Read more!

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ

కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో దాని ట్రయల్స్, ఉత్పత్తికి భాగస్వామి అయిన సీరమ్ ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా కీలక ప్రకటన చేస్తూ.. ఫిబ్రవరి 2021లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ముందుగా హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారికి ఇస్తారని, సామాన్య ప్రజలకు మాత్రం ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు కలిపి సుమారుగా రూ.1000 వరకూ ఉండొచ్చని అయన తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే తాము నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సిద్ధం చేశామని.. అయితే భారత నియంత్రణ సంస్థల నుండి ముందుగానే అనుమతి లభిస్తే, జనవరిలోపే వ్యాక్సిన్ ను తీసుకుని వస్తామని ఆయన స్పష్టం చేశారు.