LATEST NEWS
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, ఒక యువ ఐఏఎస్ అధికారిపై తక్షణ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వికాస్ మర్మత్ తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం అధికార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.ఈ సంఘటనకు సంబంధించి అసలు వివరాల్లోకి వెళితే, అక్టోబర్ 10వ తేదీ తెల్లవారుజామున సుమారు 1:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ప్రతిష్టాత్మక రెసిడెన్సీ రోడ్డులోని ఓ పబ్‌లో ఈ గొడవ చోటుచేసుకుంది. ఆ సమయంలో రాత్రివేళల్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు నిబంధనల పరిశీలన చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కస్టమర్ల వయస్సు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. అయితే ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్, ఆయనతో ఉన్న మరో ముగ్గురు స్నేహితులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. విధుల్లో ఉన్న సిబ్బందిని దూషించడంతో పాటు పోలీసుల విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ ఘటనపై విధుల్లో ఉన్న స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే స్వయంగా ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితేష్, రోషన్ తదితరులపై ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడడం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ గొడవకు సంబంధించిన తంతు  దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రభుత్వ పరువుకు భంగం వాటిల్లిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగానీ, ఉన్నతాధికారులుగానీ చట్టాన్ని గౌరవించాలే తప్ప ఇలాంటి వివాదాల్లో తలదూర్చడం తగదనే సందేశాన్ని ప్రభుత్వం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు తక్షణమే 'కాడా' ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలను వేరొకరికి ఇన్‌ఛార్జ్‌గా అప్పగించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ అధికారుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపట్ల పరిపాలనా యంత్రాంగం ఇకపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.       [ Vikas Marmat IAS, AP Government, Pub brawl, Bengaluru Police, Kuppam Area Development Authority, GAD transfer, CM Chandrababu Naidu, Bangalore Pub ]
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు. తమ ప్రేమకు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఉదయం పెళ్లి పీటలపై మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. సాయంత్రానికే గొడవతో విడిపోయింది. జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న భర్తతో కలిసి ఏడడుగులు వేసిన కొన్ని గంటల్లోనే.. ఆ నవవధువు పుట్టింటికి చేరాల్సి వచ్చింది. నాలుగేళ్ల ప్రేమకథలో పెళ్లి రోజే ఇలాంటి విషాద మలుపు ఎదురవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల ప్రేమ.. ఎన్నో అడ్డంకులు.! తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రీఠాపురం ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల మాజీ సైనికుడికి, కేరళ సరిహద్దులోని పరశాలై సమీప గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న యువతితో మొదలైన పరిచయం.. క్రమంగా ప్రేమగా మారింది. అలా నాలుగేళ్ల పాటు సాగిన వీరి ప్రేమబంధం పెళ్లి వరకు చేరుకుంది. అయితే, వీరి ప్రేమకు మొదట్లో కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. యువతి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ఇద్దరూ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. చివరకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. సోమవారం బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒక్కటైన ఈ జంట.. ఇక తమ జీవితంలో సంతోషాలే మిగులుతాయని భావించి ఉంటుంది. ఉదయం పెళ్లి సంబరాలు.. సాయంత్రానికి గొడవ.! పెళ్లి వేడుక ముగిసింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. వరుడి కుటుంబం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వరుడు తూలుతూ కనిపించడంతో వధువు తండ్రికి అనుమానం వచ్చింది. అల్లుడి ప్రవర్తనపై ఆయన ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేసుకోవడంతో పెళ్లి వేడుకలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వరుడు తన భార్య, మామపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపటి క్రితం వరకు నవ్వులు, ఆశీర్వాదాలతో సందడిగా ఉన్న పెళ్లి వేడుక.. ఒక్కసారిగా గొడవతో కలకలం రేపింది. పెళ్లయిన కొన్ని గంటల్లోనే పుట్టింటికి.! కళ్లముందే జరిగిన పరిణామాలతో వధువు కుటుంబం ఆందోళనకు గురైంది. గాయపడిన కుమార్తెను చూసిన తండ్రి.. ఆమెను వెంటనే తన ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతి.. పెళ్లయిన కొన్ని గంటల్లోనే భర్తకు దూరంగా పుట్టింటికి చేరాల్సి వచ్చింది.