LATEST NEWS
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో విజయ్ సమావేశమయ్యే అవకాశం ఉందని పలు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ పర్యటనపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రతిపాదిత భేటీలో ప్రధానంగా కృష్ణా జలాల సరఫరా, తెలుగు గంగ ప్రాజెక్టు కింద తమిళనాడుకు అందాల్సిన నీరు, నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి అవసరాల కోసం ఏటా 12 టీఎంసీల కృష్ణా జలాలను తమిళనాడుకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే, అక్టోబర్ 9 నాటికి తమిళనాడుకు 2.251 టీఎంసీల నీరు మాత్రమే అందినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. దీంతో మిగిలిన నీటి సరఫరా అంశం ఈ భేటీలో కీలకంగా మారే అవకాశం ఉంది.అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టులు, తమిళనాడు వైపు ప్రవహించే నదులపై ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానానికి సంబంధించిన అంశాలు సైతం ప్రస్తావనకు రావచ్చని సమాచారం. మరోవైపు, అక్టోబర్ 13న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఉత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో విజయ్ పర్యటన ఖరారైతే రాజకీయ, అధికారిక వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.అయితే, విజయ్ ఏపీ పర్యటన, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లతో భేటీ, చర్చల అజెండాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ సమావేశం జరిగితే, తెలుగు గంగ ప్రాజెక్టు కింద నీటి సరఫరా సహా కీలక జలవనరుల అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.      [  CM Vijay, CM Chandrababu Naidu, Pawan Kalyan, Andhra Pradesh Politics, Tamil Nadu Politics, Krishna Water Dispute, Telugu Ganga Project, Krishna Water Supply, Godavari Krishna Cauvery Link, AP Tamil Nadu Meeting, Vijay AP Tour, Political News, Telugu News, October 13 Meeting ]
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన ప్రముఖ జాతీయ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు ఎంపీలు, సీనియర్ రాజకీయ నేతలను కూడా అధికారులు నిర్బంధించి ప్రత్యేక డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయమై ఎన్నికల కమిషన్ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ విపక్ష నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సౌత్ అవెన్యూ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న మమతా బెనర్జీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదనే కారణంతో ఆమెను సమీపంలోని బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నించగా, ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తన నివాసం నుంచి బయలుదేరిన అరవింద్ కేజ్రీవాల్‌ను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. ఇదే నిరసనలో పాలుపంచుకునేందుకు వచ్చిన కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం ఎంపీలను సైతం పోలీసులు విడిచిపెట్టలేదు. నగరంలో ఎలాంటి ఆందోళనలకు ముందస్తు అనుమతి లేదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలీసు యంత్రం ద్వారా గొంతును నొక్కాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ అరెస్టుల పర్వం దేశ రాజకీయాల్లో మరింత దుమారం రేపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ తీరుపై విపక్షాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని రాజకీయ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.       [ CJP, Abhijit Deepke, Delhi Police, Cockroach Janata Party protest, Mamata Banerjee, Arvind Kejriwal, Pinarayi Vijayan, Election Commission Protest, Mamata Banerjee, Arvind Kejriwal, Pinarayi Vijayan, Delhi Police Protest, Election Commission of India, Gyanesh Kumar ]
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా శాంతుక్ పింప్రి గ్రామానికి చెందిన అభిజిత్ దీప్కే 85 ఏళ్ల పితృస్వామ్య నాయనమ్మ (అవ్వ) అనారోగ్యం  వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణ వార్త కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ విషాదకర సంఘటన వెనుక తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాయనమ్మ మరణించడానికి కేవలం కొద్ది గంటల ముందే అభిజిత్ దీప్కేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.   జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు అభిజిత్ దీప్కే తన సహచరులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో కలిసి ముంబై నుండి ప్రత్యేకంగా ఢిల్లీకి బయలుదేరారు. కానీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన పోలీసులు, విమానం ల్యాండ్ అయిన వెంటనే నేరుగా విమానంలోకి ప్రవేశించి ముగ్గురు సీజేపీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అభిజిత్ దీప్కే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జాతీయ స్థాయిలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. సరిగ్గా ఈ నిర్బంధం జరిగిన సమయానికే మహారాష్ట్ర నుంచి నాయనమ్మ మృతి చెందిన వార్త ఆయనకు చేరడంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది.    నాయనమ్మ మరణవార్త అందిన తర్వాత కూడా అభిజిత్ దీప్కేను పోలీసులు విడుదల చేస్తారా లేదా అనే దానిపై తీవ్రమైన సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. తన కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతి లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ MIDC వాలుజ్ ప్రాంతంలో ఉన్న అభిజిత్ దీప్కే నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ కేవలం ఒక్క గార్డు మాత్రమే విధుల్లో ఉండగా, ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో హెడ్‌క్వార్టర్స్ నుంచి ఏకంగా 20 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు నిరసన దీక్షల కోసం ఢిల్లీలో నేతల నిర్బంధాలు, మరోవైపు కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విచారాన్ని కలిగించింది.       [ Abhijeet Dipke grandmother, CJP founder detained, Delhi airport detention, Savitribai Dipke death, Hingoli district news, Cockroach Janata Party protest, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ఏడాది ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ షాక్ తర్వాత.. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది భారీ అంచనాలతో పంపిణీ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దిల్ రాజుకు డిస్ట్రిబ్యూటర్‌గా కొంత నిరాశ ఎదురైంది. ముఖ్యంగా యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల హక్కుల వ్యవహారం తర్వాత ఆయన తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల పంపిణీ బాధ్యతలు దిల్ రాజుకు అప్పగించినట్లు కథనాలు వస్తున్నాయి. సౌత్ థియేట్రికల్ రైట్స్ యశ్ వద్ద ఉండటంతో, ఆయన ద్వారా ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఇతిహాసంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగాన్ని నవంబర్ 5న విడుదల చేయాలని, నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించాలని ప్రణాళిక ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చి, ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రామాయణం’కు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే దిల్ రాజుకు పంపిణీదారుడిగా మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంది.  ఇది కూడా చదవండి: ఎవ‌రీ గ‌రివిడి ల‌క్ష్మి?.. నారా లోకేష్ ట్వీట్‌తో ఒక్కసారిగా చర్చ.!       [Ramayana Telugu Release, Ramayana Movie, Dil Raju, Yash, Ranbir Kapoor, Sai Pallavi, Toxic Movie, Telugu Film News]  
భారతీయ చిత్ర పరిశ్రమ సీనియర్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కి ఢిల్లీ హైకోర్టు నుండి ఊహించని షాక్ తగిలింది.అనుమతి లేకుండా తన పేరు, గొంతు, రూపురేఖలను (పర్సనాలిటీ రైట్స్) కొందరు వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన 2022లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  ఈ కేసుకు సంబంధించి జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రతివాదులతో జరుగుతున్న సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తి కాకపోతే, తదుపరి విచారణ నాటికి అమితాబ్ బచ్చన్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేసారు.  ఈ వివాదానికి సంబంధించి కొన్ని వర్గాలతో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరినప్పటికీ, లాజిస్టికల్ కారణాల వల్ల ఇంకా అధికారికంగా కాగితాలపై సంతకాలు పూర్తి కాలేదని న్యాయవాదులు తెలిపారు.  ఇది కూడా చదవండి: '96 'లో జాను రోల్ కి ఎప్పటికి ఫస్ట్ ఛాయస్ ఆ హీరోయిన్ నే: బాంబ్ పేల్చిన దర్శకుడు!        దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, అన్ని రకాల న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేయడానికి నవంబర్ 16, వరకు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఒకవేళ నవంబర్ 16 నాటికి కూడా పూర్తి స్థాయి సెటిల్‌మెంట్ కొలిక్కి రాకపోతే మాత్రం, కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాంటిఫ్ అయిన అమితాబ్ బచ్చన్ కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టు గదిలో ఉండాలని స్పష్టం చేసింది.   [Amitabh Bachchan Delhi High Court Shock, Amitabh Bachchan, Delhi High Court, personality rights case, Big B court hearing, Amitabh Bachchan news, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]  
