LATEST NEWS
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి  తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.  ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు..  ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.   గుంటూరులో జరిగిన  ముద్రగడ సంస్మరణ సభ వేదికగా..  బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది.   రాష్ట్ర జనాభాలో   25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ,  కాపుల ఆవేదనను,  డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ  ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు   మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు.  తెలుగుదేశం   అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.     ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది.   రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది. 2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను  మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో  రాధా  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా..  తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా  ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు.   ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు.  Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors
నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది.  కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా  విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం.  గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.  నీట్   లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు.  ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి  సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో  రాజంపేట నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion 
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు,  మాజీ మంత్రి,  ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది.   ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు.  ఆ నోటీసులలో  ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట  హాజరుకావాలని, లేనిపక్షంలో  అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు.  రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు.  తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో   రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర  క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా   క్రీడా పరికరాల కొనుగోల విషయంలో  భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై   వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో  అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు.  ; పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు.  గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు.   కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో  ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన  పర్యాటక  శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.  
  అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..! ఆంధ్రప్రదేశ్ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైఖరిపై టిడిపి అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేసిన ఆయన ఇటీవలి వ్యాఖ్యలు, చేష్టలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో కలిసి బోండా ఉమ ఒకే వేదికను పంచుకోవడం కూటమి వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం తెలుగుదేశం, జనసేన అధినేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ప్రత్యర్థి పార్టీ నేతతో సఖ్యతగా మెలగడం కూటమి ధర్మానికి విరుద్ధమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అంతేకాకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాపు సామాజిక వర్గ ప్రయోజనాల కోసం స్వయంగా ఉద్యమిస్తానని బోండా ఉమ ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గతంలో ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని టీడీపీ సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే 2019లో ఓటమి చవిచూసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను కుదిపివేశాయి. విజయవాడ సెంట్రల్ నుండి రెండవసారి విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిని ఆశించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చురుగ్గా పోరాటాలు చేసిన తనకే ప్రాధాన్యం దక్కుతుందని ఆయన భావించారు. అయితే వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు కేబినెట్‌లో చోటు లభించలేదు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బోండా