
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-106లో.. రోహిత్, రాకీ ఇద్దరు ఆలోచనలో పడతారు. మన గురించి తను ఎందుకు నిజం చెప్పలేదని ఆలోచిస్తుంటే అప్పుడే అంజలి వచ్చి రోహిత్ ని బయటకు పంపించి రాకీ చెంప చెళ్లుమనిపిస్తుంది. అసలు నువ్వు మనిషివేనా, నేను మత్తులో ఉన్నాను కాబట్టి నేను పొడుచుకున్నా లేదంటే నిన్ను పొడిచేదాన్ని అని అంజలి ఫైర్ అవుతుంది. సారీ అంజలి అని రాకీ అనగానే నీకు గంట టైమ్ ఇస్తున్నా, ఇంట్లో నుంచి వెళ్లిపోకపోతే అందరికి నీ గురించి చెప్పేస్తానని మాస్ వార్నింగ్ ఇస్తుంది. అదంతా రోహిత్ వింటాడు.
మరోవైపు గీత కోసం భాను జ్యూస్ తీసుకొని వస్తాడు. బ్లడ్ ఇచ్చావ్ కదా ఎనర్జీ కావాలని అంటాడు. అంజలిపై కోపం పోయినందుకు హ్యాపీగా ఉందని భాను అనగానే అలా అని ఎవరు చెప్పారు, నెక్లెస్ తీసిందని కోపం వచ్చింది కానీ తీయలేదని తెలిసి ఆ విషయంలోనే కోపం తగ్గింది, తనపై కోపం ఎప్పటికీ ఉంటుందని గీత అంటుంది. మరోవైపు మనీష్ కి భవిత భోజనం తీసుకొని వస్తుంది. బావ నిన్న అన్నం తినలేదు కదా అని అడుగుతుంది. అంజలి గురించి టెన్షన్ అయిందని మనీష్ అంటాడు. చిన్నప్పుడు తినిపించేవాడివి బావ నాకు తినిపించవా అని భవిత అడుగుతుంది.
మరోవైపు ఒరేయ్ బావ నువ్వు త్వరగా వెళ్లిపో లేదంటే మళ్లీ అంజలి వస్తుందని రాకీతో రోహిత్ అంటాడు. ఇంత సడెన్ గా వెళ్లమంటే ఎక్కడికి వెళ్తానురా అని రాకీ అంటాడు. మరోవైపు అంజలి ఇప్పుడు ఎలా ఉందని రత్నం అడుగుతుంది. అసలు జరిగింది అదేనా లేక అబద్ధం చెప్తున్నావా అని అడుగుతుంది. అదే జరిగింది అమ్మమ్మ అని అంజలి చెప్తుంది. అప్పుడే ప్రీతి, కృష్ణజ వచ్చి అంజలితో మాట్లాడతారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
