LATEST NEWS
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా శాంతుక్ పింప్రి గ్రామానికి చెందిన అభిజిత్ దీప్కే 85 ఏళ్ల పితృస్వామ్య నాయనమ్మ (అవ్వ) అనారోగ్యం  వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణ వార్త కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ విషాదకర సంఘటన వెనుక తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాయనమ్మ మరణించడానికి కేవలం కొద్ది గంటల ముందే అభిజిత్ దీప్కేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.   జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు అభిజిత్ దీప్కే తన సహచరులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో కలిసి ముంబై నుండి ప్రత్యేకంగా ఢిల్లీకి బయలుదేరారు. కానీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన పోలీసులు, విమానం ల్యాండ్ అయిన వెంటనే నేరుగా విమానంలోకి ప్రవేశించి ముగ్గురు సీజేపీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అభిజిత్ దీప్కే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జాతీయ స్థాయిలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. సరిగ్గా ఈ నిర్బంధం జరిగిన సమయానికే మహారాష్ట్ర నుంచి నాయనమ్మ మృతి చెందిన వార్త ఆయనకు చేరడంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది.    నాయనమ్మ మరణవార్త అందిన తర్వాత కూడా అభిజిత్ దీప్కేను పోలీసులు విడుదల చేస్తారా లేదా అనే దానిపై తీవ్రమైన సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. తన కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతి లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ MIDC వాలుజ్ ప్రాంతంలో ఉన్న అభిజిత్ దీప్కే నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ కేవలం ఒక్క గార్డు మాత్రమే విధుల్లో ఉండగా, ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో హెడ్‌క్వార్టర్స్ నుంచి ఏకంగా 20 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు నిరసన దీక్షల కోసం ఢిల్లీలో నేతల నిర్బంధాలు, మరోవైపు కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విచారాన్ని కలిగించింది.       [ Abhijeet Dipke grandmother, CJP founder detained, Delhi airport detention, Savitribai Dipke death, Hingoli district news, Cockroach Janata Party protest, Telugu One, Telugu News ]  
నవంబర్ 15లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి..  ముఖ్యమంత్రి ఆదేశాలు.! ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు సుదీర్ఘంగా చర్చించారు. రాజీవ్ రంజన్ కమిషన్ అందించిన సమగ్ర నివేదికను ఆధారంగా చేసుకుని, రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు దక్కాల్సిన వాటాను ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్ధారించింది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లతో పాటు మున్సిపల్ వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్‌ పదవులు.. ఇలా మొత్తం ఎనిమిది ప్రధాన కేటగిరీల్లో రిజర్వేషన్లను స్పష్టంగా విభజించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. వివిధ స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన శాతాలను పరిశీలిస్తే.. పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచ్‌ స్థానాలకు 27.95 శాతం మేర కోటా దక్కనుంది. అదేవిధంగా, మండల  జిల్లా పరిషత్ స్థానాల్లోనూ బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీటీసీ స్థానాలకు 25.55 శాతం, ఎంపీపీ మరియు జడ్పీటీసీ స్థానాలకు 24.60 శాతం చొప్పున, అలాగే జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు 23.08 శాతం మేర రిజర్వేషన్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లోనూ బీసీలకు పెద్దపీట వేస్తూ అర్బన్ వార్డు సభ్యులకు 32.78 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని మంత్రులకు సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థల ఉన్నత పదవులైన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాల్లో 32.03 శాతం, మేయర్ స్థానాల్లో ఏకంగా 35.02 శాతం మేర బీసీలకు కేటాయించడం విశేషం. ఈ కేటాయింపుల ద్వారా బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం లభిస్తుందని పాలకవర్గం భావిస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల లెక్కల ఆధారంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.       [ AP local body elections, BC reservations AP, AP Cabinet decisions, CM Chandrababu Naidu, Rajeev Ranjan Commission, Andhra Pradesh news, local polls quota, Nara lokesh, Telugu One, Telugu News ]  
  శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.! తిరుమల తిరుపతి శ్రీవారి హుండీ లెక్కింపు ప్రక్రియలో ఆటోమేషన్‌ను పెంపొందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. పరకామణి విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చి, లెక్కింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న పరకామణి కుంభకోణం నేపథ్యంలో లెక్కింపులో మానవ ప్రమేయాన్ని వీలైనంత తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులు హుండీలో కరెన్సీ నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు, వివిధ రకాల పత్రాలను కానుకలుగా సమర్పిస్తుంటారు.  ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో సుమారు 250 నుంచి 300 మంది కార్మికులు నిమగ్నమవుతున్నారు.శ్రీవారి హుండీకి సగటున రోజుకు 150 నుంచి 220 బస్తాల నాణేలు, భారీగా కరెన్సీ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ మొత్తంలో వచ్చే కానుకలను లెక్కించడం సిబ్బందికి శ్రమతో కూడుకున్న పని కావడంతో ఆటోమేషన్‌పై టీటీడీ దృష్టి సారించింది.హుండీలో వచ్చే కరెన్సీ నోట్లు, నాణేలు, బంగారు ఆభరణాలను యంత్రాల ద్వారా ఆటోమేటిక్‌గా వేరు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది.  ఇప్పటికే శ్రీవారి హుండీలోని 14 రకాల నాణేలను లెక్కించేందుకు జర్మనీ నుంచి వచ్చిన రెండు అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ యంత్రాల వినియోగంతో లెక్కింపు ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మానవ ప్రమేయం తగ్గి, అవకతవకలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వందలాది మంది కార్మికులు పాల్గొంటున్న హుండీ లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది అవసరాన్ని గణనీయంగా తగ్గించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సుమారు 100 మంది చేసే పనిని 15 నుంచి 20 మంది సిబ్బంది పర్యవేక్షణలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఈ ప్రాజెక్టుపై టీటీడీ అధికారులు సమావేశం కానున్నారు. ఆటోమేషన్ విధానం అమలు, యంత్రాల వినియోగం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. తొలుత తిరుమలలో ఈ నూతన విధానాన్ని అమలు చేసి, అనంతరం తిరుపతిలోని సంబంధిత ఆలయాలకు కూడా విస్తరించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే హుండీ లెక్కింపు మరింత వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు విలువైన కానుకలను సమర్పించారు. ఇందులో భాగంగా జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు శనివారం శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షల విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్‌తో పాటు.. రూ.7.20 లక్షల విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన మూడు వరుసల ముత్యాలహారం ఉన్నాయి. ఈ హారం బరువు 27 గ్రాములు.ఈ ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు దాత ఆర్తి బిందాల్ దంపతులు అందజేశారు.     [ Tirumala Lord Venkateswara, Aarti Bindal, TTD Chairman BR Naidu, Jaipur couple donation, BIRRD Trust, Tirumala Tirupati Devasthanams, Parakamani, CM Chandrababu, Naralokesh ]
ALSO ON TELUGUONE N E W S
సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? షూటింగ్‌లో దర్శకుల ప్లానింగ్ ఎంత ముఖ్యం? ఈ అంశాలపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.  సినిమా నిడివిపై అవగాహన లేకుండా గంటల కొద్దీ ఫుటేజీ షూట్ చేసి, చివరకు ఎడిటింగ్‌లో దాన్ని తొలగించే దర్శకులను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని కోన వెంకట్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “అలాంటి దర్శకులు ఇండస్ట్రీకి క్రిమినల్స్‌తో సమానం” అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కోన వెంకట్.. సరైన ప్రణాళిక లేకుండా సినిమాలు తెరకెక్కించే కొందరు దర్శకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 3 గంటల 50 నిమిషాల ఫుటేజీని షూట్ చేసి, అందులో గంటన్నర లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని ఎడిటింగ్‌లో తొలగిస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అంతసేపు షూటింగ్ చేయడానికి ఖర్చయ్యే డబ్బు ఎవరిదని ఆయన నిలదీశారు. నిర్మాతలు అప్పులు చేసి, తమ కుటుంబాల భవిష్యత్తును పణంగా పెట్టి సినిమాలపై పెట్టుబడులు పెడతారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ముందస్తు ప్రణాళిక లేకుండా కోట్ల రూపాయల విలువైన ఫుటేజీని వృథా చేయడం ఎంతవరకు సమంజసమన్నది ఆయన నిలదీశారు. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది పూర్తిగా ఎవరి చేతుల్లోనూ ఉండదని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే షూటింగ్‌కు ముందే కథ, సన్నివేశాలు, సినిమా నిడివి వంటి అంశాలపై స్పష్టతతో ఉండటం మాత్రం దర్శకుడి బాధ్యత అని అన్నారు. కనీస ప్రణాళిక, అవగాహన లేకుండా నిర్మాతలను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టే దర్శకులను పరిశ్రమ నుంచి నిషేధించాలని కోన వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఒక్కో సినిమాకు 8 కోట్లా.. రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.!       [Kona Venkat Comments On Directors, Comrade Kalyan Movie, Kona Venkat, Telugu Film Industry, Directors Planning, Movie Runtime, Producer Losses, Telugu Film News]  
