బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని  షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.  అంతే కాదు అన్ని విధాలుగా అసహాయంగా మిగిలిపోవడం వల్లనే భారత్ కాళ్లా వేళ్లా పడి  కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని కూడా బేలగా చెప్పేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్  లో భాగంగా ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత.. మే 10 తెల్లవారు జామున రెండున్నర గంటలకు పాకిస్థాన్ వైమానిక స్థావరంపై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందనీ, ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు.  ఇదే పాక్ ప్రధాని నిన్న మొన్నటి వరకూ భారత్ ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అనీ, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలకు కారణమైన ఆ ఆపరేషన్ ను విజయవంతంగా ఫెయిల్ చేశామనీ, భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందనీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయితే అవన్నీ బుకాయింపులేనని అంగీకరిస్తూ ఇప్పుడు వాస్తవాన్ని ప్రకటించారు. భారత్ కచ్చితత్వంతో దాడులకు పాల్పడిందనీ, ఆ దాడులలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైందనీ అంగీకరించేశారు. అయితే  దాడుల కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ఇప్పటికీ దాచిపెడుతున్న ఆయన భారత్ తో యుద్ధాలు గెలవలేమని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఇక చర్చలు మార్గమని తేల్చేశారు.  వాస్తవానికి  భారత్ దాడులలో పాకిస్థాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లు ధ్వంసమైనట్లు సమాచారం ఈ దాడులలో  పాకిస్తాన్ సైనికులతో పాటు, టర్కీ సైనికులు కూడా మృతి చెందారు. 
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో కీలక నాయకులూ, అందునా దగ్గరి బంధువులు అయిన వారిరువురూ భేటీ కావడం వాస్తవానికి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో వారిరువురి భేటీయే అత్యంత ప్రధాన వార్తగా మారిపోయింది. మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోయి.. ఇప్పుడు చర్చంతా వారిద్దరి రెండు గంటల భేటీపైనే కేంద్రీకృతమై ఉంది.  ఇందుకు కారణం లేకపోలేదు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం, త్వరలో పార్టీ పగ్గాలు తన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించనున్నారన ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. అదీ కాకుండా ఒక ప్రణాళిక మేరకు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.  ఇటీవల బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో జరిగిన  భారీ సభ సందర్భంగా హరీష్ రావుకు ఇసుమంతైనా ప్రాధాన్యత లభించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేయనున్నారనీ, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదంతా అవాస్తవ ప్రచారం అంటూ హరీష్ రావు ఇచ్చిన వివరణ కూడా ఆ ప్రచారం మరింత జోరందుకోవడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించలేదు. హరీష్ రావు కారు దిగి, వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో వాటిని పార్టీయే కాదు.. ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకు కారణం కేసీఆర్. కేసీఆర్ ను కాదని హరీష్ రావు పక్క చూపులు చూస్తారంటే ఎవరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్  పోలిటికల్ గా యాక్టివ్ గా లేరు. పార్టీ వర్గాలే ఆయన ఇక పార్టీ పగ్గాలను తన రాజకీయవారసుడికి అప్పగించేసి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారంటున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో  జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫొటోనే కనిపించలేదు. దీంతో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖారరైపోయిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది.  ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా  వెలుగొందని హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి, ఆయన స్థాయికి తగ్గ గౌరవం కూడా ఇవ్వడం లేదన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేస్తుంటే మౌనంగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసీఆర్ తనయ, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మాటేంటంటూ గొంతెత్తడం మొదలెట్టారు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడటంతో పార్టీలో లుకలుకలు ఉన్నాయనీ, అవి కూడా కేసీఆర్ కుటుంబం నుంచే మొదలయ్యాయన్న భావన అందరిలో వ్యక్తం అయ్యింది.  ఈ తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అ భేటీలో  ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వెల్లడించలేదు. అయినా భేటీ చుట్టూ ఊహాగాన సభలు మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి.  అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. హరీష్ రావు, కేటీఆర్ ల భేటీపై రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మళ్లీ పార్టీలో ఇటీవలి కాలంలో హరీష్ రావుకు తగ్గుతున్న ప్రాధాన్యతే అనడంలో సందేహం లేదు.  