తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకు తానే   రేటింగ్ ఇచ్చుకుని  సంచలనానికి తెరలేపారు ఒక జాతీయ మీడియా సదస్సులో  ఆయన తన పాలనకు  65 శాతం మార్కులు ఇవ్వొచ్చని ప్రకటించారు.   ఇంకా చేయాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.  సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు. అలా అతి విశ్వాసంతో తమ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్న చాలా మంది ముఖ్యమంత్రులకు ఎన్నికలలో ప్రజలు తన ఓటు ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి.  అయితే..  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలకు తాను ఏమి చేశాను? ఇంకా చేయాల్సింది ఏమిటి? ఎంత వరకూ చేయగలను? అన్న అంశాలపై స్పష్టత ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే ఇప్పటి వరకూ తన పాలన ఎలా ఉందో అన్న విషయంలో ఆయన చాలా చాలా వాస్తవంగా, నిజాయితీగా చెప్పారు.    జాతీయ మీడియా సదస్సులో, ఇప్పటివరకు మీ  పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారన్న ప్రశ్న ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తడుముకోకుండా, తడబడకుండా నూటికి 65 మార్కులు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తానే తక్కువ మార్కులు ఇచ్చుకోవడం ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లైంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందనీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయనీ చెప్పిన రేవంత్ వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.  సాధారణంగా ముఖ్యమంత్రులు తాము చేయగలిగినదంతా చేశామని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ, తమకు తామే వంద శాతం రేటింగ్ ఇచ్చుకుంటూ స్వోత్కర్షకు ప్రాధాన్యత ఇస్తుంటారు.  రేవంత్ రెడ్డి మాత్రం తాను చేయాల్సినది ఇంకా ఉందనీ, మూడేళ్ల పాలనా కాలంలో కేవలం 65శాతం మాత్రమే తాను అనుకున్నది చేయగలిగాననీ నిస్సంకోచంగా అంగీకరించి పరిశీలకులను సైతం విస్మయపరిచారు.  ఇది కూడా చదవండి:   బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.! తాను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పడం, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా తనకు నూటికి 64 మార్కులే పడ్డాయని ధైర్యంగా చెప్పగలగడం  ద్వారా తాను వాస్తవాలను వాస్తవాలుగా అంగీకరించడానికి భయపడనని చాటినట్లైంది.  అదే సమయంలో మిగిలిన రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల అంచనాలను చేరుకుని మిగిలిన 35 మార్కులూ కూడా సాధిస్తానని అంతే ధైర్మంగా చెప్పడం ద్వారా.. తాను వందశాతం ప్రజామోదాన్ని పొందడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పినట్లైంది. మొత్తం మీద తనకు తాను రేటింగ్ ఇచ్చుకుని రేవంత్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని రాజకీయవర్గాలలో  చర్చ జరుగుతోంది. మీకు నచ్చవచ్చు:  మహిళా శక్తే నా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి డీ లిమిటేషన్ దక్షిణాదికి గొడ్డలి పెట్టు: అమిత్ షా దమ్ముంటే ఒవైసీపై పోటీకి దిగు.!  [TelanganaCM, Revanth Reddy, Selfrating, Governence,  TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  మరోవైపు   వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో  తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్‌పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్‌పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్‌పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్‌పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్‌పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక   అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది.   పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ,   కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి  పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో   మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది.   జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.! [Andhra Pradesh Zilla Parishad Elections,  Alliancevictory, ZP chairpersons, YCP,  Alluri Sitarama Raju Zilla Parishad]
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి: కేటీఆర్ ను లైట్ తీసుకుంటా.. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విజయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సవాల్ చేశారు.  హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు.  మతపరమైన ఓట్ల చుట్టూనే బీజేపీ, ఎంఐఎం రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్  మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికపై జరిగిన సంభాషణలో లోక్‌సభ సీట్ల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు.  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)   ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంగా కాకుండా, యావత్ దక్షిణ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సవాలుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. లోక్‌సభ స్థానాలను యాభై శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని, కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. పునర్విభజన తర్వాత మొత్తం 850 లోక్‌సభ స్థానాలు ఏర్పడితే.. వాటిలో ఉత్తరాదికి దాదాపు  650 సీట్లు, దక్షిణాదికి దాదాపు 195 సీట్లు దక్కే అవకాశం ఉందని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో 60 సీట్ల తేడా ఉండగా, యాభై శాతం పెంపు జరిగితే కేరళలో 30, యూపీలో 120 సీట్లతో ఆ వ్యత్యాసం 90 సీట్లకు పెరుగుతుందని ఉదాహరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమని గుర్తు చేస్తూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిన సందర్భం ఉన్నప్పటికీ, దక్షిణాది ప్రాధాన్యతను దెబ్బతీసేలా సీట్ల సంఖ్యలో భారీ అసమతుల్యత రావడం దేశానికి  ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఆంధ్ర ప్రాంతానికి, 119 సీట్లు తెలంగాణకు ఉన్న సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ కారణంగానే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాలు, జనాభా, జీడీపీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యాభై శాతం ఫార్ములాను అనుసరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త చట్టాలు లేదా రాజ్యాంగ సవరణల అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ సహకరించినప్పటికీ, సంఖ్యాబలంతో ముందుకెళ్తూ భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అభివర్ణిస్తూ, ఆయన తరచూ విదేశీ పర్యటనల్లో ఉంటున్నారన్న రేవంత్ రెడ్డి,  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, జాతి, మతం, భాష పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషితో సామాన్యులకు లభించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్ - గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఇక విదేశాల్లో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై,  పేదల హక్కుల కోసం వివిధ దేశాల్లో పోరాడిన చేగువేరా స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాము నిలబడతామని సమర్ధించారు.   ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!   అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలపై మాట్లాడుతూ,  కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి  బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు గుర్తుకురాక నీతి ఆయోగ్ సమావేశాల్లో నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని చమత్కరించారు.  కేసీఆర్‌ను తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, అయితే కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోనని రేవంత్ చెప్పారు.  తాను పదిహేడేళ్ల వ్యవధిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నానని, కేటీఆర్ మాత్రం తండ్రి అండతో  మేనేజ్‌మెంట్ కోటా లో నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.  తన రాజకీయ కథలో కేసీఆర్‌ను  రావణాసురుడిగా అభివర్ణించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.​ కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!  [Southern Rising Summit, Revanth Reddy,   Delimitation,   Amit Shah, Oyaisi, KCR,  KTR, TeluguOne] 
ALSO ON TELUGUONE N E W S
1997లో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా తెలుగు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌లోని విప్లవ భావాలు, తెలంగాణ జానపద శైలి ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి ఐకానిక్ పాటను ఇప్పుడు రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ కోసం రీక్రియేట్ చేశారు. ఈ పాటలో మొదటగా ఆకట్టుకునేది రష్మిక కనిపించిన తీరు. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఆమె.. ఇందులో మాత్రం పూర్తి భిన్నమైన రౌద్రరూపంలో కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలు, చుట్టూ అడవి వాతావరణం, యాక్షన్ విజువల్స్‌తో ఆమె పాత్రలోని తెగువను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రష్మిక లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. మరోవైపు ఒరిజినల్ పాటలో ఉన్న విప్లవ స్ఫూర్తిని కొత్త వెర్షన్‌లోనూ కొనసాగించే ప్రయత్నం కనిపిస్తోంది. విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర అప్పట్లో అణచివేతకు ఎదురొడ్డి నిలిచే మహిళగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ‘మైసా’లోనూ రష్మిక గిరిజన మహిళ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ రెండు పాటల మధ్య ఓ భావోద్వేగపరమైన అనుసంధానం ఏర్పడింది. అందుకే ఇది సాధారణ రీమిక్స్‌లా కాకుండా ఓ ప్రత్యేకమైన నివాళిగా నిలవాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. సంగీతం విషయానికి వస్తే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్ మరోసారి తన గొంతుతో ఈ పాటను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణ. సుద్దాల అశోక్ తేజ కొత్త సాహిత్యాన్ని అందించగా, జేక్స్ బిజోయ్ తనదైన సంగీతంతో పాటకు కొత్త రూపం ఇచ్చారు. పాత పాటను యథాతథంగా అనుకరించకుండా, ‘మైసా’ కథానాయిక స్వభావానికి తగ్గట్టుగా కొత్త బీట్, కొత్త ఎనర్జీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: పండగ పాట వచ్చేసింది.. హీరోయిన్లు ఒక ఊపు ఊపేశారు.! అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఒరిజినల్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో ప్రేక్షకులకు ఉన్న అనుబంధం చాలా బలమైనది. అలాంటి పాటను మళ్లీ రూపొందించడం అంటే సహజంగానే పోలికలు వస్తాయి. విజయశాంతి సృష్టించిన ప్రభావాన్ని రష్మిక అందుకోగలదా? అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఈ విషయంపై రష్మిక స్వయంగా స్పందిస్తూ, అంతటి ఐకానిక్ పాటను మళ్లీ చేయాలంటే మొదట భయమేసిందని, ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేమని, అయితే దానికి న్యాయం చేసే ప్రయత్నం చేశామని చెప్పింది. విజయశాంతికి ఇది తమ చిన్న నివాళి అని కూడా పేర్కొంది. మొత్తానికి ‘ఒసేయ్ రాములమ్మ’ పాట ‘మైసా’పై అంచనాలను పెంచేలా ఉంది. ఒకవైపు పాత పాటను గుర్తు చేసే నాస్టాల్జియా.. మరోవైపు రష్మిక కొత్త అవతార్.. ఈ రెండింటినీ కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  మీకు నచ్చవచ్చు:  టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా! సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.?       [Mysaa Movie, Osey Ramulamma Song, Rashmika Mandanna, Vijayashanthi, Vandemataram Srinivas]  
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'రాకా'కి సరికొత్త తలనొప్పులు. పైగా ఆ తలనొప్పులు సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న చర్చల వల్ల. అది కూడా నిన్న రీసెంట్ గా విడుదలైన 'ఓం 'మూవీ వల్ల. అదేం లాజిక్ అనుకుంటున్నారా! మరి అక్కడే ఉంది అసలైన గమ్మత్తు. విషయం తెలిసాక మీరు కూడా మీ మెదళ్ళని మరింత షార్ప్ తో ఉంచుతు సోషల్ మీడియా చర్చల్లో పాల్గొంటారు.  రాకాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్. అందుకే మ్యూజిక్ కి సంబంధించిన కొత్త టెన్షన్ మొదలైంది.  ధనుష్  'ఓం' కి కూడా సాయి అభ్యంకర్ నే మ్యూజిక్ అందించాడు.