ఉమ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పరోక్షంగా అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ క్రమశిక్షణ కట్టుదాటే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉన్న సమయంలో పార్టీ నేతలే వివాదాలకు కేంద్రబిందువు కావడం తగదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించే నాయకులు ఎంతటి వారైనా సహించేది లేదనే స్పష్టమైన సంకేతాన్ని పంపేందుకే ఈ షోకాజ్ నోటీసు ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ జారీ చేసిన నోటీసుపై బోండా ఉమామహేశ్వరరావు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అధిష్టానం తదుపరి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Bonda Umamaheswara Rao, Ambati Rambabu, TDP Show Cause Notice, AP Politics, Chandrababu Naidu  
  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల  అబ్డామినల్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.  ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. తాను ఆస్పత్రిలో కోలుకుంటున్న ఫొటోను కూడా ఆ పోస్టుకు జత చేశారు.  దీనిపై   పలువురు  రాజకీయ నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపారు. అయితే.. షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ మాత్రం స్పందించలేదు.    షర్మిల తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కీలక సమాచారాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు. అయితే, సొంత చెల్లెలు ఆసుపత్రి పాలై, సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినప్పటికీ  వైసీపీ అధినేత  జగన్  పరామర్శించకపోవడం, కనీసం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలంటూ సందేశం పోస్టు చేయడపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అదే రోజు ఉదయం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఎక్స్‌లో  శుభాకాంక్షలు తెలిపిన జగన్.. సొంత చెల్లెలి ఆరోగ్యంపై స్పందించకపోవడంపై వైసీపీలో కూడా ఆసంతృప్తి వ్యక్తమౌతోంది.   కుటుంబ విభేదాలు, రాజకీయ  వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. జగన్ సొంత చెల్లెలి ఆరోగ్య పరిస్థితిపై కనీస అక్కర చూపకపోవడాన్ని వైసీపీ వర్గాలే తప్పుపడుతున్నాయి.  గత కొన్ని సంవత్సరాలుగా జగన్, షర్మిల మధ్య వేభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.   జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. 2019 ఎన్నికల సమయంలో వైసీసీ విజయానికి అలుపెరుగకుండా శ్రమించి, సుదీర్ఘ పాదయాత్ర పార్టీ స్థాపన సమయం నుంచి అన్న విజయం కోసం అలుపెరగని పాదయాత్ర నిర్వహించిన షర్మిల, తదనంతర పరిణామాల్లో జగన్ తీరుతో విభేదించి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.   అంతే కాకుండా షర్మిల, జగన్ మధ్య  ఆస్తుల పంపిణీకి సంబంధించిన వివాదాలు కూడా రచ్చకెరక్కాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయి.  అయితే ఆరోగ్యపరమైన పరిస్థితులు లేదా అత్యవసర సందర్భాలు ఎదురైనప్పుడు  వైరాన్ని పక్కనబెట్టి స్పందించపోవడంపై జగన్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి.    ఆసుపత్రిలో  కోలుకుంటున్న   చెల్లెలు షర్మిలను ఇప్పటికైనా  జగన్ ఫోన్ ద్వారా లేదా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం మంచిదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ  అభిమానులు కూడా జగన్  చెల్లెలికి కనీసం ఒక మర్యాదపూర్వక పరామర్శ సందేశం పంపితే బాగుండేదని అంటున్నారు.   urgery for Sharmila, rother Jagan doesnt even respond, CBN, LOKESH, messge, speedy, recovery
ALSO ON TELUGUONE N E W S
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా'. 'పుష్ప' తర్వాత బన్నీ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఒక సంచలనాత్మక అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాబోయే షెడ్యూల్‌లో అల్లు అర్జున్ మైండ్ బ్లాకింగ్ ఎంట్రీ సీన్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ ఊరమాస్ ఎంట్రీ సన్నివేశం కోసం ఒక భారీ సెట్‌ను కూడా ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోయే ఎంట్రీ సీన్స్‌లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించేందుకు అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా విజువల్ వండర్‌గా ఈ ఎంట్రీ సీన్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో, మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎపిసోడ్లు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్.     Raaka Movie, Allu Arjun, Entry Scene, Atlee  