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో హరీష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం, పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా ఎక్కడా హరీష్ రావు పేరు వినిపించకపోవడం, ఫొటో కనిపించకపోవడంపై కేటీఆర్ హరీష్ కు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారనీ, విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలన్న ప్రతిపాదన చేశారనీ అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురి మధ్యా విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిన తరువాతే పార్టీ పగ్గాల అప్పగింత ఉంటుందన్న కేసీఆర్ విస్పష్టంగా చెప్పి కే టీఆర్ ను హరీష్ నివాసానికి పంపారని కూడా అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేసీఆర్ ఈ ముగ్గురితోనూ భేటీ  అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మొత్తం మీద పార్టీలో లుకలుకలు, చీలిక వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారని చెబుతున్నారు. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన పార్టీ నేతలే కాదు, ఉన్నతాధికారులూ చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలూ, సూచనలూ స్వీకరించరు. తోచింది చేసేస్తారు. వాటి పర్యవశానాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనను నమ్ముకున్న వారూ నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సీతయ్య ఎవడి మాటా వినడు అని. జగన్ సీతయ్యకు మించి..ఆయన కూడా ఎవడి మాటా వినరు. వినకపోవడమే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. ఔను.. ఈ విషయం ఎవరో కాదు.. గతంలో  జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట. ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ, ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, ముందు వెనుకలు ఆలోచించరనీ, ఎవరైనా చెప్పినా వినరనీ, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారపై ఫైర్ అయిపోతారనీ చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకూ, ఆయన పార్టీకీ కూడా భారీగా డ్యామేజి జరిగిందని వివరించారు.  జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారనీ, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరనీ వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వీ చెప్పారు.   ఇందుకు జగన్ తీసుకువచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని అయన అన్నారు. జగన్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక, మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గలేదు. అధికారులు ఏమైనా చెప్పబోయినా, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేది లేదు. అని కరాఖండీగా చెప్పేసి వాళ్ల నోళ్లు మూయించే వారని ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వవరించారు. జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారనీ, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారనీ కూడా ఎల్వీ వివరించారు. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వోద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారిని ఎల్వీ గుర్తు చేసుకునే వారు. ఒక రాజకీయ  నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు.  ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైనా  సీరియస్ నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు. జగన్ ముందు చూపు లేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనీ, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనీ వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలూ కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.  మొత్తం మీద జగన్ ప్రభుత్వ పనతానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు. 
ALSO ON TELUGUONE N E W S
ఒక వర్గం ప్రజలు 'కృష్ణజింక'(Krishna Jinka)అనే ఒక జంతువుని అత్యంత పవిత్రంగా పూజిస్తారు. ఈ కృష్ణ జింకని 1998 వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్(Salman Khan)వేటాడి చంపాడని, రాజస్థాన్(Rajasthan)కోర్టు నిర్దారించి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తు 2018 ఏప్రిల్ నెలలో తీర్పుని ప్రకటించింది. ప్రస్తుతం ఈ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కృష్ణజింక విషయంలోనే గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ బెదిరింపులు కూడా ఎదుర్కుంటున్నాడు.  ఇక కృష్ణ జింక ని వేటాడి చంపిన కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో సల్మాన్ తో పాటు టబు(Tabu),సైఫ్ అలీ ఖాన్(Saif Ali khan)నీలం, సోనాలి బింద్రే(Sonali Bendre)వంటి తారల పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే కోర్టు సల్మాన్ ని మాత్రమే దోషిగా తేలుస్తు, మిగతా వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఈ తీర్పుని వ్యతిరేకిస్తు రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా  హైకోర్టుని ఆశ్రయిస్తు పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు తదుపరి విచారణని జులై 28 కి వాయిదా వేసింది. ఇటీవల పహల్ గామ్ పై పాకిస్థాన్ కి చెందిన తీవ్రవాదులు దాడి చేసి ఇరవై మూడు మందిని చంపడం, మన వాళ్ళు ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించి తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది. దీంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ టైంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు పెద్దగా  స్పందించిన దాఖలాలు లేవు. బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదాలు కూడా సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేసారు. అలాంటి ఈ సమయంలో  ఏడు సంవత్సరాల క్రితం జిల్లా కోర్టు టబు, సైఫ్ అలీ ఖాన్, నీలం, సోనాలి బింద్రే ని నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత, రాజస్థాన్ ప్రభుత్వం కృష్ణ జింక కేసులో హైకోర్టులో పిటిషన్ వెయ్యడం ఇండస్ట్రీ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది.      