బ్యాక్  గ్రౌండ్ స్కోర్‌పై సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బీజీఎం సినిమా ఫ్లోకి  ఆటంకంగా మారిందనే విమర్శలు  వినిపిస్తున్నాయి. సినిమా కథనం సాఫీగా సాగుతున్న సమయంలో సంగీతం కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించడంతో, దాని ప్రభావం ఇప్పుడు అల్లు అర్జున్ 'రాకా' మీద కూడా చర్చకు దారి తీసింది. అయితే సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ మాటలను కేవలం ప్రేక్షకుల నుంచి వస్తున్న వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి. కేవలం ఒక సినిమా విషయంలో వచ్చిన స్పందనను బట్టి వేరే మూవీ సంగీత దర్శకుడి ప్రతిభని పూర్తిగా అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ స్వతంత్ర సంగీతంతోనూ, సినిమాల పాటలతోనూ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గాయకులు టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా సంగీత నేపథ్యం ఉన్నా, చిన్న వయసులోనే దాదాపు 1000 ట్యూన్‌ల బ్యాంక్ సిద్ధం చేసుకున్నానని  గతంలో చెప్పడం వార్తల్లో నిలిచింది.   అయినప్పటికీ, 'ఓం' సినిమా బీజీఎంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సాయి అభ్యంకర్ సంగీతంపై సోషల్ మీడియాలో వేడి చర్చ మొదలైంది. అల్లు అర్జున్ సినిమాలకు ఎప్పుడూ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో 'రాకా' కోసం సాయి అభ్యంకర్ ఎలాంటి సౌండ్‌తో వస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అంతర్జాతీయ గాయకులని  కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నట్లు గతంలో చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుత విమర్శల మధ్య తన ప్రతిభను మరో స్థాయిలో నిరూపించుకోవాల్సిన పెద్ద బాధ్యత ఆయనపై ఉందని సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: నమ్మించి అడ్డంగా 14 కోట్ల రూపాయలకి ముంచేశారు: GOAT నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన మరోవైపు, 'రాకా' షూటింగ్ ఇంకా 40 శాతం మాత్రమే పూర్తయిందన్న వార్తలు కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం ఉన్నందున, 'ఓం'పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని 'రాకా' మ్యూజిక్ విషయంలో సాయి అభ్యంకర్, దర్శకుడు అట్లీ మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ మాస్ ఎలివేషన్లకు తగ్గట్టుగా బీజీఎం, పాటలు కుదిరితే ఈ టెన్షన్ మొత్తం ఆనందంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే ప్రస్తుత సినీ రోజుల్లో సీన్స్ లో పస లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో ఉండాలి. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఎందుకు ఎగురుతున్నామో కూడా తెలియకుండా ఎగురుతుంటారు.   మీకు నచ్చవచ్చు: ఎన్టీఆర్ విశ్వరూపం మీకు నచ్చవచ్చు: ఆ స్టార్ హీరోతో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి!   [Allu Arjun ,Raaka, Sai Abhyankkar, dhanush, om]
సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్‌.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఉన్న క్షణాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా బన్నీ పెట్టిన ఓ క్యూట్ పోస్ట్‌ నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. నవంబర్‌ 21న అర్హ పదో పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ తన కుమార్తెతో కలిసి ఉన్న ఓ అందమైన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. “హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్‌ ఆఫ్‌ మై లైఫ్‌” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే.. తన జీవితంలోని ఆనందం అర్హే అని చెప్పకనే చెప్పారు. ఈ చిన్న సందేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అర్హకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక అర్హ పుట్టినరోజును కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకునేందుకు అల్లు ఫ్యామిలీ శ్రీలంకకు వెళ్ళింది.  మరోవైపు అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌తో ఓ ప్రాజెక్ట్‌ కూడా లైనప్‌లో ఉంది. కెరీర్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న బన్నీ.. కూతురి పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న ఈ చిన్న సందేశంతో మరోసారి తన ఫ్యామిలీ బాండ్‌ను చాటుకున్నారు. ఇది కూడా చదవండి: శ్రీలంకకు అల్లు అర్జున్‌ ఫ్యామిలీ.. స్పెషల్ ఏంటో తెలుసా.? https://www.instagram.com/p/Df_dwzXSdeO/       [Allu Arjun, Daughter, Allu Arha, Birthday, Allu Family]  
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సహ యజమాని, సన్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కావ్య మారన్‌ తన పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన కానుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ను వివాహం చేసుకున్న కావ్య.. సన్‌ గ్రూప్‌ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, చాక్లెట్లు, పెళ్లి ఆహ్వాన పత్రికలను అందించినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఉద్యోగులు గిఫ్ట్‌ బాక్సులను తెరిచి చూస్తుండటం కనిపిస్తోంది. వాటిలో పెళ్లి ఆహ్వాన పత్రిక, చాక్లెట్లతో పాటు బంగారు ఉంగరం కూడా ఉంది. ఓ ఉద్యోగి వీడియోలో మాట్లాడుతూ.. తమకు బంగారు నాణేలు వస్తాయని అనుకున్నామని, కానీ బాక్సులో బంగారు ఉంగరం ఉండటంతో ఆశ్చర్యపోయామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కానుకలతో పాటు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో నవంబర్‌ 25న విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విందు సన్‌ గ్రూప్‌ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. అలాగే ఎంతమంది ఉద్యోగులకు ఈ కానుకలు అందించారు, ఉంగరాల బరువు ఎంత, వాటి విలువ ఎంత అనే వివరాలు కూడా అధికారికంగా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: ‘ఓం’ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. ధనుష్ కెరీర్‌లోనే హయ్యస్ట్.! ఇక కావ్య మారన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ నవంబర్‌ 11న గ్రీస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ వంటి ప్రముఖులు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. నవంబర్‌ 21న చెన్నైలో ఈ జంట వివాహ రిసెప్షన్‌ జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ సమయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున అభిమానులకు సుపరిచితమైన కావ్య మారన్‌.. ఇప్పుడు తన పెళ్లి వేడుకలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఉద్యోగులకు బంగారు ఉంగరాలు అందించినట్లు వస్తున్న వార్తలు, వైరల్‌ అవుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మీకు నచ్చవచ్చు:  8 బియ్యపు గింజలు, రెండు బస్తాల నూనె, 5 లీటర్ల సబ్బులు దొంగతనం.. హిలేరియస్ కామెడీ.! టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా!       [KavyaMaran, KavyaMarangoldrings, AnirudhRavichander, SunGroup, AnirudhKavyaWedding]