Music director Anirudh Ravichander shared an emotional message for actor Vijay on X, marking the end of their memorable collaboration with Jana Nayagan. The composer reflected on their successful journey together, expressing gratitude for the trust the actor placed in him over the years. Sharing his heartfelt note, Anirudh wrote: "It has been a thoroughly amazing and emotional journey with you through JanaNayagan, Leo, Beast, Master and Kaththi. Thank you @actorvijay sir for the unlimited trust and memories that I will cherish forever. The music lives on" The post instantly struck an emotional chord with fans, who flooded social media with nostalgic reactions. Anirudh and Vijay have delivered several chartbuster albums together over the years, with films like Kaththi, Master, Beast, Leo, and now Jana Nayagan producing songs and background scores that became hugely popular among audiences. With Jana Nayagan widely expected to be Vijay's final film before his full-fledged political journey, Anirudh's message carries added emotional weight. While their professional collaborations may have come to a pause, the composer summed it up perfectly with one simple line: "The music lives on." Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
బెంగాలీ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి శ్రీలేఖ మిత్రా తీవ్ర చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వివాదాస్పద మరియు అభ్యంతరకరమైన కార్టూన్ పోస్టర్‌ను బహిరంగంగా ప్రదర్శించారనే తీవ్ర ఆరోపణలతో ఆమెపై పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. కోల్‌కతా వీధుల్లో విద్యార్థులు చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం వివాదానికి మూలం జూలై 24న కోల్‌కతాలో జరిగిన నిరసన ర్యాలీ. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీల్దా నుండి ధర్మతాల వరకు విద్యార్థులు, యువజన సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపేందుకు నటి శ్రీలేఖ మిత్రా స్వయంగా వీధిలోకి వచ్చి నిరసనకారులతో కలసి నడిచారు. అయితే, ఆ ప్రదర్శనలో ఆమె చేతిలో ప్రధాని నరేంద్ర మోదీని అనుచిత రీతిలో చిత్రీకరించిన ఒక వివాదాస్పద పోస్టర్ కనిపించింది. శ్రీలేఖ ఆ పోస్టర్‌ను చేతిలో పట్టుకుని నిలబడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో క్షణాల్లో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపి అధికార ప్రతినిధి, ప్రముఖ నాయకురాలు కేయా ఘోష్ కోల్‌కతాలోని ఆనందపూర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీలేఖ మిత్రాపై అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీనికి తోడు బిధాన్‌నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో పాటు పలు జిల్లాల్లోనూ ఆమెపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భారతీయ నస్య సంహిత (BNS 2023) చట్టంలోని అత్యంత కీలకమైన సెక్షన్ 352 (శాంతిభంగానికి పురికొల్పడం), సెక్షన్ 353 (ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తించడం), మరియు సెక్షన్ 356 (మాననష్టం) కింద ఈ ఫిర్యాదులు దాఖలయ్యాయి. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కు పేరుతో దేశ ప్రధానిని అవమానించడం, ప్రజల్లో వైషమ్యాలు రేకెత్తించడం ఏమాత్రం చెల్లదని, శ్రీలేఖను తక్షణమే అరెస్టు చేయాలని బిజెపి నేతలు పట్టుబడుతున్నారు. తనపై వెల్లువెత్తుతున్న తీవ్ర ఆరోపణలు, పోలీస్ కేసుల నమోదుపై నటి శ్రీలేఖ మిత్రా చివరకు నోరు విప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీని అవమానించేందుకు ఆ పోస్టర్ పట్టుకోలేదని స్పష్టత ఇచ్చారు. ఆ రోజు విద్యార్థుల ర్యాలీలో నడుస్తున్న సమయంలో పోలీసులు ఉన్నట్టుండి లాఠీఛార్జ్ చేయడం ప్రారంభించారని, ఆ గందరగోళం మరియు తోపులాటలో గుంపులోని ఒక వ్యక్తి తన చేతికి ఆ పోస్టర్ ఇచ్చాడని వివరించారు. ఆ సమయంలో తాను ధరించడానికి రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకోవడం మరచిపోయానని, కేవలం సన్‌గ్లాసెస్ మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సైట్ సరిగ్గా లేకపోవడం వల్ల పోస్టర్‌పై ఉన్న చిత్రం స్పష్టంగా కనిపించలేదని, అసలు అందులో ఏముందో వెనక్కి తిప్పి కూడా చూసుకోలేదని ఆమె సమర్థించుకున్నారు. తాను బిజెపి విధానాలకు వ్యతిరేకి కావచ్చు గానీ, తనను దేశద్రోహి అని ముద్ర వేయడం హాస్యాస్పదమని శ్రీలేఖ తీవ్రంగా స్పందించారు. కావాలనే ఆ పోస్టర్‌తో ఫోటోలకు ఫోజులిచ్చానని అనుకోవడం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా శ్రీలేఖపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని రక్షక భట నిపుణులు తెలిపారు. నిరసన తెలిపేందుకు వచ్చి ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.   Sreelekha Mitra, Narendra Modi, Kolkata NEET protest, Keya Ghosh 
