ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందుల జగన్ అడ్డాగా చెబుతారు. అక్కడ ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉందని అంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు ఒకింత భిన్నంగా ఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందులలో వైసీపీ అభ్యర్థి అవమానకరం అన్న రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడంతో జగన్ అడ్డాగా అప్పటి వరకూ అంతా భావించిన పులివెందులలో వైసీపీ గాలిపోయినట్లైంది. జగన్ కోట బీటలు వారిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  అటువంటి పులివెందులలో జగన్ ఇప్పుడు పర్యటిస్తున్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు. ఔను నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 25) నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేయడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , దేవాలయాలను మన సంస్కృతీ, సంప్రదాయాల ప్రతీకలుగా అభివర్ణించారు. అయితే గతంలో  ఎన్నడూ ఇలా ఆలయాల సందర్శన, పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు. పైపెచ్చు తన హయాంలో ఆలయాలపై జరిగిన దాడులపై కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు జగన్ తన పులివెందుల పర్యటనలో ప్రత్యేకంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చకు గైర్హాజర్ కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ తప్పు చేసినట్లుగా సర్వత్రా ఒక భావన అయితే వ్యక్తం అవుతోంది. జగన్ యాంటీ హిందూ అన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో  హిందూత్వ వ్యతిరేకి అనే ముద్రకు దూరం కావడానికి జగన్ ఇప్పుడు తన నియోజకవర్గ పరిధిలోని ఓ ఆలయాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్ఠ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అంటే వైసీపీ హయాంలో కూడా జగన్ ఇలా హిందూ వ్యతిరేక ముద్ర తొలగించుకునేందుకు  పీఠాధిపతుల వద్దకు వెళ్లిన సంగతి విదితమే. ఇప్పుడు కూడా అదే తరహాలో పులివెందులలో కూడా ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పోతే.. జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ ఓటమి తరువాత పులివెందులలో జగన్ హవా తగ్గిందన్న భావన వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహం మార్చి తన పర్యటనలో ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాయలసీమ కరవును నివారించడానికి, సాగు, తాగు నీరు అందించడానికీ చేస్తున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాలు ఇందుకు కారణమంటున్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనంలో పాగా వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివెందులలో వైసీపీ ఓటమి తరువాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంపశయ్యపై ఉన్నట్లుగా తయారైందనీ, జగన్ తన పర్యటనలు, ఆలయ సందర్శనతో ఈ పరిస్థితి మర్చగలుగుతారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.   నాలిక కోస్తా అనడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందన్న పేర్కొన్న సుప్రీం కోర్టు..   ఆ మాటలను పట్టుకుని అదే నిజమని నమ్మి సెక్యూరిటీ కోరడం తగదని సూచించింది. గతంలో మీ కుటుంబంలో  ఆరుగురి హత్య జరిగిందని ఇప్పుడు సెక్యూరిటీ కోరడం కూడా సరైనది కాదని పేర్కొంది.  ఇక గతంలోకన్నా ప్రస్తుతం పోలీసులకన్నా మిన్నగా ప్రైవేట్ సెక్యూరిటీ పని చేస్తోంది. కాబట్టి మీరు మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోమని సుప్రీం కోర్టు కాటసాని న్యాయవాదులకు సూచించింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి డబ్బు శక్తి ఉందని అనడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని అంటారాయన. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండవు. అయితే కాటసానిది ఫ్యాక్షన్ కుటుంబం. మే 27, 1979న జరిగిన ఒక దారుణమైన ఘటనలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తండ్రి, ఆయన ఆరుగురు దాయాదులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1986లో ఆయన సోదరుడు కూడా హత్యకు గురయ్యారు. వీటి ఆధారంగా ఇప్పుడు ముప్పు ఉందనడమేంట సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక వేళ మీకు ప్రాణహాని ఉంటే, లోకల్ పోలీసులకు తెలియక పోదు. వారు కూడా ఒక శాస్త్రీయమైన అంచనాకు వచ్చినపుడు ఆటోమేటిగ్గా మీకు భద్రత కల్పిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగానీ మీరు ప్రతిపక్ష నేత కాబట్టి  సెక్యూరీటీ కావాలంటే కుదరదని పేర్కొంటూ,  మీరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సెక్యూరిటీ ఉండేది. అది కూడా లేక పోవడంతోనే 2ప్లస్2 భద్రత తొలగించారు. ఇవాళ,రేపు ఏదో ఒక పార్టీల్లో చేరడం చాలా చాలా సులువు. అలాంటిది మేం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.. సెక్యూరిటీ కలిపించమని అందరూ వచ్చి అడిగితే.. ఉన్న పోలీసు వ్యవస్థ చాలదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. 