టాలీవుడ్‌లో నవంబర్-డిసెంబర్‌ సినిమా క్యాలెండర్‌ ఒక్కసారిగా మారిపోయేలా కనిపిస్తోంది. వరుసగా మూడు క్రేజీ సినిమాలు వాయిదా పడుతున్నాయనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. రష్మిక మందన్న ‘మైసా’, నాగచైతన్య ‘వృషకర్మ’, నాగార్జున ‘కింగ్‌100’ సినిమాలు వాయిదా పడుతున్నట్లు సమాచారం. దీంతో నవంబర్‌ చివరి వారం నుంచి క్రిస్మస్‌ వరకు బాక్సాఫీస్‌ లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది. ముందుగా రష్మిక నటిస్తున్న ‘మైసా’ విషయానికి వస్తే.. ఈ సినిమాను నవంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదని సమాచారం. సెన్సార్‌ ప్రక్రియలో ఆలస్యం, ఫైనల్‌ కాపీ సిద్ధం కాకపోవడం.. వాయిదాకు కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డిసెంబర్‌ 4న విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా డిసెంబర్‌ 4 నుంచి వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాలని టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్‌ సీజన్‌లో కొత్త తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్‌ నడుస్తోంది. మరోవైపు అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వందో సినిమా ‘కింగ్‌100’ కూడా వాయిదా దిశగా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని డిసెంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కొన్ని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ పెండింగ్‌లో ఉండటంతో అనుకున్న తేదీకి రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.! ఈ సినిమాల షెడ్యూల్స్ మారడం వల్ల.. నందమూరి వర్సెస్ అక్కినేని బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. నాగార్జున ‘కింగ్‌100’తో పాటు బాలకృష్ణ ‘దాదా’ కూడా డిసెంబర్‌ 24ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు నాగార్జున సినిమా వాయిదా పడి, ఆ ప్లేస్ లో తనయుడు నాగచైతన్య సినిమా రానుందనే న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే 'బాలయ్య vs నాగ్' ఫైట్ కాస్తా.. 'బాలయ్య vs చైతు'గా మారనుంది.  మీకు నచ్చవచ్చు:  వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.? త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.?       [Mysaa, Vrushakarma, King 100, Dada, Tollywood]  
నిర్మాత.. తెలుగు సినిమాకి పెద్ద దిక్కు.. దిక్సూచి.. అంతరాత్మని దాటి  ఈ మాట తప్పని అనే సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే సినిమా మీద ప్రేమతో, అభిమానంతో కొన్ని కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడిగా పెడతాడు. లాభం వచ్చు గాక. అది వేరే విషయం. ముందు నిర్మాత అనే వ్యక్తి ఉంటేనే ఎవరి ఆటలైనా సాగేది. ఇప్పుడు ఆ నిర్మాత తీవ్ర మనోవేదన పడుతున్నాడు.  సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన GOAT సినిమా నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి తన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను, సుమారు 14 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో భావోద్వేగంతో పంచుకున్నారు. సినిమాని ప్రేమతో, కష్టపడి నిర్మించాలనుకున్న నిర్మాతకు ఎదురైన ఈ 14 కోట్ల కష్టాలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   సినిమా నిర్మాణం అంటే కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు, ప్రతి రోజు ఒక పరీక్షలా సాగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటర్వ్యూలో సినిమా ప్రయాణంలో తను నమ్మిన వ్యక్తుల వల్ల ఎదురైన సమస్యలను వివరంగా వెల్లడించారు. బడ్జెట్ అంచనాలు తారుమారైన తీరు, అనుకోని ఖర్చులు పెరిగిన విధానం, ఆర్థిక వివాదాల వల్ల తనపై పడిన భారం గురించి ఆయన మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా 14 కోట్ల రూపాయల స్థాయిలో నష్టం వాటిల్లడం ఏ నిర్మాతకైనా పెద్ద దెబ్బేనని, ఆ సమయంలో తనకు ఎదురైన మానసిక ఒత్తిడిని ఆయన గుర్తు చేసుకున్నారు.    GOAT సినిమా ప్రమోషన్స్, షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న వివాదాలు కూడా అప్పట్లో వార్తల్లో నిలిచాయి. అదనంగా మరో 1 కోటి రూపాయలు అడిగిన సందర్భాలు, సొంత టీమ్‌తో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు నిర్మాతకు పెద్ద సవాల్‌గా నిలిచాయి. అయినప్పటికీ పట్టుదల వదలకుండా సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమించారు.  ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ విశ్వరూపం.. మళ్లీ అలాంటి స్టెప్పుల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్! సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 12 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత కూడా నిర్మాత తన అనుభవాలను దాచుకోకుండా సీనియర్ జర్నలిస్ట్ వేణు బిక్కి నిర్వహించిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను స్పష్టంగా చెప్పారు. టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే నిర్మాతలు, పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కోణంలో కూడా ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   నమ్మించి మోసం చేసిన వారి గురించి, ఆర్థిక లావాదేవీల్లో ఎదురైన చిక్కుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.ఎన్నో అడ్డంకులు, 14 కోట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే, సినిమా పట్ల తనకున్న నిబద్ధతని  చంద్రశేఖర్ రెడ్డి మరోసారి చాటుకున్నారు. తెలుగు సినిమా రంగంలో తెరవెనుక కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టినట్లయింది. ఒక నిర్మాత పడిన ఆవేదన, ఆర్థిక పోరాటం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకు మరింత స్పష్టతను ఇచ్చాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే GOAT మూవీ ఇంకో ముప్పై నిమిషాల్లో సినిమా అయిపోతుంది అనేదాకా కూడా సినిమా చాలా బాగుంటుంది. కానీ చివరలో కథకి అన్యాయం జరిగిందని మనకి ఈజీగా తెలిసిపోతుంది. కథ యొక్క కాన్సెప్ట్ కూడా సూపర్.   మీకు నచ్చవచ్చు:స్టార్ హీరోతో క్రికెట్ దేవుడు సచిన్ కూతురి పెళ్లి! మీకు నచ్చవచ్చు:ఆ నలుగురు హీరోలు ఎవరు? స్టార్ హీరో కట్ అవుట్ ఉద్దేశ్యం ఏంటి!      [GOAT, CHANDRA SEKHAR REDDY, sudigali sudheer, DIVYA BHARATHI, Tollywood]
