వీధుల్లో హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే..

మంత్రి హరీశ్ రావు  ఆధ్వ‌ర్యంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే చేశారు.  

జహీరాబాద్ బస్టాండ్ సర్కిల్,  రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై ఆదివారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది. కాగా ఇప్పటి వరకు జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది పై చిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైట్ మందును కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు పంపి ట్రాక్టర్ల సహాయంతో స్ప్రే చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి.  

పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ‌ ఉంచుకోవాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. 

ఈ మేరకు   సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి అగ్నిమాపక వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేస్తున్న తీరును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ .రాజేష్ షా , జడ్పీ ఛైర్మన్.మంజు శ్రీ  అగ్నిమాపక జిల్లా అధికారి , మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ , వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. జహీరాబాద్ మున్సిపల్ ‌కార్యాలయంలో కరోనా వ్యాప్తి నిరోధంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష చేశారు.