టాలెంటెడ్ యాక్టర్ సుమంత్ హీరోగా రూపొందుతున్న భారీ ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ 'మహేంద్రగిరి వారాహి' రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. డివైన్ కాన్సెప్ట్, పురాణాల నేపథ్యంతో మిస్టరీ మిళితమైన కథలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందని పోస్టర్ లుక్ స్పష్టం చేస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజా శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం, ప్రతాప్ ఆర్ కృష్ణ కెమెరా పనితనం ఈ విజువల్ వండర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహేంద్రగిరి పర్వత శ్రేణులు, వారాహి అమ్మవారి దివ్య శక్తి, కొన్ని నిగూఢమైన రహస్యాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. సుమంత్ కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఈ డివైన్ థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.     Sumanth, Mahendragiri Varahi, Release Date  
సినిమా ప్రపంచంలో మెరుపులు, అందాల ఆరబోత వెనుక ఉండే కఠినమైన వాస్తవాలు తరచూ బయటపడుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి, మెగా కుటుంబ కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా నీచమైన బాడీ షేమింగ్‌కు గురికావడం చిత్ర పరిశ్రమలోనే కాక, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి, 2025 సెప్టెంబర్‌లో ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి 'వాయువ్ తేజ్' అని నామకరణం చేసి, తన సమయాన్ని పూర్తిగా మాతృత్వానికే కేటాయిస్తూ సినిమాలకు కొంత కాలంగా విరామం ఇచ్చారు. మాతృత్వం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత పవిత్రమైన, భావోద్వేగమైన ఘట్టం. అయితే, ప్రసవానంతరం మహిళల శరీరంలో అనేక సహజమైన శారీరక మార్పులు రావడం అత్యంత సహజం. ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన లావణ్యను చూసి, కొందరు నెటిజన్లు అత్యంత అనుచితంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపింది. ఆ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మునుపటి కంటే కాస్త బొద్దుగా కనిపించారు. ఆమె కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే, ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అన్న విషయాన్ని కూడా విస్మరించిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆమెపై విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. "లావుగా మారిపోయారు", "పూర్తిగా ఆంటీలా కనిపిస్తున్నారు" అంటూ అత్యంత కించపరిచేలా కామెంట్లు చేశారు. అందానికే ప్రాధాన్యత ఇచ్చే గ్లామర్ రంగంలో ఉన్నంత మాత్రాన, ప్రసవం తర్వాత ఒక మహిళ ఎదుర్కొనే శారీరక మార్పులను కూడా హేళన చేయడం నెటిజన్ల వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో కొన్ని లైక్‌లు, కామెంట్ల కోసం మాతృత్వాన్ని కూడా కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నీచమైన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లావణ్యకు మద్దతుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా గళం విప్పారు. ప్రసవానంతరం హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగడం అనేది ఏ మహిళకైనా అత్యంత సహజమైన ప్రక్రియ అని గట్టిగా తిప్పికొట్టారు. "ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి శరీరాన్ని హేళన చేయడం సభ్య సమాజం చేయాల్సిన పని కాదు. ఒక మహిళ మాతృత్వాన్ని, ఆమె పడే వేదనను గౌరవించడం నేర్చుకోండి" అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో గతంలోనూ పలువురు అగ్ర కథానాయికలు ఎదుర్కొన్న పరిస్థితులను అభిమానులు గుర్తుచేశారు. గతంలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అగ్ర నటి కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా తమ ప్రసవానంతరం తీవ్రమైన బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారని అభిమానులు ఉదాహరణగా పేర్కొన్నారు. సినీ సెలబ్రిటీలైనా, సామాన్య మహిళలైనా ప్రసవం తర్వాత తమ పూర్వపు శరీర ఆకృతిని, ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి కొంత సమయం పడుతుందనే ప్రాథమిక విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసవానంతర సమయంలో మహిళలకు ఎంతో మానసిక ప్రశాంతత, కుటుంబ మద్దతు అవసరమని, అలాంటి సమయంలో బాడీ షేమింగ్ వంటి వికృత సంస్కృతికి స్వస్తి పలకాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి మద్దతుగా మెగా ఫ్యాన్స్ మరియు నెటిజన్లు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండింగ్‌గా మారాయి. మాతృత్వాన్ని గౌరవిస్తూ, బాడీ షేమింగ్‌ను నిరసిస్తూ సాగుతున్న ఈ స్పందన సోషల్ మీడియాలో ఒక కొత్త ఆలోచనాత్మక చైతన్యాన్ని నింపుతోంది.   Lavanya Tripathi, Varun Tej, Tollywood 