హాలీవుడ్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా హీరో ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకొని, ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకునే కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. అలాంటి కథతో వచ్చిన చిత్రమే ‘రన్నర్‌’. అలాన్‌ రిచ్‌సన్‌, ఓవెన్‌ విల్సన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు స్కాట్‌ వా దర్శకత్వం వహించారు. ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా వైద్య అవయవాన్ని ఆసుపత్రికి చేర్చాల్సిన పరిస్థితి.. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు, ముఠాల వెంటాడటం.. ఇలా కథ మొత్తం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో హాంక్‌ మలోన్‌ అనే మాజీ సైనికుడు, ప్రస్తుతం కొరియర్‌ పని చేస్తుంటాడు. ఒక కీలకమైన వైద్య అవయవాన్ని పిల్లల ఆసుపత్రికి చేర్చే బాధ్యత అతడికి అప్పగిస్తారు. అయితే ఈ అవయవం కోసం ఒక క్రిమినల్‌ ముఠా కూడా ప్రయత్నిస్తుంటుంది. దీంతో హాంక్‌ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం అంత సులభం కాదు. అతడికి తోడుగా బెన్‌ బిషప్‌ అనే మరో వ్యక్తి ఉంటాడు. వీరిద్దరూ కలిసి ముఠా నుంచి తప్పించుకుంటూ, సమయానికి ఆసుపత్రికి చేరుకోవడానికి చేసే ప్రయత్నమే సినిమా ప్రధాన కథాంశం. ప్రతి నిమిషం ప్రమాదం ఎదురయ్యే పరిస్థితుల్లో కథ ముందుకు సాగుతుంది. ఇది కూడా చదవండి: మహేష్‌బాబు, అనిల్ రావిపూడి కాంబో రిపీట్.. అసలు ట్విస్ట్ ఏంటంటే? దర్శకుడు స్కాట్‌ వా యాక్షన్‌ సన్నివేశాలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కార్‌ ఛేజింగ్‌లు, రోడ్డుపై జరిగే ప్రమాదకరమైన స్టంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాన్‌ రిచ్‌సన్‌ తన శారీరక దృఢత్వంతో హాంక్‌ పాత్రకు బలం చేకూర్చారు. ఓవెన్‌ విల్సన్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాలో వినోదాన్ని అందించారు. ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు, చిన్న చిన్న వాదనలు కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయిస్తాయి. యాక్షన్‌తో పాటు కామెడీని కూడా జోడించడం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌. అయితే కథలో కొత్తదనం కొంత తక్కువగా అనిపిస్తుంది. ఒక ప్రమాదకరమైన డెలివరీ, దాని కోసం హీరోను వెంటాడే విలన్లు, మధ్యలో ఎదురయ్యే అడ్డంకులు.. ఇలాంటి కథలు గతంలోనూ చాలా వచ్చాయి. కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించగలిగేలా ఉంటాయి. అలాగే యాక్షన్‌, కామెడీ, భావోద్వేగాలను ఒకే సినిమాలో కలిపే ప్రయత్నంలో కొన్ని చోట్ల టోన్‌ మారినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రధాన నటుల కెమిస్ట్రీ, వేగంగా సాగే ఛేజ్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్‌ చేస్తాయి. మొత్తంగా ‘రన్నర్‌’ కొత్త కథతో ఆశ్చర్యపరిచే సినిమా కాకపోయినా.. యాక్షన్‌ సన్నివేశాలు, అలాన్‌ రిచ్‌సన్‌–ఓవెన్‌ విల్సన్‌ కాంబినేషన్‌ కోసం చూడదగ్గ చిత్రం. రెగ్యులర్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి చూడదగ్గ వినోదాన్ని అందిస్తుంది. అయితే కథలో కొత్తదనం, బలమైన భావోద్వేగాలు ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఇది సాధారణ యాక్షన్‌ మూవీగానే అనిపించవచ్చు. మీకు నచ్చవచ్చు: ఈ నగరానికి ఏమైంది2 బాక్సాఫీస్ రచ్చ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? ప్రశాంత్‌వర్మకు బిగ్ షాక్: మరో ‘హనుమాన్2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్.. హీరో ఎవరంటే.?       [RunnerMovieReview, Telugu, HollywoodMovie, AlanRitchson, OwenWilson]
విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘డివికి డివికి’ మంచి ఫెస్టివ్‌ వైబ్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కీర్తి సురేష్‌, కృతి శెట్టి కలిసి తెరపై కనిపించడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ అందించిన సంగీతం, ఇద్దరు హీరోయిన్ల డ్యాన్స్‌ ఈ పాటకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. ఈ పాటలో కీర్తి సురేష్‌, కృతి శెట్టి సంప్రదాయ లంగా ఓణీల్లో కనిపించారు. ఇద్దరూ పోటాపోటీగా వేసిన స్టెప్పులు పాటకు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. సాధారణంగా కమర్షియల్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కలిసి కనిపించే పాటలకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ ఇద్దరి స్క్రీన్‌ ప్రెజెన్స్‌, డ్యాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్లామర్‌ కంటే సంప్రదాయ దుస్తులు, పండగ వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా బాగుంది. ‘డివికి డివికి’ పాటలో మరో ఆసక్తికరమైన విషయం బావ బామ్మర్దుల కుటుంబ నేపథ్యానికి తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్ల మధ్య బంధాన్ని చూపించడం. వదిన మరదళ్ల మధ్య అనుబంధం, స్నేహం నేపథ్యంలో ఎంతో సరదాగా ఈ పాట సాగింది. అందుకే దీన్ని కేవలం డ్యాన్స్‌ నంబర్‌గా కాకుండా సినిమాలోని కుటుంబ వాతావరణాన్ని పరిచయం చేసే పాటగా కూడా చూడొచ్చు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జి.వి. ప్రకాష్‌ కుమార్‌ తొలి పాటతోనే తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశారు. ఫుట్‌ ట్యాపింగ్‌ బీట్‌, క్యాచీ హుక్‌ లైన్‌ పాటకు మంచి ఎనర్జీని ఇచ్చాయి. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, మధుప్రియ, హరిప్రియ గాత్రం అందించారు. ముఖ్యంగా ఇద్దరు గాయనుల గొంతులు పాటలోని ఉత్సాహభరితమైన వాతావరణానికి సరిపోయాయి. ఇది కూడా చదవండి: మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబో రిపీట్‌.. అసలు ట్విస్ట్ ఏంటంటే.?  ఈ సాంగ్ లో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ కూడా కనిపిస్తూ వేడుకలో భాగమయ్యారు. అయితే ప్రధానంగా కీర్తి, కృతి డ్యాన్స్‌ చుట్టూనే పాట సాగుతుంది. సినిమాలో వీరిద్దరి పాత్రలు, బావ బామ్మర్దుల మధ్య ఉండే కామెడీ, కుటుంబ అనుబంధాలు ఎలా ఉంటాయనే దానిపై ఈ పాట కొంత క్లారిటీ ఇస్తోంది. సంక్రాంతి సినిమాకు అవసరమైన రంగుల హంగులు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే వాతావరణం ఇందులో కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘డివికి డివికి’ పాట ‘జనవరి 12 విడుదల’ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కీర్తి సురేష్‌, కృతి శెట్టి కలిసి కనిపించడం, జి.