గత కొద్ది కాలంగో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతున్న సంగతి విదితమే.  దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని థృవీకరించింది. నిర్ధారించింది.  వాస్తవానికి ఇక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరు? అన్నది చట్టం చూసుకుంటుంది.  అయితే వైసీపీ మాత్రం కల్తీ  విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నది. అక్కడితో ఆగకుండా  తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది.  ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై మండలిలో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. అసెంబ్లీలో చేద్దామంటూ అందుకు మంగళవారం (ఫిబ్రవరి 24)ముహూర్తం నిర్ణయించింది.  ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఈ అంశాన్ని మంగళవారం (ఫిబ్రవరి 24) చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది.   వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. సభకు హాజరై కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అంది వచ్చిన ఒక అవకాశం. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయింది.   ఇక అసెంబ్లీలో మంగళవారం (ఫిబ్రవరి 14) జరిగిన  చర్చలో చంద్రబాబు ప్రసంగం.. హైలైట్ గా మారింది. మొత్తంగా కల్తీ నెయ్యి అంశంలో తాను చేసిన ఆరోపణలు, అందుకు ఆధారమైన ఎన్డీడిబీ రిపోర్టు, మొత్తంగా  2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సభ ముందుంచారు.  ఇక హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల డొల్ల తనాన్ని ఎండగట్టడమే కాకుండా.. భరతీ సిమోంట్స్ కోసం జగన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో కూడా కళ్లకు కట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు,  హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని విస్పష్టంగా చెప్పారు. అందుకు భిన్నంగా జగన్ హయాంలో  భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని  ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందన్న చంద్రబాబు,  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైసీపీయే  సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలోని సిట్ ను కోరిందని గుర్తు చేసిన చంద్రబాబు   ఆ సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందనీ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందనీ చెప్పారు. దీనిపైనే  ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై  ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏక సభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ  వైసీపీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించిదన్న ఆయన ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ,  తప్పులు చేయడం, విచారణను  అడ్డుకోవడాలని ప్రయత్నించడం వైసీపీకి అలవాటేనన్న ఆయన  ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వారికి శాపాలుగా మారాయనీ చంద్రబాబు చెప్పారు.  హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలను సభ సాక్షిగా చంద్రబాబు ఎండగట్టారు. ఆత్మరక్షణ కోసమే వైసీపీ హెరిటేజ్ ను ఇందులోకి లాగిందన్న ఆయన, ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని పేర్కొన్న చంద్రబాబు..   ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు కుండబద్దలు కొట్టారు.  అదే సమయంలో తమ ఆరోపణలకు ఆధారాలు చూపుతూ వాదనలు వినిపించాల్సిన వైసీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అటెండెన్స్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు వచ్చి వెళ్లిన జగన్  అండ్ కో.. అత్యంత కీలక విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం  సభకు డుమ్మా కొట్టి పలాయనం చిత్తగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలకులు సైతం సభకు వైసీపీ గైర్హాజర్.. కల్తీ నెయ్యి విషయంలో తప్పు ఒప్పుకున్నదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు.  మొత్తం మీద కల్తీ నెయ్యి విషయంలో  చర్చ నుంచి పలాయనం చిత్తగించడంతో వైసీపీ వాదనలు విశ్వసనీయత కోల్పోయాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
నందమూరి అభిమానులకు శుభవార్త! మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు! నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, ఏవో కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? డైరెక్టర్ ఎవరు? అంటూ అప్పటినుంచి చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడనుంది. (Nandamuri Mokshagna) క్లాసిక్ ఫిల్మ్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను బాలకృష్ణ తలపెట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే కథ రాసుకోవడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, కొంతకాలంగా మళ్ళీ ఎటువంటి చప్పుడు లేదు. అయితే త్వరలోనే సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Aditya 999) బాలకృష్ణ ఇచ్చిన స్టోరీ లైన్ ని తీసుకొని క్రిష్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఉగాది కానుకగా మార్చిలో అధికారికంగా ప్రకటించి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. కాగా, 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా, బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటిస్తుండటం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. Also Read: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!
