మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో అప్పుడెప్పుడో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 45 గంటలపాటు ధ్యానానికి కూర్చోవడం ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేం. 45 గంటలు ధ్యానం చేసే సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడరట. కేవలం ద్రవ పదార్ధాలే తీసుకుంటారట. అద్భుతం. మోడీ గారు కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో కూర్చున్న ఫొటోలు చూసి భారతీయుల హృదయాలు పులకరించిపోతున్నాయి. స్వామి వివేకానంద 2 పాయంట్ ఓ ని చూసినట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, స్వామి వివేకానందే ఈ దేశాన్ని మరోసారి ఉద్ధరించడం కోసం నరేంద్ర మోడీ రూపంలో అవతరించారా అనిపిస్తోంది. మనందరి అదృష్టం బాగుంది కాబట్టే నరేంద్ర మోడీ లాంటి యోగి పుంగవుడు మనకు ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆయన ఇలా భారీ స్థాయిలో ధ్యానం చేయడం సహజమేనేమో. ఎందుకంటే, 2019లో ఎన్నికలు ముగియగానే హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక గుహలో అద్భుతంగా ధ్యానం చేశారు. ఆ సందర్భంలో ఆయన ఫొటోలు చూస్తుంటే, మహావతార్ బాబా అంటే మరెవరో కాదు.. నరేంద్ర మోడీనే అనిపించింది. పాపం మోడీ గారు ఏర్పాటు చేసుకోరుగానీ, ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో ఎవరో అద్భుతంగా ఫొటోలు తీసి బయటి ప్రపంచానికి పంపిస్తూ వుంటారు. అంతా మన భారతీయుల అదృష్టం.  సాధారణంగా ధ్యానం అనేది ఎవరైనా గుట్టుగా చేసుకుంటారు. కానీ, మెడిటేషన్ అలా గుట్టుగా చేయకూడదని, ఆ ధ్యాన పరిమళాలు అంతటా వ్యాపించేలా చేయాలని నరేంద్ర మోడీ చాటారు. 2019లో హిమాలయాల్లో గానీ, ఇప్పుడు కన్యాకుమారిలోగానీ మోడీ గారు చేసిన ధ్యానం న్యూసు, ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి. ఇలాంటి సందర్భాల్లో మోడీని చూస్తుంటే, ‘నమో నారాయణాయ’ మంత్రాన్ని గురువుగారు తన చెవిలో చెబితే, ఆ మంత్రం అందరికీ అందాలని గుడి గోపురం మీద ఎక్కి పెద్దగా ‘ఓం నమో నారాయణాయ’ అని అరిచిన రామానుజా చార్యులు గుర్తొస్తున్నారు. బహుశా.. రామానుజాచార్యుల వారి మరో అవతారం మోడీ గారేనేమో! హిమాలయాల్లో, కన్యాకుమారిలో మోడీ గారు ధ్యానం చేస్తుండగా తీసిన ఫొటోలు చూస్తుంటే, రెండు చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తూ వుంటుంది. ముఖంలో ఆ ప్రశాంతత, తేజస్సు, వర్చస్సు... అబ్బబ్బ.. మోడీ గారికి మోడీ గారే సాటి. చాలామంది ఇంట్లో కూర్చుని ధ్యానం చేయడానికే వీల్లేక డిస్ట్రబ్ అయిపోతున్నాం అంటారు.. మోడీ గార్ని చూడండి.. ఓపెన్ ప్లేసులో, జనాలు, కెమెరాల సమక్షంలో ఎంత బాగా ధ్యానం చేస్తున్నారో. ప్రపంచంలో వున్న ధ్యానులందరూ మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఒక్కమాట చెప్పి, ముగిద్దాం.. అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పోలీస్ ఆఫీసర్ కెరీర్ అంటేనే ఒడిదుడుకులు వుంటాయి. 35 సంవత్సరాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నానో, ఈ ఐదేళ్ళ కాలంలో కూడా అలాంటి వాటినే ఎదుర్కొన్నాను. ఈ ఐదేళ్ళ కాలంలోని ఏర్పడిన ఒడిదుడుకులను నేను ప్రత్యేకంగా చూడటం లేదు. అవన్నీ జీవితంలో ఒక భాగం. అన్యాయాన్ని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. సత్యం, నీతి వైపు వుంటే, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే  ఎప్పటికైనా విజయం సాధిస్తాం. ఐదేళ్ళపాటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాననే దానికంటే, అంతిమ విజయం సాధించడం ముఖ్యం. ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ‘వండర్‌ఫుల్’ అని చెప్తాను’’ అన్నారాయన.
సీనియర్, సిన్సియర్ ఐసీఎస్ ఆఫీసర్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన సర్వీసు చివరి రోజైన శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. ‘క్యాట్’ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. పోస్టింగ్ తీసుకున్న రోజునే రిటైర్మెంట్  కూడా తీసుకున్న అరుదైన ఘనతను ఏబీ వెంకటేశ్వరరావు సాధించారు. ఇదిలా వుంటే, ఏబీ వెంకటేశ్వరరావుకు పో్స్టింగ్ ఇవ్వాల్సి రావడాన్ని కొన్ని జగన్ భజన మీడియా సంస్థలు వార్తగా ఇచ్చి, ఆ వార్తలకు ‘ఏబీవీని కరుణించిన జగన్’ అని అర్థం వచ్చేలా హెడ్ లైన్స్ పెట్టారు. ఆ హెడ్డింగ్‌లేంట్రా వేస్ట్ ఫెలోస్.. ఏబీవీకి జగన్ కరుణించి పోస్టింగ్ ఇవ్వలేదు.. జగన్ ఇవ్వనుగాక ఇవ్వను అని పట్టుదల మీద వుంటే, ఏబీవీ పోరాడి సాధించుకున్నారు.  ఒకవేళ జగన్ కనుక శుక్రవారం నాడు పోస్టు ఇవ్వకపోతే కోర్టు  ధిక్కరణ నేరం కింద జగన్‌కి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సీన్ సీతారైపోయేది. రాజ్యాంగం అనేది ఒకటి వుందని, చట్టం ఒకటి వుందని మర్చిపోయారా? శుక్రవారం నాడు ఏబీవికి పోస్టు ఇవ్వకపోతే జగన్, జవహర్ రెడ్డి ఇద్దరూ అరెస్టు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం వుండేది కాదు. సిట్యుయేషన్ ఎంత సీరియస్‌గా వుందో తెలుసు కాబట్టి, జగను, ఆయన తోక సీఎస్ ఇద్దరూ అన్నీ మూసుకుని పోస్టింగ్ ఇచ్చారు. పరిస్థితి వాళ్ళ చేతులు దాటిపోయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వక తప్పలేదు. 