తెలుగు సినీ ప్రియులకు ఎప్పుడూ నవ్వులు పంచే విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరకల్పనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విక్టరీ వెంకటేష్ పాత్రను 'చిట్టిబాబు'గా పరిచయం చేస్తూ విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్ వీడియోలో విక్టరీ వెంకటేష్‌ను 'చిట్టిబాబు'గా అత్యంత వినోదాత్మకంగా, విభిన్నమైన మ్యానరిజమ్స్‌తో డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వీడియోలో కిచెన్‌లో ఏసీని సెట్ చేయడం, ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉండటంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి "నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకొని చేసుకోవచ్చు నాన్నా.. నీకు పని బాగా తగ్గిపోయినట్లే" అంటూ వెంకటేష్‌ను ఆటపట్టిస్తుంది. దానికి వెంకటేష్ తన ప్రత్యేకమైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో స్పందిస్తూ పక్కనున్న రఘుబాబుతో "యస్, ఐ యామ్ ది మ్యాన్ ఆఫ్ ది హౌస్. అస్తమానం తల తిప్పకండి బుజ్జిగారు మెడ పట్టేస్తుంది. నాకు ఎవరేం పని చేసినా నచ్చదు, అన్నీ నేనే చూసుకుంటాను" అని చెప్పడం, దానికి పక్కనే ఉన్న రఘుబాబు "ఆవిడకి ఏమీ రాదు, అన్నీ మీరే చేసుకుంటారు" అంటూ ఇచ్చే కౌంటర్ కామిక్ టైమింగ్స్ ప్రేక్షకులకు వినోదాల విందు పంచుతున్నాయి. నారా రోహిత్ "ఆదర్శ కుటుంబం" అనే డైలాగ్ తో టీజర్ ను ముగించిన తీరు బాగుంది. త్రివిక్రమ్ మార్క్ మాటల విన్యాసం, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ వీడియో హైలైట్ గా నిలిచాయి. కుటుంబ వ్యవస్థలోని ఆప్యాయతలు, ఇంటి పనుల్లో మగవారి పాత్రను హాస్యభరితంగా చూపిస్తూనే, లోతైన కుటుంబ అనుబంధాలను స్పృశించే సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక టీజర్ చివరలో రైలు ప్రయాణంలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి డోర్ నుంచి బయటకు చూసే విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2, 2026న థియేటర్లలో అడుగు పెట్టనుంది.     Venkatesh, Chittibabu, Aadarsha Kutumbam, Trivikram  
Sumanth's upcoming mystical thriller Mahendragiri Varahi is gearing up for a theatrical release. After the teaser crossed one crore digital views and generated strong buzz, the makers officially announced the release date while interacting with the media. Confident about the film's content, Sumanth promised that audiences are in for an "unpredictable" and "edge-of-the-seat" theatrical experience. Speaking about the project, Sumanth revealed that he and director Santhossh Jagarlapudi locked the script nearly two-and-a-half years ago. However, they waited until they found the right producers in Madhu Kalipu and Laxman to mount the film on the desired scale. He thanked the team for standing by the project and expressed confidence that the hard work put into the film would pay off when it reaches theatres. Producer Madhu credited the overwhelming teaser response as proof of the film's potential and stated that the makers are now focused on delivering equally impactful promotional content. He also expressed confidence that the film's songs would become closely associated with Goddess Varahi, much like devotional chartbusters have become synonymous with Lord Ayyappa. The team has also begun promoting the film by installing Goddess Varahi idols at theatres. Director Santhossh Jagarlapudi said the teaser's success has increased his responsibility to meet audience expectations. He thanked Sumanth for trusting his vision and appreciated the unwavering support of the producers throughout the journey. The producer also praised Sumanth's dedication during production, revealing that the actor stayed at the shooting locations instead of using a caravan to help complete the film on schedule and within budget. Also starring Malvika Nair, Aishwarya Rajesh, and Meenakshi Goswami, Mahendragiri Varahi has steadily built anticipation with its intriguing promotional material. With the release now locked for September 11, the makers are set to intensify promotions in the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The makers of Victory Venkatesh and Trivikram Srinivas’ much-awaited family entertainer “Aadarsha Kutumbam House No: 47 – AK47” have officially begun unveiling the vibrant world of the film with a series of character introductions. Kicking off the campaign is Victory Venkatesh as Chitti Babu, followed by Srinidhi Shetty, Yuvina Parthavi and Raja Prajwal, who together form the heart of this wholesome family entertainer. Introducing the first character, Venkatesh steps into the role of Chittibabu, the lovable pillar of the family who binds everyone together with his warmth, wit and unwavering sense of responsibility. The character glimpse offers a charming sneak peek into his world, featuring Venkatesh alongside Srinidhi Shetty and Nara Rohith, teasing the film’s blend of