    -ఎగిరే చిలకమ్మ గా పవన్ ఫ్యాన్స్ లో ప్రత్యేక గుర్తింపు  -నిన్న కార్ బుక్ చేసుకుంది  -ఆ తర్వాతనే అసలు విషయం తెలిసింది -ఆలా చెయ్యడం తప్పు కదా!  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో ఒక్క సినిమా చేసినా చాలు సదరు హీరోయిన్ ఛాయలు అంత త్వరగా  తెలుగు ప్రేక్షకుల ఆలోచనల నుంచి వెళ్లవు. మరి స్వయంగా పవన్ కళ్యాణ్ నే ఆ హీరోయిన్ ని ఉద్దేశించి 'ఎగిరే చిలకమ్మా నా ముద్దుల మొలకమ్మ' అని అంటూ పాడితే, ఇక ఆ హీరోయిన్ ని మరవడం కొంచం కష్టమే కదా! అలాంటి ఒక హీరోయిన్ మీరాచోప్రా.. బంగారం(Bangaram)సినిమాలో పవన్ తో  కలిసి చేసింది. నిన్న ఉదయం మీరాచోప్రా(Meerra Chopra)బయటకి వెళ్ళడానికి ఉబర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆరు గంటల పాటు తనతో ఉండాలనేది డీల్. కాసేపటికి కారు వచ్చింది. కానీ కారు నిండా దుమ్ము.డ్రైవర్ కూడా  డర్టీ గా ఉన్నాడు.కారు ఎందుకు  దుమ్ముగా ఉందని అడిగితే  స మాధానం లేదు. కారు నడుతూనే నిద్రపోతున్నాడు. దాంతో ఆమె ఇరవై నిమిషాల్లోనే కారు దిగి వేరే క్యాబ్ బుక్ చేసుకుంది. కానీ ఆరు గంటల సమయానికి ఛార్జి వసూలు చేసాడు. జరిగిన ఈ విషయం మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా మీరా చోప్రా నే వెల్లడి చేసింది. కస్టమర్స్ భద్రతని గాలికొదిలేసి డబ్బు సంపాదించడం మాత్రమే వారి పని అని తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది.  Also read :Varanasi:వారణాసి కోసం ఎదురుచూస్తున్నారా! ఐతే ది బ్లఫ్ మూవీ చూడండి మీరాచోప్రా బంగారం తో పాటు వాన, గ్రీకు వీరుడు వంటి చిత్రాల్లో  చేసింది.బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లోను చేసింది.  కానీ స్టార్ డమ్ విషయంలో పెద్దగా క్లిక్ అవ్వలేదు.         
హీరోగా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్ 'ప్రేమ కావాలి'తో డ్రీమ్ డెబ్యూ దర్శకుడు విజయ భాస్కర్ కీ స్పెషల్ మూవీ ఒక మంచి హిట్ ఫిల్మ్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చాలామంది కలలు కంటుంటారు. అలాంటి డ్రీమ్ డెబ్యూ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ కి లభించింది. అదే 'ప్రేమ కావాలి'. ఈ సినిమా విడుదలై నేటితో 15 వసంతాలు పూర్తయింది. (Prema Kavali) ఆది, ఇషా చావ్లా జంటగా ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన చిత్రం 'ప్రేమ కావాలి'. ఆదితో పాటు ఇషా చావ్లాకు కూడా ఇది తొలి చిత్రం కావడం విశేషం. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్.. 2011 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రేమ కథకు టెర్రరిస్ట్ నేపథ్యాన్ని జోడిస్తూ 'ప్రేమ కావాలి' సినిమాని మలిచిన తీరు ఆకట్టుకుంది. లవ్ సీన్స్, కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పలు సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.14 కోట్ల షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. 'ప్రేమ కావాలి' విజయంలో అనూప్ రూబెన్స్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. 'చిరునవ్వే విసిరావే', 'మనసంతా ముక్కలు చేసి', 'నువ్వే నువ్వే' వంటి పాటలు ఆ సమయంలో మారుమోగిపోయాయి. తొలి సినిమా అయినా తనదైన నటన, డ్యాన్స్ లతో ఆది మెప్పించాడు. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులు అందుకున్నాడు.  దర్శకుడు విజయ భాస్కర్ కి కూడా ఇది స్పెషల్ ఫిల్మ్. దర్శకుడిగా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విజయ భాస్కర్.. ఏడేళ్ళ తరువాత అందుకున్న విజయమిది. Also Read: చికిరి vs ఆయా షేర్.. ప్యారడైజ్ సౌండ్ మామూలుగా లేదు!
