తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే  కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..  ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.   గతంలో బీజేపీ,తెలుగుదేశం మధ్య విభేదాలు ఉన్నాయంటూ సాగిన ప్రచారానికి ఈ భేటీలతో ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా ఏపీలో కూటమి విజయం తర్వాత, ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడబోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాకుండా..  మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేనలను కలుపుకొని ఎన్డీయే కూటమిగా ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.   2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే కూటమి పొత్తు అధికారికంగా లేకపోయినా..  టీడీపీ కేడర్ మద్దతు బీజేపీకి లభించడం వల్ల అక్కడ ఆ పార్టీకి ఎంపీ సీట్లు పెరిగాయని ఆయన విశ్లేషించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీకి ఇప్పటికీ గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే కూటమిగా వెళ్లడమే శ్రేయస్కరమని ప్రధాని మోదీ భావిస్తున్నారని అడుసుమిల్లి చెప్పారు.  చంద్రబాబు నాయుడు, మోదీల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా..  రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రం నుంచి అందుతున్న సహకారం..  పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల విడుదల వంటివి రెండు పార్టీల మధ్య స్నేహాన్ని మరింత బలపరిచాయి. తెలంగాణలో కూడా ఒక సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి..  కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే ఎన్డీయే కూటమి ఇక్కడ బలమైన శక్తిగా ఎదుగుతుందని అడుసుమిల్లి విశ్లేషించారు.  
తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్‌ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ  ఆదేశాలు జారీ చేసి సంచలనం సృష్టించారు. తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.  ఎందుకంటే వీటి మూసివేతతో మిగిలిన దుకాణాల వద్ద అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. కాబ‌ట్టి   ఆదాయానికి వ‌చ్చే లోటు ఉండ‌దు. మ‌ద్యం కావాల‌నుకునేవారు ఇక్క‌డ దొర‌క్కంటే మరో చోట  కొనుక్కుంటారు.  ఇక విజయ్ వ్యూహం ఏంటో చూస్తే.. ఆయ‌న‌ లక్ష్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే కాదు.  నియంత్రిత విక్రయాలు మాత్ర‌మే. ప్రజల నుంచి విమర్శలు వస్తున్న సెన్సిటివ్ ఏరియాల్లో దుకాణాలు తొలగించడం ద్వారా ఆయన ఒక క్లీన్ ఇమేజ్, సోషల్ రిఫార్మర్  గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.  అయితే..   ఇదే అంశాన్ని ఏపీలో జ‌గ‌న్ సంపూర్ణ మ‌ద్య పాన నిషేధం అని చెప్పి సాగించిన విచ్చ‌ల‌విడి విధానాల‌తో ముడి పెట్టి చూస్తున్నారు కొంద‌రు. ఆనాడు..  జ‌గ‌న్  ద‌శలవారీ నిషేధం అని చెప్పి ప్రభుత్వమే దుకాణాలు నడిపింది. అప్ప‌టి  వ‌ర‌కూ మార్కెట్లో ఉన్న పాపుల‌ర్ బ్రాండ్ల‌ను ప‌క్క‌న పెట్టి బూమ్ బూమ్ వంటి  కొత్త  ర‌కాల‌ను ప్ర‌వేశ  పెట్టింది. అంతే కాదు ఆయా లిక్క‌ర్ సిండికేట్ల‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హించి ముడుపులు తీసుకుంది. దేశంలోనే  అతి పెద్ద లిక్క‌ర్ స్కామ్  కి దారులు ప‌రిచింది నాటి వైసీపీ ప్ర‌భుత్వం.     అదే విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యాలు భ‌విష్య‌త్ లో బ‌డులు, గుడులు, బ‌స్టాండ్ వంటి  బ‌హిరంగ  ప్ర‌దేశాల్లో మందుబాబుల అరాచ‌కాలు త‌గ్గి.. త‌ద్వారా విజ‌య్ ప్ర‌భుత్వం  ప‌ట్ల మ‌హిళా  ఓట‌ర్ల‌లో ఒక ర‌క‌మైన న‌మ్మ‌కం  ఏర్ప‌డే అవకాశం ఉంది. మద్యం మాఫియా, సిండికేట్లకు తావులేకుండా దుకాణాల నిర్వహణలో పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. అదే జగన్  ఏపీలో మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రయోగాలు చేసి చివరకు   విమర్శలకు గురయ్యారు. విజయ్ మాత్రం ఆదాయం కంటే  ప్రజా క్షేమం  ముఖ్యమని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.  అయితే, ఈ 48 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోకుండా రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌ ఆదాయం తగ్గితే, ఆ లోటును భర్తీ చేయడానికి విజయ్ ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించాల్సి  ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప‌న్నుల్లో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సి ఉంటుందంటున్నారు. పారిశ్రామికాభివృద్ధి మ‌రింత‌గా విస్త‌రింప చేయాల్సి ఉంటుందనీ సూచిస్తున్నారు. ఏది ఏమైనా విజ‌య్ మార్క్ పాల‌నైతే త‌మిళ‌నాడులో షురూ అయిన‌ట్టుగానే  క‌నిపిస్తోంది.
తమిళనాడులో సోమవారం (మే 11) రాజకీయ విలువలకు అద్దంపట్టే చూడముచ్చటైన దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్వయంగా రాష్ట్ర మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సందర్భంగా స్టాలిన్ విజయ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. అంతకు కొద్ది క్షణాల ముందు.. తమ నివాసానికి వచ్చిన విజయ్ కు తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిథి మారన్ ఆప్యాయంగా పలకరించి, అలింగనం చేసుకుని లోనికి తోడ్కొని వెళ్లారు. ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులు అంటే బద్ధ శత్రువుల్లా వ్యవహరించే తీరు ఎక్కువైపోయింది. అంశాల వారీ విమర్శలు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థి పార్టీలు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విమర్శల స్థాయి పాతాళానికి దిగజారిపోయిన పరిస్థితి ఉంది.  అయితే గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.  పరిణతితో, సామాజిక బాధ్యతతో ఉండేది.  ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య  రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక ఎంపికలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉండేది.  అయితే తరువాత తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  అయితే.. తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్…  ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.   ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో విజయ్ చేసిన పని ప్రజాస్వామ్య వాదుల మన్ననలు అందుకుంటోంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో  ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేసే నేతలు.. ఆ తర్వాత రాజకీయాలను పక్కనపెట్టేసి   అభివృద్ధిపై దృష్టి సారించేవారంటున్నారు. రాజకీయాల్లో పరస్పరం చేసుకున్న విమర్శలను ఆ తర్వాత వారు అంతగా పట్టించుకునే వారు కాదు.అసలు గతంలో రాజకీయ విమర్శలు కూడా హుందాగా, సిద్ధాంతాల ప్రాతిపదికనే ఉండేవి.   అయితే నేడు అది కనుమరుగై..  విమర్శలు అంటే వ్యక్తిగత దూషణలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అయితే తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా మాజీ సీఎం ఇంటికి వెళ్లడం ద్వారా రాజకీయాలలో విలువలకే పెద్దపీట వేస్తానని చాటారు.  ఎన్నికల ప్రచారంలోనూ ఆయన శైలి భిన్నంగానే ఉంది. ప్రత్యర్థి పార్టీలపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఒక వేళ చేసినా అవి ఎక్కడా పరిధి దాటలేదు.  ఆరోగ్యకరమైన రాజకీయాలకు విజయ్ తమిళనాట తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, తాజాగా సినిమా టికెట్ ధరల వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో టికెట్ రేట్ల పెంపు అనేది ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే. పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు రేట్లు పెంచడం ఆనవాయితీగా మారింది. అయితే, ఈ అంశంపై రాహుల్ స్పందిస్తూ సామాన్య ప్రేక్షకుడి కోణంలో విశ్లేషించారు. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కేవలం సినిమా బాగుంటే సరిపోదు, అది వెండితెరపైనే చూడాల్సిన అద్భుతంగా ఉండాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూడలేని ఒక గొప్ప అనుభూతిని థియేటర్ ఇస్తేనే, ప్రేక్షకుడు టికెట్ ధరను భరించడానికి సిద్ధపడతాడని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం కంటెంట్ లేని సినిమాలకు రేట్లు పెంచితే జనం ఆదరించరని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఒక సామాన్యుడు సినిమాకు రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటుకుని రావాలని రాహుల్ గుర్తుచేశారు. ఎండలు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, పెట్రోల్ ఖర్చులకు తోడు థియేటర్లలో విపరీతంగా ఉండే స్నాక్స్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కష్టాలు పడి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి క్వాలిటీ సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉందని స్పష్టం చేశారు. సినిమా రిజల్ట్ గురించి చెబుతూ రాహుల్ ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే, మనం తీసిన సినిమా ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి అది ఒక నిదర్శనమని అన్నారు. ప్రేక్షకుడి సమయానికి, డబ్బుకు విలువ ఇవ్వని పక్షంలో జనం సినిమా హాళ్లకు దూరం అవుతారని, ఖాళీ కుర్చీలే సినిమా అసలు సిసలైన రిజల్ట్‌ను చూపిస్తాయని తనదైన శైలిలో విశ్లేషించారు. 'అర్జున్ రెడ్డి', 'జాతి రత్నాలు' వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ, ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో కూడా ఆయన రియాలిటీని ప్రతిబింబించేలా మాట్లాడటంతో నెటిజన్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచడం కంటే, కంటెంట్ మీద దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నటుడు, తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, రాహుల్ చేసిన ఈ కామెంట్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
