Home

»

Latest News

రాకాకి ఓం మూవీ గండం: ఇదేం లాజిక్ అనుకోవద్దు: మ్యాటర్ మొత్తం ఫ్యాన్స్ కి తెలుసు!

Nov 21, 2026 2:18PM

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'రాకా'కి సరికొత్త తలనొప్పులు. పైగా ఆ తలనొప్పులు సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న చర్చల వల్ల. అది కూడా నిన్న రీసెంట్ గా విడుదలైన 'ఓం 'మూవీ వల్ల. అదేం లాజిక్ అనుకుంటున్నారా! మరి అక్కడే ఉంది అసలైన గమ్మత్తు. విషయం తెలిసాక మీరు కూడా మీ మెదళ్ళని మరింత షార్ప్ తో ఉంచుతు సోషల్ మీడియా చర్చల్లో పాల్గొంటారు. 

రాకాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్. అందుకే మ్యూజిక్ కి సంబంధించిన కొత్త టెన్షన్ మొదలైంది.  ధనుష్  'ఓం' కి కూడా సాయి అభ్యంకర్ నే మ్యూజిక్ అందించాడు.బ్యాక్  గ్రౌండ్ స్కోర్‌పై సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బీజీఎం సినిమా ఫ్లోకి  ఆటంకంగా మారిందనే విమర్శలు  వినిపిస్తున్నాయి. సినిమా కథనం సాఫీగా సాగుతున్న సమయంలో సంగీతం కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించడంతో, దాని ప్రభావం ఇప్పుడు అల్లు అర్జున్ 'రాకా' మీద కూడా చర్చకు దారి తీసింది.

అయితే సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ మాటలను కేవలం ప్రేక్షకుల నుంచి వస్తున్న వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి. కేవలం ఒక సినిమా విషయంలో వచ్చిన స్పందనను బట్టి వేరే మూవీ సంగీత దర్శకుడి ప్రతిభని పూర్తిగా అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ స్వతంత్ర సంగీతంతోనూ, సినిమాల పాటలతోనూ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గాయకులు టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా సంగీత నేపథ్యం ఉన్నా, చిన్న వయసులోనే దాదాపు 1000 ట్యూన్‌ల బ్యాంక్ సిద్ధం చేసుకున్నానని  గతంలో చెప్పడం వార్తల్లో నిలిచింది.

 


అయినప్పటికీ, 'ఓం' సినిమా బీజీఎంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సాయి అభ్యంకర్ సంగీతంపై సోషల్ మీడియాలో వేడి చర్చ మొదలైంది. అల్లు అర్జున్ సినిమాలకు ఎప్పుడూ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో 'రాకా' కోసం సాయి అభ్యంకర్ ఎలాంటి సౌండ్‌తో వస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అంతర్జాతీయ గాయకులని  కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నట్లు గతంలో చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుత విమర్శల మధ్య తన ప్రతిభను మరో స్థాయిలో నిరూపించుకోవాల్సిన పెద్ద బాధ్యత ఆయనపై ఉందని సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: నమ్మించి అడ్డంగా 14 కోట్ల రూపాయలకి ముంచేశారు: GOAT నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన

మరోవైపు, 'రాకా' షూటింగ్ ఇంకా 40 శాతం మాత్రమే పూర్తయిందన్న వార్తలు కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం ఉన్నందున, 'ఓం'పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని 'రాకా' మ్యూజిక్ విషయంలో సాయి అభ్యంకర్, దర్శకుడు అట్లీ మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అల్లు అర్జున్ మాస్ ఎలివేషన్లకు తగ్గట్టుగా బీజీఎం, పాటలు కుదిరితే ఈ టెన్షన్ మొత్తం ఆనందంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే ప్రస్తుత సినీ రోజుల్లో సీన్స్ లో పస లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో ఉండాలి. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఎందుకు ఎగురుతున్నామో కూడా తెలియకుండా ఎగురుతుంటారు.

 

మీకు నచ్చవచ్చు: ఎన్టీఆర్ విశ్వరూపం
మీకు నచ్చవచ్చు: ఆ స్టార్ హీరోతో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి!

 

[Allu Arjun ,Raaka, Sai Abhyankkar, dhanush, om]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com