    -పాన్ వరల్డ్ అభిమానుల మనస్సులో వారణాసి  -శరవేగంగా చిత్రీకరణ  -ఓటిటి లోకి వచ్చేసిన ది బ్లఫ్  ఎందుకు చూడాలి  మహేష్(Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi)గురించి తెలుసుకుంటూ ఉండటం ఇప్పుడు పాన్ వరల్డ్ సినీ అభిమానుల నిత్యదిన చర్యలలో భాగమైంది. అంతలా వారణాసి తో కనెక్ట్ అవుతు వస్తున్నారు. దీంతో సినిమాకి ఉన్న శక్తి ఏ పాటిదో తెలియచేసిన కీర్తిని కూడా వారణాసి పొందుతుంది. అంతే కాకుండా మందాకినీ వల్ల ఏ రోజుకైనా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తీ సినిమాకి మాత్రమే ఉందనే మాట కూడా నిజమవుతుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. ది బ్లఫ్(The Bluf).. ప్రియాంక చోప్రా(Priyanka chopra)హాలీవుడ్ లో చేసిన మూవీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా  'యెర్సెల్ బోర్డెన్' అనే క్యారక్టర్ లో ప్రియాంక చోప్రా చేసింది. తనదే మెయిన్ క్యారక్టర్ కూడా. యాక్షన్ సన్నివేశాలలో అయితే ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శించింది. ది బాయ్స్ మూవీ ఫేమ్ 'కార్ల్ అర్బన్(Karl Urban)మేల్ లీడ్ కాగా  ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్(Frank E Flowers)దర్శకుడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime)వీడియోలో ఈ రోజు  మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండనుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తో పాటు  తెలుగు డబ్బింగ్ సహా మొత్తం 19 భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ. Also read: Poona Kaur:  కాపు వారసత్వాన్ని క్రైస్తవ మతంలోకి మార్చారు దీంతో వారణాసి హోదాలో 'ది బ్లఫ్' ని చూసే సౌత్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. హాలీవుడ్ తో పాటు  హిందీ లో అయితే చెప్పక్కర్లేదు.ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోనే ఉంటారు. మరి ఈ లెక్కన వారణాసి కి హాలీవుడ్,బాలీవుడ్  లో ఎంత ఉపయోగం ఉంటుందో వివరంగా చెప్పక్కర్లేదనుకుంట అనే కామెంట్స్ నెట్టింట వినపడుతున్నాయి.      
'చికిరి' బాటలో 'ఆయా షేర్' సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'ప్యారడైజ్' సాంగ్ ఆడియన్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ ఫిదా సినిమా ప్రమోషన్స్ లో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆడియో పరంగా, విజువల్ పరంగా సాంగ్ హిట్ అయిందంటే.. సినిమాకి బోలెడంత మైలేజ్ వస్తుంది. ఇటీవల 'పెద్ది'(Peddi) విషయంలో అది జరిగింది. తాజాగా ఆ లిస్టులో 'ది ప్యారడైజ్'(The Paradise) చేరింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'పెద్ది' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'చికిరి చికిరి' విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆడియో పరంగా హిట్ అవ్వడమే కాకుండా, అందులో హుక్ స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్డేట్స్ వచ్చినా రాకపోయినా కొద్దినెలలుగా సోషల్ మీడియాలో 'పెద్ది' గురించి తెగ చర్చ జరుగుతుంది అంటే దానికి ప్రధాన కారణం 'చికిరి చికిరి' సాంగ్ అనడంలో డౌట్ లేదు. ఇప్పుడు 'ఆయా షేర్' రూపంలో 'ప్యారడైజ్' టైం స్టార్ట్ అయింది. (Aaya Sher) 'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ఫిల్మ్ 'ది ప్యారడైజ్'. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదలైంది. 'ప్యారడైజ్'లో జడల్ అనే పాత్రలో నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపిస్తున్నాడు. ఆ జడల్ పాత్రను ఎలివేట్ చేస్తూ 'ఆయా షేర్' సాంగ్ సాగింది. అనిరుధ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్స్ అదిరిపోయాయి. సిగరెట్ వెలిగిస్తూ వేసే స్టెప్, జడ పట్టుకొని వేసే స్టెప్ హైలైట్ గా నిలిచాయి. 'ఆయా షేర్' సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెం.1 ప్లేస్ లో ఉంది. ఈ సాంగ్స్ తో ప్రముఖ రాజకీయ నాయకుల ఎడిట్స్ కూడా సోషల్ దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ ఎడిట్ ని కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎడిట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంటూ, తక్కువ టైంలోనే ఇంత రీచ్ పొందిన పాటలు చాలా తక్కువ ఉన్నాయి. 'ఆయా షేర్'కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ప్యారడైజ్ కి బోలెడంత మైలేజ్ వచ్చినట్టే అని చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. Also Read: 'అతడు' సెకండ్ రీ రిలీజ్ బుకింగ్స్.. మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్!  