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాత్సవ, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, కృష్ణ చైతన్య తదితరులు సంగీతం: చైతన్ భరద్వాజ్ డీఓపీ: ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి బ్యానర్: హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల తేదీ: మే 31, 2024 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం 'గం గం గణేశా'. క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: అనాథ అయిన గణేష్(ఆనంద్ దేవరకొండ), తన స్నేహితుడు శంకర్(ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు.  ప్రేమించిన అమ్మాయి శృతి(నయన్ సారిక) తనని కాదని, డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో.. ఎలాగైనా తాను కూడా ధనువంతుడు కావాలనుకుంటాడు గణేష్. ఈ క్రమంలో ఏడు కోట్ల విలువైన డైమండ్ ను దొంగతనం చేసే డీల్ ఒప్పుకుంటాడు. కానీ దొంగతనం చేశాక.. అత్యాశకు పోయి ఆ డైమండ్ ను తానే అమ్మి డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆ డైమండ్ ని అమ్మడం కోసం చెన్నై వెళ్తుండగా మధ్యలో పోలీసు చెకింగ్ కి భయపడి.. అటుగా వస్తున్న లారీలోని వినాయకుడి విగ్రహం తొండంలో దానిని పడేస్తాడు. అయితే ఆ వినాయకుడి విగ్రహాన్ని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్) ఆర్డర్ మేరకు, ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించుకొని, రుద్ర (కృష్ణ చైతన్య) తీసుకెళ్తుంటాడు. అయితే కిషోర్ రెడ్డి ఊరికి చేరాల్సిన ఆ విగ్రహం.. అనూహ్యంగా అతని ప్రత్యర్థి నాయకుడి ఊరికి చేరుతుంది. అసలు ఆ వినాయకుడి విగ్రహం కథేంటి? అందులో ఉండిపోయిన డైమండ్ ను గణేష్ తిరిగి సంపాదించాడా? తెలియాలంటే సినిమా చూడాలి. విశ్లేషణ: ఒక విలువైన వస్తువు.. దాని చుట్టూ హీరో, విలన్ గ్యాంగ్ లు తిరగడం అనే పాయింట్ తో పలు సినిమాలు వచ్చాయి. 'గం గం గణేశా' కూడా ఆ కోవకు చెందినదే. ఈ సినిమాలో 'స్వామి రారా' ఛాయలు కనిపిస్తాయి. అయితే తెలిసిన కథే అయినప్పటికీ.. దానికి తనదైన కామెడీని, థ్రిల్ ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే ప్రథమార్థం మాత్రం సప్పగానే సాగింది. హీరో లైఫ్ స్టైల్, లవ్ ట్రాక్ ని చూపిస్తూ.. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. డైమండ్ దొంగతనం నుంచి అసలు కథ మొదలై, ఆసక్తికరంగా నడుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ మెప్పించాయి. ఓ వైపు కిషోర్ రెడ్డికి చెందిన విగ్రహం, మరోవైపు ఆ విగ్రహంలో ఉండిపోయిన గణేష్ కొట్టేసిన వజ్రం.. దానికితోడు ఆ విగ్రహం కిషోర్ రెడ్డి ప్రత్యర్థి ఊరికి చేరడంతో.. తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగిస్తూ ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. విగ్రహం కోసం కిషోర్ రెడ్డి గ్యాంగ్, హీరో గ్యాంగ్ వేసే ప్లాన్ లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే మధ్యలో ఆనంద్-ప్రగతి శ్రీవాత్సవ లవ్ ట్రాక్ మాత్రం.. ఇరికించినట్లుగా, కథ ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉంది. పతాక సన్నివేశాలు మెప్పించాయి. ఆదిత్య జవ్వాది కెమెరా పనితనం ఆకట్టుకుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: గణేష్ పాత్రలో ఆనంద్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. ఇందులో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఫస్టాఫ్ లో నయన్ సారిక, సెకండాఫ్ లో ప్రగతి శ్రీవాత్సవ అలా మెరిశారు. హీరో స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్ కి మంచి పాత్ర దక్కింది. దానిని ఇమ్మాన్యుయేల్ సద్వినియోగం చేసుకొని, బాగానే నవ్వించాడు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. రాజ్ అర్జున్, కృష్ణ చైతన్య, సత్యం రాజేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా... కథలో కొత్తదనం లేనప్పటికీ.. కొంచెం కామెడీ, కొంచెం థ్రిల్ ని పంచిన ఈ చిత్రాన్ని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 
పాన్ ఇండియా ప్రేక్షకుల  కట్టప్ప సత్యరాజ్. మొదటి ఇన్నింగ్స్ లో  హీరోగా రాణించి సెకండ్ ఇన్నింగ్స్ లో వర్సటైల్ యాక్టర్ గా అశేష ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. లేటెస్ట్ గా వెపన్ అనే మూవీతో వస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తి కరమైన విషయాల్ని వెల్లడించాడు. వెపన్ మూవీ జూన్ 7 న విడుదల కానుంది.ఇందులో 28 ఏళ్ళ వయసున్న వ్యక్తిగా  సత్య రాజ్ కనిపించబోతున్నాడు. ఏఐ టెక్నాలజీ ని ఉపయోగించి  ఆ విధంగా చూపిస్తున్నారు. ఇక సత్య రాజ్ మాట్లాడుతూ వెపన్ ఖచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పాడు. అదే విధంగా దర్శక ధీరుడు రాజమౌళి  గురించి కూడా మాట్లాడాడు. బాహుబలి లో కట్టప్ప క్యారక్టర్ ని ఇచ్చిన రాజమౌళికి  జీవింతాంతం రుణపడి ఉంటాను. అదే విధంగా రాజమౌళి మహేష్ మూవీ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.కానీ ప్రస్థుతానికి రాజమౌళి టీం నన్ను సంప్రదించలేదని  చెప్పాడు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రధాన మంత్రి  మోదీ బయోపిక్ లో నటిస్తున్నానే వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదని కూడా చెప్పాడు. సత్య రాజ్  వయసు ప్రస్తుతం 68 . మిలియన్ స్టూడియో బ్యానర్ పై  ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో వెపన్ తెరకెక్కింది. జైలర్ లో రజనీకాంత్ కొడుకుగా చేసిన  వసంత్ రవి, తాన్యా హోప్, మీమీ గోపి, రాజీవ్ మీనన్, షియాస్ కరీం, తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించగా గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.   
