శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం
Prasanna Venkateswara Temple (Appalayagunta)
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో, శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే, శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం
తిరుమల తిరుపతి దేవస్థానముల అధీనంలో ఉన్న మరొక సుప్రసిద్ధ వేంకటేశ్వరాలయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం. ఈ ఆలయం తిరుపతికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయగుంట గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని కార్వేటి రాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం తి.తి.దే. అధీనంలోకి వచ్చిన తర్వాత స్వామివారికి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు.
ఈ పురాతన ఆలయంలో స్వామివారికి ఇరువైపులా శ్రీ పద్మావతీ అమ్మవారు మరోవైపు శ్రీ ఆండాళ్ అమ్మవార్లు వేంచేసి భక్తుల మనోరథం తీరుస్తుంటారు. ఈ ఆలయ ఆవరణలోనే ఆంజనేయస్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రసన్న వదనంతో విరాజిల్లే ఈ ప్రసన్న వేంకటేశ్వరునికే ఋణవిమోచనుడనే పేరు ఉందని స్థానికుల కథనం. అందుకే అనేకమంది స్థానికులు, స్థానికేతరులు ఋణవిమోచనం కొరకు ఈ స్వామిని దర్శించి వేడుకుంటారనే నానుడి ప్రచారంలో ఉంది.
ప్రసన్న వేంకటేశ్వర ఆలయం దీర్ఘకాలిక రుగ్మతల నుండి విముక్తి నొందడానికి గాలి సోకిన వారికి ఈ ఆలయంలోని ఆంజనేయస్వామివారి సన్నిధిలో వైద్యం చేయబడుతుంది. ఈవిధంగా అప్పలయ్యగుంట ప్రసన్న వేంకటేశ్వరుడు అటు రుణాల నుండి, ఇటు రుగ్మతల నుండి విముక్తిని ప్రసాదించి భక్తజనావళికి ప్రశాంత జీవితాన్ని ప్రసాదించే ప్రసన్న వేంకటేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు.
ఏది ఏమైనా సకల భక్తాభీష్ట ప్రదాత అయిన శ్రీవేంకటేశ్వరునికి ఇటువంటి ఆలయం ఉండటం కూడా విశేషమే. భక్త సులభుడైన ఈ ప్రసన్న వేంకటేశ్వరుని సేవించి ఋణ, రుగ్మతల నుండి విముక్తులమౌదాం.
దయామృత తరంగిణ్యాస్తరంగైవ రివ శీతలై
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళం
Appalayagunta Prasanna Venkateswara Temple, tirupati Prasanna Venkateswara Temple, Appalayagunta Prasanna Venkateswara for good health, Prasanna Venkateswara free from loans, prasanna venkateswara for health and wealth