LATEST NEWS
తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
  నచ్చాల్సింది నీకు కాదు ప్రేక్షకులకి అంటూ తనని విమర్శలు చేసే వాళ్ళకి సమాధానాలు ఇస్తూనే సుమారు ఏడూ చిత్రాల వరకు హీరోగా చేసి మెప్పించాడు సంపూర్ణేష్ బాబు.  బర్నింగ్ స్టార్‌ అనే  టాగ్ లైన్ కూడా ఇచ్చేలా చేసుకున్న సంపూర్ణేష్ బాబు ఈ నెల 24 న  న్యాచురల్ స్టార్ నాని ఒన్ మాన్ షో గా భావిస్తున్న ‘ది ప్యారడైజ్’లో  ‘బిర్యానీ’ అనే ఒక కీ రోల్ లో చేస్తున్నాడు.     రీసెంట్ గా ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతు ప్యారడైజ్ నా నటనా ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. ఈ సినిమా తర్వాత ఇకపై సోలో హీరోగా సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నన్ను కేవలం కామెడీ రోల్స్ లేదా స్పూఫ్ సినిమాలకే పరిమితం చేయకుండా, శ్రీకాంత్ ఒడెల వంటి దర్శకుడు ‘ది ప్యారడైజ్’లో 100% వైవిధ్యమైన, బలమైన నటనకి  తావున్న క్యారక్టర్ ఇచ్చాడు. ఇకపై కథలో ప్రాధాన్యం ఉన్న విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లేదా కథని నడిపించే కీలకమైన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాను. హీరోగా 100% వినోదాన్ని పంచిన రోజులు ముగిశాయని, ఇకపై నటుడిగా 360 డిగ్రీల రూపాంతరం చెందడమే తన లక్ష్యమని సంపూ వెల్లడించారు.        Also Read: మోక్షజ్ఞ మూవీలో పెద్ద ట్విస్ట్: ఫ్యాన్స్ ఏమంటున్నారు! ప్యారడైజ్ లో నాని పోషిస్తున్న 'జాడల్'కి అత్యంత ఆప్తమిత్రుడిగా సంపూర్ణేష్  కనిపిస్తున్నాడు . ఇటీవలే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతిలో ఆయుధం, రక్తపు మరకలతో మునుపెన్నడూ చూడని తీవ్రమైన మరియు వైలెంట్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.     [Sampoornesh Babu,  The Paradise, Nani, No More Hero Rols, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే మాతృత్వపు తీపి అనుభూతిని పొందబోతున్న విష‌యం తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమె సీమంతం (గోద్ భరాయి) వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సమంత, ఈ పవిత్ర ఘట్టానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన వేడుకను పూర్తిగా హిందూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమంత భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చొని ప్రత్యేక దేవి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గోద్ భరాయి వేడుక ముగిసిన అనంతరం సామ్ ఇన్‍స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగమైన నోట్‌ను పోస్ట్ చేశారు. మన భారతీయ సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. మంత్రోచ్ఛారణలు, శ్రీవిద్య ఉపాసన ద్వారా పొందిన అనుభూతి తనలో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యాన్ని, రక్షణ భావాన్ని నింపిందని ఆమె తెలిపారు. ఈ వేడుకను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి నిర్వహించిన తన ఆత్మీయ స్నేహితురాలు శిల్పా రెడ్డికి సమంత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోనతో పాటు కొద్దిమంది అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఒక తల్లిగా రూపాంతరం చెందుతున్న ఈ ప్రయాణంలో తనకు లభించిన ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞురాలినని ఆమె వెల్లడించారు. గత ఏడాది చివరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, కొద్ది నెలల క్రితమే ఈ తియ్యటి వార్తను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి సామ్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, తన ఆరోగ్యానికి అలాగే రాబోయే బిడ్డ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది.  సామ్ షేర్ చేసిన ఈ పవిత్రమైన ఫొటోలు బయటకు రాగానే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ రూపంలో కాబోయే అమ్మ సమంతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.     [Samantha Ruth Prabhu, Samantha Godh Bharai, Raj Nidimoru, Samantha Seemantham Photos, Samantha Pregnancy Updates]
    గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నట వారసుడు, డెమి గాడ్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీని విశ్వంభర ఫేమ్ వశిష్ఠతో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా పాన్ ఇండియా హిట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం, పునర్జన్మల కాన్సెప్ట్ అని ఈ రోజు ఉదయం అనౌన్స్ మెంట్ రావడంతో    అంచనాలు అంతకు మించి ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ దాగి ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞ హీరోగా నటించడమే కాకుండా, ఆయన తండ్రి బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ మరియు అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య పాత్ర కేవలం కామియో లేదా గెస్ట్ రోల్‌కి మాత్రమే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విశ్వరూప స్థాయి క్యారెక్టర్‌గా ఉండబోతోంది. మోక్షజ్ఞ డెబ్యూ కోసం దర్శకుడు వశిష్ట రాసుకున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో దాదాపు 40 శాతానికి పైగా భాగం అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) మరియు గ్రాఫిక్స్ పనులతో నిండి ఉండనుంది. స్క్రీన్‌పై నందమూరి తండ్రీకొడుకులిద్దరూ ఒకేసారి కనిపించే ఆ సన్నివేశం థియేటర్లలో నందమూరి అభిమానులకి  పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.     Also Read: కమిట్మెంట్ అడిగారంటున్న ప్రముఖ హీరోయిన్: ఆ దర్శకులు, నిర్మాతలు ఏం చేస్తారంటే!   మోక్షజ్ఞ ఈ సినిమా కోసం తన రూపురేఖలను పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ, గత 6 నెలలుగా కఠినమైన వర్కౌట్స్, స్పెషల్ డైట్ మరియు డాన్స్ విభాగార్థంలో శిక్షణ తీసుకుని దాదాపు 15 కిలోల బరువు తగ్గి అత్యంత సన్నగా, స్టైలిష్‌గా మరియు ఫిట్‌గా తయారయ్యారు. అంతేకాకుండా, నటన మరియు ఫైట్స్ శిక్షణ కోసం ముంబై, బ్యాంకాక్‌లలో ప్రత్యేక వర్క్‌షాప్‌లలో కూడా మోక్షజ్ఞ పాల్గొన్నాడు.         [Nanadamuri Mokshagna, Balakrishna, Vasishta, Vishwambhara, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]    
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో 'ఫౌజీ' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'ఫౌజీ' వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని, కాదు మార్చిలో అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండూ కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి లోనేమో ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' ఉంది. అందుకే ఫిబ్రవరి మంచి ఆప్షన్ అని భావిస్తున్నారట. 'ఫౌజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్, కొత్త రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. డేట్ ఫైనల్ అయితే, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.       [Prabhas Fauzi Movie, Fauzi New Release Date, Fauzi February Release, Fauzi Movie 2027, Fauzi vs Spirit, Prabhas, Hanu Raghavapudi, Telugu Film News, Telugu News]  
  కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంది. కానీ సాహితీ దాసరి మాత్రం మరోసారి కాస్టింగ్ కౌచ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. 'మా ఊరి పొలిమేర'లో  అద్భుతమైన పెర్ఫార్మ్ తో  ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సాహితీ  ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ హోదాలో బిజీగా ఉన్నాయి.  సాహితి మాట్లాడుతు  'ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు నేరుగా కాకుండా రకరకాల మార్గాల్లో కమిట్‌మెంట్స్ అడుగుతారు. సాధారణంగా పెద్ద మేకర్స్ నేరుగా నటీమణుల వద్దకి రారు. కోఆర్డినేటర్లు, కాస్టింగ్ మేనేజర్లు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల వంటి మధ్యవర్తుల ద్వారానే ఆ ప్రతిపాదనలు పంపుతారు. "దర్శకుడికి కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఆయనతో నిరంతరం టచ్‌లో ఉండి మెసేజ్‌లు చేస్తూ ఉండాలి, నంబర్ ఇస్తాను మాట్లాడండి, అలా చేస్తే పెద్ద ప్రాజెక్టుల్లో క్రేజీ అవకాశాలు దక్కుతాయి" అంటూ ఈ మధ్యవర్తులు రకరకాల హింట్స్ ఇస్తుంటారని పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు  ఏమాత్రం వెనకడుగు వేయకుండా, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వెంటనే తిరస్కరించాను. ఇటువంటి అడ్డదారులను నిరాకరించడం వల్ల తాను పరిశ్రమలో కొన్ని పెద్ద బానర్ల ప్రాజెక్టులను, 100% మంచి అవకాశాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అవకాశాలు పోయినా సరే, నా నియమాలకు కట్టుబడి ఉండటమే నా లక్ష్యం.        Also Read: ఇరుముడి ఓటిటి డేట్ వచ్చేసింది: అదనపు బోనస్ ఏంటంటే! జీవితంలో ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడూ నిలబడదు. అడ్డదారుల్లో వచ్చే విజయం తాత్కాలికమే. ఎంత చిన్నగా, కష్టపడి అడుగులు వేస్తూ ఎదిగితే పరిశ్రమలో అంత లాంగ్ లాస్టింగ్ ఇమేజ్ ఉంటుంది" అనే సిద్ధాంతాన్ని  గట్టిగా నమ్ముతానని వ్యాఖ్యానించింది. త్వరితగతిన వచ్చే సక్సెస్ కంటే సొంత ప్రతిభపై ఆధారపడటమే నిజమైన విజయం అని ఆమె స్పష్టం చేసింది. పొలిమేర లో   గెటప్ శ్రీను భార్యగా, డీ-గ్లామర్ లుక్‌లో రాముల పాత్రలో నటించి ప్రతి ఒక్కరినీ మెప్పించిన సాహితి పొలిమేర 2 లో కూడా తగ్గేదేలే అంటూ తన సత్తా చాటిన విషయం తెలిసిందే.       [Sahithi Dasari , Casting Couch, Maa Oori Polimera, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
Soori’s Mandaadi is turning out to be a strong performer at the box office, with the makers officially declaring that the film grossed Rs.65 crore worldwide. The latest poster gives the film’s theatrical run a clear commercial boost, especially after the movie managed to hold its ground against competing releases. Directed by Mathimaran Pugazhendhi, Mandaadi stars Soori, Suhas, Sathyaraj and Mahima Nambiar in prominent roles. The sports-action drama has been gaining momentum through strong word of mouth, with its raw setting and intense emotional conflict becoming major talking points. The ₹65 crore milestone is particularly notable for Soori, whose transformation into a leading man continues to gather momentum. What started as a film carrying curiosity around its unusual backdrop has now turned into a genuine theatrical success story. It marks to be a successful debut for Suhas in Tamil and a big hit in his career. Produced by Elred Kumar under RS Infotainment, Mandaadi is also backed by Vetrimaaran as creative producer. With the film continuing its successful theatrical run, the focus now shifts to how fast it can hit the coveted Rs.100 crore mark before The Paradise storm at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సంతోష్ శోభన్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ ఏడాది 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా మరో విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సత్తిబాబు