మార్పులు కనిపించినా వైద్యులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులను ఆపడం లేదా వాటి మోతాదును మార్చడం చేయకండి. పోషకాహార సప్లిమెంట్లను కూడా వైద్యుల సూచనల మేరకే ఉపయోగించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)