వి. ప్రకాష్‌ క్యాచీ మ్యూజిక్‌, అనిల్‌ రావిపూడి ఫెస్టివ్‌ టచ్‌ పాటకు ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. మరి సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఈ పాట ప్రేక్షకులతో ఎంతలా స్టెప్పులు వేయిస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! ప్రశాంత్‌ వర్మకు బిగ్ షాక్.. మరో ‘హనుమాన్‌ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్.!       [Diviki Diviki Song, January 12 Vidudala, Keerthy Suresh, Krithi Shetty, GV Prakash Kumar]  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కాలు కదిపి డాన్స్ చేస్తే రబ్బరు కూడా అంత గబాగబా వంగదు కదా అనే విధంగా డాన్స్ చేస్తాడు. ఎంతటి  కష్టమైన స్టెప్పునైనా అత్యంత సునాయాసంగా, గ్రేస్‌తో వేయడం ప్రత్యేకత. అందుకే అభిమానులు కింగ్ ఆఫ్ డాన్స్ అంటారు. డాన్స్ చెయ్యడమే కాదు స్టెప్స్ ని స్టైల్ గా ప్రదర్శించడంలో కూడా ఎన్టీఆర్ సిద్ధహస్తుడు.  ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన డ్యాన్స్ నంబర్లు ఉన్నప్పటికీ, 2015లో పూరి జగన్నాధ్ తో చేసిన 'టెంపర్' లోని టైటిల్ సాంగ్ 'నీ తాత టెంపర్.. నీ అయ్య టెంపర్' మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. అనూప్ రూబెన్స్ అందించిన మాస్ బీట్‌కు, భాస్కరభట్ల రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ తోడవడంతో ఈ పాట బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్ వేసిన అదిరిపోయే స్టెప్పులు, ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు స్టైలిష్ లుక్ థియేటర్లలో అభిమానులని పూనకాలతో ఊగిపోయేలా చేశాయి. రిలీజ్ రోజు గుంటూరులోని చాలా థియేటర్స్ లో అయితే రెండో సారి ప్లే చేసే దాకా ఫ్యాన్స్ ఊరుకోలేదు.నందమూరి వంశం పౌరుషాన్ని, యాటిట్యూడ్‌ని ప్రతిబింబించేలా సాగే ఈ 4 నిమిషాల 6 సెకన్ల పాటలో ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త హెయిర్ స్టైల్‌తో కాజల్ అగర్వాల్‌తో కలిసి  చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ అభిమానులకి ఫేవరెట్. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ మరియు స్టైల్ ఉన్న పాటగా 'టెంపర్' టైటిల్ సాంగ్ నిలిచిపోయింది.   యూట్యూబ్‌లో ఈ ఫుల్ వీడియో సాంగ్‌కు ఇప్పటివరకు 38 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఈ పాట క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.  పాట మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ వేసే ప్రతి ఫుట్‌వర్క్, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, క్లాస్ ప్రేక్షకులు కూడా ఈ పాటలోని ఎన్టీఆర్ గ్రేస్‌కు ఫిదా అయిపోయారు. ఇది కూడా చదవండి: పీపీ డుమ్ డుమ్: ఆ స్టార్ హీరోతో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి! ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ చూసి కానీ నిద్రలోకి జారుకోరు. ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలేజీ ఈవెంట్స్ అయినా, డ్యాన్స్ రియాలిటీ షోలు అయినా 'నీ తాత టెంపర్' పాటకు డ్యాన్స్ చేయాల్సిందే అన్నంతగా  పాపులర్ అయింది.  అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారారు. ఆయా సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఉండటంతో, 'టెంపర్' రేంజ్‌లో పూర్తిస్థాయి మాస్, స్టైలిష్ డ్యాన్స్ నంబర్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. దీనితో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ కోరికను బయటపెడుతున్నారు. ఎన్టీఆర్ మళ్లీ 'నీ తాత టెంపర్' పాటలో మాదిరిగా హై-వోల్టేజ్ ఎనర్జీతో, స్టైలిష్ స్టెప్పులతో థియేటర్లని  షేక్ చేసే సాంగ్ చేయాలని వారు ఆశిస్తున్నారు. రాబోయే సినిమాల్లో ఎన్టీఆర్ నుంచి అలాంటి వింటేజ్ మాస్ డ్యాన్స్ ట్రీట్ రావాలని కోరుకుందాం.   మీకు నచ్చవచ్చు :ఆ నలుగురు తెలుగు స్టార్స్ పై సల్మాన్ వ్యాఖ్యలు వైరల్! మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార హీరోయిన్  అసలు కథ ఇదే!   [Ntr, Temper, kazal, Tollywood]
సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ఈ హిట్‌ జోడీ మళ్లీ కలిసి పనిచేయబోతోందనే సమాచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ కలుస్తున్నది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసమట. 2020 సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు ఎనర్జీ, అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అప్పటినుంచి ఈ జోడీ రీయూనియన్‌పై అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది చిన్న సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. అయితే యాడ్‌ షూట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు.  ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! మరోవైపు అనిల్‌ రావిపూడి.. వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. మొత్తానికి మహేష్–అనిల్‌ కాంబినేషన్‌ మరోసారి కలుస్తున్నప్పటికీ అది వెండితెరపై కొత్త సినిమా కోసం కాదు. యాడ్‌ షూట్‌ వరకే పరిమితమవుతుందనే సమాచారం వినిపిస్తోంది. మరి ఈ హిట్‌ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుంది? అభిమానుల ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుంది? అనేది చూడాలి. మీకు నచ్చవచ్చు:  వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.? ‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్‌ రచ్చ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే.?       [Mahesh Anil Combo, Mahesh Babu, Anil Ravipudi, Sarileru Neekevvaru, Varanasi]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సాధారణంగా ఇంట్లో పొట్లకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ అదే పొట్లకాయకు పచ్చిశనగపప్పు తోడైతే ఆ రుచి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర వండితే మాంసం కూరలను కూడా మర్చిపోవాల్సిందేనన్నంత అద్భుతమైన రుచి సొంతమవుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, లేదా రోటి దేనిలోకి తిన్నా ఈ కూర అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కూర కావాలనిపించేలా చేసే ఈ వంటకం మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సులభంగా సిద్ధమవుతుంది. కేవలం 5 దశల్లో ఈ వంట విధానాన్ని పూర్తి చేయవచ్చు. ఈ కూర రుచికి అసలు పునాది పచ్చిశనగపప్పును సరిగ్గా ఉడికించడంలోనే ఉంది. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని, తగినన్ని నీళ్లు మరియు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పప్పును మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా ఒక మాదిరిగా గింజ చెదరకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యస్థంగా ఉడికిన పప్పు పొట్లకాయ ముక్కలతో కలిసినప్పుడు కూరకు ప్రత్యేకమైన పోకడ, రుచి వస్తాయి. తాలింపు వేసే విధానం కూర ఘుమఘుమలకు ప్రాణం పోస్తుంది. పాన్‌లో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మరియు శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేపుకుంటే కూరకు సహజమైన తీపి, కమ్మదనం చేరుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జులా మగ్గాక, అందులో నాలుగు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు కారం వేసి బాగా కలపాలి. మసాలాలు, ఉప్పు, కారం పొట్లకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలిపితే ప్రతి ముక్కా రుచిగా మారుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పును ఇందులో కలపాలి. పప్పు వేసిన తర్వాత కూరను మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. ఆ 4 నిమిషాల సమయం పప్పు, కూర కలిసిపోవడానికి ఎంతో కీలకం. చివరగా తాజా కొత్తిమీర చల్లి దింపేస్తే ఘుమఘుమలాడే పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర సిద్ధం. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలోనే ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ కూరను తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్ర రుచుల ఇష్టపడేవారికి ఇది ఖచ్చితంగా ఫేవరెట్ డిష్‌గా నిలిచిపోతుంది. మీకు నచ్చవచ్చు:ఆముదం ఆకుల, రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు! ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!                                    రోజ్ వాటర్ తో, మీ చర్మం మెరిసిపోవాలంటే, ఇలా ట్రై చేయండి!       Potlakaya Senagapappu Kura, Snake Gourd Chana Dal Curry, Andhra Veg Curries, Traditional Telugu Recipes, Vegetarian Meat Alternative, Healthy Lunch Curry, Cooking Recipes In Telugu.  
చలికాలం రాగానే వాతావరణంలో చలిగాలులు పెరిగి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ జలుబు, దగ్గు, కఫం సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే సాధారణ దగ్గు కూడా కొన్నిసార్లు త్వరగా తగ్గకుండా రోజుల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా గొంతు గరగర, ముక్కు కారడం, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మందులపైనే కాకుండా మన ఇంట్లో సులభంగా దొరికే సహజ పదార్థాలతో కూడిన సాంప్రదాయ ఇంటి చిట్కాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఇంటి వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి; అవి పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను అదుపులోకి తీసుకురావడానికి మన వంటగదిలో ఉండే పదార్థాలే చక్కగా పనిచేస్తాయి. కఫంతో కూడిన దగ్గుతో బాధపడేవారికి తమలపాకు, తేనె కలయిక ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఒక తాజా తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేసి, ఆకుపై ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకుని నెమ్మదిగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా వరుసగా 2 రోజుల పాటు చేస్తే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కరక్కాయ మరియు లవంగాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. కరక్కాయను చిన్నగా దంచి, అందులో ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల గొంతులోని చికాకు తగ్గుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తీసుకుంటే పొడి దగ్గు నుంచి మంచి ఊరట కలుగుతుంది. అలాగే పొడి దగ్గు ఉన్నప్పుడు 2 లవంగాలను పంటి కింద ఉంచుకుని నెమ్మదిగా నములుతూ రసం మింగడం కూడా గొంతుకు హాయిని ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ లేదా మంట అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. కఫం త్వరగా బయటకు రావడానికి తేనె, లవంగాల పొడి చిట్కా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో తాజాగా దంచి పెట్టుకున్న లవంగాల పొడిని కలిపి తీసుకుంటే కఫం కరిగి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాను వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు పాటిస్తే దగ్గు, జలుబు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే గొంతు నొప్పి, శ్వాసకోశ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సహజ పద్ధతులు సులభంగా ఆచరించదగినవిగా ఉంటాయి. ఇది కూడా చదవండి:ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర! చిన్నపిల్లల విషయంలో దగ్గు, జలుబు కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా సహజ నివారణలను ఎంచుకోవాలి. ఒక స్పూన్ తులసి ఆకు రసంలో 2 నుంచి 3 చుక్కల తేనె కలిపి ఉదయాన్నే పిల్లలకు తాగిస్తే జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది లోపు శిశువులకు తేనె ఇవ్వకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం. మొత్తంగా చూస్తే, చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు సమస్యలను ఎదుర్కోవడానికి తమలపాకు, తేనె, లవంగాలు, కరక్కాయ, తులసి మరియు గోరువెచ్చని ఉప్పు నీరు వంటి సాంప్రదాయ ఇంటి చిట్కాలు మన పెద్దలు అందించిన విలువైన ఆయుర్వేద జ్ఞానం. సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా సహజంగానే ఉపశమనం పొందవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ చలికాలంలో దగ్గు, జలుబు బారి నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మీకు నచ్చవచ్చు:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి!                               ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!         Betel Leaf For Cough And Cold, Tamalapaku Home Remedies, Winter Cold Remedies, Elders Health Tips, Natural Cough Relief, Traditional Home Remedies, Health Tips In Telugu.