పరలోకయాత్ర' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సినీ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు హాలీవుడ్, ఇత‌ర‌ భాషల్లో సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ జోనర్‌లో మల్టీవర్స్ కాన్సెప్ట్‌లను చూశాం. అయితే, టాలీవుడ్‌లో తొలిసారిగా మల్టీవర్స్ కామెడీ జోనర్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'స్వాతిముత్యం' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పరలోకం లేదా వేరే లోకాల కాన్సెప్ట్‌ను అత్యంత నవ్వులు పూయించేలా వినోదాత్మకంగా మలచబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంతోష్ శోభన్ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, ఒక కంటితో విచిత్రంగా చూస్తూ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన ప్రీతి అస్రాని, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్, డిజైన్ చూస్తుంటే ఇదొక కంప్లీట్ ఫన్ రైడ్ సినిమా అని అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక కొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ 'మల్టీవర్స్ కామెడీ' ప్రేక్షకులకు ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.     [Santosh Soban Sattibabu Paraloka Yatra, Telugu First Multiverse Comedy Movie, Santosh Soban New Movie UV Creations, Sattibabu Paraloka Yatra First Look, Lakshman K Krishna Director Movies]
ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ-10' విన్నర్ రాజు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాల పేరుతో దగ్గరై, మోసం చేశాడంటూ ఒక యువతి ఫిర్యాదుతో రాజుపై కేసు నమోదైంది. అయితే శిరీష అనే యువతితో రాజు మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇక మీదట మనం ఫ్రెండ్స్ లా ఉందాం" అని ఆ ఆడియోలో రాజు చెప్పినట్టుగా ఉంది. అయితే శిరీష మాత్రం.. "రాజు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ, నువ్వు వేరే అమ్మాయికి దగ్గరవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను." అని ఎంతో ఎమోషనల్ గా చెప్పింది. అంతేకాదు, "నా డబ్బులు నేను తిరిగి తీసుకున్నాక.. నీపై నాకు హక్కు ఉండదు. ఇంత జరిగిన తర్వాత ఫ్రెండ్ లా ఉండలేను. ఒకవేళ నువ్వు తప్పు తెలుసుకొని, మనసు మార్చుకొని వస్తానంటే.. ఆ డబ్బులు రిటర్న్ అడగను. ఇంకా 50 లక్షలు లోన్ తీసుకొని నీ చేతిలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను." అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఆడియో క్లిప్ ను బట్టి అర్థమవుతుంది ఏంటంటే.. రాజుని శిరీష మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతనికి లక్షల్లో డబ్బులు కూడా ఇచ్చింది. కానీ, రాజు వేరే అమ్మాయితో చనువుగా ఉండటం శిరీషకు నచ్చలేదు. అందుకే డబ్బులు రిటర్న్ అడిగింది. ఒకవైపు డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూనే.. మరోవైపు రాజు మనసు మార్చుకొని తనతో ఉంటానంటే ఇంకా డబ్బులు ఇస్తానని కూడా చెబుతుంది. మరి ఈ ఆడియోలో నిజానిజాలు ఎంత? ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగి రాజు జైలు పాలయ్యాడు? అనేది తెలియాల్సి ఉంది.       [Dhee Raju Audio Leak, Dhee Raju Case, Raju Sirisha Audio, Dhee Raju Audio, Dhee Raju, Telugu Film News, Telugu Audio, Telugu News]  