Prime Video, India’s most loved entertainment destination, today unveiled the gripping trailer of its upcoming Prime Original movie System, offering a powerful glimpse into hard-hitting social realities and questions a system where power defines truth. Directed by Ashwiny Iyer Tiwari and produced by Pammi Baweja, Harman Baweja, and Smitha Baliga, System captures the universal themes of ambition, revenge, fight for justice, and moral ethics. Written by Harman Baweja, Arun Sukumar, Ashwiny Iyer Tiwari, Tasneem Lokhandwala, and Akshat Ghildial, System features Sonakshi Sinha, Jyotika, and Ashutosh Gowariker in lead roles, supported by Preeti Agarwal, Adinath Kothare, Aashriya Mishra, Gaurav Pandey, and Sayandeep Gupta in pivotal roles. The movie will premiere exclusively on Prime Video in Hindi, across India and over 240 countries and territories worldwide on May 22.   The trailer for System opens with Neha, a determined young lawyer played by Sonakshi Sinha, taking on a tough challenge from her father (Ashutosh Gowariker) to be worthy of a partnership in his firm. To pull it off, she recruits Sarika (Jyotika) - a street-smart courtroom stenographer, who secretly harbors motives of her own. What follows is a fast-moving glimpse into intense courtroom battles, messy relationships, and some powerful moments. Hard-hitting dialogues like "Ameeri ke shor mein gareeb ki awaaz kho jaati hai" cut straight to the core conflict, and viewers are left to wonder, in a System where influence can outweigh truth, has Power killed Justice or does it still stand a chance? Find out when System premieres exclusively on Prime Video on May 22!   Ashwiny Iyer Tiwari, the director and co-writer of System shared, “As a filmmaker every story I have told is an act of bravery. Stories that inspire me creatively, break barriers  and sometimes they are deeply personal. System like all my movies shares similar values that challenges me to evolve with my craft with authenticity. Movies that I hope will  live beyond my lifetime. She further added, “I am immensely grateful that Prime Video along with Baweja Studios believed in my vision. With Sonakshi Sinha and Jyotika, two powerful actors at the heart of the narrative, I hope that System will not only entertain but also spark a conversation among viewers in India and around the world, when it premieres on Prime Video on May 22.”   Sonakshi Sinha, who plays Neha, an ambitious public prosecutor, shared, “Playing this character has been deeply rewarding. I’m always drawn to stories that challenge me as an actor, and Prime Video has given me the opportunity to explore diverse genres and themes—from Dahaad to now System. This original movie is more than just a legal drama; it reflects the society we live in, where justice can sometimes be as divided as the social structures around us. Ashwiny’s clear vision helped me bring out my best and I’m excited to see how audiences respond when System premieres on Prime Video on May 22.”   Known for her versatility, Jyotika, who plays the role of Sarika, a courtroom stenographer, said, “Portraying such a layered character in System was both exciting and challenging. The film explores the contrasts of modern India, where privilege and inequality coexist. Ashwiny brings a clear and engaging vision to the story, from well-developed characters to realistic settings. Being part of a Prime Original movie has been a great experience. Prime Video is known for sharing meaningful stories with audiences across India and globally, and I am glad System will reach so many people when it premieres on May 22.” Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కెరీర్‌లో ఒక భారీ మలుపు తీసుకోబోతున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. తన తదుపరి చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని, ఒక నూతన దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు తానే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హీరోగా, డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించబోతున్నారట. తన అన్న కృష్ణ చైతన్య పోతినేనితో కలిసి సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా ఒకే సినిమాకు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి.. రామ్ సంచలనానికి సిద్ధమవుతున్నారు.  ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఈ సినిమా కోసం 'ది లోన్ వోల్ఫ్' (The Lone Wolf) అనే టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. సామ్ సి.ఎస్ (Sam CS) ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉంది. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. గత చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. మరి దర్శకుడిగా విజయం సాధించి, తనలోని నటుడిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారేమో చూడాలి.  