-వైరల్ గా మారిన పూనమ్ కౌర్ ట్వీట్  -తన ట్వీట్ లో ఏముంది  -క్రైస్తవంలోకి మారిన కాపు కమ్యూనిటీ వారసత్వం ఎవరు  -అర్ధం కానీ ఎన్నో ప్రశ్నలు    పూనమ్ కౌర్(Poonam kaur)..సినీ నటిగా కంటే సోషల్ మీడియాని రఫ్ఫాడించడం ద్వారా ఎక్కువ  ఫాలోయింగ్ ని సంపాదించిందని చెప్పుకోవడంలో ఎలాంటి దాపరికం లేదు. బహిరంగ రహస్యమే. ఆ విషయం పూనమ్ కౌర్ కి కూడా తెలుసు. ఆమె చేసే ట్వీట్ లకి అయితే  భారీ అభిమాన గణం ఉంది. అసలు ఉదయాన్నే ఆమె ఎక్స్ అకౌంట్ ని చెక్ చేసే పనినే జాబ్ గా మలచుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవర్ని ఉద్దేశించి చేస్తుందో  చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసనీ  సంబరపడిపోతుంటారు. దీన్ని బట్టి పూనమ్ ట్వీట్స్ కి ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా 'అంతకి మించి' అనే రీతిలో  సంచలన ట్వీట్ చేసింది. ట్వీట్ లో ఏముందో చూద్దాం. also read: ఆ సినిమాకి  మాత్రం నో.. వెంకటేష్ నిర్ణయంలో న్యాయముందా!   కొంతమంది హిందూ మతాన్ని కేవలం దుస్తులలో మాత్రమే అనుసరిస్తారు. ఆ లబ్ధిదారులు తమ పిల్లలకి  మూడు నెలల వయసు ఉన్నప్పుడే క్యాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించడం జరిగింది. మేమెప్పుడూ మా వారసత్వాన్ని మార్చుకోలేదు. కాపు కమ్యూనిటీ యొక్క గొప్ప పాత వారసత్వం ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవ మతంగా మార్పించడంలో రాయబారిగా వ్యవహరిస్తున్నారు. యూపీలో దీన్ని లవ్ జిహాద్ అంటారు. ఏపీలో ఇది సెలెక్టివ్ గా మారుతుందని ట్వీట్ చేసింది. పూనమ్ గతంలో కొన్ని సంచలన ట్వీట్స్ చేసి ఆ వెంటనే డిలీట్ చేయడంతో, ప్రెజెంట్ ట్వీట్స్ ని స్క్రీన్ షాట్స్ గా  తీసుకొని కొంత మంది నెట్టింట షేర్ చేస్తున్నారు.                        https://x.com/poonamkaurlal/status/2026318259293958165?s=20            
భారతీయ సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది నటీమణులు చిత్ర పరిశ్రమకు వచ్చారు. తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. అయితే ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో ప్రత్యేకత ఉండేది. అలా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. ఏ హీరోయిన్‌కీ లభించని ఆద‌ర‌ణ‌ ఆమె సొంతం. దాదాపు 50 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాలో నటించి ఎవరూ అందుకోలేని రికార్డును సొంతం చేసుకున్నారు. ఏ భాషలో తీసుకున్నా.. ఆమెతో నటించని హీరో లేరంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునల సరసన హీరోయిన్‌గా నటించారు. తండ్రీ కొడుకులతో నటించిన అరుదైన ఘనత ఆమెది. సాధారణ ప్రేక్షకులే కాదు, చిత్ర రంగంలో ఉన్న ఎంతో మందికి శ్రీదేవి ఆరాధ్య దేవత. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోయిన్లకు ఆమె ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. భౌతికంగా ఆమె మన మధ్య లేనప్పటికీ లెక్కకు మించి ఆమె చేసిన సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూ మ‌న‌నం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 24 శ్రీదేవి వర్థంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కి తల్లి అంటే ఎంతో ఇష్టం. కుమార్తెను తనంతటి హీరోయిన్‌ని చెయ్యాలని శ్రీదేవి కలలు కనేవారు. ఆ దిశగానే ఆమెను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. ఇప్ప్పుడు జాన్వీ హీరోయిన్‌గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే అవేవీ చూడకుండానే శ్రీదేవి అందరికీ దూరమయ్యారు.  తన తల్లి వర్థంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు జాన్వీ. చిన్నతనంలో తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘అమ్మా.. నిన్ను తలుచుకోకుండా ఒక్క రోజు కూడా గడవదు. నీ గొంతు, నీ కౌగిలి, నీ ధైర్యం.. ఇవే నన్ను ప్రతి రోజూ నడిపిస్తున్నాయి. ఎక్కడున్నా సరే, నువ్వు గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను. ఎప్పటికీ నీ చిన్న పాపనే’ అంటూ జాన్వీ కపూర్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందర్నీ కదిలించింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
  -వరుస హిట్స్ తో జోరుమీద ఉన్న వెంకటేష్  -త్రివిక్రమ్ మూవీ పై భారీ అంచనాలు  -కానీ ఆ చిత్రాన్ని ఎందుకు వద్దని అంటున్నాడు -అందుకు కారణాలేంటి  -రూమరా, నిజామా!   'ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్' అనే రీతిలో విక్టరీ వెంకటేష్(Venkatesh)సృషించుకున్న సినీ సామ్రాజ్యంకి పెద్ద హిస్టరీ నే ఉంది. రీసెంట్ గా చిరంజీవి(Chiranjeevi)తో కలిసి మన శంకర వరప్రసాద్ గారులో చేయడం ద్వారా సదరు సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఎంతలా అంటే తెలుగు సినిమా రికార్డుల బుక్ లో స్థానాన్ని పొందేలా. దీంతో త్రివిక్రమ్(trivikram)తో చేస్తున్న ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47 పై  అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అభిమానులు, మూవీ లవర్స్ ఈ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే, వెంకటేష్ సినీ జర్నీకే సంబంధించిన మరో న్యూస్ ఆ అందరి కంట పడింది. కాకపోతే రూమర్ హోదాలో. రూమర్ అయినా విక్టరీ ది కాబట్టి చూసేద్దాం. వెంకటేష్, మీనా జంటగా  వచ్చినక్రైమ్ థ్రిల్లర్ దృశ్యం రెండు భాగాలుగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెంకటేష్ తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో  రీమేక్ అనే ఛాయల్ని తెలుగు ప్రేక్షకుల దరిదాపుల్లోకి కూడా తీసుకురాలేదు.దీంతో మూడవ భాగానికి సంబంధించిన అధికార ప్రకటన కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ మూడవ భాగం షూటింగ్ మలయాళంలో కంప్లీట్ కాబోతుండటమే అందుకు కారణం. ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ అనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ  దృశ్యం 3(Drishyam 3)రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయించుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా రూమర్స్ నే వివరిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం'లో చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఉందనేది టాక్. అంటే ఆ రెండు చిత్రాలు అయ్యాకే 'దృశ్యం 3 చేయాల్సి వస్తుంది.  also read:  నటుడు మయాంక్ పవార్ ఆకస్మిక మరణం.. అబద్దమని చెప్పమంటున్న ఫ్యాన్స్  మరి అప్పటికే ఒరిజినల్ మళయాళ వెర్షన్  ఓటీటీలో వచ్చి ఉంటుంది. సదరు ఓటిటి సంస్థలు పాన్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.వెంకటేష్ రీమేక్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ లోనే కుదురుతుంది. ఒక వేళ ఇప్పటికిప్పుడు చేసినా ఒరిజినల్ వెర్షన్ ఓటిటి మాత్రం ఆగదు. అజయ్ దేవగన్ తో హిందీ రీమేక్ కూడా కంప్లీట్ కావలసి వస్తుంది. దీంతో తను చేసే టైంకి రీమేక్ ని  ఎవరు చూస్తారనే అభిప్రాయంలో  వెంకటేష్ ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ రూమర్స్.     
The crime comedy family thriller ‘Sampradayini Suppini Suddapoosani’, produced and headlined by noted actor Shivaji under the banner of Sri Shivaji Productions, is set for a worldwide theatrical release on March 6. Shivaji and Laya, who earlier delivered several hit films together and earned popularity as a successful pair, are reuniting once again in this film. Directed by Sudheer Sriram, the movie is jointly produced by Shivaji and leading OTT platform ETV Win. Prominent producers Bunny Vasu and Vamsi Nandipati are releasing the film in theatres through their banners. A press meet was held in this regard. Speaking on the occasion, hero and producer Shivaji said that the film will release globally on March 6. He expressed happiness over the film being released with the support of ETV Win, Bunny Vasu, and Vamsi Nandipati. He stated that the project was initially planned for a theatrical release and was made as envisioned. Though ETV Win was looking for fresh original content for OTT, the team felt the film would offer a better theatrical experience and decided to release it in cinemas. He said everyone who watched the film laughed heartily and expressed confidence that it is a good film that will appeal to all audiences. Shivaji thanked director Anil Ravipudi for supporting the theatrical release. ETV Win Business Head Saikrishna said it is a delight that Shivaji and Laya are acting together again after a long gap. He described the film as a crime comedy family thriller and expressed confidence that audiences will enjoy it in theatres and extend their support. Actress Laya said she initially felt both happy and slightly disappointed when the film was planned for OTT release, as she always associates films with the theatre experience since childhood. She expressed joy that the film is now releasing in theatres and thanked everyone responsible. She said she is eagerly waiting, like the audience, to watch the film and believes it will mark a strong beginning to her second innings. She added that the film contains all elements required for success and should be experienced in theatres for its emotional impact. Bunny Vasu said director Anil Ravipudi encouraged them to release the film in theatres after watching it. With Shivaji’s confidence, they decided on a theatrical release. He appreciated Shivaji’s performance, stating that he has reached another level after his films in the 1990s. He also praised Laya’s performance, saying her role will be memorable. He expressed confidence that the combination of crime thriller and family emotion will make the film a success. Vamsi Nandipati said Shivaji and Laya’s hit combination is returning to the big screen with this film. He expressed happiness in associating with his favorite actress Laya and described the film as a thriller and entertainer. He voiced confidence that the film will become a blockbuster. Director Sudheer Sriram said the film was initially planned for OTT, but after Anil Ravipudi watched it and suggested a theatrical release, the team decided to bring it to cinemas. He said it felt like a miracle that ETV Win and Shivaji agreed to the decision. He added that good content has found its way to theatres and announced that a new trailer will be released soon. Actor Ali said the director has made the film in a neat and engaging manner. He invited audiences to watch and enjoy the film in theatres on March 6 and expressed confidence that the Shivaji–Laya combination will achieve success once again.