విజయ్ దేవరకొండ హిట్ అందుకొని చాలా యేండ్లు అవుతుంది. కానీ క్రేజ్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బాక్స్ ఆఫీస్ పై నా జెండా పాతడం పక్కా అంటూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రణబాలి’ తో వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ సైతం 'రణబాలి' ట్రైలర్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడంటే 'రణబాలి’ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.    అక్టోబర్ 16 రిలీజ్ డేట్ కావడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ‘రణబాలి’ సినిమా టికెట్ ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలకు మొదటి వారం లేదా ప్రీమియర్ షోల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రత్యేక ధరల పెంపు కోరడం టాలీవుడ్‌లో రివాజుగా మారింది. కానీ, ‘రణబాలి’ చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుని అభిమానులకు అదిరిపోయే గుడ్ నూస్ అందించింది.   సినిమా టికెట్ ధరల పెంపుపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: అలియాస్ రుక్మిణి: ఈ సుందరినేనా!      ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తాము ఎలాంటి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలను ఆశ్రయించలేదని, సినిమాను కేవలం స్టాండర్డ్ (సాధారణ) ధరలకే విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల అటు సినీ వర్గాలలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సులభంగా ఆస్వాదించవచ్చని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.  విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ ‘రణబాలి’ క్యారక్టర్ లో కనిపించనుండగా, ఆయన సరసన జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటీష్ క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. భారీ తారాగణం, ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.   Ranabaali Ticket Prices Update, Vijay Deverakonda, Ranabaali movie, Ranabaali ticket prices, Rashmika Mandanna, Mythri Movie Makers, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి పారితోషికంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఒక్కో సినిమాకు ఆమె రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన శ్రీనిధి.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో వచ్చిన విజయంతో శ్రీనిధి శెట్టి పారితోషికం భారీగా పెంచేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలేనని, అలాంటప్పుడు రూ.7–8 కోట్లు డిమాండ్ చేస్తున్నాననే ప్రచారం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. డబ్బు సంపాదించడమే తన లక్ష్యమైతే ఈపాటికి 20 నుంచి 30 సినిమాలు చేసి ఉండేదాన్నని శ్రీనిధి అన్నారు. కానీ తనకు నచ్చిన కథలు, మంచి పాత్రలు ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని భావిస్తానని ఆమె తెలిపారు. పారితోషికం ఒక్కటే సినిమా అంగీకరించడానికి ప్రామాణికం కాదన్నది ఆమె మాటల్లో స్పష్టమవుతోంది. యశ్ సరసన ‘కేజీఎఫ్’ చిత్రాల్లో రీనా దేశాయ్‌గా కనిపించిన శ్రీనిధి, ఆ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విక్రమ్‌తో ‘కోబ్రా’, నానితో ‘హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వెంకటేశ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా గుర్తింపు వచ్చిన తర్వాత పారితోషికం పెంచుకోవడం సహజమే అయినా, తన విషయంలో మాత్రం డబ్బు కంటే కథ, పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని శ్రీనిధి చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి ‘ఆదర్శ కుటుంబం’తో ఆమె ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఇది కూడా చదవండి: 'అత్తరు సాయిబో రారా' సాంగ్‌ ఫుల్ లిరిక్స్!         [Srinidhi Shetty Remuneration, Srinidhi Shetty 8 Crore Salary, Srinidhi Shetty, KGF Actress, Aadarsha Kutumbam, Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]  
  ఇక చాలు బాబు ప్లాపులు అనుకునే పరిస్థితి నుంచి రాబోయే చిత్రాలతో  హిట్టు మీద హిట్టు మన సొంతం అనేలా నితిన్ తన అప్ కమింగ్ ట్రాక్ లైన్ ని  ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే డిసెంబర్ డిసెంబర్ 4 న 'అలియాస్ రుక్మిణితో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నాడు. అయితే టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రుక్మిణి గా  బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ (Aafiya Syed)  కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, రుక్మిణీ గా ఎవరు కనిపించబోతున్నారనేది మేకర్స్  అక్టోబర్ 13న అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది కూడా చదవండి: వార్: ఈ యుద్దాన్ని ఆపేవారు ఉన్నారా!     ఆఫియా సయ్యద్ అయితే మాత్రం తెలుగు ప్రేక్షకుల పంట పండినట్టే. ఆఫియా ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ నెల 2 న రిలీజైన 'ప్రేమ్ కితాను' తో సందడి చేస్తూ ఉంది. అలియాస్ రుక్మిణి ప్రమోషన్స్ అప్పుడే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌పై నాచురల్ స్టార్ నాని  భాగస్వామ్యం ఉండటం సినిమాపై హైప్‌ను మరింతగా పెంచేసింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు.   [Nithiin Alias Rukmini Heroine Aafiya Syed, Nithiin, Alias Rukmini Release Date, Nani, Aafiya Syed, December 4 release,Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]    
డిసెంబర్ లో తెలుగు సినిమా 'తగ్గేదెలే' అనే రీతిలో తన ప్రతాపాన్ని చూపించనుంది. అందుకే వింటర్ అయిన సినీ సమ్మర్ మాత్రం పక్కా. ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీన టాలీవుడ్ తెరపై ఊహించని రీతిలో భారీ పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఒకే రోజున పలువురు యువ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  నాగచైతన్య, నితిన్, విశ్వక్‌సేన్ వంటి ప్రముఖ హీరోలు ఒకే తేదీని టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. నాగచైతన్య ప్రెస్టేజియస్ట్ మూవీ 'వృషకర్మ' డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు చిత్రబృందం చాలాకాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది. 'విరూపాక్ష' వంటి సంచలన విజయం అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో గోల్డెన్ లెగ్ సుందరి 'మీనాక్షి చౌదరి' హీరోయిన్. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు  నితిన్  'అలియాస్ రుక్మిణి' కూడా సరిగ్గా అదే డిసెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 'దండోరా' ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా నాచురల్ స్టార్ నాని నిర్మాత.  నితిన్ సరసన రుక్మిణిగా చేస్తుంది ఎవరనే  సస్పెన్స్ అక్టోబర్ 13న వీడనుంది. ఇది కూడా చదవండి: ఆది సాయికుమార్ సంచలన పోస్ట్: ఎవరు ఆ హీరో? యూట్యూబర్ కి ఉన్న ఇమేజ్ లేదా!   విశ్వక్‌సేన్ 'లెగసీ'  కూడా డిసెంబర్ 4 న రాబోతుంది . సాయికిరణ్‌ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రాజకీయ నేపథ్య చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇలా ఒకే రోజు ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో తలపడుతుండటంతో థియేటర్ల కేటాయింపు మరియు ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ డిసెంబర్ 4 బాక్సాఫీస్ సమరంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.   అదే రోజు ఇటీవల మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమా శ్రీశ్రీ కూడా డిసెంబర్‌ 4నే  రాబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ కావడం స్పెషల్ ఎట్రాక్షన్.     [December 4 Box Office Clash, Naga Chaitanya Vrushakarma, Nithiin Alias Rukmini, Vishwak Sen Legacy, Tollywood movie updates, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]  
  తొలి చిత్రంతోనే వంద రోజుల పోస్టర్ స్టేట్ మొత్తం అతికేలా చేసిన ఆది సాయికుమార్ ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ ని తన పిన్ కోడ్ గా మార్చుకున్నాడు.  కానీ ప్రీవియస్ మూవీ శంభాల తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విమర్శకుల నోళ్లు మూయించి కట్ అవుట్ కి ఉన్న రేంజ్ తగ్గలేదని నిరూపించాడు. రీసెంట్ గా ఒక నెటిజెన్ సోషల్ మీడియా వేదికగా 'కొందరు హీరోలకి కనీసం యూ  ట్యూబర్స్ కి ఉన్న ఫాలోయింగ్ కూడా ఉండదనే పోస్ట్ చేసాడు. అందుకు ఆది రిప్లై ఇస్తూ 'సామాజిక మాధ్యమాలు విస్తరించిన ఈ రోజుల్లో ఇతరులను కించపరచడం, ట్రోల్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఎవరి ప్రతిభను వారు గౌరవించుకోవాల్సింది పోయి, పది మందిలో ఎదుటివారిని చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోవడంపై ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఇతరులను కిందికి లాగడానికి ప్రయత్నించడం కంటే, వారిలో ఆత్మస్థైర్యం నింపేలా ప్రోత్సహించడం ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరిదైన రంగంలో కష్టపడుతుంటారని, అలాంటి వారిని నిరుత్సాహపరచకుండా చేయూతనందించే మంచి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే ఇతరులను కించపరిచేలా కామెంట్లు చేస్తుండటం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుండటం చాలా బాధాకరమని ఆది అభిప్రాయపడ్డారు. కేవలం సరదా కోసం లేదా వ్యూస్ కోసం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరు మారాలని ఆయన సూచించారు. ఒక వ్యక్తిని పైకి లేపడం చేతకనప్పుడు, కనీసం వారిని కిందకు లాగే ప్రయత్నం చేయకూడదన్న కఠిన సత్యాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరహా ప్రతికూలత కేవలం సెలబ్రిటీలను మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలను, ముఖ్యంగా అభివృద్ధి చెందాలని చూస్తున్న యువతను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విజయదశమికి పెద్ద హీరోల సినిమాలు ఎందుకు విడుదల కావు: టాలీవుడ్ బాక్సాఫీస్ అసలు రహస్యం!     ఒకరి విజయాన్ని చూసి ఓర్వలేకపోవడం లేదా అసూయ పడటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని, బదిలీగా అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా నిలిస్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఆది సాయికుమార్‌ పేర్కొన్నారు. సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా ప్రయాణం ఎవరికీ అంత సులభంగా సాగిపోదు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్లేవారితో సానుకూలంగా ఉండటం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సానుకూల దృక్పథాన్ని (Positive Attitude) పెంపొందించుకోవాలని, సృజనాత్మకతను ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, నెటిజన్ల నుంచి విశేష స్పందనని  పొందుతున్నాయి.   [Aadi Saikumar Comments On Social Media, Aadi Saikumar, Telugu actor news, Aadi Saikumar comments, social media negativity, Tollywood updates,telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