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతగా నటించి మెప్పించిన భామ అంజలి.. గత నెలలో  గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో  ఒక ముఖ్య పాత్రని పోషించింది. తాజాగా అగ్ర హీరో నందమూరి  బాలకృష్ణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. విశ్వక్ సేన్  హీరోగా  తెరకెక్కిన  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  కొన్ని రోజుల క్రితం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జరుపుకుంది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. అదే టైం లో విశ్వక్ తో పాటు  హీరోయిన్ నేహా, అంజలి, మిగతా నటీ నటులు, సాంకేతిక నిపుణులకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. ఈ ఫంక్షన్ లోనే  అంజలిని బాలకృష్ణ  చేత్తో  నెడతాడు.ఆయన సరదాగా అలా నెట్టాడనే విషయం ఫంక్షన్ మొత్తం ఫాలో అయిన వాళ్ళకి అర్ధం అవుతుంది. పైగా  అందరు చూస్తుండగానే  స్టేజ్ పైనే  అదంతా జరిగింది. కానీ కొంతమంది  అంజలి పట్ల బాలకృష్ణ దురుసు ప్రవర్తన అంటు అత్యుత్సాహంతో సదరు వీడియోని ప్రమోట్ చెయ్యడం మొదలుపెట్టారు. నేషనల్ లెవల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయ్యేలా అంజలి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.      బాలకృష్ణ గారు నేను ఎప్పటినుంచో  చాలా  స్నేహంగా ఉంటాం. ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. అదే విధంగా  ఈవెంట్ లో వాళ్ళిద్దరి    మధ్య జరిగిన  కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వీడియో రూపంగా చేసింది. బాలకృష్ణ  ఆమెతో నవ్వుతూ మాట్లాడటంతో పాటు  ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. బాలకృష్ణ, అంజలి లు జంటగా డిక్టేటర్ అనే మూవీలో చేసారు. అందులో ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోతుంది. డాన్స్ ల్లోను ఇద్దరి మధ్య బాండింగ్ సూపర్ గా ఉంటుంది. 2016 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  
Mass Ka Das Vishwak Sen has proven his versatility with different films in various genres. Now, he came with a gangster flick, Gangs of Godavari in the direction of Krishna Chaitanya.  Neha Sshetty and Anjali are playing female leads in the film produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively.  The film released in theatres today and it is getting mixed reactions everywhere. It is known that OTT giant Netflix bought the streaming rights for hefty price. The film will be available for streaming after 28 days theatrical run. Venkat Upputuri and Gopichand Innumuri are co-producing the film and Srikara Studios is presenting it. Anith Madhadi is handling cinematography and Navin Nooli is editing the film.
సినిమా పేరు: భజే వాయు వేగం  తారాగణం: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రవి శంకర్, తనికెళ్ళ భరణి ,రాహుల్ హరిదాస్, శరత్ లోహితస్వ, పృథ్వీరాజ్ తదితరులు  రచన, దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి  సంగీతం : రాధాన్ బ్యానర్  : యువి క్రియేషన్స్  నిర్మాతలు: వంశీ ,ప్రమోద్ మరియు అజయ్ కుమార్ రాజు   సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్   విడుదల తేదీ: మే  31 , 2024  ఆర్ఎక్స్ 100 తో యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ. గత కొంతకాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.  లేటెస్ట్ గా  భజే వాయువేగం అంటు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా యు వి క్రియేషన్స్ లాంటి అగ్ర సంస్థ నిర్మించడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం కథ మధ్య తరగతి కుటుంబానికి చెందిన  వెంకట్ (కార్తికేయ) చిన్నపటినుంచి పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటాడు. అందుకు తగ్గ అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. అనుకోకుండా  తండ్రి రాజయ్య (తనికెళ్ళ భరణి) అనారోగ్యం బారిన పడటంతో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. ఇంకో పక్క రౌడీ స్థాయి నుంచి హైదరాబాద్ నగరానికి మేయర్ అయిన  జార్జ్ (శరత్ ) అతని తమ్ముడు డేవిడ్ (రవిశంకర్) లు వెంకట్ ని చంపటానికి తిరుగుతుంటారు. పైగా  వెంకట్ మీద డ్రగ్స్  డీలర్ అనే ముద్రతో పాటు హత్య కేసు కూడా పడుతుంది.