ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  మరోవైపు   వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో  తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్‌పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్‌పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్‌పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్‌పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్‌పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక   అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది.   పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ,   కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి  పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో   మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది.   జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.! [Andhra Pradesh Zilla Parishad Elections,  Alliancevictory, ZP chairpersons, YCP,  Alluri Sitarama Raju Zilla Parishad]
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి: కేటీఆర్ ను లైట్ తీసుకుంటా.. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విజయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సవాల్ చేశారు.  హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు.  మతపరమైన ఓట్ల చుట్టూనే బీజేపీ, ఎంఐఎం రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్  మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికపై జరిగిన సంభాషణలో లోక్‌సభ సీట్ల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు.  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)   ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంగా కాకుండా, యావత్ దక్షిణ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సవాలుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. లోక్‌సభ స్థానాలను యాభై శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని, కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. పునర్విభజన తర్వాత మొత్తం 850 లోక్‌సభ స్థానాలు ఏర్పడితే.. వాటిలో ఉత్తరాదికి దాదాపు  650 సీట్లు, దక్షిణాదికి దాదాపు 195 సీట్లు దక్కే అవకాశం ఉందని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో 60 సీట్ల తేడా ఉండగా, యాభై శాతం పెంపు జరిగితే కేరళలో 30, యూపీలో 120 సీట్లతో ఆ వ్యత్యాసం 90 సీట్లకు పెరుగుతుందని ఉదాహరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమని గుర్తు చేస్తూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిన సందర్భం ఉన్నప్పటికీ, దక్షిణాది ప్రాధాన్యతను దెబ్బతీసేలా సీట్ల సంఖ్యలో భారీ అసమతుల్యత రావడం దేశానికి  ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఆంధ్ర ప్రాంతానికి, 119 సీట్లు తెలంగాణకు ఉన్న సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ కారణంగానే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాలు, జనాభా, జీడీపీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యాభై శాతం ఫార్ములాను అనుసరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త చట్టాలు లేదా రాజ్యాంగ సవరణల అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ సహకరించినప్పటికీ, సంఖ్యాబలంతో ముందుకెళ్తూ భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అభివర్ణిస్తూ, ఆయన తరచూ విదేశీ పర్యటనల్లో ఉంటున్నారన్న రేవంత్ రెడ్డి,  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, జాతి, మతం, భాష పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషితో సామాన్యులకు లభించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్ - గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఇక విదేశాల్లో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై,  పేదల హక్కుల కోసం వివిధ దేశాల్లో పోరాడిన చేగువేరా స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాము నిలబడతామని సమర్ధించారు.   ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!   అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలపై మాట్లాడుతూ,  కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి  బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు గుర్తుకురాక నీతి ఆయోగ్ సమావేశాల్లో నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని చమత్కరించారు.  కేసీఆర్‌ను తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, అయితే కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోనని రేవంత్ చెప్పారు.  తాను పదిహేడేళ్ల వ్యవధిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నానని, కేటీఆర్ మాత్రం తండ్రి అండతో  మేనేజ్‌మెంట్ కోటా లో నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.  తన రాజకీయ కథలో కేసీఆర్‌ను  రావణాసురుడిగా అభివర్ణించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.​ కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!  [Southern Rising Summit, Revanth Reddy,   Delimitation,   Amit Shah, Oyaisi, KCR,  KTR, TeluguOne] 