  పండుగ రోజు సినిమా చూస్తే వచ్చే మజాని మాటల్లో చెప్పలేం. అదే పెద్ద హీరో మూవీ అయితే,మా అంత అదృష్టవంతులు లేరని అభిమాని, సినీ ప్రేమికుడు అనుకోవడం పరిపాటి. అసలు తెలుగు సినిమా పరిశ్రమలో పండుగ సీజన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు సినిమాల విడుదలకి అత్యంత అనుకూలమైన సమయాలుగా టాలీవుడ్ వర్గాలు పరిగణిస్తాయి.  అయితే, సంక్రాంతి సీజన్‌తో పోలిస్తే దసరా పండగ సమయంలో టాలీవుడ్ ప్రముఖ పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తారు అనే ప్రశ్న ఎప్పటి నుంచో సినీ ప్రేక్షకులని వేధిస్తోంది. ఒకప్పుడు దసరా బరిలో పెద్ద హీరోల చిత్రాలు నిలిచి భారీ విజయాలను సాధించినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్‌లో పెద్ద మార్పు వచ్చింది.  దసరా సెలవులు, స్కూల్స్ మరియు కాలేజీలకు వచ్చే వరుస హాలిడేస్, ప్రేక్షకులు సినిమా థియేటర్లకి క్యూ కట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ, చిరంజీవి,  బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు దసరా బరిలో నేరుగా దిగడానికి సాహసించకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అసలు ఈ ట్రెండ్ వెనుక ప్రధాన కారణం దసరా సీజన్ యొక్క బాక్సాఫీస్ వ్యాపార సమీకరణాలు మరియు ఇతర పండుగలతో ఉన్న డిఫరెన్స్. సంక్రాంతి సీజన్‌లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమతో పాటు కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సుదీర్ఘమైన సెలవులు ఉంటాయి. సంక్రాంతికి ఏకంగా ఐదు నుండి పది రోజుల పాటు వరుస సెలవులు లభిస్తాయి కాబట్టి, సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా సరే తొలి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ దసరా సమయంలో సాధారణంగా మూడు నుండి ఐదు రోజులకు మించి వరుస సెలవులు రావడం అరుదు. అంతేకాకుండా, దసరా పండుగ అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ సమయంలో వర్షాకాలం ప్రభావం ఎక్కువగా ఉండటం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల కలెక్షన్లపై కొంత ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, బీ-సెంటర్స్, సీ-సెంటర్స్ లో రైతులు వ్యవసాయ పనులతో బిజీగా ఉండటం లేదా వర్షాల వల్ల థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలు పెద్ద సినిమాల బాక్సాఫీస్ వసూళ్లను దెబ్బతీస్తాయి. ఇది కూడా చదవండి: త్రివిక్రమ్‌పై ప్రముఖ హీరోయిన్ సంచలన ఆరోపణలు.. కుటుంబ బలహీనతని వాడుకొని...!     మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే, పాన్ ఇండియా చిత్రాల హవా పెరిగిన తర్వాత తెలుగు సినిమాల బడ్జెట్లు వందల కోట్లకు చేరాయి. ఒక పెద్ద హీరో సినిమా విడుదల కావాలంటే కనీసం నూట యాభై నుండి మూడు వందల కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ స్థాయిలో రికవరీ రావాలంటే కేవలం తెలుగు రాష్ట్రాల దసరా సెలవులు మాత్రమే సరిపోవు. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో భారీ విడుదల ఉండాలి. దసరా పండుగను ఉత్తర భారతదేశంలో 'దుర్గా పూజ' లేదా 'నవరాత్రి'గా జరుపుకుంటారు కానీ, అక్కడ దీపావళికి ఉన్నంత సినిమా క్రేజ్ దసరాకి ఉండదు. బాలీవుడ్ మేకర్స్ కూడా దీపావళి లేదా క్రిస్మస్ సీజన్లకే తమ భారీ బడ్జెట్ చిత్రాలను కేటాయిస్తారు. అందువల్ల టాలీవుడ్ పెద్ద హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దసరాను వదిలేసి, సంక్రాంతి లేదా సమ్మర్ (వేసవి సెలవులు) బరిని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక చిన్న, మీడియం రేంజ్ హీరోల చిత్రాలకు మాత్రం దసరా పండగ నిజంగానే ఒక అద్భుతమైన వరంలా మారుతోంది. పెద్ద హీరోల పోటీ లేకపోవడం వల్ల థియేటర్ల సర్దుబాటు సులభంగా జరుగుతుంది. కంటెంట్ బాగుండి, సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు, దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకుని బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజినీకాంత్  జైలర్ 2 తో ఈ నెల 15 న వస్తున్న విషయం తెలిసిందే.     [Vijayadashami Movie Releases Tollywood, vijaya dashami movies, tollywood box office, dasara holidays, big hero movies, telugu cinema trends, Rajinikanth, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]     
పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులు ఎనీ టైం గుర్తుపట్టే భామ. సోషల్ మీడియాలో చేసే సంచలన  పోస్ట్ లతో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న పూనమ్ రీసెంట్ గా దర్శకుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ వైరల్ హోదాలో చక్కర్లు కొడుతూ ఉంది.    త్రివిక్రమ్ తన కుటుంబంలోని బలహీనతలను ఆసరాగా చేసుకుని, బలవంతంగా స్టేట్‌మెంట్లు ఇప్పించారు. వ్యక్తిగత సమస్యలు తలెత్తినప్పుడు కావాలనే దూరం పెట్టి, తిరిగి తమ అవసరం వచ్చినప్పుడు స్వార్థం కోసం మళ్లీ వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య.  రాజకీయ నాయకులు లేదా ఇతర వ్యక్తులు చేసే తప్పులకి మా  కుటుంబం ఎందుకు సమాధానం చెప్పాలి.  కుటుంబ బలహీనతలను అడ్టుపెట్టుకుని మానసిక క్షోభకు గురిచేశారు.  