  పనీర్ భూర్జీ అంటే పసిపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే అద్భుతమైన ఉత్తర భారతీయ వంటకం. వేడివేడి రోటీలు, పూరీలు, చపాతీలు లేదా బ్రెడ్ టోస్ట్‌తో పనీర్ భూర్జీ తింటే ఆ రుచే వేరు. కానీ చాలా ఇళ్లలో పనీర్ భూర్జీ తయారుచేసేటప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఎదురవుతుంటుంది. వండిన కొద్దిసేపటికే పనీర్ నుండి నీరు వేరైపోయి (watery), వంటకం నీరుగారడం లేదా పనీర్ తీవ్రంగా గట్టిపడి డ్రైగా మారిపోవడం జరుగుతుంది. ప్లేటులో వడ్డించినప్పుడు పనీర్ ఒకవైపు, నీరు మరొకవైపు తేలుతూ ఉంటే వంటకం చూడటానికి బాగుండదు, తినడానికి రుచించదు. ఈ సమస్యను నివారించి, రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో సాఫ్ట్‌గా, జ్యూసీగా, నీరుకారకుండా పనీర్ భూర్జీని తయారు చేయడానికి నిపుణులు 4 ప్రత్యేకమైన వంట పద్ధతులను పరీక్షించి పరిష్కారాలను అందించారు. ఆ సీక్రెట్ చిట్కాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పనీర్ భూర్జీ చేసేటప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు పనీర్‌ను తురిమే విధానంలోనే ఉంటుంది. సాధారణంగా పనీర్‌ను గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముతుంటారు. కానీ పనీర్‌ను అలా తురిమినప్పుడు దాని కణజాలం బాగా నలిగిపోయి, దానిలోని సహజమైన తేమ లేదా నీరు చాలా వేగంగా బయటకు వచ్చేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మొదటి పద్ధతిలో పనీర్‌ను గ్రేట్ చేయడానికి బదులుగా, చేతులతోనే చిన్న చిన్న అసమాన ముక్కలుగా (crumbling) నలపడం అత్యంత శ్రేష్ఠమైనది. చేత్తో నలిపిన పనీర్ ముక్కలు వండేటప్పుడు తమలోని తేమను సులభంగా కోల్పోవు. దీనివల్ల భూర్జీ నీరుగారిపోకుండా చక్కటి ఆకృతితో (texture) నోటికి ఎంతో రుచిగా తగులుతుంది. రెండవ పద్ధతి భూర్జీలోని తేమను పట్టి ఉంచే  బైండింగ్ ఏజెంట్ను  ఉపయోగించడం. సాధారణంగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మసాలాలు నూనెలో వేగుతున్న సమయంలోనే 1 చిన్న టీస్పూన్ శనగపిండి (Besan) లేదా కొద్దిగా ఇంట్లో తయారుచేసిన మలై (మీగడ) చేర్చడం ఒక తిరుగులేని సీక్రెట్ చిట్కా. శనగపిండిని మసాలాలతో పాటు నూనెలో దోరగా వేయించినప్పుడు, అది వంటకం చివర్లో పనీర్ విడుదల చేసే అదనపు తేమను తక్షణమే పీల్చుకుంటుంది. దీనివల్ల గ్రేవీ నీరుగారిపోకుండా ఎంతో చిక్కగా, క్రీమీగా మారుతుంది. ఈ చిన్న సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌ను చేర్చడం వల్ల ప్లేటులో వడ్డించినప్పుడు నీరు వేరుపడే ప్రసక్తే ఉండదు. మూడవ పద్ధతి ఉప్పు వేసే సమయాన్ని సరిగ్గా నిర్వహించడం. చాలామంది ఉల్లిపాయలు త్వరగా వేగాలని వంట ప్రారంభంలోనే ఉప్పు వేస్తారు లేదా పనీర్ వేసిన వెంటనే ఉప్పు కలపుతారు. కానీ పనీర్‌పై నేరుగా ఉప్పు పడటం వల్ల  ఆస్మోసిస్  అనే ప్రక్రియ జరిగి పనీర్ లోపల ఉన్న సహజ నీటిని ఉప్పు బయటకు లాగేస్తుంది. అందుకే మసాలాలన్నీ బాగా వేగి, పనీర్ కలిపి స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరి క్షణంలో మాత్రమే ఉప్పును చేర్చడం ఉత్తమం. ఈ చిన్న మార్పు చేయడం వల్ల పనీర్ తన లోపలి తేమను కాపాడుకుని, ఎంతో మెత్తగా ఉంటుంది. నాల్గవ పద్ధతి పనీర్ ఉడికించే సమయం మరియు మంట (heat). పనీర్‌ను మసాలా దినుసుల్లో కలిపిన తర్వాత ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచి ఉడికించకూడదు. పనీర్‌ను కేవలం 2 నుండి 3 నిమిషాల పాటు మాత్రమే మంట మీద తేలికగా టాస్ చేయాలి. 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు వండితే పనీర్‌లోని ప్రొటీన్లు గట్టిపడి రబ్బరులా మారిపోతాయి, దాంతో పనీర్ తనలోని నీటిని బయటకు వదిలేస్తుంది. కాబట్టి పనీర్ వేసిన వెంటనే మంటను తగ్గించి, 2,3 నిమిషాల వ్యవధిలోనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ 4 సులువైన వంట చిట్కాలను పాటిస్తే ఇకపై మీ ఇంట్లో చేసే పనీర్ భూర్జీ ఎప్పటికీ నీరుకారకుండా, రెస్టారెంట్ కంటే అద్భుతమైన టెక్స్చర్ మరియు రుచితో వస్తుంది. తర్వాతి సారి పనీర్ భూర్జీ వండేటప్పుడు పనీర్‌ను చేత్తో నలపడం, ఒక స్పూన్ శనగపిండి వేయడం, ఉప్పు చివర్లో కలపడం మరియు 2,3 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించకపోవడం అనే నియమాలను తప్పక గుర్తుంచుకోండి.       [Paneer Bhurji, Paneer Recipes, Cooking Tips, Restaurant Style Paneer, Paneer Texture, Besan, Indian Cuisine, North Indian Food, Cooking Hacks, Easy Recipes]