'పెద్ది'(Peddi)ట్రైలర్ ఈ నెల 18 న రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ట్రైలర్ వేడుకని మధ్యప్రదేశ్ లోని భోపాల్‌ లేదా ముంబైలో నిర్వహించాలని మేకర్స్  ప్లాన్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా చేయనున్నారని అంటున్నారు.  కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత  ఫ్యాన్స్ జోష్ మరింత పెంచేలా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సదరు సాంగ్ సూపర్ గా వచ్చిందని, రెహ్మాన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడని అంటున్నారు. శృతి హాసన్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ కూడా సందడి చేయనుంది. Also read: veerabhadrudu: సరికొత్త వివాదంలో వీరభద్రుడు.. తెలుగు ఫ్యాన్స్ ఫైర్  జూన్ 4 వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న పెద్ది చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కింది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)సోషల్ మీడియా వేదికగా రోజుకొక అప్ డేట్ ఇస్తూ పెద్ది పై అంచనాలని రెట్టింపు చేస్తున్నాడు.  
టాలీవుడ్ సహజ నటి జయసుధ (Jayasudha) తాజాగా 'రమణి కళ్యాణం' (Ramani Kalyanam) చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. సూర్య వశిష్ట, దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం సమాజంలో మారుతున్న మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో 'రమణి కళ్యాణం' చిత్రాన్ని దర్శకుడు విజయ్ అదిరెడ్డి తెరకెక్కించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జయసుధ టీజర్‌ను విడుదల చేసి తన మనసులోని మాటను పంచుకున్నారు. "సినిమా అంటే కేవలం రంగులు, హంగులు మాత్రమే కాదు.. మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను ప్రతిబింబించేలా ఉండాలి. 'రమణి కల్యాణం' టీజర్ చూస్తుంటే ఆ ఫీల్ కనిపిస్తోంది. చిన్న సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందని ఆశిస్తున్నాను" అని జయసుధ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కొత్త తరం నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను జయసుధ అభినందించారు. సినిమాటోగ్రఫీ బాగుందని కొనియాడారు. అలాగే హీరో సూర్య వశిష్ట, హీరోయిన్ దీప్షిక తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని ఆమె తెలిపారు. 54 ఏళ్ల సినీ ప్రయాణం నాది.. కొత్త తరంతో కలిసి ఇలా సినిమా వేడుకలో పాల్గొనడం బ్లెస్సింగ్ అని జయసుధ అన్నారు. శ్రీనివాస రెడ్డి, చైతు జొన్నలగడ్డ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ హార్ట్ టచింగ్ డ్రామా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.   