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు. అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు.  ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.! [Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన గారాలపట్టి అల్లు అర్హ రేపు (నవంబర్‌ 21) పదో పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా అల్లు కుటుంబం ప్రత్యేక వేడుకల కోసం శ్రీలంకకు బయలుదేరింది. అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అయాన్‌ కాగా.. చిన్న కుమార్తె అర్హ. తన అల్లరి, ముద్దు ముద్దు మాటలతో అర్హ ఇప్పటికే సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి ఆమె చేసే సందడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అర్హ పదో పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరిపేందుకు కుటుంబమంతా శ్రీలంకకు వెళ్లడం విశేషం. ఈ సెలబ్రేషన్స్‌ ఎలా ఉండబోతున్నాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అర్హకు ముందుగానే సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.       [Allu Arjun, Allu Arha, 10th Birthday, Sneha Reddy, Allu Ayaan]  
జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డేగల బాబు. ఒక సాధారణ కంటెస్టెంట్‌గా షోలోకి అడుగుపెట్టి.. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ కమెడియన్‌ తన అభిమానులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం (నవంబర్‌ 20) బాబు, అమూల్య వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా బాబే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్ల, బుల్లితెర ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాబు పెళ్లి వేడుకకు పలువురు జబర్దస్త్‌ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్‌, పంచ్‌ ప్రసాద్‌, నూకరాజు తదితరులు వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన బాబు.. తన ప్రతిభతో టాప్‌ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  ఇది కూడా చదవండి: సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.? నటనతో పాటు స్క్రిప్ట్‌ రైటింగ్‌లోనూ బాబుకు మంచి పట్టుంది. ఇప్పటికే పలు టీవీ షోల కోసం వందలాది స్కిట్లు రాశాడు. https://www.instagram.com/reel/Df9e0OtyIKe/ ఇటీవలే మెగాఫోన్‌ పట్టి ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఓటీటీలో విడుదలైన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు దర్శకుడిగా బాబుకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్‌లో ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే తన ఏడేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నాడు. మీకు నచ్చవచ్చు:  త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.? 450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!       [Jabardasth Babu, Wedding, Marriage, Babu Amulya]
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమంత.. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు.  చిన్నారి చేతి వేళ్లను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘దేవ్ నిడిమోరు’ అని పేరు ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ చిన్నారి పేరుపై పడింది. అసలు ‘దేవ్’ అనే పేరుకు అర్థమేంటి? ఈ పేరును ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. సంస్కృత మూలాలున్న ‘దేవ్’ అనే పేరుకు దేవుడు, దైవికమైన వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ప్రకాశించేవాడు, కాంతివంతమైనవాడు అనే భావాలు కూడా ఈ పేరుతో ముడిపడి ఉన్నాయి. పవిత్రత, దైవత్వం, మంచితనానికి ప్రతీకగా ఈ పేరును భావిస్తారు. చిన్నగా, సులభంగా పలకడానికి వీలుగా ఉండటంతో పాటు సంప్రదాయ అర్థాన్ని కలిగి ఉండటం ‘దేవ్’ పేరులోని ప్రత్యేకత. ఆధునికంగా అనిపిస్తూనే భారతీయ సంస్కృతితో అనుబంధం ఉండటం కూడా ఈ పేరును ఆకర్షణీయంగా మార్చింది. ఇది కూడా చదవండి: సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!       [Samantha Son Name, Dev Name Meaning, Dev Nidimoru, Raj Nidimoru]  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన కి సంబంధించిన న్యూస్ వేడి వేడి హాట్ న్యూస్ హోదాలో సోషల్ మీడియా;నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని పాడుకునేలా చేస్తుంది. మరి ఉదయం నుంచి సోషల్ మీడియాని సరిగా ఎవరు పట్టించుకోలేదంటా! మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.  .సాధారణంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు పవన్ కల్యాణ్‌ను ఆప్యాయంగా ‘పవర్ స్టార్’ అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ, మీ అందరికీ ఆయన పవర్ స్టార్‌లా కనిపిస్తున్నారేమో కానీ, తన దృష్టిలో మాత్రం ఆయన నిజమైన ‘ఎంపవర్ స్టార్’ అని పేర్కొనడం అందరినీ ఆకట్టుకుంది. ఇతరులకు శక్తిని ఇవ్వడం, ప్రజలను సాధికారత వైపు నడిపించడమే నిజమైన శక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలోని ‘అపోలో ఆరంభ్’ చొరవతో ఏర్పాటు చేసిన తొలి మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం గడ్డపై ఈ అత్యాధునిక అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం కావడం ఒక గర్వకారణమైన ఘట్టమని ఉపాసన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, దేశంలోని తల్లులు మరియు చిన్నారుల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా చిన్నారుల ప్రాథమిక ఆరోగ్యం, పోషకాహారం, తొలిదశ అభ్యాసానికి బలమైన పునాది వేస్తున్నట్లు వివరించారు.      ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లులు, శిశువుల సంక్షేమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రం సురక్షితమైన, పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం, ఆధునిక విద్యా సౌకర్యాలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. పిఠాపురం ప్రజలు ఈ చొరవను హర్షాతిరేకాలతో స్వాగతించారు.   ఇది కూడా చదవండి: నిజంగానే ఆకాశంలో ఒక తార: సాత్విక వీరవల్లి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! కేవలం పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి మరిన్ని మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకత్వం, ఆరోగ్య రంగ సంస్థల సమన్వయంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధి దృక్పథాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు మహిళలు, చిన్నారుల ఆరోగ్య భద్రతపై ఉపాసన తీసుకుంటున్న చొరవపై ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోంది. ‘పవర్ స్టార్’ నుంచి ‘ఎంపవర్ స్టార్’ వరకు ఆమె ఇచ్చిన ఈ కొత్త బిరుదు ఇప్పుడు అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది.   మీకు నచ్చవచ్చు:హీరోయిన్ అయితే చేతులతో తాకాలా: దెబ్బకి డిలీట్ చేసి పడేసాడు!  మీకు నచ్చవచ్చు: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కత్తితో కలకలం!   [Pawan Kalyan, Upasana, Empower Star,Ram Charan,Tollywood]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నెక్స్ట్‌ మూవీ ఎవరితో చేయబోతున్నారు? ఈ ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ సూర్యతోనూ త్రివిక్రమ్‌ చర్చలు జరుపుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. వెంకటేశ్‌తో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేయాల్సిన ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌తో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’. అయితే ఎన్టీఆర్‌ ఇతర సినిమాల షెడ్యూల్స్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే ఆలోచనకు వచ్చారని సమాచారం. ఇప్పటికే మెగాస్టార్‌కు ఓ కథ వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్‌ మనసులో సూర్యతో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉందట. గతంలోనే సూర్యకు ఓ కథ చెప్పినట్లు త్రివిక్రమ్‌ స్వయంగా వెల్లడించారు. ఆ కథను ఆయనకు నచ్చేలా చెప్పలేకపోయానని, త్వరలోనే సూర్యతో సినిమా చేస్తాననే నమ్మకం ఉందని కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై కొంతకాలంగా ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! తాజా ప్రచారం ప్రకారం, చిరంజీవితో సినిమా ఆలస్యమైతే సూర్యతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సూర్య ఇప్పటికే ఓ సినిమా చేయడానికి అంగీకరించారని, ఈ కాంబినేషన్‌ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌. మరి త్రివిక్రమ్‌ ముందుగా మెగాస్టార్‌తో సినిమా చేస్తారా? లేక సూర్యతో కొత్త ప్రయాణం మొదలుపెడతారా? ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లపై చర్చలు జరుగుతున్నా.. ఏది ఖరారైందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మీకు నచ్చవచ్చు:  ఒసేయ్ రాములమ్మ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.! సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!       [Trivikram Srinivas, Chiranjeevi, Suriya, God of War, Jr NTR]
తెలుగు సినిమా ప్రేమికులంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఒకర్ని మించి మరొక అందగత్తె, కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు భావజాలాన్ని ప్రదర్శిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు రేపుతున్నారు. గిలిగింతలు రేపడమే కాదు తొలి ఆట పడటం ఆలస్యం అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ అదృష్టం సాత్విక వీరవల్లిది అయ్యింది. సాత్విక వీరవల్లి  అచ్చ తెలుగమ్మాయి. తండ్రిది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా. బిజినెస్ రీత్యా చెన్నై లో సెటిల్ అయ్యారు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆమె తన కలలను నిజం చేసుకునేందుకు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.సాధారణంగా అమెరికాలో మంచి కార్పొరేట్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే జీవితంలో పూర్తిగా సెటిల్ అయిపోయామని ఎవరైనా అనుకుంటారు.  కానీ సాత్విక వీరవల్లి ఆ సురక్షితమైన చట్రాన్ని దాటి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తూ  తెలుగు తెరకు పరిచయమయ్యారు. కార్పొరేట్ జీవితాన్ని వదిలి వెండితెర వైపు రావడం తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన యాదృచ్ఛికమని ఆమె పంచుకున్నారు.   అమెరికాలో పుట్టి పెరిగిన సాత్వికకు సాఫ్ట్‌వేర్, హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో సుమారు 4 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంది. ఒరాకిల్ సెర్నర్‌లో సీనియర్ కన్సల్టెంట్ మరియు ఇంటర్‌ఆపరబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఆమె, నిజానికి పీహెచ్‌డీ లేదా ఎంబీఏ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.   అయితే న్యూయార్క్‌కు మారిన తర్వాత కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే కళల వైపు పయనిస్తున్న ఎంతోమందిని చూసి, తన మనసులోని లోటు మరింత పెద్దదైందని ఆమె వివరించారు. ఆ సమయంలోనే ఈ సినిమా అవకాశం రావడంతో వెనుకాడకుండా అంగీకరించారు.ఒరాకిల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు తనలో ఒక్కసారిగా భయం, ఆందోళన మొదలయ్యాయని సాత్విక నిజాయితీగా చెప్పారు. రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, 4 ఏళ్ల అనుభవాన్ని దేనికోసం వదిలేస్తున్నానా, నా నిర్ణయం తప్పైతే ఏంటి అని ఆ రోజు ఆలోచించారట. ఇది కూడా చదవండి: సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాలా: వైరల్ గా మారిన కీర్తి సురేష్ వ్యాఖ్యలు!    కానీ ఆకాశంలో ఒక తార షూటింగ్ మొదలైన తర్వాత ఆ భయాలన్నీ మాయమయ్యాయి. 157 నిమిషాల నిడివితో నవంబర్ 20, 2026న విడుదలైన ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక గ్రామీణ యువతి చుట్టూ తిరుగుతుంది.   అమెరికాలో పెరిగిన సాత్వికకు పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం, ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్‌లో తనను తాను అద్దంలో చూసుకోవడం తొలుత చాలా ఆశ్చర్యం కలిగించిందట   .  ఆకాశంలో ఒక తారలో కల్పన గా అత్యద్భుతంగా నటించి తన కలలని  నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దుగా పోరాడే యువతిగా అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం తన ప్రతిభ, పట్టుదలతో ఇంత పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకున్న సాత్విక వీరవల్లి భవిష్యత్తులో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదగడం ఖాయమని కూడా  సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రామాయణ పార్ట్ 2 లో రణబీర్, యష్ ని మించి ఈ స్టార్ నటుడు! మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!     [Satvika Veeravalli , Aakasamlo Oka Tara,  Pavan Sadineni, Dulqer, Shruthi Haasan]                 
హీరోయిన్.. సినిమాలో క్యారక్టర్ కోసం కొంచం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొంచం పొట్టి దుస్తులు ధరించే పరిస్థితి రావచ్చు. క్యారక్టర్ కి తగ్గ రొమాన్స్ పండించడానికి హీరోతో రొమాన్స్ చెయ్యాల్సి రావచ్చు. దీంతో ఆటోమాటిక్ గా  రకరకాల స్పర్సలు తనని చుట్టుముట్టే అవకాశం ఉండవచ్చు. పైగా అవన్నీ జరుగుతున్నప్పుడు తక్కువలో తక్కువ 50 మంది దాకా షూటింగ్ మెంబర్స్ ఉండవచ్చు.ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పుకునే అవకాశం ఒక మహానుభావుడు కల్పించాడు. తాజాగా ప్రముఖ నటి కీర్తి సురేశ్‌, దర్శకుడు నటుడు మిష్కిన్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. చెన్నైలో జరిగిన 'సత్యవాన్ సావిత్రి' చిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికపై వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుతున్న దృశ్యం బయటకు వచ్చింది. ఆ సమయంలో మిష్కిన్‌ కీర్తి సురేశ్‌ను ప్రశంసిస్తూ, ఆమె మోకాలు లేదా తొడ భాగం వైపు కొద్దిసేపు చేయి వేసిన క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా పాకింది. ఆ క్లిప్‌ను చూసిన కొందరు నెటిజన్లు కీర్తి సురేశ్‌ ముఖంలో అసౌకర్యం కనిపించిందంటూ కామెంట్లు చేయడం స్టార్ట్ చేసారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి, సినిమాల్లో నటీనటులు సన్నివేశాల కోసం సన్నిహితంగా నటిస్తారు కదా, అలాంటప్పుడు బహిరంగ వేదికపై ఇలాంటి స్పర్శను ఎందుకు తప్పుబడుతున్నారనే తరహాలో ప్రశ్నలు లేవనెత్తారు.  దీంతో కీర్తి సురేశ్‌ మౌనం వీడి, సోషల్ మీడియా వేదికగా ఘాటుగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె స్పందిస్తు  తమ మధ్య ఉన్నది తండ్రీకూతుళ్ల లాంటి అనుబంధం. నా ముఖంలో మీకు అసౌకర్యం ఎక్కడ కనిపించింది, మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధం గురించి మేము చెప్పిన మాటలు మీరు వినలేదా.ఒకవేళ నిజంగానే అసౌకర్యం కలిగి ఉంటే, సినిమాల్లో నటిస్తాం కాబట్టి బయట కూడా అలాగే ఉండాలా! కొన్ని విషయాలని  సరిగ్గా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. నిజానికి ఆ వేదికపై మిష్కిన్‌ కీర్తి సురేశ్‌పై ఎంతో అభిమానాన్ని కురిపించారు. ఆమె నటనను మెచ్చుకుంటూ 'నడిగైయర్ తిలగం' అనే బిరుదు ఇస్తున్నట్లు ప్రకటించారు, తలపై చేయి వేసి ఆశీర్వదించారు. అంతేకాకుండా, కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన 'డోరతీ'లో ఆమె నటనకు మెచ్చి బంగారు ఉంగరాన్ని కూడా బహుమతిగా అందజేశారు. షూటింగ్ మొదలైన రెండో రోజే మిష్కిన్‌ తన కూతురు ఫోటో చూపించి, తన కూతురు అచ్చం కీర్తిలాగే ఉంటుందని చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. https://x.com/trigguuuu/status/2123298998605996441 కీర్తి సురేశ్‌ స్పందించిన తర్వాత ఆ వివాదాస్పద పోస్ట్ పెట్టిన నెటిజన్ తన పోస్ట్‌ను తొలగించి, తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదంటూ క్షమాపణ కోరడం విశేషం.    మీకు నచ్చవచ్చు: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కలకలం మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!   [Keerthy Suresh, Mysskin, Sathyavan Savithiri, Tollywood]                
నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గుర్తింపు దక్కనుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించే విశిష్ట పురస్కారానికి ఈ ఏడాది బాలకృష్ణను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన సినీ సేవలతో పాటు సామాజిక సేవను గుర్తించి ఈ పురస్కారానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో ఆయన చేస్తున్న కృషిని కూడా ఈ ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది కళలు, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విశిష్ట పురస్కారాన్ని అందిస్తుంది.  ఈసారి కళ, సేవా రంగాల నుంచి బాలకృష్ణ పేరును ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: బాలకృష్ణ దాదా లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.! అయితే ఈ పురస్కారానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్‌ ఆస్పత్రి సేవలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ పురస్కారం లభిస్తే ఆయన ఖాతాలో మరో గౌరవం చేరినట్లే. మీకు నచ్చవచ్చు:  ఒసేయ్ రాములమ్మ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.! తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!       [Nandamuri Balakrishna, Telugu University Award 2026, Visishta Puraskaram, Telangana Government]  
రామాయణ తన జోరుని ఇంచు కూడా తగ్గించకుండా పేరు పెట్టలేని తుఫాన్ ని బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తూ ఉంది. కేవలం 14 రోజుల్లోనే 1,500 కోట్ల మార్కుని అందుకొని  ఇప్పుడు ఏకంగా 2,000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో రెండవ పార్ట్ పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేసేలా ప్రముఖ నటుడు అజింక్య దేవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి. అజింక్య దేవ్ రామాయణలో మహర్షి విశ్వామిత్రుడిగా కనిపించాడు. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు  మొదటి భాగం కథ రాయడానికి, షూటింగ్ పూర్తి చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి దాదాపు 9 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది.  ఇప్పుడు 'రామాయణ పార్ట్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత భారీ స్థాయిలో, ఉత్కంఠభరితంగా తెరకెక్కుతోందని, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   మరోవైపు 'రామాయణ' కథని మూడో భాగంతో కూడా కొనసాగించే అవకాశం ఉందా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. దీనిపై అజింక్య దేవ్ స్పందిస్తూ, మూడో భాగం గురించి మేకర్స్ తనతో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం పంచుకోలేదని చెప్పారు. కానీ భవిష్యత్తులో గనుక మూడో భాగం తీస్తే తన పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని, అందుకే అలా జరిగితే ఎంతో సంతోషిస్తానని అన్నారు. ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కలకలం: కత్తితో ఏం చేసాడంటే..షాక్ లో ఫ్యాన్స్! అంతేకాదు, "మూడు భాగాలతో ఎందుకు ఆగిపోవాలి? ఏకంగా 5 భాగాలుగా తీసినా బాగుంటుంది, అలాంటి మహాకావ్యంలో మళ్లీ మళ్లీ భాగమవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. విశ్వామిత్రుడి పాత్ర కోసం తాను పడిన శారీరక శ్రమ గురించి కూడా అజింక్య దేవ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆ పాత్రలో ఎక్కువగా బేర్ బాడీతో కనిపించాల్సి రావడం వల్ల ఫిట్‌నెస్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు. సిక్స్-ప్యాక్ కోసం కాకుండా, ఒక మహర్షికి ఉండాల్సిన గంభీరత, దృఢత్వం తెరపై కనిపించేలా శరీరాన్ని తీర్చిదిద్దుకున్నానని వివరించారు. దశరథ మహారాజు పాత్రలో అరుణ్ గోవిల్ వంటి దిగ్గజ నటుడితో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి అని, ప్రతి సన్నివేశంలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమించానని అజింక్య దేవ్ తెలిపారు. మొత్తానికి 9 ఏళ్ల ప్రయాణం 1,500 కోట్ల కలెక్షన్లు, రాబోతున్న పార్ట్ 2లో సన్నీ డియోల్ హనుమంతుడి అవతారం—ఇవన్నీ 'రామాయణ'పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.  మీకు నచ్చవచ్చు:విన్నర్ ఎవరు...ఈ సినిమానేనా! మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!     [Ajinkya Deo,Ramayana Part 2, Sunny Deol,Ranbir Kapoor,Yash]         
తెలుగు ప్రేక్షకులకు సహజమైన నటనతో దగ్గరైన హీరోయిన్ నివేదా థామస్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీమతి' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 విడుదల చేసింది. అంతేకాదు, స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించింది. '35 చిన్న కథ కాదు' సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న నివేదా థామస్ ఈ ప్రాజెక్ట్‌తో తిరిగి ప్రేక్షకులను పలకరించనున్నారు. 'శ్రీమతి' సినిమాలో నివేదా థామస్‌కు జోడీగా తిరువీర్ నటించారు. ఇందులో ఆమె మధుశ్రీ అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత ఒక మహిళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చుట్టూ ఈ కథ సాగుతుంది. కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే అంచనాలకు అనుగుణంగా జీవించాలా? లేక తన కలలు, ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలా? అనే సంఘర్షణను ఇందులో చూపించబోతున్నారు. 'ప్రతి శ్రీమతి వెనుక ఒక కథ ఉంటుంది' అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. 'స్కైలాబ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఖండేరావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సంబంధాలు, మహిళల భావోద్వేగాలు, వారి వ్యక్తిగత ఆశయాలను ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. నివేదా థామస్, తిరువీర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాపై టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 'శ్రీమతి' డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 4, 2026 నుంచి తెలుగు జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లతో పాటు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'శ్రీమతి' ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.       [NivethaThomas, SrimathiOTT, SrimathiMovieOTTRelease, NivethaThomasLatestMovie]
మనం రోజూ తినే ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలని వైద్యులు, పోషకాహార నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే మార్కెట్లోకి వెళ్లినప్పుడు జామ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు కనిపిస్తే, వీటిలో మన శరీరానికి ఏది ఎక్కువ బలాన్ని ఇస్తుందనే సందేహం చాలామందికి వస్తుంది. నిజానికి ఈ మూడు పండ్లలో ఏ ఒక్కటి మాత్రమే అన్ని రకాల పోషకాలను పూర్తిస్థాయిలో అందించలేదు. ప్రతి పండుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మన శరీర అవసరాలు, ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఏ పండు ఎంచుకోవాలో తెలుసుకోవడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ముందుగా పేదల ఆపిల్‌గా పిలువబడే జామ పండు గురించి మాట్లాడుకుంటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి అత్యధిక స్థాయిలో ఉండటం వల్ల సీజనల్‌గా వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి గట్టి రక్షణ కవచంలా నిలుస్తుంది. అంతేకాకుండా జామలో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కేలరీలు చాలా తక్కువగా ఉండటం, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఒక అద్భుతమైన వరం. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి జామను ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడిని సంప్రదించడం ఎంతో శ్రేయస్కరం. ఇక ఎర్రని గింజలతో నోరూరించే దానిమ్మ పండు రక్తహీనతను తరిమికొట్టడంలో, గుండెను పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మలో పుష్కలంగా ఉండే ఐరన్, ఫోలేట్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రక్త వృద్ధికి ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు, గర్భిణులకు దానిమ్మ పండు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. దీనితో పాటు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను కాపాడి, ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మెరిపిస్తాయి. మరోవైపు బంగారు వర్ణంలో ఉండే బొప్పాయి పండు మన జీర్ణవ్యవస్థకు ఒక ఆప్తమిత్రుడిలా పనిచేస్తుంది. బొప్పాయిలో సహజంగా ఉండే  పపైన్  అనే ప్రత్యేక జీర్ణ ఎంజైమ్ మనం తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీర్ఘకాలంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి పొట్ట సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారికి బొప్పాయి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటంతో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఇది కంటి చూపుకు మరియు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే బొప్పాయి తిన్న తర్వాత ఆహారం వేగంగా జీర్ణమవడం వల్ల కొంతమందికి మళ్లీ త్వరగా ఆకలి వేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి:ప్రసాదాన్ని, తలపించే రుచి.. ఇంట్లోనే ఈజీగా బెల్లం గోధుమ రవ్వ కేసరి! ఇలా జామ ఇమ్యూనిటీకి, దానిమ్మ గుండె మరియు రక్త ఆరోగ్యానికి, బొప్పాయి జీర్ణక్రియకు వేర్వేరుగా మేలు చేస్తాయని స్పష్టమవుతోంది. కాబట్టి ఈ మూడింటిలో ఏది గొప్పదని పోల్చి ఒకే పండుకు పరిమితం కావడం కంటే, మన శరీరానికి ఏ సమయంలో ఏ పోషకాలు అవసరమో గుర్తించి ఆహారంలో భాగం చేసుకోవడం తెలివైన పని. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంలో బొప్పాయి తీసుకుంటే రోజంతా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మధ్యాహ్నం పూట ఆకలి వేసినప్పుడు జామ పండు తినడం వల్ల శక్తితో పాటు ఇమ్యూనిటీ లభిస్తుంది, ఇక సాయంత్రం వేళ దానిమ్మ గింజలు తీసుకోవడం వల్ల గుండెకు, రక్తానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ విధంగా రోజులో వేర్వేరు సమయాల్లో ఈ మూడు పండ్లను మార్చి మార్చి తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు సమతుల్యంగా శరీరానికి చేరుతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ పోషక గనులను సరైన పద్ధతిలో వినియోగించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉత్సాహంగా జీవించవచ్చు. అయితే మీకు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నట్లయితే, మీ రోజువారీ ఆహార ప్రణాళికలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీకు నచ్చవచ్చు:ఒంట్లో వేడి తగ్గి, ఉక్కులాంటి బలం.. రాగి అంబలి సీక్రెట్ ఇదే!                                   చలికాలంలో, జలుబు దగ్గుకు చెక్ పెట్టే, మిరియాల కోడిగుడ్డు కూర!       Disease Fighting Fruits, Fruit Combination Facts, Daily Fruit Benefits, Nutrition And Wellness, Healthy Eating Habits, Doctor Health Advice, Health Tips In Telugu.