ప్రేమకి సరికొత్త నిర్వచనంతో పాటు తొలి సారి యువతీ యువకుల మధ్య ఏర్పడిన ప్రేమ  తాలూకు పొరలు చచ్చే వరకు మనసులో నుంచి వెళ్ళవని, ప్రేమ అవతలి వారి సంతోషాన్ని కూడా కోరుకుంటుందని చెప్పిన మూవీ 96 .  త్రిష, విజయ్ సేతుపతి నుంచి  తమిళంలో రాగా  తెలుగులో జాను పేరుతో సమంత, శర్వానంద్ ప్రేక్షకులకి అందించారు. అయితే 96 బాగుందనే టాక్ రావడంతో జాను గా రాక ముందే చాలా మంది   తెలుగు ప్రేమికుల  తమిళంలోచూసేసారు. అందుకే  'సౌత్ ఇండియన్  క్లాసిక్ లవ్ స్టోరీ అనే టాగ్ లైన్ ని ఆభరణంగా ఉంచుకుంది. 2018 అక్టోబర్ 4 న రిలీజవ్వగా రీసెంట్ గా 96 తమిళనాట నిన్న (అక్టోబర్ 9 ) రీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో జాను క్యారక్టర్ కి  సంబంధించి గతంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జాను కోసం మొదట జ్యోతికను సంప్రదించారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై తాజాగా చిత్ర దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'జాను కోసం నా మొదటి,  ఏకైక ఛాయిస్ ఎప్పుడూ త్రిష గారే. స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే నేను  నటీనటులను ఊహించుకుంటాను. అలా రాస్తున్నప్పుడే నా మనసులో జాను గా  కోసం త్రిష రూపమే మెదిలింది. ఇది కూడా చదవండి: 'రణబాలి’కి టికెట్ ధరలే బిగ్ బూస్ట్.. బాక్సాఫీస్‌పై విజయ్ దేవరకొండ ఆశలు!   2015 డిసెంబర్‌లో వచ్చిన చెన్నై భీకర వరదల సమయంలో 96 కథ రాశాను.  అప్పట్లో త్రిష డేట్స్ సర్దుబాటు కావడం కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ, ఆ తర్వాత అన్నీ కుదిరి విజయ్ సేతుపతి సరసన త్రిష నటించేలా షెడ్యూల్స్ అడ్జస్ట్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ  ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ప్రతీ ఏటా సినిమా వార్షికోత్సవం సందర్భంగా రెండేళ్లు, మూడేళ్లు లేదా ఎనిమిదేళ్లు పూర్తయినా కూడా అభిమానులు ఇచ్చే రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. 96 ని కేవలం ఒక సినిమాగా కాకుండా ప్రేక్షకులు తమ జీవితంలో ఒక భాగంగాచూస్తున్నారు. ఆ ప్రేమ తన ఊహకందనిదిగా ఉంది. 2002 వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో  వచ్చిన ఐడియాతో కథ రాస్తున్నానని ప్రేమ్ కుమార్ తెలిపాడు . ప్రేమ్ కుమార్ ప్రీవియస్ మూవీ సత్యం సుందరం.. భారీ బడ్జెట్ కి దూరంగా సమాజంలోని క్యారెక్టర్స్, వాటి మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్, భావోద్వేగాల ఆధారంగా మాత్రమే సినిమాలు తెరకెక్కించడంలో ప్రేమ్ కుమార్ స్పెషలిస్ట్.   [96 Director About 96 Movie Jaanu First Choice Clarification, C Prem Kumar About 96 movie, Jaanu character, Trisha Krishnan, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]    
సోషల్ మీడియాలో పాటలు, టీజర్‌తో ఆసక్తి రేపుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనలో ఆసక్తి కలిగించిందని, గరివిడి లక్ష్మి ఎవరు? ఆమె కథేంటి? అని ఆరా తీసినట్లు వెల్లడించారు. బుర్రకథ కళనే జీవితంగా బతుకుతూ, ఆ కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందడం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. చదువుకోకపోయినా సంప్రదాయ బుర్రకథకు ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలను జోడించి ఆ కళకు కొత్త వన్నె తీసుకొచ్చిన గరివిడి లక్ష్మి కథను తెరపై చూసేందుకు తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నారా లోకేశ్ తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు. జానపద కళలకు ఆదరణ తగ్గుతోందనే చర్చ జరుగుతున్న తరుణంలో, బుర్రకథ కళాకారిణి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్రకు చెందిన రెడ్డి విజయలక్ష్మి జీవిత ప్రయాణం, ఆమె కళా ప్రస్థానం ఈ సినిమాకు ప్రధాన ఆధారం. సంప్రదాయ బుర్రకథలో స్థానిక జానపద పదాలను కలిపి ప్రేక్షకులకు చేరువ చేసిన ఆమె జీవితంలోని విశేషాలను ఈ చిత్రం పరిచయం చేయనుంది. ఈ సినిమాలో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తుండగా, ఆమె తల్లిగా రాశి కనిపించనున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాధారణంగా బయోపిక్‌లు అంటే ప్రముఖుల జీవితాలకే పరిమితమవుతుంటాయి. కానీ గ్రామీణ కళను తన జీవితంగా మలుచుకున్న ఓ కళాకారిణి కథను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలుస్తోంది. నారా లోకేశ్ ప్రశంసలతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. మరి అక్టోబర్ 17న విడుదల కానున్న గరివిడి లక్ష్మి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  ఇది కూడా చదవండి: గరివిడి లక్ష్మి ఎవరు: బయోపిక్ తీసే అంతలా ఆమె ఏం చేసింది.? https://x.com/naralokesh/status/2108868050888053064       [Nara Lokesh Tweet On Garividi Lakshmi, Nara Lokesh Twitter, Garividi Lakshmi Movie, Actress Anandhi, Reddy Vijayalakshmi, Burrakatha Artist, Nara Lokesh, Garividi Lakshmi, Telugu Film News]