దీంతో వెంకట్ కోసం  పోలీసులు వెతుకుతుంటారు.   వెంకట్ కి జార్జ్, డేవిడ్ లకి సంబంధం ఏంటి? డ్రగ్స్ కేసు మర్డర్ కేసు వెనుక ఉన్న కథ ఏంటి?  అన్ని ప్రాబ్లమ్స్ నుంచి  ఎలా బయటపడ్డాడు?  చివరకి తన తండ్రి ఆపరేషన్ చేయించాడా?  అనేదే ఈ కథ ఎనాలసిస్  ఈ కథలో కొత్త దనం ఏముందని కార్తికేయ ఒప్పుకున్నాడో  గాని  సినిమా స్టార్ట్ అయిన అరగంటకే మనకి అనిపిస్తుంది  .  ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే అవసరం లేకపోయినా  తండ్రి కొడుకుల మధ్య కొంచం ఎక్కువ కథని నడిపాడు. ఎంతసేపు   ఆపరేషన్ కోసం డబ్బులని చెప్పించారు. అలా కాకుండా క్రికెటర్ అయిన హీరోకి క్రికెట్ లో అత్యునత స్థాయికి చేరుకోవాలంటే వచ్చే అడ్డంకులు గురించి చెప్పాల్సింది.పైగా హీరో కి క్రికెట్ మీద  బెట్టింగ్ లు వేసే  అలవాటు ఉందని చెప్పారు. కాబట్టి ఆ అంశం చుట్టూ  క్రికెట్ చుట్టు  ఫస్ట్ ఆఫ్ కథ అల్లుకుంటే బాగుండేది. హీరోయిన్ ని కూడా అందులో లింక్ చేస్తే బాగుండేది. హీరో మొదటి నుంచి కూడా డల్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక సెకండ్ ఆఫ్ ని చూసుకుంటే హీరోకి విలన్ కి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ తేలిపోయాయి. అన్యాయంగా తన మీద కేసులు పడుతుంటే వీర తాండవం చేయాల్సిన హీరో కామన్ మాన్ లా  మాములుగా ఉంటాడు. అలా కాకుండా  హీరో అనే పదానికి అర్ధం వచ్చేలా చేసుంటే బాగుండేది. పైగా ఎంత పేద వాళ్ళైనా ఈ రోజులో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అలాంటిది హీరో మాములు ఫోన్ వాడటం పెద్ద విచిత్రం. పైగా ఫోన్  మాట్లాడంలోనే  సెకండ్ ఆఫ్ సగం  నడిచింది.. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు కార్తికేయ పెర్ఫార్మన్స్  విషయానికి వస్తే  పెద్దగా నటనకి అవకాశం లేకుండా పోయింది. సెంటిమెంట్ సీన్స్ లో బాగా చేసినా కూడా సబ్జెక్టు వీక్ గా ఉండటం వలన తేలిపోయింది. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవాలిసిన  పని లేదు. కార్తికేయ తమ్ముడు గా చేసిన రాహుల్ చక్కగానే చేసాడు. ఇక తనికెళ్ల భరణి  రాజయ్య క్యారక్టర్ లో జీవించాడు.అలాంటి పెర్ ఫార్మ్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.  విలన్ గా చేసిన రవిశంకర్ ది రొటీన్ నటనే. మేయర్ గా చేసిన శరత్ లోహితస్వ రూపంలో తెలుగు తెరకి ఇంకో చక్కని విలన్ దొరికాడు. సాంకేతిక నిపుణల విషయానికి వస్తే ఆర్ ఆర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్ లో ఓపిగ్గా కుర్చున్నామంటే  ఆయన వల్లే. ఇక దర్శకుడు విషయానికి వస్తే  కొత్త దర్శకుడు  ఎవరైనా ఒక వెరైటీ కథ తో తెరంగ్రేటం చేస్తాడు. కానీ  ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథ తో వచ్చాడు.  అతని టేకింగ్ బాగానే ఉన్న  స్క్రీన్ ప్లే  మాత్రం రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంతంత మాత్రమే ఫైనల్ గా చెప్పాలంటే మరోసారి కార్తికేయ ని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగా అర్ధం తెలియలేదు.  2024 లో ప్రేక్షకాదరణ కష్టమే. రేటింగ్ : 2.5 / 5                                                                                          అరుణాచలం                                                                                                                                
Allari Naresh’s out-and-out family entertainer Aa Okkati Adakku is directed by debutant Malli Ankam and produced by Rajiv Chilaka under the banner of Chilaka Productions. Faria Abdullah played the leading lady opposite Allari Naresh. The film starring Vennela Kishore, Jamie Lever, Viva Harsha, and Ariyana Glory and others released in theatres on May 3rd. The film got mixed talk and ended up as average outing at box office. The film silently entered into OTT. Aa Okkati Adakku is available for streaming now on Amazon Prime Video. Enjoy this decent family entertainer in theatres now. Abburi Ravi is the writer, while cinematography is handled by Suryaa and music is scored by Gopi Sundar. Chota K Prasad is the editor of the movie, while J K Murthy is the art director.
తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, సాయి కుమార్, హైపర్ ఆది, పమ్మి సాయి, ప్రవీణ్ తదితరులు  సంగీతం:    యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి ఎడిటర్: నవీన్ నూలి రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య బ్యానర్స్:     సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విడుదల తేదీ:     మే 31, 2024 కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'రౌడీ ఫెలో', 'ఛల్ మోహన్ రంగ' చిత్రాల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాని రూపొందించాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల ఆకర్షించిన ఈ చిత్రం మంచి అంచనాలతో నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: లంకల ప్రాంతానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. ఒక సాధారణ యువకుడు. కానీ అతని ఆలోచనలు మాత్రం అసాధారణంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, పదిమందిని శాసించే స్థాయికి ఎదగాలి అనుకుంటాడు. దాని కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. తన ఎదుగుదల కోసం కాలర్ పట్టుకోవడానికైనా, కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడే రకం. అలాంటి రత్న.. ఆ ప్రాంత ఎమ్మెల్యే దొరస్వామిరాజు(గోపరాజు రమణ) పంచన చేరి, అతనికి నమ్మిన బంటులా పేరు తెచ్చుకుంటాడు. తెరవెనుక మాత్రం, ప్రత్యర్థి పార్టీ నాయకుడు నానాజీ(నాజర్)తో చేతులు కలిపి.. దొరస్వామిరాజుకి వెన్నుపోటు పొడిచి తానే ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. ఆ తరువాత రత్న జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అసలు రత్న గతం ఏంటి? అతను ఎందుకు ఇలా తయారయ్యాడు? అతని జీవితంలో బుజ్జి(నేహా శెట్టి), రత్నమాల(అంజలి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? తన ఎదుగుదలకు కారణమైన వారే, తనని అసహ్యించుకునేలా రత్న ఏం చేశాడు? అసలు అతను ఏం సాధించాడు?, ఏం పోగుట్టుకున్నాడు?, చివరికి ఏం తెలుసుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ని ఒక ఇంటెన్స్ ఫిల్మ్ గా ముందు నుంచి ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు కూడా ప్రచార చిత్రాలు చూసి.. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని భావించారు. చిత్రం బృందం కూడా ఇందులోని భావోద్వేగాలు కట్టి పడేస్తాయని చెప్పుకొచ్చింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఆ భావన కలగదు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. డ్రామా తేలిపోయింది. మనకి గోదావరి అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వెటకారాలు, మమకారాలు ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. మెజారిటీ సినిమాల్లో ఇవే చూపిస్తారు. అలాంటి గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి కథాంశంతో సినిమా చేయాలని, హీరోని నెగటివ్ షేడ్స్ లో చూపించాలనే దర్శకుడి ఆలోచన కాస్త కొత్తగా ఉంది. అయితే ఆ సెటప్ కి తగ్గ కథాకథనాలు తోడు కాలేదు. అలాగే, ఎప్పుడైనా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రతో ట్రావెల్ అవుతూ.. సినిమాలో లీనమవుతారు. అలా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తన కోసం, తాను ఎదగడం కోసం ఏదైనా చేసే మొండివాడిగా రత్న పాత్రని పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. కానీ రత్న ప్రయాణం మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. అతను ఎమ్మెల్యే దగ్గర పనిలో చేరి, ఆ తర్వాత తానే ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రయాణం సినిమాటిక్ గా అనిపించింది. పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఫస్టాఫ్ పరవాలేదు అనేలా నడిచింది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంది. ఇటువంటి కథల్లో విలన్ పాత్ర బలంగా ఉండాలి. అతని నుంచి బయటపడలేనంత ఇబ్బందికర పరిస్థితులు హీరోకి ఎదురు కావాలి. అప్పుడే హీరో పాత్ర ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కానీ ఇందులో అవి లోపించడంతో.. సెకండాఫ్ తేలిపోయింది. ఊహించని మలుపులు, కట్టిపడేసే భావోద్వేగాలు లేకపోవడంతో.. దాదాపు సినిమా అంతా ఫ్లాట్ గానే నడిచింది. చివరి 20 నిమిషాల్లో మాత్రం కొంత ఎమోషన్ పండింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ సినిమాని, ఇందులోని హీరో పాత్రని చూస్తే.. మనకి 'నేనే రాజు నేనే మంత్రి', 'రణరంగం' వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అసలు ఆ రెండు సినిమాలను కలిపి.. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 'నేనే రాజు నేనే మంత్రి' కథలోకి 'రణరంగం' హీరో వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే.. 'రణరంగం' కూడా సితార బ్యానర్ లోనే రూపొందింది. సాంకేతికంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' బాగానే ఉంది. అనిత్ మదాడి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఫ్రేమ్స్, లైటింగ్ ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్ సీన్స్ లోనూ మెప్పించాడు. అంజలి చేసిందనే తప్ప రత్నమాల పాత్రకు అంత ప్రత్యేకత ఏమి లేదు. కానీ తనదైన నటనతో ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇక బుజ్జిగా నేహా శెట్టికి మంచి పాత్రే దక్కింది. నిజానికి రత్న, బుజ్జి పాత్రల మధ్య బలమైన సంఘర్షణను చూపించడానికి ఎంతో ఆస్కారముంది. కానీ దానికి తగ్గ బలమైన సన్నివేశాలు పడకపోవడంతో.. బుజ్జి పాత్ర  పూర్తిస్థాయిలో మెప్పించలేదు. బుజ్జి పాత్రకి భావోద్వేగాలు పండించే బరువైన సన్నివేశాలు పడుంటే.. నేహా శెట్టికి మంచి పేరొచ్చేది. నాజర్, గోపరాజు రమణ, సాయి కుమార్, హైపర్ ఆది, పమ్మి సాయి, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  ఫైనల్ గా... అంచనాలతో వెళ్తే  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చూసి నిరాశ చెందుతారు. 'నేనే రాజు నేనే మంత్రి', 'రణరంగం' చిత్రాలను గుర్తు చేసేలా ఉన్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కొత్త సెటప్, విశ్వక్ సేన్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ కోసం మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.  రేటింగ్: 2.5/5  - గంగసాని
డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ 81వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎక్స్‌ వేదికగా తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా. మిమ్మల్ని నేను చాలా మిస్‌ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలో మీరు జీవించే ఉంటారు’ అని ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ని పోస్ట్‌ చేస్తూ సూపర్‌స్టార్‌ కృష్ణ యంగ్‌ లుక్‌లో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు.  సూపర్‌స్టార్‌ కృష్ణ తన సినిమా కెరీర్‌లో సాధించిన విజయాలు, తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన తీరు అందరికీ తెలిసిందే. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కృష్ణ తను చేసిన ఎన్నో గొప్ప చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలనే తపనతోనే సినిమాలు చేస్తున్నారు.  ప్రస్తుతం రాజమౌళితో చేయబోతున్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ కోసం మహేశ్‌ మేకోవర్‌ అవుతున్న విషయం తెలిసిందే. దాని కోసం ఎంతో శ్రమిస్తున్నారు మహేష్‌. అందులో భాగంగానే ఇటీవల మహేష్‌ విదేశాలకు కూడా వెళ్లారు. తెలుగులో ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్‌ ఎడ్వంచర్‌ డ్రామాగా ఈ సినిమాను రూపొందించేందుకు రాజమౌళి కృషి చేస్తున్నారు. 