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తదుపరి సినిమాపై ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నానితో 'సరిపోదా శనివారం' వంటి హిట్ అందుకున్న తర్వాత, ఈ యంగ్ డైరెక్టర్ ఎవరితో జతకట్టబోతున్నారనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వివేక్ ఆత్రేయ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాస్ మహారాజా రవితేజతో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. నిజానికి వివేక్ ఆత్రేయ తొలుత నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా దాదాపు ఖాయమనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అయితే, బాలయ్య ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివేక్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళింది. బాలయ్య కాల్షీట్లు దొరకడం కష్టమని భావించిన దర్శకుడు, వేచి చూడకుండా తన తదుపరి అడుగులు వేగంగా వేశారు. బాలయ్యతో సినిమా అటకెక్కడంతో వివేక్ ఆత్రేయ వెంటనే మాస్ రాజా రవితేజను సంప్రదించారు. అయితే బాలయ్య కోసం రాసుకున్న కథతో కాకుండా, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే మరో కొత్త కథను ఆయనకు వినిపించారు. ఈ వైవిధ్యమైన కథాంశం రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ మార్క్ ట్రీట్‌మెంట్‌కు రవితేజ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' సినిమాతో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గతంలో 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి సినిమాలతో తనదైన శైలిని చాటుకున్న వివేక్, రవితేజను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఈ క్రేజీ కాంబోపై సోషల్ మీడియాలో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. మాస్ రాజా అభిమానులు వివేక్ ఆత్రేయ రైటింగ్ అండ్ టేకింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అటు రవితేజ ఇరుముడి, ఇటు వివేక్ ఆత్రేయ నయా ప్రాజెక్ట్.. రెండూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
  ఎప్పుడు ఎవరితో ఏ అవసరం ఏర్పడుతుందో తెలియదు. కాబట్టి అనవసరంగా ఎవర్ని ద్వేషించకూడదు,దూషించకూడదు. కానీ ఒక వేళ అనవసరంగా ఎవరినైనా ద్వేషించినా, దూషించినా సూర్య వన్ మాన్ షో  వీరభద్రుడుకి వచ్చిన పరిస్థితే వస్థుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వీరభద్రుడు(Veerabhadrudu)తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 14 న రిలీజ్ అవుతుండటంతో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆర్ జె బాలాజీ గతంలో ఒక ఇంటర్వ్యూ లో మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుతు తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదు. హీరోల ఎలివేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొంత మందైతే ఒక అడుగు ముందుకేసి మన తెలుగు సినిమాని అవమానించి  ఇప్పుడు తన సినిమాని చూడమని ఎలా అడుగుతాడనే కామెంట్స్ చేస్తున్నారు.   Also read: Raviteja: నిర్మాతలకు అండగా రవితేజ సాహసోపేత నిర్ణయం.. సుమారు 10 కోట్లు కోత! ఈ విషయంపై సినీ విశ్లేషకులు స్పందిస్తు ఆర్ జె బాలాజీ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో సదరు విషయంపై బాలాజీ స్పందించి మాట్లాడాలని లేదంటే వీరభద్రుడుపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాలాజీ స్పందిస్తాడేమో చూడాలి. నిన్న జరిగిన ఈవెంట్ లో మాత్రం తెలుగు ప్రేక్షకులపై, హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ రామ్ చరణ్  కి వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు       
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్‌ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది. ముంబైలో పెద్ది హంగామా! పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్‌లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్‌ రిలీజ్ చేయనున్నారని సమాచారం.  సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో..  రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్‌, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్. డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని! టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ రెమ్యూనరేషన్‌లో భారీ కోత! తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్! తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సినిమాకు కొత్త తలనొప్పి! కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్‌జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. విడాకుల బాటలో మౌనీ రాయ్ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.  
Telugu actress Seerat Kapoor is making headlines, not for a movie update, but for delivering a brutal reality check to toxic fan culture. Over the weekend, the actress posted a glamorous picture of herself in a brown outfit on Instagram. While the post received the usual flood of compliments, one user crossed the line by commenting, "Allu Arjun property." The derogatory remark traces back to April, when Seerat sparked massive online buzz by sharing photos with Allu Arjun aboard his private jet to celebrate the superstar's 44th birthday. However, instead of ignoring the misogynistic comment on her recent post, she decided to set the record straight with a sharp, dignified response. Hitting back at the troll, Seerat wrote, “Adding a '😍' doesn't make it sound respectful, Sir. A woman is never anyone's property. She's her own person, with her own identity, dreams & voice. Admire with dignity, not ownership. Stay blessed.” Her response immediately went viral, earning massive support across social media platforms for standing up against the objectification heroines frequently face from star-worshipping fanbases. The user quickly deleted the comment, but the incident has sparked a much-needed debate about boundaries and the toxic behavior of overzealous fans in the industry. It was a perfect, no-nonsense comeback that proved she refuses to be reduced to just a superstar's accessory.   Disclaimer:The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్ మరియు విజువల్ వండర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సాంకేతికత అంతగా అందుబాటులో లేని కాలంలోనే 'అమ్మోరు', 'దేవి' వంటి చిత్రాలతో అద్భుతాలు సృష్టించిన ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో ప్రతిష్టాత్మక చిత్రం 'దేవిపుత్రుడు'. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, ఎం.ఎస్. రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ సినిమా ఎందుకు పరాజయం పాలైందనే విషయంపై తాజాగా నిర్మాత ఎం.ఎస్. రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం 'క్లైమాక్స్' అని ఎం.ఎస్. రాజు విశ్లేషించారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే హీరో వెంకటేష్ క్లైమాక్స్ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. సినిమా మొదటి సగం మరియు ద్వారక నగరం వంటి అంశాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, చివరి 45 నిమిషాల విషయంలో వెంకటేష్‌కు కొన్ని సందేహాలు ఉండేవని రాజు తెలిపారు. "క్లైమాక్స్ మార్చితే తప్ప సినిమా షూటింగ్ మొదలుపెట్టొద్దు" అని వెంకటేష్ సూచించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ సూచన మేరకు దర్శకుడు కోడి రామకృష్ణ మరియు ఎం.ఎస్. రాజు కలిసి పలువురు రచయితలతో క్లైమాక్స్ మార్పు గురించి చర్చలు జరిపారు. కానీ, ఆ కథకు తగిన ప్రత్యామ్నాయ ముగింపు ఏదీ సెట్ కాలేదు. చివరకు మరే దారి లేక కోడి రామకృష్ణ మొదట అనుకున్న క్లైమాక్స్‌తోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంకటేష్‌కు ఈ విషయంలో పెద్దగా ఇష్టం లేకపోయినా, నిర్మాత మరియు దర్శకుడి మీద నమ్మకంతో షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ భయపడినట్లుగానే ప్రేక్షకులు క్లైమాక్స్‌ను రిసీవ్ చేసుకోలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఉన్న ఫీల్ చివరి వరకు కొనసాగకపోవడంతో అది 'స్పీడ్ బ్రేకర్'లా మారిందని విశ్లేషకులు భావించారు. దాదాపు 15 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం 5 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించి నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అయినప్పటికీ, తెలుగు సినిమాలో ఇలాంటి సరికొత్త ప్రయోగం చేసినందుకు తనకు సంతృప్తిగానే ఉందని ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు. 'దేవిపుత్రుడు' ఒకవేళ సరైన క్లైమాక్స్‌తో వచ్చి ఉంటే నేడు రాజమౌళి చిత్రాల స్థాయిలో ఒక క్లాసిక్‌గా నిలిచేదని అభిమానుల అభిప్రాయం. ఒక చిన్న పొరపాటు ఎంతటి భారీ ఫలితాన్ని తారుమారు చేస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఏది ఏమైనా, టెక్నాలజీ పరంగా దేవిపుత్రుడు తెలుగు సినిమా గర్వించదగ్గ ప్రయత్నాలలో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఖచ్చితంగా, లైపోసెక్షన్ మరియు టమ్మీ టక్ గురించి మీ వెబ్‌సైట్ కోసం పాఠకులను ఆకట్టుకునేలా మరియు భావోద్వేగాలను స్పృశించేలా రూపొందించిన సమాచారం ఇక్కడ ఉంది: మీ కలల రూపం మీ సొంతం: లైపోసెక్షన్ మరియు బాడీ కాంటౌరింగ్ గురించి పూర్తి అవగాహన మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పదిమందిలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోలేక, బాడీ షేప్ సరిగ్గా లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందరికో ఎదురవుతుంటాయి. మీ ఈ ఆవేదనను అర్థం చేసుకుని, మీకు సరైన ఆకృతిని ఇచ్చే అద్భుతమైన ప్రక్రియే 'లైపోసెక్షన్'. మనం ఈ చికిత్స ఎందుకు చేయించుకోవాలి? (Why Should We?) లైపోసెక్షన్ అనేది కేవలం కొవ్వును తీసేయడం మాత్రమే కాదు, అది మీ శరీరానికి ఒక కొత్త రూపాన్ని, మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మొండి కొవ్వు నుండి విముక్తి: వ్యాయామంతో తగ్గని లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్, మరియు చేతుల దగ్గరి కొవ్వును ఇది సులభంగా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుదల: ముఖ్యంగా యువతలో గైనకోమాస్టియా (పురుషులలో ఛాతి పెరగడం) వంటి సమస్యల వల్ల కలిగే మానసిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. సరైన శారీరక ఆకృతి: హై డెఫినిషన్ లైపోసెక్షన్ ద్వారా జిమ్‌కు వెళ్లినప్పుడు వచ్చే సహజమైన బాడీ లైన్స్‌ను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: పొట్ట భాగం కిందకు సాగిపోవడం వల్ల వచ్చే అలర్జీలు, రాషెస్ మరియు అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. లైపోసెక్షన్ ఎలా చేస్తారు? (How it works?) ఇది చాలా సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. చిన్న గాటు: కేవలం 1.5 నుండి 2 mm వరకు ఉండే అతి చిన్న రంధ్రం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాట్ సక్షన్: ఒక చిన్న ట్యూబ్ సహాయంతో శరీరంలోని అదనపు కొవ్వును బయటకు సక్ (Suck) చేస్తారు. త్వరిత కోలుకోవడం: సర్జరీ జరిగిన రోజే లేదా మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు రోజుల తర్వాత మీ సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. టమ్మీ టక్ (Tummy Tuck): పొట్ట భాగం మరీ ఎక్కువగా సాగిపోయిన వారికి ఆ అదనపు చర్మాన్ని తీసేసి, బొడ్డును కూడా సరిచేసి మంచి షేప్ ఇస్తారు. ఏం చేయకూడదు? (What Not to Do?) లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బరువు తగ్గడానికి కాదు: లైపోసెక్షన్ అనేది బరువు తగ్గడానికి చేసే చికిత్స అని నమ్మవద్దు; ఇది కేవలం శరీర ఆకృతిని (Body Shaping) మార్చడానికి మాత్రమే. ధూమపానం వద్దు: సర్జరీకి 2-3 వారాల ముందు మరియు తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అన్-సర్టిఫైడ్ డాక్టర్లు వద్దు: అనుభవం లేని వారితో కాకుండా, కేవలం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారానే ఈ చికిత్స చేయించుకోవాలి. నియమాలను అతిక్రమించవద్దు: డాక్టర్ సూచించిన లిమిట్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయమని ఒత్తిడి చేయకూడదు, అది ప్రమాదకరం కావచ్చు. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: లైపోసెక్షన్ సురక్షితమేనా?  జ: అవును, అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నియమిత పరిమితుల్లో చేయించుకుంటే ఇది 100% సురక్షితం. ప్ర: సర్జరీ తర్వాత మచ్చలు కనిపిస్తాయా?  జ: లైపోసెక్షన్ రంధ్రాలు చాలా చిన్నవి కాబట్టి మచ్చలు తెలియవు. టమ్మీ టక్ చేసినా ఆ గీత మీ ఇన్నర్ వేర్ లైన్ లోపలికే ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. ప్ర: సర్జరీ తర్వాత మళ్ళీ కొవ్వు చేరుతుందా?  జ: సర్జరీ తర్వాత హెల్దీ డైట్ పాటించడం మరియు డాక్టర్ సూచించిన విధంగా 4-6 వారాల పాటు కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందంగా కనిపించాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఈ అద్భుత చికిత్సలతో మీ కలల రూపాన్ని పొందడం ఇప్పుడు సులభం. భయపడాల్సిన అవసరం లేదు, సరైన నిపుణులను సంప్రదించి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)