ఇటీవలి కాలంలో కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తుండగా, మరికొన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈమధ్యకాలంలో అందరి దృష్టినీ ఆకర్షించిన బయోపిక్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే. ఈ చిత్రాన్ని నితిన్‌ కక్కర్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.కార్తికేయ, వరుణ్‌ గుప్తా నిర్మిస్తున్నారని, ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. మరోపక్క బాలీవుడ్‌లో ఇదే బయోపిక్‌పై ప్రచారం జోరందుకుంది. ఆమిర్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణి కాంబినేషన్‌లో దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. వినిపిస్తున్న ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై దాదా సాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ క్లారిటీ ఇచ్చారు.  ‘మా తాతగారి బయోగ్రఫీ రాజమౌళి సమర్పణలో చేయబోతున్నారనే వార్త నేను కూడా విన్నాను. అయితే రాజమౌళి టీమ్‌ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. ఎవరైనా ప్రముఖుడి జీవిత చరిత్రను తెరకెక్కించాలంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఎందుకంటే వారికి తెలిసినన్ని విశేషాలు బయటి వారికి తెలియవు కదా. ఈ విషయంలో ఆమిర్‌ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణి నన్ను చాలా సార్లు సంప్రదించారు. వారి టీమ్‌ నాతో మూడు సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతోంది. తాతగారి గురించిన చాలా విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ బయోపిక్‌ను ఎంతో సిన్సియర్‌గా అటెమ్ట్‌ చేస్తున్నారనిపిస్తుంది. ఆమిర్‌ఖాన్‌ చాలా మంచి నటుడు. ఆయన ఈ పాత్ర పోషించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు.  దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌కి సంబంధించి బాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఆమిర్‌ఖాన్‌, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం జూన్‌ 20న విడుదల కాబోతోంది. అక్టోబర్‌లో ఫాల్కే బయోపిక్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట. భారత స్వాతంత్య్ర పోరాటం, భారతదేశంలో సినిమా ఎలా పుట్టింది అనే అంశాలతో ఈ బయోపిక్‌ రూపొందిస్తారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్‌, రాజమౌళి ఈ బయోపిక్‌ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అర్థమవుతోంది. కేవలం ఈ ప్రాజెక్ట్‌ గురించి ప్రచారం మాత్రమే జరిగిందని తెలుస్తోంది. 
Ajith Kumar has a huge following all over not just confining to Tamil Nadu. The actor needs a big film that really stands up to the expectations his fans and common audiences have on him. His recent Good Bad Ugly, showcased his star power and pull again in a big way. The actor shocked many with his weight loss.  Talking about it in an interview, he stated that he reduced 42 kgs in 8 months from August 2024, to support his racing career. He also stated that he realised his fitness is crucial to continue racing and acting careers at the best of his capabilities. Hence, he reduced weight with balanced diet combined with swimming and workouts.  Ajith also shared that he became a teetotaller and took to complete vegetarianism to help him in this process. He also stated that it worked for him as he took a concious decision to improve his fitness and focus on his life goals.  He later shared that his acting career will not be affected by racing and he has plans for next 6 years. He also stated that his next will start shoot around November and wishes to release it by Summer, next year. 
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన హృతిక్ రోషన్(Hrithik Roshan)ట్వీట్ చేస్తు 'ఎన్టీఆర్ పుట్టిన రోజుకి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టుగా తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి  మొదలైంది. రీసెంట్ గా ఈ ట్వీట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇస్తు 'కబీర్ నిన్ను వేటాడి, నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు వేచి  చూస్తున్నాను  అని ట్వీట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఇద్దరు కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టిస్టారర్ గా వార్ 2(War 2)తెరకెక్కుతుంది.దీంతో వార్ 2 నుంచి ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వార్ 2 ని నిర్మిస్తుండగా  కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. అయాన్ ముఖర్జీ  దర్శకుడు కాగా  ఆగస్టు  14 న  వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ నటించిన వార్ కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది.    