ఇటీవల ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ.. నటి అంజలితో అనుచితంగా ప్రవర్తించారని, ఫొటో సెషన్‌ సమయంలో అంజలిని వెనక్కి నెట్టేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. ఈ వేదికపై బాలయ్య ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విషయమై అంజలి ఎక్స్‌లో స్పందించారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా ఈవెంట్‌కు బాలకృష్ణగారు వచ్చినందుకు చాలా థాంక్స్‌. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయనతో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని పోస్టు పెట్టారు. అదే వేడుకలో బాలయ్యకు, తనకు మధ్య జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.  ఈ ఈవెంట్‌లో అంజలితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారంటూ ప్రచారంలో ఉన్న వీడియోపై, ఆయనపై వస్తున్న విమర్శలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో చనువుకొద్దీ వెనక్కి తోశారు తప్ప ఆయన ప్రవర్తలో మరే ఉద్దేశం లేదు. ఫ్రెండ్‌షిప్‌లో ఇలాంటివి ఎంతో సహజమన్నారు. అంతేకాదు అంజలిని వెనక్కి నెట్టిన వీడియోనే ప్రత్యేకించి చూపిస్తున్నారు తప్ప దానికి ముందు, వెనుక ఉన్న విజువల్స్‌ని ఎందుకు చూపించడం లేదు. ఇలా ఒక చిన్న బిట్‌ని చూపిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఆ తర్వాత బాలయ్య, అంజలి హైఫై అంటూ చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించడం లేదు. అది కూడా చూపిస్తే అక్కడ జరిగిన విషయం ఎంత చిన్నది అనే విషయం అందరికీ అర్థమవుతుంది అంటూ వివరించారు. 
The upcoming action-packed movie "Weapon," directed by Guhan Senniappan and presented by MS Manjor under the banner of Million Studio, is set for release on June 7. The official trailer launch event took place recently in Hyderabad, and many of the film's stars, including Sathyaraj, Vasanth Ravi, Tanya Hope, and Rajeev Pillai, spoke about their experiences working on the film. Sathyaraj, who plays the enigmatic character described as a gangster, ghost, and superhuman, emphasized the power of the pen, microphone, media, and voting, as well as the importance of language in making movies accessible to audiences worldwide. He also praised the film's Super Human Saga concept, Guhan's captivating story, and Vasanth's impressive portrayal of Jailor. Vasanth, who plays a member of an assassin gang tasked with taking down Sathyaraj's character, praised Guhan's comic book-inspired script, which features fantasy, action, and superhero elements, along with the film's impressive CG work. He also commended Sathyaraj's performance and expressed his enthusiasm for working with talented young actors. Tanya Hope, who plays an emotional role in the film, praised the unique and fresh concept of "Weapon" and urged audiences to support the film's release. Rajeev Pillai, who plays a character with superhero-like abilities, expressed his gratitude to the director and producers for giving him the chance to portray such a powerful character, along with his admiration for Sathyaraj's work.  Guhan Senniappan revealed that the film is a sci-fi, thriller, and action flick, featuring impressive performances from all of the actors, including Sathyaraj's legendary portrayal of an enigmatic character and the use of AI tools in certain scenes. He expressed his excitement for the audience to get a sneak peek into a different side of Sathyaraj's acting and to support the film's release on June 7. The stage was set for star-studded action extravaganza as the cast and crew of "Weapon" came together to give audiences a glimpse of an epic storyline featuring an assassin’s group, a powerful character portrayed by Sathyaraj, and th holistic approach to storytelling driven by a classic sci-fi plot.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. వీటిని జయించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి విషయంలో ఫలితాలు మాత్రం కాస్త నిరాశగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా దానిలో సఫలం అయ్యేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితి వల్ల కలిగేది. దీన్ని జబ్బు కింద జమచేసి చాలా కాలమే అయినా దీనికి తగిన మందు మాత్రం కనుగొనలేకపోయారు. అయితే ఒత్తిడి జయించడానికి ఎప్పుడూ చేసే ప్రయత్నాలే కాకుండా దాని గురించి అందరినీ అలర్ట్ చేస్తూ ఒత్తిడి భూతానికి దూరంగా ఉండేందుకూ, ఒత్తిడి సమస్య ఉన్నపుడు దాన్ని జయించడానికి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైన వాటిని చర్చించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. దాన్నే వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన దీన్ని నిర్వహిస్తారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఒత్తిడిలోకి జారుకుని ఎంతోమంది బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నవారు ఉన్నారు. ఎంతోమంది సెలెబ్రిటీస్ జీవితాలు కూడా ఇలాంటి సమస్య వల్ల ముగిసిపోయాయి.  మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది?? బాధ్యతలు ఎక్కువైనప్పుడు, మనిషిని అర్థం చేసుకోనపుడు మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. తగినంత విశ్రాంతి దొరకకపోతే ఆ అలసట కాస్తా ఒత్తిడిగా మారుతుంది. అది పెరుగుతూ వెళ్ళేకొద్ది విశ్వరూపం దాలుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనీసం దాన్ని పంచుకునేవారు లేకపోవడం, వ్యక్తి నలిగిపోతున్నప్పుడు గమనించకుండా వారి మానాన వారిని వదిలేయడం వల్ల మానసిక సమస్య అనేది ప్రమాదకర సమస్యగా రూపాంతరం చెందుతోంది. ఏమి చెయ్యాలి?? మానసిక సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఫాలో అవ్వాలి. వాటి వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు.  మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవాలి!! మనసు భారంగా మారితే ఒత్తిడి తాలూకూ ప్రభావం పెరుగుతుంది. అందుకే మనసును ఎప్పటికప్పుడు తేలికగా మార్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని భరిస్తూ ఉండటం అంటే ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని తిరగడమే. అందుకే ఒత్తిడిని జయించాలంటే మనసును తేలికగా ఉంచుకోవడమే ఉత్తమ పరిష్కారం.  ఇష్టమైన పనులను చేయడం!! ఇష్టమైన పనులు చేయడంలో తృప్తి ఉంటుంది. ఈ తృప్తి మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనిషి ఎన్ని బరువులు మోస్తున్నా తనకు నచ్చిన పని చేస్తున్నాననే సాటిసిఫాక్షన్ మనిషిని హాయిగా ఉంచుతుంది. మంచి నిద్ర!! నిద్ర ఒక గొప్ప ఔషధం. నిద్ర సరిగ్గా ఉంటే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరికేసినట్టే ప్రతి మనిషికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది. రోజు మొత్తం అలసట నుండి శరీరానికి మెదడుకు ఆమాత్రం విశ్రాంతి కచ్చితంగా అవసరం.  ఎమోషన్స్ ని మోయకూడదు!! కొందరు ఏ ఎమోషన్ బయట పెట్టకుండా ఉండటం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం లేదని అనుకుంటూ వుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎమోషన్స్ ని మనిషిలో దాచుకోవడం వల్ల అవి ఒత్తిడిగా మారిపోతాయి. అలాగని అందరి ముందూ కోపం, అసహనం, ద్వేషం వంటివి వ్యక్తం చేయమని అర్థం కాదు. ఎమోషన్ క్రియేట్ అయ్యే వరకు పరిస్థితులను తీసుకెళ్లకూడదు. అలాగే ఎమోషన్స్ ని భూతద్దంతో చూడకూడదు.  భరించకూడదు!! కొన్నిసార్లు కొన్ని పనులను భరిస్తూ చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఎలా ఉంటాయంటే మనిషిని నిమిషం కూడా స్థిమితంగా ఉండనివ్వవు. మీ బాధ్యత కాకపోతే, దాని వల్ల అదనపు ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అనిపిస్తే సున్నితంగా ఆ పనికి నో చెప్పేయచ్చు.  నష్టం కూడా మంచిదే!! కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు వదులుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోవడం మాట నిజమే. కానీ ఆ పనుల వల్ల కలిగే భీకర ఒత్తిడిని సున్నితంగా దూరం చేసినట్టు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కాలం, కాలం చేసే ఒత్తిడి మాయాజలంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒత్తిడి విషయంలో అన్ని రకాల మార్గాలను అన్వేషించి వాటిని అనుసరిస్తే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందులేని జబ్బు అయిన ఈ మానసిక సమస్యలకు మనసుతోను, ఆలోచనలతోనూ వైద్యం చేసుకోవాలి.                                    ◆నిశ్శబ్ద.
ప్రేమ ఒక మైకం అంటారు.  ప్రేమలో ఉన్నవారి ప్రపంచం వేరే ఉంటుంది.  అందులో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు వారి మధ్య బంధం చాలా లోతుగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రేమ మత్తులో ఉన్నారని అంటుంటారు.  ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి అయినా సంకోచించరు.  ఈ క్రమంలోనే ప్రేమికులు ప్రేమ మత్తులో కొన్ని పనులు చేసి తరువాత బ్రేకప్ అయ్యాక కుమిలిపోతుంటారు.  లవ్ లో ఉన్నవారు తమ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే..  పొరపాటున కూడా కొన్ని పనులు చెయ్యకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ లవ్ లో ఉన్నవారు చెయ్యకూడని పనులేంటో ఓ లుక్కేస్తే.. ఫొటోస్.. చాలామంది ప్రేమికులు ఇంచుమించు భార్యాభర్తల్లానే బిహేవ్ చేస్తుంటారు. పెళ్లి కాలేదు.. కలసి ఉండలేదు అనే విషయం మినహాయిస్తే అన్ని విధాలా ఓపెన్ అయిపోతుంటారు. కానీ చాలా క్లోజ్ గా ఉన్నాం కదా అని ప్రైవేట్ ఫొటోలను తమ పార్ట్నర్ తో పంచుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు నార్సిసిస్టక్ మెంటాలిటీ కలిగి ఉన్నవారు అయితే బ్రేకప్ తరువాత  అమ్మాయిలను బ్లాక్మెయిల్ చెయ్యడం,  వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం వంటి వాటికి అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించే ప్రమాదం ఉంటుంది.   అంతే కాదు..  ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల సైబర్ నేరాల బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫొటో గ్యాలరీకి పర్మిషన్ అడుగుతుంటాయి. ఈ ఫొటోలు సదరు యాప్ కు వెళ్లిపోతాయి. ఈ ఫొటోల ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ప్రైవేట్ ఫొటోస్ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు. బ్యాంక్ అకౌంట్.. బ్యాంక్ ఖాతా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత ఆర్ఠిక విషయం.  ప్రేమలో ఉన్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆర్థిక విషయాలు పంచుకోవడం సబబు కాదు.  ప్రేమలో ఉన్నప్పుడు  లవ్ పార్ట్నర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే సున్నితంగా అవన్నీ చెప్పడం ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పాలి. కానీ కొందరు తమ లవ్ పార్ట్నర్ ఎక్కడ నొచ్చుకుంటారో అనే ఆలోచనతో అన్నీ చెప్పేస్తుంటారు.  లవ్ లో బ్రేకప్ వచ్చి విడిపోతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుటుంబం.. ప్రేమలో ఉన్నవారు సంతోషం, దుఃఖం, బాధ వంటి విషయాలు అన్నీ ఓపెన్ గా చెప్పుకోవం మంచిదే కానీ కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కుటుంబ వ్యక్తిగత విషయాలు అన్నీ ఓపెన్ అయ్యి చెప్పుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబానికి, కుటుంబంలో వ్యక్తుల గౌరవానికి ఎప్పటికైనా ఇబ్బందే. చనువుతో ఓపెన్ అయ్యి చెప్పుకున్న కొన్ని విషయాలు తరువాత బ్రేకప్ అయినప్పుడు నలుగురికి చాలా సులువుగా చేరిపోతాయి. అప్పుడు ఎవరికి వారు వారి కుటుంబ పరువును, గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. రహస్యాలు.. ఇప్పటి కాలంలో పరిచయాలు చాలా తొందరగా జరిగిపోతాయి. అదే విధంగా దగ్గరితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ బందం ఏదైనా నిలబడటమే కష్టంగా ఉంటుంది. ఒకరి నుండి విడిపోయాక మళ్ళీ ఇంకొకరితో పరిచయం కావడం, వారితో మళ్ళీ దగ్గరి తనం ఏర్పడటం, అది కాస్తా ప్రేమకు దారితీయడం చాలా వేగంగా జరుగుతాయి.  ఈ క్రమంలో ఎవరితోనూ గతానికి సంబంధించి  విషయాలు ఓపెన్ అయ్యి చెప్పుకోకూడదు.  దీనివల్ల వ్యక్తిత్వం మీద దారుణమైన ముద్రలు, అవమానాలు ఎదురవుతాయి.