మన చుట్టూ ఉండే వాతావరణంలో పెరుగుతున్న గాలి కాలుష్యం నేడు మానవాళి ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా మారింది. మనం పీల్చే ప్రతి ఊపిరిలోనూ కంటికి కనిపించని విషపూరితమైన కాలుష్య కణాలు శరీరంలోకి చేరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే వాయు కాలుష్యం ఏ సమయంలో, ఎంత మేర మన శరీరంపై ప్రభావం చూపుతుందో కచ్చితంగా అంచనా వేయడం ఇప్పటివరకు చాలా కష్టంగా ఉండేది. ఈ సవాలుకు పరిష్కారంగా అంతర్జాతీయ పరిశోధకులు ఒక వినూత్నమైన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రియల్ టైమ్‌లో వాయు నాణ్యతను ట్రాక్ చేస్తూ, అది వ్యక్తుల ఆరోగ్యంపై చూపుతున్న ప్రత్యక్ష ప్రభావాన్ని కచ్చితమైన వివరాలతో లెక్కగట్టడం ఇప్పుడు సాధ్యమైంది. ఈ నూతన యాప్ ద్వారా నిర్వహించిన పరిశోధనలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వాతావరణంలోని పిఎమ్ 2.5 (PM2.5) మరియు పిఎమ్ 10 (PM10) కణాల స్థాయిలను, వినియోగదారులు నమోదు చేసే రోజువారీ ఆరోగ్య లక్షణాలతో ఈ యాప్ అనుసంధానిస్తుంది. వేలాది మంది వినియోగదారుల నుంచి సేకరించిన డేటా ప్రకారం, వాతావరణంలో పిఎమ్ 2.5 ప్రమాదకరమైన 50 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ దాటిన రోజుల్లో ప్రజల్లో శ్వాసకోశ ఇబ్బందులు, గొంతు మంట మరియు ఆస్తమా లక్షణాలు ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు పెరుగుతున్నాయని తేలింది. అంతేకాకుండా, నిరంతరం కాలుష్య వాతావరణంలో గడిపే వారిలో 25 శాతం మంది తీవ్రమైన నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు యాప్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.   గాలి కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోందని ఈ యాప్ డేటా నిరూపించింది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య పొగమంచు, కాలుష్యం ఎక్కువగా ఉండే సమయంలో వయోవృద్ధులలో రక్తపోటు హెచ్చుతగ్గులు మరియు గుండె సంబంధిత అసౌకర్యాలు 18 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ యాప్‌లో లభించే రియల్ టైమ్ పొల్యూషన్ అలర్ట్స్ కారణంగా 62 శాతం మంది వినియోగదారులు తమ బయటి పనుల వేళలను మార్చుకుని, తాము పీల్చే విషవాయువుల శాతాన్ని దాదాపు 30 శాతం వరకు తగ్గించుకోగలిగారు. ఇది డిజిటల్ హెల్త్ మానిటరింగ్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాధారణ పొల్యూషన్ మానిటరింగ్ స్టేషన్లు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సగటు సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. కానీ ఈ స్మార్ట్ యాప్ కేవలం 500 మీటర్ల పరిధిలోని స్థానిక వాయు నాణ్యతను ట్రాక్ చేస్తూ వ్యక్తిగత ఆరోగ్య హెచ్చరికలను పంపుతుంది. దీనివల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, ఆస్తమా మరియు గుండె వ్యాధిగ్రస్తులు వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళల్లో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు. N95 మాస్క్‌లు ధరించడం లేదా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం ద్వారా ముందస్తుగా ప్రమాదాన్ని అరికట్టడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతోంది. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేటి కాలంలో ఇటువంటి డిజిటల్ సాంకేతికత మానవాళికి ఒక రక్షణ కవచంలా మారుతోంది. వాయు కాలుష్యం వల్ల వచ్చే ముప్పును కేవలం అంచనా వేయడమే కాకుండా, ప్రత్యక్ష ఆధారాలతో నివారణ మార్గాలను చూపడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధునిక విజ్ఞానాన్ని, హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని మరియు మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.       [Air Pollution, Air Quality, PM2.5, PM10, Pollution Monitoring, Health Monitoring, Respiratory Health, Asthma, Digital Health, Air Quality App]
