Home

»

Latest News

స‌మంత సీమంతం.. నెట్టింట వైరల్ అవుతున్న గోద్ భరాయి పిక్స్.! 

Sep 15, 2026 3:44PM

స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే మాతృత్వపు తీపి అనుభూతిని పొందబోతున్న విష‌యం తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమె సీమంతం (గోద్ భరాయి) వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సమంత, ఈ పవిత్ర ఘట్టానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ప్రత్యేకమైన వేడుకను పూర్తిగా హిందూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమంత భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చొని ప్రత్యేక దేవి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

గోద్ భరాయి వేడుక ముగిసిన అనంతరం సామ్ ఇన్‍స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగమైన నోట్‌ను పోస్ట్ చేశారు. మన భారతీయ సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. మంత్రోచ్ఛారణలు, శ్రీవిద్య ఉపాసన ద్వారా పొందిన అనుభూతి తనలో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యాన్ని, రక్షణ భావాన్ని నింపిందని ఆమె తెలిపారు.

ఈ వేడుకను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి నిర్వహించిన తన ఆత్మీయ స్నేహితురాలు శిల్పా రెడ్డికి సమంత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోనతో పాటు కొద్దిమంది అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఒక తల్లిగా రూపాంతరం చెందుతున్న ఈ ప్రయాణంలో తనకు లభించిన ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞురాలినని ఆమె వెల్లడించారు.

గత ఏడాది చివరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, కొద్ది నెలల క్రితమే ఈ తియ్యటి వార్తను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి సామ్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, తన ఆరోగ్యానికి అలాగే రాబోయే బిడ్డ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది. 

సామ్ షేర్ చేసిన ఈ పవిత్రమైన ఫొటోలు బయటకు రాగానే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ రూపంలో కాబోయే అమ్మ సమంతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

[Samantha Ruth Prabhu, Samantha Godh Bharai, Raj Nidimoru, Samantha Seemantham Photos, Samantha Pregnancy Updates]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com