ఈ ఘటనపై తండ్రి, కుమార్తె కులచ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వరుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నాలుగేళ్ల ప్రేమ.. కుటుంబాల అంగీకారం.. ఘనంగా జరిగిన పెళ్లి.. ఇలా సంతోషంగా సాగాల్సిన కథలో కొన్ని గంటల్లోనే ఊహించని మలుపు ఎదురైంది. జీవితాంతం తోడుగా ఉంటానని మూడు ముళ్లు వేసిన బంధం.. పెళ్లి రోజే గొడవతో ఇబ్బందుల్లో పడింది. ప్రేమతో మొదలైన ప్రయాణం ఇలా కన్నీటితో మొదటి రోజే ముగిసిన పరిస్థితి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో.. పోలీసుల విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి.       [ Kanyakumari Marriage Dispute, Love Marriage, Four Years Love Story, Bride Returns To Parents Home, Wedding Day Fight, Newly Married Couple, Tamil Nadu News, Kerala Border News, Former Army Man, Bride Groom Dispute, Kulachal Police, Marriage Controversy, Emotional Love Story, Wedding Day Incident, Viral News ]
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.! ప్రియుడిని జైలు నుంచి బయటకు తీసుకురావాలనే ఆరాటం.. డబ్బు కోసం అడ్డదారి.. చివరికి కటకటాల వెనక్కి చేరిన యువతి.. ప్రేమ కోసం ఏదైనా చేయాలనుకుంది. కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే చిక్కుల్లోకి నెట్టింది. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలోని పటమట ప్రాంతానికి చెందిన నాగసౌమ్య అనే యువతి.. తన ప్రియుడు కాశీవర్ధన్ జైలులో ఉండటంతో అతడిని బయటకు తీసుకురావాలని భావించినట్లు సమాచారం. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన కాశీవర్ధన్ చిత్తూరు జైలులో ఉన్నాడు. అతడికి బెయిల్ ఇప్పించాలంటే డబ్బు అవసరం కావడంతో.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కృష్ణలంకకు చెందిన బషీర్. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకొస్తే భారీగా కమీషన్ ఇస్తానంటూ నాగసౌమ్యకు ఆశ చూపినట్లు సమాచారం. ప్రియుడిని బయటకు తీసుకురావాలనే ఆరాటంలో ఆమె ఆ ప్రలోభానికి లొంగింది. ప్రేమ కోసం మొదలైన ప్రయత్నం.. ఆమెను డ్రగ్స్ రవాణా అనే ప్రమాదకరమైన నేరంలోకి నెట్టింది. బెంగళూరుకు వెళ్లిన నాగసౌమ్య అక్కడి నుంచి సుమారు 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను రెండు ప్యాకెట్లలో సేకరించింది. వాటిని ప్రత్యేకంగా దుస్తుల్లో కుట్టించిన జేబుల్లో దాచుకుని హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది.  తన ప్రయాణం ఎవరికీ అనుమానం కలిగించదని భావించిందో ఏమో.. కానీ పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేకపోయింది.ముందుగా అందిన సమాచారంతో ఈగల్, జీఆర్పీ పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టారు. రైలు చేరుకున్న సమయంలో పోలీసుల తనిఖీలను గమనించిన నాగసౌమ్య భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బషీర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే పోలీసులు నాగసౌమ్యను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. దుస్తుల్లో దాచిన ఎండీఎంఏ ప్యాకెట్లు బయటపడ్డాయి. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాగసౌమ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బషీర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ప్రియుడికి బెయిల్ ఇప్పించాలనే ఆశ.. చివరికి తనకే జైలు శిక్ష పడే పరిస్థితిని తీసుకొచ్చిందా? ప్రేమ పేరుతో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. వ్యసనాలు, డబ్బు ఆశ, తప్పుడు పరిచయాలు.. ఏ కారణమైనా సరే, నేరానికి పాల్పడితే దాని పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ప్రేమతో ఒకరిని కాపాడాలనుకున్న ప్రయత్నం.. చివరికి తన జీవితాన్నే చిక్కుల్లో పడేసిన విషాద ఘటనగా ఇది నిలిచింది.     [ Vijayawada Drug Case, Naga Soumya Arrest, MDMA Drugs Seized, Vijayawada Railway Station, Eagle Team, GRP Police, AP Crime News, Drug Smuggling Case, Naga Soumya arrest, railway station drug raid, AP crime news, Telugu One News, Telug News ]
ALSO ON TELUGUONE N E W S
  అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెల్యులాయిడ్ ఎన్టీఆర్ వన్ మాన్ షో డ్రాగన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మేకర్స్  షూటింగ్ కార్యక్రమాలని స్పీడ్ అప్ చేస్తున్నారు. ముఖ్యంగా, సినిమాలోని కీలకమైన అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. ప్రపంచ స్థాయి హంగులతో, సరికొత్త విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్నడ్రాగన్ లో  భారీ సెట్టింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం సాధారణ తారాగణంతో కాకుండా, దాదాపు వేల సంఖ్యలో కళాకారులు మరియు ప్రత్యేక జూనియర్ ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న ఈ రక్తపాత దృశ్యాలు, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఇది చదవండి: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ సిటీలో లాస్ట్ పంచ్!   ఇప్పటికే  విడుదలైన గ్లింప్స్ వీడియో కేవలం 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రికార్డుతోనే డ్రాగన్ రేంజ్ ఏంటో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు స్పష్టమైంది. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఈ తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొని తన విలక్షణ నటనతో సెట్స్‌పై సందడి చేస్తున్నాడు . దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ ని ను మించి డ్రాగన్ ని హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.ఎన్టీఆర్ తో పాటు రుక్మిణి వసంత్   అనిల్ కపూర్,  బిజు మీనన్ ఉండగా సూపర్ హిట్ పెద్ద కష్టమైన పని కాదు.     [Ntr Dragon Shooting At Ramoji Film City, Jr NTR Dragon, Prashanth Neel movie, Ramoji Film City shoot, Dragon movie updates, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా'గా సెల్యులాయిడ్ పై చేసే మెస్మరైజ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు డిసెంబర్ 24 కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మైసూర్ లో యాక్షన్ సన్నివేశాలని పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు సినిమా ఆఖరి మరియు ఫైనల్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో రంగంలోకి దిగింది.    హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన ఈ ఆఖరి షెడ్యూల్‌తో 'దాదా' సినిమా షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ కానుంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే మేకర్స్ ఎలాంటి ఆలస్యం చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారు. మాస్ సినిమాల వీర లెవెల్ హిట్ కాంబినేషన్‌గా పేరున్న 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని, తమన్ ఎస్ కాంబ్రియో రిపీట్ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో రాజకీయాలు,లెక్కలు ఎక్కువ: కన్నీళ్లు పెట్టుకున్న గరివిడి లక్ష్మి       బాలయ్య సరసన అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ మంచు మనోజ్ నెవర్ బిఫోర్ లుక్‌లో అత్యంత పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.   [Dada Shooting Update, Dada Final Schedule Hyderabad, NBK Dada movie, Balakrishna Dada Hyderabad schedule, Gopichand Malineni, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]    
స్క్రీన్ పై ఆనంది పెర్ఫార్మ్ చేస్తుంటే తన అందం లాగానే పెర్ఫార్మ్ కూడా అంతే అందంగా ఉంటుంది. 2012 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంది ఈ నెల 17 న 'గరివిడి లక్ష్మి' తో వరల్డ్ వైడ్ గా సందడి చేయడానికి వస్తుంది. ప్రచార చిత్రాలు, సాంగ్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పరుచుకుంది.   తాజాగా 'గరివిడి లక్ష్మి' ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఆమె మాట్లాడుతు 'ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో ఉండే లెక్కలు, రాజకీయాలు చూస్తుంటే నేను అసలు ఈ రంగానికి సరిపోనేమోనని తీవ్ర ఆవేదన చెందాను. అయితే, ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, నన్ను  ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తనను ముందుకు నడిపిస్తున్న అసలైన బలం. ఇండస్ట్రీ నన్ను గుర్తించకపోయినా, తెరపై నేను  పోషించే ప్రతి పాత్రని  ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని చూపిస్తున్న ఆదరణే నాకు  దక్కిన అతిపెద్ద పురస్కారమని ఆమె పేర్కొన్నారు.     ఇది కూడా చదవండి: జైలర్ 2 పబ్లిక్ టాక్: రజినీకాంత్ మాస్ రచ్చ: సినిమా ఎలా ఉందంటే!  అసలు మైక్ అందుకున్న క్షణం నుంచే ఆమె గొంతు పూడిపోయింది, కళ్లలో నీళ్లు తిరగడంతో సభలోని వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంది స్వస్థలం తెలంగాణలోని వరంగల్.   [Actress Anandhi Emotional Speech, Actress Anandhi, Garividi Lakshmi movie, Tollywood politics, Anandhi emotional speech, Anandhi latest news, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]     .   
  సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో తెరకెక్కిన 'జైలర్ 2'  పాత రికార్డ్స్ కి సెండ్ ఆఫ్ చెప్పడానికి ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. జైలర్ కి సీక్వెల్ కావడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఉదయం నుంచే థియేటర్స్ వద్ద బారులు తీరారు. ప్రీ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే  80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇది రజిని కట్ అవుట్ అమ్మ అని మరో సారి చాటి చెప్పింది.. సాధారణ ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్న పబ్లిక్ టాక్ ప్రకారం 'జైలర్ 2' ఫస్ట్ హాఫ్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. దర్శకుడు నెల్సన్ తన మార్క్ డార్క్ హ్యూమర్, పవర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో మొదటి భాగాన్ని డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా ఉంది. రజనీకాంత్ కామ్ అండ్ కంపోజ్డ్ స్వాగ్, సీరియస్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే మాస్ సీన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయని టాక్. కేరళ, తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన విజువల్స్ గ్రాండ్ కాన్వాస్‌ను గుర్తుచేస్తాయి. నటుడు యోగిబాబు కామెడీ టైమింగ్ కథనానికి కావలసినంత వినోదాన్ని అందిస్తూ నవ్వులు పూయించింది. ఇది కూడా చదవండి: Jailer 2: జైలర్ ట్విట్టర్ రివ్యూ ఇదే! సినిమాకు ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి ఎలివేషన్ సీన్‌ను ఆయన తన బీజీఎంతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతిలతో పాటు బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్లతో కూడిన భారీ క్యాస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రథమార్థంలో వచ్చే ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ థియేటర్లలో పేలుడు పుట్టించింది. 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ చేసింది.     ద్వితీయార్థం (సెకండ్ హాఫ్) లో కథ కొంత నెమ్మదించినప్పటికీ, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల చేత కేకలు వేయిస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా  140 కోట్లకు పైగా ఘనమైన ఓపెనింగ్ వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోందని బాక్సాఫీస్ అంచనాలు చెబుతున్నాయి.    [Jailer 2 Public Talk, Jailer 2 Twitter Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Movie Review, Jailer 2 Public Response, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
  తలైవా రజినీకాంత్ ప్రస్తుతం థియేటర్స్ లో ముత్తువేల్ పాండియన్ గా థియేటర్స్ లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. అసలు రివ్యూ వచ్చే లోపు ట్విట్టర్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాని రజినీ అభిమానులు హోరెత్తిస్తున్నారు . సినిమా మొదటి భాగం కథ ఎక్కడ ముగిసిందో, సరిగ్గా అక్కడి నుండే 'జైలర్ 2' ప్రారంభమవుతుంది. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎంట్రీ సీన్ సూపర్. ప్రథమార్థంలో దర్శకుడు నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, యోగి బాబు కామెడీ అండ్ టీ స్టాల్ సీన్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. అయితే, కథనం కాస్త నిమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. బ్లాక్‌బస్టర్ ఇంటర్వెల్ మోమెంట్స్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.  అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. రజినీకాంత్ మాస్ ఎలివేషన్ సన్నివేశాలలో అనిరుధ్ BGM థియేటర్లను హోరెత్తిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, సర్ప్రైజ్ కామియోల గురించి ట్విట్టర్‌లో విశేషమైన చర్చ నడుస్తోంది. సినిమాలో ఇతర ముఖ్య తారలు మరియు కామియో రోల్స్ లో  కనిపించిన నటుల ఎంట్రీలు ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌గా మారాయి.     ట్విట్టర్ రివ్యూల సమాహారాన్ని గమనిస్తే, దాదాపు 70 శాతం మంది నెటిజన్లు సినిమాపై సానుకూల (పాజిటివ్) స్పందనను వ్యక్తం చేస్తూ 4/5 రేటింగ్స్ ఇస్తున్నారు. కాగా, మిగిలిన 30 శాతం మంది కథనం కొన్ని చోట్ల స్లోగా సాగిందని, రొటీన్ ఫార్మాట్‌లా అనిపించిందని మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రజినీకాంత్ మేనరిజమ్స్, నెల్సన్ మార్క్ కామెడీ, అనిరుధ్ మ్యూజిక్ కలగలిసి 'జైలర్ 2'ని థియేటర్లలో పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయని మెజారిటీ నెటిజన్ల ప్రాథమిక టాక్.   Jailer 2 Twitter Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Movie Review, Jailer 2 Public Response, Nelson Dilipkumar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood  News  
