తెలుగోడి తెలివి.. వాటర్ వెహికల్.. బోరు నీళ్లు పోస్తే చాలు

 

పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు గుంటూరుకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సుందర్రామయ్య. తనకు వచ్చిన ఆలోచనలతో పదహారేళ్ల పాటు కష్టపడి తాను కన్న కలను నిజం చేశారు. సాధారణ అవసరాలకు వాడే నీటితోనే నడిచే వాహనాన్ని తయారు చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా 20 శాతం ఇంధనం, 80 శాతం నీరుతో వాహనాలను నడపవచ్చు. 

నీరు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ల మిశ్రమం. నీటిలోంచి హైడ్రోజన్ ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్న ఆలోచనలో ప్రయోగాలు మొదలు పెట్టారు సుందరరామయ్య. వాటర్ హైడ్రోసిస్ థెరపీ ద్వారా హైడ్రోజన్ తయారవుతుంది. అలా తయారైన హైడ్రోజన్ ఇంజన్ లోకి వెళ్లి కంప్రెస్ అవుతుంది. ఇంజన్ నడపడానికి ఈ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. వాటర్ ఫీల్ తో వాహనాల మైలేజీ కూడా పెరుగుతుందంటున్నారు సుందర్. ఒక లీటరు వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తోంది. ఈ హైడ్రోజన్ డైరెక్ట్ గా కంబషన్ చాంబర్ లోకి వెళ్లి ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ వాటర్ ఫ్యూయరల్ 30 లీటర్ల ఫ్యూయల్ కి సమానమంటున్నారు సుందర్. హైడ్రోజన్ ఫ్యూయల్ పర్యావరణరహితం అంటున్నారు సుందర్. 

ప్రస్తుత వాహనాల ద్వారా పర్యావరణానికి కీడుచేసే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతోంది. వాటర్ తో నడిచే వాహనాల ద్వారా కేవలం ఆక్సిజన్ మాత్రమే విడుదలవుతుంది. మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో నీటితో నడిచే కార్లు రూపొందించబోతున్నామన్నారు సుందర్. నీటి నుంచి హైడ్రోజన్ వేరుచేయటం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికీ చాలా రిస్క్ తో కూడిన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు వాటర్ ఫ్యూయల్ పరికరం ఖరీదు చాలా ఎక్కువ. ఈ పరికరాన్ని వాహనంలో అమర్చాలంటే దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది సామాన్యుడికి చాలా భారం. అందుకే ఈ ప్రొడెక్ట్ ను సామాన్యులకు అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సుందర్.