  మానవాళి ఆరోగ్యానికి మరియు ఆయుష్షుకు అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధుల్లో గుండె సంబంధిత జబ్బులు (Cardiovascular Diseases) మరియు క్యాన్సర్ ప్రధానమైనవి. అయితే ఇటీవల ప్రచురితమైన అంతర్జాతీయ వైద్య పరిశోధన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్ల జరుగుతున్న మరణాలే అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించి ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులలో లేదా అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు, ఇప్పుడు చిన్న వయసులోనే ప్రాణాలను తీస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. వైద్య గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.8 కోట్ల (180 లక్షల) కంటే ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం మరణాలలో దాదాపు 32 శాతానికి సమానం. దీనికి విరుద్ధంగా క్యాన్సర్ వ్యాధి వల్ల ఏటా సుమారు 1.0 కోటి మరణాలు (మొత్తం మరణాలలో దాదాపు 18 శాతం) సంభవిస్తున్నాయి. అంటే క్యాన్సర్ మహమ్మారి కంటే కూడా గుండె జబ్బులే ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మొదటి ప్రధాన వ్యాధిగా నిలిచాయి. అందులోనూ ముఖ్యంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువత మరియు నడివయస్కులలోనే దాదాపు 35 శాతం గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర హెచ్చరిక సంకేతంగా మారింది. వైద్య నిపుణులు మరియు కార్డియాలజిస్టుల ప్రకారం, ఈ గుండె జబ్బుల విజృంభణకు మన ఆధునిక జీవనశైలే 70 శాతానికి పైగా కారణమవుతోంది. అనియంత్రిత అధిక రక్తపోటు (Hypertension), శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం, మధుమేహం (Diabetes), పొగతాగడం (Smoking) మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress) గుండె నాళాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రోజువారీ ఆహారంలో 50 శాతానికి పైగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, అధిక ఉప్పు మరియు ప్రాసెస్డ్ చక్కెర వాడకం రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి దారితీస్తున్నాయి. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయి క్షణాల్లో హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ సంభవిస్తోంది.   అయితే ఈ ప్రాణాంతక పరిస్థితి నుండి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమేనని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం పాటించే సరైన జీవనశైలి మార్పుల ద్వారా దాదాపు 80 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే అరికట్టవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా సాధారణ వ్యాయామం చేయడం వల్ల గుండె పనితీరు 40 శాతం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉప్పు వాడకాన్ని రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా పరిమితం చేయడం చాలా అవసరం. 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి గుండె సంబంధిత రొటీన్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ శ్రేయస్సుకు మూలస్తంభం. గుండె అందించే సూక్ష్మ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం మరియు ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే గుండె జబ్బుల బారిన పడకుండా దీర్ఘాయుష్షును పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.     [Heart Disease, Cardiovascular Diseases, Cancer, Heart Attack, Cardiac Arrest, Heart Health, High Blood Pressure, Cholesterol, Diabetes, Healthy Lifestyle]  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.