కల్మషం లేని అభిమానం, ప్రేమ, కుటుంబ బంధాలకి విలువ ఇచ్చే నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తాడనే   దర్శకుడిగా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో పరశురామ్ కి మంచి పేరు ఉంది. అయితే తన రూట్ మార్చి కమర్షియల్, మెసేజ్ ఫార్మేట్ తో మహేష్ బాబు తో 'సర్కారు వారి పాట' ని నింపి పర్వాలేదనిపించాడు.ఆ తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మాన్ అంతకంటే తక్కువ సిట్యువేషన్, తాజాగా సోషల్ మీడియాలో పరశురామ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది.   పరశురామ్ మాట్లాడుతు 'సోలో' విజయం తర్వాత ఇండస్ట్రీలో అందరూ త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ తర్వాత నువ్వే అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ అతి నమ్మకంతోనే మాస్ మహారాజా రవితేజతో 'సారొచ్చారు' తెరకెక్కించాను. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో పాటు భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ఆ సినిమా పరాజయంతో  పొగిడిన వారందరూ ఒక్కసారిగా దూరం పెట్టారు. వాళ్ల మాటలు కూడా నన్ను చాలా బాధపెట్టాయి. దీంతో  సారొచ్చారు ఫ్లాప్ తర్వాత  దాదాపు మూడేళ్ల పాటు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు ఏం చేయాలో తోచలేదు. ఆ కష్టకాలంలో నిర్మాత బన్నీ వాసు ఎంతో అండగా నిలిచారు. అప్పుడపుడు ఫోన్ మాట్లాడుతు దైర్యం చెప్పేవారు. అసలు  బన్నీ వాసు నుంచి ఫోన్ వస్తే  ఏదైనా కొత్త ఆఫర్ ఉంటుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూసేవాడిని. అనుకున్నట్లుగానే మూడేళ్ల తర్వాత బన్నీ వాసు ఫోన్ చేసి అల్లు అరవింద్ గారు నిన్ను కలవాలనుకుంటున్నారని చెప్పడంతో నాలో ఆశలు చిగురించాయి.     ఇది కూడా చదవండి: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్!     అల్లు అరవింద్ గారు నాతో అల్లు శిరీష్‌కి  సోలో  సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ తరహాలోనే ఒక మంచి సాఫ్ట్ లవ్ స్టోరీ చేయమని కోరారు. అంతేకాకుండా 10 లక్షల చెక్కు అడ్వాన్స్‌గా ఇచ్చి ఎడారిలో వర్షం కురిపించినంతటి ఉపశమనం కలిగించారు. అదే సమయంలో నాకు కొడుకు పుట్టాడు. దీంతో ఆపద సమయంలో అండగా నిలిచి లైఫ్ ఇచ్చిన అల్లు అరవింద్‌ గారిపై ఉన్న కృతజ్ఞతతో అందరూ ప్రేమగా పిలిచే 'అవ్యన్' అనే పేరుని నా కుమారుడికి పెట్టుకున్నట్లు పరశురామ్ తెలిపారు. గీతా ఆర్ట్స్ లో  అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లోనే  విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన 'గీత గోవిందం' 100 కోట్లకి పైగా రాబట్టింది. మరి అల్లు అరవింద్ పేరు అరవింద్ కదా, పరశురామ్ కొడుకు పేరు అవ్యన్ కదా అనుకోవచ్చు. అల్లు అరవింద్ ని దగ్గర వాళ్ళు  'అవి' అని పిలుస్తుంటారు.         [Director Parasuram About Allu Aravind, Director Parasuram About Carir Struggles, Saroccharu movie, 10 lacs,  Geetha Govindam, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
హాలీవుడ్ నటుడు టోబీ మాగైర్ తన మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ పెళ్లిలో కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘స్పైడర్‌మ్యాన్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టోబీ.. తన మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న వేడుకలో స్వయంగా వివాహ వేడుకను నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విడాకుల తర్వాత కూడా ఇద్దరూ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారనే విషయానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. జెన్నిఫర్ 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వారి విడాకుల ప్రక్రియ పూర్తయింది. తాజాగా జెన్నిఫర్ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ జెఫ్రీ ఒగున్లేసిని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 10న హవాయిలోని ఫోర్ సీజన్స్ రిసార్ట్ లనాయ్‌లో ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో టోబీ స్వయంగా వివాహ వేడుకను నిర్వహించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.  ఈ వేడుకకు హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టోబీ స్నేహితుడు, ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో తన ప్రేయసి విట్టోరియా సెరెట్టితో కలిసి పాల్గొన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ శాంచెజ్, నటి కోర్టెనీ కాక్స్, కేట్ హడ్సన్ తదితరులు కూడా వేడుకలో సందడి చేశారు. విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తూ స్నేహపూర్వకంగా ఉంటున్న టోబీ, జెన్నిఫర్.. ఇప్పుడు ఆమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేడుకలోనూ కలిసి కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.       [Tobey Maguire, Jennifer Meyer Wedding, Tobey Maguire Ex Wife, Geoffrey Ogunlesi, Spider-Man Actor, Hollywood Celebrity Wedding, Leonardo DiCaprio, Jennifer Meyer Divorce, Tobey Maguire Latest News]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. అదే ‘హైందవ’. ఆధ్యాత్మిక అంశాలకు యాక్షన్‌, అడ్వెంచర్‌ను జోడిస్తూ దర్శకుడు లుధీర్‌ బైరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ‘హైందవ’ టీజర్‌లో కనిపిస్తున్న ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేకమైన నేపథ్యం. దైవత్వానికి సంబంధించిన అంశాలను భారీ యాక్షన్‌తో ముడిపెట్టిన విధానం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు మరింత బలాన్ని చేకూర్చే అంశాలుగా నిలుస్తున్నాయి. శ్రీవిష్ణు అవతారాలను ముడిపెడుతూ టీజర్ ను ఆసక్తికరంగా రూపొందించారు. ఇక పోలీస్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనదైన మాస్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యాక్షన్‌ సన్నివేశాలు, పాత్రను ఎలివేట్‌ చేసే షాట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈసారి ఆయన ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారనే భావన టీజర్‌ కలిగిస్తోంది. సాధారణ యాక్షన్‌ కథలకు భిన్నంగా ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ఎంచుకోవడం ‘హైందవ’కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. దైవత్వం, అడ్వెంచర్‌, భారీ యాక్షన్‌ అంశాలను కలిపి ఒక ఆసక్తికరమైన సినిమాటిక్‌ ప్రపంచాన్ని సృష్టించాలనే దర్శకుడి ప్రయత్నం టీజర్‌లో కనిపిస్తోంది. కథలోని మిస్టరీని పూర్తిగా బయటపెట్టకుండా ఆసక్తిని కొనసాగించడం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఆశల హరివిల్లు.. కొత్త లోకంలోకి తీసుకెళ్ళే సిరివెన్నెల సాహిత్యం.!       [Haindava Teaser Review, Haindava Official Teaser, Haindava Movie, Haindava Teaser, Bellamkonda Sai Sreenivas, Samyuktha Menon, Ludheer Byreddy, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో మటన్ బోటి కూర కచ్చితంగా ఉంటుంది. సాధారణంగా చికెన్, మటన్‌ను ఇష్టపడేవారు మేకలోని ప్రతి భాగాన్ని రుచిగా వండుకుంటారు. అయితే మేక లేదా గొర్రె పేగులతో తయారయ్యే బోటిని క్రమం తప్పకుండా లేదా వారానికి, పదిరోజులకు ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం బలంగా, దృఢంగా మారుతుందని డైటీషియన్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి, దాని పేగులలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా దాగుంటాయి. బోటిలో అధికంగా లభించే ప్రోటీన్, ఫ్యాట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ అలసటగా, నీరసంగా లేదా బలహీనంగా అనిపించేవారికి బోటి కూర ఒక అద్భుతమైన వరం లాంటిదడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పోషకభరితమైన వంటకంలో శరీరానికి అవసరమైన ఐరన్, ఫైబర్‌తో పాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఇ, మరియు కె వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కౌట్స్ చేసేవారికి మరియు కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి బోటి ఒక ఉత్తమమైన ఆహార ఎంపిక. ఇందులో ఉండే జింక్ చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి, జుట్టు దృఢంగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని (మెమరీ పవర్) మెరుగుపరిచి, మెదడును ఎప్పుడూ చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని ప్రతి కణానికి, ముఖ్యంగా నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరించి నరాల బలహీనతను సమర్థవంతంగా నివారిస్తుంది. అంతేకాకుండా, బోటిలో లభించే ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బోటి కూరలో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్‌కి, జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా మేలు చేస్తాయి. అలాగే సన్నగా బలహీనంగా ఉండేవారు త్వరగా బరువు పెరగడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుందని దీనిని అధికంగా లేదా పరిమితికి మించి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ గణనీయంగా పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉన్నవాళ్లు బోటి కూరను అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. వండేటప్పుడు వేడి నీటితో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, సరిగ్గా ఉడికించి మితంగా తీసుకుంటేనే బోటి ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.     mutton boti health benefits, goat intestine nutrition, boti benefits, benefits of eating mutton boti, goat tripe health benefits, non veg health benefits, mutton boti curry nutrition.