Nani is set to sport a never-seen-before look in his next film, Bloody Romeo. After spending over two years shooting for The Paradise, the actor is ready to move on to this gangster drama directed by Sujeeth, who is known for presenting his leading men in a stylish avatar. Sujeeth has personally overseen Nani’s makeover for the film, giving him a trendy new hairstyle and stylish spectacles. The makers have completed a photoshoot, offering a glimpse of Nani’s revamped look without revealing his complete appearance. After a rooted mass actioner like The Paradise, Nani appears to be shifting gears with a look that promises to be classy, charming and distinctly different from his earlier outings. The combination of Nani and Sujeeth has already generated considerable buzz following the announcement glimpse. Known for films like Run Raja Run, Saaho and OG, Sujeeth is now gearing up to present Nani in a stylish new light with Bloody Romeo. Produced by Venkat Boyanapalli on a massive scale, the film is gearing up for its next phase, with the makers announcing that the Bloody Romeo kitchen will open very soon. The project is expected to offer a fresh cinematic experience, with Nani’s makeover adding to the curiosity surrounding this much-awaited collaboration. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Sree Vishnu’s Comrade Kalyan is gaining momentum at the box office, with the film’s positive word of mouth growing with each show. The comedy entertainer grossed over Rs. 4 crore worldwide on its opening day, including US$100K in North America. The makers held a success press meet, with Sree Vishnu and presenter Kona Venkat interacting with the media. “We are happy that with each show the positive Word Of Mouth is growing across Telugu States. From first and second shows on Day 1, family audiences started coming to theatres and they are enjoying it, thoroughly,” Sree Vishnu said. The actor said the team had been hoping to win over family audiences, which he believes is crucial for a comedy entertainer to sustain its run. “I have been waiting for family audiences to watch the film and as anticipated, they loved it. We are all hoping for the movie to have a long run during the holidays,” he added. Sree Vishnu also spoke about the film’s approach, saying, “We thought that the movie will be loved by family audiences and once, they like it any movie will be a big hit. I am happy and thrilled that our movie is garnering such great reception.” He further explained, “From first and second shows on Day 1, we saw family audiences coming to theatres and they are enjoying it with their kids. We took a very serious backdrop and tried to balance the comical approach throughout. With such a positive word of mouth, we are expecting that the movie will have a long run.” Directed by Janakiram Marella, Comrade Kalyan is produced by Venkata Krishna Karnati and Seetha Karnati, with Kona Venkat presenting it. Music is composed by Vijai Bulganin. The film’s Day 2 bookings have reportedly remained strong, with advance housefulls in several areas. The makers are hoping the positive response will translate into a sustained run through the Dasara holiday season. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? షూటింగ్‌లో దర్శకుల ప్లానింగ్ ఎంత ముఖ్యం? ఈ అంశాలపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.  సినిమా నిడివిపై అవగాహన లేకుండా గంటల కొద్దీ ఫుటేజీ షూట్ చేసి, చివరకు ఎడిటింగ్‌లో దాన్ని తొలగించే దర్శకులను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని కోన వెంకట్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “అలాంటి దర్శకులు ఇండస్ట్రీకి క్రిమినల్స్‌తో సమానం” అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కోన వెంకట్.. సరైన ప్రణాళిక లేకుండా సినిమాలు తెరకెక్కించే కొందరు దర్శకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 3 గంటల 50 నిమిషాల ఫుటేజీని షూట్ చేసి, అందులో గంటన్నర లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని ఎడిటింగ్‌లో తొలగిస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అంతసేపు షూటింగ్ చేయడానికి ఖర్చయ్యే డబ్బు ఎవరిదని ఆయన నిలదీశారు. నిర్మాతలు అప్పులు చేసి, తమ కుటుంబాల భవిష్యత్తును పణంగా పెట్టి సినిమాలపై పెట్టుబడులు పెడతారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ముందస్తు ప్రణాళిక లేకుండా కోట్ల రూపాయల విలువైన ఫుటేజీని వృథా చేయడం ఎంతవరకు సమంజసమన్నది ఆయన నిలదీశారు. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది పూర్తిగా ఎవరి చేతుల్లోనూ ఉండదని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే షూటింగ్‌కు ముందే కథ, సన్నివేశాలు, సినిమా నిడివి వంటి అంశాలపై స్పష్టతతో ఉండటం మాత్రం దర్శకుడి బాధ్యత అని అన్నారు. కనీస ప్రణాళిక, అవగాహన లేకుండా నిర్మాతలను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టే దర్శకులను పరిశ్రమ నుంచి నిషేధించాలని కోన వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఒక్కో సినిమాకు 8 కోట్లా.. రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.!       [Kona Venkat Comments On Directors, Comrade Kalyan Movie, Kona Venkat, Telugu Film Industry, Directors Planning, Movie Runtime, Producer Losses, Telugu Film News]  
విజయ్ దేవరకొండ హిట్ అందుకొని చాలా యేండ్లు అవుతుంది. కానీ క్రేజ్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బాక్స్ ఆఫీస్ పై నా జెండా పాతడం పక్కా అంటూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రణబాలి’ తో వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ సైతం 'రణబాలి' ట్రైలర్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడంటే 'రణబాలి’ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.    అక్టోబర్ 16 రిలీజ్ డేట్ కావడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ‘రణబాలి’ సినిమా టికెట్ ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలకు మొదటి వారం లేదా ప్రీమియర్ షోల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రత్యేక ధరల పెంపు కోరడం టాలీవుడ్‌లో రివాజుగా మారింది. కానీ, ‘రణబాలి’ చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుని అభిమానులకు అదిరిపోయే గుడ్ నూస్ అందించింది.   సినిమా టికెట్ ధరల పెంపుపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: అలియాస్ రుక్మిణి: ఈ సుందరినేనా!      ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తాము ఎలాంటి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలను ఆశ్రయించలేదని, సినిమాను కేవలం స్టాండర్డ్ (సాధారణ) ధరలకే విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల అటు సినీ వర్గాలలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సులభంగా ఆస్వాదించవచ్చని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.  విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ ‘రణబాలి’ క్యారక్టర్ లో కనిపించనుండగా, ఆయన సరసన జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటీష్ క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. భారీ తారాగణం, ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.   Ranabaali Ticket Prices Update, Vijay Deverakonda, Ranabaali movie, Ranabaali ticket prices, Rashmika Mandanna, Mythri Movie Makers, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచ తపాలా దినోత్సవం..  సమాచార ప్రసారంలో చెరగని ముద్ర..    మానవ సమాజ పురోగతిలో, సంబంధాలను దగ్గర చేయడంలో  తపాలా వ్యవస్థ నిర్వహించిన పాత్ర చాలా కీలకమైనది. కాలం ఎంత వేగంగా మారినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రూపాంతరం చెందినప్పటికీ ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ప్రాచీన, ప్రభావవంతమైన మార్గాలలో తపాలా వ్యవస్థ మొదటి వరుసలో నిలుస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ తపాలా దినోత్సవం (వరల్డ్ పోస్ట్ డే) తపాలా వ్యవస్థ  చారిత్రక ప్రాధాన్యతను, సమకాలీన ఉపయోగాలను స్మరించుకోవడానికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.  ఈ సందర్బంగా తపాలా వ్యవస్థ గురించి,  ఆవిర్భావం గురించి,  అందులో ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. చారిత్రక నేపథ్యం.. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఉత్తరాల రవాణాను, సమాచార మార్పిడిని క్రమబద్ధీకరించడానికి ఈ సంస్థ ప్రాణం పోసుకుంది. ఆ చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా, 1969లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్‌లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించారు. నాటి నుండి ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో ప్రపంచ దేశాలన్నీ ఈ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ తపాలా దినోత్సవ లక్ష్యం.. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, మానవుల రోజువారీ జీవితంలో, వ్యాపార లావాదేవీలలో తపాలా రంగానికి ఉన్న ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం. రెండోది, ఒక దేశ సామాజిక, ఆర్థిక వికాసంలో తపాలా వ్యవస్థ అందిస్తున్న సహకారాన్ని గుర్తించడం. సరిహద్దులు, భాషలు, సంస్కృతులు వేరైనా ప్రజలను మానసికంగా దగ్గర చేయడంలో ఉత్తరం ఒక వారధిగా పనిచేసింది. మారుతున్న కాలం - రూపాంతరం చెందుతున్న తపాలా సేవలు.. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్శిళ్ల రవాణాకే పరిమితమైన తపాలా శాఖ, కాలానికి అనుగుణంగా తనను తాను సరికొత్తగా మలచుకుంది. నేడు డిజిటల్ విప్లవంలో భాగమై సాంకేతిక సేవలను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చింది. తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి డిజిటల్ చెల్లింపులు, సేవింగ్స్ ఖాతాలు, భీమా సేవలను గ్రామగ్రామానికీ విస్తరించింది. ఈ-కామర్స్ రంగం విస్తరించిన తరుణంలో వస్తువుల వేగవంతమైన రవాణాకు పోస్టల్ పార్శిల్ సేవలు వెన్నెముకగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ఫించన్లు, సబ్సిడీలను చివరి మైలు వరకు చేర్చడంలో పోస్టల్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ నమోదు, అప్డేట్  నుండి వివిధ రకాల ప్రభుత్వ ధృవీకరణ పత్రాల పంపిణీ వరకు ఎన్నో పౌర సేవలు తపాలా కార్యాలయాల ద్వారా సులభంగా అందుతున్నాయి. మానవీయ సంబంధాల తీపి గుర్తు.. సాంకేతికత పెరిగి ఈమెయిళ్లు, వెంటనే మెసేజ్ లు  యుగం వచ్చినప్పటికీ, చేతిరాతతో రాసిన ఉత్తరంలో ఉండే ఆత్మీయత, భావోద్వేగం ప్రత్యేకమైనవి. తపాలా బిళ్ళలు  అంటే స్టాంపులు.. ఒక దేశ సంస్కృతి, చరిత్ర, సైన్స్, ప్రకృతి సౌందర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. స్టాంపుల సేకరణ (ఫిలాటెలీ) నేటికీ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించే  వ్యాపకముగా వర్ధిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనుసంధానిస్తూ, నమ్మకానికి  మారుపేరుగా నిలిచిన తపాలా వ్యవస్థస సేవలను గుర్తించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. సాంకేతిక పురోగతితో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటూ, ఆధునిక సేవలతో ముందుకు సాగుతున్న తపాలా రంగానికి మద్దతుగా నిలవడం, దాని ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ రోజు మనం ఇచ్చే నిజమైన నివాళి.                                                                                                                                     *రూపశ్రీ.
 అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.! ఏదైనా ఒక అందమైన బంధానికి అతి ముఖ్యమైన పునాది ప్రేమ , పరస్పర నమ్మకం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు ఆ బంధంలో నమ్మకమే ప్రధాన ఊపిరిగా పనిచేస్తుంది. అయితే అదే నమ్మకం స్థానంలో చిన్నగా అనుమానం ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధమైనా క్రమంగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు. భాగస్వామి ప్రతి చిన్న కదలికను తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి భయపడటం , మనస్సులోనే ఎప్పుడూ  ఆలోచిస్తూ ఉండటం బంధంలో మానసిక దూరాన్ని పెంచుతాయి. అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో , దానిని ఎలా అధిగమించవచ్చో  వివరంగా తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం.. భాగస్వామి ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఆలస్యమైంది అని సాధారణంగా అడిగే ప్రశ్నలు,  ఇవి ప్రేమకు సంకేతం కావచ్చు. కానీ అదే పనిగా ప్రతి నిమిషం వివరాలు అడుగుతూ, వారి సమాధానాలను తప్పు పడుతుంటే అది భద్రతాభావం లోపించడానికే సూచిక. భాగస్వామిని నిరంతరం ప్రశ్నించడం వల్ల వారికి తమ స్వతంత్రతను కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఇది వారిలో తీవ్రమైన ఒత్తిడిని, అసహనాన్ని నింపుతుంది. ప్రైవసీకి భంగం కలిగించడం.. ఒకరి ఫోన్‌ను దొంగతనంగా చూడటం, మెసేజ్‌లు , కాల్ హిస్టరీ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ పై  నిరంతరం నిఘా పెట్టడం వంటి పనులు బంధంలో వ్యక్తిగత లిమిట్స్ ను దాటడమే అవుతాయి. నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి పనులు ఎంతమాత్రం ఉపయోగపడవు. పైగా ఇవి భాగస్వామికి తమపై అసలు గౌరవం లేదనే భావనను కలిగిస్తాయి. ఆధారాలు లేకుండా నిందలు వేయడం.. భాగస్వామి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయనప్పుడు లేదా మెసేజ్‌కు ఆలస్యంగా రిప్లై ఇచ్చినప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేరుగా ఏదో తప్పు జరుగుతోందని నిర్ణయానికి రావడం చాలా ప్రమాదకరం. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిందలు వేయడం వల్ల భాగస్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతారు. విషయాలను సూటిగా అడిగి తెలుసుకోవడానికి బదులు ఊహించుకోవడం వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. బంధంలో మానసిక దూరం పెరగడం.. నిరంతరం అనుమానాలు, నిందలు ఎదుర్కొనే భాగస్వామి మానసికంగా అలసిపోతారు. తమను ప్రతి విషయంలోనూ తప్పుగా భావిస్తున్నారని అనిపించినప్పుడు వారు క్రమంగా మాట్లాడటం తగ్గించేస్తారు. మరోవైపు అనుమానించే వ్యక్తి కూడా నిరంతరం ఆందోళన, భయంతో గడుపుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయి మానసిక దూరం చాలా వేగంగా పెరుగుతుంది. అనుమానానికి అసలు కారణాలు.. అనుమానించే అలవాటు ఎప్పుడూ భాగస్వామి చేసే తప్పుల వల్లే రావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న చేదు అనుభవాలు, చిన్నతనంలో ఎదురైన మానసిక సంఘటనలు, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా భాగస్వామిని ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేస్తాయి. ముందుగా ఈ భయాలకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. బంధాన్ని కాపాడుకోవడానికి మార్గాలు.. ముందుగా  మనస్సులో కలిగే అనుమానాలు నిజమైన సంఘటనల ఆధారంగా వస్తున్నాయా లేదా కేవలం  భయాల వల్ల వస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిపై నిందలు వేసే విధంగా కాకుండా మీ భయాలు, ఆందోళనల గురించి వారితో ప్రశాంతంగా, ఓపేన్ గా  మాట్లాడాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అనుమానాలు మరీ ఎక్కువై బంధం చేజారిపోతోందని అనిపిస్తే దంపతులు మంచి కౌన్సెలర్ లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది.                                 *రూపశ్రీ.
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది రోజంతా నిలబడి పనిచేయడం, గంటల తరబడి డెస్క్ ఉద్యోగాలు చేయడం వల్ల తీవ్రమైన కాళ్ల నొప్పులు, పాదాల వాపులు మరియు మానసిక అలసటతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉప్పుతో అద్భుతమైన ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పుపై కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు నిలబడటం లేదా ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల శరీరం మరియు మనసుకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన కాళ్లకు ఈ సాధారణ పద్ధతి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఉప్పులో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు చర్మం ద్వారా సులభంగా శోషించబడి, కాళ్లలోని బిగుసుకుపోయిన కండరాలను పూర్తిగా సడలిస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని దారుణంగా తగ్గించి, మనసుకు అపారమైన ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా, ఈ అద్భుతమైన ఉప్పు చికిత్స కాళ్లలోని రక్త నాళాలను శక్తివంతంగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల శరీరంలోని కింది భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటించడం వల్ల దీర్ఘకాలిక కాళ్ల తిమ్మిర్లు, కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కీళ్ల నొప్పులు లేదా పాదాల వాపులతో బాధపడేవారికి ఉప్పు చికిత్స ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఉప్పులో ఉండే సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను మరియు వాపులను వేగంగా నివారిస్తాయి. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య దృక్పథం ప్రకారం ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఉప్పుపై నిలబడటం వల్ల శరీరంలోని వ్యర్థాలతో పాటు మానసిక ఆందోళనలు, నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఈ అద్భుతమైన చికిత్సను ఇంట్లోనే సులభంగా ఆచరించవచ్చు. ఒక టబ్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు సముద్రపు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు వేసి, మీ పాదాలను అందులో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఈ పద్ధతి పాదాల మృదుత్వాన్ని పెంచడంతో పాటు రాత్రిళ్లు గాఢమైన మరియు ప్రశాంతమైన నిద్ర పట్టేలా అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఒత్తిడికి దూరంగా ఉంటూ, మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సులభమైన చికిత్సను నిరభ్యంతరంగా మీ దినచర్యలో భాగం చేసుకోండి.       [Foot Soaking Benefits, Salt Water Foot Soak, Sea Salt, Rock Salt Benefits, Foot Pain Relief, Swollen Feet, Blood Circulation, Joint Pain Relief, Stress Relief, Better Sleep]
మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవితంలో ఏ పనైనా ఉత్సాహంగా, సంతోషంగా చేయగలం. శరీరానికి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా లేదా జ్వరం వచ్చినా మనం వెంటనే వైద్యుడి వద్దకు పరుగెడతాం. కానీ మనస్సు బాధపడినా, తీవ్రమైన ఒత్తిడికి గురైనా బయటకు చెప్పకుండా లోపలనే దాచేస్తుంటాం. నేటి వేగవంతమైన ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ విషయాలుగా మారిపోయాయి. శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మనస్సుకు కూడా ప్రశాంతత అంతే అవసరమని అందరికీ గుర్తుచేయడానికే ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పరిష్కారమే వైద్యం.. మన సమాజంలో చాలామంది మానసిక సమస్యల గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని తెలిస్తే వారిని వేరేలా చూస్తారేమోననే భయం చాలామందిలో ఉంటుంది. కానీ శరీరానికి అనారోగ్యం చేసినట్లే మనస్సుకు కూడా అలసట, ఆందోళన రావడం చాలా సహజమైన విషయం. దీనిని గుర్తించి సరైన సమయంలో స్పందించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. చిన్న మార్పులు.. పెద్ద ఫలితాలు.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు నడవడం లేదా సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. సమయానికి పోషకాహారం తీసుకోవడం, రాత్రి పూట సరిపడా నిద్రపోవడం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియాకు దూరం.. నేటి డిజిటల్ యుగంలో రోజంతా ఫోన్లు, సోషల్ మీడియాతో గడపడం కూడా మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజులో కొంత సమయం ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో, మిత్రులతో సరదాగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.  ఇష్టమైన పుస్తకాలు చదవడం, పాటలు వినడం లేదా తోటపని వంటి చిన్న చిన్న వ్యాపకాలు మనస్సులోని ఆందోళనలను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్యం మన చేతుల్లోనే.. అన్నింటికంటే ముఖ్యమైనది మనసులోని భావాలను దాచుకోకపోవడం. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు నమ్మకమైన వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడాలి. అవసరమైతే మానసిక నిపుణులు లేదా కౌన్సెలర్ల సలహా తీసుకోవడంలో ఎలాంటి భయం కానీ, మొహమాటం కానీ ఉండకూడదు. మానసిక ప్రశాంతత అనేది మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించి, మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.                                  *రూపశ్రీ.
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తారు. అందుకే రోజూ గ్రీన్ టీ తాగడాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే గ్రీన్ టీని ఎలా ఎంచుకోవాలి? ఏ ఆకులతో తయారుచేసిన టీ తాగాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? గ్రీన్ టీ ఒక్కటే తాగితే బరువు తగ్గుతారా? ఇలాంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. ఈ వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గ్రీన్ టీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వివరించారు. గ్రీన్ టీ తయారీకి ఉపయోగించే ఆకులు, వాటిని ఉపయోగించే విధానం, టీ తాగడానికి అనువైన సమయాల గురించి తెలియజేశారు. గ్రీన్ టీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి విషయాలను గమనించాలి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? అనే అంశాలపై అవగాహన కల్పించారు. గ్రీన్ టీతో పాటు మన చుట్టూ సులభంగా లభించే కొన్ని ఆకులతో కూడా హెర్బల్ టీ తయారుచేసుకోవచ్చు. పారిజాతం ఆకులు, జామ ఆకులు, రేగు ఆకులు, మారేడు లేదా బిల్వ ఆకులు, తులసి ఆకులు, నేరేడు ఆకులతో తయారుచేసే హెర్బల్ టీల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి? వాటితో టీ తయారుచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా డాక్టర్ శిరీష వివరించారు. గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గుతారా?  బరువు తగ్గాలనుకునేవారిలో గ్రీన్ టీపై ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే గ్రీన్ టీ తాగడం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదు. సరైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా ముఖ్యమే. కేవలం గ్రీన్ టీపై ఆధారపడకుండా, రోజువారీ అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో లభించే గ్రీన్ టీ రకాలు, వివిధ ఆకులతో తయారుచేసే హెర్బల్ టీలు, వాటిని తీసుకునే విధానం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యకరమైన పానీయాల కోసం చూస్తున్నవారు గ్రీన్ టీ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి? ఏ ఆకులతో హెర్బల్ టీ తయారుచేసుకోవచ్చు? గ్రీన్ టీ గురించి మనకు తెలిసిన విషయాల్లో అపోహలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ శిరీష వివరణను పూర్తిగా చూడండి. గమనిక: హెర్బల్ టీలు సహజమైన ఆకులతో తయారుచేసినవే అయినప్పటికీ, అవన్నీ అందరికీ ఒకే విధంగా సరిపోతాయని చెప్పలేం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు, గర్భిణులు వైద్యుల సలహాతోనే కొత్త హెర్బల్ పానీయాలను తీసుకోవాలి. బరువు తగ్గడానికి గ్రీన్ టీని మాత్రమే పరిష్కారంగా భావించకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)