స్వరూపానంద పరమ డూప్లికేటు! గోవిందానంద సరస్వతి సంచలనం.. 

విశాఖ శారదా పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు  గోవిందానంద సరస్వతి. విశాఖ శారదా పీఠం ఒక డూప్లికేటు అంటూ విమర్శించారు. స్వరూపానంద శంకరాచార్యులు కాదు.. పరమ డూప్లికేటు అని ఆరోపించారు. దేశంలో డూప్లికేటు పీఠాలు చాలా చోట్ల ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద ఎక్కడో సన్యాసం తీసుకుని సాధన చేశారని, ఆయన జనాలను మోసం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్వరూపానంద భయపడి పారిపోయారని చెప్పారు. 

ఆంజనేయ స్వామి జన్మస్థలంపై టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మధ్య వివాదం ముదురుతోంది. దే. ఈ విషయంపై హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతీ స్పందించారు. హన్మంతుడి జన్మస్థలం వివాదానికి కారణం టీటీటీ తొందరపాటేనని తప్పుబట్టారు. టీటీడీ అధికారులు తప్పుడు మార్గంలో వెళ్లారని గోవిందానంద సరస్వతి విమర్శించారు.

టీటీడీపైనా గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోచిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు.