Read more!

చంద్రబాబు ప్రచారంలో పవర్ కట్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విశాఖపట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పెందుర్తి నుంచి ర్యాలీ ప్రారంభించిన చంద్రబాబు.. చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ మీదుగా ముందుకు వెళ్లారు. అయితే చంద్రబాబు పర్యటించనున్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో  వీధి దీపాలు వెలగలేదు. లైట్ల వెలుగకపోవడంతో రోడ్లు చీకటిమయమయ్యాయి. వైసీపీ నేతల ఆదేశాలతోనే విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

విశాఖలో రెండ్రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు.