Home

»

Tv News

Ye Devi Varamo Neevu : రాజారావు సర్ప్రైజ్‌తో కంటతడి పెట్టుకున్న అంజలి..రాకీ కుట్రలకు అడ్డుకట్ట!

Aug 11, 2026 5:57PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.....ఏంట్రా మీ తాత, మనవడు కలిసి ఏదైనా కుట్ర చేసారా అని భాను అనగానే అలా అంటారేంటి అని గీత అంటుంది. కుట్ర అంటే నా దృష్టిలో సర్ ప్రైజ్ అని భాను అంటాడు. అదేం లేదని రాజారావు టెన్షన్ పడుతాడు. ఎందుకు నాన్న టెన్షన్.. మేం ఉండగా మేం ఇంతమందిమి ఉన్నాం.. బాగా సెటిల్ అయ్యాం అని శంకర్ అంటాడు. అవును రా అందరిని సెటిల్ చేసాను.. ఒక్క అంజలిని తప్ప.. తనకి న్యాయం చెయ్యాలని రాజారావు అనుకుంటాడు. ఆ తర్వాత అంజలి దగ్గరికి రాజారావు వెళ్లి నువ్వు ఈ పనులన్నీ ఆపి నిన్న కొన్న చీరకట్టుకొని రా నీకు సర్ ప్రైజ్ ఉందని అంటాడు.

దాంతో అంజలి వెళ్తుంది. ఆ మాటలు విన్న రాకీ తన డ్రెస్ మార్చుకునే గదిలోకి రిమోట్ కార్ లో వీడియో రికార్డింగ్ పెట్టి తన గదిలోకి పంపిస్తాడు కానీ అంజలి కాలు తగిలి అది బెడ్ కిందకి వెళ్తుంది. దాంతో రాకీ డిస్సపాయింట్ అవుతాడు. మరొకవైపు పార్టీలో ఎవరి బిజీ లో వాళ్ళు ఉంటారు. రాకీ డిస్సపాయింట్ గా కనిపిస్తాడు. ఏమైంది బావ అమ్మాయిని ట్రై చేస్తున్నావా అని రాకీని గీతాంజలి కొడుకు అడుగుతాడు. పదా బామ్మర్ది వెళ్లి డ్రింక్ చేద్దామని అతన్ని రాకీ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు  అంజలి కోసం మనిష్ వెతుకుతుంటే మనీష్ కోసం భవి వెతుకుతుంది.

మనీష్ కన్పించగానే అతన్ని తన మాటలతో ఇరిటేట్ చేస్తుంది భవి. బావ నీకు గిఫ్ట్ అంటూ ఒక వాచ్ ఇస్తుంది. థాంక్స్ అని మనీష్ అక్కడ నుంచి వెళ్తాడు. అంజలి చీర కట్టుకొని వస్తుంటే తనని చూసి మనీష్ ఫ్లాట్ అవుతాడు. ఒక మాట చెప్తాను ఏం అనుకోవద్దు నువ్వు చీరలో బాగున్నావని మనీష్ చెప్తాడు. తరువాయి భాగంలో గీతాంజలి, భాను కేక్ కట్ చేస్తారు. మరొకవైపు అంజలి చేత రాజారావు ఈ రోజు నీ బర్త్ డే అని చెప్పి కేక్ కట్ చేయిస్తాడు. దాంతో అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com