ఎన్ని ఏళ్లు అయినా 'అతడు'కి తగ్గని క్రేజ్ సెకండ్ రీ రిలీజ్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఖలేజా రికార్డు బ్రేక్ అవుతుందా? మహేష్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా? కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి అరుదైన సినిమాలలో 'అతడు'(Athadu) ముందు వరుసలో ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమిది. జయభేరి ఆర్ట్స్ నిర్మించిన 'అతడు' మూవీ.. 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  'అతడు'తో ప్రేమలో పడని తెలుగు సినీ ప్రియుడు లేడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బుల్లితెరపై ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగానూ రికార్డు క్రియేట్ చేసింది. 'అతడు' సినిమా మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 9న మొదటిసారి రీ-రిలీజ్ అయింది. అప్పుడు వరల్డ్ వైడ్ గా రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Athadu Re Release) రీ-రిలీజ్ లో ఏడు కోట్లు రాబట్టడం అనేది మంచి కలెక్షన్స్ కిందే లెక్క. అయితే అక్కడుంది 'అతడు' కాబట్టి.. ఆ లెక్క సరిపోలేదు. ఇంకా ఎక్కువ వసూళ్లు రాబడుతుందని అభిమానులు ఆశించారు. తెలుగు సినిమాల్లో రీ-రిలీజ్ పరంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఖలేజా' టాప్ లో ఉంది. అది కూడా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే కావడం విశేషం. 'ఖలేజా' రికార్డును 'అతడు' బ్రేక్ చేస్తుంది అనుకుంటే అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు సెకండ్ రీ-రిలీజ్ లో ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫిబ్రవరి 28న 'అతడు' సెకండ్ రీ-రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం తక్కువ థియేటర్లలోనే బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ.. అప్పుడే బుక్ మై షోలో ట్రెండింగ్ లోకి రావడం విశేషం. ఇక పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడం.. అతడు సినిమాని మళ్ళీ మళ్ళీ చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండంతో సెకండ్ రీ-రిలీజ్ లోనూ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే.. ఫస్ట్ రీ-రిలీజ్ ని మించిన వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు. Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది.  కొందరు ఇలాంటి సందిగ్ధంలో ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా ఉండిపోతారు, మరికొందరు  అందరూ మంచోళ్లే అనే అబిప్రాయంతో ఏదో ఒక రోజు ఇతరుల స్వార్థానికి బలి అయిపోతారు. కానీ ఎవరినీ నమ్మకుండా ఉంటే ఏదో ఒకరోజు తమ మీద తాము నమ్మకం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.  అలాగని అందరినీ గుడ్డిగా కూడా నమ్మకూడదు. దీనికి పరిష్కారమే ఆచార్య చాణక్యుడు చెప్పిన మార్గం.  మనిషిలో ఉండే కొన్ని లక్షణాల ఆధారంగా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చట.  ఇంతకూ ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. స్వార్థం.. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మంచి  సమయం ఏదంటే.. వారు స్వార్థపరులుగా ఉన్న సమయమే.. ప్రతిఫలం కోసం, ప్రశంసల కోసం ఆశించకుండా,   వ్యక్తిగత లాభం లేని సమయాల్లో,  సందర్భాలలో వ్యక్తి నిజమైన స్వభావం బయటపడుతుంది. సంకోచం లేకుండా తమ బాధ్యతలను నెరవేర్చేవారు, నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండేవారు, వారి నిజమైన ఉద్దేశాలను బయటపెడతారు. ఒకరి మంచితనం లాభానికి మాత్రమే పరిమితం అయితే, అదే వారి నిజమైన స్వభావం. ఇది వారి స్వార్థం అవుతుంది.  అలాంటి వ్యక్తులు స్వార్థపరులు. బాధ్యత..  వాయిదా వేయడం అనేది చాలామందిలో కనిపించే గుణం.  మరీ ముఖ్యంగా ఎదుటివారికి ఏదైనా మాట ఇచ్చి, తప్పడం అనేది బాధ్యతను విస్మరించడం అవుతుంది. స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం లేదా  సరైన సమాధానాలు చెప్పకుండా ఉండేందుకు కావాలని గొడవలు క్రియేట్ చేయడం అనేది వారి మనసులో వేరే ఉద్దేశ్యం ఉందని సూచిస్తుంది.  చాలామంది  సహజంగానే వారి ప్రణాళికలు లేదా సౌలభ్యానికి  వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్నుండి తప్పించుకోవడానికి లేదా వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు.  పదే పదే వాయిదా వేయడం లేదా మాట తప్పడం అనేది  బలహీనతకు సంకేతం అని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి బలహీనత కంటే వారి ఉద్దేశ్యమే వేరు అని అర్థం.  ఎందుకంటే వారు తమ పనుల్లో ఇలాంటి అలసత్వం అస్సలు చూపించరు. ఒత్తిడి, బాధ.. ఒత్తిడి,  బాధ కూడా వ్యక్తి  నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఒత్తిడి ఒక వ్యక్తిని మార్చదు, కానీ అది వారిలో అంతర్గతంగా దాగి ఉన్న స్వభావాన్ని వెల్లడిస్తుంది. పరిస్థితులు చాలా ఛాలెంజింగ్ గా  ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా చాకచక్యంగా ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా లేదా దూకుడుగా ఉంటాడా అని గమనిస్తే..  