laughter, emotions and strong family bonds. With his effortless screen presence, impeccable comic timing and natural flair for family entertainers, Venkatesh once again promises a character that audiences of all ages will instantly connect with. Chitti Babu is poised to be one of those memorable roles that perfectly reflects the spirit of a joyful, close-knit family. As the first introduction sets the tone, excitement is now building for the remaining character reveals, each expected to bring a unique flavour to the lively world of AK47. Produced by S. Radha Krishna (Chinababu) under the prestigious Haarika & Hassine Creations banner, “Aadarsha Kutumbam House No: 47 – AK47” is slated for a grand worldwide theatrical release on October 2, 2026.  With music by S. Thaman, cinematography by Ravi K. Chandran, editing by Sreekar Prasad, action choreography by Kevin Kumar, the film promises to deliver a complete festive entertainer for audiences across all sections. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సోషల్ మీడియా ప్రపంచంలో క్షణాల్లో ప్రాచుర్యం ఎంత వేగంగా వస్తుందో, ఒక్క చిన్న పొరపాటుతో అంతే వేగంగా క్రేజ్ కరిగిపోతుందని నిరూపించే చేదు నిజం ఇది! ప్రముఖ నటి, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్, టెలివిజన్ యాంకర్ పియర్లీ మానే (Pearle Maaney) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కారణంగా, అదీ కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను ఆమె కోల్పోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ సున్నితమైన అంశంపై పియర్లీ మానే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌లో విద్యార్థులందరూ సురక్షితంగా ఉండాలని, ఎవరూ గాయపడకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, "మన భద్రత ప్రమాదంలో పడినప్పుడు, ప్రాణాలను పణంగా పెట్టేంత గొప్ప ఉద్యమం ఏదీ ఉండదు" అని వ్యాఖ్యానించారు. అలాగే ఉద్యమం అసలు ఉద్దేశం పక్కదారి పట్టకుండా, విద్యార్థులంతా తమ భవిష్యత్తుపైనే దృష్టి సారించి ఇళ్లకు తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలవాల్సింది పోయి, వారి నిరసన తీవ్రతను నీరుగార్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నెటిజన్లు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతుంటే, వారి అసలు సమస్యలను ప్రస్తావించకుండా ఇళ్లకు వెళ్లమని సలహా ఇవ్వడం ఏంటని తీవ్రంగా ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు భారీగా వెల్లువెత్తడంతో, పియర్లీ మానే వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సంబంధించిన కామెంట్ సెక్షన్‌ను డిసేబుల్ చేశారు. ఈ చర్యతో వివాదం చల్లారకపోగా మరింత ముదిరింది. తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశిస్తూ పియర్లీ వరుస ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను పోస్ట్ చేశారు. అందులో ఒక స్టోరీలో, ఒక 'విఫలమైన దర్శకుడు' తనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రముఖ మలయాళ చలనచిత్ర దర్శకుడు సిబి మలయిల్‌ను ఉద్దేశించి చేసినవేనని అందరికీ స్పష్టమైంది. అంతేకాకుండా, మరొక స్టోరీలో తనకు ఇష్టమైన రంగు కాషాయమని, అది మన జాతీయ జెండాలో ఉందంటూ పోస్ట్ చేయడం వివాదానికి రాజకీయ రంగు పూసి మరింత ఉద్రిక్తతను పెంచింది. ఈ వ్యాఖ్యలపై సిబి మలయిల్ కుమారుడు జో సిబి మలయిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగజారిన వ్యక్తిగత దాడి అని, సున్నితమైన సమస్యపై పోరాడుతున్న విద్యార్థులకు ఇళ్లకు పొమ్మని చెప్పడం అత్యంత తెలివి తక్కువతనమని మండిపడ్డారు. మరోవైపు, ప్రముఖ నటి మరీనా మైఖేల్ కూడా స్పందిస్తూ, ఆన్‌లైన్ విమర్శలను సెలబ్రిటీలు అత్యంత హుందాగా స్వీకరించాలని, ఇలాంటి అంశాలను వ్యక్తిగత గెలుపోటములుగా చూడకూడదని హితవు పలికారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పియర్లీ మానే తన వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను డిలీట్ చేశారు. వివాదానికి ముందు పియర్లీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సుమారు 27 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 24 లక్షలకు పడిపోయింది. అంటే కంటిరెప్ప మూసి తెరిచేలోగా 300,000 మందికి పైగా ఆమెను అన్‌ఫాలో చేశారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాకుండా యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఇతర వేదికలపై కూడా వేలాది మంది నెటిజన్లు ఆమెను అన్‌ఫాలో చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక మరియు రాజకీయ ప్రాధాన్యత ఉన్న సున్నితమైన విషయాలపై ప్రముఖులు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, మాట తూలితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సంఘటన మరొకసారి స్పష్టంగా నిరూపించింది. ఇప్పటివరకు పియర్లీ మానే ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
  గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఊహకి అందని  కథ, కథనం, లొకేషన్స్, క్యారక్టర్ ల తీరుతోనే సెల్యులాయిడ్ పై వండర్ ని క్రియేట్ చేసే దర్శక రచయిత 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan). ప్రెజెంట్ ది ఒడిస్సీ' తో వరల్డ్ వైడ్ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యంపై  పైరసీ రాబందుల నీడ పడింది. దీంతో  ప్రపంచ సినీ రంగంతో పాటు నోలన్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు. స్పష్టమైన హై క్వాలిటీ ప్రింట్‌తో ఈ పూర్తి సినిమా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో ప్రత్యక్షమైంది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అందరినీ తీవ్రంగా కలవరపెడుతున్న ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ లీకైన సినిమా కాపీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు 21 లక్షల మంది (2.1 మిలియన్లు) వీక్షించారు. ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రం ఈ స్థాయిలో లీక్ కావడం మరియు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది మంది దానిని చూడటం కలకలం రేపుతోంది. ఈ పైరసీ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమై తీవ్రంగా స్పందించింది. కాపీరైట్ చట్టాల కింద న్యాయపరమైన చర్యలు వేగంగా ప్రారంభించి,సామాజిక మాధ్యమాల నుంచి పైరసీ వీడియో లింకులని, సినిమాని  పోస్ట్ చేసిన సంబంధిత ఖాతాను వెంటనే తొలగించే పనులను వేగవంతం చేసింది. అయితే అప్పటికే కోట్లాది రూపాయల వ్యాపారం పైరసీ ముప్పు వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఏర్పడటంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీకు మహాకవి హోమర్ రాసిన అత్యంత ప్రాచీన ఇతిహాసం ఆధారంగా మాట్ డామన్, అన్నీ హథవే, టామ్ హాలెండ్ ప్రధాన క్యారెక్టర్లలో నోలన్ తెరేక్కించాడు. సుమారు 2,000 కోట్లకి  (250 మిలియన్ డాలర్లు) పైగా భారీ బడ్జెట్‌తో  రూపొందింది. సినీ చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి సినిమాను అత్యంత ఖరీదైన ఐమ్యాక్స్ 70ఎంఎం (IMAX 70mm) కెమెరాలతో చిత్రీకరించి ఒక సరికొత్త విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కథలోని సహజత్వం కోసం స్కాట్లాండ్, ఇటలీ, గ్రీస్, మొరాకో, ఐస్‌ల్యాండ్ వంటి 5 దేశాలలో 91 రోజుల పాటు అహోరాత్రులు షూటింగ్ నిర్వహించారు. Also read: ప్రముఖ బిజినెస్ మెన్ ప్రేమలో మలైకా అరోరా!.. గబ్బర్ సింగ్ కెవ్వు కేక గుర్తిందిగా  తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లు (. 2,548 కోట్లు) వసూలు చేసి నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 700 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు  6,700 కోట్లు) మార్కుకి  అత్యంత చేరువలో ఉంది. భారతీయ మార్కెట్‌లోను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజే  20.76 కోట్ల గ్రాస్ సాధించడంతో పాటు మొదటి వారంలో 100 కోట్ల క్లబ్‌లో చేరి ప్రస్తుతం 147 కోట్ల భారీ వసూళ్లని  సొంతం చేసుకుంది. The Odyssey, Christopher Nolan, Hollywood
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే.. మాజీ ప్రేమికుల గురించి..  భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది. సొంత వ్యక్తుల చెడుగుణం..  భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల రహస్యాలు..  ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు. ఇష్టాలు, అయిష్టాలు.. భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. సోషల్ మీడియా పాస్వర్డ్ లు.. నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు. సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.                                *రూపశ్రీ
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
 ఆవనూనె లేదా ఆలివ్ నూనె.. గుండె జబ్బుల రోగులకు ఏ నూనె మంచిది తెలుసా.! ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.  ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు,  ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా  ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు.  మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని,  ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని,  వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి.  పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె  మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్  ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.  చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు  ఆహారాన్ని  నూనెలో బాగా వేయిస్తారు, పోపు  వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి.                                    *రూపశ్రీ.  
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...