
కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంది. కానీ సాహితీ దాసరి మాత్రం మరోసారి కాస్టింగ్ కౌచ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. 'మా ఊరి పొలిమేర'లో అద్భుతమైన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సాహితీ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ హోదాలో బిజీగా ఉన్నాయి.
సాహితి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు నేరుగా కాకుండా రకరకాల మార్గాల్లో కమిట్‌మెంట్స్ అడుగుతారు. సాధారణంగా పెద్ద మేకర్స్ నేరుగా నటీమణుల వద్దకి రారు. కోఆర్డినేటర్లు, కాస్టింగ్ మేనేజర్లు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల వంటి మధ్యవర్తుల ద్వారానే ఆ ప్రతిపాదనలు పంపుతారు. "దర్శకుడికి కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఆయనతో నిరంతరం టచ్‌లో ఉండి మెసేజ్‌లు చేస్తూ ఉండాలి, నంబర్ ఇస్తాను మాట్లాడండి, అలా చేస్తే పెద్ద ప్రాజెక్టుల్లో క్రేజీ అవకాశాలు దక్కుతాయి" అంటూ ఈ మధ్యవర్తులు రకరకాల హింట్స్ ఇస్తుంటారని పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వెంటనే తిరస్కరించాను. ఇటువంటి అడ్డదారులను నిరాకరించడం వల్ల తాను పరిశ్రమలో కొన్ని పెద్ద బానర్ల ప్రాజెక్టులను, 100% మంచి అవకాశాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అవకాశాలు పోయినా సరే, నా నియమాలకు కట్టుబడి ఉండటమే నా లక్ష్యం.

Also Read: ఇరుముడి ఓటిటి డేట్ వచ్చేసింది: అదనపు బోనస్ ఏంటంటే!
జీవితంలో ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడూ నిలబడదు. అడ్డదారుల్లో వచ్చే విజయం తాత్కాలికమే. ఎంత చిన్నగా, కష్టపడి అడుగులు వేస్తూ ఎదిగితే పరిశ్రమలో అంత లాంగ్ లాస్టింగ్ ఇమేజ్ ఉంటుంది" అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానని వ్యాఖ్యానించింది. త్వరితగతిన వచ్చే సక్సెస్ కంటే సొంత ప్రతిభపై ఆధారపడటమే నిజమైన విజయం అని ఆమె స్పష్టం చేసింది. పొలిమేర లో గెటప్ శ్రీను భార్యగా, డీ-గ్లామర్ లుక్‌లో రాముల పాత్రలో నటించి ప్రతి ఒక్కరినీ మెప్పించిన సాహితి పొలిమేర 2 లో కూడా తగ్గేదేలే అంటూ తన సత్తా చాటిన విషయం తెలిసిందే.
[Sahithi Dasari , Casting Couch, Maa Oori Polimera, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]