మన దైనందిన ఆహారంలో కూరగాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా గ్రీన్ బీన్స్‌ను మనం అనేక రకాల వంటకాల్లో, ఫ్రైడ్ రైస్‌లలో, బిర్యానీలలో విరివిగా ఉపయోగిస్తాము. నూనె లేకుండా నాన్‌స్టిక్ పాత్రల్లో చేసే బీన్స్ ఫ్రై అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా, ప్రకృతి వైద్య విధానాలను అనుసరించే వారికి చక్కటి ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. అయితే ఈ గ్రీన్ బీన్స్‌ కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా, మన శరీరంలోని ఎముకల బలాన్ని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, గ్రీన్ బీన్స్‌లో విటమిన్  కె  చాలా సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి 100 గ్రాముల గ్రీన్ బీన్స్‌లో దాదాపు 14 మైక్రోగ్రాముల విటమిన్  కె ఉంటుంది. ఈ విటమిన్‌తో పాటు బీన్స్‌లో ఉండే ప్రత్యేక రసాయన సమ్మేళనాలు మనం తీసుకునే ఆహారంలోని కాల్షియంను ఎముకలు సమర్థవంతంగా గ్రహించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే కాల్షియం నేరుగా శరీరంలోకి వెళ్లినంత మాత్రాన సరిపోదు, అది ఎముకలకు పట్టి గట్టిపడటం ఎంతో ముఖ్యం. ఈ ప్రక్రియలో గ్రీన్ బీన్స్ శరీరానికి ఎంతగానో సహకరిస్తాయి. గ్రీన్ బీన్స్ ఎముకల బలానికి ఏ విధంగా దోహదపడతాయో పరిశీలిస్తే, ఇవి శరీరంలో "ఆస్టియోక్యాల్సిన్" అనే ప్రోటీన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆస్టియోక్యాల్సిన్ ఎముక కణజాలాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఎముకలు గట్టిగా, పటిష్టంగా తయారవుతాయి. అంతేకాకుండా, ఎముకల్లో గుజ్జు సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ పవర్ఫుల్ ఆహారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమందికి మామూలు చిక్కుడుకాయలు తింటే సరిగ్గా అరగవని, గ్యాస్ లేదా కడుపు బరువుగా అనిపించే సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిలో ఒలిగోశాకరైడ్స్ ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అయితే గ్రీన్ బీన్స్‌లో అటువంటి సమస్యలు అసలు తలెత్తవు. ఇవి చాలా తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయి మరియు ఏ రూపంలో వండినా ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించవు. ఈ బీన్స్‌లోని గింజలు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ డైట్‌లో రెగ్యులర్‌గా భాగం చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా లభించే గ్రీన్ బీన్స్‌ను రోజూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నాన్‌స్టిక్ పాత్రలో తక్కువ నూనెతో లేదా కొద్దిగా మీగడతో గ్రీన్ బీన్స్ ఫ్రై చేసుకుని, పైన నువ్వుల పొడి లేదా కొబ్బరి తురుము చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బీన్స్‌లోని పచ్చిదనం పూర్తిగా పోవాలంటే, వాటిని పది నిమిషాల పాటు పుల్లటి పెరుగు లేదా నిమ్మరసం కలిపిన నీటిలో ఉడికించి ఆపై వేయించుకోవచ్చు. ఈ సరైన వంట పద్ధతుల ద్వారా పోషకాలు ఏమాత్రం కోల్పోకుండా గ్రీన్ బీన్స్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.     green beans health benefits, green beans for bone strength, joint cartilage foods, bone density foods, green beans nutrition, vegetable benefits for joint pain, green beans health secrets.
ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి కూరగాయలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ మనం తరచుగా వాటి ఆకారాన్ని, రుచిని బట్టి కొన్నింటిని ఇష్టపడతాం, మరికొన్నింటిని చిన్నచూూపు చూసి పక్కన పెడుతుంటాం. అలా ఆకారం కారణంగా చాలా మంది నిర్లక్ష్యం చేసే కూరగాయల్లో 'పొట్లకాయ' ముందుంటుంది. అయితే, ఈ పాములాంటి కూరగాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉన్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. పొట్లకాయలో కేలరీలు అత్యంత తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లతో పాటు మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి కీలక ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే 'కుకుర్బిటాసిన్' అనే సహజ రసాయన సమ్మేళనం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించే లక్షణాలను కలిగి ఉంది. సాధారణ జ్వరం, జలుబు లేదా సీజనల్ అనారోగ్యాల బారిన పడినప్పుడు పొట్లకాయను ఆహారంలో తీసుకుంటే నీరసం, అలసట పూర్తిగా తగ్గిపోయి శరీరం త్వరగా కోలుకుంటుంది. ముఖ్యంగా గుండె పదిలంగా ఉండటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు, గుండె కొట్టుకునే వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పొట్లకాయ కూర తినడం లేదా సుమారు 30 మిలీలీటర్ల పొట్లకాయ రసం తాగడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడి, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల దృఢత్వానికి కావలసిన కాల్షియం పొట్లకాయలో సమృద్ధిగా లభిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనతను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే, కామెర్లు సోకినప్పుడు కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతుంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులను, పొట్లకాయ ఆకులను కలిపి రసం తీసి, నిపుణుల సలహాతో రోజుకు మూడుసార్లు తీసుకోవడం ద్వారా కామెర్ల నుంచి వేగంగా కోలుకోవచ్చు. ఇది శరీరంలోని మలినాలను మరియు హానికారక టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్‌లో పొట్లకాయను కచ్చితంగా చేర్చుకోవాలి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటం, కొవ్వు అస్సలు లేకపోవడం దీని ప్రధాన ప్లస్ పాయింట్. నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తక్కువ తిన్నప్పటికీ కడుపు నిండిన భావన కలుగుతుంది, ఇది అనవసరమైన ఆకలిని నియంత్రించి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, పొట్లకాయ శరీరానికి సహజమైన చలవ చేస్తుంది. దీనిని మెత్తని పేస్ట్‌లా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను అరికట్టవచ్చు. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కాబట్టి ఇప్పటివరకు పొట్లకాయను దూరంగా పెట్టిన వారు, ఇకపై ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని మీ దైనందిన ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి.     snake gourd health benefits, potlakaya benefits, snake gourd for heart health, strong bones foods, vegetable health benefits, potlakaya nutrition, healthy vegetables telugu health tips.  
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్ ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు సాధారణ జీర్ణ సమస్యలుగా లేదా రోజువారీ ఆరోగ్య ఇబ్బందులుగా భావించే లక్షణాల వెనుక కూడా అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే శరీరంలో తరచూ కనిపించే మార్పులను గమనించడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అండాశయ క్యాన్సర్‌కు సూచనగా ఉండే లక్షణాలు ఏమిటి? కడుపు తరచూ ఉబ్బరంగా అనిపించడం, పొత్తికడుపు కింది భాగంలో నొప్పి రావడం, కొద్దిగా ఆహారం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ సమస్యలు తరచూ రావడం, తగ్గకుండా కొనసాగడం లేదా సాధారణ స్థితికి భిన్నంగా అనిపించడం గమనించాల్సిన విషయం. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అండాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారించలేం. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. లక్షణాలు ఎంతకాలంగా ఉన్నాయి, ఎంత తరచుగా వస్తున్నాయి, వాటితో పాటు ఇతర మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా అనే విషయాలను వైద్యులు పరిశీలించి అవసరమైన పరీక్షలను సూచిస్తారు. అండాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం? అండాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీని లక్షణాలు ఇతర సాధారణ సమస్యలను పోలి ఉండవచ్చు. కాబట్టి కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గడం లేదా తరచూ మూత్రం రావడం వంటి సమస్యలు నిరంతరం కొనసాగితే వాటిని చిన్నవిగా భావించి వాయిదా వేయకూడదు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డాక్టర్ రాహుల్  గారు అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు, వాటిని గుర్తించాల్సిన అవసరం, ఆరోగ్య సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలనే అంశాల గురించి వివరిస్తారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను గమనించడానికి, అండాశయ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, త్వరగా కడుపు నిండిన భావన లేదా తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు నిరంతరం కొనసాగితే వైద్యులను సంప్రదించండి. లక్షణాల ఆధారంగా మాత్రమే క్యాన్సర్‌ను నిర్ధారించలేం. వైద్య పరీక్షల ద్వారా మాత్రమే సరైన నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే, వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.