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు.  ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే  విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది.  ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. లవంగాలు తినడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది.  ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్.  లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది  రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది.   తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే  జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.   మలబద్దకం  నుండి ఉపశమనం కలిగిస్తుంది.. లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది,  వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని,  మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పంటినొప్పిని దూరం చేస్తుంది.. లవంగాలలో  మత్తు లక్షణాలు ఉంటాయి.  పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని  దంతాలు,  వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. మన శరీరాన్ని శుద్ది చేయడానికి,  మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు. నొప్పి, వాపు తగ్గిస్తుంది.. లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి. ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్.. లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్,  యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు,  కీళ్ల ఆరోగ్యానికి మంచివి.  ఇవి  ఎముకల మందాన్ని పెంచుతాయి,  ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు  ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.. ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది  రక్తం నుండి అదనపు చక్కెరను  కణాలలోకి ఎగుమతి చేస్తుంది,  మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది.                                                             *నిశ్శబ్ద.  
భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే పనిజరగదు. ఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధన అయితే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుష్షే పెరుగుతోందని చెబుతోంది.   అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకీ, ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం పదహారు వేలమంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 23 ఏళ్లపాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు. తాము సేకరించిన వివరాలలో పండు మిర్చి తినే అలవాటు కల్గినవారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది. యువకులు, మంచి తిండిపుష్టి కలిగినవారు, మగవారు పండుమిరపకాయలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు. తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది. (కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో కూడా ఎండుమిర్చిని తినేవారు ఈ కోవకే చెందడాన్ని గమనించవచ్చు)   ఆశ్చర్యకరంగా పండుమిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా 13 శాతం తక్కువగా కనిపించింది. పండుమిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీని ఇవ్వలేం కానీ.... వారిలో కొన్నిరకాల ఆరోగ్యసమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మిర్చిలో ఉండే కేప్సైసిన్ (CAPSAICIN) వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందనీ, శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయనీ భావిస్తున్నారు. రుచి, రంగు ఉండని ఈ కేప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే Transient Receptor Potential (TRP) అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. ఇది కూడా దీర్ఘాయుష్షుకి కారణం అని నమ్ముతున్నారు.   పండుమిర్చి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు! మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉందని ఈపాటికే తేలిపోయింది. ఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది కదా! తాజా పరిశోధన ఈ విషయాన్నే రుజువులతో సహా నిరూపించింది. కాకపోతే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు. మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా. - నిర్జర.  
టీ తాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా? అనే విషయం గురించి  చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. టీని మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అందరూ అంటుంటారు. పరిశోధకులు కూడా ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  గుండె నుండి గట్ వరకు ఇంకా  మధుమేహం నుండి బరువు నియంత్రణ వరకు చాలా సమస్యలలో బ్లాక్ టీ మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది.  కరోనా  సమయంలో బ్లాక్ టీ చాలా చర్చనీయాంశమైంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిసింది, ఇది  అంటు వ్యాధుల శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలోని కెఫిన్.. బ్లాక్ టీ లో ఉండే కెఫిన్ మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కెఫిన్ మూత్రపిండాలకు హానికరమని కొందరు చెబుతుంటారు.    టీ,  కాఫీలలో  కెఫీన్ ఉండటం సాధారణం. ఇది మూత్రపిండాలకు మంచితో పాటు చెడు కూడ చేస్తుంది. ఇదంతా ఎంత టీ తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది.  మూత్రపిండాలపై కెఫీన్  దుష్ప్రభావాలు ఎంతంటే.. కెఫిన్ మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిగణించబడుతున్నప్పటికీ, ఇది  దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కెఫిన్  రక్తపోటును ప్రభావితం చేస్తుంది.  అధికంగా కెఫిన్ తీసుకోవడం సిస్టోలిక్,  డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్లాక్-టీ లో ఆక్సలేట్ గురించి తెలుసా?? బ్లాక్ టీలో కనిపించే ఆక్సలేట్  మూత్రపిండాలకు చాలా హానికరమైనది.  బ్లాక్ టీలో   కరిగే ఆక్సలేట్  సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలుస్తాయి. ఇవి స్ఫటికాలను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఈ కారణంగానే బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు  నిపుణుల సలహా ఏమిటంటే.. బ్లాక్ టీ  ఆరోగ్యానికి మేలు చేసేదే, ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది.   ఇది గుండె జబ్బులను తగ్గించడంలో,  కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇదంతా బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే కలిగే ప్రయోజనం. బ్లాక్ టీ ని  ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజులో రెండు కప్పులకు మించి బ్లాక్ టీ తాగడం ప్రమాదం.                             *నిశ్శబ్ద.