చలికాలం రాగానే భుజాలపై తెల్లని పొట్టు రాలడం, తలలో తీవ్రమైన దురద, పదేపదే గోకాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఉష్ణోగ్రతలు పడిపోగానే చుండ్రు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా మరింత తీవ్రంగా మారడం మనం తరచూ చూస్తుంటాం. చలి గాలి వల్ల తల చర్మం పొడిబారిపోతోంది కాబోలు అని చాలా మంది సులభంగా ఊహించేసుకుంటారు. కానీ తలలో పొట్టు రాలడానికి ప్రతిసారీ ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధారణ చుండ్రులా కనిపించేది నిజానికి సెబోర్రెయిక్ డెర్మటైటిస్ (Seborrhoeic Dermatitis) అనే వాపు సంబంధిత చర్మ సమస్య కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు సమస్యలకు చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరాల ప్రకారం, తల చర్మంలో తేమ స్థాయి బాగా తగ్గిపోయినప్పుడు సాధారణంగా డ్రై స్కాల్ప్ లేదా పొడి తల చర్మం ఏర్పడుతుంది. చల్లని వాతావరణం, గాలిలో తక్కువ తేమ, ఘాటైన షాంపూలతో తరచూ తలస్నానం చేయడం, ఎక్కువసేపు వేడి నీటిని వాడటం వంటివి ఈ పొడిబారడానికి దారితీస్తాయి. ఇలాంటప్పుడు వచ్చే పొట్టు చాలా చిన్నదిగా, తెల్లగా, పౌడర్‌లా ఉంటుంది మరియు తల చర్మం బిగుతుగా లేదా స్వల్ప దురదతో అనిపిస్తుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారికి శరీరంలోని ఇతర భాగాల చర్మంపై కూడా పొడిబారడం కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ చుండ్రు అనేది చర్మంపై సహజంగా ఉండే మలాసెజియా (Malassezia) అనే ఈస్ట్ అధికంగా పెరగడం లేదా దాని పనితీరు మారడంతో ముడిపడి ఉంటుంది. ఈ ఈస్ట్ చర్మంలోని నూనెలో ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. కొందరిలో ఈ ఈస్ట్, చర్మపు నూనెలు మరియు శరీరంలోని వాపు ప్రతిస్పందన కలిసినప్పుడు చర్మ కణాలు వేగంగా రాలిపోయి స్పష్టమైన పొట్టు, దురద ఏర్పడతాయి. ఈ సమస్య మరింత వాపుతో, దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌గా నిర్ధారిస్తారు. సాధారణ పొడి తల చర్మానికి భిన్నంగా, సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌లో ఎరుపు రంగు, చికాకు మరియు కొంచెం జిడ్డుగా ఉండే తెలుపు లేదా లేత పసుపు రంగు పొట్టు కనిపించవచ్చు. ఇది తల చర్మం దాటి కనుబొమలు, ముక్కు పక్క భాగాలు, చెవుల వెనుక మరియు కొన్నిసార్లు ఛాతీపై కూడా ప్రభావం చూపవచ్చు. చలికాలంలో తక్కువ తేమ మరియు చల్లని ఉష్ణోగ్రతలు పొడిబారడాన్ని పెంచుతాయి, అలాగే హెయిర్ కేర్ అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, అనారోగ్యం మరియు హార్మోన్ల ప్రభావాలు సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇది కూడా చదవండి:వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు! చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి ప్రతి రకమైన పొట్టుకు మందపాటి హెయిర్ ఆయిల్స్ రాయడం. నూనె రాయడం వల్ల పొడి జుట్టు కొంత మృదువుగా అనిపించవచ్చు కానీ, సెబోర్రెయిక్ డెర్మటైటిస్ ఉన్న తల చర్మంపై ఎక్కువ నూనె నేరుగా రాస్తే కొందరిలో లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ పాసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమస్యకు తల చర్మంలోని నూనె మరియు మలాసెజియా ఈస్ట్‌తో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల పొట్టు స్వభావాన్ని, దురద తీవ్రతను మరియు వాపు లక్షణాలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ డ్రై స్కాల్ప్ కోసం మైల్డ్ షాంపూ వాడటం, మరీ వేడి నీటిని నివారించడం, ఘాటైన ఉత్పత్తులను తగ్గించడం మరియు తల చర్మ అవసరానికి తగ్గట్టుగా తలస్నానాల వ్యవధిని సర్దుబాటు చేయడం మేలు చేస్తుంది. చుండ్రు మరియు సెబోర్రెయిక్ డెర్మటైటిస్ కోసం కెటోకొనజోల్ (Ketoconazole), సెలీనియం సల్ఫైడ్ (Selenium Sulphide) లేదా జింక్ పైరిథియోన్ (Zinc Pyrithione) వంటి యాంటీ ఫంగల్ మరియు మెడికేటెడ్ షాంపూలను సూచించవచ్చు. వీటిని తలకు పట్టించిన వెంటనే కడిగేయకుండా నిర్దేశించిన సమయం పాటు ఉంచి కడగాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దురద భరించలేనంతగా ఉన్నా తలను పదేపదే గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది, అలాగే తీవ్రమైన ఎరుపు, వాపు, మందపాటి ప్యాచెస్, నొప్పి లేదా జుట్టు రాలడం గమనిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. మీకు నచ్చవచ్చు:మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!                                   ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!       Winter Dandruff, Hair Oil And Dandruff, Winter Hair Care Mistakes, Scalp Flakes Treatment, Dermatologist Hair Advice, Dandruff Tips In Winter, Health Tips In Telugu.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
బూడిద గుమ్మడి మనకు సులభంగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమైనది? బూడిద గుమ్మడి రసం కిడ్నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తీసుకోవచ్చా? బూడిద గుమ్మడిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? అంతేకాకుండా ఎసిడిటీ సమస్య, శరీర బరువు నియంత్రణ విషయంలో బూడిద గుమ్మడి ఎలాంటి ప్రయోజనాలను అందించగలదు? బూడిద గుమ్మడి, సాధారణ గుమ్మడి కాయ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? వాటిలో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ వీడియోలో వివరించారు. బూడిద గుమ్మడి రసాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా బూడిద గుమ్మడిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. బూడిద గుమ్మడి రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని లేదా వాటిని నివారిస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలి. వైద్యులు సూచించిన చికిత్సను ఆపి, దానికి బదులుగా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.