ఈ మొత్తం వివాదంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహరిస్తున్న తీరుపై కూడా పూనమ్ కౌర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలో ఒక మహిళా ఆర్టిస్ట్‌కు అన్యాయం జరుగుతున్నా, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా 'మా' పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మా అసోసియేషన్ ఇంకా ఎవరి కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి మౌనం వల్ల ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనమైపోవాలి. గతంలోనే ఈమెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ, బాధ్యులైన పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ నటుడు నానా పటేకర్ ఉదంతాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన వారు తోటివారికి లేదా బాధితులకు చేసిన వేదన, క్షోభ చెరిగిపోవని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఒక వ్యక్తిని పొగడటానికి మాత్రమే అందరూ అనుమతిస్తూ, ఆ వ్యక్తి వల్ల జీవితం కోల్పోయిన బాధితుల వేదనను పూర్తిగా విస్మరించడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఒకరి మరణానికి సంతాపం తెలపడం ఎంత సహజమో, వారి వల్ల జీవితాంతం నానా ఇబ్బందులు పడుతున్న బాధితుల క్షోభను గుర్తించడం కూడా అంతే ముఖ్యమని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.  ఇది కూడా చదవండి: నానాపటేకర్ నా జీవితాన్ని నరకప్రాయం చేసారు.. ఈవిల్ డెడ్!     ఇక  గతంలో కూడా పూనమ్ పేరు లేకుండా చేసే పోస్ట్ లు  త్రివిక్రమ్ ని ఉద్దేశించి చేసావే అనే టాక్ ఉండేది. అలాంటిది ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడం సినీ సర్కిల్స్ లో కూడా సంచలనంగా మారింది. త్రివిక్రమ్ ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.      [Poonam Kaur Fires At Trivikram, Poonam Kaur, Trivikram Srinivas, Tollywood controversy, Poonam Kaur latest news, MAA association, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచ తపాలా దినోత్సవం..  సమాచార ప్రసారంలో చెరగని ముద్ర..    మానవ సమాజ పురోగతిలో, సంబంధాలను దగ్గర చేయడంలో  తపాలా వ్యవస్థ నిర్వహించిన పాత్ర చాలా కీలకమైనది. కాలం ఎంత వేగంగా మారినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రూపాంతరం చెందినప్పటికీ ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ప్రాచీన, ప్రభావవంతమైన మార్గాలలో తపాలా వ్యవస్థ మొదటి వరుసలో నిలుస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ తపాలా దినోత్సవం (వరల్డ్ పోస్ట్ డే) తపాలా వ్యవస్థ  చారిత్రక ప్రాధాన్యతను, సమకాలీన ఉపయోగాలను స్మరించుకోవడానికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.  ఈ సందర్బంగా తపాలా వ్యవస్థ గురించి,  ఆవిర్భావం గురించి,  అందులో ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. చారిత్రక నేపథ్యం.. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఉత్తరాల రవాణాను, సమాచార మార్పిడిని క్రమబద్ధీకరించడానికి ఈ సంస్థ ప్రాణం పోసుకుంది. ఆ చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా, 1969లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్‌లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించారు. నాటి నుండి ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో ప్రపంచ దేశాలన్నీ ఈ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ తపాలా దినోత్సవ లక్ష్యం.. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, మానవుల రోజువారీ జీవితంలో, వ్యాపార లావాదేవీలలో తపాలా రంగానికి ఉన్న ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం. రెండోది, ఒక దేశ సామాజిక, ఆర్థిక వికాసంలో తపాలా వ్యవస్థ అందిస్తున్న సహకారాన్ని గుర్తించడం. సరిహద్దులు, భాషలు, సంస్కృతులు వేరైనా ప్రజలను మానసికంగా దగ్గర చేయడంలో ఉత్తరం ఒక వారధిగా పనిచేసింది. మారుతున్న కాలం - రూపాంతరం చెందుతున్న తపాలా సేవలు.. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్శిళ్ల రవాణాకే పరిమితమైన తపాలా శాఖ, కాలానికి అనుగుణంగా తనను తాను సరికొత్తగా మలచుకుంది. నేడు డిజిటల్ విప్లవంలో భాగమై సాంకేతిక సేవలను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చింది. తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి డిజిటల్ చెల్లింపులు, సేవింగ్స్ ఖాతాలు, భీమా సేవలను గ్రామగ్రామానికీ విస్తరించింది. ఈ-కామర్స్ రంగం విస్తరించిన తరుణంలో వస్తువుల వేగవంతమైన రవాణాకు పోస్టల్ పార్శిల్ సేవలు వెన్నెముకగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ఫించన్లు, సబ్సిడీలను చివరి మైలు వరకు చేర్చడంలో పోస్టల్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ నమోదు, అప్డేట్  నుండి వివిధ రకాల ప్రభుత్వ ధృవీకరణ పత్రాల పంపిణీ వరకు ఎన్నో పౌర సేవలు తపాలా కార్యాలయాల ద్వారా సులభంగా అందుతున్నాయి. మానవీయ సంబంధాల తీపి గుర్తు.. సాంకేతికత పెరిగి ఈమెయిళ్లు, వెంటనే మెసేజ్ లు  యుగం వచ్చినప్పటికీ, చేతిరాతతో రాసిన ఉత్తరంలో ఉండే ఆత్మీయత, భావోద్వేగం ప్రత్యేకమైనవి. తపాలా బిళ్ళలు  అంటే స్టాంపులు.. ఒక దేశ సంస్కృతి, చరిత్ర, సైన్స్, ప్రకృతి సౌందర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. స్టాంపుల సేకరణ (ఫిలాటెలీ) నేటికీ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించే  వ్యాపకముగా వర్ధిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనుసంధానిస్తూ, నమ్మకానికి  మారుపేరుగా నిలిచిన తపాలా వ్యవస్థస సేవలను గుర్తించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. సాంకేతిక పురోగతితో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటూ, ఆధునిక సేవలతో ముందుకు సాగుతున్న తపాలా రంగానికి మద్దతుగా నిలవడం, దాని ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ రోజు మనం ఇచ్చే నిజమైన నివాళి.                                                                                                                                     *రూపశ్రీ.
 అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.! ఏదైనా ఒక అందమైన బంధానికి అతి ముఖ్యమైన పునాది ప్రేమ , పరస్పర నమ్మకం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు ఆ బంధంలో నమ్మకమే ప్రధాన ఊపిరిగా పనిచేస్తుంది. అయితే అదే నమ్మకం స్థానంలో చిన్నగా అనుమానం ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధమైనా క్రమంగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు. భాగస్వామి ప్రతి చిన్న కదలికను తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి భయపడటం , మనస్సులోనే ఎప్పుడూ  ఆలోచిస్తూ ఉండటం బంధంలో మానసిక దూరాన్ని పెంచుతాయి. అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో , దానిని ఎలా అధిగమించవచ్చో  వివరంగా తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం.. భాగస్వామి ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఆలస్యమైంది అని సాధారణంగా అడిగే ప్రశ్నలు,  ఇవి ప్రేమకు సంకేతం కావచ్చు. కానీ అదే పనిగా ప్రతి నిమిషం వివరాలు అడుగుతూ, వారి సమాధానాలను తప్పు పడుతుంటే అది భద్రతాభావం లోపించడానికే సూచిక. భాగస్వామిని నిరంతరం ప్రశ్నించడం వల్ల వారికి తమ స్వతంత్రతను కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఇది వారిలో తీవ్రమైన ఒత్తిడిని, అసహనాన్ని నింపుతుంది. ప్రైవసీకి భంగం కలిగించడం.. ఒకరి ఫోన్‌ను దొంగతనంగా చూడటం, మెసేజ్‌లు , కాల్ హిస్టరీ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ పై  నిరంతరం నిఘా పెట్టడం వంటి పనులు బంధంలో వ్యక్తిగత లిమిట్స్ ను దాటడమే అవుతాయి. నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి పనులు ఎంతమాత్రం ఉపయోగపడవు. పైగా ఇవి భాగస్వామికి తమపై అసలు గౌరవం లేదనే భావనను కలిగిస్తాయి. ఆధారాలు లేకుండా నిందలు వేయడం.. భాగస్వామి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయనప్పుడు లేదా మెసేజ్‌కు ఆలస్యంగా రిప్లై ఇచ్చినప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేరుగా ఏదో తప్పు జరుగుతోందని నిర్ణయానికి రావడం చాలా ప్రమాదకరం. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిందలు వేయడం వల్ల భాగస్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతారు. విషయాలను సూటిగా అడిగి తెలుసుకోవడానికి బదులు ఊహించుకోవడం వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. బంధంలో మానసిక దూరం పెరగడం.. నిరంతరం అనుమానాలు, నిందలు ఎదుర్కొనే భాగస్వామి మానసికంగా అలసిపోతారు. తమను ప్రతి విషయంలోనూ తప్పుగా భావిస్తున్నారని అనిపించినప్పుడు వారు క్రమంగా మాట్లాడటం తగ్గించేస్తారు. మరోవైపు అనుమానించే వ్యక్తి కూడా నిరంతరం ఆందోళన, భయంతో గడుపుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయి మానసిక దూరం చాలా వేగంగా పెరుగుతుంది. అనుమానానికి అసలు కారణాలు.. అనుమానించే అలవాటు ఎప్పుడూ భాగస్వామి చేసే తప్పుల వల్లే రావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న చేదు అనుభవాలు, చిన్నతనంలో ఎదురైన మానసిక సంఘటనలు, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా భాగస్వామిని ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేస్తాయి. ముందుగా ఈ భయాలకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. బంధాన్ని కాపాడుకోవడానికి మార్గాలు.. ముందుగా  మనస్సులో కలిగే అనుమానాలు నిజమైన సంఘటనల ఆధారంగా వస్తున్నాయా లేదా కేవలం  భయాల వల్ల వస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిపై నిందలు వేసే విధంగా కాకుండా మీ భయాలు, ఆందోళనల గురించి వారితో ప్రశాంతంగా, ఓపేన్ గా  మాట్లాడాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అనుమానాలు మరీ ఎక్కువై బంధం చేజారిపోతోందని అనిపిస్తే దంపతులు మంచి కౌన్సెలర్ లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది.                                 *రూపశ్రీ.