  ఈ ఏడాది 'తండేల్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య.. తన తదుపరి సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'NC24' అనేది వర్కింగ్ టైటిల్. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఎస్.వి.సి.సి. బ్యానర్ లో మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'NC24' నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెరిగేలా చేస్తోంది.   'NC24' కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ గుహ సెట్ వేశారు. ఈ సెట్ చూడటానికి ఎంత సహజంగా ఉందో, అంతే అద్భుతంగా ఉంది. ఈమధ్య ఈ తరహా సినిమాలన్నీ ఎక్కువగా గ్రాఫిక్స్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. కానీ, 'NC24' టీం మాత్రం సహజత్వం కోసం ఇంత భారీ సెట్ ని ఏర్పాటు చేశామని చెబుతోంది. ఈ సెట్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా చిత్రీకరణ 18 రోజుల పాటు జరగగా, 10 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.   'విరూపాక్ష' నిర్మాణంలో భాగమైనట్లుగానే.. 'NC24' నిర్మాణంలోనూ సుకుమార్ భాగమయ్యారు. స్క్రిప్ట్ పరంగా ఆయన పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, 'విరూపాక్ష'ను మించిన మ్యాజిక్ చేయడం ఖాయమని చెబుతున్నారు.    ఇందులో చైతన్య ట్రెజర్ హంటర్ గా కనిపించనుండగా, దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి కనిపించనుంది. 'NC24'లో హీరో పాత్రకి సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటుందట. స్క్రీన్ టైం పరంగా చూస్తే హీరో కంటే మీనాక్షి పాత్ర కొద్ది నిమిషాలు ఎక్కువ కనిపిస్తుందని అంటున్నారు.    ఇప్పటిదాకా చైతన్య కెరీర్ లో తండేల్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా, ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో 'NC24' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అప్పుడే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఆఫర్స్ భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది.  
The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Riding on this growing excitement, the team is now gearing up to unveil the much-anticipated third single along with the official trailer of the film. With the trailer’s release, anticipation is expected to soar to new heights, setting the stage perfectly for what's to come. Crafted on an epic scale, Hari Hara Veera Mallu is now racing toward its final stages, with post-production in full swing. From intense VFX work to immersive sound design and dubbing, the film is undergoing its finishing touches at lightning speed. Director A.M. Jyothi Krishna, who took over the reins amidst delays, has been tirelessly steering the ship across departments, ensuring that every moment on screen lives up to the film’s legendary ambition. Backed by a dream crew, Oscar-winner M.M. Keeravani’s powerful score, Manoj Paramahamsa’s breathtaking visuals, and Thota Tharani’s majestic production design, this film is built to leave audiences awestruck.   An epic cast including Bobby Deol as the fearsome Mughal ruler, Nidhhi Agerwal in a striking lead, and seasoned actors like Satyaraj and Jisshu Sengupta who bring gravity and charisma to this saga. With a massive worldwide release across Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam, Hari Hara Veera Mallu is poised to conquer hearts and box offices alike. Produced by A. Dayakar Rao. Presented by A.M. Rathnam under Mega Surya Productions. Mark your calendars, This June 12th, 2025. The legend arrives.
  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' విడుదలై ఏడాది దాటిపోయింది. ఇంతవరకు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని చేయాల్సి ఉంది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, అట్లీ ప్రాజెక్ట్ తో అల్లు అర్జున్ బిజీ కావడంతో.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి జరిగింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. వెంకటేష్, శివకార్తికేయన్ వంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ (Ram Charan) పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. (Pawan Kalyan)   పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగానూ వ్యవహరించారు. సినిమాల పరంగానే కాకుండా, పర్సనల్ గానూ వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తన మిత్రుడు పవన్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథని సిద్ధం చేశాడట. అయితే ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్.. కొత్త సినిమాలను కమిట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆ కథను చరణ్ తో చేయమని సూచించాడట. ప్రస్తుతం త్రివిక్రమ్-చరణ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.   రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ మూవీ కమిటై ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. సుకుమార్ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరణ్ తో సుకుమార్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చరణ్ చూస్తున్నాడట. అది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. దీనిని త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే అవకాశముంది.  
సూర్య(Suriya)పూజాహెగ్డే(Pooja hegde)జతగా ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రెట్రో(Retro). తొంభైవ దశకానికి చెందిన కథనాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రొమాంటిక్ మూవీ తెలుగు నాట పెద్దగా ప్రేక్షాదరణ పొందకపోయినా తమిళనాట మంచి విజయాన్నే అందుకుంది. 100 కోట్ల రూపాయిల వసూళ్ళని తమిళనాట అందుకోవడమే ఇందుకు నిదర్శనం.   ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో సదరు సంస్థ ఈ మూవీని జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకువస్తుందనే టాక్ సినీ సర్కిల్స్ లో  చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు వస్తున్నాయి.జూన్ 5 ఖాయమైతే కనుక     అతి తక్కువ వ్యవధిలోనే ఓటిటిలోకి అడుగుపెట్టిన సూర్య మూవీ రెట్రోనే  కావచ్చు.  కార్తీక్ సుబ్బరాజ్(Karthik SUbbaraj)దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జాజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, శ్వాసిక, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.  జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి?? చదువు! సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి.  ఉద్యోగం! ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు.  ఆర్థిక విషయాలు! చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు. ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్! ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యతలు! అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు.  అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.    
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...