ఉదయం లేవగానే హడావుడిగా టిఫిన్ తినాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక్క గ్లాస్ రాగి అంబలి తాగితే చాలు శరీరానికి కావాల్సిన బలం, చలువ, ఉత్సాహం సులభంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాల గనిగా నిలిచే రాగులు లేదా ఫింగర్ మిల్లెట్ మన సంప్రదాయ ఆహారంలో అత్యంత విలువైన చిరుధాన్యం. రాగి అంబలి లేదా రాగి సంగటి రూపంలో వీటిని తీసుకుంటే శరీరానికి అద్భుతమైన మేలు జరుగుతుంది. ముఖ్యంగా నేటి వేగవంతమైన జీవనశైలిలో నీరసం, ఒంట్లో వేడి, బరువు పెరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ సహజ పానీయం ఒక గొప్ప వరంలా పనిచేస్తుంది. రాగులలో కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, బి-విటమిన్లు అలాగే మిథియోనిన్, లైసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆసిడ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల రాగులలో సుమారు 344 మిల్లీగ్రాముల నుంచి 364 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుందని పోషకాహార గణాంకాలు సూచిస్తాయి; ఇది గోధుమ పిండి లేదా జొన్నలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ అధిక కాల్షియం ఎముకలు మరియు దంతాల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే రాగుల్లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కాపాడటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మరియు స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి రాగి అంబలి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. కేవలం ఒక గ్లాసు రాగి అంబలి తాగినా చాలాసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అనవసరంగా ఎక్కువ ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. సాధారణంగా ఒక గ్లాసు రాగి అంబలి సుమారు 80 నుంచి 110 కిలోక్యాలరీల శక్తిని అందిస్తూ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (సుమారు 52) మరియు ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో రోజంతా స్థిరమైన శక్తి లభించడమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాగి అంబలికి ఉండే ప్రధాన విశిష్టత దాని చలువ చేసే గుణం. శరీరంలో పేరుకుపోయిన అధిక వేడిని సమర్థవంతంగా తగ్గించి, శరీరాన్ని చల్లబరచడానికి రాగి అంబలి ఎంతో ఉపయోగపడుతుంది. మజ్జిగ లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే వేసవి తాపం నుంచి రక్షణ లభించడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా, రాగి పిండిని 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టి తయారుచేస్తే అందులో మంచి బ్యాక్టీరియా పెరిగి ప్రోబయోటిక్ ప్రయోజనాలు లభిస్తాయి, ఫైటిక్ ఆమ్లం 40 నుంచి 60 శాతం వరకు తగ్గి ఖనిజాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. ఇది కూడా చదవండి:నిద్రవేళలు, అస్తవ్యస్తంగా ఉన్నాయా? మగవారి గుండె ఆరోగ్యంపై కీలక హెచ్చరిక సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే రాగి జావ లేదా రాగి అంబలిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. రాగి పిండి, నీరు, మజ్జిగ, కొద్దిగా ఉప్పుతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు లేదా జీలకర్ర, కరివేపాకు కలిపి తాగితే రుచితో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఉదయం పరగడుపున లేదా అల్పాహారానికి బదులుగా ఒక గ్లాసు రాగి అంబలి తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా, శక్తివంతంగా పనిచేయగలరు. అయితే ఏదైనా ఆహార మార్పు చేసే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా రాగి అంబలి తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. సరైన మోతాదులో, ఆరోగ్యకరమైన అలవాట్లతో కలిపి రాగి అంబలిని తీసుకుంటే దీర్ఘకాలంలో శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీకు నచ్చవచ్చు:చలికాలంలో, జలుబు దగ్గుకు చెక్ పెట్టే, మిరియాల కోడిగుడ్డు కూర!                          ప్రసాదాన్ని, తలపించే రుచి.. ఇంట్లోనే ఈజీగా బెల్లం గోధుమ రవ్వ కేసరి!     Ragi Ambali Benefits, Healthy Breakfast Alternative, Finger Millet Drink, Ragi Java Nutrition, Morning Energy Drink, Millet Diet Tips, Health Tips In Telugu.  