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది రోజంతా నిలబడి పనిచేయడం, గంటల తరబడి డెస్క్ ఉద్యోగాలు చేయడం వల్ల తీవ్రమైన కాళ్ల నొప్పులు, పాదాల వాపులు మరియు మానసిక అలసటతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉప్పుతో అద్భుతమైన ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పుపై కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు నిలబడటం లేదా ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల శరీరం మరియు మనసుకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన కాళ్లకు ఈ సాధారణ పద్ధతి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఉప్పులో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు చర్మం ద్వారా సులభంగా శోషించబడి, కాళ్లలోని బిగుసుకుపోయిన కండరాలను పూర్తిగా సడలిస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని దారుణంగా తగ్గించి, మనసుకు అపారమైన ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా, ఈ అద్భుతమైన ఉప్పు చికిత్స కాళ్లలోని రక్త నాళాలను శక్తివంతంగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల శరీరంలోని కింది భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటించడం వల్ల దీర్ఘకాలిక కాళ్ల తిమ్మిర్లు, కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కీళ్ల నొప్పులు లేదా పాదాల వాపులతో బాధపడేవారికి ఉప్పు చికిత్స ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఉప్పులో ఉండే సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను మరియు వాపులను వేగంగా నివారిస్తాయి. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య దృక్పథం ప్రకారం ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఉప్పుపై నిలబడటం వల్ల శరీరంలోని వ్యర్థాలతో పాటు మానసిక ఆందోళనలు, నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఈ అద్భుతమైన చికిత్సను ఇంట్లోనే సులభంగా ఆచరించవచ్చు. ఒక టబ్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు సముద్రపు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు వేసి, మీ పాదాలను అందులో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఈ పద్ధతి పాదాల మృదుత్వాన్ని పెంచడంతో పాటు రాత్రిళ్లు గాఢమైన మరియు ప్రశాంతమైన నిద్ర పట్టేలా అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఒత్తిడికి దూరంగా ఉంటూ, మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సులభమైన చికిత్సను నిరభ్యంతరంగా మీ దినచర్యలో భాగం చేసుకోండి.       [Foot Soaking Benefits, Salt Water Foot Soak, Sea Salt, Rock Salt Benefits, Foot Pain Relief, Swollen Feet, Blood Circulation, Joint Pain Relief, Stress Relief, Better Sleep]
బరువు తగ్గడానికి ఆహారం తగ్గించడం, నియమబద్ధంగా వ్యాయామం చేయడం వంటి మార్గాలు అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది డైటింగ్ సరిగ్గా చేస్తున్నా, క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నా బరువు కాస్త కూడా తగ్గడం లేదని ఆవేదన చెందుతుంటారు. అంతగా కష్టపడుతున్నా ఫలితం కనిపించకపోవడానికి మనం పెద్దగా పట్టించుకోని ఒక రహస్య కారణం ఉంది. అదే నిద్ర, ఇన్సులిన్, బరువు పెరగడం మధ్య ఉన్న అంతర్గత సంబంధం. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. సరిగా నిద్రపోకపోతే.. రాత్రిపూట తగినంత నిద్రపోకపోవడం మన శరీర జీవక్రియలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మన నిద్రకూ, శరీరంలో ఉండే ఇన్సులిన్ హార్మోన్‌కూ నేరుగా సంబంధం ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. కానీ సరిపడా నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ కార్టిసోల్ ప్రభావం వల్ల ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతింటుంది. ఇన్సులిన్ నిరోధకత.. ఇన్సులిన్ ప్రధాన పని రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడం. కానీ నిద్రలేమి వల్ల కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, ఆ అదనపు చక్కెర అంతా కొవ్వు రూపంలో శరీరంలో, ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోతుంది.  ఎంత తక్కువ తిన్నా, ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీరం కొవ్వును కరిగించడానికి బదులు మరింత కొవ్వును దాచిపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఆకలి హార్మోన్లు.. మరొక వైపు, సరైన నిద్ర లేనప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ పెరిగిపోతుంది, కడుపు నిండిన భావనను ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే తియ్యటి లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న పదార్థాలు తినాలనిపిస్తుంది. మెటబాలిజం.. నిద్రలేమితో బాధపడేవారిలో జీవక్రియ వేగం లేదా మెటబాలిజం మందగిస్తుంది. శరీరం కేలరీలను కరిగించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా రోజంతా తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ, శరీరం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఆహార నియమాలు, వ్యాయామాలపైనే కాకుండా రాత్రిపూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్రపోవడంపై శ్రద్ధ పెట్టాలి. సరైన సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఫోన్లు లేదా స్క్రీన్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. నిద్ర సమయాన్ని సరిచేసుకుంటే ఇన్సులిన్ సమతుల్యత పునరుద్ధరించబడి,  పడుతున్న కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
మనకు అందుబాటులో ఉండే ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో గంగవాయల కూర కూడా ఒకటి. ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలగవచ్చు? శరీరంలో వేడి, మంట వంటి సమస్యల విషయంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? గంగవాయల కూర గురించి చాలామందికి తెలియని విషయాలు ఏమిటి? యునాని వైద్య నిపుణులు డాక్టర్ సత్య ఈ వీడియోలో గంగవాయల కూర ప్రత్యేకతలు, దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతో పాటు, శరీరంలో వేడి, మంట, మూత్రపిండాల ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ ఆకుకూర పాత్ర గురించి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, రక్తస్రావం అయ్యే మొలలు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల విషయంలో గంగవాయల కూర గురించి సంప్రదాయ వైద్యంలో చెప్పే ఉపయోగాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ ఆకుకూరను ఎలా తీసుకోవాలి? దాని స్వభావం ఏమిటి? రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి? అనే అంశాలపై డాక్టర్ వివరణను వినవచ్చు. మన చుట్టూ లభించే ఆకుకూరల పోషక విలువలను తెలుసుకొని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం ముఖ్యం. గంగవాయల కూర ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గంగవాయల కూరను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే షుగర్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు లేదా ఇతర అనారోగ్యాలకు వైద్యులు సూచించిన చికిత్సకు బదులుగా దీనిని ఉపయోగించకండి. మందులు వాడుతున్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)