ఆ సమయంలో వారి స్వభావం,  వారి ప్రవర్తనను బట్టి వారి వ్యక్తిత్వం బయటకు తెలుస్తుంది. విధేయత.. ప్రజల పొగడ్తల కంటే కూడా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరిని గౌరవిస్తాడనేది చాలా ముఖ్యం. ఎవరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు,  ఎవరి సరిహద్దులను వారు సహజంగా గౌరవిస్తారు అనే విషయాల మీదే  వారి ప్రాధాన్యతలు  ఉంటాయి. ఒక సంఘటన ఆధారంగా ఎవరి గురించి జడ్డ్  చేయకూడదు. నిజమైన ఉద్దేశాలు కాలక్రమేణా పదే పదే రిపీట్ గా జరిగే పనులలో బయటకు తెలుస్తాయి.  ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటే అదే వారి నిజాయితీకి బలమైన సాక్ష్యం  అవుతుంది.                                              *రూపశ్రీ
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి.  స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది.  పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది.  అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ డ్రైయర్ వేడి.. స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది.  మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే   స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.  ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి. బేకింగ్ సోడా, నూనె పేస్ట్.. ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా,  నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా,  వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి.  ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది. వెనిగర్ వాటర్.. వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత  మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్.. గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్  ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్  రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత  సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి. వేడినీరు..  వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం  గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు   పదార్థం సులభంగా తొలగిపోతాయి.                                    *రూపశ్రీ.
శరీరంలో ఏదైనా వ్యాధి లేక జబ్బు వస్తే.. అది వెంటనే బయటపడకపోయినా.. శరీరం మాత్రం వాటికి సంబంధించి సంకేతాలు ఇస్తూనే ఉంటుంది.  వీటినే ఆయా జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటుంటాం.  శరీరం పదే పదే  సంకేతాలు ఇస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా  థైరాయిడ్ పనిచేయకపోవడం కూడా అలాంటి సమస్యే.. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే  సమస్య నెమ్మదిగా పెరుగుతూ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలో.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకుంటే.. చలిగా అనిపించడం.. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ,  ఇతరులకన్నా చల్లగా అనిపిస్తే అది  జీవక్రియ మందగిస్తున్నదానికి సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చల్లగా అనిపిస్తుంది. ఏకాగ్రత.. తరచుగా మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం లేదా నీరసంగా అనిపించడం కూడా థైరాయిడ్ వ్యాధికి  సంకేతాలు కావచ్చట.  ఇది హార్మోన్ల అసమతుల్యత మానసిక పనితీరును ప్రభావితం చేస్తుంది. నెలసరి సమస్యలు.. స్త్రీలలో, అధికంగా లేదా  క్రమరహిత ఋతుస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం..  ఆహారంలో ఎటువంటి  మార్పులు చేయకపోయినా  బరువు పెరుగుతున్నట్లయితే, అది నెమ్మదిగా జీవక్రియ జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, శరీరం కేలరీలను చాలా నెమ్మదిగా బర్న్ చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. చర్మం.. నిస్తేజంగా,  పొడిబారిన చర్మం, గరుకుగా ఉండే జుట్టు కూడా థైరాయిడ్ అసమతుల్యతను సూచిస్తుంది. ఎవరికి థైరాయిడ్ వ్యాధులు ప్రమాదం  ఉంటుంది?  ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే వారికి  ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తల లేదా మెడకు రేడియేషన్ థెరపీ పొందిన లేదా అధిక మొత్తంలో అయోడిన్ ఉన్న మందులు తీసుకుంటున్న టర్నర్ సిండ్రోమ్ ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. పైన చెప్పుకున్న లక్షణాలు చాలా వారాల పాటు కొనసాగితే లేదా క్రమంగా పెరిగితే, TSH, T3,  T4  రక్త పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధి సాధారణం, కానీ వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే అది  గుండె, బరువు, మానసిక ఆరోగ్యం,  సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.  వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.