చలి గాలులు వీచే వేళ, వర్షపు జల్లులు కురిసే సాయంత్రం వేళ వేడివేడిగా, ఘాటుగా తినాలని మనసుకు అనిపిస్తుంది. అలాంటి సమయంలో రోజూ తినే సాధారణ కూరలకు భిన్నంగా మిరియాల కోడిగుడ్డు కూర చేసుకుంటే ఇంటిల్లిపాదీకి నోటికి కొత్త రుచి తగులుతుంది. వేడి అన్నం, చపాతీ, లేదా రోటీలలోకి ఈ కూర అద్భుతంగా సరిపోతుంది. ముఖ్యంగా చలి కాలం మరియు వానలు పడే రోజుల్లో నల్ల మిరియాల ఘాటుతో కూడిన ఇలాంటి వంటకాలు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రుచికరమైన కోడిగుడ్డు కూరను తక్కువ సమయంలోనే వండుకోవచ్చు. ఈ మిరియాల కోడిగుడ్డు కూర తయారీకి ముందుగా 4 కోడిగుడ్లు, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 3 ఉల్లిపాయలు మరియు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర సిద్ధం చేసుకోవాలి. తాలింపు మరియు రుచి కోసం 2 కరివేపాకు రెబ్బలు, తాజా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి. ఈ కొలతలతో చేసుకునే కూర కుటుంబ సభ్యులందరికీ చక్కని రుచిని అందిస్తుంది. మొదటి దశలో బాగా ఉడికించిన కోడిగుడ్లపై చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి, తద్వారా మసాలాలు గుడ్ల లోపలికి చక్కగా చేరతాయి. ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి, రుచికి సరిపడా పసుపు మరియు ఉప్పు కలిపి ఈ గుడ్లను బంగారు రంగులోకి వచ్చేవరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించడం వల్ల కోడిగుడ్లకు మంచి రంగు రావడమే కాకుండా కూరలో విడిపోకుండా గట్టిగా, రుచిగా ఉంటాయి. చలి రోజుల్లో వేడివేడిగా మొదలయ్యే ఈ వంటక ప్రక్రియ ఇంటి వంటగదిని మంచి సువాసనతో నింపుతుంది. తర్వాత అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి కొద్దిగా జీలకర్ర మరియు 4 కరివేపాకు ఆకులు వేసి చిటపటలాడించాలి. ఆ వెంటనే తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసి వాటి రంగు మారేవరకు ఓపికగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. అనంతరం కట్ చేసిన 2 టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు వేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. ఇది కూడా చదవండి:దంతాలపై పాచి పోవాలా? ఈ వంటింటి చిట్కా, పాటించండి! మసాలా గ్రేవీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మరియు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి 2 నిమిషాల పాటు మంచిగా కలపాలి. మిరియాల పొడి ఘాటు మసాలాతో కలిసి కూరకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీరు పోసి 4 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను గ్రేవీలో వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మసాలాలు పట్టేలా బాగా ఉడికించాలి. చివరగా తాజా కొత్తిమీర చల్లి దించుకుంటే ఘాటైన, రుచికరమైన మిరియాల కోడిగుడ్డు కూర సిద్ధమవుతుంది. చలి కాలంలో జలుబు, దగ్గు నుంచి రక్షణనిస్తూనే భోజనానికి కొత్త కళను తెచ్చే ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి. వేడివేడి చపాతీ లేదా అన్నంతో కలిపి తింటుంటే ప్రతి ముద్దలోనూ నల్ల మిరియాల ఘాటు, మసాలాల రుచి ఆకట్టుకుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ వంటకం మీ డైలీ మెనూలో తప్పక చేర్చదగిన స్పెషల్ ఐటమ్. మీకు నచ్చవచ్చు:మధ్య వయస్కులకు, బెస్ట్ ఫిట్‌నెస్ టిప్స్: డిజిటల్ వ్యాయామాల క్రేజ్                               ఎముకల బలం మరియు, హార్మోన్ల సమతుల్యత, కోసం వేయించిన ఖర్జూరాలు!       Pepper Egg Curry, Miriyala Kodiguddu Kura, Winter Egg Recipes, Spicy Egg Masala, Winter Comfort Food, Easy Indian Curry, Cooking Recipes In Telugu.  
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
బూడిద గుమ్మడి మనకు సులభంగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమైనది? బూడిద గుమ్మడి రసం కిడ్నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తీసుకోవచ్చా? బూడిద గుమ్మడిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? అంతేకాకుండా ఎసిడిటీ సమస్య, శరీర బరువు నియంత్రణ విషయంలో బూడిద గుమ్మడి ఎలాంటి ప్రయోజనాలను అందించగలదు? బూడిద గుమ్మడి, సాధారణ గుమ్మడి కాయ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? వాటిలో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ వీడియోలో వివరించారు. బూడిద గుమ్మడి రసాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా బూడిద గుమ్మడిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. బూడిద గుమ్మడి రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని లేదా వాటిని నివారిస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలి. వైద్యులు సూచించిన చికిత్సను ఆపి, దానికి బదులుగా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.